ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం  | Two AP Students Lost In Road Accident At Philippine | Sakshi
Sakshi News home page

ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం 

Published Tue, Apr 7 2020 8:01 AM | Last Updated on Tue, Apr 7 2020 8:01 AM

Two AP Students Lost In Road Accident At Philippine - Sakshi

సాక్షి, కదిరి: ఫిలిప్పీన్స్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఇరువురు  విద్యార్థులు దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.. కదిరి పట్టణంలోని మెయిన్‌ రోడ్‌లో ఉంటున్న ఎల్‌ఎల్‌వీ క్లాత్‌ సెంటర్‌ నిర్వాహకుడు కటికెల మల్లికార్జున రెండో కుమారుడు రేవంత్‌కుమార్‌(21), అనంతపురానికి చెందిన దండోరా నాయకుడు కేపీ నారాయణ స్వామి కుమారుడు వంశీకృష్ణ(18) ఫిలిప్పీన్స్‌లోని సెబూ నగరంలో ఉన్న ఎంహెచ్‌ఏఎం కళాశాలలో ఒకరు ఎంబీబీఎస్‌ నాల్గవ సంవత్సరం కాగా, మరొకరు మొదటి సంవత్సరం చదువుతున్నారు.

వీరిరువురూ అక్కడ ఒకే రూంలో అద్దెకు ఉంటూ చదువుకుంటున్నారు. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా తెల్లవారుజామునే ద్విచక్ర వాహనంతో నిత్యావసరాల కోసం బయలు దేరారు. ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్‌కు రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్నారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం  అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ నిలిపివేయగా.. వారి మృతదేహాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డితో పాటు కలెక్టర్‌ గంధం చంద్రుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement