ఇద్దరు విద్యార్థులు మృతి, ఒకరు గల్లంతు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ భవనం బేస్‌మెంట్‌లో నిర్వహిస్తున్న యూపీఎస్‌సీ కోచింగ్ సెంటర్‌లోకి వరద నీరు ప్రవేశించి ఇద్దరు విద్యార్థులు చనిపోగా మరొకరు గల్లంతయ్యారు. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో శనివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో, ఓల్డ్ రాజీందర్ నగర్‌లోని ఓ భవనం బేస్‌మెంట్‌లో నడుస్తున్న రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరద ప్రవేశించింది.
దీంతో కొందరు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. వరదతో బేస్‌మెంట్ పూర్తిగా నిండిపోయినట్లు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిని బయటకు తోడారు. సహాయక చర్యల్లో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభించాయి. గల్లంతైన మరో విద్యార్థి జాడ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment