Philippine
-
మీడియాకు ముప్పుగా మారిన దేశమేది? 17 నెలల్లో ఎంతమంది బలయ్యారు?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పౌరులతో పాటు, కొందరు జర్నలిస్టులు కూడా మృతిచెందారు. అయితే ఇలాంటి పరిస్థితులు లేనప్పటికీ ఫిలిప్పీన్స్‌లో పలువురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. ఈ దేశంలో హత్యకు గురైన జర్నలిస్టుల జాబితాలోకి మరో పేరు చేరింది. తాజాగా రేడియో బ్రాడ్‌కాస్టర్ ఒకరు స్టూడియోలో తుపాకీ కాల్పులకు బలయ్యారు. గడచిన 17 నెలల్లో ఫిలిప్పీన్స్‌లో నలుగురు మీడియా సిబ్బంది హత్యకు గురయ్యారు. కాలాంబా మునిసిపాలిటీ ప్రతినిధి కెప్టెన్ డియోర్ రాగోనియా మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. 57 ఏళ్ల రేడియో బ్రాడ్‌కాస్టర్ జువాన్ జుమలోన్‌కు చెందిన స్టూడియోలోకి చొరబడిన సాయుధ దుండగుడు అతని తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జుమాలోన్ మృతి చెందాడు. ‘డీజే జానీ వాకర్’గా పేరొందిన జుమాలోన్.. మిండానావోలోని తన నివాసంలోని స్టూడియోలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన అనంతరం ఆగంతకుడు పరారయ్యాడు. ఈ ఘటన స్టూడియోలోని సీసీ కెమెరాలో రికార్డయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ హత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ ఈ కేసులో నేరస్తులను త్వరగా పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. తమ ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్టులపై దాడులను సహించబోమని, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే వారి చర్యలు తీసుకుంటామని మార్కోస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా తెలియజేశారు. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఫిలిప్పీన్స్(ఎన్‌యుజేపీ) తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాది జూన్‌లో ఫెర్డినాండ్ మార్కోస్ అధికారం చేపట్టిన తర్వాత ఫిలిప్పీన్స్‌లో నలుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా ఫిలిప్పీన్స్ మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ‘ప్లీజ్.. పెళ్లి చేసుకోండి’.. యువతులను వేడుకుంటున్న చైనా అధ్యక్షుడు -
ఎవరికి వారు పెంచుకునేలా..వెటరన్ ఇంటిగ్రేటెడ్ ఫామ్!
ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంత జీవితంలో తనకు నైపుణ్యం ఉన్న రంగంలో కృషిని కొనసాగించడం ఇటు తనకు, అటు సమాజానికి మేలు జరుగుతుందని నమ్మే వ్యక్తి వెస్లీ రొసారియో. తన నమ్మకాన్ని ఆచరణలో పెట్టి వాహ్ అనిపించుకుంటున్నారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన వెస్లీ చేపలు, రొయ్యల పెంపకంలో నిపుణుడు. బ్యూరో ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాటిక్ రిసోర్సెస్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షుడిగా ఉన్నత స్థాయిలో సేవలందించి దగుపన్ నగరంలో మూడేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ బాధ్యతల రీత్యా బదిలీల వల్ల టపుయాక్ జిల్లాలోని తమ పూర్వీకుల ఇంటిని ఖాళీగా ఉంచాల్సి వచ్చింది. అక్కడ ఎవరూ లేకపోయేసరికి ఆ ఇంటితో పాటు వెయ్యి చదరపు మీటర్ల పెరడు కూడా నిరుపయోగంగా పాడు పడింది. రిటైరైన తర్వాత ఆయన ఇంటికి చేరుకొని కొద్ది నెలల్లోనే ఫిష్‌టెక్ అర్బన్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫార్మింగ్ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పటంతో ఇంటికే కాదు పెరటికి కూడా కళ వచ్చింది. ఇంటిపట్టునే కూరగాయలు, ఆకుకూరలు, కోళ్లతో పాటు చేపలను కూడా నిశ్చింతగా ఎవరికివారు పెంచుకొని ఇంటిల్లపాదీ పౌష్టికాహారాన్ని ఆస్వాదించవచ్చని వెస్లీ రొసారియో తన అర్బన్ ఇంటిగ్రేటెడ్ ఫామ్‌లో ఆచరించి చూపుతున్నారు. యూత్, సెకండ్ యూత్ అన్న తేడా లేకుండా బ్యాచ్‌ల వారీగా అందరికీ శిక్షణ ఇస్తున్నారాయన. ట్యాంకు నుంచి అజోలాను వెలికితీస్తున్న రొసారియో వెస్లీ రొసారియో పెరటి తోటలో మొత్తం ఎనిమిది (మీటరు వెడల్పు, మూడు మీటర్ల పొడవైన) చిన్న చెరువులు ఉన్నాయి. నేలపై తవ్విన చెరువుతో పాటు సిల్పాలిన్ షీట్, ఫైబర్‌తో చేసిన కృత్రిమ చెరువులు కూడా ఉన్నాయి. రీసర్కులేటరీ ఆక్వా చెరువు కూడా అందులో ఒకటి. కూరగాయలు, ఆకుకూరలు సాగయ్యే మడులతో పాటు కంటెయినర్లు ఉన్నాయి. హైడ్రోపోనిక్స్ వ్యవస్థలో ఆకుకూరలు, ఔషధ మొక్కలు పెంచుతున్నారు. ఆక్వాపోనిక్స్ వ్యవస్థ అదేవిధంగా ఆక్వాపోనిక్స్ వ్యవస్థ ఉంది. చేపల విసర్జితాలు, వాటికి వేసే మేత వ్యర్థాలతో కూడిన ఆ నీరు పోషకవంతమై ఆకుకూరలకు ఉపయోగపడుతోందని వెస్లీ రొసారియో తెలిపారు. నేలపై ఉన్న చెరువులో జెయింట్ గౌరామి, తిలాపియా, ఫంగాసియస్, క్యాట్‌ఫిష్‌లు పెరుగుతున్నాయి. నాటు కోళ్లు, బాతులకు ఆయన ప్రధానంగా అజోలాని పండించి మేతగా వేస్తున్నారు. అజోలాను నీటిలో వేస్తే చాలు, పెరుగుతుంది. ప్రాసెసింగ్ అవసరం లేదు. నేరుగా చేపలు, జంతువులకు, పక్షులకు మేతగా వేయొచ్చని ఆయన అన్నారు. అజోలా పెరిగే చెరువుల్లో దోమలు గుడ్లుపెట్టే అవకాశం ఉండబోదన్నారు. చెరువు నీటిలో చేపలు పెంచుతూనే, ఆ చెరువు నీటిపై తేలాడే మడు(ఫ్లోటింగ్ బెడ్)లను ఏర్పాటు చేసి అజోలాను పెంచుతుండటం విశేషం. సందర్శకులకు హైడ్రోపోనిక్స్ గురించి వివరిస్తున్న వెస్లీ రొసారియో చేపల తలలు, తోకలు, రెక్కలు, పొలుసులు, లోపలి భాగాలు వంటి వ్యర్థాలను సేకరించి మీనామృతం తయారు చేసి, పంటలపై పిచికారీ చేస్తే బలంగా పెరుగుతాయని రోసారియో తెలిపారు. వంకాయలు, మిరపకాయలు, బెండకాయకాయలు తదితర కూరగాయలను పండిస్తాం. బాతులు, నాటు కోళ్లు గుడ్లు పెడుతున్నాయి. పట్టణ ప్రజలు పెరట్లో చేపలు, కూరగాయలు పెంచుకోవడానికి శ్రద్ధ కావాలే గానీ పెద్దగా పెట్టుబడి అవసరం లేదు అంటున్నారు రొసారియో. అనుభవాలను పంచుకోవడం చాలా రిలాక్సింగ్‌గా ఉంది నేను పదవీ విరమణ తర్వాత జీవితం ఉండేలా చూడాలనుకున్నాను. నన్ను బిజీగా ఉంచుకోవడానికి ఏమి చేయాలో ముందుగానే ప్లాన్ చేసాను. నా వృత్తిపరమైన జీవితమంతా ఫిషరీస్‌లో పనిచేశాను కాబట్టి ఫిష్‌టెక్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫామ్‌ని ఏర్పాటు చేశాను. నా అనుభవాలను పంచుకోవడం చాలా రిలాక్సింగ్‌గా ఉంది. అలాగే, వచ్చి సలహాలు అడిగే మాజీ సహోద్యోగులతో సంబంధాలు కొనసాగటం సంతోషంగా ఉంది. – వెస్లీ రొసారియో, దగుపన్ నగరం, ఫిలిప్పీన్స్ (చదవండి: పెద్ద విస్తీర్ణంలో ప్రకృతి సేద్యం ఎలా చేయాలంటే..!) -
చిన్నారులపై అత్యాచారం కేసులో ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష
చిన్నారులపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పుడుతున్న ఒక వ్యక్తికి 129 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. బాలికలపై అత్యాచారం, మానవ అక్రమ రవాణా కేసుల్లో ఇప్పటికే జీవిత ఖైతు అనుభవిస్తున్న పీటర్ గెరార్డ్ స్కల్లీ అనే ఆస్ట్రేలియా వ్యక్తికి ఇది రెండో నేరం. అతను 18 నెలలు వయసు ఉన్న చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో స్కల్లీకి ఈ శిక్ష విధించినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ తీర్పు ఇలాంటి ఘోరమైన నేరాలకు పాల్పడేవారికి, మానవ అక్రమ రవాణాదారులకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. ప్రస్తుతం ఫిలిప్పీన్స్ చిన్నారులపై లైంగిక వేదింపులకు అడ్డగా మారిందన్నారు. దేశంలోని పేదరికం, ఆగ్లంలో మంచి పట్టు, హైస్పీడ్ ఇంటర్నెట్ వెసులుబాటు తదితరాలు ఈ దారుణమైన ఘటనలకు కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు. నిందితుడు స్కల్లీ చిన్నారులపై అత్యాచారాలు, మానవ అక్రమ రవాణాతో సహా సుమారు 60 నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మేరకు ఆస్ట్రేలియా కగాయన్ డి ఓరో కోర్టు నిందితుడు స్కల్లీ అతని ముగ్గురు సహచరులకు 129 ఏళ్ల జైలు శిక్ష విధించగా అతడి స్నేహితురాలికి 126 ఏళ్లు జైలు శిక్ష విధించింది. (చదవండి: ఇదే నా చివరి మెసేజ్ కావొచ్చు’.. బందీగా మారిన భారత నావికుడు) -
7.3 తీవ్రతతో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిన భవనాలు!
మనీలా: భూకంపాలకు నిలయంగా మారిన ఫిలిప్పీన్స్‌లో బుధవారం తెల్లవారు జామున మరోమారు భూమి కంపించింది. ఈసారి భారీ స్థాయిలో రిక్టార్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఉదయం 8.43 గంటల ప్రాంతంలో లుజోన్ ద్వీపంలోని ఆబ్రా ప్రావిన్స్‌ను భూకంపం తాకినట్లు పేర్కొంది. మనీలాకు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఎత్తైన భవనాలు కుదుపులకు లోనయ్యాయి. కొన్ని భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ప్రజలు భయంతో బయటకు పరుగులు పెటుడుతున్న భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇద్దరు మృతి.. భూకంప కేంద్రానికి 13 కిలోమీటర్ల దూరంలోని డోలోర్స్‌లో ప్రజలు భయంతో పరుగులు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ‘ఈ భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది. పోలీస్ స్టేషన్ భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ’ అని పోలీస్ మేజర్ ఎడ్విన్ సెర్జియో తెలిపారు. తొలుత ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అంచనా వేసినా.. పలు భవనాలు, చర్చీలు కూలిన ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు మీడియా పేర్కొంది. ప్రతి ఏడాది సుమారు 20కిపైగా తుపాన్లు ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేస్తుంటాయి. ప్రపంచంలోనే అంత్యత విపత్తు ప్రాంతంగా నిలుస్తోంది ఈ దేశం. 1990లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించగా.. 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ ఇప్పుడు 7కుపైగా తీవ్రత నమోదవటం వల్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. 🚨#BREAKING: A Powerful magnitude 7.3 earthquake has hit the Philippines, 📌#Philippines l #Asia A magnitude 7.3 earthquake has hit the Philippines, with reports of significant damage has occurred. As It was felt strongly in metro Manila, and all buildings have been evacuated. pic.twitter.com/G6SqC1akFq — R A W S A L E R T S (@rawsalerts) July 27, 2022 ఇదీ చదవండి: విమాన భోజనంలో బయటపడిన పాము తల.. వీడియో వైరల్ -
నవ్వుతూ సేవ చేయ్! లేదంటే జరిమాన: ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు
Smile Or Get Fined: ఫిలిప్పీన్స్ మేయర్ స్థానిక ప్రభుత్వం అందించే సేవల స్థాయిని మెరుగుపరిచే నిమిత్తం ఒక సరికొత్త పాలసీని తీసుకు వచ్చాడు. ఫిలిప్పీన్స్ ప్రధాన ద్వీపం లుజోన్‌లో క్యూజోన్ ప్రావిన్స్‌లోని ములానే పట్టణంలో అరిస్టాటిల్ అగ్యురే కొత్త మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అధికారం చేపట్టిన వెంటనే స్మైల్ పాలసీ అనే కొత్త పాలసీని ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేస్తూనే ప్రశాంతంగా, స్నేహపూర్వక వాతావరణంలో వారి సమస్యలను విని సాయం అందించేలా చిత్తశుద్ధితో పనిచేసేందుకు ఈ స్మైల్ పాలసీ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానికులు, ఎక్కువగా కొబ్బరి వ్యాపారులు, మత్స్యకారులు తమ పన్నులు చెల్లించడానికి లేదా సహాయం కోరడానికి వెళ్ళినప్పుడు టౌన్ హాల్ సిబ్బంది తమతో అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ ...ఫిర్యాదులు రావడంతోనే ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అగ్యురే తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల వైఖరి మార్చేందుకే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ పాలసీని పాటించని ఉద్యోగులకు ఆరు నెలల జీతానికి సరిపడా మొత్తం జరిమానగా విధించబడటం లేదా విధుల నుంచి తొలగించడం వంటివి జరుగుతాయని స్పష్టం చేశారు. అగ్యురే ఎన్నికలలో పోటీ చేయడానికి ముందు ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌గా పనిచేశారు. ఈ మేరకు అగ్యురే మాట్లాడుతూ... వ్యాపార అనుకూలమైన మున్సిపాలిటీగా ఉండేందుకే ఈ పాలసీని తీసుకువచ్చాం. తమ ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలు పాటిస్తారనే విశ్వసిస్తున్నానని చెప్పారు. (చదవండి: అగ్నిపర్వతం వద్ద సెల్ఫీ తీసుకోబోయి... అందులోనే పడిపోయాడు ఆ తర్వాత...) -
సంచలన ప్రకటన చేసిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె మరోసారి వార్తల్లోనిలిచారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. తాను 2022 ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయనని, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని శనివారం ప్రకటించారు. తద్వారా తన కుమార్తె సారా డ్యూటెర్టె దేశాధ్యక్ష పదవిని చేపట్టేందుకు మార్గాన్ని క్లియర్ చేస్తున్నాడనే ఊహాగానాలకు ఆజ్యం పోశారు. తాను వైస్ ప్రెసిడెంట్ పోటీకి అనర్హుడినన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పోటీనుంచి, రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. వచ్చే ఏడాది తన కుమార్తె పోటీకి మార్గం సుగమం చేశారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు రోడ్రిగో విధేయుడు, సెనేటర్ క్రిస్టోఫర్ "బోంగ్" వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేయనుండటం విశషం. కాగా 2022 ఎన్నికలకు గాను రోడ్రిగో డుటెర్టె ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా ఆరేళ్లు కాలపరిమితిని పూర్తిచేసుకున్న ఆయన, టాప్ పొజిషన్ కోసం మళ్లీ పోటీ చేయడానికి అర్హుడు కాదు. అయితే సారా డ్యూటెర్టేకు లైన్ క్లియర్ చేసేందుకే ఆయన రేసునుంచి తప్పుకున్నారని న్యాయ, రాజకీయాల ప్రొఫెసర్ ఆంటోనియో లా వినా అన్నారు. ఈ ఫైర్ బ్రాండ్ మళ్లీ మనసు మార్చుకున్నా ఆశ్చర్యం లేదని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. -
బాక్సింగ్‌కు గుడ్‌బై.. దేశాధ్యక్ష పదవిపై టార్గెట్
మనీలా: ఫిలిప్పీన్స్ బాక్సింగ్ లెజెండ్ మ్యానీ పకియావో తన బాక్సింగ్ కెరీర్‌కు వీడ్కొలు పలికాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి రిటైరవుతున్నట్లు బుధవారం ట్విట్టర్లో వీడియో సందేశం ద్వారా తెలిపాడు. తనను పేదరికం నుంచి ఈ స్ధాయికు తీసుకువచ్చిన బాక్సింగ్‌ను విడిచిపెట్టడం చాలా బాధగా ఉంది అని పకియావో తెలిపాడు. తన రాజకీయ భవిష్యత్తు పై దృష్టి సారించేందుకుఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు పేర్కొన్నాడు. 2022లో ఫిలిప్పీన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు గతంలో మ్యానీ పకియావో ప్రకటించాడు. కాగా అతడు ఫిలిప్పీన్‌లో సెనేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతడు చివరిగా క్యూబాకు చెందిన యోర్డెనిస్ ఉగాస్ ప్రొఫెషనల్ ఫైట్‌లో తలపడ్డాడు. ఈ ఫైట్‌లో పకియావో ఓటమి చెందాడు. కాగా తన 26 ఏళ్ల బాక్సింగ్ కెరియర్లో 8 డివిజన్ ప్రపంచ స్ధాయి చాంఫియన్‌గా పకియావో నిలిచాడు. చదవండి: Team India Head Coach: కుంబ్లే వద్దన్నాడు.. టీమిండియాకు కొత్త విదేశీ కోచ్! -
స్ట్రాంగ్ వార్నింగ్.. టీకా వేసుకుంటారా లేక జైలుకు వెళ్తారా?
మనీలా: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే మరోసారి దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారిని జైలులో పెడతామని వార్నింగ్ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటారా? లేక జైలుకు వెళ్తారా? అని బెదిరించారు. కాగా, ఫిలిప్పీన్స్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. దేశంలో ఇప్పటివరకు 13 లక్షల పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 23 వేల మందికి పైగా మరణించారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ కొంతమంది వ్యాక్సిన్ పట్ల విముఖత చూపిస్తున్నారు. దాంతో టీకా వేసుకోవడానికి నిరాకరించిన ప్రజలపై రోడ్రిగో డ్యూటెర్టే విరుచుకుపడ్డారు. టీకా వద్దంటే ఖబర్దార్.. జైలులో ఊచలు లెక్కించాల్సిందే అని వ్యాఖ్యానించారు. ‘దేశంలో కరోనా సంక్షోభం ఉంది కనుక ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది, నన్ను తప్పుగా భావించవద్దు’ అని డ్యూటెర్టే వివరణ ఇచ్చుకున్నారు. జూన్ 20 నాటికి, ఫిలిప్పీన్స్ అధికారులు 2.1 మిలియన్ల మందికి పూర్తిగా టీకాలు వేశారని ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు. చదవండి: సిజేరియన్ డాక్టర్ల నిర్వాకం.. పసికందు ముఖంపై 13 కుట్లు -
ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం
సాక్షి, కదిరి: ఫిలిప్పీన్స్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఇరువురు విద్యార్థులు దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.. కదిరి పట్టణంలోని మెయిన్ రోడ్లో ఉంటున్న ఎల్ఎల్వీ క్లాత్ సెంటర్ నిర్వాహకుడు కటికెల మల్లికార్జున రెండో కుమారుడు రేవంత్‌కుమార్(21), అనంతపురానికి చెందిన దండోరా నాయకుడు కేపీ నారాయణ స్వామి కుమారుడు వంశీకృష్ణ(18) ఫిలిప్పీన్స్‌లోని సెబూ నగరంలో ఉన్న ఎంహెచ్‌ఏఎం కళాశాలలో ఒకరు ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం కాగా, మరొకరు మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరిరువురూ అక్కడ ఒకే రూంలో అద్దెకు ఉంటూ చదువుకుంటున్నారు. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా తెల్లవారుజామునే ద్విచక్ర వాహనంతో నిత్యావసరాల కోసం బయలు దేరారు. ఎదురుగా వస్తున్న వాహనాల లైటింగ్‌కు రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ నిలిపివేయగా.. వారి మృతదేహాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డితో పాటు కలెక్టర్ గంధం చంద్రుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. -
మంచి టర్న్
కొన్ని సినిమా కథలు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో ఊహించలేం. ‘యు–టర్న్’ సినిమా కథ అలాంటిదే. ఈ కథలో వచ్చిన మలుపులను ప్రేక్షకులు ముందే ఊహించలేకపోయారు. అంత పకడ్బందీగా ఆ కథ రాసుకున్నారు చిత్రదర్శకుడు పవన్ కుమార్. అందుకే కన్నడంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అయి, రెండు భాషల్లోనూ హిట్ అయింది. ఇప్పుడు ‘యు–టర్న్’ మరో మంచి టర్న్ తీసుకోబోతోంది. ఈ చిత్రం ఫిలిపైన్ భాషలో రీమేక్ కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు పవన్ కుమార్ మాట్లాడుతూ – ‘‘మా ‘యు–టర్న్’ ఫిలిపైన్లో రీమేక్ కానుంది. కిమ్ చియు, జెఎమ్‌డి గుజ్‌మ్యాన్, టోనీ లబ్రుస్కా ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారు. ఫిలిపైన్ దర్శకుడు డెరిక్ కాబ్రిడో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. మనం తీసిన సినిమా ఇతర భాషల్లో రీమేక్ అవుతోందంటే చాలా ఆనందంగా ఉంటుంది. పైగా దర్శకుడిగా కన్నా ఈ కథ రాసినందుకు రచయితగా ఎక్కువగా ఆనందపడుతున్నా. ఎందుకంటే ఈ కథ రాస్తున్నప్పుడు లోకల్ స్టోరీ అనుకుని రాశాను. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రీచ్ ఉంటుందనుకోలేదు. గత నెల సింహళ భాషలో ఈ చిత్రం రీమేక్ అయింది. ఇంకా థాయ్, చైనీస్ భాషల్లోనూ రీమేక్ కానుంది. విశేషం ఏంటంటే.. ఈ సినిమాని రీమేక్ చేస్తారా? అని మా అంతట మేం ఎవరినీ అడగలేదు. సినిమా చూసి రీమేక్ చేయడానికి వాళ్లంతట వాళ్లే ముందుకొచ్చారు’’ అన్నారు. ‘‘భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. మేం రీమేక్ చేయబోతున్న ‘యు–టర్న్’ మా ఫిలిపైన్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు చిత్రనిర్మాతలు. -
విమానంలో ప్రసవం..
హైదరాబాద్: రియాద్ నుంచి మనీలా వెళ్తున్న ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఫిలిప్పీన్స్ మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. నొప్పులు తీవ్రమవడంతో.. మహిళ పరిస్థితిని గమనించిన పైలట్ ఆ సమయంలో సమీపంలో ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఏటీసీని సంప్రదించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు అపోలో ఆస్పత్రి వైద్య బృందానికి తెలిపారు. అప్రమత్తమైన వైద్యులు విమానం ల్యాండ్ అవ్వకముందే విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానం ల్యాండ్ అయిన మరుక్షణ మే ఆమె కూర్చున్న సీటు వద్దనే మహిళకు సాధారణ కాన్పు చేశారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. భద్రతా కారణాలతో విమానంలోకి సర్జికల్ బ్లేడ్లకు అనుమతి లేకపోవడంతో బొడ్డు తాడును వేరుచేయలేకపోయారు. దీంతో మెరుగైన వైద్యం కోసం తల్లి, బిడ్డలను జూబ్లీహిల్స్‌లోని అపోలో క్రెడిల్ ఆస్పత్రికి తరలించారు. చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ పి.సురేష్‌కుమార్ నేతృత్వంలోని వైద్యుల బృందం తల్లి, బిడ్డలకు చికిత్స అందించింది. ఈ ఘటన ఈ నెల 8న చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు అపోలో వైద్యులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారు. -
అతనో పిచ్చివాడు.. పట్టించుకోవద్దు
దావా : ఆడ, మగ తేడా లేకుండా అందరికి సమ న్యాయం కల్పించాల్సిన నాయకులే ఆడవారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. తప్పు చేసిన వారిని శిక్షించలేని సమాజం తన మాటలు, చేతలతో బాధితులనే మరింత ఇబ్బంది పెడుతోంది. అత్యాచారాలను నిరోధించలేని నాయకులు చిత్రంగా ఆడవారిదే తప్పంటూ మహిళల మీదే రాళ్లు వేస్తుంటారు. ఇలా నోటికి అడ్డు, అదుపు లేకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారిలో ముందుంటారు ఫిలీప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్. తాజాగా ఈయన గారు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి వివాదాస్పద ‘జోక్’ చేసి విమర్శల పాలవుతున్నారు. దావోలో ఓ కార్యక్రమానికి హాజరైన డ్యూటర్ట్ ‘అందమైన మహిళలు ఉన్నంత కాలం అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయంటూ’ పనికిమాలిన జోక్ చేశారు. అంతటితో ఆగకుండా మరికొన్ని నీతి మాలిన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ దేశ మహిళా సంఘాలతో పాటు పాశ్చత్య మీడియా కూడా డ్యూటర్ట్ మీద దుమ్మేత్తిపోస్తున్నాయి. డ్యూటర్ట్ గురించి తెలిసిన ఫిలీప్పీన్స్ మహిళలు ‘దేవున్నే ఇడియట్ అన్న వాడు మహిళల గురించి ఇంత కన్నా బాగా ఎలా మాట్లాడగలడు. డ్యూటర్ట్ ఓ పిచ్చివాడు.. అతని మాటాలను పరిగణలోకి తీసుకుంటే మన స్థాయి పడిపోతుంది’ అంటున్నారు. -
ఫిలీప్పీన్స్‌లో పెళ్లికూతురు సాహసం
-
దేవుడున్నాడని నిరూపిస్తే రాజీనామా
మనీలా : దేవుడున్నాడని ఎవరైనా నిరూపిస్తే దేశ అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తానని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్ సవాలు విసిరారు. స్టూపిడ్ గాడ్ అంటూ రొడ్రిగో ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేవుడిపై తన వ్యాఖ్యాలతో రోమన్ క్యాథలిక్ దేశమైన ఫిలిప్పీన్స్‌లో వివాదంగా మారుతున్నారు. దక్షిణ దవవొ నగరంలో సైన్స్, టెక్నాలజీ అంశంపై శనివారం రొడ్రిగో మాట్లాడుతూ... ‘అసలు ఈ సృష్టిలో దేవుడు అనేవాడు లేడు. ఎవరైనా దేవుడు వున్నాడని నిరూపిస్తే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా. దేవుడు అనే పదానికి అర్థం ఏంటి. దేవుడి బొమ్మగాని, అతను మాట్లాడుతాడనిగాని ఎవరైనా నిరూపించగలరా? దేవుడు ఉన్నాడనే భావన చాలా మూర్ఖమైనది. ఇదేం మతమో’ అని వ్యాఖ్యానించారు. గతవారం రొడ్రిగో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అసలు ఆ స్టూపిడ్ గాడ్ ఎవరని, క్యాథలిక్ బిషప్‌లను మానసిక రోగులని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డ్యూటర్ట్ క్రైస్తవ మత విశ్వాసాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ప్రతిపక్ష నేత ఆంటోనియా ట్రిలియన్స్ రొడ్రిగోను ఒక దుష్టుడిగా అభివర్ణించారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా క్రూరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల విమర్శలను రొడ్రిగో అధికార ప్రతినిధి హ్యారి రోక్ తీవ్రంగా ఖండించారు. దేవుడిపైనా, మతాలపైన తన అభిప్రాయాన్ని రోడ్రిగో వ్యక్తపరిచారని, ఆ హక్కు ఆయనకు ఉందని తెలిపారు. -
ఔను ప్రజల్ని చంపుతున్నా.. జైల్లో పెట్టే దమ్ముందా!
ఫిలిప్పీన్స్ నిరంకుశ అధ్యక్షుడు రోడ్రిగో ద్యుతర్తె ఐరాస మానవహక్కుల సంఘం చీఫ్‌పై తిట్లవర్షం కురిపించారు. ‘వేశ్య కొడుకా.. నన్నే సైక్రియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లమంటావా?’ అంటూ విరుచుకుపడ్డారు. దేశంలో డ్రగ్స్ మాఫియా లేకుండా చేస్తానంటూ అత్యంత క్రూరంగా ద్యుతర్తె సాగిస్తున్న అణచివేతపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ద్యుతర్తె సైక్రియాట్రిస్ట్ దగ్గరకు వెళ్లి.. మానసిక పరిస్థితిని బాగుపర్చుకోవాలని ఐరాస మానవహక్కుల సంఘం హైకమిషనర్ జీద్ రాడ్ అన్ హుస్సేన్ సూచించారు. ఐరాస ప్రతినిధులపై దుర్భాషలు ఆడితే.. తగిన బదులిస్తామని ఘాటుగా పేర్కొన్నారు. జోర్డానియన్ రాజకుమారుడైన జీద్ వ్యాఖ్యలపై ద్యుతర్తె చిందులు తొక్కారు. ‘మీరు బాగున్నారు మేయర్.. మీకు తిట్టడం అంటే కొంచెం ఇష్టం’ అని సైక్రియాట్రిస్ట్ నాకు చెప్పాడు. జీద్ వ్యాఖ్యలపై స్పందించవద్దని కొంతమంది నాకు చెప్పారు. కానీ ప్రతీకారం తీర్చుకునేందుకు మాట్లాడుతున్నా’ అని ఆయన చెప్పుకొచ్చారు. జీద్ తలకాయలో మెదడు లేదని, అది ఉత్త బుర్ర అని తిట్టిపోశారు. ‘అవును, నేను పరుషంగా ఉంటాను. చాలా పరుషంగా ఉంటాను. ఇందులో నేనే చేసేదేమీ లేదు. నేను ప్రజల్ని చంపుతున్నానా? అవును నేను డ్రగ్స్ అమ్ముతున్న వారిని చంపేస్తున్నాను. దీనిని ఆపాలని నేను ఇంతకుముందే చెప్పాను’ అని ద్యుతర్తే మంగళవారం తెలిపారు. ‘నన్ను జైల్లో వేయగలమని మీరు అనుకుంటే.. మీరు కల కంటున్నట్టే’ అని మానవ హక్కుల సంఘాలను ఉద్దేశించి ద్యుతర్తే పేర్కొన్నారు. దేశంలో పెరిగిపోయిన డ్రగ్స్ సంస్కృతిని ఆరునెలల్లో రూపుమాపుతానని 2016లో అధికారంలోకి వచ్చిన ద్యుతర్తే ప్రభుత్వం.. డ్రగ్స్ అణచివేతలో భాగంగా వందలమంది డీలర్లను, వేలమంది వినియోగదారులను హతమార్చింది. డ్రగ్స్ సేవిస్తున్నట్టు భావిస్తున్న 4,100 మందిని చంపేసినట్టు ఫిలిప్పీన్స్ పోలీసులు చెప్తుండగా.. అనధికారికంగా ఆ సంఖ్య మూడు రెట్లు అధికమని హక్కుల సంఘాలు చెప్తున్నాయి. ద్యుతర్తే ప్రభుత్వం చట్టవిరుద్ధంగా పౌరులను హతమారుస్తోందని, ఈ దుర్మార్గంపై దర్యాప్తు జరపాల్సిన అవసరముందని జీద్ గత నెలలో మండిపడ్డారు. ఐరాస ప్రతినిధిపై ద్యుతర్తె దుర్భాషలాడటాన్ని ఖండించారు. -
లంచగొండి అధికారుల్ని హెలికాప్టర్ నుంచి తోసేస్తా!
మాదక ద్రవ్యాలపై నిరంకుశంగా ఉక్కుపాదం మోపి.. వేలాదిమందిని చనిపోవడానికి కారణమైన ఫిలిపీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్తే మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే.. వారిని హెలికాప్టర్ నుంచి తోసేస్తానని ఆయన హెచ్చరించారు. గతంలో తాను ఓ కిడ్నాపర్ ను ఇలాగే హెలికాప్టర్ నుంచి పారేశారనని, ఇప్పుడు అధికారుల్ని తోసేయడానికి ఏమాత్రం వెనుకాడబోనని బెదిరించారు. 'హెలికాప్టర్లో మనీలాకు మిమ్మల్ని తీసుకెళ్తూ.. దారిలో మిమ్మల్ని తోసిపారేస్తా' అని డ్యుటర్తే అన్నారు. క్యామరిన్స్ సర్ ప్రావిన్స్‌లో జనాలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన 'నేను గతంలో కూడా చేశాను. ఇప్పుడెందుకు చేయకూడదు' అంటూ అధికారుల్ని బెదిరించారు. మాజీ మేయర్, ప్రాసిక్యూటర్ అయిన డ్యుటర్తే దేశం ఎదుర్కొంటున్న డ్రగ్స్ మహమ్మారిని సమూలంగా నిర్మూలిస్తానని ప్రకటించి అధికారంలోకి వచ్చారు. అన్నట్టుగానే ఆయన అత్యంత హింసాత్మకంగా, డ్రగ్స్ బాధితులు కనిపిస్తే కాల్చిపారేసే తరహాలో ఆదేశాలు ఇచ్చి.. వేలాదిమందిని పొట్టనబెట్టుకున్నారు. -
'నేనిక శపించను'
ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె గురువారం తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకెక్కారు. జపాన్ నుంచి తిరిగి స్వదేశానికి వస్తూ దవావో నగరంలో మాట్లాడారు. విమానంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో తాను మాత్రం ఆకాశం వైపు చూశానని చెప్పారు. ఆ సమయంలో తానొక గొంతును విన్నానని.. భవిష్యత్తులో నిరర్ధక వ్యాఖ్యలు మానుకోపోతే విమానాన్ని ఇప్పుడే కూల్చేస్తాననే మాటలు ఆకాశవాణి రూపంలో తనకు వినిపించినట్లు చెప్పారు. మీరెవరు? అని ప్రశ్నించగా దేవుడనే సమాధానం వచ్చిందని తెలిపారు. ఇక నుంచి తాను ఎవరినీ దూషిస్తూ మాట్లాడనని, శపించనని దేవుడికి ప్రమాణం చేస్తున్నానని చెప్పారు. దేవుడికి ప్రమాణం చేస్తే ఫిలిప్పీన్ ప్రజలందరికీ ప్రమాణం చేసినట్లేనని అన్నారు. డ్యుటెర్టె సంభాషణ గురించి చెప్పడం ముగియగానే ఆ ప్రదేశం అంతా చప్పట్లతో హోరెత్తింది. దీనిపై స్పందిచిన డ్యుటెర్టె ఎక్కువగా చప్పట్లు కొట్టొద్దని దీన్ని కూడా రాద్దాంతం చేస్తారని అన్నారు. కాగా, ఈ ఏడాది జూన్ చివరిలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి దేశంలో డ్రగ్స్ మాఫియాపై డ్యుటెర్టె ఉక్కుపాదం మోపారు. ఆయన చర్యలకు వేల సంఖ్యలో డ్రగ్ డీలర్లు మరణించారు. పోప్ ఫ్రాన్సిస్ ను వెలియాలి తనయుడు అంటూ డ్యుటెర్టె చేసిన వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆయనపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. -
బండచాకిరి.. బ్రెడ్డు ముక్క.. పీనుగలా మార్చారు
సింగపూర్: బండచాకిరి చేయించుకుంటూ ఏమాత్రం జాలిదయ లేకుండా వ్యవహరించి దాదాపు 15 నెలలుగా తనను చిత్ర హింసలకు గుర్తు చేశారని సింగపూర్ దంపతులపై ఓ పిలిప్పీన్స్ శరణార్థి ఫిర్యాదు చేసింది. థెల్మా గవిడాన్(40) అనే పిలిప్పీన్స్ కు చెందిన మహిళ 2014 ఏప్రిల్ నెలలో శరణార్థిగా వచ్చి ఓ సింగపూర్ కు చెందిన దంపతుల ఇంట్లో చిక్కుకుపోయింది. అప్పటి నుంచి ఆమెను ఇంట్లోనే ఉంచి అన్ని పనులు చేయించుకుంటూ రోజుకు కొన్ని నూడుల్స్, ఒక బ్రెడ్డు ముక్క మాత్రం పడేస్తూ ఆమె ఆకలి ఆర్తనాదాలను నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా ఆమె దాదాపు 29 కేజీల బరువు తగ్గిపోయి పీనుగలా తయారైంది. అతి తక్కువ వేతనం మాత్రమే ఇవ్వడం కాకుండా ఆమెను ప్రతిక్షణం గమనించేవారని, ఎవరితో మాట్లాడనిచ్చేవారు కాదని తెలిపింది. 'నేను నిద్ర లేచినప్పటి నుంచి ఏమి తింటున్నాను, ఏమి తాగుతున్నాను, ఆఖరికి స్నానం చేసేముందు కూడా వదిలిపెట్టకుండా ఓ నిఘా మాదిరిగా నన్ను గమనించేవారు అంటూ గవిడాన్ వాపోయింది. ఎంతోకాలంగా రహస్యంగా ఉంచిన ఆమె విషయం మీడియా ద్వారా బయటకు రావడంతో కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది. -
మనీలాలో ఘోర అగ్ని ప్రమాదం
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని దక్షిణ మనీలా కు సమీపంలోని మార్కెట్ లో శనివారం ఘోర అగ్రి ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పసివాళ్లు సహా 15 మంది సజీవ దహనమయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాద కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పోర్ట్ సిటీ జోబాంగో సమీపంలోని మార్కెట్ నుంచి ఎక్కువగా బట్టలు, కూరగాయలు ఎగుమతి అవుతాయి. ఈ క్రమంలోనే తమ సరుకులకు కాపలాగా వ్యాపారస్తులు కుటుంబాలతో షాపుల దగ్గరే నిద్రపోవడం మామూలు. తమ వస్తువులను ఎగుమతిచేసే నిమిత్తం మార్కెట్ భవనంలో నిద్రపోతుండగా ఈ ప్రమాదం సంభవించింది. హఠాత్తుగా మంటలు చుట్టుముట్టడంతో స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడడంతో తప్పించుకోవడం కష్టంగా మారిందని ఓ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా ఫిలిప్సీన్స్ దేశంలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు తరచూ సంభవిస్తాయని తెలుస్తోంది. గతంలో చెప్పుల పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి.