సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లో బుధవారం రాత్రి వాన పడింది. దీంతో పలు రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఇక మాదాపూర్‌లో 5 సెంటిమీటర్లు, గచ్చిబౌలింలో 4.6 సెంటిమీటర్లు, చందానగర్‌లో 4.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి కురిసిన వానకు ఉప్పల్ ప్రాంతంలోని ఆదిత్య ఆస్పత్రి రోడ్డుపై ఉన్న గుంతలు జలమయం అయ్యాయి.
రోడ్డుపై నిలిచిపోయిన నీటితో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి రహదారిపై నీటితో నిండిన గుంతలలో పార సాయంతో స్వయంగా మట్టినింపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను రాచకొండ పోలీసు కమిషనరేట్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను వీక్షించిన పోలీసు అధికారులు, నెటిజన్లు ట్రాఫిక్ పోలీసులు పని తీరును ప్రశంసిస్తున్నారు.
చదవండి: ఓలా ఫౌండేషన్: ఇంటి ముందుకే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు
Comments
Please login to add a commentAdd a comment