Delhi Gurugram Expressway After Heavy Downpour Waterlogging - Sakshi
Sakshi News home page

Video: గురుగ్రామ్‌లో కుండపోత వర్షం.. నీట మునిగిన వాహనాలు.. 5 కి.మీ మేర ట్రాఫిక్‌

Published Wed, Jun 21 2023 4:21 PM | Last Updated on Wed, Jun 21 2023 5:22 PM

Traffic Jam Delhi Gurugram Expressway After Heavy Downpour Waterlogging - Sakshi

చండీగఢ్‌: హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల నుంచి కురుస్తున్న కుండపోత వర్షం నగరాన్ని ముంచెత్తింది. రహదారుపై పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ఢిల్లీ-గురుగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. దీంతో దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ప్రజా రవాణా స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మొకాళ్ల లోతు నీరు చేరడంతో కొన్ని వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్డుపై నిలిచిన నీటిలోనే వాహనాలు నెమ్మదిగా కదులుతున్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.  నర్సింగపూర్‌ చౌక్‌ ఏరియాలో రహదారిపై వరద నీరు నిలిచిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. 

బుధవారం ఉదయం ఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం (ఆర్‌డబ్ల్యూఎఫ్‌సీ) గురుగ్రామ్‌తో సహా ఢిల్లీలోని  పరిసర ప్రాంతాలలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఢిల్లీ (పాలెం, ఐజిఐ విమానాశ్రయం), ఎన్‌సిఆర్ (గురుగ్రామ్, మనేసర్) ఫరూఖ్‌నగర్, సోహానా, నుహ్ (హర్యానా) మొరాదాబాద్, సంభాల్, బిల్లారి, చందౌసి, జహంగీరాబాద్, అనుప్‌షహర్, బహజోయ్ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement