
సాక్షి, పాల్వంచ: విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం కిన్నెరసాని కాల్వ వద్ద జరిగింది. ములకలపల్లి మండలం నాగారం యూపీఎస్‌కు చెందిన నలుగురు టీచర్లు 70మంది విద్యార్థులను కిన్నెరసాని కాల్వ వద్దకు విహార యాత్రకు తీసుకు వచ్చారు. అయితే ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతులను ముత్యాలు, నాగమణిల కుమారుడు వారం రాజేష్(11), వల్లవరపు వెంకటకృష్ణ, సౌజన్య దంపతుల కుమారుడు విజన్(10)గా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment