Delhi-Gurgaon Expressway
-
గురుగ్రామ్‌లో కుండపోత వర్షం.. నీట మునిగిన వాహనాలు..
చండీగఢ్: హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల నుంచి కురుస్తున్న కుండపోత వర్షం నగరాన్ని ముంచెత్తింది. రహదారుపై పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. దీంతో దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజా రవాణా స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మొకాళ్ల లోతు నీరు చేరడంతో కొన్ని వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్డుపై నిలిచిన నీటిలోనే వాహనాలు నెమ్మదిగా కదులుతున్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. నర్సింగపూర్ చౌక్ ఏరియాలో రహదారిపై వరద నీరు నిలిచిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. #WATCH | Heavy waterlogging in parts of Gurugram after rain lashed the city (Visuals from Narsinghpur Chowk) pic.twitter.com/B8Q7IlC8oh — ANI (@ANI) June 21, 2023 Welcome to Gurgaon, The city of Lakes. #gurugram #gurugramTraffic #gurugramrains @mlkhattar pic.twitter.com/IulhUYFcqH — Ankit Jain (@ajsunnyboy) June 21, 2023 బుధవారం ఉదయం ఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ సూచన కేంద్రం (ఆర్‌డబ్ల్యూఎఫ్‌సీ) గురుగ్రామ్‌తో సహా ఢిల్లీలోని పరిసర ప్రాంతాలలో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఢిల్లీ (పాలెం, ఐజిఐ విమానాశ్రయం), ఎన్‌సిఆర్ (గురుగ్రామ్, మనేసర్) ఫరూఖ్‌నగర్, సోహానా, నుహ్ (హర్యానా) మొరాదాబాద్, సంభాల్, బిల్లారి, చందౌసి, జహంగీరాబాద్, అనుప్షహర్, బహజోయ్ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. #Gurugram में बारिश से दरिया बनी सड़कों पर फंसी गाड़ियां, सवारियों से भरी बस बीच सड़क फंसी, चारो तरफ हाहाकार#Emergency #WaterLogging #GurugramRains #Gurgaon @cmohry @OfficialGMDA @MunCorpGurugram @pcmeenaIAS pic.twitter.com/FhRdijHC2t — Sunil K Yadav (@SunilYadavRao) June 21, 2023 -
ఇంటికి వెళ్లడానికి 12 గంటలు పట్టింది
గుర్గావ్: దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ వేపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికే గంటలకొద్దీ సమయం పడుతోంది. గురువారం ఆఫీస్ నుంచి బయలుదేరితే ట్రాఫిక్ జామ్ కారణంగా 12 గంటల తర్వాత ఈ రోజు ఉదయం ఇంటికి చేరుకున్నానని ఓ ఉద్యోగి చెప్పారు. రెండు రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని గుర్గావ్ పోలీసులు యాజమాన్యాలను కోరారు. అలాగే పరిస్థితి కుదుటపడే వరకు కార్పొరేట్ హబ్ అయిన గుర్గావ్కు రాకుండా ఉండాలని ఢిల్లీ ఉద్యోగులకు సూచించారు. ఢిల్లీ-గుర్గావ్ హైవేపై కిలోమీటర్ల మేర వాహానాలు నిలిచిపోయాయి. కార్లు, ఇతర వాహనదారులు గంటలకొద్దీ ఫస్ట్ గేర్‌లోనే వెళ్లాల్సిరావడంతో ఆయిల్ అయిపోయి కొన్ని వాహనాలు ఆగిపోయాయి. రోడ్లను క్లియర్ చేసేందుకు అధికారులతో కూడిన బృందాన్ని పంపాల్సిందిగా కేంద్ర రవాణ శాఖమంత్రి నితిన్ గడ్కరీ నేషనల్ హైవే చీఫ్‌ను ఆదేశించారు. గుర్గావ్ పోలీస్ చీఫ్ నవదీప్ విర్క్ బైక్‌పై వెళ్లి ట్రాఫిక్ జామ్ అయిన ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షించారు. ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్లడం కంటే న్యూయార్క్‌కు తొందరగా చేరుకోవచ్చని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. -
ఎక్స్‌ప్రెస్‌వేలో మహిళను వెంటాడి..
న్యూఢిల్లీ: అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆగ్రహించిన ఓ మహిళను దుండగులు వేటాడి, ఆమెపై కాల్పులు జరిపారు. ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్‌వేలో ఈ దారుణం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి ఢిల్లీకి చెందిన ఆరుగురు స్కార్పియో వాహనంలో వెళ్తున్నారు. వీరిలో సిద్దాంత్ ఠాకూర్, దేవిశ్రీ, అసిస్టెంట్ జైలర్ సునీల్ కుమార్, ఆడిటర్ సంజీవ్ కుమార్ మరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. దారి మధ్యలో ఓ మద్యం షాపు వద్ద ముగ్గురు వ్యక్తులు కారులో ఉన్న మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో కారులో ఉన్న మహిళ ఎదురుతిరిగి ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పుడు ఏమీ మాట్లాడకుండా వెళ్లిన అపరిచితులు కాసేపటి తర్వాత మరో ఇద్దరిని తీసుకుని స్కార్పియోను వెంబడించారు. ఐఫ్కో చౌక్ వద్ద దుండగులు స్కార్పియో అద్దాలను బేస్ బాల్ బ్యాట్లతో పగలగొట్టారు. లోపల ఉన్న సిద్ధాంత్, దేవిశ్రీలపై కాల్పులు జరిపి పారిపోయారు. సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన సిద్ధాంత్, దేవిశ్రీ గురుగ్రామ్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.