సరిహద్దులో ఉద్రిక్తత.. | Fire Exchange Between Police and Maoists  | Sakshi
Sakshi News home page

పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు

Published Sat, Feb 3 2018 1:45 PM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM

 Fire Exchange Between Police and Maoists  - Sakshi

సాక్షి, భద్రాద్రి : రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. చర్ల మండలం తిప్పాపురం, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 5 న తెలంగాణ బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో శనివారం ఉదయం తిప్పాపురం వద్ద భద్రతా సిబ్బందికి మావోలు తారసపడటంతో కాల్పులు జరిపారు. దాదాపు గంట సేపటి నుంచి  మావోయిస్టులు, పోలీసులకు ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement