
సాక్షి, ఖమ్మం: అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన పద్దం చిన్ని(27) స్థానిక అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తుంది. గడిచిన పది రోజుల క్రితం గుమ్మడవల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకాలు వేశారు. నాలుగు రోజుల క్రితం అంగన్‌వాడీ టీచర్ చిన్ని కరోనా టీకా వేయించుకున్నారు. అప్పటి నుంచి జ్వరం, వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేసి పరిస్థితి విషమించడంతో ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున ఆమె మృతి చెందింది. టీకా వికటించడం వల్లే చిన్ని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
చదవండి: అటవీ అధికారులతో లొల్లి: బావిలో దూకిన మహిళ
కోవిడ్ నుంచి కోలుకున్న వారికి వ్యాక్సిన్ వద్దు
Comments
Please login to add a commentAdd a comment