coaching centre
-
కోచింగ్ సెంటర్లకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు చేయకూడదని కేంద్రం హెచ్చరించింది. కోచింగ్ కేంద్రాలు చేసే 100 శాతం జాబ్ గ్యారెంటీ, 100 శాతం సెలెక్షన్ వంటి తప్పుడు ప్రకటనలను నియంత్రించేందుకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో కేంద్ర వినియోగదారుల భద్రత సంస్థకు (CCPA) అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా ఇప్పటివరకు సీసీపీఏ 54 నోటీసులు జారీ చేయగా.. రూ. 54.60 లక్షల జరిమానాలు విధించింది.‘విద్యార్థుల నుంచి కోచింగ్ సెంటర్లు ఉద్దేశపూర్వకంగా కొంత సమాచారాన్ని దాచడం తాము గమనించాం. అందుకే కోచింగ్ సెంటర్ల నిర్వహకుల కోసం కొత్తమార్గదర్శకాలను రూపొందించామని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే పేర్కొన్నారు. కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని అయితే ప్రకటనల నాణ్యత వినియోగదారుల హక్కులను దెబ్బతీయకూడదని ఆమె అన్నారు.కొత్త మార్గదర్శకాల ప్రకారం..కోచింగ్ సెంటర్లు అందించే కోర్సులు, వ్యవధికి సంబంధించి తప్పుడు ప్రకటనలు చేయకూడదు. ఉదా: ఫీజు విధానం, వాపస్ పాలసీ, ఎగ్జామ్ ర్యాంకింగ్, జాబ్ గ్యారంటీ, జీతం పెరుగుదల వంటివిఅభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత వారి రాతపూర్వక అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్లు అభ్యర్థుల పేర్లు, ఫొటోలు ఉపయోగించకూడదు. కోర్సుల గురించి ముఖ్యమైన సమాచారాన్ని బహిర్గతం చేయాలి.చాలా మంది యూపీఎస్సీ విద్యార్థులు తమ స్వంతంగా చదవుకొని ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేస్తారు. కోచింగ్ సెంటర్ల నుంచి ఇంటర్వ్యూ మార్గదర్శకాలను మాత్రమే తీసుకుంటారు. ఈ విషయంలో విద్యార్ధులకు ముందే స్పష్టత ఇవ్వాలిఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులు తమ వద్ద ఏ కోర్సులో శిక్షణ తీసుకున్నారో తెలియజేయాలి.చట్టబద్ధంగా అనుమతి తీసుకున్న భవనాల్లో మాత్రమే కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి.కోచింగ్ సెంటర్లు తమ అభ్యర్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, భద్రత కల్పించాలి.నిబంధనలు ఉల్లంఘించిన వారికి వినియోగదారుల రక్షణ చట్టం కింద జరిమానాలు విధించనున్నారు. -
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌పై హైకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఓల్డ్ రాజిందర్ నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరదనీరు చేరి ముగ్గురు మృతిచెందిన ఘటనపై ఢిల్లీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. కోచింగ్ సెంటర్ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాలని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై జరిపించాలని కోరుతూ ఓ ఎన్జీఓ దాఖలుచేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం.. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌పై అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆర్బన్ ప్లానింగ్ లోపాలపై వివరణ కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. అదే విధంగా రాజింద్రనగర్ ప్రాంతంలో మురికి కాల్వలను ఆక్రమించి కట్టిన అన్ని కట్టడాలను శుక్రవారం నాటికి కూల్చివేయాలని ఆదేశించింది. ఇక ఢిల్లీ హైకోర్టు ఆప్ ప్రభుత్వంపై కూడా మండిపడింది. ప్రభుత్వాల ఉచితాల సంస్కృతి కారణంగా పన్నులు వసూలు చేయకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు ఖచ్చితంగా జరుగుతాయని తెలిపింది. యూపీఎస్సీ కోచింగ్ హబ్ అయిన రాజిందర్ నగర్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకుండానే బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి నిర్వహించడానికి అనుమతిస్తున్నారని పేర్కొంది.మరోవైపు ఇప్పటి వరకు ఎమ్సీడీ(MCD) అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఢిల్లీ పోలీసులను కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో బిల్డింగ్ యజమాని, కోచింగ్ సెంటర్ యజమాని సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని, అరెస్టయినవారిలో వరదలున్న వీధి గుండా వేగంగా దూసుకొచ్చిన కారు డ్రైవర్ కూడా ఉన్నారని తెలిపింది. అయితే తమ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ దుర్ఘటనకు మున్సిపల్ అధికారులను ఒక్కరినైనా అరెస్టు చేసి జైలుకు పంపారా అని అని ప్రశ్నించింది. అనంతరం ఈ కేసులో ఢిల్లీ పోలీసులను కూడా ప్రతివాదిగా చేర్చింది ధర్మాసనం.ఢిల్లీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయడంలో విఫలమైతే కేంద్ర ఏజెన్సీకి బదిలీ చేయాలని సూచిస్తామని హెచ్చరించింది. అనంతరం తదుపరి విచారణ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది. -
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన: ‘నా భర్త నిందితుడు కాదు.. బాధితుడు’
ఢిల్లీ: ఢిల్లీలోని సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు పోటేత్తటంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన ఘటనకు కారణం అంటూ ఓ కారు ఓనర్‌ను అరెస్ట్ చేశారు. కోచింగ్ సెంటర్ ముందు రోడ్డుపై వేగంగా కారు నడపటం వల్ల సెల్లారులోకి నీళ్లు పోటేత్తిన కారణం చూపుతూ.. మంజూ కథూరియా అనే వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మంజూ కథూరియా అరెస్ట్‌పై ఆయన భార్య షిమా మీడియాతో మాట్లాడారు.‘ఇది పూర్తిగా అవాస్తవమైన ఆరోపణ. ఈ ఘటనలో ముగ్గురు అభ్యర్థులు మృతిచెందారు. ఇది కచ్చితంగా సిస్టం ఫెయిల్యూర్. అక్కడ నా భర్త రాష్ డ్రైవింగ్ చేయలేదు. వీడియోలో కూడా కనిపిస్తుంది. నా భర్త అధిక వేగంగా కూడా కారు నడపలేదు. ఆయన కేవలం సురక్షిత ప్రాంతానికి వెళ్లడానికి మాత్రమే ప్రయత్నం చేశారు. అయినా రావూస్ సివిల్స్ సెంటర్ వాళ్లు ఎటువంటి అనుమతి లేకుండా బేస్మెంట్లో లైబ్రరీ ఎలా నడుపుతున్నారు?. భారీ వర్షాలకు పోలీసులు ఎందుకు ఆ రోడ్డును మూసివేయాలేదు. ఎవరిదీ తప్పు ఉందో అధికారులే గుర్తించాలి. నా భర్త ఎటువంటి తప్పు చేయలేదు. నన్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయ స్థానం కూడా న్యాయమైన నిర్ణయమే తీసుకుంటుంది. వీడియోలో తన భర్త కారు కనిపించటంతో కేవలం విచారణ కోసమే తన భర్తను తీసుకువెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు’ అని షిమా తెలిపారు.#WATCH | Delhi: Old Rajinder Nagar coaching centre incident | Shima Kathuria- wife of one of the accused Manuj Kathuria, says "This is a completely wrong allegation. It was a painful incident due to which 3 innocents lost their lives. It is a failure of the system. There was no… pic.twitter.com/1MsNErILWW— ANI (@ANI) July 30, 2024 Another video has surfaced from outside Rajendra Nagar Institute in which it can be seen how the passing of a vehicle increased the flow of water, due to which the gates broke and water entered the basement.#Delhi #CoachingCenter #Flood #HeavyRain #RaoIASCoaching… pic.twitter.com/cZUBkKbNUm— POWER CORRIDORS (@power_corridors) July 28, 2024 -
ఢిల్లీ సర్కార్‌కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో రావూస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో సివిల్స్ అభ్యర్థుల జలసమాధి ఉదంతంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. మరణాలపై మీడియా వార్తలతో కేసును సూమోటోగా స్వీకరించింది. ఘటనపై రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక సమరి్పంచాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వంతోపాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు నోటీసుల జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీలో నడుస్తున్న కోచింగ్ సెంటర్లు, సంస్థల వివరాలు, వాటిపై వచ్చిన ఫిర్యాదులు, సంబంధిత శాఖ అధికారులు వాటిపై తీసుకున్న చర్యల గురించి కూడా నివేదికలో పొందుపర్చాలని ఎన్హెచ్ఆర్సీ కోరింది. అధికారులకు అనేక ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడింది. పటేల్ నగర్ ప్రాంతంలో పూడిక తీయకపోవడం వల్ల వర్షపు నీరు నిలిచి అక్కడ విద్యుదాఘాతానికి గురై సివిల్స్ అభ్యర్థి మరణించిన ఉదంతాన్నీ కేసుగా ఎన్హెచ్ఆర్సీ సూమోటోగా స్వీకరించింది. -
విద్యార్థుల జలసమాధిపై ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో కోచింగ్ సెంటర్లో విద్యార్థుల జలసమాధి ఘటనపై కేంద్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సోమవారం ప్రకటించింది. ఘటనకు కారణాలను తెల్సుకోవడంతోపాటు బాధ్యులెవరో తేల్చనుంది. ఘటనలు పునరావృతంకాకుండా తీసుకోవాల్సిన చర్యలతోపాటు అవసరమైతే విధానపర నిర్ణయాల్లో చేపట్టాల్సిన మార్పులను కమిటీ సిఫార్సుచేయనుంది. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఢిల్లీ ప్రభుత్వ(హోంశాఖ) ముఖ్య కార్యదర్శి, ఢిల్లీ పోలీస్, ఫైర్ స్పెషల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఈ కమిటీకి కనీ్వనర్‌గా ఉంటారు. 30 రోజుల్లోపు ఈ కమిటీ తన నివేదికను సమర్పించనుందని హోం శాఖ అధికార ప్రతినిధి సోమవారం చెప్పారు మరో ఐదుగురి అరెస్ట్ ఈ ఘటనలో బేస్మెంట్ యజమానులపాటు మొత్తం ఐదుగురిని సోమవారం పోలీసులు అ రెస్ట్చేశారు. డ్రైనీజీలపై అక్రమ కట్టడాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చేయడం మొదలెట్టారు.20 బేస్మెంట్లకు సీలుకోచింగ్ కేంద్రాలకు నిలయమైన పాత రాజీందర్ నగర్ ప్రాంతంలో సోమవారం అధికారులు అక్రమ కట్టడాలపై చర్యలకు ఉపక్రమించారు. అక్రమంగా నడుస్తున్న పలు కోచింగ్ సెంటర్లకు సంబంధించిన 20 బేస్మెంట్లకు సీల్‌వేశారు. అధిక కోచింగ్ సెంటర్లు ఉండే మరో ప్రాంతం ముఖర్జీ నగర్లోనూ ఆకస్మిక పర్యటనలు చేయించండి. అభ్యర్థులను శాంతింపజేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోమవారం అక్కడి చేరుకుని వారితో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. విచారణకు కమిటీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్ ఘటనపై కేంద్రప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై విచారణ కోసం కమిటీని నియమించింది. ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో వరద పోటెత్తి సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దుమారం రేగడంతో కేంద్ర ప్రభుత్వం విచారణకు తాజాగా కమిటీని నియమించింది. -
కోచింగ్ సెంటర్లు వ్యాపారంగా మారిపోయాయి: రాజ్యసభ ఛైర్మన్
‘కోచింగ్ వ్యవస్థ పూర్తిగా వాణిజ్యంగా మారింది. ఎప్పుడూ వార్తాపత్రికలను చదువుదాం అని తెరిచిన ప్రతిసారీ ముందు ఒకటి రెండు పేజీల్లో వారి ప్రకటనలే కనిపిస్తాయి’ అంటూ అని ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో వరదనీటిలో మునిగి యూపీఎస్సీ అభ్యర్థులు మరణించిన ఘటనను ఉద్దేశిస్తూ సోమవారం రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ దుర్ఘటనపై రాజ్యసభలో స్వల్పకాలిక చర్చకు పిలుపునివ్వడం సముచితమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై తన ఛాంబర్లో అన్ని పార్టీల నేతలతో సమావేశం నిర్వహిస్తానని ఉపరాష్ట్రపతి ధన్కర్ తెలిపారు. కాగా ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోని బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ ఘటనపై విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ సహా ఏడుగురిని అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనం సెల్లార్‌ను స్టోర్ రూమ్, పార్కింగుకు కేటాయిస్తామని ప్రణాళికలో చూపించి గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు. -
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. అక్రమ కట్టడాలపై బుల్డోజర్
దేశ రాజధాని ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మృతిచెందడానికి కారణమైన ని ఓల్డ్ రాజిందర్ నగర్ ప్రాంతంలో ఢిల్లీ ప్రభుత్వం బుల్డోజర్ చర్యను ప్రారంభించింది. కాలువలు, డ్రైనేజీలకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేసే పనులు చేపట్టారు.కాగా ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోని బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన రెండు రోజులకు అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఈ ప్రాంతంలో డ్రైనేజీలను, కాలువలను ఆక్రమిస్తూ, వాటికి అడ్డంగా నిర్మించిన కట్టడాలను, పాత్‌వేలను బుల్డోజర్లతో తొలగిస్తున్నారు. డ్రైనేజీలోకి నీరు వెళ్లకుండా రహదారులపై అడ్డుగా నిర్మించిన సిమెంట్ బ్లాక్స్‌ను పొక్లెయిన్లతో సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ బుల్డోజర్ చర్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్లో రావూస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు.#WATCH | Earth movers put into action to remove encroachment over drains in Delhi's Old Rajinder Nagar after the incident of death of 3 UPSC aspirants due to drowning in an IAS coaching institute pic.twitter.com/NR6sjw5a7b— ANI (@ANI) July 29, 2024 -
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై లోక్‌సభలో రచ్చ.. కేంద్రమంత్రి రిప్లై
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. తాజాగా ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో విద్యార్ధుల మృతి అంశం లోక్‌సభను కుదిపేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఢిల్లీలోని కోచింగ్ సెంటర్ బేస్మెంట్ ప్రమాదంలో యూపీఎస్సీ విద్యార్ధుల మరణాలను ప్రస్తావిస్తూ దేశంలో కోచింగ్ సెంటర్లు ఓ మాఫియాలా తయారయ్యాయని మండిపడ్డారు. ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల పట్ల వివక్ష చూపడం కలిగిస్తోందన్నారు.‘2023లో రాజ్యసభలో ఓ మంత్రి పెరుగుతున్న విద్యార్ధుల ఆత్మహత్యపై సమాధానం ఇచ్చారు, 2018 నుంచి 2022 వరకు ఐఐటీలు, ఐఐఎంలతో సహా ఉన్నత విద్యాసంస్థల్లో సుమారు 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఇందుకు అక్కడ నెలకొన్న కుల వివక్ష ప్రధాన కారణాలలో ఒకటి.. దీనీనీ తక్షణమే పరిశీలించాలి.దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్లలో భద్రత, నియంత్రణ సమస్యలను వేణుగోపాల్ ప్రస్తావించారు. నిన్నగాక మొన్న న్యూఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థులు తమ విలువైన ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ కోచింగ్ సరైన అనుమతి, తగిన సౌకర్యాలు లేకుండా పనిచేస్తోందని మీడియా కథనాల ద్వారా వెల్లడైంది. కొన్ని కోచింగ్ సెంటర్లు 'మాఫియా'లుగా మారాయి. ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా?’’ అని కాంగ్రెస్ ఎంపీ ప్రశ్నించారు.దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. విద్యార్థులు ఎక్కడ చదువుకున్నా వారి శారీరక- మానసిక రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు లేవినెత్తిన ఈ ప్రశ్న నేటి చర్చకు సంబంధించినది కాదు. కానీ కోచింగ్ సెంటర్, పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, ఇన్స్టిట్యూట్లు ఇలా విద్యార్ధులు ఎక్కడ చదువుతున్నప్పటికీ వారి శారీరక, మానసిక రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నేను హామీ ఇస్తున్నాను అని పేర్కొన్నారు.కాగా కోచింగ్ సెంటర్లకు సంబంధించి కేంద్రం జనవరిలో తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. అన్ని రాష్ట్రాలకు సమగ్రమైన, వివరణాత్మక మార్గదర్శకాలు అందించింది. అయితే రాజస్థాన్, బీహార్, గోవా మొదలైన రాష్ట్రాలు తమ సొంత నిబంధనలను కలిగి ఉన్నాయి. కాగా ఢిల్లీలోని ఓ భవనం బేస్మెంట్లో నిర్వహిస్తున్న యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో శనివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో, ఓల్డ్ రాజీందర్ నగర్‌లోని ఓ భవనం బేస్మెంట్లో నడుస్తున్న రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద చేరడంతో కొందరు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. వరదతో బేస్మెంట్ పూర్తిగా నిండిపోయినట్లు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిని బయటకు తోడారు. తాజాగా ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకోవడంతో.. అరెస్టుల సంఖ్య ఏడుకు చేరింది. -
Delhi incident: ప్రమాదం వెనుక నిర్లక్ష్యం! ఏడుగురి అరెస్ట్
న్యూఢిల్లీ: సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకోవడంతో.. అరెస్టుల సంఖ్య ఏడుకు చేరింది. అయితే ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోందనే విమర్శ బలంగా వినిపిస్తోందిప్పుడు. ప్రమాదానికి నెల ముందే ఈ ఇనిస్టిట్యూట్ పరిస్థితులపై అధికారులకు ఓ ఫిర్యాదు వెళ్లినట్లు తెలుస్తోంది. కిషోర్ సింగ్ కుష్వా అనే సివిల్స్ అభ్యర్థి.. కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(MCD)కు కోచింగ్ సెంటర్ నిర్వహణ తీరుపై లేఖ రాశాడు. ‘‘ఇది అత్యవసరమైన అంశం. విద్యార్థుల ప్రాణాలకు సంబంధించింది. కేవలం పార్కింగ్ కోసమో, స్టోరేజ్ కోసమో సెల్లార్లను ఉపయోగించుకోవాలన్న ఎంసీడీ నిబంధనలను కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పట్టించుకోవట్లేదు. .. సెల్లార్లోనే క్లాసులు, లైబ్రరీలను నిర్వహిస్తున్నారు. తద్వారా విద్యార్థులు, సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి కోచింగ్‌సెంటర్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని కిషోర్ సింగ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదు ఇంకా విచారణ దశలోనే ఉందని ఆయన చేసిన ఆన్లైన్ పోర్టల్‌లో స్టేటస్ చూపిస్తోంది. దీనిపై స్పందించడానికి అధికారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. మరోవైపు.. ఢిల్లీలో జరిగిన దుర్ఘటనపై విద్యార్థులు, పలు రాజకీయ పార్టీల నేతలు మండిపడ్డారు. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని 12 రోజుల క్రితమే స్థానిక కౌన్సిలరుకు తెలియజేశామన్నారు. వెంటనే స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. ఏడుకు అరెస్టులు.. ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ ప్రమాద ఘటనలో.. బిల్డింగ్ యజమాని సహా ఐదుగురిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్టుల సంఖ్య ఏడుకి చేరింది. ఇంతకు ముందే కోచింగ్ సెంటర్ ఓనర్‌ను, కో ఆర్డినేటర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. దీంతో వాళ్లకు 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించారు. -
సివిల్స్ కల జల సమాధి
సాక్షి, న్యూఢిల్లీ/శ్రీరాంపూర్ (మంచిర్యాల జిల్లా): ఎలాగైనా ఐఏఎస్ కావాలని ఆ యువతి కన్న కల జల సమాధి అయ్యింది. ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో ఉన్న రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ సెల్లార్‌ను వరద ముంచెత్తిన దుర్ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన తానియా సోని (22) దుర్మరణం పాలయ్యింది. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా..అందులో సోని ఉన్నట్లు అందిన సమాచారంతో శ్రీరాంపూర్‌లో విషాదం నెలకొంది.ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బిహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్ సింగరేణి శ్రీరాంపూర్ డివిజన్లోని ఎస్సారీ్ప–1 గని మేనేజర్‌గా పని చేస్తున్నారు. నస్పూర్‌లోని సీసీసీ టౌన్షిప్ బీ–2 కంపెనీ క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. విజయ్‌కుమార్– బబిత దంపతులకు ముగ్గురు సంతానం కాగా సోనిపెద్ద కుమార్తె. రెండో కూతురు పలక్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో బీటెక్ చేస్తోంది.కుమారుడు ఆదిత్యకుమార్ హైదరాబాద్‌లో పదో తరగతి చదువుతున్నాడు. సోని గతేడాదే ఢిల్లీలోని అగ్రసేన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. కలెక్టర్ కావాలనే తన కోరికను తండ్రికి చెప్పింది. తండ్రి ఆశ కూడా అదే కావడంతో మూడు నెలల క్రితం రావూస్ కోచింగ్ సెంటర్లో చేరి్పంచి శిక్షణ ఇప్పిస్తున్నారు. శనివారం ఏం జరిగింది..? ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉన్న భవనం బేస్మెంట్లోకి భారీగా వరద నీరు రావడం ప్రారంభమయ్యింది. విషయం గమనించిన విద్యార్థులు బయటపడేందుకు ప్రయతి్నంచారు. కానీ విద్యుత్ సరఫరా నిలిచిపోయి బేస్మెంట్లోని లైబ్రరీలో బయోమెట్రిక్ గేటు జామ్ అయింది. దీంతో విద్యార్థులు చిక్కుకుపోయారు. బల్లలపై నిల్చుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.చూస్తుండగానే 10–12 అడుగుల లోతు నీళ్లు చేరాయి. పరిస్థితిని గమనించిన అక్కడివారు విద్యార్థులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. రాత్రి ఏడు గంటల సమయంలో అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోటార్లతో నీటిని తోడారు. 14 మందిని తాళ్ల సహాయతో రక్షించారు. అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగగా ఆదివారం తెల్లవారుజామున సోనితో పాటు యూపీకి చెందిన శ్రేయ యాదవ్ (22), కేరళకు చెందిన నెవిన్ డాలి్వన్ (29) మృతదేహాలను వెలికితీశారు. స్పందించిన సింగరేణి అధికారులు సమాచారం తెలిసిన వెంటనే సింగరేణి సీఎండీ, ఇతర డైరెక్టర్లు, శ్రీరాంపూర్‌లోని ఏరియా జీఎం బి.సంజీవరెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలోని సింగరేణి రెసిడెంట్ ఆఫీసర్ ఓజా, కోల్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్ డీజీఎం అజయ్‌కుమార్‌ను అప్రమత్తం చేశారు. దీంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని సోని మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారు. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టమ్ అనంతరం మూడు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రయాణంలో ఉండగా మరణ వార్త విజయ్‌కుమార్–బబిత దంపతులు రెండో కూతురు పలక్‌ను కాలేజీలో దింపడం కోసం శనివారం రైల్లో లక్నో బయల్దేరారు. కాగజ్‌నగర్‌కు చేరుకోగానే వారికి సోని మరణవార్త తెలిసింది. దీంతో వారు తీవ్ర విషాదంలోనే నాగ్‌పూర్ వరకు వెళ్లి అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఆసుపత్రిలో విగతజీవిగా పడి ఉన్న సోనిని చూసి బోరున విలపించారు. అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం తమ స్వస్థలమైన ఔరంగాబాద్‌కు తరలించారు. విజయ్‌కుమార్‌కు పిల్లలంటే ఎంతో ఇష్టమని, వారి కేరీర్ గురించి ఎప్పుడు తమతో చర్చిస్తూ ఉండేవాడని తోటి అధికారులు తెలిపారు. 10 మందికి పైగా గల్లంతు? ముంపు ఘటన నేపథ్యంలో విద్యార్థులు అర్ధరాత్రి నుంచే ఆందోళనకు దిగారు. 10 మందికి పైగా గల్లంతయ్యారని ఆరోపించారు. మృతులు, గాయపడిన వారి వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో స్టడీ సర్కిల్ యజమాని స్టడీ సర్కిల్ యజమాని అభిõÙక్ గుప్తాను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో బేస్మెంట్లోకి నీరు చేరిందని గుప్తా పోలీసుల విచారణలో అంగీకరించాడు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) స్పందించింది. రావూస్ సంస్థకు బేస్మెంట్లో లైబ్రరీ నిర్వహణకు తాము అనుమతివ్వలేదని స్పష్టం చేసింది. ఘటనపై దర్యాప్తుకు ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, రాష్ట్ర మంత్రి అతిషి ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా ఢిల్లీ దుర్ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బిహార్‌కు చెందిన సోని తండ్రి విజయ్‌కుమార్ మంచిర్యాలలో సింగరేణి సంస్థలో పని చేస్తున్నారని ఆయన వివరించారు. కాగా విజయ్‌కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిందిగా సీఎం ఆదేశించారు. ఢిల్లీలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్‌కుమార్‌ను ఫోన్లో పరామర్శించారు. విద్యార్థుల మృతిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. -
కోచింగ్ సెంటర్ ఘటనపై తెలుగు విద్యార్థుల రియాక్షన్
-
ఢిల్లీ రాజేంద్రనగర్ లో తీవ్ర విషాదం
-
కోచింగ్ సెంటర్లోకి వరదనీరు..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ భవనం బేస్మెంట్లో నిర్వహిస్తున్న యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు ప్రవేశించి ఇద్దరు విద్యార్థులు చనిపోగా మరొకరు గల్లంతయ్యారు. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో శనివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో, ఓల్డ్ రాజీందర్ నగర్‌లోని ఓ భవనం బేస్మెంట్లో నడుస్తున్న రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద ప్రవేశించింది. దీంతో కొందరు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. వరదతో బేస్మెంట్ పూర్తిగా నిండిపోయినట్లు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని నీటిని బయటకు తోడారు. సహాయక చర్యల్లో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభించాయి. గల్లంతైన మరో విద్యార్థి జాడ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. -
అడవిబిడ్డలకు ఉన్నత విద్యను అందిస్తోన్న ఏపీ ప్రభుత్వం
-
TS: ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అక్కడినుంచి చదవాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ప్రభుత్వం తీపి కబురు అందించడంతో వారిలో ఆశలు చిగురించాయి. ఉద్యోగాల భర్తీకి సర్కారు చేసిన ప్రకటన అభ్యర్థులకు ఉత్సాహాన్నిచ్చింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మరోసారి పోటీపరీక్షల అధ్యయన కేంద్రంగా మారింది. ఏళ్లకేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఊళ్లకు వెళ్లిన లక్షలాది మంది తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. కోచింగ్ సెంటర్లు, స్టడీహాళ్లు, పుస్తకాల దుకాణాలు కళకళలాడుతున్నాయి. నగరంలోని చిక్కడపల్లి, అశోక్‌నగర్, గాంధీనగర్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాలు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులతో సందడిగా మారాయి. మరోవైపు సుమారు 18 వేల పోలీసుల ఉద్యోగాల కోసం పోలీసుశాఖ ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది. కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల శిక్షణకు దిల్సుఖ్నగర్, మలక్‌పేట్‌లలోని కోచింగ్ సెంటర్లకు అభ్యర్థుల తాకిడి పెరిగింది. పోలీసు, గ్రూప్–1 మొదలుకొని గ్రూప్–4 వరకు వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వాళ్లు శాస్త్రీయమైన పద్ధతిలో అధ్యయనం చేయాలని, ఏ పోటీ పరీక్షకైనా ఎలాంటి షార్ట్‌కట్ మెథడ్స్ ఉండబోవని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: ఉద్యోగ నియామకాలకు రెడీ.. సర్కారు అనుమతులివ్వగానే .. ఏ సెంటర్‌కు వెళ్తున్నారు... ఉద్యోగాల భర్తీపైన ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడిన వెంటనే కోచింగ్ సెంటర్లు తలుపులు బార్లా తెరిచాయి. మరోవైపు ఆన్లైన్ శిక్షణ సంస్థలు, యూట్యూబ్ కోచింగ్‌లు సైతం ముందుకొచ్చాయి. గ్రేటర్లో చిన్నవి, పెద్దవి కలిసి సుమారు 150కి పైగా కోచింగ్ సెంటర్లు ఉన్నట్లు అంచనా. బాగా పేరున్న సంస్థల్లో గ్రూప్–1కు రూ.70 వేలు.. గ్రూప్ –4కు రూ.25 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎస్సై, కానిస్టైబుల్ ఉద్యోగాలకు సైతం ఇదే స్థాయిలో డిమాండ్ ఉంది. ప్రభుత్వం భర్తీ చేయనున్న 80 వేల ఉద్యోగాల కోసం సుమారు 10 లక్షల మందికి పైగా పోటీ పడనున్నట్లు అంచనా. అభ్యర్థులు కోచింగ్ సెంటర్లను ఎంపిక చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యమైన అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలికంగా కోచింగ్ నిర్వహిస్తున్న అనుభవం, ఆయా సెంటర్లలో గతంలో ఎలాంటి ఫలితాలు వెలువడ్డాయనే అంశాల ఆధారంగా ఈ ఎంపిక ఉండాలి. చదవండి: CM KCR: తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీ: సీఎం కేసీఆర్ ప్రకటన అక్కడినుంచి చదవాల్సిందే.. సాధారణంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మాత్రమే సీరియస్‌గా చదవడం మొదలెడతారు. దీంతో అప్పటికప్పుడు మార్కెట్లో లభించే గైడ్లు, ఇతర స్టడీ మెటీరియల్ పైన ఆధారపడుతారు. ప్రామాణికమైన కోచింగ్ కేంద్రాల నుంచి లభించే మెటీరియల్ మంచిదే. కానీ గ్రూప్ –1 నుంచి గ్రూపు–4 వరకు అన్ని పోటీపరీక్షలకు సొంతంగా మెటీరియల్ రూపొందించుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరు నుంచి పదో తరగతి వరకు సైన్స్, సోషల్ స్టడీస్, గణితంపై పట్టు సాధించాలి. వివిధ సబ్జెక్టులలో పాఠ్యాంశాలను లోతుగా అధ్యయనం చేయడంతో పాటు ముఖ్యమైన అంశాలను స్వదస్తూరితో రాసుకోవాలి. దీంతో రాయడంలో వేగం, నైపుణ్యం పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. సమకాలీన అంశాలపై ప్రిపేర్ కావాలి.. సమకాలీన అంశాలు, సాధారణ పరిజ్ఞానంపై పట్టు పెంచాలి. పోటీ పరీక్షలలో వచ్చే ప్రశ్నల తీరు మారింది. అభ్యర్థుల విస్తృతమైన, లోతైన అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించేలా ఈ ప్రశ్నలు ఉంటాయి. ఉదాహరణకు ఉక్రెయిన్ యుద్ధానికి నాలుగు కారణాలను ఇచ్చి అందులో ప్రధానమైన కారణమేంటని అడగవచ్చు. నాలుగింటిలో ఏది ప్రధానమో తేల్చుకోవాలంటే సమకాలీన ఘటనలు, పరిణామాలపై స్పష్టత తప్పనిసరి. కొంతకాలంగా ప్రశ్నల తీరు మారింది. అందుకనుగుణంగానే ప్రిపరేషన్ ఉండాలి. గందరగోళానికి గురికావొద్దు.. ఒక సబ్జెక్టుపై ఒకటి, రెండు ప్రామాణికమైన పుస్తకాలను మాత్రమే ఎంపికచేసుకొని లోతుగా అధ్యయనం చేయాలి. ఎస్సై ఉద్యోగాలు, గ్రూప్–1, గ్రూప్–2, వంటి పరీక్షల కోసం చదివేవాళ్లకు గణితం, రీజనింగ్, అరిథ్‌మెటిక్ వంటి అంశాల్లో శిక్షణ తప్పనిసరిగా అవసరం. – వి.వేణుగోపాల్, గణితశాస్త్ర నిపుణులు దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి ఏ పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే వాళ్లయినా సరే హడావుడిగా చదవకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రారంభించాలి. ఇప్పటికే చదువుతున్న వాళ్లు అధ్యయనానికి మరింత పదును పెట్టాలి, కొత్తగా ప్రారంభించేవాళ్లు చక్కటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. ఆందోళన వద్దు, కోచింగ్ సెంటర్ల ఎంపిక ఎంతో కీలకం. – కేవీఆర్, ఇంగ్లిష్ ఫ్యాకల్టీ -
ఆరు నెలల పాటు సినిమాలు, వాట్సాప్ చూడకండి: కేటీఆర్
సాక్షి, మేడిపల్లి(హైదరాబాద్): తల్లిదండ్రులను సంతోషపెట్టేలా యువత తమ భవిష్యత్‌కు ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పీర్జాదిగూడ బుద్ధానగర్ సాయిబాబా టెంపుల్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 వేల పైలుకు పోస్టులను ప్రభుత్వం ప్రకటించందన్నారు. అభ్యర్థులు ఆరు నెలల పాటు సినిమాలు, ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, క్రికెట్ చూడడం తగ్గించుకోవాలని సూచించారు. సెంటర్లో ప్రొజెక్టర్‌ను ప్రారంభిస్తున్న కేటీఆర్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో మొదటిసారి పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు మంత్రి చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డిని అభినందించారు. 20 సంవత్సరాలు అనుభవిజ్ఞులైన అధ్యాపకులచే కోచింగ్ సెంటర్లో 3 నుంచి 4 నెలలు పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఉచిత మెటీరియల్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. పోటీ తత్వంతో గట్టిగా చదివితే ఉద్యోగం వస్తుందని భరోసానిచ్చారు. చదవండి: హైదరాబాద్: ఫలించిన యాభై ఏళ్ల కల! Live: Speaking after inaugurating a Govt Coaching Center in Peerzadiguda Municipal Corporation https://t.co/dXWgZpeKZT — KTR (@KTRTRS) March 14, 2022 టీఎస్ ఐపాస్ ద్వారా 19 వేల పరిశ్రమలు వచ్చాయని కేటీఆర్ చెప్పారు. 13 వేల పరిశ్రమల పనులు ఇప్పటికే ప్రారంభం కాగా మరో 6వేల పరిశ్రమలు ప్రారంభం కానున్నాయన్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ హరీష్, జిల్లాపరిషత్ చైర్మన్ మలిపెద్ధి శరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ధి సుధీర్‌రెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్‌గౌడ్, కమిషనర్ రామకృష్ణారావు పాల్గొన్నారు. -
కోచింగ్ సెంటర్ యజమానిపై కన్నేసిన ప్రొఫెసర్.. ఇంటికి ఆహ్వనించి
జైపూర్: ఉదయ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మాట్లాడుకుందాం అని ఇంటికి ఆహ్వనించి.. మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. కాగా, బాధిత యువతి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, తాజాగా (సోమవారం) జరిగిన ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన బాధిత మహిళ స్థానికంగా ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్‌ను నడుపుతుంది. దీంట్లో ఎందరో విద్యార్థులు కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో.. నీరజ్‌కుమార్ అనే వ్యక్తి.. సదరు ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను తీసుకునేవాడు.కాగా, ఇతను ఉదయ్‌పూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రొఫెసర్‌గా కూడా పనిచేసేవాడు. అయితే, కోచింగ్ సెంటర్ లో క్లాసులు తీసుకోవడం వలన వీరిద్దరికి కొంత పరిచయం ఏర్పడింది. గత కొంత కాలంగా నీరజ్ .. కోచింగ్ సెంటర్ యజమానిపై కన్నేశాడు. ఈ క్రమంలో ఎలాగైనా ఆమెను లోంగదీసుకోవాలనుకున్నాడు. అదును కోసం చూడసాగాడు. దీంట్లో భాగంగానే ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ యువతిని ఉదయ్‌పూర్‌లోని తన ఇంటికి రావల్సిందిగా ఆహ్వనించాడు. అయితే, బాధిత యువతి తెలిసినవాడే కదా.. అని ఉదయ్‌పూర్ వెళ్లింది. కానీ, ప్రొఫెసర్ మనసులో ఉన్న దుర్భుద్ధిని మాత్రం గుర్తించలేకపోయింది. ఈ క్రమంలో అతగాడు..యువతి.. ఉదయ్‌పూర్ వచ్చాక ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత , ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. దాని ప్రభావంతో ఆమె మత్తులోకి జారుకుంది. దీంతో.. అతగాడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాసేపటికి మత్తు నుంచి తేరుకున్నాక.. సదరు యువతి ఆందోళనకు లోనైంది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నీరజ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న గోడుండా పోలీసులు నీరజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సూరత్ అగ్ని ప్రమాదం : ముగ్గురి మీద ఎఫ్ఐఆర్
గాంధీనగర్ : సూరత్‌లోని కోచింగ్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భవన యజమానితో పాటు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు, బిల్డరు ఇలా మొత్తం ముగ్గురి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భవన నిర్మాణంలో లోపాలు, సరైన అగ్నిమాపక ఏర్పాట్లు లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు తమ విచారణలో తేలిందన్నారు అధికారులు. శిక్షణా కేంద్రం నిర్వహిస్తున్న నాలుగో అంతస్తుకి చేరుకోవడానికి కేవలం ఒకవైపు నుంచే మెట్లు ఉన్నాయని.. ఇది కూడా నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. అలాగే మెట్లు కూడా చెక్కవి కావడంతో భారీ మంటల వలన అవి కాలి బూడిదయ్యాయన్నారు. దాంతో విద్యార్థులకు తప్పించుకోవడానికి వేరే మార్గం లేకుండా పోయిందని తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులు తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి పై నుంచి దూకాల్సి వచ్చిందన్నారు. దాంతో వారికి తీవ్ర గాయాలై కొంతమంది అక్కడికక్కడే మృతి చెందారన్నారు అధికారులు. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు క్రమేపి బిల్డింగ్ అంతా వ్యాపించాయని అధికారులు తెలిపారు. ఆ సమయంలో కోచింగ్ సెంటర్లో దాదాపు 70 మంది విద్యార్థులున్నుట్లు వెల్లడించారు. ప్రమాదం దృష్ట్యా కొద్ది రోజుల పాటు పట్టణంలో అన్ని రకాల ట్యూషన్స్ను, కోచింగ్ సెంటర్ల నిర్వహణ ఆపేయాలని పోలీసులు ఆదేశించారు. అగ్ని మాపక భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాతే క్లాసులు నిర్వహించాలని పోలీసులు తెలిపారు. Satish Sharma, Commissioner of Police Surat: 20 people have died & more than 20 have been injured in the fire that broke out in Surat yesterday. An FIR has been registered against three people. #Gujarat pic.twitter.com/psDRwi7v0P — ANI (@ANI) May 25, 2019 ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం అందించినప్పటికీ.. వారు వెంటనే స్పందించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో ఘటనా స్థలానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే అగ్ని మాపక కేంద్రం ఉందని.. కానీ ఫైరింజన్ ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు 45 నిమిషాల సమయం తీసుకుందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు కాపాడి సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాడు. ప్రమాదం జరిగిన అనంతరం సంఘటన స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి విజయ్ రూపానీ.. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
‘భయపడలేదు.. క్షేమంగా బయటపడ్డా’
గాంధీనగర్ : సూరత్ కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో దాదాపు 20 మంది విద్యార్థులు మృతి చెందిన సంఘటన గురించి తెలిసిందే. ప్రాణాలు కాపాడుకునేందుకు విద్యార్థులు భవనం పై నుంచి దూకడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉందంటున్నారు అధికారులు. ఈ ప్రమాదంలో ఉర్మి హర్సుఖ్భాయ్ వెకారి అనే విద్యార్థిని సురక్షితంగా బయటడటమే కాక మరో స్టూడెంట్‌ని కూడా కాపాడింది. ఈ క్రమంలో ప్రమాదం జరిగిన తీరు.. తాను బయటపడిన వివరాలు చెప్పుకొచ్చింది ఉర్మి. ‘పది రోజుల క్రితమే డ్రాయింగ్ క్లాసెస్ కోసమని నేను ఈ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ దాదాపు 20 - 30 మంది దాక విద్యార్థులు డ్రాయింగ్ నేర్చుకోవడానికి వచ్చేవారు. భార్గవ్ సార్ మాకు పాఠాలు చెప్పేవారు. నిన్న ప్రమాదం జరిగినప్పుడు మా క్లాస్ రూంలో ఉన్నట్టుండి పొగ వ్యాపించింది. ఎవరైన పేపర్లు కాలుస్తున్నారేమో.. అనుకున్నాం. కానీ తర్వాత అగ్నిప్రమాదం సంభవించిందని తెలియడంతో.. విద్యార్థులు భయంతో పరుగులు తీస్తూ.. కిందకు దూకడం ప్రాంరంభించారు’ అని తెలిపింది. అయితే ‘విద్యార్థులంతా పరిగెత్తుతుంటే.. నేను, నా స్నేహితురాలు మాత్రం భయపడకుండా అలానే ప్రశాంతంగా కూర్చున్నాం. క్షేమంగా బయటపడేందుకు మార్గం ఉందేమోనని చుట్టూ గమనించడం ప్రారంభించాము. ఇంతలో మా సార్ కిటికి పక్కన ఉన్న రెయిలింగ్ పట్టుకుని కిందకు దిగడం ప్రారంభించాడు. మేం కూడా ఆయన లానే రెయిలింగ్ పట్టుకుని కిందకు దిగి ప్రాణాలు కాపాడుకున్నాం’ అని తెలిపింది. కోచింగ్ సెంటర్లో ఫైన్ ఆర్ట్స్ క్లాసులు నిర్వహిస్తున్నారని ఉర్మి తెలిపింది. నాటా లాంటి పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వడం కోసం విద్యార్థులు ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారన్నది. అంతేకాక బిల్డింగ్ పై నుంచి కిందకు దూకిన చిన్నారి.. అదే కోచింగ్ సెంటర్లో పని చేసే ఓ టీచర్ బిడ్డగా గుర్తించింది ఉర్మి. ‘టీచర్ తన పిల్లలను ఎప్పుడు కోచింగ్ సెంటర్‌కు తీసుకు వచ్చేవారు కాదు. కానీ దురదృష్టవశాత్తు నిన్న తీసుకు వచ్చారు. పాపం అగ్ని ప్రమాదం అని వినగానే ఆ చిన్నారి వెనక ముందు ఆలోచించకుండా కిందకు దూకేసింద’ని తెలిపింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై సర్థనా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామన్నారు. అయితే దీనిలో ఎవరి పేరు చేర్చలేదన్నారు. లోతుగా దర్యాప్తు జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా ఈ ఘటనపై స్పందించిన గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనపై లోతుగా విచారణ జరపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సంఘటనపై స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురయినట్లు తెలిపారు. (చదవండి : ఘోర అగ్నిప్రమాదం; 15 మంది విద్యార్థులు మృతి!) Extremely anguished by the fire tragedy in Surat. My thoughts are with bereaved families. May the injured recover quickly. Have asked the Gujarat Government and local authorities to provide all possible assistance to those affected. — Narendra Modi (@narendramodi) May 24, 2019 -
సూరత్: కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం
-
కోచింగ్ సెంటర్లో మంటలు.. 20 మంది విద్యార్థుల దుర్మరణం
సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోచింగ్ క్లాసులు నడుస్తున్న 4అంతస్తుల వాణిజ్య భవనంలో మంటలు వ్యాపించి 20 మంది విద్యార్థులు మరణించారు. మంటల నుంచి తప్పించుకునేందుకు మూడో, నాల్గో అంతస్తుల నుంచి కిందకు దూకడం వల్లే ఎక్కువ మంది విద్యార్థులు చనిపోగా, పొగకు ఊపిరాడకపోవడం వల్ల మరికొందరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు. మంటల నుంచి తమనుతాము కాపాడుకునేందుకు విద్యార్థులు కిందకు దూకుతున్న భయానక దృశ్యాలను టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. సూరత్‌లోని సర్థానా ప్రాంతంలో ఉన్న తక్షశిల కాంప్లెక్స్ అనే భవనంలో శుక్రవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. దాదాపు 10 మంది విద్యార్థులు భవనం నుంచి దూకారనీ, ఈ ఘటనలో గాయపడిన వారందరినీ వైద్యశాలకు తరలించామని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. 19 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పి సహాయక చర్యలు చేపట్టామని చెప్పారు. విద్యార్థులను కాపాడేందుకు స్థానిక పోలీసులు, ప్రజలు అగ్నిమాపక దళ సిబ్బందికి సాయం చేశారు. చనిపోయిన విద్యార్థుల బంధువులకు రూ. 4 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని గుజరాత్ సీఎం రూపానీ ప్రకటించారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామనీ, బాధ్యులను వదిలిపెట్టబోమని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ తెలిపారు. ప్రమాదం సమయంలో దాదాపు 50 మంది విద్యార్థులు అక్కడ ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మోదీ, రాహుల్ విచారం.. సూరత్‌లో అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మోదీ ఓ ట్వీట్ చేస్తూ ‘సూరత్‌లో అగ్నిప్రమాదం నన్ను తీవ్రంగా వేదనకు గురిచేసింది. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని తెలిపారు. ‘బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌గాంధీ హిందీలో ట్వీట్‌చేశారు. కోచింగ్ సెంటర్లో మంటలు భవనంపైన రేకులతో వేసిన షెడ్డు వంటి నిర్మాణాల నీడలో ఈ తరగతులు నిర్వహించేవారనీ, ఇది అక్రమ నిర్మాణమేమో పరిశీలిస్తామని సీఎం చెప్పారు. ముందుగా కింది అంతస్తులో మంటలు మొదలవడంతో అక్కడ ఉన్నవారు భయంతో భవనంపైకి వెళ్లారనీ, తర్వాత మంటలు పైకి ఎగబాకాయి. పైన ఏసీ కంప్రెసర్లు, టైర్లు వంటివి ఉండటంతో వాటికి మంటలు అంటుకుని దట్టమైన పొగలు వెలువడి, పైన రేకులు ఉండటంతో పొగలు ఆకాశంలోకి వెళ్లక విద్యార్థులకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది. భవనం పైన నుంచి విద్యార్థులు తప్పించుకునేందుకు మరో మార్గం లేదనీ, మంటలను ఆర్పడానికి అగ్నిమాపక పరికరాలను యాజమాన్యం ఏర్పాటు చేయలేదని అధికారి మీడియాకు వెల్లడించారు. కోచింగ్ సెంటర్లను అన్నింటినీ తనిఖీ చేసి అవి భద్రతా ప్రమాణాల ప్రకారం ఉన్నాయో లేదో అధికారులు ధ్రువీకరించే వరకు నగరంలోని కోచింగ్ సెంటర్లను మూసేయాల్సిందిగా అహ్మదాబాద్ నగరపాలక అధికారులు ఆదేశాలిచ్చారు. -
టీచర్ మెడలో చెప్పుల దండ వేసి..
-
కోచింగ్ సెంటర్‌కు రావడం లేదని..
భువనేశ్వర్: విద్య వ్యాపారంగా మారిందనడానికి ఒడిషాలో ఇటీవల చోటుచేసుకున్న ఓ ఘటన సజీవ సాక్ష్యంగా నిలిచింది. తన కోచింగ్ సెంటర్లో చదువుచెప్పే టీచర్ మరో ఇన్స్టిట్యూట్లోకి మారడాన్ని జీర్ణించుకోలేని ఓ ప్రబుద్ధుడు అత్యంత అనాగరిక చర్యకు పాల్పడ్డాడు. సదరు టీచర్ మెడలో చెప్పుల దండ వేసి ఘోర అవమానం చేశాడు. ఈ ఘటన నయాగర్ జిల్లాలో మంగళవారం జరిగింది. వివరాలు.. తపన్ మహాపాత్రకు చెందిన సత్యసాయి కోచింగ్ సెంటర్లో మయాధర్ మహాపాత్ర అనే వ్యక్తి ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా తపన్ జీతం సరిగా చెల్లించడం లేదు. దాంతో మయాధర్ ఇటీవల మరో కోచింగ్ సెంటర్లో జాబ్‌లో చేరాడు. మయాధర్ వెళ్లిపోవడంతో తన కోచింగ్ సెంటర్ సరిగా నడవడం లేదని తపన్ అతనిపై పగ పెంచుకున్నాడు. మంగళవారం విధులకు బయల్దేరిన మయాధర్ను తపన్ మరో ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. అతనిపై దాడికి దిగారు. చెట్టుకు కట్టేసి చెప్పుల దండవేసి అవమానించారు. విషయం బయటపెడితే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. అయితే, ఈ వ్యవహారాన్నంత ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. తనకు ఘోర అవమానం చేసిన తపన్, మరో ఇద్దరిపై మయాధర్ ఫిర్యాదు చేశాడని జిల్లా ఎస్పీ ఆశిష్‌సింగ్ వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టామని ఎస్పీ తెలిపారు. -
గురువే..అమ్మాయిల నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తూ...
చదువుకునేందుకు వచ్చిన అమ్మాయిల జీవితాలతో కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు చెలగాటమాడుతున్నాడు. అమ్మాయిలు స్నానం చేసే దృశ్యాలను బాత్రూంలో రహస్యంగా అమర్చిన మొబైల్ వీడియోతో చిత్రీకరిస్తున్నాడు. ఎట్టకేలకు ఓ అమ్మాయి ఈ గుట్టును పసిగట్టడంతో రట్టయ్యింది. తోటి విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి నిర్వాహకుడికి దేహశుద్ధి చేశారు. పోటీపరీక్షలకు శిక్షణ ఇస్తారని పంపితే.. ఇలా వారి జీవితాలతో ఆడుకుంటారా అంటూ కోచింగ్సెంటర్లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతపురం సెంట్రల్ : రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన సంజీవరాయుడు బీఈడీ వరకు చదువుకున్నాడు. మూడేళ్ల కిందట అనంతపురం వచ్చాడు. మారుతినగర్లో ‘లోటస్ అకాడమీ కోచింగ్’ ఏర్పాటు చేసి వివిధ పోటీ పరీక్షలతో పాటు పాలిసెట్, ఏపీఆర్జేసీ, టీటీసీ, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. సబ్జెక్టును బట్టి నెలకు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఇల్లు, కోచింగ్ సెంటర్‌తోపాటు గ్రామీణ ప్రాంత విద్యార్థినుల కోసం హాస్టల్ కూడా ఒకే చోట నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం 75 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారు. దుర్బుద్ధి.. విద్యార్థులకు శిక్షణ ఇవ్వాల్సిన నిర్వాహకుడికి దుర్బుద్ధి పుట్టింది. అమ్మాయిలను నగ్న దృశ్యాలను చిత్రీకరించాలనుకున్నాడు. హాస్టల్లో విద్యార్థిను లందరికీ ఒకే బాత్రూం ఉంది. అవసరమైతే తన బాత్రూం కూడా వాడుకోవాలని శుక్రవారం ఉదయం చెప్పాడు. అయితే అప్పటికే బాత్రూంలో చెప్పుల బాక్సు (ఖాళీ అట్టపెట్టె) ఉంచి, దానికి రంధ్రం పెట్టి అక్కడ సెల్‌ఫోన్ వీడియో ఆన్ చేసి ఉంచాడు. స్నానానికి వెళ్లిన ఓ విద్యార్థిని అట్టపెట్టె అనుమానంగా కనిపించడంతో తెరిచి చూసింది. వీడియో రికార్డింగ్‌ను గుర్తించింది. జరిగిన విషయాన్ని తోటి విద్యార్థులకు తెలియజేసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు శిక్షకుడు సంజీవరాయుడకు దేహశుద్ధిచేశారు. లోటస్ అకాడమీ కోచింగ్ సెంటర్‌ను ధ్వంసం చేశారు. నాల్గవ పట్టణ ఎస్ఐ శ్రీరామ్ శ్రీనివాస్ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు వివరించారు.