smile
-
SmilePay: నగదు చెల్లింపునకు ఓ ‘నవ్వు’ చాలు!
ప్రైవేట్ రంగ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ సరికొత్త డిజిటల్ చెల్లింపు వ్యవస్థను తీసుకొచ్చింది. ‘స్మైల్ పే’ అనే ఫేషియల్ పేమెంట్ సిస్టమ్‌ను ప్రారంభించింది. దీంతో కస్టమర్లు కేవలం కెమెరాను చూసి నవ్వుతూ చెల్లింపులు జరపవచ్చు. ఈ సేవతో డబ్బు లావాదేవీల కోసం మీకు నగదు, కార్డ్ లేదా మొబైల్ అవసరం ఉండదు. రిలయన్స్ రిటైల్, అనన్య బిర్లాకు చెందిన ఇండిపెండెంట్ మైక్రో ఫైనాన్స్ ద్వారా కొన్ని ఎంపిక చేసిన శాఖలలో దీని వినియోగం ఇప్పటికే ప్రారంభమైంది.పైలట్ ప్రాజెక్టుప్రస్తుతం ఈ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ చెల్లింపు వ్యవస్థ 'భీమ్ ఆధార్ పే'పై ఆధారపడి ఉంటుంది. దీనిపై నిర్మించిన అప్‌గ్రేడెడ్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఇది ఉపయోగించుకుంటుంది. యూజర్లు తమ ఫేస్‌ను స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది. దీంతో కార్డు లేదా మొబైల్ లేకుండా కూడా వ్యాపారులకు చెల్లింపులు చేయగలరు. మొత్తం లావాదేవీ ప్రక్రియ రెండు దశల్లో పూర్తవుతుంది.స్మైల్‌పే ఫీచర్లుస్మైల్పే ద్వారా నగదు, కార్డ్ లేదా ఫోన్‌ని తీసుకెళ్లకుండానే మీ లావాదేవీని పూర్తి చేయవచ్చు. దీనితో పాటు, ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టడం వల్ల కౌంటర్ వద్ద రద్దీ నుండి ఉపశమనం లభిస్తుంది. సురక్షితమైన ఆధార్ ఫేస్ రికగ్నిషన్ సర్వీస్ ఆధారంగా చేసే లావాదేవీలతో భద్రత చింత ఉండదు. స్మైల్‌పే ఫీచర్ ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. దీని కోసం వ్యాపారులు, వినియోగదారులు ఇద్దరూ ఆ బ్యాంకులో ఖాతాలను కలిగి ఉండాలి. రాబోయే రోజుల్లో ఈ వ్యవస్థను మరింత విస్తరించాలని ఫెడరల్ బ్యాంక్ యోచిస్తోంది.ఎలా పనిచేస్తుందంటే..స్మైల్పేను వినియోగించాంటే మొబైల్లో ఫెడ్ మర్చెంట్ (FED MERCHANT) అనే యాప్ ఉండాలి.ఫెడరల్ బ్యాంక్‌తో అనుసంధానమైన దుకాణాల్లో షాపింగ్ చేసి బిల్లు చెల్లింపు సమయంలో స్మైల్ పే ఎంచుకోవాలి. తర్వాత దుకాణదారు.. కస్టమర్ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి యాప్ ద్వారా చెల్లింపును ప్రారంభిస్తారు. దుకాణదారు మొబైల్ కెమెరా కస్టమర్ ఫేస్‌ను స్కాన్ చేస్తుంది. ఆధార్ సిస్టమ్ ఆధారంగా ఫేస్ రికగ్నిషన్ డేటాతో సరిపోల్చుకుని చెల్లింపు పూర్తవుతుంది. కస్టమర్ ఖాతా నుండి డబ్బు దుకాణదారుడి ఖాతాలో జమవుతుంది. -
నేడు వరల్డ్ హాపీనెస్ డే...లక్ష్యం ఉన్నచోట ఉత్సాహం... ఉత్సాహం ఉన్నచోట సంతోషం ఉంటాయి
సంతోషం సగం బలం అన్నారుగానీ నిజానికి అది సంపూర్ణ బలం. ఆ బలం ఉన్నచోటే ఆరోగ్యం ఉంటుంది. విజయం ఉంటుంది.డబ్బుతో కొనలేని ‘సంతోషం’ ఎవరూ చేరుకోలేని కీకారణ్యం కాదు. ‘నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను’ అని మనసులో గట్టిగా అనుకొని ఒక అడుగు వేస్తే ఎన్నో దారులు కనిపిస్తాయి. సంతోష సామ్రాజ్యానికి దగ్గర చేస్తాయి.‘సక్సెస్‌తో సంతోషం రాదు. సంతోషంతో సక్సెస్ వస్తుంది’ అనే పాతతరం మాటకు కొత్త తరం విలువ ఇస్తోందిప్పుడు. నిరంతరం సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. సంతోషంగా ఉండడానికి సంబంధించిన టెక్నిక్స్ గురించి ఆసక్తిగా తెలుసుకుంటోంది... భోపాల్‌కు చెందిన అనీష ప్రతి రెండు రోజులకు ఒక సంస్కృత శ్లోకాన్ని కంఠస్థం చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకొని ఈ ఏడాది జనవరి మొదటి తేదీ నుంచి ప్రారంభించింది. ఫిబ్రవరి నెల పూర్తయ్యే సరికి తాను అలవోకగా చెప్పగలిగే శ్లోకాల గురించి లెక్క వేసుకుంటే చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆ సంతోషం ఇంకా కొనసాగుతూనే ఉంది.తమిళనాడులోని వెల్లూరుకు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ ఐశ్వర్య మోహన్‌కు డ్రైవింగ్ అంటే చెప్పలేనంత భయం. ఆ భయాన్ని వదిలి ఈమధ్యే స్కూటీ నడపడం నేర్చుకుంది. తనకు ఇప్పుడు విమానం నడుపుతున్నంత సంతోషంగా ఉంది. ముంబైకి చెందిన సజన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్యాడ్జెట్స్ కొనడంలో అతడికి అంతులేనంత సంతోషం దొరుకుతుంది. ఇవి మాత్రమే కాదు...మనం చేసే పనికి ఇతరుల నుంచి లభించే ప్రశంస, అభిమాన హీరో సినిమాకు వెళ్లడం, ‘చాలా హ్యాండ్సమ్’గా ఉన్నావు’లాంటి కామెంట్... ఇలాంటివి అప్పటికప్పుడు లభించే తాత్కాలిక సంతోషాలే అయినా తక్కువ చేసి చూసేవి మాత్రం కాదు. చిన్న చిన్న చినుకులు కలిస్తేనే కదా వర్షం.చిరు సంతోషాల కలయికే కదా ఆనందమయ జీవితం! ‘హాబీల నుంచి వచ్చే హ్యాపీనెస్ అంతా ఇంతా కాదయా’ అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.జెన్ జెడ్‌కు సుపరిచితమైన పేరు... విష్ణు కౌశల్. ఇన్‌స్టాగ్రామ్‌లో కామిక్ కంటెంట్ జెనరేట్ చేయడం అతడి హాబీ. ఈ హాబీ కాస్త అతడిని డిజిటల్ స్టార్‌ను చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో విష్ణు కౌశల్‌కు 2.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ‘పెద్ద లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని నా ప్రయాణాన్ని ప్రారంభించలేదు. నేను కామిక్ కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి కారణం అది నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచుతుంది’ అంటాడు 25 సంవత్సరాల విష్ణు కౌశల్. ‘లేదు అనుకుంటే ఏమీ లేదు. ఉంది అనుకుంటే ఎంతో ఉంది’ అనే ధోరణిని అనుసరించే యువతరం సూర్యోదయం నుంచి వెండి వెన్నెల వెలుగు వరకు ప్రతి ప్రకృతి అద్భుతాన్ని ఎంజాయ్ చేస్తోంది.‘హ్యాపీనెస్ అనేది ఎమోషన్, ఫీలింగ్ కాదు. అదొక స్కిల్’ అంటున్న యువతరం రకరకాల టెక్నిక్‌లపై కూడా దృష్టి సారిస్తోంది. స్థూలంగా చె΄్పాలంటే ‘సంతోషం’ అనే పునాదిని సిద్ధం చేసుకొని ‘లక్ష్యాలు’ అనే భవనాలపై దృష్టి పెడుతోంది. ట్రై చేసి చూద్దాం వ్యాయామాలతో సంతోషాన్ని సొంతం చేసుకునేవారు కొందరైతే, సంతోషం కోసం ప్రత్యేక వ్యాయామాలు చేసేవారు కొందరు. ‘హ్యాపీనెస్’ను సొంతం చేసుకోవడం కోసం చిన్నపాటి ఎక్సర్సైజ్ల మీద దృష్టి పెట్టే ధోరణి యువతరంలో పెరగుతుంది. వాటిలో కొన్ని... ► టాప్ ఔట్ స్ట్రెస్ ►న్యూ బెహ్ జెన్ ►యాంకర్ హ్యాపీ అండ్ కామ్ ఫీలింగ్స్ ►బ్రీత్ టెక్నిక్ ∙యాంగర్ రిలీజ్ సీక్రెట్. నచ్చిన పనిలోనే సంతోషం చెన్నైలో పుట్టి బెంగళూరులో పెరిగిన నిహారిక ఎన్ఎం ఇంజినీరింగ్ చదివే రోజుల్లో హాబీగా యూట్యూబ్ వీడియోలు చేసింది. ఈ ప్రక్రియ తనను ఒత్తిడికి దూరంగా ఉంచడంతో పాటు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చేసింది. ‘నచ్చిన పని చేయడంలో అపారమైన ఆనందం సొంతం అవుతుంది’ అంటున్న నిహారిక ఎన్ఎం ‘డిజిటల్ కంటెంట్ క్రియేటర్’గా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. హ్యాపీనెస్ ఫార్ములా ‘హ్యాపీనెస్’ అనే మాట వినిపించగానే గుర్తుకు వచ్చే పేర్లలో ఒకటి సైకాలజిస్ట్ మార్టిన్ సెలిగ్మాన్. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన సెలిగ్మాన్ సంతోషం అంటే ఏమిటి? మనిషిని సంతోషంగా ఉంచే అంశాలు ఏమిటి? ఫెయిల్యూర్స్‌ను అధిగమించి విజయాలు సొంతం చేసుకున్న వ్యక్తుల గురించి లోతుగా అధ్యయనం చేశాడు. ‘అథెంటిక్ హ్యాపీనెస్’ పేరుతో పుస్తకం రాశాడు. ‘హ్యాపీనెస్’కు సంబంధించి హెచ్=ఎస్ +సి+వి అనే ఫార్ములాను రూపొందించాడు. హెచ్–హ్యాపీనెస్ ఎస్–సెట్ రేంజ్ : మన సంతోషంలో 50 శాతం పూర్తిగా మన నియంత్రణలో ఉండదు. జెనెటిక్ కెపాసిటీ ప్రభావం ఉంటుంది. సి–సర్కమస్టాన్సెస్: దీర్ఘకాలిక సంతోషాన్ని సొంతం చేసుకోవడానికి పరిస్థితులను సరిదిద్దుకుంటూ, స్ట్రాటిజిక్ వర్క్‌తో ప్రయాణించాలి. ఉదా: నెగెటివ్ ఈవెంట్స్, నెగిటివ్ ఎమోషన్స్‌కు దూరంగా ఉండడం. వి–వాలెంటరీ వేరియబుల్స్: హ్యాపీనెస్ ఫార్ములాలో బెస్ట్ అండ్ మోస్ట్ కంట్రోలబుల్ పార్ట్ ఇది. గత, వర్తమాన, భవిష్యత్తుకు సంబంధించిన పాజిటివ్ ఎమోషన్స్ ద్వారా సంతోషంగా ఉండడం.హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ్ర΄÷ఫెసర్, సోషల్ సైంటిస్ట్, రచయిత డా.అర్థర్ బూక్స్ర్ ‘హ్యాపీనెస్’కు సంబంధించి హెచ్=ఇ+ఎస్+ఎం అనే ఈక్వేషన్‌ను ప్రచారంలోకి తీసుకువచ్చాడు.హాపీనెస్ (హెచ్) = ఎంజాయ్మెంట్ (ఇ)+శాటిస్ఫాక్షన్ (ఎస్)+మీనింగ్ (ఎం) హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఆర్థర్ రూపొందించిన ‘మేనేజింగ్ హ్యాపీనెస్’ అనే కోర్సు అందుబాటులో ఉంది. -
కొందరూ నెలల పిల్లలు నవ్వితే వాంతులవుతుంటాయి ఎందుకు?
ఆరు నెలల లోపు చిన్నపిల్లలు కొందరిలో... వాళ్లు బాగా నవ్వుతున్నా, వేగంగా కాళ్లూచేతులు కదిలిస్తున్నా వెంటనే వాంతులు అవుతుంటాయి. అప్పటివరకూ వాళ్లు చురుగ్గా ఆడుతుండటం చూసిన తల్లిదండ్రులకు... అంతలోనే ఎదురైన ఆ సంఘటన ఎంతగానో ఆందోళన కలిగిస్తుంది. నిజానికి అది ఏమాత్రం అపాయకరం కాని ఒక కండిషన్. దాన్ని ‘గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్’ అంటారు. ఈ కండిషన్ కారణంగానే ఈ నెలల పిల్లలకు ఈ తరహాలో వాంతులవుతుంటాయి. చిన్నారుల పొట్ట కింది భాగంలో లోయర్ ఈసోఫేగస్ స్ఫింక్టర్ అనే కండరాలు పొట్టలోపలికి వెళ్లిన ఆహారాన్ని మళ్లీ పైకి రాకుండా నొక్కిపెడతాయి. కొందరిలో ఈ స్ఫింక్టర్ కండరాలు ఉండవలసిన దాని కంటే వదులుగా (రిలాక్స్డ్గా) ఉండే అవకాశం ఉంది. అప్పుడు పాలు, ద్రవాలు (యాసిడ్ కంటెంట్స్) కడుపు లోంచి ఈసోఫేగస్ వైపునకు నెట్టినట్లుగా బయటకు వస్తాయి. అలా వెనక్కురావడాన్ని ‘రిఫ్లక్స్’ అంటారు. చిన్నతనంలో చాలా మంది పిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్య... వారికి మూడు నుంచి తొమ్మిది నెలలు వచ్చే నాటికి స్ఫింక్టర్ కండరం బలపడటంతో దానంతట అదే తగ్గిపోతుంది. వాంతులు అనే లక్షణం అనేక ఇతర ఆరోగ్య సమస్యల్లోనూ కనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కొద్దిమంది పిల్లల్లో వాంతులతో పాటు ఒకవేళ పసరుతో కూడుకున్న వాంతులు (బిలియస్ వామిటింగ్), వాంతుల్లో రక్తపు చారిక కనిపించడం, వాంతులతో పాటు విరేచనాలు కనిపిస్తుంటే మాత్రం మరికొన్ని ఇతర కారణాల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో వాంతులు అదేపనిగా అవుతున్నప్పుడు యాంట్రల్ వెబ్, ఇంటస్టినల్ మొబిలిటీ డిజార్డర్స్ (పేగు కదలికల్లో సమస్యలు), హెచ్. పైలోరీ ఇన్ఫెక్షన్, పెప్టిక్ అల్సర్, ఆహారం సరిపడకపోవడం (ఫుడ్ అలర్జీస్), హయటస్ హెర్నియా వంటి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమోనని తప్పక అన్వేషించాలి. ఆర్నెల్లు దాటిన వారు మొదలుకొని, రెండేళ్ల వరకు పిల్లల్లో వాంతులవుతూ, పై లక్షణాలు కనిపిస్తుంటే అప్పుడు వారిలో ఇంకేమైనా ఆరోగ్య సమస్యలున్నాయేమోనని అదనపు పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. నిర్ధారణ పరీక్షలు... గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ సమస్యను బేరియం ఎక్స్–రే పరీక్ష, మిల్క్ స్కాన్, 24 గంటల పీహెచ్ మానిటరింగ్, ఎండోస్కోపీ వంటి పరీక్షలతో నిర్ధారణ చేస్తారు. చికిత్స... చాలామంది పిల్లల్లో ఇది దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ వాంతులు కావడం మరీ ఎక్కువగా ఉంటే అలాంటి పిల్లలకు ద్రవపదార్థాలు తక్కువగా ఇవ్వడం, ప్రోకైనెటిక్ డ్రగ్స్ (ఉదాహరణకు సిసాప్రైడ్, మెటాక్లోప్రమైడ్ వంటి మందులు), ఎసిడిటీ తగ్గించే మందులు వాడటం చాలావరకు ఉపశమనాన్నిస్తుంది. అలాగే ఈ సమస్య ఉన్న పిల్లలను పాలుపట్టిన వెంటనే పడుకోబెట్టకపోవడం, తల కొద్దిగా ఎత్తున ఉంచి పడుకోబెట్టడం, తిన్న వెంటనే పొట్టపై ఒత్తిడి పెంచే (ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ కలిగించే) యాక్టివిటీస్ వంటి వాటికి దూరంగా ఉంచాలి. ఈ సమస్య ఉన్న పిల్లల్లో వ్యాధి తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే ఫండోప్లెకేషన్ అనే ఆపరేషన్ అవసరం పడవచ్చు. -
ఆస్కార్ గెలిచిందని స్థలమిచ్చారు.. ఇప్పుడేమో కూల్చేస్తామంటూ!
2009లో ఆస్కార్ అవార్డ్ పొందిన డాక్యుమెంటరీ చిత్రం స్మైల్ పింకీ. ఈ చిత్రంలో ఓ మారుమూల ప్రాంతానికి చెందిన పింకీ జీవితం ఆధారంగా మెగాన్ మైలాన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటించిన ఆరేళ్ల పాప పేరు పింకీ సోంకర్. ఆమె తన తండ్రితో కలిసి ఆస్కార్ అవార్డ్‌ను అందుకుంది. ఈ డాక్యుమెంటరీతో దేశ వ్యాప్తంగా పింకీ పేరు మారుమోగిపోయింది. అయితే పింకీ కుటుంబం చాలా పేదరికంలో ఉంది. పింకీ తండ్రి రాజేంద్ర సోంకర్ కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. వీరి కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మారుమూల పల్లెలో నివసిస్తోంది. అయితే గతంలో ఆస్కార్ అవార్డ్ వచ్చినందుకు పింకీ కుటుంబానికి అధికారులు కొంత భూమిని ఇచ్చారు. ప్రస్తుతం అదే స్థలంలో ఇంటిని నిర్మించుకొని జీవనం సాగిస్తోంది పింకీ ఫ్యామీలీ. అయితే తాజాగా ఈ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ అధికారులు ఇచ్చిన నోటీసులు చర్చనీయాంశంగా మారాయి. యూపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. తాజాగా పింకీ ఫ్యామిలీకి కూడా ఇంటిని కూల్చివేస్తున్నట్లు అధికారులు నోటీసులిచ్చారు. మీర్జాపూర్ జిల్లా ధాబీ గ్రామంలో చాలామందికి అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పింకీ తండ్రి రాజేంద్ర సోంకర్ మాట్లాడుతూ.. తాము ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోనే ఇంటిని నిర్మించామని చెబుతున్నారు. ఆస్కార్ విజేత ఇంటిని కూల్చివేస్తామనడం యూపీతో పాటు దేశంలోనూ హాట్‌టాపిక్‌గా మారింది. 2008లో స్మైల్ పింకీ డాక్యుమెంటరీలో నటించినప్పుడు ఆ పాప వయస్సు కేవలం ఆరు సంవత్సరాలు. ప్రస్తుతం 20 సంవత్సరాలు కాగా.. ఇప్పటికీ అదే గ్రామంలో నివసిస్తున్నారు. ఇప్పుడు 12వ తరగతి చదువుతోంది. మా కుటుంబ అవసరాలు తీర్చేందుకు నాన్న పండ్లు, కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారని గతంలో పింకీ వెల్లడించింది. -
Sai Pallavi: జీవితంలో అవి ఉంటే చాలు.. సాయి పల్లవి పోస్ట్ వైరల్
చిత్ర పరిశ్రమలో సాయి పల్లవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఆమెను అభిమానించేవాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే మన దర్శకనిర్మాతలు సినిమాల్లో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటారు. హీరో ఎవరనేది పట్టించుకోకుండా.. వైవిద్యమైన పాత్ర ఉంటే చాలు నటించడానికి సై అంటుంది ఈ లేడీ పవర్‌స్టార్. ఫిదా, లవ్‌స్టోరీ సినిమాలు ఆ కోవలోకి చెందిన చిత్రాలే. అయితే గత కొంతకాలం నుంచి మాత్రం సాయి పల్లకి బ్యాడ్ టైం నడుస్తోంది. ఇటీవల ఈ నేచురల్ బ్యూటీ నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన విరాటపర్వం, గార్గి లాంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. సాయి పల్లవి నటనకు ప్రేక్షకులు ఫిదా అయినప్పటికీ.. కమర్షియల్‌గా నిర్మాతలకు మాత్రం నిరాశే మిగులుతోంది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది ఈ నేచురల్ బ్యూటీ. అంతేకాదు మీడియాకు, సోషల్ మీడియాకు కూడా కాస్త దూరంగానే ఉంటుంది. దానికి కారణం ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ కావడమే. అయితే చాలా రోజుల తర్వాత ఇన్‌స్టాలో ఆమె ఫోటోని షేర్ చేసింది. జీవితంలో చిరునవ్వులు...ఆశ... కృతజ్ఞత ఉంటే చాలు అంటూ నవ్వులు చిందిస్తున్న ఫోటోని సాయి పల్లవి షేర్ చేసింది. View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) -
నవ్వుతూ సేవ చేయ్! లేదంటే జరిమాన: ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు
Smile Or Get Fined: ఫిలిప్పీన్స్ మేయర్ స్థానిక ప్రభుత్వం అందించే సేవల స్థాయిని మెరుగుపరిచే నిమిత్తం ఒక సరికొత్త పాలసీని తీసుకు వచ్చాడు. ఫిలిప్పీన్స్ ప్రధాన ద్వీపం లుజోన్‌లో క్యూజోన్ ప్రావిన్స్‌లోని ములానే పట్టణంలో అరిస్టాటిల్ అగ్యురే కొత్త మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అధికారం చేపట్టిన వెంటనే స్మైల్ పాలసీ అనే కొత్త పాలసీని ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేస్తూనే ప్రశాంతంగా, స్నేహపూర్వక వాతావరణంలో వారి సమస్యలను విని సాయం అందించేలా చిత్తశుద్ధితో పనిచేసేందుకు ఈ స్మైల్ పాలసీ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానికులు, ఎక్కువగా కొబ్బరి వ్యాపారులు, మత్స్యకారులు తమ పన్నులు చెల్లించడానికి లేదా సహాయం కోరడానికి వెళ్ళినప్పుడు టౌన్ హాల్ సిబ్బంది తమతో అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ ...ఫిర్యాదులు రావడంతోనే ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అగ్యురే తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల వైఖరి మార్చేందుకే ఈ పాలసీని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ పాలసీని పాటించని ఉద్యోగులకు ఆరు నెలల జీతానికి సరిపడా మొత్తం జరిమానగా విధించబడటం లేదా విధుల నుంచి తొలగించడం వంటివి జరుగుతాయని స్పష్టం చేశారు. అగ్యురే ఎన్నికలలో పోటీ చేయడానికి ముందు ఆక్యుపేషనల్ థెరపిస్ట్‌గా పనిచేశారు. ఈ మేరకు అగ్యురే మాట్లాడుతూ... వ్యాపార అనుకూలమైన మున్సిపాలిటీగా ఉండేందుకే ఈ పాలసీని తీసుకువచ్చాం. తమ ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలు పాటిస్తారనే విశ్వసిస్తున్నానని చెప్పారు. (చదవండి: అగ్నిపర్వతం వద్ద సెల్ఫీ తీసుకోబోయి... అందులోనే పడిపోయాడు ఆ తర్వాత...) -
పాపం పసిపాప.. నవ్వు ముఖంతోనే పుట్టింది!
పిల్లలు అన్నాక.. పుట్టిన సమయంలోనైనా ఏడ్వాలి కదా!. కానీ, ఇక్కడో పసికందు నవ్వుతూనే పుట్టింది. ఎందుకో తెలుసా? ఆ బిడ్డ ముఖంలో అలాంటి లోపం ఏర్పడింది. అదీ తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే ఈ స్థితి ఏర్పడింది ఆ పసిపాపకు!. బైలేటరల్ మాక్రోస్టోమియా.. అరుదైన పరిస్థితి ఇది. పుట్టుకతో వచ్చే క్రమరాహిత్యం. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఏడో వారంలో.. కణజాలాల వల్ల ఈ స్థితి ఏర్పడుతుంది. ప్రపంచంలో ఇప్పటికి ఇలాంటి పరిస్థితితో కేవలం 14 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని ఉందని గణాంకాలు చెప్తున్నాయి. అందులో 14వ కేసు.. ఎయిలా సమ్మర్ ముచా. ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్టియానా వెర్చెర్(21), బ్లేజియా ముచా(20) సంతానం ఈ ఎయిలా. డిసెంబర్ 2021లో జన్మించింది ఈ చిన్నారి. అయితే పుట్టినప్పుడు ఆ బిడ్డ ఏడ్వలేదు. పైగా పెదాల దగ్గర అసాధారణ స్థితి నెలకొనడంతో ఆ తల్లిదండ్రులు కంగారుపడిపోయారు. డాక్టర్లు పరిశీలించి.. అది బైలెటరల్ మాక్రోస్టోమియాగా నిర్ధారించారు. తద్వారా పెదాలు సాగిపోయినట్లు ఉంటుంది. అందుకే ఆ చిన్నారి పుట్టినప్పుడు ఏడ్వలేకుండా ఉంది. ఈ పరిస్థితి గురించి ఆరాతీయగా.. తల్లి గర్భంలోనే బిడ్డకు ఏడో వారంలో పిండ దశ నుంచే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని తేలింది. ప్రపంచంలో ఇలాంటి కేసులు ఇప్పటిదాకా 14 మాత్రమే ఉన్నాయని తేలింది. సర్జరీతో బిడ్డ స్థితి మెరుగుపడే అవకాశం ఉన్నా.. పెద్దయ్యాక మళ్లీ ఆ స్థితి ఏర్పడొచ్చనే వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ జంట సోషల్ మీడియా ద్వారా బిడ్డ స్థితిని.. ఇలాంటి పరిస్థితుల్లో తాము ఎలా ఎదుర్కొంటున్నామో తెలియజేసేందుకు పోస్టులు చేస్తోంది. అయితే బిడ్డ స్థితి తెలిసి కూడా కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఆ పసికందు తల్లి స్పందిస్తూ.. మనిషికి ఏడుపు ఒక శాపం.. నా బిడ్డకు నవ్వు ఒక వరం.. నవ్వే వాళ్లను నవ్వనివ్వండి అంటోంది. -
నవ్వితేనే ఆఫీసుల్లోకి ఎంట్రీ.. ఇదేం విడ్డూరం!
ఆఫీస్ పరిధిల్లో సీసీ కెమెరాలు, ఐరిష్ మెషిన్లు ఉద్యోగుల కదలికలను, హాజరును పరిశీలించేందుకు ఏర్పాటు చేస్తుంటాయి కంపెనీలు. అయితే చైనాలోని కొన్ని ఆఫీసుల్లో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఉద్యోగులు ఆఫీస్‌లోకి అడుగుపెట్టాలంటే కచ్చితంగా నవ్వాల్సిందే. ఈ మేరకు స్మైల్ రికగ్నిషన్ కెమెరా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఆఫీసుల్లోకి ప్రవేశించడం మాత్రమే కాదు.. పర్సనల్ పీసీలు ఆన్ చేయాలన్నా, లంచ్ యాక్సెస్, మీటింగ్‌లకు అటెండ్ కావాలన్నా ఎంప్లాయి నవ్వాల్సిందే. ఇందుకు సంబంధించి కెనన్ కంపెనీ, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాయంతో స్మైల్ రికగ్నిషన్ టెక్నాలజీ డెవలప్ చేసింది. పని చేసే టైంలో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? లేదా? అనేది ఈ టెక్నాలజీ మానిటరింగ్ చేస్తుందని కెనన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలిపింది. ప్రయోగాత్మకం మరో 30 దేశాల్లో(భారత్‌తో సహా) ఈ టెక్నాలజీకి ట్రయల్ రన్ నిర్వహించాలని భావిస్తున్నట్లు కెనన్ ఒక స్టేట్మెంట్లో పేర్కొంది. నిజానికి స్మైల్ రికగ్నిషన్ కెమెరాలను కిందటి ఏడాదే డెవలప్ చేసినప్పటికీ.. అది అంతగా గుర్తింపు దక్కించుకోలేదు. అయితే ఈ ఏడాది బీజింగ్‌లో కొన్ని టాప్ కంపెనీలు ఈ టెక్నాలజీని అనుమతించడంతో ప్రముఖంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ టెక్నాలజీపై విమర్శలు ఉన్నప్పటికీ.. ఇది ఉద్యోగుల మానస్థితిని అదుపు చేస్తుందని, వాళ్లను వందకి వంద శాతం సంతోషంగా ఉంచుతాయని కంపెనీలు వివరణలు ఇచ్చుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మాస్కులు పెట్టుకున్న ఉద్యోగుల సంగతేంటని కొందరు సెటైర్లు వేస్తుండడం కొసమెరుపు. చదవండి: ఆర్టిఫిషీయల్ మూడో కన్ను! -
'స్మైల్' లుక్..
-
భూమాత రోజు నాకు సర్ప్రైజ్ ఇస్తుంది..
ఉదయం నిద్ర లేచేటప్పుడే చిరునవ్వుతో లేస్తే ఆ రోజంతా సంతోషంగా ఉంటామని డాక్టర్లు చెబుతుంటారు. చాలా మంది అలాగే చేయాలి అనుకుంటారు. కొంతమంది చేస్తారు. నవ్వుతూ నిద్ర లేవాలంటే కూడా ఇంట్లో అందుకు తగ్గ పరిస్థితులు ఉండాల్సిందే. అయితే తన డాన్స్‌తో, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి ఇంటి వద్ద అలాంటి పరిస్థితులే ఉంటాయట. ఉదయాన్నే లేచేసరికి ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుందట. ఈ విషయాన్ని సాయిపల్లవి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. చదవండి: ‘మరో బిడ్డను కనే అర్హత లేదు’‘మరో బిడ్డను కనే అర్హత లేదు’ View this post on Instagram The reason I woke up with a smile...was coz mama earth threw in a surprise 🌸 #rainbow #6am #hatti A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) on Jul 23, 2020 at 7:14pm PDT ఉదయాన్నే తనను భూమాత సర్ప్రైజ్ చేస్తుందని సాయిపల్లవి తెలిపింది. అందుకే తాను ప్రతిరోజు చిరునవ్వుతో నిద్రలేస్తానని చెప్పింది. తన ఇంటి బయట నుంచి ఆకాశంలోకి చూస్తే అద్భుతంగా కనబడుతుందని, దీనిని తెలిపే వీడియోను ఆమె పోస్ట్ చేసింది. పెద్ద ఇంద్రధనుస్సు ఒకటి ఇందులో కనబడుతుంది. ఇలాంటి ఆహ్లాదకర వాతావరణం కారణంగా తాను ప్రతి రోజు సంతోషంగా గడుపుతానని సాయిపల్లవి చెబుతోంది. ఆమె పోస్ట్ చేసిన వీడియో అభిమానులు లైక్‌లు కొడుతున్నారు. చదవండి: పెళ్లిపై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్ -
నవ్వండి బాస్.. మహా అయితే తిరిగి నవ్వుతారు
సాక్షి, విశాఖపట్నం: విశ్వ శ్రేయః హాస్యః అని ఓ సంస్కృత వాక్యం ఉంది. అంటే.. ప్రపంచ శ్రేయస్సు కోరేది ఏదైనా ఉందంటే అది కేవలం నవ్వు మాత్రమే. ఒకరినొకరు ద్వేషించుకునే బదులు నవ్వుతూ పలకరించుకుంటే అసలు యుద్ధాలే రావంటారు అరిస్టాటిల్. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా.. మీరు మనస్ఫూర్తిగా నవ్వుతున్నారా..? అంతలా ఆలోచిస్తున్నారేంటి.? అలా బిక్కమొహమేసుకొని చిరాగ్గా ఉండకుండా కాస్తా నవ్వండి. నవ్వుతూ ఈ కథనం చదివేయండి.. నవ్వులనేవి మంచి మనసుకు చిరునామాలు. ఒక మనిషి ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసుకోవాలంటే వారి నవ్వును కొలమానంగా తీసుకోవచ్చంటారు వైద్య నిపుణులు. ఉదయాన్నే లేచినవెంటనే.. అద్దం చూస్తూ.. చిరునవ్వు నవి్వతే చాలు. ఆరోజంతా ఎంతో ప్రశాంతంగా సాగిపోతుంది. మనసును విశ్రాంతపరుస్తూ.. కొత్తలోకంలో విహరింపజేసేలా చేస్తుంది. ఒత్తిడి, కోపం, నొప్పులకు దివ్యౌషధంలాంటిదని వైద్యులు ధ్రువీకరించారు. నవి్వనప్పుడు విడుదలయ్యే హార్మోనులు మీలో చిరాకును దూరం చేస్తాయి. దీని వల్ల వునం ఆరోగ్యంగా జీవించగలం. జీవితంలో మిమ్మల్ని స్థిరంగా ఉండేటట్లుగా సహాయపడుతూ.. పాజిటివ్ ఆలోచనలతో జీవించేలా ప్రోత్సహిస్తుంది. మీ బాధల్ని తగ్గించి ఎంకరేజ్ చేస్తూ.. గాజువాకకు చెందిన శ్రీకర్.. కోట్ల రూపాయలు సంపాదించినా ఎప్పుడూ జీవితంలో ఏదో పోగొట్టుకున్నవాడిలా కనిపిస్తుంటాడు. ఇంట్లో వాళ్ల సలహా మేరకు డాక్టర్ దగ్గరకు వెళ్లి తన సమస్య చెప్పుకున్నాడు. బీపీ, సుగర్ ఇలా వ్యాధుల చిట్టా చెప్పుకొచ్చాడు. మొత్తం విన్న డాక్టర్ శ్రీకర్ని కాసేపు తీక్షణంగా చూసి మందులు రాసిచ్చారు. హాస్పిటల్ బయటకు వచ్చి మందులు కొందామని చీటీ చూడగా... అందులో.. రోజూ మూడు పూటలు మనసారా నవ్వుతూ ఉండండి అని రాసి ఉంది. అప్పటి నుంచి అది ఫాలో అయిపోయాడు శ్రీకర్. సరిగ్గా నెల తర్వాత చూస్తే బీపీ, సుగర్ కంట్రోల్లోకి వచ్చాయి. ముఖారవిందం మారిపోయింది. ఇప్పుడు శ్రీకర్ హాయిగా ఉన్నాడు. ఎందుకంటే.... నవ్వు.. మనిషి అంతరంగాన్ని ఆవిష్కరిస్తుంది. నవ్వు.. వ్యక్తి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. నవ్వు.. ఒత్తిడిని జయిస్తుంది. నవ్వు.. ఆహ్లాదాన్ని పంచుతుంది. నవ్వు.. శరీరానికి కావాల్సిన శక్తినందిస్తుంది. ఇంతటి మహత్తర శక్తి ఒక్క చిరునవ్వుకే సాధ్యం. సంగీతానికి రాళ్లు కరిగించే శక్తి ఉందో లేదో తెలీదు కానీ.. నవ్వుకు మాత్రం వ్యా«ధులు నయమవుతాయన్న నిజం శాస్త్రీయంగా నిరూపితమైంది. అలాంటి నవ్వుకు ఉన్న శక్తిని తెలిపే రోజే స్మైల్ పవర్ డే. నవ్వడం ఒక భోగం... నవ్వు భౌతిక, మానసిక, భావోద్వేగ, సమతుల్యతకు సహాయకారి. నవ్వు వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది. దీనివల్ల శరీరంలో అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. కేలరీలు కరిగించి ఆరోగ్యంగా జీవించేందుకు సహాయపడుతుంది. మరికొన్ని పరిశోధనలు డయాబెటిక్ పేషెంట్స్‌లో సుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసే శక్తి నవ్వుకు ఉంటుందని నిరూపించాయి. స్మైల్ సైకాలజీ ప్రకారం స్మైల్ సైకాలజీ ప్రకారం చూస్తే.. రోజువారీ మనలోని శక్తిని మార్చే గుణం నవ్వులో ఉంటుంది. రోజూ ఉదయాన్నే గంటసేపు నవి్వతే.. ఆ రోజంతా మనకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. కొత్త స్నేహాల్ని పరిచయం చేస్తుంది. మనలో ని శక్తి సామర్థ్యాల్ని మరింత ఇనుమడింపజేస్తుంది. సక్సెస్‌కు చిరునామాగా నవ్వు ని లుస్తుందని సైకాలజిస్టులు చెబుతుంటారు. చాక్లెట్‌కు మె దడు పనితీరుని చురుకుదనంగా మార్చే శక్తి ఉంటుంది. అలాంటి చాక్లెట్ బార్లు 2,000 తింటే.. మెదడు ఎంతటి చు రుకుదనంగా మారుతుందో.. ఒక్క నవ్వు అంతటి చురుకుదనాన్ని ఇస్తుందని బ్రిటిష్ పరిశోధకుల పరిశోధనల్లో తేలింది. శరీర శోభను పెంచే శక్తి నవ్వుకే.. ►నవ్వు మానవ జీవితానికి పలువిధాల శోభనిస్తుంది. చిరునవ్వుతో ముఖంలోని దాదాపు 150 కండరాలు కదిలించగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ►అనేక రుగ్మతల్ని రూపుమాపగలిగే శక్తి నవ్వుకి ఉందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కొన్ని రకాల వ్యాధుల్ని నవ్వుతోనే నయం చేసుకోవచ్చు. అనవసరంగా మందులు వాడాల్సిన పని లేకుండా వ్యాధులు తగ్గే అవకాశాలు నవ్వుతోనే సాధ్యం. ►మానసిక ఒత్తిడి కలిగించే హార్మోన్ల స్థాయిని నవ్వు తగ్గిస్తుంది. ►మనం నవి్వనప్పుడు అంటువ్యాధుల్ని నిర్మూలించే కణాలు మరింత చురుగ్గా పనిచేస్తాయి. ఏబీ ఇమ్యునోగ్లోబిన్స్ని కూడా నవ్వు వృద్ధి చేస్తుంది. ఈ ఇమ్యునోగ్లోబిన్స్ వృద్ధి చెందితే.. శరీరంలోని చెడు బ్యాక్టీరియా, వైరస్‌ను నాశనం చేసి శ్వాసకోశాన్ని కాపాడుతుంది. ►సహజంగా నొప్పి తగ్గించే ఎండారి్పన్ను నవ్వు పెంచుతుంది. ఆర్థరైటిస్, స్పాండిలైటిస్ కండరాలకు సంబంధించిన నొప్పులు, మైగ్రేన్ ఉద్రిక్తతకు సంబంధించిన తలనొప్పుల్ని తగ్గించేందుకు ఈ ఎండార్ఫిన్ ఎంతగానో దోహదపడుతుంది. ►ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది. బ్రాంకైటిస్, ఉబ్బసం ఉన్నవారికి నవ్వు వైద్యుడిగా సహాయపడుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి రక్తంలో ప్రాణవాయువు స్థానాన్ని పెంచుతుంది. ►మానసిక ఒత్తిడిని తగ్గించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ►పది నిమిషాల పాటు నవి్వన తర్వాత చెక్ చేస్తే.. బీపీ పేషెంట్లో రక్తపోటు తగ్గుముఖం పట్టినట్టు పరిశోధనలు తెలిపాయి. ►మనసారా రోజూ నవ్వుకోండి. మీ ముఖంలో ఎలాంటి వృద్ధాప్య ఛాయలు కనిపించవు. మన ముఖ కండరాల్ని టోన్ చెయ్యడంతో పాటు ముఖ కవళికల్ని మెరుగుపరచడంలో నవ్వు కీలక పాత్ర పోషిస్తుంది. మీరెప్పుడైనా పొట్ట చెక్కలయ్యేలా నవ్వినప్పుడు మన ముఖం ఎర్రబడటాన్ని గమనించారు. దీనికి కారణం రక్త సరఫరా వేగవంతం కావడమే. ఇలా రక్త ప్రసరణ వేగవంతమైతే.. ముఖ చర్మానికి పోషణ లభించి మెరుపు సంతరించుకుంటుంది. ఈ సీక్రెట్‌ను తెలుసుకునే.. చాలా మంది నవ్వుతూ ఉంటారు. ఇంత పవర్ నవ్వులో ఉన్నప్పుడు ఈ వార్తని కూడా సీరియస్‌గా చదువుతారెందుకు.. ఇప్పటి నుంచే నవ్వుతూ.. నవ్విస్తూ.. హాయిగా ఆరోగ్యంగా జీవించండి. ఒత్తిడి దూరం.. గంటల తరబడి చదువుతున్నప్పుడు మానసిక ఒత్తిడికి గురవుతుంటాను. ఆ సమయంలో ఒక్క అరగంట సేపు కామెడీ షోలు చూస్తుంటా. అంతే ఒత్తిడి మొత్తం మాయమైపోయి రిలాక్స్‌గా మారిపోతుంటా. ఇంట్లో అంతా ఇదే ఫాలో అవుతున్నాం. – శైలజ, పీజీ విద్యార్థిని కామెడీ షోలకు ప్రాధాన్యం... నవ్వు ఆరోగ్యానికి మంచిదని ఎప్పుడో చదివాను. అప్పటి నుంచి కామెడీషోలు, సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంటాను. క్లాసులు విన్నాక.. కాసేపు ఫ్రెండ్స్ అంతా కూర్చొని ఎవరికి తెలిసిన జోకుల్ని చెప్పుకుంటూ నవ్వుకుంటాం. – బండారు స్వరాజ్యం, బీటెక్ విద్యార్థిని నవ్వే ఆయుధం... ఎదుటి వారు ఏ విషయంలోనైనా కోపంగా మాట్లాడితే.. వారికి నేను చిరునవ్వుతోనే సమాధానం చెబుతుంటాను. దీంతో.. వారు కూల్ అయిపోతారు. నాపై కోపాన్ని మరిచిపోయి ఫ్రెండ్స్ అయిపోతారు. నా స్మైల్ నా పవర్ అని చాలా మంది చెబుతుంటారు. – తమ్మినేని దర్శిని,డిగ్రీ విద్యార్థిని లాఫర్ థెరపీ మంచిదే... మా దగ్గరికి చాలా మంది వివిధ రకాల నొప్పులతో బాధపడుతూ వస్తుంటారు. వాళ్లందరికీ ఫిజియోథెరపీ చేశాక ఇంటికి వెళ్లి అరగంట పాటు నవ్వమని సలహా ఇస్తుంటాను.లాఫర్ థెరపీతో ఎలాంటి నొప్పులనైనా మాయం చెయ్యొచ్చు. – ఎస్.స్వాతి, ఫిజియోథెరపిస్ట్ -
హావభావాలకు అనుగుణంగా ఆత్మస్థైర్యం..
తిరుపతి అన్నమయ్య సర్కిల్, కల్చరల్: మారుతున్న కాలానికి అనుగుణంగా మనషుల మనస్తత్వాలు మారుతున్నాయి. ఒకనాడు అక్కా బాగున్నారా, అన్నా బాగున్నారా..? అని ఆప్యాయంగా పలకరించుకుంటూ జనం మధ్య సంబంధాలు మన అనుకునేంత.. దగ్గరగా కొనసాగేవి. అయితే ఆధునిక సమాజంలో కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో పాటు మనుషుల మధ్య పలకరింపు సైతం సరికొత్త స్మైల్.. స్టైల్‌గా మారింది. మాట నేర్చిన పిల్లాడి నుంచి చరమాంకంలోనున్న వృద్ధుల వరకు స్మైల్‌తో హాయ్ చెప్పడం స్టైల్‌గా మారింది. పట్టణాలలో ప్రారంభమైన ఈ స్టైల్ సంస్కృతి గ్రామీణ ప్రాంతాలకు సైతం వేగంగా విస్తరించింది. ఉదయం నిద్రలేచింది మొదలు తిరిగి నిద్రకు ఉపక్రమించే వరకు స్టైల్‌తో సంతరించుకున్న స్మైలే హాయ్ జీవన గమనమైంది. కనిపిస్తే చిరునవ్వుతో హాయ్ అనడమేకాక సమయానికి అనుగుణంగా గుడ్మార్కింగ్, గుడాఫ్టర్నూన్, గుడ్ ఈవెనింగ్, గుడ్ నైట్ అనే పదాలు స్మైల్‌తో వాటి హావభావాలు పలికిస్తున్నారు. మనుషులు ఎదురెదురుగా మాట్లాడుకునే విధానం దూరయ్యారు. ఇందుకు ప్రధాన కారణంగా సోషల్ మీడివేదికగా మారింది. కలిసి అప్యాయంగా పలకరించే సంస్కృతి దూరమైన సామాజిక మాద్యమాలతో కావాల్సిన వారి కి మెసేజ్‌ల ద్వారా స్మైల్ సింబల్స్‌నే వాడే పరి స్థితి నెలకొంది. దీంతో ఇద్దరు వ్యక్తులు కలిసి మ నస్ఫూర్తిగా పలకరించుకునే దుస్థితి కరువై వారి మధ్య దూరాలు పెరుగుతున్నాయి. నేటి ఆధునిక జీవన విధానంలో మానవులు పోటీ తత్వానికి అలవాటు పడి సమయాభావం లేకుండా చిరునవ్వుతోనే పలకరింపులు ముగిస్తున్నాయి. సజీవమైన నవ్వులు పెదవులపై తొణికిసలాడే వారే సంపూర్ణమైన ఆరోగ్యవంతులు, ఆకర్షణీయులు.. నవ్వు నాలుగు విధానాల మేలు అనే సామెతకు ఇదే తార్కాణం... నవ్వడం ఒక భో గం..., నవ్వించడం ఓ యోగం..., నవ్వలేకపోవడం ఓ రోగం... ప్రపంచంలోని కోటాను కోట్ల జీవరాసులలో పరిపూర్ణంగా నవ్వకలిగే శక్తి ఒక మానవునికే ఉంది. ప్రతి మనిషి నిత్యం ఉత్సాహంగా, ఉల్లాస జీవనంతో దీర్ఘకాలిక ఆరోగ్యం తో బతికించే దివ్య ఔషధం నవ్వు. అంతేకాదు పైసా ఖర్చు లేకుండా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పంచే అద్భుతమైన ఔషధం నవ్వు. నవరసాల్లో హాస్యం ఒకటి. మనుషుల మధ్య బంధాలను పెంచడంలోనూ, పదుగురిని దరి చేర్చడంలోను ఎంతో ఉపకరించి ఆనందాన్ని పంచే అమృతం లాంటిది చిరునవ్వు. ప్రతి మనిషి ఆరోగ్యాన్ని, ఆయుష్సును రెట్టింపు చేసి సమాజంలో గుర్తింపునిచ్చేది ఈ నవ్వే. అంతటి మహత్యం కలిగిన ఈ నవ్వుకు నేటి ఆధునిక సమాజం కొత్త భాష్యానిస్తోంది. అనేక హావభావాలతో చిరునవ్వే సమాధానంగా వివిధ రూపాలలో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుత వేగవంతమైన సమాజం, ఉరుకుపరుగుల జీవితం, కొత్త సంభాషణలతో చతురోక్తులు, చలోక్తులతో సమాజం నడుస్తోంది. చిరునవ్వుతో లాభాలెన్నో.. రోజు కొద్ది సేపు నవ్వే వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఊపిరితిత్తులు, గుండె సామర్థ్యం పెరుగు పడుతుంది. ఆస్తమా, బీపీ, షుగర్, మానసిక రోగులకు నవ్వు ఎంతో ఉపసమనం ఇస్తుంది. శ్వాస కోశ వ్యవస్థలోని పొరలు నవ్వుతో మెరుగుపరుస్తుంది. నవ్విన వారి శరీరంలో టిసెల్స్ శాతం అధికంగా విడుదలై నీరసం నిసత్తువ తగ్గుముఖం పడతాయి. శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యం చేకూరుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ఆరోగ్యమంటే నవ్వు అని అర్థం. సోషల్ మీడియాలో.. నేటి యువత అధికంగా స్మార్ట్ ఫోన్లతో సామాజిక మాధ్యమాలలో స్మైల్‌తోనే ఉత్తర ప్రత్తుత్తరాలు జరుపుతున్నారు. ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు భాగా మృగ్యమైపోతున్నాయి. నేటి సాంకేతిక ప్రగతి మనుషుల్ని క్రమంగా దూరం చేస్తోంది. సామాజిక మాధ్యమాల రాకతో మనస్ఫూర్తిగా పలకించే వారే కరవయ్యారు. భార్య భర్తలు ఎదురెదురుగా ఉన్నా సామాజిక మాధ్యమాలతోనే పలకరించుకుంటూ స్వచ్ఛమైన నవ్వుకు దూరం అవుతున్నారు. ఈ విపరీత ధోరణికి కారణం కుటుంబ వ్యవస్థ, మానవ సంబంధాలను గుర్తించపోవడమే.– డాక్టర్ ఎన్బీ.సుధాకర్‌రెడ్డి, ప్రముఖ సైకాలజిస్ట్, తిరుపతి విజేతలు.. ఒక్క చిరునవ్వు.. వెయ్యి సమస్యలను పరి ష్కస్తుంది. వంద విజయాలను దరి చేరుస్తుంది. అది ఓ కార్పొరేట్ సంస్థ ఉద్యోగి అయినా.. పారిశ్రామిక వేత్తయినా, వ్యాపా రి అయినా కష్టాన్ని మరిపించి.. మానసిక ఆందోళనను దూరం చేసేది చిరునవ్వే. ఇదే విజయానికి బాటలు పరుస్తుంది. స్మేహితుడు.. ఏ కల్మషం లేనిది స్మేహమొక్కటే. తనలో ఎన్ని భావాలున్నా.. వాటన్నింటినీ తొక్కిపెట్టి ఆత్మీయుడికి ఆనందాన్ని పంచేది చిరునవ్వు ఒక్కటే. ఎలాంటి ఆర్థిక తోడ్పాటు లేకుండా.. అరమరికలను దూరం చేసే శక్తి చిరునవ్వేకే ఉందంటే అతిశయోక్తి కాదేమో. సామాజిక మాధ్యమాలు.. రోజు ప్రారంభం నుంచి.. పూర్తయ్యే వరకు.. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్..కు పట్టే ఫొటోలన్నీ చిరునవ్వుకు ప్రతిరూపాలే. పచ్చని ప్రకృతి, పూలతోట, పక్షుల కిలకిలా రావాలను తెలియజేసే ఆడియోలు.. ఇవ న్నీ.. హాయ్ చెప్పేందుకు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఉపయోగిస్తున్నారు. -
కత్రినా కైఫ్ వల్ల కూడా కాలేదట
సాక్షి, హైదరాబాద్ : మాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ నెట్టింట్లో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, బాలీవుడ్ హీరోలు, స్టార్ క్రికెటర్లను ఆకట్టుకుంటూ ఈ అమ్మడు దూసుకుపోతోంది. ఇక ఈ అమ్మాయి కొంటెగా కన్నుగీటితూ.. సన్నగా నవ్విన అర నవ్వులకు సోషల్ మీడియాలో కుర్రకారు హుషారు ఒక రేంజ్లో ఉంది. ట్విటర్, ఎక్స్ ప్రెషన్స్, కామెంట్లు, జిప్ వీడియోలతో హోరెత్తిపోతోంది. ముఖ్యంగా ప్రముఖ క్రికెటర్లు గౌతం గంభీర్, రవి శాస్త్రి, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీతో పాటు, బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్‌లు ప్రియావైపు చూస్తున్నట్లు హాస్య ఫోటోలను ఎడిట్ చేసి టైమ్‌లైన్‌లను నింపేస్తున్నారు నెటిజన్లు. బాలీవుడ్ చర్రితలో కత్రినా కైఫ్ కూడా ఇంతటి అందమైన భావాలను అన్నిరకాల వ్యక్తీకరణలను పలికించలేపోయిందని ఓ ట్విటరాటీ వ్యాఖ్యానించడం విశేషం. కేరళలోని త్రిసూర్‌కు చెందిన ప్రియ నటిస్తున్న ‘ఒరు అదార్ లవ్’లోని ‘మాణిక్య మలరయ పూవి’ అనే సాంగ్‌లో క్లిప్ ఫిబ్రవరి 9న ఆన్లైన్లో వైరల్ అయి మంగళవారం సాయంత్రానికి యూ ట్యూబ్‌లో సుమారు 10,000,000 వీక్షణలను సంపాదించింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రియా ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోయారు. కాగా త్వరలో విడుదల కాన్ను ప్రియ డెబ్యూ మూవీకి ఓమర్ దర్శకత్వం వహించగా, ఓసుపచాన్ మూవీ హౌస్ పతాకంపై ఓసేపచాన్ వాలాకుజ్హి నిర్మించారు. షాన్ రెహ్మాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. pic.twitter.com/TesNiqPq9L — pysh (@TeaAnddBusquets) February 11, 2018 Cute expression kya bt hai Dil ko chu gya thaak 😍😍😍😍😍😍 pic.twitter.com/BsVvsPRmVf — Nitish thapliyal (@Nitishthapliya5) February 12, 2018 pic.twitter.com/tglRkpNEWu — 💛 (@ShiftedtoMars) February 11, 2018 -
నవ్వితేనే చూపిస్తా!..
ఎవరైనా అద్దం ముందు నిలబడితే వారి ప్రతిబింబాన్ని చూపిస్తుంది. అలా చూపించకపోతే దాన్ని అద్దమే అనం కదా! కానీ మన ప్రతిబింబాన్ని చూపించకపోయినా ఒక్కోసారి అద్దం అనాల్సి ఉంటుంది. ఈ విషయానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ ఫొటోలో కనిపిస్తున్న అద్దం. దీని ఎదురుగా మామూలు స్థితిలో నిలబడితే మన ముఖాన్ని చూపించదు. మన ప్రతిబింబాన్ని చూడాలంటే మాత్రం మనం చిన్న చిరునవ్వును ఇవ్వాలి. స్మైల్ ఇస్తేనే ఈ అద్దం మన ప్రతిబింబాన్ని చూపిస్తుంది. దీన్ని కేన్సర్ రోగుల కోసం ప్రత్యేకంగా తయారుచేశారు. ఇదొక హైటెక్ మిర్రర్. ఇందులో ఒక కెమెరా ఉంటుంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ సహాయంతో ఈ అద్దం పనిచేస్తుంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించుకుని మన ముఖ కవళికలను ఈ అద్దం గుర్తిస్తుంది. మనం నవ్వులు చిందించినప్పుడు కెమెరా సహాయంతో మన ముఖాన్ని గుర్తించి సదరు వ్యక్తి ప్రతిబింబం దర్శనమిస్తుంది. దీన్ని గోడకు, టేబుల్ మీద ఎక్కడైనా ఉంచి సాధారణ అద్దం తరహాలో ఉపయోగించవచ్చు. ప్రస్తుతం దీని ధర 2,000–3,000 డాలర్ల మధ్య ఉంది. దీన్ని టర్కీస్ ఇండస్ట్రియల్ డిజైనర్ బెర్క్ ఇల్హాన్ రూపొందించారు. బెర్క్ ఇంట్లో ఒకరికి కేన్సర్ వచ్చింది. అప్పటి నుంచి ఆ ఇంట్లో నవ్వులు దూరమయ్యాయి. ఎలాగైనా ఆ ఇంట్లో నవ్వులు పూయించాలనుకున్న ఇల్హాన్ రెండేళ్లు కష్టపడి ఈ హైటెక్ మిర్రర్‌ను రూపొందించారు. -
ఎయిర్ ఇండియా సిబ్బందికి 'ఆకట్టుకునే' సూచనలు!
న్యూఢిల్లీః ఎయిర్ ఇండియాపై ఇటీవల అనేక విమర్శలు వినబడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సంస్థపై పడ్డ చెడు ముద్రను చెరిపే పనిలో నిమగ్నమయ్యారు. ముఖంపై నవ్వును చిందిస్తూ ప్రయాణీకులతో మర్యాద పూర్వకంగా ఎలా వ్యవహరించాలో ఎయిర్ లైన్స్ ఛీఫ్.. అశ్వనీ లొహానీ సిబ్బందికి వివరించారు. చిరునవ్వుతో కూడిన పలకరింపు ఓ మంచి లక్షణమని, అది సిబ్బంది అలవాటు చేసుకోవడం ఎంతైనా అవసరమని కొత్త సూచనలు చేశారు. విమానాల ఆలస్యం విషయంలో కాక్ పిట్, కేబిన్ క్రూ సిబ్బంది సంయమనం పాటిస్తూ... ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండాలని అశ్వనీ లొహానీ సిబ్బందికి సలహా ఇచ్చారు. చెక్ ఇన్ ఏజెంట్లు తప్పనిసరిగా ప్రయాణీకులకు అందుబాటులో ఉండాలని, వారి అనుమానాలను నివృత్తి చేస్తూ వారితో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ఎయిర్ ఇండియా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా సిబ్బంది, సంస్థకు సంబంధించిన ఏజెన్సీల ప్రవర్తన అనుకూలంగా ఉండి, సమస్యను పరిష్కరించేట్టుగా ఉండాలని సూచించారు. ఎయిర్ ఇండియాలో ప్రయాణం ప్రయాణీకులకు 'మంచి' అనుభవం కావాలని, అందుకు సిబ్బంది సహకారం అవసరమని కోరారు. ముఖ్యంగా విమానాల ఆలస్యం విషయంలో సిబ్బందికి, ప్రయాణీకులకు మధ్య వివాదాలు తలెత్తడం ఇటీవలి కాలంలో తరచుగా ఎదురౌతున్న నేపథ్యంలో లొహానీ సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. కేబిన్ సిబ్బంది.. ప్రయాణీకులకు సంప్రదాయ బద్ధంగా నమస్కరించాలని, ప్రయాణీకులనుంచి అభినందనలు పొందే విధంగా ఉండాలని, ముఖంపై నవ్వుతో మర్యాద పూర్వక సంభాషణలను చేయాలని లొహానీ చెప్పారు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయానికి, లేదా ఆలస్యం ఉన్నపుడు వెంటనే విమానాశ్రయ మనేజర్, స్టేషన్ మేనేజర్ ప్రయాణీకుల ముందు హాజరవ్వాలన్నారు. అంతేకాక వారితో మర్యాదపూర్వకంగా సంభాషించి, సమస్యను సులభంగా అధిగమించే ప్రయత్నం చేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రయాణీకులకు అందించే ఆహారం నాణ్యత విషయంలోనూ శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు ఛెఫ్ తనిఖీలు నిర్వహిస్తుండాలని తెలిపారు. -
నమ్మండి.. ఇది నవ్వేనండి!
మనిషి తర్వాత అంతటి కామెడీ జంతువు ఏది? చింపాజీ.. కోతి.. అంటూ ఆంథ్రోపాలజీ ఆధారంగా ఊహాగానం లాంటి సమాధానం చెబితే సరిపోదు. మీకు సమీపంలో ఉన్న జంతువుల్ని పరీక్షగా చూశారా? ఎప్పుడైనా ఓసారి అవి నవ్వితే ఎలా ఉంటుందో చూశారా? చూస్తే ఇంకోసారి, చూడకపోతే మొదటిసారి..అన్నట్లు జంతువుల్లో హైనాలు బాగా కామెడీ టైప్ అట! ఎలుకలు కూడా సాధ్యమైనంతలో పొట్ట చెక్కలు చేసుకుంటూ ఉంటాయట! ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఫొటోగ్రాఫర్లు తీసిన, జనం మెచ్చిన పక్షులు, జంతువుల నవ్వుల ఫొటోలివి.. నమ్మండి.. ఇది నిజంగా నవ్వేనండి! -
మోడల్స్ క్యాట్వాక్లో నవ్వకూడదా?
సరికొత్త ఫ్యాషన్లను, డిజైన్లను మార్కెట్లో పరిచయం చేయడానికి ప్రత్యేక వారధులు ఫ్యాషన్ మోడల్స్. ఓ కొత్త ట్రెండ్ ను సెట్ చేయడంలోనూ వారిది ప్రధాన పాత్రగా కనిపిస్తుంది. అటువంటి మోడల్స్.. క్యాట్ వాక్ చేసేటప్పుడు ఎందుకు గంభీరంగా ఉండాలి అన్నది కొందరి ప్రశ్న. నవ్వడం వల్ల నష్టం ఏముంది అంటూ కొందరు వాదించడం కూడ కనిపిస్తుంది. అయితే మోడల్స్ గుంభనంగా, గంభీరంగా ఉండాలన్న నిబంధన కొత్తగా వచ్చినది కాదు. అటువంటి నిబంధనవెనుక ఎంతో చరిత్రే ఉందంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. ఫ్యాషన్ ప్రపంచంపై ఎవరి అభిప్రాయం వారిది. అయితే క్యాట్ వాక్ చేసేటప్పుడు మోడల్స్ ఎందుకు నవ్వకూడదు అన్న వాదన అప్పుడప్పుడు తెరపైకి వస్తుంటుంది. ఒక్కో వృత్తిలోనూ ఆ వృత్తికి సంబంధించిన కొన్ని నిబంధనలు ఉంటాయి. అలాగే ఫ్యాషన్ మోడల్స్ ప్రదర్శన సమయంలోనూ పాటించాల్సిన నిబంధనలు ఉన్నాయి. క్యాట్ వాక్ సమయంలో మోడల్స్ ముఖంలో కనీసం చిరునవ్వు కనిపించకూడదు అన్నది ఏళ్ళుగా కొనసాగుతున్న నిబంధన. మోడల్స్ కథాంశంగా నిర్మించిన జూలాండర్ వంటి హాస్య కధా చిత్రాల్లో కూడా అదే నిబంధనను పాటించడం కనిపిస్తుంది. అయితే క్యాట్ వాక్ ను స్మైల్ ఫ్రీ జోన్ గా పరిగణంచడంపై వస్తున్న అనేక విమర్శలను మాత్రం ఫ్యాషన్ నిపుణులు తిప్పి కొడుతున్నారు. వేదికపై క్యాట్ వాక్ ముగిసిన తర్వాత... డిజైనర్ పరిచయ సమయంలో మాత్రమే మోడల్స్ నవ్వే అవకాశం ఉంది. ఇతర సందర్భాల్లో వారు ఎంత గంభీరంగా ఉంటే... వారు పరిచయం చేసే ఫ్యాషన్ కు అంతటి విలువ లభిస్తుందంటున్నారు కొందరు అనుభవజ్ఞులు. క్యాట్ వాక్ సమయంలో మోడల్స్ నవ్వకూడదన్న నిబంధన వారసత్వంగా వస్తోంది. అందుకు ఎన్నో ఆసక్తికరమైన ఉదాహరణలు ఉన్నాయి. 19వ శతాబ్దం నాటి చిత్రలేఖనాలను చూస్తే అదే విషయం వెల్లడవుతుంది. 20వ శతాబ్దంలో కనిపించన ఫ్యాషన్ ఫొటోగ్రఫీని చూసినా మోడల్స్ హాటీ లుక్, వారు ధరించిన దుస్తులు వారి స్థితిని తెలిపేట్లుగానే ఉంటాయన్నది ఫ్యాషన్ నిపుణుడు హాస్ట్ పి హాస్ట్ ఉద్దేశ్యం. ముఖం గంభీరంగా, గర్వంగా కనిపించడం, ఇతరులను తిరస్కరించే విధంగా ఉన్నా... మోడల్స్ విషయంలో మాత్రం ఆ స్వభావం వారి స్వీయ నియంత్రణను తెలుపుతుందని చెప్తున్నారు. పూర్వ కాలంలో ఉన్నత కుటుంబీకుల్లో, రాచరికంలోని వ్యక్తుల ప్రవర్తనా విధానంపై ప్రత్యేక శిక్షణ ఉండేది. ముఖ్యంగా ఇది యూరోపియన్ ఉన్నత కుటుంబీకుల్లో కనిపించేది. అయితే ఆధునిక ప్రపంచంలో గాంభీర్యాన్ని ప్రదర్శించడం ఓ ప్రత్యేక సామర్థ్యంగా గుర్తిస్తున్నారు. గంభీరంగా ఉండటం మరింత ఆకట్టుకునేదిగా ఉంటుందని సిద్ధాంతకర్త ఇర్వింగ్ గోఫ్మాన్ అంటున్నారు. ఇటువంటి ప్రదర్శన వారి వారి స్థాయిని తెలుపుతుందని చెప్తున్నారు. యుద్ధ పైలెట్లలో, డైహార్డ్ వంటి సినిమా విలన్లను చూసినప్పుడు అదే లక్షణం కనిపిస్తుందని... అది వారి సామర్థ్యాన్నితెలుపుతుందని అంటున్నారు. ముఖ్యంగా మనసు కన్నా శరీరం అధీనంలో ఉండటం ఎంతో అవసరమని, ఆసక్తిని కలిగిస్తుందని గోఫ్మాన్ చెప్తున్నారు. మోడల్స్ విషయంలో వారి గాంభీర్య స్వభావం వారి వ్యక్తిగత గౌరవాన్ని నిలబెట్టేదిగా ఉంటుందని... నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రాముఖ్యతను కోల్పోతారని చెప్తున్నారు. క్యాట్ వాక్ పై నవ్వడం, అసహనాన్ని వ్యక్తం చేయడం వల్ల ఆ ప్రభావం డిజైనర్ పై కూడ పడుతుందని... అందుకే మోడల్స్ వేదికపై నవ్వకూడదు అన్న నియమాన్ని శతాబ్దాలుగా కొనసాగిస్తున్నట్లు చెప్తున్నారు. -
ఔనా! నిజమా! నమ్మలేం!
'మీరు అందంగా ఉన్నారు' అని ఎవరైనా మీ ఎదురుగా వచ్చి చెప్తే.. ఎలా స్పందిస్తారు? మీ ఎక్స్ ప్రెషన్ ఎలా ఉంటుంది? ఇలాంటి చిత్రమైన అంశం మీదే స్టూడెంట్, ఫొటోగ్రాఫర్ అయిన షియా గ్లోవర్ ఓ ప్రయోగాన్ని చేపట్టింది. ఉపాధ్యాయులు, సహచర విద్యార్థుల ఎదురుగా వెళ్లి వారి ఫొటోలను క్లిక్ చేసింది. ఎందుకు అని వారు ఆశ్చర్యంగా అడిగితే.. 'మీరు చాలా అందంగా ఉన్నారు. అందుకే ఫొటో తీయకుండా ఉండలేకపోయాను' అంటూ సమాధానమిచ్చింది. 'మీరు అందంగా ఉన్నారు' అనే మాట వినిపించగానే ఎదుటివారి నుంచి భలే చిత్రమైన ఎక్స్ ప్రెషన్స్ వచ్చాయి. కొందరు మృదువుగా నవ్వారు. మరికొందరు భళ్లున ఇకిలించారు. ఇంకొందరు చికాకుపడ్డారు. మరికొందరు కనుబొమ్మలు ముడివేశారు. చాలామంది నమ్మలేమన్నట్టు ముఖ కవళికలు ప్రదర్శించారు. 'మీరు అందంగా ఉన్నారు' అన్న చిన్న డైలాగే ఎన్ని ఎక్స్ ప్రెషన్స్ రాబట్టిందో ఆమె తీసిన వీడియోలో చూడవచ్చు. యూట్యూబ్ లో పెట్టిన ఈ వీడియో మీ ముఖాల మీద కూడా చిరునవ్వులు పూయించవచ్చు. చూడండి.. -
సిల్వియా లెకైన్స్... చెరిగిన చిరునవ్వు
క్రైమ్ ఫైల్ అక్టోబర్ 26, 1965... అమెరికాలోని ఇండియానా పోలిస్ ప్రాంతంలో ఉన్న ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగుతోంది. రెండు మూడుసార్లు మోగాక ఒక నడి వయస్కురాలు వచ్చి తలుపు తీసింది. ఎదురుగా పోలీసులు. ‘‘ఇక్కడ గెట్రూడ్ బెనెస్యూయ్‌స్కీ అంటే ఎవరు?’’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘‘నేనే సర్. మీకు ఫోన్ చేసింది నేనే’’ అందామె ఆతృతగా. ‘‘ఏంటి... ఏం జరిగింది?’’ ‘‘నా ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటోన్న సిల్వియా లెకైన్స్ని ఎవరో చంపేశారు.’’ ‘‘ఎవరు? ఎందుకు చంపారు?’’ ‘‘తెలియదు సర్. సిల్వియా అంత మంచి అమ్మాయి కాదు. తనకు చాలా మంది అబ్బాయిలతో సంబంధం ఉంది. వారం క్రితం ఇంటి నుంచి వెళ్లి ఇవాళ ఉదయమే తిరిగివచ్చింది. తనని దిగబెట్టడానికి కొందరు అబ్బాయిలు వచ్చారు. వాళ్లతో తను ఎందుకో గొడవ పడింది. దాంతో వాళ్లు తనని బేస్మెంట్ లోకి లాక్కెళ్లి దారుణంగా కొట్టారు. తను చనిపోయింది’’... ఏడుస్తూ చెప్పింది. ఇన్స్పెక్టర్ బేస్మెంట్ వైపు నడిచాడు. అక్కడ నేలమీద... చెల్లాచెదురుగా పడేసి ఉన్న వస్తువుల మధ్య... దుప్పటి కప్పి ఉంది సిల్వియా దేహం. దుప్పటి తొలగించాడు ఇన్స్పెక్టర్. సిల్వియా నైట్ ప్యాంట్, టీషర్ట్ వేసుకుంది. టీషర్ట్ నిండా రక్తం. తల పగిలి రక్తం ధారకట్టింది. పెదవులు చిట్లిపోయాయి. ముఖం, చేతుల మీద ఎక్కడ చూసినా గాయాలే. ఆ కుర్రాళ్ల గురించి ఏమైనా తెలుసా అంటూ బెనెస్యూయ్స్కీని అడిగాడు ఇన్స్పెక్టర్. ఆమె తెలియదంది. దాంతో బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి దర్యాప్తు ఎలా చేయాలా అని ఆలోచనలో పడ్డాడు. ‘‘ఏమంటున్నారు డాక్టర్?’’.. షాక్ తిన్నట్టుగా అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘నిజం సర్. ఇది ఒక్కరోజులోనో, కొద్దిసేపటిలోనో జరిగిన హింస కాదు. కొన్ని నెలల పాటు చిత్రహింసలు పెట్టారు. ఒళ్లంతా గాయాలతో పుండై పోయింది. ఇంకా దారుణం ఏమిటంటే... ఆ అమ్మాయికి కొన్ని నెలలుగా సరైన ఆహారం కూడా పెట్టలేదు’’... ‘‘రేప్లాంటిదేమైనా...?’’ ‘‘రేప్ జరగలేదు. కానీ రేప్ కంటే దారుణమైన హింస జరిగింది. ఆమె జననాంగాలు దాదాపు ఛిద్రమైపోయాయి. పదహారేళ్ల లేత శరీరం... అంత బాధని ఎలా తట్టుకుందో అర్థమే కావడం లేదు. ఇది మనుషులు చేసే పని కాదు... ఛ.’’ ఆవేశం తన్నుకొచ్చింది ఇన్స్పెక్టర్కి. ఇన్వెస్టిగేషన్ ఎక్కడ మొదలుపెట్టాలో అర్థమైంది. వెంటనే బయలుదేరాడు. ‘‘నన్ను అనుమానిస్తున్నారా సర్? నా తప్పు ఉంటే నేనెందుకు మిమ్మల్ని పిలు స్తాను?’’... అరిచింది బెనెస్యూయ్‌స్కీ. ఇన్స్పెక్టర్ తీక్షణంగా చూస్తున్నాడు. ఆ చూపుల నిండా సందేహాలే. ‘‘అలా చూస్తారేంటి సర్. సిల్వియాతో పాటు తన చెల్లెలు జెన్నీ కూడా నా దగ్గరే ఉంటోంది. కావాలంటే తనని అడగండి. నేనెలాంటిదాన్నో చెప్తుంది’’ అంటూ జెన్నీని పిలిచింది. గదిలోంచి వచ్చి, బెరుకుగా చూస్తూ నిలబడింది జెన్నీ. మెల్లగా వెళ్లి ఆమె తలపై చేయి వేశాడు ఇన్స్పెక్టర్. ‘‘చెప్పు తల్లీ. అక్కని ఎవరు చంపారు?’’ అన్నాడు అనునయంగా. ‘‘ఆ రోజు అక్కతో పాటు ఎవరో వచ్చారంకుల్. వాళ్లతో అక్క గొడవ పడింది. వాళ్లే చంపేశారు. మేమందరం వెళ్లేలోపే వాళ్లు పారిపోయారు.’’ బెనెస్యూయ్‌స్కీ చెప్పింది నిజమేనని అర్థమైంది ఇన్స్పెక్టర్కి. కానీ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ మరొకటి చెబుతోందే. ఏది నిజం? ఆలోచిస్తూ బయటికి నడిచాడు. జీపు ఎక్కి స్టార్ట్ చేశాడు. మరో క్షణంలో వెళ్లిపోయే వాడే. కానీ అంతలో ఎక్కడి నుంచో ఓ కాగితపు ఉండ వచ్చి ఒడిలో పడింది. తెరిచి చూశాడు. ‘‘నన్ను ఇక్కడ్నుంచి బయట పడెయ్యండి అంకుల్. ఏం జరిగిందో నేను చెప్తాను - జెన్నీ’’ ఒక్క అంగలో జీపు దిగాడు. జెన్నీ దగ్గరకు వెళ్లి ఏం జరిగిందో చెప్పమ న్నాడు. తను చెప్పింది విన్నాక అతడి మనసు ద్రవించిపోయింది. సిల్వియా, జెన్నీల తల్లిదండ్రులు సర్కస్‌లో పని చేస్తారు. ఊళ్లు తిరుగు తారు. దానివల్ల పిల్లల చదువు పాడవు తోందని బెనెస్యూయ్‌స్కీ దగ్గర పేయింగ్ గెస్టులుగా పెట్టి వెళ్లారు. వారానికి ఇరవై డాలర్లు ఇస్తామని చెప్పారు. రెండు వారాలకు అడ్వాన్స కూడా ఇచ్చి వెళ్లారు. దాంతో రెండు వారాలు పిల్లల్ని బాగానే చూసింది బెనెస్యూయ్‌స్కీ. మూడోవారం డబ్బు పంపడం ఆలస్యం కావడంతో ఆమె నిజస్వరూపం బయటపడింది. డబ్బు లిస్తామని మోసం చేశారు మీ అమ్మా నాన్నలు, వాళ్లకు సిగ్గులేదు, నా ఇంట్లో పడి తినడానికి మీకూ సిగ్గులేదు అని తిట్టడం మొదలుపెట్టింది. స్కూలుకు పంపడం మానేసింది. వికలాంగురాలైన జెన్నీని కుంటిది అనేది. సిల్వియాని బూతులు తిట్టేది. సమాధానం చెప్పబోతే కొట్టేది. ఆలస్యంగానైనా డబ్బులు అందాయి. కానీ బెనెస్యూయ్‌స్కీ ప్రవర్తన మాత్రం మారలేదు. ఆ డబ్బుతో మిమ్మల్ని పోషించలేనంటూ తిండి పెట్టడం మానే సింది. ఆకలిని తట్టుకోలేక అల్లాడిపోయే వారు. సిల్వియా భరించేది. కానీ చెల్లెలు ఏడిస్తే తట్టుకోలేకపోయేది. ఓరోజు వంటింట్లోంచి దొంగతనంగా రొట్టె తెచ్చి చెల్లికి పెట్టింది. అది తెలిసి ఉగ్రరూపం దాల్చింది బెనెస్యూయ్‌స్కీ. సిల్వియాని విపరీతంగా కొట్టి, తీసుకెళ్లి బేస్మెంట్లో కట్టి పారేసింది. ఆమె హింసించేది చాలక తన పిల్లల్ని, వాళ్ల స్నేహితుల్ని, ఆడుకోవ డానికి వచ్చిన పక్కింటి పిల్లల్ని కూడా రెచ్చగొట్టేది. సిల్వియాని పంచింగ్ బ్యాగ్ అనుకుని ఆడుకొమ్మని చెప్పేది. దాంతో వాళ్లు వికృతంగా ప్రవర్తించేవారు. బెనెస్యూయ్‌స్కీ పెద్ద కూతురు పౌలా, సిల్వియా మీద వేడినీళ్లు పోసేది. రెండో కూతురు స్టెఫానీ... పదే పదే కడుపులో గుద్దేది. మిగతా పిల్లలంతా సిల్వియాను వివస్త్రను చేసి... ఒళ్లంతా బ్లేళ్లతో కోసే వారు. సూదులతో గుచ్చేవారు. బెనె స్యూయ్స్కీ అయితే కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టి మరీ సిల్వియాను హింసించేది. జననాంగాల్లో గాజు సీసాలు పెట్టేది. టెస్ట్ చేస్తే నువ్వు చెడిపోయినదానివని తెలియ డానికే ఇలా చేశాననేది. సూదులను కాల్చి వాటితో ఆమె ఒంటి మీద ‘నేను చెడి పోయినదాన్ని’ అన్న అక్షరాలు వచ్చేలా గుచ్చింది. చెక్కదిమ్మలతో రహస్యాంగాల మీద కొట్టేది. భరించలేక కేకలు పెడితే పైశాచికానందాన్ని పొందేది! పాపం సిల్వియా... విరిగిన ఎముకలు బాధపెడుతుంటే, కోతలు వాతలు సలుపు తుంటే తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేది. ఎవరితో చెప్పుకోవాలో తెలియక, ఎలా బయటపడాలో అర్థం కాక, ఎలాగో తంటాలు పడి, పక్క ఊరిలో ఉంటోన్న తన అక్క డయానాకి ఉత్తరం రాసింది. కానీ తమ దగ్గరకు వచ్చి ఉండటానికి అలా ఎత్తు వేసిందనుకుని ఆ ఉత్తరాన్ని చించి పారేశారు డయానా, ఆమె భర్త. అయితే సిల్వియా తన అక్కకి ఉత్తరం రాసిన విషయం బెనెస్యూయ్స్కీకి తెలిసి పోయింది. వెంటనే సిల్వియాని వదిలించు కోవడానికి ప్లాన్ వేసింది. తనని తీసుకెళ్లి ఎక్కడైనా వదిలేస్తే చస్తుంది అనుకుంది. తన మీదకు నేరం రాకుండా ఉండేందుకు, ‘నేను నా ప్రియుడితో పారిపోతున్నాను’ అంటూ ఉత్తరం రాసి, సిల్వియాతో సంతకం పెట్టించింది. ఆమె ఎత్తుగడను పసిగట్టిన సిల్వియా, పారిపోవాలని ప్రయ త్నించింది. ఒంట్లో సత్తువ లేదు. ఎక్కడికని పోతుంది! అందుకే పాపం దొరికిపోయింది. ఆ తర్వాత వాళ్లు పెట్టిన హింసను తాళలేక, ప్రాణాలే వదిలేసింది. ఇదంతా విని చలించిపోయాడు ఇన్స్పెక్టర్. బెనెస్యూయ్స్కీతో పాటు సిల్వియా ప్రాణాలు పోవడానికి కారణ మైన వాళ్లందరినీ కోర్టులో నిలబెట్టాడు. అయితే... రెండు పెళ్లిళ్లు విఫలమై, ఒంటరిగా కుటుంబాన్ని ఈదలేక, ఒక విధమైన మానసిక రుగ్మతకు గురవ్వడం వల్లే బెనెస్యూయ్‌స్కీ అలా చేసిందని భావించిన న్యాయస్థానం... మరణ శిక్ష వేయలేదు. ఆమెకు, ఆమె కూతురు పౌలాకి జీవితఖైదును విధించింది. మిగతా వాళ్లందరికీ వాళ్ల నేర తీవ్రతను బట్టి... రెండు నుంచి ఇరవయ్యొక్కేళ్ల వరకూ శిక్షలు విధించింది. అయితే, వీళ్లంతా తర్వాత బెయిలు మీద బయటికొచ్చేశారు. బెనెస్యూయ్‌స్కీ అయితే రెండేళ్లకే బయటికొచ్చింది. ఊపిరి తిత్తుల క్యాన్సర్‌తో కన్నుమూసే వరకూ మారు పేరుతో మరోచోట ప్రశాంతంగానే జీవించింది. మిగతావాళ్లు కూడా తమ కుటుంబాలతో సంతోషంగా జీవించారు. కానీ అక్క పడిన వేదనను కళ్లారా చూసిన జెన్నీ మాత్రం కొన్నేళ్ల వరకూ తేరుకోలేక పోయింది. వాళ్ల కుటుంబం సిల్వియాను మర్చిపోలేక నరక యాతన పడింది. ఆ చిట్టితల్లికి న్యాయం జరగలేదంటూ ఆవేదన చెందింది. అది నిజమేనేమో. ఏం పాపం చేసిందని సిల్వియా మూడు నెలల పాటు అంత నరకాన్ని చవిచూడాలి? ఏం అన్యాయం చేసిందని వాళ్ల చేతుల్లో అంత దారుణంగా మరణించాలి? కోర్టు ఇలా ఆలోచించక పోవడం, ఆ చిన్నారి చిరునవ్వును చెరిపేసినవాళ్లని అలా వదిలేయడం నిజంగా అన్యాయమేనేమో! -
హస్నా జరూరీ హై
కనబడుట లేదు రూపం: తెల్లగా అందంగా ఉంటుంది వయసు: తగ్గిస్తుంది బరువు: దించుతుంది వెడల్పు: కనీసం మూడు అంగుళా తత్వం: తియ్యగా చల్లగా ఉంటుంది పేరు: చిరునవ్వు పై లక్షణాలున్న చిరునవ్వు హైదరాబాద్ నగరంలో కనబడుట లేదు. నగరంలోని ఒత్తిళ్లను తట్టుకోలేక మాయం అయిపోయింది. కనిపించిన వారు వెంటనే పెదాలపైకి చేర్చుకోగలరు. నవ్వు అందంగా ఉంటుంది. కావాలంటే అద్దంలోకి నవ్వి చూడండి. నవ్వు తెల్లగా ఉంటుంది- నవ్వితే అది తేటతెల్లం అవుతుంది. నవ్వు తియ్యగా ఉంటుంది- రుచి చూడాలంటే నవ్వాల్సిందే. ఆ నవ్వుకి ఎవరైనా సరే తియ్యగా మాట్లాడాల్సిందే. నవ్వు చల్లగానూ, వెచ్చగానూ ఉంటుంది ఆశ్చర్యంగా..! కోపంలో చల్లగా, కష్టాల్లో వెచ్చగా ఉంటుంది. ఇది రాస్తూ నేనూ నవ్వుతున్నా, చదువుతూ మీరు ఓ చిరునవ్వేసుకోండి. దరహాస దాతా ! సుఖీభవ.. స్మైల్ ప్లీజ్.. మన మహానగరంలో ఉన్న లక్షలాది బైకుల్లో ఒకానొక బైక్‌పై కనిపించిన క్యాప్షన్ ఇది. ఆ సమయానికి యధాలాపంగా డ్రైవ్ చేస్తున్న నన్ను ఆ వ్యక్తి ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది. వెంటనే నా ముఖంపై ఏ ఎక్స్ప్రెషన్ ఉందో గమనించాను. కనుబొమ్మలు ముడిపడి, పెదాలు ముడుచుకుని, బుగ్గలు ఒకింత బిగుసుకుని.. సీరియస్‌గా ఉన్నానేమో అనిపించింది. ఇలా ఉన్నానేంటబ్బా అనుకున్న మరు క్షణంలో ఎక్స్ప్రెషన్ మారిపోయింది. మనసున తొణికిన చిరునవ్వు పెదాలపైకి వచ్చేసింది. ముఖం విచ్చుకుంది. ఆ అజ్ఞాత బైకు వీరుడికి నా థ్యాంక్స్. ఇలా రోజులో కొంత మందికైనా చిరునవ్వు పంచి పెడుతున్నందుకు. నవ్వుదాతా సుఖీభవ. ఏడ తానున్నాదో నవ్వు.. నేను రేడియో జాకీగా పని చేసిన కొద్ది కాలంలో రోజూ ఉదయాన్నే చిరునవ్వుతో ఆఫీస్ చేరేదాన్ని. ఆ నవ్వు ఆ రోజంతా నన్ను ఫ్రెష్‌గా ఉంచేది. ఓ రోజు షోలో పంచుకున్న ఈ విషయానికి ఎందరో కనక్ట్ అయ్యారు. ప్రస్తుతం.. బస్‌స్టాప్‌లో అలసిన ముఖాలు, ఫుట్‌పాత్‌పై బరువైన పేదరికం, ట్రాఫిక్‌లో చిరాగ్గా చోదకులు.. చిరునవ్వు జాడ కనిపించడం లేదు. ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉన్న చోట చిరునవ్వు చిందేయడం తేలికే. కానీ ఒక్కరే ఉన్న చోట చిరునవ్వు చిరునామా లేదు. పోనీ ఒక్కరే తమలో తాము నవ్వుకుంటే సచ్చిదానందం అనుకోరు సరికదా.. మెంటల్ కేస్ అని ఫిక్స్ అవుతారు. మనలో మనం అటుంచండి, పక్క వ్యక్తిని చూసి కూడా నవ్వకపోతే ఏమనాలి. నవ్వులు రువ్వే నవ్వమ్మా.. తెలియని వారిని చూసి నవ్వితే ఏమనుకుంటారో అని నవ్వం. తెలిసిన వారిని చూసి నవ్వితే ఏం అడిగేస్తారో అని భయం. ఇలా నవ్వును దాచేస్తే ఏలా. నవ్వితే తిరిగి నవ్వే సమాధానంగా వస్తుంది. చిరునవ్వులో మ్యాజిక్ ఉంది. నవ్వితే మీరు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారని రీసెర్చ్‌లు ఘోషిస్తున్నాయి. నేను మా అమ్మగారు కొన్నేళ్ల కిందట ఓ ఎక్స్పరిమెంట్ చేశాం. పర్సనల్ ఇష్యూస్‌లో కోర్టుకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం అంతా బరువుగా ఉండేది. దీనికి చెక్ పెడుతూ మా అమ్మగారు నవ్వులు పంచే ఏంజిల్ అవతారం ఎత్తారు. నేనూ ఓ నవ్వు కలిపాను. ఎవరిని చూసినా కళ్లలో మెరుపుతో, చిరునవ్వుతో పలకరించేవాళ్లం. ఆ రకంగా కోర్టు వాతావరణాన్ని మార్చేశాం. నవ్వే మంత్రమూ.. ‘రానీ రానీ కష్టాల్ కోపాల్ తాపాల్’ అన్న మహాకవి ‘హాసం లాసం’ కూడా రానీ అన్నాడు. ఎంతటి బరువైన సమస్యకైనా ఎంతటి డిప్రెషన్‌కు అయినా చిరునవ్వే మంత్రం అని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. ఒక చిరునవ్వు మెదడులోని సెరొటోనిన్ అనే కెమికల్ని విడుదల చేస్తుందట. దాని వల్ల రిలాక్స్ అవుతామట. పెద్దగా హాయిగా మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల ఎండోర్ఫిన్స్ విడుదలై ఉత్తేజపరుస్తాయట. మరింక ఆలస్యం దేనికి.. ఖర్చు పెట్టక్కర్లేకుండా రిఫ్రెష్ అవ్వడానికి చిరునవ్వే వరం. పాశ్యాత్య దేశాల్లో ఎవరైనా ఎదురుపడితే చాలు తెలిసినా, తెలియకపోయినా పలకరింపుగా ఓ చిరునవ్వు విసురుతూ వెళ్లిపోతుంటారు. వాళ్లు మన నగరానికి వస్తే అయోమయానికి గురి కావడం ఖాయం. నగరం నవ్వుల వనం.. ఉరుకుల పరుగుల మన నగరానికి నవ్వడం నేర్పించాలి. అందుకు పెద్ద ప్రణాళిక ఏమీ అక్కర్లేదు. జస్ట్ మీరొక్కరు నవ్వండి చాలు అంతే చిరునవ్వు పాకిపోతుంది. బ్రెజిల్‌లోని నిటెరోయ్ అనే నగరాన్ని ‘ద స్మైలింగ్ సిటీ’ అని ముద్దుగా పిలుస్తారు. ఆ నగరాన్ని ఎప్పటికైనా చూడాలని నాకు కోరిక. ఆ సిటీ తిరిగి నవ్వుతుందట అంటే, అక్కడి జనాభా అంతా సంతోషంగా ఉన్నట్టే కదా. మన హైదరాబాద్‌ను కూడా భారతదేశానికి స్మైల్ క్యాపిటల్‌గా మారుద్దాం. కష్టంలో ఉంటే చిరునవ్వు కష్టం అంటారా, ఒక్కసారి నవ్వి చూడండి మీ కష్టం తేలికైపోతుంది. కష్టాల్, నష్టాల్, ఉరుకుల్, పరుగుల్ ఎన్ని ఉన్నా కూడా మనం పూయిద్దాం నవ్వుల్ పువ్వుల్. మిషన్ ‘హైదరాబాద్ స్మైల్’ మీరు నవ్వండి పక్క వ్యక్తినీ నవ్వించండి. స్మైల్ ప్లీజ్. facebook.com/anchorjhansi -
స్మైల్ ఈజ్ స్టైల్
స్మైల్‌ని మించిన స్టైల్ లేదు.. ఈ స్టేట్మెంట్ ఓ డిజైనర్ది. రోజుకో ఫ్యాషన్ సృష్టికర్త.. నవ్వుని మించిన స్టైల్ స్టేట్మెంట్ లేదనడం విశేషమే. అయితే అంతకు మించిన విశేషాలు చాలానే ఉన్నాయి నిఖిల్ తంపి దగ్గర. ఫ్యాషన్ డిజైనర్‌గా మూడేళ్లలో స్టార్డమ్ అంటే దాదాపు అసాధ్యమే. అయితే దీన్ని సుసాధ్యం చేశాడు నిఖిల్. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా అన్నట్టుగా.. షార్ట్‌టైమ్‌లోనే టాప్ ప్లేస్‌కి చేరుకున్నాడు. నేటి బాలీవుడ్ తారలైన సోనమ్ కపూర్, విద్యాబాలన్‌ల నుంచి ఎవర్గ్రీన్ మాధురీదీక్షిత్ దాకా.. వస్త్ర శైలులను తీర్చిదిద్దాడు. వయసులోనే కాదు అనుభవంలోనూ కుర్రాడే అయిన ఈ ముంబై పోరడు.. నగరంలో తొలిసారి తన డిజైన్లను ప్రదర్శించిన సందర్భంగా సిటీప్లస్‌తో ముచ్చటించాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే... - ఎస్బీ హాయ్ హైదరాబాద్.. ఈ సిటీకి ఇదే తొలిసారి రావడం. నాకు నెట్ ద్వారా ఇక్కడ చాలా మంది కనెక్ట్ అయ్యారు. నా డిజైన్లను అభిమానిస్తున్నారు. వారందరికీ థ్యాంక్స్. ఫస్ట్ టైమ్ వారికి నా డిజైన్స్‌ను పరిచయం చేస్తున్నా. ఇకపై రెగ్యులర్‌గా ఈ సిటీలోని ఫ్యాషన్ లవర్స్‌కి నా డిజైన్స్ అందుబాటులోకి తెస్తా. ఓనమాలు తెలీకున్నా.. నేనేమీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేయలేదు. అయితే ఒక స్నేహితురాలి కోరిక మేరకు ఆమె లేబుల్ లాంచింగ్ కోసం బాగా హెల్ప్ చేశాను. ఆ సమయంలో డిజైనింగ్‌పై ఏర్పడిన అవగాహన, కొంతమంది సన్నిహితుల సూచనలు నన్ను ఇన్స్పైర్ చేసి ఈ రంగంలోకి వచ్చేలా చేశాయి. ఎంట్రీలెవల్లోనే లాక్మె ఫ్యాషన్ వీక్‌లో పాల్గొనడం అక్కడ నుంచి ఒకటొకటిగా వచ్చిన అవకాశాలు నన్ను చాలా స్వల్పకాలంలోనే డిమాండ్ ఉన్న డిజైనర్‌గా మార్చాయి. ఇది ఓవర్‌నైట్ స్టార్డమ్ అనే విషయం నేను అంగీకరిస్తాను. అయితే దీన్ని లాంగ్‌టైమ్ నిలుపుకునేందుకు ప్రయత్నిస్తాను. నానమ్మ స్ఫూర్తి.. మా నాన్నది కేరళ. ట్రెడిషనల్ ఫ్యామిలీ. పొడవాటి జడ, నిండైన విగ్రహం, అందుకు తగ్గట్టుగా కాంచీవరం చీర .. అందంగా మాత్రమే కాదు హుందాగా కూడా మెరిసిపోయేది మా నానమ్మ. ఆమె రూపాన్ని చూస్తూ పలువురు గొప్పగా మాట్లాడుకోవడం నేను విన్నాను. ఆ వస్త్రధారణ నన్ను చిన్నప్పటి నుంచి ఆకట్టుకునేది. ఓ రకంగా నేను డిజైనర్ కావడానికి ఆమే స్ఫూర్తి. కేరళ వస్త్రధారణ థీమ్‌తోనే నేను కథాకళి కలెక్షన్ రూపొందించాను. ఏంజెలినా.. చాన్స్ ఇచ్చేనా.. నాకు యుక్తవయసు నుంచి అభిమాన నటి మాధురీ దీక్షిత్. ఆమె కోసం కేప్టాప్ని డిజైనింగ్ చేయడం మరిచిపోలేని అనుభవం. వయసు పెరిగినా వన్నె తరగని అందం ఆమెది. అలాగే అనుష్కాశర్మ, సోనమ్ కపూర్, విద్యాబాలన్.. వీరందరికి నా డిజైన్స్ ఇవ్వడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. దీపికా పదుకునే, ఏంజలినా జోలిలకూ డిజైన్ చేయాలని నా కోరిక. నవ్వుతూ కనిపించరా.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక స్టైల్ స్టేట్మెంట్ ఏర్పరచుకుంటున్నారు. అయితే నా దృష్టిలో నవ్వుని మించిన స్టైల్ స్టేట్మెంట్ లేదు. ఒక వ్యక్తిని తలచుకోగానే తన స్మైలింగ్ ఫేస్ గుర్తుకు వస్తే చాలు. ప్రతి ఒక్కరిలో ఆ లుక్ గుర్తుండిపోతుంది. అందుకే కీప్ స్మైలింగ్. -
రాహుల్ నవ్వాలి
జీవన కాలమ్ పాపులారిటీ పెరగాలంటే రాహుల్ గాంధీ ఏం చెయ్యాలి? సంజయ్ నిరుపమ్గారయితే కొద్దిగా ‘దేశీ’ ధోరణిలో కనిపించాలన్నారు. వారు ప్రస్తుతం ‘విదేశీ’ ధోరణిలో, ఇటలీ ధోరణిలో కనిపిస్తున్నారని ఆయనకి అనిపించి ఉండవచ్చు. ఈ మధ్య రాహుల్‌గాంధీ బొత్తిగా నవ్వకుండా బుంగ మూతి పెట్టుకు కనిపిస్తు న్నారు. ఎక్కడ మాట్లాడినా నుదురు ముడతలు పడు తూ ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఆయన పాపులారిటీ తగ్గడానికి కారణాలని ఆయన సన్నిహి తులూ, కాంగ్రెస్ నాయకులూ కొందరు గ్రహించారు. వారిలో పవన్‌కుమార్ బన్సల్, చిరంజీవి, సంజయ్ నిరుపమ్ వంటి ముఖ్యులు ఉన్నారు. వీరు ఈ మధ్య రాహుల్‌గాంధీ గారితో ఏకాంతంగా సమావేశమ య్యారని వార్త. పాపులారిటీ పెరగాలంటే రాహుల్‌గాంధీ ఏం చెయ్యాలి? మరికాస్త విశాలంగా, హాయిగా నవ్వుతూ కనిపించాలి. సంజయ్ నిరుపమ్గారయితే కొద్దిగా ‘దేశీ’ ధోరణిలో కనిపించాలన్నారు. వారు ప్రస్తుతం ‘విదేశీ’ ధోరణిలో, ఇటలీ ధోరణిలో కనిపిస్తున్నారని ఆయనకి అనిపించి ఉండవచ్చు. చిరంజీవి అనే మెగాస్టార్, సినీ రంగంలో లబ్ధ ప్రతిష్టులు. వారికి గొప్ప రహస్యాన్ని ఉద్బోధించారు. ‘‘బాబూ! రాజకీయాలు కూడా ఒక విధంగా నటిం చడమే!’’ అనే బ్రహ్మసూత్రాన్ని ప్రబోధించారు. ప్రస్తుతం చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాల్లో ‘నటిస్తున్న’ కారణంగానే వారి రేటింగ్ పెరుగుతున్నదని చిరంజీవిగారు స్వానుభవంతో గ్రహించి ఉండవచ్చు. అందరి ఉమ్మడి అభిప్రాయం ఏమిటంటే- రాహుల్ గాంధీగారు ఇప్పటికన్నా పాత్రికేయులతో మరింత స్నేహ పూర్వకంగా ఉండాలి. అంటే? ఒక కాంగ్రెస్ నాయ కులు అన్నారు: ‘అప్పుడప్పుడు వాళ్ల భుజాల మీద చేతులు వెయ్యాలి’ అని. మోదీగారి సభల్లో వేదిక మీద ఎప్పుడూ 40 మంది ఉంటారు. వాళ్ల మధ్య ఆయన చుక్కల్లో చంద్రుడిలాగ వెలిగిపోతూంటారు. కాని రాహుల్ గారి సభల్లో నల్ల కళ్లద్దాలు పెట్టుకుని దిక్కులు చూస్తున్న, బొత్తిగా చిరు నవ్వు మరచిపోయిన కమాండోలు ఉంటారు. ఇవి ఆత్మీయులయిన, అనుభవం గల సన్నిహితులు చెప్పే గొప్ప సూచనలని నేను నమ్ముతాను. కాకపోతే నావి మరికొన్ని సూచనలున్నాయి. రాహుల్ గాంధీగారు పత్రికా సమావేశాల్లో జొరబడి ఆర్డినెన్స్ కాగితాలు చించెయ్యడం, పార్లమెంటులో నిద్ర పోవడం వంటి కుర్ర చేష్టలు తరుచూ చేస్తుంటారు కనుక- చూడగానే పెద్దమనిషిలాగ మర్యాదగా కనిపించడానికి చిరంజీవిగారి సహాయంతో జుత్తుకి తెల్లరంగు వేయ డమో, కాస్త తెల్లబడిన జుత్తున్న విగ్గు పెట్టడమో చేయాలి. నుదురు కాస్త ముడుతలు పడినట్టు కనిపించడానికి రకరకాల మేకప్ పరికరాలున్నాయి. ముఖ్యంగా ఆయన ప్రతిరోజూ గెడ్డం గీసుకోవాలి. ఎప్పుడూ దిక్కుమాలిన కుర్తా కాక తరుచుగా అత్తా కోడలంచు పంచె, పొందూరు ఖద్దరు కండువా వేసు కోవాలి. ‘‘రాజకీయాలు నటన వంటివే’’ అన్న సత్యాన్ని రాహుల్‌గాంధీ గారు గీతావాక్యం లాగ గోడకు తగిలిం చుకుని ఓ మూల చిరంజీవి బొమ్మని ఉంచుకోవాలి. ఇక- పాత్రికేయులతో భుజం మీద చెయ్యి వేయడం చాలదని నా అభిప్రాయం. అప్పుడప్పుడు పెద్దగా నవ్వుతూ వీపు మీద తట్టడం, మధ్య మధ్య చిలిపిగా కడుపులో పొడవడం వంటి సరదా పనులు చెయ్యాలి. అప్పుడప్పుడు సభల్లో దేశవాళీ అలవాట్లను మెచ్చుకుంటూ - దారి పక్కన నిలబడ్డ కుర్రాడి చేతిలో మొక్కజొన్న కండె, దూరంగా నిలబడిన అమ్మాయి చేతిలో పకోడీ పొట్లం లాక్కొని చటుక్కున నోట్లో వేసుకోవాలి. సగం సగం బట్టలున్న పేదపిల్లని హఠాత్తుగా ఎత్తుకుని కెమెరాకి కనిపించేటట్టు బుగ్గలు నిమరాలి. ఇవన్నీ తప్పనిసరిగా రాహుల్ గాంధీ ఇమేజ్‌ని ప్రజల్లో పెంచుతాయి. సందేహం లేదు. అయితే ముఖ్యమయిన పని మరొకటుంది. రాహుల్‌గాంధీ గారు కేవలం నవ్వడమే కాక అప్పు డప్పుడు కాస్త ఏడవడం కూడా అలవాటు చేసు కోవాలి. వాళ్ల అమ్మ హయాంలో జరిగిన దిక్కు మాలిన అవినీతులు- బొగ్గు కుంభకోణం, 2జీ కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం, తెల్గీ కుంభకోణం, ఆదర్శ్ కుంభకోణం, ప్రజా శ్రేయస్సుని కాక పార్టీ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాలకూ ఉపకారం జరగని రీతిలో పార్లమెంటులో దీపాలార్పి రాష్ట్రాన్ని చీల్చిన కుంభకోణం- వీటన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారనీ, అసహ్యించుకుని తమ అసహ్యాన్ని ఓట్ల ద్వారా నిర్దాక్షిణ్యంగా, కుండబద్దలు కొట్టినట్టు తెలియ చేశారనీ గుర్తుంచుకుంటే - చేసిన తప్పిదాలను - ఎలా గూ ముఖం చెల్లనిస్థితి వచ్చింది కనుక- కనీసం ఒప్పు కోవడం, పశ్చాత్తాపాన్ని ప్రకటించడం- రాజకీయ నాయకులలో అరుదయిన ‘నిజాయితీ’కి అద్దం పడ తాయి. ఏమయినా రాహుల్ గారు ముందు ముందు ఇంకా విశాలంగా, ఇంకా నిండుగా, ఇంకా మెండుగా నవ్వుతారు. అది మన అదృష్టం. -
భావోద్వేగాల భోజనం
బౌద్ధ వాణి బుద్ధుడు కోపానికి, ఆవేశానికి, ఆగ్రహానికి లోనవలేదు. పెపైచ్చు ఎంతో శాంతంగా మాట్లాడి ఆ భావోద్వేగాల భోజనాన్ని గృహస్థునే భుజించమని చెప్పి వెళ్లాడు. ఓ గృహస్థు ఒకనాడు గౌతమ బుద్ధుడిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. బుద్ధుడు వెళ్లాడు. వెళ్లాక ఆయనకు తెలిసింది ఏమిటంటే ఆ గృహస్థు తనను పిలిచింది భోజనానికి కాదనీ, తనను విమర్శించడానికి, దూషించడానికి అని అర్థమైంది. బుద్ధుడు అతడి తిట్లన్నీ భరించాడు. అతడి ఆరోపణలనన్నింటినీ భరించాడు. అతడి విమర్శలన్నిటికీ చిరునవ్వునే సమాధానంగా ఇచ్చాడు. అయినప్పటికీ ఆ గృహస్థు బుద్ధుడిని దూషించడం మానలేదు. చివరికి బుద్ధుడు అడిగాడు, ‘‘మిత్రమా... నీ ఇంటికి తరచు భోజన సందర్శకులు వస్తుంటారా?’’ ‘‘అవును. వస్తుంటారు’’ అని చెప్పాడు గృహస్థు. ‘‘వారి కోసం నువ్వు ఏమి సిద్ధం చేస్తుంటావు?’’ ‘‘పెద్ద విందునే సిద్ధం చేస్తాను’’ ‘‘ఒకవేళ భోజనానికి వస్తానన్న వారు చివరి నిమిషంలో రాకపోతే, వారి కోసం వండించిన పదార్థాల మాటేమిటి?’’ ‘‘ఏముందీ, మేమే భుజిస్తాం’’ అన్నాడు గృహస్థు. ‘‘సరే, నువ్వు నన్ను భోజనానికి పిలిచావు. కానీ తిట్లు, పరుష పదాలు వడ్డించావు. అంటే నువ్వు నాకోసం సిద్ధం చేసిన పదార్థాలు దూషణలు, విమర్శలు మాత్రమే. కానీ వాటిని నేను తినదలచుకోలేదు. కాబట్టి నువ్వే వాటిని స్వీకరించు’’ అని, అక్కడి నుంచి వెళ్లిపోయాడు బుద్ధుడు. చూడండి, ఇక్కడ బుద్ధుడు ఏం చేశాడో! మాటకు మాట అనకుండా, ప్రతి విమర్శలు చెయ్యకుండా, అసలు కోపానికే తావివ్వకుండా, తనకు రావలసిన కోపాన్ని ఆ గృహస్థుకే తిరిగి ఇచ్చేశాడు. అంటే బుద్ధుడు కోపానికి, ఆవేశానికి, ఆగ్రహానికి లోనవలేదు. పెపైచ్చు ఎంతో శాంతంగా మాట్లాడి ఆ భావోద్వేగాల భోజనాన్ని గృహస్థునే భుజించమని చెప్పి వెళ్లాడు. ఇదంతా గమనించిన శిష్యులకు బుద్ధుడు ఇలా చెప్పాడు. ‘‘ఎప్పుడూ కూడా, ఎవరి మీద కూడా ప్రతీకారం తీర్చుకోకండి. ద్వేషం అనేది ద్వేషంతో చల్లారకపోగా, మరింత ద్వేషానికి దారి తీస్తుంది’’. మనం కూడా జీవితంలో ఇలాంటి అకారణ దూషణలకు, విమర్శలకు గురవుతుంటాం. కొన్ని మాటలు మరీ కఠినంగా, హృదయాన్ని బాధించే విధంగా కూడా ఉంటాయి. అలాంటప్పుడు మనం కోపంతో ఊగిపోకూడదు. ఒకటికి రెండు తిట్లు తిట్టి అవతలి వారి కన్నా దిగజారి పోకూడదు. మనలోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని రెచ్చగొట్టేందుకు అవతలి వ్యక్తులు చేసే ప్రయత్నాలను సఫలం కానీయకూడదు. అప్పుడేం జరుగుతుంది? వాళ్ల మాటలు తిరిగి వాళ్లకే తగులుతాయి. వాళ్ల కోపం తిరిగి వారినే చేరుతుంది. మనం స్వీకరిస్తేనే కదా వారి నుంచి మనకు వచ్చేది. ఆ ‘బహుమతి’ని మనం ఎందుకు తీసుకోవడం? వాళ్ల దగ్గరే ఉండనిద్దాం. మనం మౌనంగా, మనశ్శాంతిగా ఉందాం. చివరికి వారే తెలుసుకుంటారు, తమ వల్ల జరిగిన తప్పేమిటో! ఇసుమంత కూడా కోపం తెచ్చుకోని మన వ్యక్తిత్వాన్ని వారు గౌరవించి తీరుతారు. అయితే మరీ మౌనంగా ఉండిపోతే వారు తమ విమర్శలు సరైనవేనని నమ్మే ప్రమాదం ఉంది. మనలో తప్పు ఉంది కాబట్టే మనం మౌనంగా ఉండిపోయామని అనుకునే అవకాశమూ ఉంది. అందుకే వారిని సహనంగా అడగాలి, ‘‘మీ మాటల్లో వాస్తవముందా?’’ అని అడగాలి. ఒకవేళ వాళ్ల వైపు నుండి వాస్తవం ఉన్నట్లయితే అప్పుడు మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. వాస్తవం లేనట్లయితే సహజంగానే మనకు కోపం వస్తుంది. అప్పుడు వాదించీ, వారించీ లాభం లేదు. వాళ్ల మాటల్లోని కోపాన్ని మనలోకీ తెచ్చుకుని అరచి, ఆగ్రహం చెందీ ప్రయోజనం లేదు. ప్రశాంతతతో కూడిన చిరునవ్వుతోనే మనం అలాంటి వారికి అడ్డుకట్ట వెయ్యాలి. సాధారణంగా ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించే ప్రయత్నంలో ఇలాంటి మౌనమే మనకు తోడ్పడుతుంది. -
సందర్భ శుద్ధి లేని నవ్వుతో చేటే!
నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగం... నవ్వకపోవడం ఒక రోగం’ అన్నాడు ప్రముఖ దర్శకుడు జంధ్యాల. ఆ మాట అక్షర సత్యం. కానీ, ఆ నవ్వుకు సందర్భ శుద్ధి చాలా అవసరం. ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు నవ్వకూడదో తెలుసుకుని మరీ నవ్వాలి. లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఈ విషయం సరిగ్గా తెలియపోవడం వల్లనే చైనాలో ఓ పెద్ద మనిషికి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 సంవత్సరాల జైలుశిక్ష పడింది. అదేంటి, నవ్వినందుకు కూడా జైల్లో పెడతారా అనుకోవచ్చు గానీ ఇది అక్షరాలా నిజం ఎందుకంటే, ఓ ప్రమాదం జరిగినప్పుడు దాన్ని చూసి ఆయన విరగబడి నవ్వారట. దాంతో ఒళ్లు మండిన కోర్టు సదరు పెద్దమనిషిని హాయిగా జైల్లో కాలం గడపాలంటూ ఆదేశించింది. కానీ ఆ కోర్టుకు నిజంగా నవ్వు విలువ తెలుసో లేదోనని ఆయన ఆవేదన చెందారట. అసలు విషయం ఏమిటంటే, ఇంత అన్యాయంగా కూడా ప్రమాదాలకు గురవుతారా అని అతగాడికి అనుమానం వచ్చింది. ప్రశాంతంగా బాగున్న రోడ్డు మీద ఎంచక్కా వెళ్లకుండా అనవసరంగా ఎలా యాక్సిడెంటు చేసుకున్నారోనంటూ నవ్వుకున్నారు. దాన్ని కాస్తా ఆ ప్రమాదంలో బతికి బయటపడ్డవాళ్లు వీడియో తీసి కోర్టుకు పంపేసరికి అయ్యగారి బండారం అందరికీ తెలిసిపోయింది. దాంతో ఆయనకు అక్షరాలా 14 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. చైనా పెద్ద మనిషి అనవసరంగా తంటాలు పడ్డారు గానీ, నిజానికి ప్రపంచవ్యాప్తంగా నవ్వు... అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకొని ఎందరో ఆరోగ్యవంతులవుతున్నారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నవ్వు క్లబ్‌లు. నగు మోముకు నవ్వే అందాల నగ... అరమరికలు లేని నవ్వు ఎదుటి వారిని ఆప్యాయంగా పలకరించినట్టు ఆలింగనం చేసుకున్నట్టు ఆప్యాయతను కురిపిస్తుంది. నవ్వితే హాయిగా, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. కడుపుబ్బా నవ్విన తర్వాత ఎలా ఉందని అడిగితే... చాలామంది హాయిగా ఉందం టారు. కానీ ప్రస్తుతం నగర జీవితపు వాసనల వల్ల నవ్వు అనేదే మాయమైపోయింది. నలుగురు కలిసి హాయిగా నవ్వుకునే రోజులు కనిపించడంలేదు. నవ్వు అనేక రకాలుగా ఆరో గ్యానికి మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో నవ్వుకోడానికే ప్రత్యేకంగా లాఫింగ్ క్లబ్‌లు ఏర్పడ్డాయి. నవ్వు అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్, దీనికి మించిన వ్యాయామం లేదని చాలాసార్లు చాలామంది చెప్పారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్నిచ్చి, మనిషని ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చేసేది నవ్వు. మనుషులకు మాత్రమే చేతనైన ఏకైక విద్య నవ్వేనంటే ఆశ్చర్యం లేదు. నవ్వు శరీరంలోని కొటికోల్ అయాన్ హార్మోన్లను విడుదల చేస్తుంది. నవ్వు వల్ల ఎండార్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ బాధను మరిపిస్తాయి, అనేక శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేసి ప్రశాంతతను ఇవ్వడంలో ఈ హార్మోన్లు ప్రధానపాత్ర పోషిస్తాయి. నవ్వడం వలన రోగాలు మటుమాయం అవుతాయని వైద్య నిపుణులు చెబుతారు. శాస్త్రీయంగా చెప్పాలంటే మాత్రం.. నవ్వు ఒక విధమైన ముఖ కవళిక. నవ్వులో ముఖంలోని వివిధ కండరాలు, ముఖ్యంగా నోటికి రెండువైపులా ఉండేవి సంకోచిస్తాయి. మానవులలో నవ్వు సంతోషం, ఆనందానికి బాహ్య సంకేతం. కొందరు నిశ్శబ్దంగా నవ్వుకుంటే, కొంత మంది బయటకు శబ్దం వచ్చేటట్లుగా నవ్వుతారు. సాధారణంగా చలోక్తులు, కితకితలు మరికొన్ని రకాల ప్రేరేపణల వలన నవ్వొస్తుంది. నైట్రస్ ఆక్సైడ్ పీల్చడం వలన, కొన్ని మాదక ద్రవ్యాలు వాడడం వలన బిగ్గరగా నవ్వుతారు. బిగ్గరగా నవ్వినప్పుడు కొన్నిసార్లు కన్నీరు కూడా రావచ్చు. మానవులలో నవ్వడాన్ని మెదడు నియంత్రిస్తుంది. నవ్వు కోపానికి విరుగుడు. మానవులలో నవ్వు, హాస్యానికి సంబంధించిన మానసిక, శరీరధర్మ శాస్త్ర ప్రభావాల్ని గురించి తెలిపే శాస్త్ర విజ్ఞానాన్ని "జెలోటాలజీ" అంటారు. -
లోక్ సభలో సీమాంధ్రకేంద్ర మంత్రుల చిరునవ్వులు