ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ఘటన: ‘నా భర్త నిందితుడు కాదు.. బాధితుడు’ | Coaching Centre Incident: Wife of SUV driver arrested says there was no rash driving | Sakshi
Sakshi News home page

ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ఘటన: ‘నా భర్త నిందితుడు కాదు.. బాధితుడు’

Published Wed, Jul 31 2024 7:12 AM | Last Updated on Wed, Jul 31 2024 9:20 AM

Coaching Centre Incident: Wife of SUV driver arrested says there was no rash driving

ఢిల్లీ: ఢిల్లీలోని సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి  వరద నీరు పోటేత్తటంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందిన  ఘటనకు కారణం అంటూ ఓ కారు ఓనర్‌ను అరెస్ట్‌ చేశారు. కోచింగ్‌ సెంటర్‌ ముందు రోడ్డుపై వేగంగా కారు నడపటం వల్ల సెల్లారులోకి నీళ్లు పోటేత్తిన కారణం చూపుతూ.. మంజూ కథూరియా అనే వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే మంజూ కథూరియా అరెస్ట్‌పై ఆయన భార్య షిమా మీడియాతో  మాట్లాడారు.

‘ఇది పూర్తిగా అవాస్తవమైన ఆరోపణ. ఈ ఘటనలో ముగ్గురు  అభ్యర్థులు మృతిచెందారు. ఇది కచ్చితంగా సిస్టం ఫెయిల్యూర్‌.  అక్కడ నా భర్త రాష్‌ డ్రైవింగ్‌ చేయలేదు. వీడియోలో కూడా కనిపిస్తుంది. నా భర్త అధిక వేగంగా కూడా  కారు నడపలేదు. ఆయన కేవలం సురక్షిత ప్రాంతానికి వెళ్లడానికి మాత్రమే ప్రయత్నం చేశారు. అయినా రావూస్‌ సివిల్స్ సెంటర్‌ వాళ్లు ఎటువంటి అనుమతి లేకుండా బేస్‌మెంట్‌లో లైబ్రరీ ఎలా నడుపుతున్నారు?.  

భారీ వర్షాలకు పోలీసులు ఎందుకు ఆ రోడ్డును మూసివేయాలేదు. ఎవరిదీ తప్పు ఉందో అధికారులే గుర్తించాలి.  నా భర్త ఎటువంటి తప్పు చేయలేదు. నన్యాయ వ్యవస్థపై మాకు పూర్తి నమ్మకం  ఉంది. న్యాయ స్థానం కూడా న్యాయమైన నిర్ణయమే తీసుకుంటుంది.  వీడియోలో తన భర్త కారు కనిపించటంతో కేవలం విచారణ కోసమే తన భర్తను తీసుకువెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు’ అని షిమా తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement