ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ఘటన.. అక్రమ కట్టడాలపై బుల్డోజర్‌ | Bulldozer Action In Delhi After 3 Die In Coaching Centre Basement Tragedy | Sakshi
Sakshi News home page

ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ఘటన.. అక్రమ కట్టడాలపై బుల్డోజర్‌

Published Mon, Jul 29 2024 3:11 PM | Last Updated on Mon, Jul 29 2024 3:18 PM

Bulldozer Action In Delhi After 3 Die In Coaching Centre Basement Tragedy

దేశ రాజధాని ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మృతిచెందడానికి కారణమైన ని ఓల్డ్‌ రాజిందర్ నగర్‌ ప్రాంతంలో ఢిల్లీ ప్రభుత్వం బుల్డోజర్‌ చర్యను ప్రారంభించింది. కాలువలు, డ్రైనేజీలకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలను మున్సిపల్‌ అధికారులు కూల్చివేసే పనులు చేపట్టారు.

కాగా ఢిల్లీలోని రావూస్‌ ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌లోని బేస్‌మెంట్‌లోకి వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన రెండు రోజులకు అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఈ ప్రాంతంలో డ్రైనేజీలను, కాలువలను ఆక్రమిస్తూ, వాటికి అడ్డంగా నిర్మించిన కట్టడాలను, పాత్‌వేలను బుల్డోజర్లతో తొలగిస్తున్నారు. 

డ్రైనేజీలోకి నీరు వెళ్లకుండా రహదారులపై అడ్డుగా నిర్మించిన సిమెంట్‌ బ్లాక్స్‌ను పొక్లెయిన్‌లతో సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ బుల్డోజర్‌ చర్యలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఢిల్లీలోని ఓల్డ్‌ రాజేందర్‌ నగర్‌లో రావూస్‌ స్టడీ సర్కిల్‌ బేస్‌మెంట్‌లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా  నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement