రతన్‌ టాటా మళ్లీ బతికొస్తే..! | Best use of AI Ratan Tata video impressive on social media | Sakshi
Sakshi News home page

రతన్‌ టాటా మళ్లీ బతికొస్తే..! ఆకట్టుకుంటున్న వీడియో

Published Sat, Oct 12 2024 4:18 PM | Last Updated on Sat, Oct 12 2024 9:54 PM

Best use of AI Ratan Tata video impressive on social media

రతన​ టాటాను ఒక పారిశ్రామికవేత్తగా కంటే కూడా ఒక గొప్ప మానవతావాదిగా, అనుక్షణం దేశ శ్రేయస్సు కోసం కాంక్షించిన వ్యక్తిగా అందరూ గుర్తుంచుకుంటారు.  అలాంటి గొప్ప వ్యక్తి ఈ లోకాన్ని విడిచి మనందరికీ దూరమయ్యారు. ఆయన మళ్లీ బతికొస్తే బావుండు అని అనుకోనివారుండరు.

అలా భావించిన ఒక వ్యక్తి రతన్‌ టాటాపై ఏఐ సహాయంతో ఓ అద్భుతమైన వీడియో రూపొందించారు. తన సారథ్యంలోని టాటా గ్రూపు ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో దేశ ప్రజల శ్రేయస్సు గురించే రతన్‌ టాటా ఆలోచించేవారు. అలా ఆయన అభివృద్ధి చేసిన పలు వ్యాపారాలను గుర్తు చేస్తున్నట్టుగా రతన్‌ టాటా ఈ వీడియోలో కనిపించారు.

రతన్‌ టాటా దూరమయ్యారని దేశమంతా బాధాతప్తులైన వేళ టాటా మళ్లీ బతికొచ్చి ‘చింతించకండి.. నేను లేకపోయినా నా జ్ఞాపకాలు మీతోనే ఉంటాయి‘ అని అంటున్న విధంగా రూపొందించిన ఈ ఏఐ వీడియో సోషల్‌ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement