సాక్షి, భద్రాద్రి : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఘటన మరవకముందే.. కొత్తగూడెంలో సైతం అటవీ అధికారులపై దాడి జరిగింది. జిల్లాలోని ముల్కలపల్లి మండలం గుండాలపాడులో పోడు సాగుదారులు అటవీ అధికారులపై సోమవారం అర్ధరాత్రి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఓ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్‌కు గాయాలయ్యాయి. వివరాలు.. పోడు సాగుదారలు అటవీ భూములను చదును చేసేందుకు ట్రాక్టర్లతో వెళ్లారు. ఈ విషయం తెలుసుకుని వారిని అడ్డుకునేందుకు బీట్ ఆఫీసర్ భాస్కర్, సెక్షన్ ఆఫీసర్ నీలమయ్య ప్రయత్నించారు. ఈ క్రమంలో పోడు సాగుదారులు అధికారులపై దాడి చేయగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment