కొత్త వెలుగు | BTPS works starts soon | Sakshi
Sakshi News home page

కొత్త వెలుగు

Published Fri, Oct 14 2016 10:34 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

BTPS works starts soon

ఇక ‘కొత్త’జిల్లాలో ‘భద్రాద్రి’ వెలుగులు
-  త్వరలోనే బీటీపీఎస్‌ పనులు
 పినపాక

ఆటంకాలు..అభ్యంతరాల నడుమ నెలల తరబడి నిలిచిన భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్ (బీటీపీఎస్‌) పనులు ఇక ముందుకు సాగనున్నాయి.  సాక్షాత్తూ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన వేలకోట్ల రూపాయల విలువైన ప్లాంట్‌కు అనుకూలంగా ఉన్నతాధికారుల కమిటీ నివేదిక ఉండడంతో నవంబర్‌లో పనులు శ్రీకారం చుట్టే∙అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకున్న లక్ష్యం నెరవేరితే పదివేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. ‘కొత్త’జిల్లాకు మరో వెలుగుల కలికితురాయి దక్కనుంది.  – ‘కొత్త’ కదలిక మొదలైంది. వేల కోట్ల బడ్జెట్‌తో నిర్మించతలపెట్టిన భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్ (బీటీపీఎస్‌) పనులకు లైన్ క్లియరైంది. ఉన్నతాధికారుల కమిటీ సందర్శన, నివేదిక సమర్పణతో ప్లాంట్‌ ఆశలు చిగురించాయి. నిలిచిన పనులు..భూ నిర్వాసితుల గగ్గోలు..గ్రీన్ ట్రిబ్యునల్, ప్రజా ప్రయోజన వాజ్యాల నమోదు..ఇలా వరుసబెట్టి ఎదురైన ఆటంకాలతో పది నెలల పాటు స్తంభించిన ప్రక్రియతో నెలకొన్న సందిగ్ధం వీడబోతోంది. ఇక మెగా ప్రాజెక్ట్‌ పనులు చకచకా సాగబోతున్నాయి. వీలైనంత త్వరగా ‘భద్రాద్రి’ వెలుగులు నింపేదిశగా బీటీపీఎస్‌ కార్యరూపం దాల్చబోతోంది. 

                         
ఇవీ ప్లాంట్‌ విశేషాలు..
l2015 మార్చి28 శ్రీరామనవమి పండుగ రోజున భద్రాద్రి థర్మల్‌ పవర్‌స్టేషన్ (బీటీపీఎస్‌)కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.  
lప్లాంటుకు కేటాయించిన నిధులు రూ.7250 కోట్లు  
lపినపాక, మణుగూరు మండలాల్లో గల సీతారాంపురం, చిక్కుడుగుంట, దమ్మక్కపేట, సాంబాయిగూడెం గ్రామాల్లో ప్లాంట్‌ విస్తరించనుంది.  
lనిర్మాణ పనులను  కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ బీహెచ్‌ఈఎల్‌ చేపట్టింది.  
lపూర్తికావాల్సిన గడువు 2018 మార్చి 28 (36 నెలలు)
l1080 మోగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లు నిర్మించాల్సి ఉంది.  
lప్లాంట్‌ నిర్మాణానికి 1140 ఎకరాలు సాగుభూమి కేటాయించారు.  
lఅధికారులు గుర్తించిన భూ నిర్వాసితులు  పినపాకలో 340 మంది, మణుగూరులో 800 మంది.
lపరిహారానికి బదులు ఉద్యోగం కోరుకున్న భూ నిర్వాసితులు 346 మంది.


తొలుత సవ్యం.. ఆ తర్వాత ఆటంకం..
ఉమ్మండి ఖమ్మం జిల్లాలో ఉండగా..పినపాక, మణుగూరు మండలాల సరిహద్దుల్లో భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ (బీటీపీఎస్‌) నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2015 మార్చి 28న శంకుస్థాపన చేశారు. మొదట సీతారాంపురం గ్రామం వద్ద విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి నిధులు కేటాయించారు. అక్కడే పైలాన్ శంకుస్థాపన, నిర్మాణ పనుల ప్రారంభం జరిగాయి. ఆ తర్వాత ప్లాంట్‌కు అనుమతులు లేవనే కారణంతో విడతల వారీగా ప్లాంట్‌నిర్మాణ పనులు నిలిచాయి. పర్యావరణ అనుమతుల కోసం గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, ప్రజా ప్రయోజన వాజ్యాలు నమోదు వరుసగా జరిగాయి. దీంతో ఈ పనులపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన అనంతరం ఆశలు చిగురించాయి. తాజాగా గత నెలలో పవర్‌ ప్లాంట్‌ నిర్మాణంపై కమిటీ సందర్శించి ప్రభుత్వానికి నివేదిక అందజేయడంతో అనుకూలంగా నిర్ణయం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.


నవంబర్‌లో శ్రీకారం..
వేలమందికి ఉపాధి అవకాశం..

ప్లాంట్‌ నిర్మాణ పనులు నవబంర్‌లో ప్రారంభం కానున్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్‌ కమిటీ..పర్యావరణ ముప్పు శాతం తక్కువగా ఉందని, సవరణలు చేసే అవకాశాలు ఉన్నాయని ఆ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. ఈ నెల చివరిలో అనుమతులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంట్రాక్టర్లు భారీ యంత్రాలు, కూలీలను సమకూర్చుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్లాంట్‌ పూర్తయితే..పినపాక, మణుగూరు మండలాలకు చెందిన సుమారు 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.వెయ్యి మందికి ప్రత్యక్ష్యంగా, 9 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. నిర్మాణ పనుల్లోనే కాంట్రాక్టర్లు సూపర్‌వైర్లుగా, డ్రైవర్లుగా, కూలీలుగా రెండు వేలమందిని వినియోగిస్తున్నారు. పలు గ్రామాల్లో హోటళ్లు, కిరాణా దుకాణాలు, రవాణా వ్యవస్థ వ్యాపారాలు ఊపందుకోనున్నాయి.  


lకేవలం 8 కిలోమీటర్ల దూరంలో బొగ్గు నిల్వలు ఉండటం,  రైలు మార్గం కూడా ఉండటం కలిసొచ్చింది.  
lభద్రాద్రి పవర్‌ప్లాంట్‌ నిర్మాణానికి సమీపంలోనే గోదావరి నది ఉండటం చాలా అనుకూలం.
lభద్రాద్రి పవర్‌ప్లాంట్‌ నిర్మాణ పనులు పూర్తయితే భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లాకు భద్రాద్రి వెలుగులు అందనున్నాయి.  
lఈ జిల్లాలో పరిశ్రమలకు, వ్యవసాయానికి, ఇంటి అవసరాలకు కావాల్సిన విద్యుత్‌ సరఫరాకు ఇక్కడి నుంచే సరఫరా జరగనుంది.  
l270 మోగావాట్ల సామర్థ్య ఉన్న నాలుగు యూనిట్లను నిర్మిస్తున్నారు.  
lవాస్తవానికి 2016 డిసెంబర్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా..2018 మార్చి నాటికి సిద్ధం చేయాలని ప్రణాళిక రూపొందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement