
ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లోనూ టెక్నాలజీని వాడేస్తున్నారు. ఇప్పుడు తాజాగా టేబుల్ టెన్నిస్ ఆడే రోబోట్ వెలుగులోకి వచ్చింది. ఇది టేబుల్ టెన్నిస్ క్రీడాకారులకు ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తోంది. వేగం, సామర్థ్యంలో ఈ రోబోట్.. మనుషులను కూడా మించిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో గమనిస్తే.. టేబుల్ టెన్నిస్ ఆడే రోబో మానవ పోటీదారులు గట్టి పోటీ ఇస్తోంది. సొంతంగా బాల్ పట్టుకోలేదు, సర్వ్ కూడా చేయలేదు. కానీ టేబుల్ టెన్నిస్ ఆడవాళ్లను మాత్రం అవలీలగా ఓడించేస్తోంది. ఈ రోబోట్ మొత్తం 29 మ్యాచ్‌ల సమయంలో 13 మందిని ఓడించి 45 శాతం విజయాన్ని సొంతం చేసుకుంది. కొంతమంది ఆటగాళ్లతో రోబోట్ కూడా ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment