waterlogging
-
Jamnagar: ఎక్కడ చూసినా.. బురద, దుర్వాసన
జామ్‌నగర్: గుజరాత్‌లోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా జామ్‌నగర్‌లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారయ్యింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో మీడియా బృందం జామ్ నగర్లో పర్యటించింది. జామ్‌నగర్‌లో వరదలు, వర్షాల కారణంగా ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందారు. 500కు పైగా పశువులు ప్రాణాలు కోల్పోయాయి.వర్షాల అనంతం జామ్‌నగర్‌లోని తీన్ బత్తి చౌక్ ప్రాంతంలోని బద్రీ కాంప్లెక్స్ బేస్మెంట్లో నీరు నిలిచిపోయి, బురద పేరుకుపోయింది. విపరీతమైన దుర్వాసన కూడా వస్తోంది. కాంప్లెక్స్‌లో వర్షాలకు ముద్దయిన సరుకులను సంబంధిత దుకాణాల యజమానులు ట్రాక్టర్లలో ఎక్కించుకుని తీసుకువెళుతున్నారు.ఇక్కడకు కొద్ది దూరంలో ఉన్న మదీనా మసీదు సమీపంలో కూడా ఇటువంటి పరిస్థితే కనిపించింది. రోడ్లన్నీ బురదమయంగా మారాయి. గుంతల్లో నీరు నిలిచిపోయింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు బాధితులకు నిత్యావసర సరుకులను అందిస్తున్నాయి. మీడియాను చూసిన అక్కడి మహిళలు తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వేడుకున్నారు.ఘాచీ కి ఖడ్కీలో వర్షాల అనంతరం పరిస్థితి మరింత ఘోరంగా తయారయ్యింది. దీంతో స్థానికులు తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ ప్రాంతమంతా చెత్తాచెదారంతో నిండిపోయింది. రోడ్లపై అడుగుతీసి అడుగువేయలేనంతగా బురద పేరుకుపోయింది. -
ఢిల్లీ: భారీ వర్షంతో మొదలైన వీకెండ్..
దేశరాజధాని ఢిల్లీలో భారీవర్షాలతో వారాంతం మొదలయ్యింది. గురువారం ఆకాశం మేఘావృతమైనప్పటికీ అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే కురిశాయి. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షం ఢిల్లీ-ఎన్సీఆర్లోని జనానికి ఊరటనిచ్చింది. వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో జనం అవస్థలు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా రాజోరీ గార్డెన్, ఠాగూర్ గార్డెన్, తిలక్ నగర్, సుభాష్ నగర్, వికాస్పురి, ఠాగూర్ గార్డెన్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి రోడ్డపై నీరు నిలిచింది. వాక్‌వే స్టాండ్ లెవల్ వరకు నీరు నిండిపోవడంతో వాహనాలు నిదానంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆగస్టు 15 వరకు ఢిల్లీలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీలో మరికొన్ని రోజుల పాటు చినుకులు పడే అవకాశం ఉంది. 10, 11 తేదీలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఔటర్ ఢిల్లీలోని ప్రేమ్ నగర్లో శుక్రవారం సాయంత్రం చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రేమ్ నగర్ పరిధిలోని రాణి ఖేడా గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు చెరువు వద్దకు వెళ్లారు. వారిలో ఇద్దరు చిన్నారులు నీటి లోతుల్లోకి వెళ్లిన కారణంగా మృతి చెందారు. -
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన.. అక్రమ కట్టడాలపై బుల్డోజర్
దేశ రాజధాని ఢిల్లీలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మృతిచెందడానికి కారణమైన ని ఓల్డ్ రాజిందర్ నగర్ ప్రాంతంలో ఢిల్లీ ప్రభుత్వం బుల్డోజర్ చర్యను ప్రారంభించింది. కాలువలు, డ్రైనేజీలకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేసే పనులు చేపట్టారు.కాగా ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోని బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన రెండు రోజులకు అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఈ ప్రాంతంలో డ్రైనేజీలను, కాలువలను ఆక్రమిస్తూ, వాటికి అడ్డంగా నిర్మించిన కట్టడాలను, పాత్‌వేలను బుల్డోజర్లతో తొలగిస్తున్నారు. డ్రైనేజీలోకి నీరు వెళ్లకుండా రహదారులపై అడ్డుగా నిర్మించిన సిమెంట్ బ్లాక్స్‌ను పొక్లెయిన్లతో సిబ్బంది తొలగిస్తున్నారు. ఈ బుల్డోజర్ చర్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్లో రావూస్ స్టడీ సర్కిల్ బేస్మెంట్లోకి వరద నీరు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నారు.#WATCH | Earth movers put into action to remove encroachment over drains in Delhi's Old Rajinder Nagar after the incident of death of 3 UPSC aspirants due to drowning in an IAS coaching institute pic.twitter.com/NR6sjw5a7b— ANI (@ANI) July 29, 2024 -
ఈసారీ ఇంతేనా? గ్రేటర్లో వానొస్తే వణుకుతున్న కాలనీలు
సాక్షి, హైదరాబాద్: మళ్లీ వానాకాలం వచ్చేసింది. మెల్లగా వర్షాలు ఊపందుకుంటున్నాయి. ఇప్పుడుగానీ భారీ వర్షం పడితే మళ్లీ ఈ ప్రాంతం నీట మునగడం తప్పని పరిస్థితి. ఈ ఒక్కచోట మాత్రమే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ నగరవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి. అయితే నాలాలు లేకపోవడం, ఉన్నా ఆక్రమణలు, చెత్తాచెదారం, పూడిక చేరి.. వరద అంతా కాలనీలు, రోడ్లపైకి చేరడం పరిపాటిగా మారిపోయింది. గట్టి వాన కురిస్తే.. చాలా కాలనీలు అతలాకుతలం అవుతున్నాయి.వందల కాలనీలు నీట మునగడంతో.. ⇒ నగరంలో 2020లో కురిసిన భారీ వర్షాలకు వందల కాలనీలు నీట మునిగాయి. ఇళ్లు కూలి, విద్యుత్ షాక్ తగిలి, నీట మునిగి 17 మంది మృతి చెందారు. కొన్ని కాలనీలు చెరువుల్లా మారిపోవడంతో.. పడవల్లో ప్రజలను బయటికి తీసుకు రావాల్సి వచ్చింది. వరద నీరు సాఫీగా వెళ్లలేకపోవడం, నాలాలు సరిగా లేకపోవడమే సమస్యకు కారణమని గుర్తించారు. వాటితో ఎప్పటికీ ప్రమాదమేనని గుర్తించి పరిష్కార చర్యలకు సిద్ధమయ్యారు. ‘వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఎన్డీపీ)’ను చేపట్టారు.నగరంలో ఏడాది సగటు వర్షపాతం, వరద నీరు వెళ్లే నాలాల పరిమాణం, క్షేత్రస్థాయి పరిస్థితు లు.. ఇలా అన్ని అంశాలను పరిశీలించారు. వరద కాలువలను విస్తరించాలని తొలుత నిర్ణయించారు. కానీ అందుకు ఆస్తుల సేకరణ కష్టంతో కూడుకున్నదని, భారీగా నిధులు అవసరమని భావించి.. ప్రత్యామ్నాయంగా ప్రస్తుతమున్న నాలాలకు సమాంతరంగా వరద నీరు పోయేలా ఏర్పాట్లు చేపట్టారు. ఉన్న రోడ్లకు ఎలాంటి ఆటంకం కలగకుండా అందుబాటులో ఉన్న స్థలాల్లో బాక్స్ డ్రెయిన్లు, ఇతర ఏర్పాట్లు చేపట్టారు.సగం దాకా పనులు కొనసాగుతూనే..⇒ నగరంతో పాటు శివార్లలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ పనులు చేపట్టాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. వర్షాలతో తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రాంతాల్లో తొలిదశ కింద రూ.985.45 కోట్లతో పనులు చేపట్టారు. నాలాల ప్రాజెక్టులను విభజించి 58 పనులుగా చేపట్టగా.. 35 పనులు పూర్తయ్యాయి. రెండు పనులు కోర్టు కేసులతో ఆగిపోయాయి. స్థానిక ఇబ్బందులతో ఒక పని పెండింగ్‌లో ఉంది. మిగతావి తుదిదశలో ఉన్నాయి.తాత్కాలిక చర్యలతో..ప్రస్తుతం తాత్కాలిక ఉపశమనంగా కాలనీలతోపాటు రోడ్లపై నిలిచిపోయే నీటిని వెంటనే తోడి పోసేందుకు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌ల పేరిట కారి్మకులను నియమించారు. నీళ్లు ఎక్కువగా నిలిచిన ప్రాంతాల్లో మోటార్లతో తోడిపోస్తున్నారు.ఇలా చెత్త వేయడమూ కారణమే! ⇒ నాలాలు లేని ప్రాంతాల్లో వరద నీరు వెళ్లే మార్గం లేక సమస్యగా మారుతుంటే.. నాలాలున్న చోట కూడా వివిధ రకాల వ్యర్థాలు, చెత్తా చెదారం వేస్తుండటంతో పూడుకుపోయి సమస్య తలెత్తుతోంది. చాలా ప్రాంతాల్లో వరదనీరు, మురుగునీరు కలిసి వ్యాధులకు కారణమవుతున్నాయి.ఆ పనులు మొదలయ్యేదెన్నడు?⇒ ఎస్ఎన్డీపీ తొలిదశ పనులు కొలిక్కి వస్తుండటంతో.. రెండో దశలో వచ్చే రెండేళ్లలో రూ.2,141.22 కోట్లతో 176 కిలోమీటర్ల నాలాల పనులు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. నిధుల సమస్యతో వాటిలో ప్రాధాన్యమున్నవి ఎంపిక చేసి.. అంచనా నిధులను రూ.495 కోట్లకు కుదించారు. ఈ పనులెప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పథకం పేరును హెచ్–సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్– నాలా కాంపొనెంట్)గా మార్చింది.పనులు చేపట్టిన చోట కూడా.. ఎస్ఎన్డీపీ కింద పనులు చేపట్టిన ప్రాంతాల్లోనూ వరద ముప్పు తప్పని పరిస్థితి కనిపిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. బండ్లగూడ చెరువులోకి చేరే వరద నీటితో.. పక్కనే ఉన్న అయ్యప్ప కాలనీ, మల్లికార్జుననగర్ నీట మునిగేవి. పరిష్కారం కోసం అధికారులు ట్రంక్‌లైన్ ఏర్పాటు చేశారు. కానీ భారీ వర్షం వస్తే.. దానితో ప్రయోజనం ఉండదని, ముంపు తప్పదని స్థానికులు వాపోతున్నారు.ఉదాహరణకు సరూర్‌నగర్ చెరువు లోతట్టు ప్రాంతాలైన కోదండరాంనగర్, సీసాలబస్తీ, శారదానగర్, కమలానగర్, న్యూగడ్డి అన్నారం కాలనీలు గట్టి వానపడినప్పుడల్లా నీట మునిగేవి. వరద నీరు తగ్గేందుకు మూడు నాలుగు రోజులు పట్టేది. ఈ సమస్య పరిష్కారానికి బాక్స్ డ్రెయిన్, అదనంగా ట్రంక్‌లైన్ ఏర్పాటు చేశారు. కానీ న్యూ గడ్డిఅన్నారం, కమలానగర్ ప్రాంతాల్లో వరద నీటి సమస్య అలాగే ఉందని స్థానికులు చెప్తున్నారు.భారీ వర్షాలు వస్తే మునగడమే..⇒ అయ్యప్ప కాలనీలోకి పైకాలనీల నుంచి వరద నీరు రాకుండా ట్రంక్‌లైన్ వేశారు. కానీ భారీ వర్షాలు వచి్చనప్పుడల్లా అయ్యప్ప కాలనీ నీట మునుగుతూనే ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ అంశంపై తగిన శ్రద్ధ చూపి వరద నీరు రాకుండా చర్యలు చేపట్టాలి. శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలి. – శ్రీనివాస్, అయ్యప్ప కాలనీ గతంలో వరదనీటితో మునిగిన అయ్యప్ప కాలనీ -
అమెరికాలో భారీ వర్షాలు
వాషింగ్టన్: ఎడతెరిపి కురుస్తున్న భారీ వర్షాలతో అమెరికాలో అయోవా రాష్ట్రం అతలాకుతలమైంది. వర్షపు నీటిలో మునిగి రహదారులు కనిపించకుండాపోయాయి. ఇళ్లు నీట మునగడంతో జనం సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. జలదిగ్భందంలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ సాయంతో రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. పడవల్లో జనాలను వేరే చోట్లకు తరలిస్తున్నారు. అయోవా రాష్ట్రంలోని సియాక్స్ కౌంటీలోని రాక్‌వ్యాలీ జనావాసం మొత్తం జలమయమైంది. 21 కౌంటీల్లో అత్యవసర పరిస్థితి విధించారు.45.72 సెంటీమీటర్ల వర్షపాతం సౌత్ డకోటాలోనూ భీకర వర్షాలు కురుస్తున్నాయి. ఆగ్నేయ సియాక్స్ ఫాల్స్ సమీపంలోని కాన్టన్ పట్ణణంలో ఏకంగా 45.72 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జాతీయ రహదారులపైనా వర్షపు నీరు నిలిచింది. దీంతో హైవేలపై రాకపోకలను పోలీసులు ఆపేశారు. మిన్నెసోటాలోనూ రాష్ట్ర రహదారులను మూసేశారు. మిగతా రాష్ట్రాలు అతి ఎండలు అమెరికాలో ఓవైపు వర్షాలు వణికిస్తుంటే మిగతా రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. 1.5 కోట్ల జనాభాను వడగాల్పులు వేధిస్తున్నాయని, మరో 9 కోట్ల మంది భయంకర ఎండల బారిన పడ్డారని జాతీయ వాతావరణ సంస్థ ఆదివారం ప్రకటించింది. 1936 తర్వాత ఎన్నడూలేనంతగా గత ఏడాది అత్యధిక వడగాల్పులు అమెరికాకు ముచ్చెమటలు పట్టించాయి. దీంతో గత 45 ఏళ్లలో ఎప్పుడూలేనంతగా 2,300 మంది ఎండసంబంధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. సోమవారం వాషింగ్టన్, కాలిఫోరి్నయాలోని సెంట్రల్ వ్యాలీల్లో అధిక ఉష్ణోగ్రత నమోదుకావచ్చని వాతావరణ శాఖ తెలిపింది. -
ఢిల్లీలో మళ్లీ భారీ వర్షం..స్తంభించిన జనజీవనం
సాక్షి, ఢిల్లీ: నాలుగు రోజుల తర్వాత ఢిల్లీలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో మొదలైన వర్షం.. గట్టిగానే దంచి కొడుతోంది. దీంతో.. ఇప్పడిప్పుడే బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న జనం మళ్లీ ఇంటి వైపు పరుగులు పెడుతున్నారు. ఈ పరిస్థితితో ఇప్పటికే వరద గుప్పిట ఉన్న ఢిల్లీ కోలుకునేందుకు ఇంకాస్త సమయం పట్టేదిగా కనిపిస్తోంది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు.. పైగా యమునా నదీకి ఎగువ నుంచి వచ్చి చేరిన వరదతో దేశ రాజధాని ప్రాంతం నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓవైపు వర్షం ఆగిపోయినప్పటికీ.. అప్పటికే పోటెత్తిన వరద యమునా నదిని డేంజర్ జోన్‌కి నెట్టేసింది. దీంతో నదీ తీర ప్రాంతం నుంచి జనాల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది ఢిల్లీ ప్రభుత్వం. ఈలోపు నగరం కూడా నీట మునిగి.. మొత్తం జనజీవనంపై ప్రభావం పడింది. మునుపెన్నడూ చూడని దృశ్యాలకు హస్తిన వేదికైంది. ఇక సహాయక చర్యల్లో భాగంగా రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ నడుం లోతు వరద నీటి నుంచి జనాలను, మూగ జీవాల్ని తరలిస్తూ వస్తోంది. ఈలోపు వరద క్రమంగా తగ్గుముఖం పడుతుండడం.. యమునా నదీ ఐదు సెంటీమీటర్ల ప్రవాహం తగ్గడంతో పరిస్థితి సాధారణం వైపు వెళ్తోందని అంతా ఆశించారు. కానీ, తాజాగా మళ్లీ వర్షం కురుస్తుండడంతో మళ్లీ నగర వాసుల్లో ఆందోళన పెరిగిపోతోంది. చాలావరకు వీధుల్లో ఇప్పటికీ నీరు అలాగే నిలిచి ఉండడం గమనార్హం. ఇంకోవైపు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. #WATCH | Rain lashes parts of national capital. Visuals from Raj Ghat. pic.twitter.com/aVDmlTlw39 — ANI (@ANI) July 15, 2023 -
Delhi Floods: దేశ రాజధానికి ఈ దుస్థితి దేనికి?
దేశ రాజధాని నీట మునిగింది. మూడురోజుల ఎడతెరిపి ఇవ్వని వర్షంతో.. ఢిల్లీకి ఈ దుస్థితి ఏర్పడింది. 205 మీటర్ల డేంజర్ మార్క్‌ను ఇప్పటికే దాటేసి మరీ యమునా నది మహోగ్ర రూపంతో ఉప్పొంగుతోంది. నీటి స్థాయి ఇంకా పెరుగుతూ పోవడంతో ఎప్పుడు.. ఏం జరుగుతుందో ఆందోళన నెలకొంది. అందుకే యమునా నది తీరం వెంట 144 సెక్షన్ విధించారు!. అయితే వర్షాలే రాజధాని ప్రాంతం నీట మునగడానికి కారణం కాదా? ఢిల్లీ.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం, దీనికి తోడు హర్యానా హర్యానాలోని హథ్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్లే రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం వరద పరిస్థితి నెలకొంది. మోకాళ్ల లోతు నీటిపైనే నీరు నిలిచి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే.. నిపుణులు మాత్రమే ఇవి మాత్రమే కారణాలు కాదని చెబుతున్నారు. ఢిల్లీ వరద పరిస్థితులపై సెంట్రల్ వాటర్ కమిషన్(CWC)కి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందించారు. హర్యానా యమునానగర్‌లోని హథ్నీకుండ్ బ్యారేజ్ నుంచి ఎన్నో ఏళ్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుంటారు. 180 కిలోమీటర్ల ప్రయాణం.. అదీ రెండు, మూడు రోజుల తర్వాత అది ఢిల్లీకి చేరుకునేది. అయితే.. ఈసారి తక్కువ టైంలో వరద నీరు ఢిల్లీ వైపునకు చేరింది. అదే సమయంలో భారీ వర్షాలు కురవడంతో.. ఆ నీరు ఈ నీరు కలిసి ఢిల్లీని వరదలా ముంచెత్తాయి. అయితే.. దీనికి ప్రధాన కారణం ఆక్రమణలు, నేల కోత(కట్టడాలతో పాటు కాలుష్యమూ దీనికి కారణంగా చెబుతున్నారు). ఇంతకుముందు, నీరు ప్రవహించడానికి ఎక్కువ స్థలం ఉండేది. ఇప్పుడు నేల కోత, అక్రమ కట్టడాల కారణంగా అది కుంచించుకుపోయిందని చెబుతున్నారాయన. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH)లోని నేచురల్ హెరిటేజ్ డివిజన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ మను భట్నాగర్.. యమునా నది ఇంతలా ఉప్పొంగడానికి విపరీతమైన వర్షపాతం కారణమని అభిప్రాయపడ్డారు. యమునా నదికి ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఎక్కువ కాలం పడే వర్షాల వల్ల వరద ప్రభావం కనిపించేది కాదు. కానీ, ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. అందువల్లే దిగువన ఈ పరిస్థితి నెలకొందని మను భట్నాగర్ అంటున్నారు. నదీ డ్యామ్‌లపై అధ్యయనం చేసిన అనుభవం ఉన్న నిపుణుడు భీమ్ సింగ్ రావత్ యమునా నది నదీ కోత వల్ల.. నదీగర్భం ఎత్తు పెరిగిపోవడమేనని అభిప్రాయపడ్డారు. ‘‘వజీరాబాద్ నుంచి ఓక్లా వరకు 22 కిలోమీటర్ల నది విస్తీర్ణంలో.. 20 కంటే ఎక్కువ వంతెనలు ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. తద్వారా నదీ కోతకు గురై.. ఇసుక మేటలు ఏర్పడ్డాయి. అదే సమయంలో కాలుష్య కారకాలూ కూడా నీటి ప్రవాహానికి అడ్డుతగులుతున్నాయి’’ అని ఆయన చెప్పారు. ఢిల్లీలో యమునా నదీ చుట్టుపక్కల ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. పరిస్థితి ఇవాళ్టికి మరింత దిగజారే అవకాశం ఉండడంతో.. నదీ చుట్టుపక్కలకు వెళ్లకూడదని నిషేధాజ్ఞాలు జారీ అయ్యాయి. ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో.. 208.46 మీటర్ల లెవల్‌కు నీటి స్థాయి చేరుకుంది. 1978లో ఇది 207.49 మీటర్లు దాటింది. జాతీయ విపత్తు స్పందన బలగాల(NDRF) నుంచి 12 బృందాలు ఇప్పటికే మోహరించాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు
-
గురుగ్రామ్‌లో కుండపోత వర్షం.. నీట మునిగిన వాహనాలు..
చండీగఢ్: హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల నుంచి కురుస్తున్న కుండపోత వర్షం నగరాన్ని ముంచెత్తింది. రహదారుపై పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. దీంతో దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజా రవాణా స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మొకాళ్ల లోతు నీరు చేరడంతో కొన్ని వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్డుపై నిలిచిన నీటిలోనే వాహనాలు నెమ్మదిగా కదులుతున్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. నర్సింగపూర్ చౌక్ ఏరియాలో రహదారిపై వరద నీరు నిలిచిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. #WATCH | Heavy waterlogging in parts of Gurugram after rain lashed the city (Visuals from Narsinghpur Chowk) pic.twitter.com/B8Q7IlC8oh — ANI (@ANI) June 21, 2023 Welcome to Gurgaon, The city of Lakes. #gurugram #gurugramTraffic #gurugramrains @mlkhattar pic.twitter.com/IulhUYFcqH — Ankit Jain (@ajsunnyboy) June 21, 2023 బుధవారం ఉదయం ఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం (ఆర్‌డబ్ల్యూఎఫ్‌సీ) గురుగ్రామ్‌తో సహా ఢిల్లీలోని పరిసర ప్రాంతాలలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఢిల్లీ (పాలెం, ఐజిఐ విమానాశ్రయం), ఎన్‌సిఆర్ (గురుగ్రామ్, మనేసర్) ఫరూఖ్‌నగర్, సోహానా, నుహ్ (హర్యానా) మొరాదాబాద్, సంభాల్, బిల్లారి, చందౌసి, జహంగీరాబాద్, అనుప్షహర్, బహజోయ్ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. #Gurugram में बारिश से दरिया बनी सड़कों पर फंसी गाड़ियां, सवारियों से भरी बस बीच सड़क फंसी, चारो तरफ हाहाकार#Emergency #WaterLogging #GurugramRains #Gurgaon @cmohry @OfficialGMDA @MunCorpGurugram @pcmeenaIAS pic.twitter.com/FhRdijHC2t — Sunil K Yadav (@SunilYadavRao) June 21, 2023 -
డ్రైన్లు శుభ్రం చేసిన ట్రాఫిక్ పోలీసులు
బెంగళూరు: గుజరాత్ తీరంలో అల్లకల్లోలం సృష్టిస్తోన్న బిపర్ జోయ్ తుఫాను ప్రభావం బెంగళూరు నగరం మీద కూడా పడింది. మంగళవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరం మొత్తం నీటమునిగింది. ఎక్కడికక్కడ నీళ్లు రోడ్లపై చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. స్వయంగా ట్రాఫిక్ పోలీసులే రంగంలోకి దిగి డ్రైనేజీ అడ్డులను తొలగించి వర్షపు నీటిని మళ్లించి ట్రాఫక్ క్లియర్ చేశారు. వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన పోలీసుల వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు బెంగళూరు సౌత్ డీసీపీ సుజీతా సల్మాన్. భారీ వర్షం కారణంగా ఏకోస్పెస్, బెల్లందూర్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ కోన్ లను ఉపయోగించి నీటిని తొలగించారు. డ్రైనేజీల్లో అడ్డుపడిన చెత్తను స్వహస్తాలతో తీసి వర్షపు నీటిని మళ్లించడంతో నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేయగలిగారు. ఇదే విషయాన్ని బెంగళూరు సౌత్ డీసీపీ తన ట్విట్టర్లో రాస్తూ.. నిలిచిపోయిన నీటిని ట్రాఫిక్ పోలీసుల సాయంతో తొలగించడమైందన్నారు. ట్వీట్ తోపాటు వీడియోని కూడా జత చేశారు డీసీపీ. water logging cleared with the help of our staff. @CPBlr @jointcptraffic @blrcitytraffic @BlrCityPolice https://t.co/CUXvU8EG9e pic.twitter.com/fMmo3dsV92 — Sujeetha Salman , IPS (@DCPSouthTrBCP) June 12, 2023 -
మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. మూడు రోజులపాటు ఇలాగే
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో నేటి (జూలై 6) నుంచి 8 వరకు భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. దీంతో ఐఎండీ శుక్రవారం వరకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.ఇప్పటికే ముంబై సహా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ముంబై రహదారులపై, సబ్ వేలలో వర్షపు నీరు చేరడంతో వాహనాలను దారిమళ్లించాల్సి వస్తోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వర్షాలు తెరిపిలేకుండా కురుస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైసహా తూర్పు, పశ్చిమ ఉప నగరాలలో గత 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఇరుకు రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంధేరీ, సైన్, చెంబూర్, కుర్లా తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరడంతో అనేక చోట్ల వాహనాలను దారి మళ్లించారు. న్యూ ముంబైలోని ఖాందేశ్వర్ రైల్వే స్టేషన్ టికెట్ బుకింగ్ కౌంటర్ జలమయమైంది. సాన్‌పాడా రైల్వే స్టేషన్ దిశగా వెళ్లే రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో ఆటోలు ముందుకు వెళ్లలేకపోయాయి. దీంతో ప్రయాణికులు కాలినడకన ముందుసాగారు. ముంబై, థానే, ఉప నగరాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే సూచించారు. నదులు, చెరువులు, నాలాల పరీవాహక ప్రాంతాలపై నిఘా వేయాలని అధికారులను ఆదేశించారు. ఐఎండీ హెచ్చరికల ప్రకారం సముద్రంలో మూడు రోజులపాటు హై టైడ్ ఉంటుంది. పెద్దపెద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడే ప్రమాదముంది. దీంతో జనాలు సముద్ర తీరాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. పర్యాటకుల కష్టాలు.. 24 గంటల నుంచి తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పంచ్గంగాలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. సోమవారం సాయంత్రం వరకు ఈ నదిపై ఉన్న రాజారాం డ్యాంలో నీటి మట్టం 16 అడుగుల మేర పెరిగింది. కాని మంగళవారం ఉదయం ఈ నీటి మట్టం ఏకంగా 24 అడుగులకు చేరింది. డ్యాంలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోవడంతో తిలకించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. కాని భారీవర్షం కారణంగా అనేక మంది పర్యాటకులు డ్యాం పరిసరాల్లో చిక్కుకున్నారు. రెస్క్యు టీం పర్యాటకులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా కొల్హాపూర్ సిటీసహా జిల్లా లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొల్హాపూర్ వాసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరఠ్వాడాలోనూ వానలే వానలు.. మరఠ్వాడలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఔరంగాబాద్, జాల్నా, పర్భణీ, నాందేడ్, హింగోళి, లాతూర్, బీడ్, ఉస్మానాబాద్ జిల్లాలో భారీ వర్షాలతోపాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నా యి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలుల వల్ల అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో అనేక గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఒకపక్క వర్షం, మరోపక్క విద్యుత్ సరఫరాలేక ప్రజలు అంధకారంలోనే గడుపుతున్నారు. అయితే జూన్‌లో పత్తాలేకుండా పోయిన వర్షాలు జూలై ఆరంభంలోనే కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దుక్కిదున్ని, విత్తనాలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో అనేక చోట్ల చెక్ డ్యాంలు కనిపించకుండా పోయాయి. చిన్న చిన్న వంతెనల మీదుగా నీరు ప్రవహిస్తోంది. దీంతో కొన్ని గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయా యి. రవాణా సౌకర్యాలు లేక ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. భారీ వర్షాల కారణంగా మంగళవారం సీఎస్ఎంటీలో రైళ్లు ఆలస్యం కావడంతో ఫ్లాట్‌ఫాంకు అటూఇటూ భారీగా నిలిచిపోయిన ప్రజలు -
చెరువులా మారిన ఢిల్లీ విమానాశ్రయం, అంతా నీరే..
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిరాటంకంగా శనివారం భారీ వర్షం పడడంతో రోడ్లతో పాటు విమానాశ్రయం కూడా జలమయమైంది. ఎయిర్పోర్ట్ ప్రాంతమంతా నీటిలో మునిగింది. విమానాలు ఆగే ప్రాంతం.. ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతాలు నీటితో నిండాయి. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలు రద్దవగా మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. ఒక అంతర్జాతీయ, ఒక దేశీయ విమానం జైపూర్, అహ్మదాబాద్‌కు దారి మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో మూడు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. చదవండి: సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్‌కు ఇంజెక్షన్ ‘అకస్మాత్తుగా కురిసిన వర్షంతో కొద్దీ సమయంలోనే నీళ్లు చేరాయి. మా బృందం వెంటనే చర్యలు చేపట్టింది’ అని ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. విమానాశ్రయాన్ని ఎప్పటికప్పుడు నీరు బయటకు పంపించేందుకు ఎయిర్పోర్ట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దేశ రాజధానిలో శుక్రవారం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో 18 ఏళ్ల రికార్డు బద్దలవగా ఈ ఏడాది వర్షాకాలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. 40 ఏళ్లల్లోనే అత్యధిక వర్షాలు 2021లో నమోదయ్యాయని వాతావరణ శాఖ ప్రకటించింది. చదవండి: భిక్షమెత్తుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి మరదలు #WATCH | Parts of Delhi Airport waterlogged following heavy rainfall in the national capital; visuals from Indira Gandhi International Airport (Terminal 3) pic.twitter.com/DIfUn8tMei — ANI (@ANI) September 11, 2021 बूँद-बूँद से बनता है सागर 🤦🏻♀️#DelhiAirport claims it’s all clear now and the water has been drained out. Latest pics below pic.twitter.com/5U1tKeFtUR — Poulomi Saha (@PoulomiMSaha) September 11, 2021 -
జలదిగ్బంధంలో భైంసా పట్టణం
-
జలదిగ్బంధంలో భైంసా పట్టణం
నిర్మల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ వర్షాల ధాటికి భైంసా పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గడ్డెన్న వాగు గేట్లు ఎత్తడంతో వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో వరద నీరు ఇళ్ల మధ్యలో నుంచి ప్రవహిస్తోంది. వరద తీవ్రత ఎక్కువ కావడంతో భైంసా పట్టణం ఆటోనగర్‌లోని 60 కుటుంబాలు నీటిలో చిక్కుకున్నాయి. ఈ ప్రాంతంలో మంత్రి ఇంద్రకరన్ రెడ్డి పర్యటించి, పరిస్థితులను తెలుసుకున్నారు. కాగా రెస్క్యూ టీం నాటు పడవలతో సహాయక చర్యలు ప్రారంభించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురువడంతో.. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.. గ్రామాల్లో మురుగుకాల్వలు, ప్రధాన రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. -
వైరల్ వీడియో: రోడ్డుపై వర్షం నీటిని తొలగిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
-
వైరల్: ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులపై ప్రశంసల జల్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో బుధవారం రాత్రి వాన పడింది. దీంతో పలు రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఇక మాదాపూర్‌లో 5 సెంటిమీటర్లు, గచ్చిబౌలింలో 4.6 సెంటిమీటర్లు, చందానగర్‌లో 4.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి కురిసిన వానకు ఉప్పల్ ప్రాంతంలోని ఆదిత్య ఆస్పత్రి రోడ్డుపై ఉన్న గుంతలు జలమయం అయ్యాయి. రోడ్డుపై నిలిచిపోయిన నీటితో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి రహదారిపై నీటితో నిండిన గుంతలలో పార సాయంతో స్వయంగా మట్టినింపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను రాచకొండ పోలీసు కమిషనరేట్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను వీక్షించిన పోలీసు అధికారులు, నెటిజన్లు ట్రాఫిక్ పోలీసులు పని తీరును ప్రశంసిస్తున్నారు. చదవండి: ఓలా ఫౌండేషన్: ఇంటి ముందుకే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు -
అదరగొడుతున్న చిన్నారి రిపోర్టర్
చండీగఢ్: మీడియా రంగంలో రిపోర్టింగ్‌కు ఉండే క్రేజే వేరు. ఈ ఫీల్డులోకి అడుగుపెట్టాలని భావించే వారి ప్రథమ ప్రధాన్యం రిపోర్టింగే. అయితే అనుకున్నంత సులువు కాదు రిపోర్టింగ్. ఏళ్లుగా అనుభవం ఉన్నవారు కూడా ఒక్కోసారి తడబడుతుంటారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ చిన్నారి ఏమాత్రం తడబాటు లేకుండా.. సమస్యల గురించి రిపోర్ట్ చేస్తోన్న పద్దతికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వివరాలు.. గత కొద్ది రోజులుగా హరియాణలో కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. మ్యాన్‌హోల్స్ సరిగా లేకపోవడంతో ఎక్కడికక్కడే వర్షపు నీరు నిలిచిపోయి.. చిన్న సైజు తటకాలను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల వర్షపు నీరు ఇండ్లలోకి ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కురుక్షేత్రకు చెందిన ఓ చిన్నారి ఈ సమస్య గురించి గ్రౌండ్ రిపోర్ట్ చేసింది. తన ఇంటి చుట్టపక్కల వర్షపు నీరు నిలిచి పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. నీరు నిలిచిపోయి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అన్నది. ఈ నీరు ఇళ్లలోకి ప్రవేశించకుండా ఉండటానికి కొందరు ఇంటి ముందు సిమెంట్ బస్తాలతో అడ్డు కట్టలు వేస్తున్నారన్నది. వెంటనే ఉన్నతాధికారులు ఈ సమస్యపై స్పందించి తగిన పరిష్కారం చూపాలని డిమాండ్ చేసింది. దీన్నంతా వీడియో తీసి ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. చిన్నారి ఏమాత్రం తడబాటు లేకుండా సమస్య గురించి రిపోర్ట్ చేయడంతో నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. In Haryana school girl from #Kurukshetra is reporting live during rainfall from her neighbourhood about the water logging problem. I hope her voice will reach to the authorities @cmohry @mlkhattar .No doubt she has outsmarted all TV journalists in her stint ! pic.twitter.com/5QE82hjkQU — Chiguru Prashanth (@prashantchiguru) July 20, 2019 -
ప్రతియేటా ఇలా నీళ్లు నిలిస్తే ఊరుకోం: హైకోర్టు
''ప్రతియేటా ఇలాగే జరుగుతుంటే మేం సహించేది లేదు'' అని ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ తీవ్రంగా ఉండటంతో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నీళ్లు నిలిచిపోయిన పరిస్థితిపై హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి ఢిల్లీ సర్కారును తీవ్రంగా తప్పుబట్టారు. నీళ్లు నిలిచిపోయిన ప్రాంతాల విషయంలో పరిధి అంటూ ఏమీ ఉండదని, ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంటే మాత్రం తాము సహించేది లేదని కోర్టు ఘాటుగా హెచ్చరించింది. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో నీళ్లు ఎక్కువగా నిలిచిపోవడంతో కోర్టు దీన్ని పరిగణనలోకి తీసుకుంది. తాను ఉదయం కోర్టుకు వస్తుంటే ఉపరాష్ట్రపతి నివాసం ఎదుట కూడా నీళ్లు నిలిచిపోయి ఉండటం కనిపించిందని కేసును విచారించిన న్యాయమూర్తి అన్నారు. ఢిల్లీలో డ్రైనేజి వ్యవస్థ ఏమాత్రం బాగోలేకపోవడంతో డ్రెయిన్లలో దోమలు తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయని, దానివల్ల డెంగ్యూ, చికన్ గున్యా లాంటి వ్యాధులు విజృంభిస్తున్నాయని కూడా న్యాయమూర్తి అన్నారు. దక్షిణ ఎక్స్టెన్షన్ పార్ట్ -1, సమీపంలో ఉన్న కుశాక్ నల్లా ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయిన ఫొటోలను కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టారు. దక్షిణ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో డ్రైనేజి వసతి సరిగా లేకపోవడం వల్ల అక్కడి నీళ్లే కుశాక్ నల్లాప్రాంతాన్ని కూడా ముంచెత్తినట్లు ఫొటోల వల్ల తెలుస్తోందని అన్నారు. దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, ఢిల్లీ జలబోర్డులకు కోర్టు నోటీసులు జారీచేసింది. నిలిచిపోయిన నీళ్లను ఎప్పటికప్పుడు పోయేలా చూడాలని తెలిపింది. కేసు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.