ఢిల్లీ: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను ఆగస్టు 21 వరకు అరెస్ట చేయోద్దని కోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. యూపీఎస్సీ పరీక్షలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజా ఖేద్కర్ తనకు ముందస్తు బెయిల్‌ను జిల్లా కోర్టు నిరాకరించింది. దీంతో జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది.
ఈ కేసులో కుట్రను వెలికితీసేందుకు పూజా ఖేద్కర్‌ను కస్టడీకి ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో సమాధానం ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు, యూపీఎస్సీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపపరి చేపట్టే విచారణ (ఆగస్ట్ 21) వరకు ఆమెను పోలీసు అరెస్ట్ చేయవద్దని జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ అన్నారు. తక్షణ కస్టడీకి తరలించాల్సిన అవసరం లేద పేర్కొన్నారు. ‘ప్రస్తుతానికి పూజా ఖేద్కర్‌ను తక్షణ కస్టడీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు కనిపించడం లేదు’ అని జస్టిస్ ప్రసాద్ యూపీఎస్సీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నరేష్ కౌశిక్‌కు తెలిపారు.
చదవండి: పూజా ఖేద్కర్ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్.. ఆమె తండ్రిపై కేసు ఫైల్
Comments
Please login to add a commentAdd a comment