Two students dead
-
కోచింగ్ సెంటర్లోకి వరదనీరు..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ భవనం బేస్మెంట్లో నిర్వహిస్తున్న యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు ప్రవేశించి ఇద్దరు విద్యార్థులు చనిపోగా మరొకరు గల్లంతయ్యారు. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో శనివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో, ఓల్డ్ రాజీందర్ నగర్‌లోని ఓ భవనం బేస్మెంట్లో నడుస్తున్న రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద ప్రవేశించింది. దీంతో కొందరు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. వరదతో బేస్మెంట్ పూర్తిగా నిండిపోయినట్లు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిని బయటకు తోడారు. సహాయక చర్యల్లో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభించాయి. గల్లంతైన మరో విద్యార్థి జాడ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. -
ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
గుంటూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి జాతీయ రహదారిపై జరిగింది. గుంటూరు ఆర్వీఆర్ కళాశాలలో కెమికల్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపాలెంకు చెందిన జె.ప్రవీణ్‌రెడ్డి(23) గుంటూరు రూరల్ మండలం రెడ్డిపాలెంలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. రెడ్డిపాలెంకు చెందిన టి.చందు (18) కూడా ఆర్వీఆర్ కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ ఆదివారం రాత్రి బైక్‌పై కాజ టోల్గేట్ వద్ద ఉన్న హోటల్‌కు వచ్చి భోజనం చేసి తిరిగి వెళ్తుండగా, పెదకాకాని మండలం కంతేరు అడ్డరోడ్డు సమీపంలో ఎదురుగా వెళ్తున్న లారీని దాటేందుకు యత్నించారు. ఈ క్రమంలో లారీ వెనుకభాగం బైక్‌కు తగలడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రవీణ్‌రెడ్డి, చందు తీవ్రంగా గాయపడ్డారు. ప్రవీణ్‌రెడ్డిని చినకాకాని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి, చందును గుంటూరు రోడ్డులోని ఉదయ్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. పెదకాకాని పల్లాలమ్మ చెరువు వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని 108 సిబ్బంది తెలిపారు. క్షతగాత్రుని వద్ద ఎటువంటి ఆధారాలూ లభ్యం కాలేదని çపోలీసులు తెలిపారు. -
పుట్టిన రోజున.. పుట్టెడు దు:ఖం
పుట్టిన రోజు వేడుక.. ఇంటిల్లిపాదీ ఆనందం.. స్నేహితులతో మరెంతో సంతోషం.. కొత్త దుస్తులు.. తోటి మిత్రులు.. పెన్నానదిలో వారితో భోజనం.. అంతా ఆనందమయం.. అంతలోనే అనుకోని ప్రమాదం.. నీటి సుడులలో పోయిన ప్రాణం.. క్షణాల్లో జరిగిపోయింది ఘోరం.. తమ గారాల బిడ్డ ఇక లేడని.. ఇంటికి రాడని తెలిసి.. ఆ తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీళ్లు సుడులయ్యాయి. ఒక్కగానొక్క కొడుకుపై పెట్టుకున్న కోటి ఆశలు జలసమాధి అయ్యాయి.. శతమానం భవతి అని ఆశీర్వదించాల్సిన సమయాన.. జనాజా(పాడె) మోసే దుర్గతి పట్టినందుకు.. కన్నవారి హృదయంలో విషాదం ఉప్పెనైంది.. ప్రొద్దుటూరు : ‘బాబా..! మేర బర్త్‌డేకు నయా కపడే లావో.. చాక్లెట్స్‌బీ దిలానా.. స్కూల్ మే ఫ్రెండ్స్‌కు చాక్లెట్ దేతూ బాబా..’ రెండు రోజుల క్రితం మహమ్మద్ తండ్రితో అన్న మాటలు ఇవి. కుమారుడి కళ్లలో ఆనందం చూడాలని రెండు రోజులు ముందే తండ్రి కొత్త దుస్తులు తెచ్చాడు. పుట్టిన రోజు కావడంతో కొత్త దుస్తులు తొడిగి కుమారుడిని తల్లి అందంగా ముస్తాబు చేసింది. తల్లిదండ్రులకు బై చెప్పిన ఆ పిల్లాడు పాఠశాలకు వెళ్లాడు. పుట్టిన రోజే తనకు చివరి రోజు అవుతుందని పాపం బాలుడికి తెలియదు. విద్యార్థులందరూ బర్త్‌డే బాయ్ మహమ్మద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అందరి విషెస్ అందుకున్న విద్యార్థి ఆనందంతో తబ్బిబ్బయ్యాడు. కొద్ది గంటల్లోనే మరో విద్యార్థితో కలిసి తిరిగిరాని లోకాలకు పయనమయ్యాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటన రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దర్గాబజార్‌కు చెందిన షేక్ మహమ్మద్(13), కేహెచ్‌ఎం స్ట్రీట్‌కు చెందిన తాహిర్(13) కొత్తకొట్టాలలోని ఉర్దూ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నారు. ఎప్పటి లాగే ఇద్దరూ పాఠశాలకు వెళ్లారు. ఈ రోజు తన పుట్టిన రోజని మహమ్మద్ తోటి స్నేహితులకు చెప్పాడు. భోజన విరామంలో అందరూ కలసి బయటికి వెళ్లాలని మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే మహమ్మద్, తాహిర్‌తో పాటు మరో ఆరుగురు విద్యార్థులు వెంట తెచ్చుకున్న క్యారియర్లను తీసుకొని పాఠశాలలో చెప్పకుండా రామేశ్వరం సమీపంలోని పెన్నానదికి వెళ్లారు. పెన్నానదిలో సరదాగా గడపాలని.. పాఠశాల నుంచి పెన్నా నది సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. స్కూల్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు నడుచుకుంటూ అక్కడికి వెళ్లారు. ముందుగా తమ వెంట తెచ్చుకున్న క్యారియర్లలోని భోజనాలను ఆరగించారు. రైల్వే వంతెనపై కొంత సేపు ఆడుకున్నారు. ఆ తర్వాత దిగువన ఉన్న పెన్నానదిలో నీరు తక్కువగా ఉండటంతో విద్యార్థులందరూ అక్కడ దిగి ఈతకొట్టసాగారు. ఈ క్రమంలోనే మహమ్మద్, తాహిర్ ఈదుకుంటూ నీరు ఎక్కువగా ఉన్న మడుగులోకి వెళ్లారు. అక్కడున్న రజకులు వెళ్లవద్దని వారించారు. అయినా వారు వినిపించుకోలేదు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరు పిల్లలు మునిగి పోయారు. నీళ్లలో కొట్టుమిట్టాడుతున్న తాహిర్‌ను చూసి సమీపంలో ఉన్న రజకులు అతన్ని బయటికి తీసుకొచ్చారు. అప్పటికే నీళ్లు తాగిన బాలుడు మృతి చెందాడు. మహమ్మద్ ఊబిలో ఇరుక్కొని పోయాడు. సుమారు నాలుగు గంటల పాటు అతని మృతదేహం బయట పడలేదు. అగ్నిమాపక శాఖ అధికారి రఘునాథ్ ఆధ్వర్యంలో రెస్క్యూ టీం నీళ్లలోకి దిగి బాలుడి శవాన్ని బయటికి తీశారు. రూరల్ ఎస్ఐ లక్ష్మినారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భయంతో పరుగెత్తిన విద్యార్థులు.. ఇద్దరు విద్యార్థులు నీళ్లలో మునిగిన సమయంలో మిగతా పిల్లలు పక్కనే ఉన్నారు. తోటి స్నేహితులు ఆపదలో ఉన్నా.. వారిని కాపాడాలనే అవగాహన, అంత వయసు గానీ వారికి లేదు. దీంతో అక్కడి నుంచి భయంతో ఆరుగురు విద్యార్థులు పరుగులు తీశారు. వారి ద్వారా పాఠశాలలోని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఇద్దరు విద్యార్థులు మృతి చెందారనే విషయం తెలిసింది. దీంతో పిల్లల కుటుంబ సభ్యులు, వీధిలోని ప్రజలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పుట్టిన రోజే.. పరలోకానికి షాహుస్సేన్‌వలి దర్గాబజారులో నివాసం ఉంటున్న మహబూబ్‌బాషాకు భార్య చాంద్‌బీతో పాటు షాబిరా అనే కుమార్తె, మహమ్మద్ అనే కుమారుడు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం కుమార్తెకు వివాహమైంది. మహబూబ్‌బాషా మసీదులో మౌజన్‌గా పని చేస్తున్నాడు. కుమారుడి పుట్టిన రోజు కావడంతో రెండు రోజుల క్రితమే అతను కొత్త దుస్తులు తెచ్చాడు. ఉదయాన్నే కొత్త దుస్తులు ధరించి కుమారుడు స్కూల్‌కు వెళ్లాడు. అలా వెళ్లిన కుమారుడిని శవంలా చూడాల్సి వస్తుందని అనుకోలేదని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. తాహిర్ కుటుంబంలో విషాదం షేక్షావలి కేహెచ్‌ఎం స్ట్రీట్‌లో నివాసం ఉంటున్నాడు. బొంగు బజార్లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు గౌస్‌పీర్, తాహిర్ అనే ఇద్దరు కుమారులతో పాటు కుమార్తె ఉన్నారు. కుమారుడు మృతి చెందాడనే విషయం విద్యార్థుల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు సొమ్మసిల్లి పడిపోయారు. చదవండి: నా కోరిక తీర్చు.. లేదంటే నీ కొడుకు, భర్తను అంతం చేస్తా -
ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం
సాక్షి, కదిరి: ఫిలిప్పీన్స్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఇరువురు విద్యార్థులు దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.. కదిరి పట్టణంలోని మెయిన్ రోడ్లో ఉంటున్న ఎల్ఎల్వీ క్లాత్ సెంటర్ నిర్వాహకుడు కటికెల మల్లికార్జున రెండో కుమారుడు రేవంత్‌కుమార్(21), అనంతపురానికి చెందిన దండోరా నాయకుడు కేపీ నారాయణ స్వామి కుమారుడు వంశీకృష్ణ(18) ఫిలిప్పీన్స్‌లోని సెబూ నగరంలో ఉన్న ఎంహెచ్‌ఏఎం కళాశాలలో ఒకరు ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం కాగా, మరొకరు మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరిరువురూ అక్కడ ఒకే రూంలో అద్దెకు ఉంటూ చదువుకుంటున్నారు. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా తెల్లవారుజామునే ద్విచక్ర వాహనంతో నిత్యావసరాల కోసం బయలు దేరారు. ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్‌కు రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ నిలిపివేయగా.. వారి మృతదేహాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డితో పాటు కలెక్టర్ గంధం చంద్రుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. -
విహార యాత్రలో విషాదం
సాక్షి, పాల్వంచ: విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం కిన్నెరసాని కాల్వ వద్ద జరిగింది. ములకలపల్లి మండలం నాగారం యూపీఎస్‌కు చెందిన నలుగురు టీచర్లు 70మంది విద్యార్థులను కిన్నెరసాని కాల్వ వద్దకు విహార యాత్రకు తీసుకు వచ్చారు. అయితే ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతులను ముత్యాలు, నాగమణిల కుమారుడు వారం రాజేష్(11), వల్లవరపు వెంకటకృష్ణ, సౌజన్య దంపతుల కుమారుడు విజన్(10)గా గుర్తించారు. -
ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
బార్కాస్ (నెల్లూరు) : ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ మండలంలోని వేదగిరి నరసింహస్వామి ఆలయంలోని కోనేరులో ఈతకు దిగిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు రూరల్ మండలం నారాయణరెడ్డిపల్లెకు చెందినవారుగా సమాచారం.