మణుగూరు కమిషనర్ కుర్చీలో వెంకటస్వామి, తనను కూర్చోనివ్వాలని వాదిస్తున్న నాగప్రసాద్
మణుగూరు టౌన్: భద్రాద్రి జిల్లా మణుగూరు మున్సిపాలిటీలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘటనతో అటు ఉద్యోగులు, ఇటు పనుల కోసం వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోయారు. కమిషనర్ కుర్చీ నాదంటే నాదేనని ఇద్దరు అధికారులు వాదించు కోవడంతో గందరగోళంలో పడిపోయారు. గతంలో మణుగూరు మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన వెంకటస్వామిని వైరా కమిషనర్‌గా బదిలీ చేశారు. మణుగూరు కమిషనర్‌గా నాగప్రసాద్‌ను నియమించారు.
అయితే మున్సిపల్ ఉన్నతాధికారులు మణుగూరు మున్సిపల్ కమిషనర్‌గా తిరిగి వెం కటస్వామిని నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంటస్వామి సోమవారం కార్యాలయానికి వచ్చి కమిషనర్ సీటులో కూర్చు న్నారు. కాసేపటికి వచ్చిన నాగప్రసాద్ తనను రిలీవ్ చేస్తూ ఆదేశాలు రానందున తానే కమిషన ర్‌నని వాదించారు. సీటులో తననే కూర్చోనివ్వా లని సూచించారు. తనకు సీడీఎంఏ నుంచి ఉత్త ర్వులు వచ్చినందున తానే కమిషనర్‌నని, కలెక్టర్ ను కలిసి రిలీవ్ ఉత్తర్వులు తెచ్చుకోవాలని వెంక టస్వామి అన్నారు. ఈ విషయమై సాయంత్రం వరకు ఎలాంటి స్పష్టత రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment