'మీరు అందంగా ఉన్నారు' అని ఎవరైనా మీ ఎదురుగా వచ్చి చెప్తే.. ఎలా స్పందిస్తారు? మీ ఎక్స్ ప్రెషన్ ఎలా ఉంటుంది? ఇలాంటి చిత్రమైన అంశం మీదే స్టూడెంట్, ఫొటోగ్రాఫర్ అయిన షియా గ్లోవర్ ఓ ప్రయోగాన్ని చేపట్టింది. ఉపాధ్యాయులు, సహచర విద్యార్థుల ఎదురుగా వెళ్లి వారి ఫొటోలను క్లిక్ చేసింది. ఎందుకు అని వారు ఆశ్చర్యంగా అడిగితే.. 'మీరు చాలా అందంగా ఉన్నారు. అందుకే ఫొటో తీయకుండా ఉండలేకపోయాను' అంటూ సమాధానమిచ్చింది.
'మీరు అందంగా ఉన్నారు' అనే మాట వినిపించగానే ఎదుటివారి నుంచి భలే చిత్రమైన ఎక్స్ ప్రెషన్స్ వచ్చాయి. కొందరు మృదువుగా నవ్వారు. మరికొందరు భళ్లున ఇకిలించారు. ఇంకొందరు చికాకుపడ్డారు. మరికొందరు కనుబొమ్మలు ముడివేశారు. చాలామంది నమ్మలేమన్నట్టు ముఖ కవళికలు ప్రదర్శించారు. 'మీరు అందంగా ఉన్నారు' అన్న చిన్న డైలాగే ఎన్ని ఎక్స్ ప్రెషన్స్ రాబట్టిందో ఆమె తీసిన వీడియోలో చూడవచ్చు. యూట్యూబ్ లో పెట్టిన ఈ వీడియో మీ ముఖాల మీద కూడా చిరునవ్వులు పూయించవచ్చు. చూడండి..