Smile Or Get Fined: ఫిలిప్పీన్స్ మేయర్ స్థానిక ప్రభుత్వం అందించే సేవల స్థాయిని మెరుగుపరిచే నిమిత్తం ఒక సరికొత్త పాలసీని తీసుకు వచ్చాడు. ఫిలిప్పీన్స్ ప్రధాన ద్వీపం లుజోన్‌లో క్యూజోన్ ప్రావిన్స్‌లోని ములానే పట్టణంలో అరిస్టాటిల్ అగ్యురే కొత్త మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అధికారం చేపట్టిన వెంటనే స్మైల్ పాలసీ అనే కొత్త పాలసీని ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేస్తూనే ప్రశాంతంగా, స్నేహపూర్వక వాతావరణంలో వారి సమస్యలను విని సాయం అందించేలా చిత్తశుద్ధితో పనిచేసేందుకు ఈ స్మైల్ పాలసీ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
స్థానికులు, ఎక్కువగా కొబ్బరి వ్యాపారులు, మత్స్యకారులు తమ పన్నులు చెల్లించడానికి లేదా సహాయం కోరడానికి వెళ్ళినప్పుడు టౌన్ హాల్ సిబ్బంది తమతో అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ ...ఫిర్యాదులు రావడంతోనే ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అగ్యురే తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల వైఖరి మార్చేందుకే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు తెలిపారు.
ఈ పాలసీని పాటించని ఉద్యోగులకు ఆరు నెలల జీతానికి సరిపడా మొత్తం జరిమానగా విధించబడటం లేదా విధుల నుంచి తొలగించడం వంటివి జరుగుతాయని స్పష్టం చేశారు. అగ్యురే ఎన్నికలలో పోటీ చేయడానికి ముందు ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌గా పనిచేశారు. ఈ మేరకు అగ్యురే మాట్లాడుతూ... వ్యాపార అనుకూలమైన మున్సిపాలిటీగా ఉండేందుకే ఈ పాలసీని తీసుకువచ్చాం. తమ ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలు పాటిస్తారనే విశ్వసిస్తున్నానని చెప్పారు.
(చదవండి: అగ్నిపర్వతం వద్ద సెల్ఫీ తీసుకోబోయి... అందులోనే పడిపోయాడు ఆ తర్వాత...)
Comments
Please login to add a commentAdd a comment