AI-Powered Video Editing App గూగుల్ యాజమాన్యంలోని ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) వీడియో క్రియేటర్లకు తీపి కబురు అందించింది. తాజాగా యూట్యూబ్ క్రియేట్ (YouTube Create) యాప్ లాంచ్ చేసేంది. అలాగే ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఎంటిలిజెన్స్ (AI)కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్ క్రియేటర్లు వీడియోలను సులువుగా రూపొందించుకునేలా కొత్త యాప్‌ను తీసు కొస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్‌మాతృ సంస్థ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఎక్స్ (ట్విటర్)లోప్రకటించారు. AI పవర్డ్ టెక్నాలజీ రంగంలో తన మార్గ-బ్రేకింగ్ ఆవిష్కరణను వెల్లడించింది గూగుల్.
Just announced at today’s #MadeOnYouTube event: Dream Screen lets creators type in an idea to produce an AI-generated video or image background, and creators can use YouTube Create to make video production much easier. https://t.co/mXxStE83N9
— Sundar Pichai (@sundarpichai) September 21, 2023
transport yourself to places you could only imagine - from a popcorn volcano to a jellybean beach 🤯 Dream Screen AI-generated backgrounds enter the chat in 2024. pic.twitter.com/11DXy6olYi
— YouTube (@YouTube) September 21, 2023
వీడియో క్రియేట్‌లో ప్రెసిషన్ ఎడిటింగ్ , ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ వాయిస్‌ఓవర్, క్యాప్షనింగ్ ,ట్రాన్సిషన్స్ వంటి ఫీచర్లు ఉంటాయని కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. చాట్ బాక్స్‌లో మనం అనుకున్నది టైప్ చేయడం ద్వారా రి వీడియోలకు AI- రూపొందించిన వీడియో లేదా చిత్రాన్ని జోడించేలా 'డ్రీమ్ స్క్రీన్' అనే కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఉదాహరణకు, వినియోగదారులు "నేను పారిస్‌లో ఉండాలనుకుంటున్నాను" అని టైప్ చేస్తే దానికి సంబంధించి వీడియో లేదా చిత్రాన్ని వస్తుంది. ట్రెండింగ్ టాపిక్‌లు, ప్రేక్షకుల ప్రాధాన్యతల ఆధారంగా వీడియోల కోసం టాపిక్ ఐడియాలు, అవుట్‌లైన్‌లను రూపొందించడంలో సాయపడుతుంది.
ఈ కొత్త యాప్ ప్రతి ఒక్కరికీ వీడియో ప్రొడక్షన్‌ను సులభతరం చేయడం, ముఖ్యంగా ఫస్ట్‌టైం యూట్యూబ్ వీడియోలు చేస్తున్నవారికి మరింత అందుబాటులో ఉండేలా చేయడమే తమ లక్ష్యమని యూట్యూబ్ కమ్యూనిటీ ప్రోడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ టోనీ తెలిపారు. ఈ ఫిచర్ షార్ట్-ఫారమ్ వీడియోల కోసం మాత్రమే కాకుండా, YouTubeలో లాంగ్ ఫామ్ కంటెంట్ సృష్టికి కూడా సమానంగా సపోర్ట్ చేస్తుందని ఆయన వెల్లడించారు.
తద్వారా చిన్న వీడియోలు లేదా రీల్స్ విషయంలో యూత్ మనసు దోచుకున్న టిక్‌టాక్, ఇన్‌స్టాలోని యాప్‌లతో YouTube క్రియేట్ పోటీ పడనుంది. ప్రస్తుతానికి ఇది ఎంపిక చేసిన దేశాల్లో యాప్ ఆండ్రాయిడ్‌లో బీటా మోడ్‌లో తొలుత భారత్, అమెరికా,యూకె, జర్మనీ, ఫ్రాన్స్, ఇండోనేషియా, సింగపూర్, కొరియాలోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment