editing
-
గ్రాఫిక్స్‌కి సమయం ఇవ్వలేదు!
హీరో రజనీకాంత్, డైరెక్టర్ కేఎస్ రవికుమార్లది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ముత్తు’(1995) చిత్రం సూపర్ హిట్ కాగా, ‘నరసింహా’(1999) మూవీ బ్లాక్‌బస్టర్ అయింది. అయితే వీరికాంబోలో వచ్చిన ‘లింగ’(2014) చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కాగా ఈ సినిమా ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారంటూ కేఎస్ రవికుమార్ తాజాగా ఆరోపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ–‘‘లింగ’ సినిమా ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారు. ద్వితీయార్ధం మొత్తం మార్చేశారు.కంప్యూటర్ గ్రాఫిక్స్‌కి నాకు సమయం ఇవ్వలేదు. అనుష్కతో ఉండే ఒక పాటని, పతాక సన్నివేశంలో వచ్చే ఓ ట్విస్ట్‌ను పూర్తిగా తొలగించారు. కృత్రిమంగా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ ని యాడ్ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా మొత్తాన్ని గందరగోళం చేశారు’’ అని పేర్కొన్నారు. రజనీకాంత్‌పై కేఎస్ రవికుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.అయితే ‘లింగ’ సినిమా గురించి 2016లో కేఎస్ రవికుమార్ మాట్లాడిన మాటలను కొందరు గుర్తు చేస్తున్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా మా సినిమా(లింగ) రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అది మామూలు విషయం కాదు. బాక్సాఫీస్ వసూళ్ల పరంగా మా సినిమా సూపర్‌హిట్’’ అంటూ గతంలో మాట్లాడిన ఆయన.. ఇప్పుడేమో ‘లింగ’ పరాజయానికి రజనీకాంత్ కారణమని చెబుతున్నారంటూ విమర్శిస్తున్నారు. -
Tech Talk: యూట్యూబ్‌లో కామెంట్‌ను ఎడిట్, డిలీట్ చేయడానికి..
మనం చూసిన వీడియోలు, చేసిన కామెంట్స్‌ను యూట్యూబ్ సేవ్ చేస్తుంది. కామెంట్ హిస్టరీని చూడాలనుకుంటున్నారా? ఎడిట్ లేదా డిలీట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి... యూట్యూబ్ లోగోకు లెఫ్ట్‌లో ఉన్న హంబర్గర్ మెనూ బటన్‌ను క్లిక్ చేయాలి. ‘యూ’ సెక్షన్ కింద ఉన్న ‘హిస్టరీ’ని క్లిక్ చేయాలి. రైట్లో ఉన్న ‘మేనేజ్ ఆల్ హిస్టరీ’ క్లిక్ చేయాలి కామెంట్స్–ట్యాప్.డిలిట్, ఎడిట్ చేయడానికి...– ‘ఎక్స్’ ఐకాన్‌ను నొక్కితే కామెంట్ ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది.– ఎడిట్ చేయడానికి వీడియో లింక్‌ను నొక్కాలి. లోడ్ అయిన పేజీ మీ కామెంట్‌ను హైలైట్ చేస్తుంది.– ఎడిట్ చేయాలనుకుంటున్న కామెంట్ పక్కన ఉన్న త్రీడాట్ మెనూ బటన్‌పై క్లిక్ చేసి ‘సేవ్’ బటన్ నొక్కాలి.– గమనించాల్సిన విషయం ఏమిటంటే మార్పులు చేసిన తరువాత కామెంట్ ఎడిట్ చేసినట్లు యూట్యూబ్ చూపిస్తుంది.ఇవి చదవండి: Aryan Chauhan: అద్భుతాల ఆర్యన్! -
యూట్యూబర్లకు గుడ్ న్యూస్: సుందర్ పిచాయ్ ప్లాన్ అదిరిపోయిందిగా!
AI-Powered Video Editing App గూగుల్ యాజమాన్యంలోని ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) వీడియో క్రియేటర్లకు తీపి కబురు అందించింది. తాజాగా యూట్యూబ్ క్రియేట్ (YouTube Create) యాప్ లాంచ్ చేసేంది. అలాగే ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఎంటిలిజెన్స్ (AI)కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో యూట్యూబ్ క్రియేటర్లు వీడియోలను సులువుగా రూపొందించుకునేలా కొత్త యాప్‌ను తీసు కొస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని గూగుల్‌మాతృ సంస్థ అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా ఎక్స్ (ట్విటర్)లోప్రకటించారు. AI పవర్డ్ టెక్నాలజీ రంగంలో తన మార్గ-బ్రేకింగ్ ఆవిష్కరణను వెల్లడించింది గూగుల్. Just announced at today’s #MadeOnYouTube event: Dream Screen lets creators type in an idea to produce an AI-generated video or image background, and creators can use YouTube Create to make video production much easier. https://t.co/mXxStE83N9 — Sundar Pichai (@sundarpichai) September 21, 2023 transport yourself to places you could only imagine - from a popcorn volcano to a jellybean beach 🤯 Dream Screen AI-generated backgrounds enter the chat in 2024. pic.twitter.com/11DXy6olYi — YouTube (@YouTube) September 21, 2023 వీడియో క్రియేట్‌లో ప్రెసిషన్ ఎడిటింగ్ , ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ వాయిస్ఓవర్, క్యాప్షనింగ్ ,ట్రాన్సిషన్స్ వంటి ఫీచర్లు ఉంటాయని కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. చాట్ బాక్స్‌లో మనం అనుకున్నది టైప్ చేయడం ద్వారా రి వీడియోలకు AI- రూపొందించిన వీడియో లేదా చిత్రాన్ని జోడించేలా 'డ్రీమ్ స్క్రీన్' అనే కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఉదాహరణకు, వినియోగదారులు "నేను పారిస్‌లో ఉండాలనుకుంటున్నాను" అని టైప్ చేస్తే దానికి సంబంధించి వీడియో లేదా చిత్రాన్ని వస్తుంది. ట్రెండింగ్ టాపిక్‌లు, ప్రేక్షకుల ప్రాధాన్యతల ఆధారంగా వీడియోల కోసం టాపిక్ ఐడియాలు, అవుట్‌లైన్‌లను రూపొందించడంలో సాయపడుతుంది. ఈ కొత్త యాప్ ప్రతి ఒక్కరికీ వీడియో ప్రొడక్షన్‌ను సులభతరం చేయడం, ముఖ్యంగా ఫస్ట్‌టైం యూట్యూబ్ వీడియోలు చేస్తున్నవారికి మరింత అందుబాటులో ఉండేలా చేయడమే తమ లక్ష్యమని యూట్యూబ్ కమ్యూనిటీ ప్రోడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ టోనీ తెలిపారు. ఈ ఫిచర్ షార్ట్-ఫారమ్ వీడియోల కోసం మాత్రమే కాకుండా, YouTubeలో లాంగ్ ఫామ్ కంటెంట్ సృష్టికి కూడా సమానంగా సపోర్ట్ చేస్తుందని ఆయన వెల్లడించారు. తద్వారా చిన్న వీడియోలు లేదా రీల్స్ విషయంలో యూత్ మనసు దోచుకున్న టిక్‌టాక్, ఇన్‌స్టాలోని యాప్‌లతో YouTube క్రియేట్ పోటీ పడనుంది. ప్రస్తుతానికి ఇది ఎంపిక చేసిన దేశాల్లో యాప్ ఆండ్రాయిడ్‌లో బీటా మోడ్‌లో తొలుత భారత్, అమెరికా,యూకె, జర్మనీ, ఫ్రాన్స్, ఇండోనేషియా, సింగపూర్, కొరియాలోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. -
వాట్సాప్‌లో ఎడిట్ ఫీచర్ ప్రారంభం
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కొత్తగా ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. పొరపాటున, తప్పుగా పంపిన సందేశాల్లో మార్పులు చేసుకోవచ్చు. అక్షర దోషాలు ఉంటే సరి చేసుకోవచ్చు. ఈ మేరకు ఎడిట్ బటన్ ఫీచర్‌ను ప్రారంభించినట్లు వాట్సాప్ యాజమాన్యం ప్రకటించింది. రాంగ్ మెసేజ్‌లు ఎడిట్ చేసుకోవడానికి తొలి 15 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. సందేశం తప్పుగా వెళ్లినట్లు భావిస్తే దాన్ని మొత్తం తొలగించాల్సిన అవసరం లేదు. మార్పులు చేస్తే సరిపోతుంది. దీనివల్ల యూజర్లకు చాటింగ్‌పై మరింత కంట్రోల్ లభిస్తుందని యాజమాన్యం తెలియజేసింది. మెసేజ్‌లు ఎలా ఎడిట్ చేయాలి? 1. వాట్సాప్ యాప్‌లో ఎనీ చాట్‌లోకి వెళ్లాలి. 2. పొరపాటున పంపిన మెసేజ్‌పై వేలితో కాసేపు నొక్కి ఉంచాలి(లాంగ్ ప్రెస్). 3. ఇప్పుడు ఎడిట్ మెసేజ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై నొక్కి, సందేశాన్ని ఎడిట్ చేయొచ్చు. మెసేజ్ పంపిన తర్వాత కేవలం 15 నిమిషాలలోపే ఈ వెసులుబాటు ఉంది. గడువు దాటితే ఆ మెసేజ్‌ను పూర్తిగా డిలీట్ చేయడం మినహా మరో మార్గం లేదు. -
వాట్సాప్‌లో ఎడిట్ మెసేజ్ ఫీచర్
పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ‘ఎడిట్ మెసేజ్’ అనే కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తుంది. కొన్నిసార్లు తొందరపాటు వల్లో, పరధ్యానం వల్లో పంపిన మెసేజ్‌లో తప్పులు దొర్లుతుంటాయి. ఇకముందు నాలుక కర్చుకొని అయ్యో అనుకోనక్కర్లేదు. ఎడిట్ మెసేజ్ ఫీచర్‌తో పంపిన మెసేజ్‌లో తప్పును సరిద్దుకోవచ్చు. ఇప్పటికీ వాట్సాప్‌లో ‘డిలిట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్ అందుబాటులో ఉంది. దీంతో యూజర్స్ సెంట్ మెసేజ్‌లను డిలిట్ చేయవచ్చు. అయితే ‘ఎడిట్ మెసేజ్’తో పూర్తిగా డిలిట్ చేయాల్సిన అవసరం లేకుండానే అవసరం ఉన్న చోట ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తారు. (క్లిక్: అక్టోబరు ఒకటిన 5జీ సేవలు లాంచ్) -
ట్విటర్ ప్లాట్ఫామ్లో భారీ మార్పు! అతి త్వరలో..
మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్.. అతిత్వరలో భారీ మార్పు తీసుకురానుంది. ఎడిట్ ట్వీట్ బటన్ వెసులుబాటును తేనుంది. అయితే.. దీనిని ట్విటర్ బ్లూ సబ్స్క్రయిబర్స్కు మాత్రమే రాబోయే రోజుల్లో అందించనున్నట్లు ట్విటర్ పేర్కొంది. ట్విటర్లో ఒకసారి గనుక ట్వీట్ చేస్తే.. దానిని ఎడిట్ చేసే అవకాశం లేదు ఇప్పటిదాకా. అయితే ఎడిట్ బటన్ వల్ల ట్వీట్ పబ్లిష్ అయిన 30 నిమిషాల్లోపు ట్వీట్‌ను ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. సెండ్ బటన్ నొక్కాక 30 సెకన్ల లోపు అన్డూ ద్వారా క్యాన్సిల్ కూడా చేయొచ్చు. ట్విటర్యూజర్లు.. దానిని క్లిక్ చేసి మార్పులు, ఒరిజినల్‌గా వాళ్లు చేసిన ట్వీట్‌ను సైతం చూసే వెసులుబాటు తేనుంది. well well well, look what we’ve been testing… pic.twitter.com/a8fND4xqMM — Twitter Blue (@TwitterBlue) September 1, 2022 ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 320 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. చాలాకాలంగా ఎడిట్ ఆప్షన్‌ను తీసుకురావాలని యూజర్లు కోరుతున్నా.. ట్విటర్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో ఇప్పుడు తేనున్న ఈ ఆప్షన్ ముందుముందు యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. if you see an edited Tweet it's because we're testing the edit button this is happening and you'll be okay — Twitter (@Twitter) September 1, 2022 అయితే.. 2020లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అప్పటి ట్విటర్ సీఈవో జాక్ డోర్సే.. ట్విటర్ ఎప్పటికీ ఎడిట్ ట్వీట్ ఫీచర్ తేకపోవచ్చని కామెంట్ చేశాడు. ఈ ఫీచర్ వల్ల తప్పుడు సమాచారం వ్యాప్తి కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు. అంతేకాదు కొందరు టెక్ నిపుణులు సైతం ఎడిట్ ట్వీట్ బటన్ వల్ల స్టేట్మెంట్లను మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదీ చదవండి: తల్లిదండ్రులు, భార్య గురించి రిషి సునాక్ ఏమన్నారంటే.. -
మహమ్మారి కాలంలో చదువు సమస్య
మహమ్మారి మూలాన, విద్యార్థులు, ఉపాధ్యాయులు భౌతికంగా తరగతి గదిలో కలుసుకొనే అవకాశమే లేకుండా పోయింది. అయినప్పటికీ విద్యాబోధన ఏదోలా ఆన్లైన్లో కొనసాగుతోంది. అయితే ఈ విషయంలో ఇందులో భాగ స్వాములైన అన్ని పక్షాలూ తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాయి. భౌతిక తరగతి గదిలో విద్యార్థులు ప్రాథమిక పాఠశాల నుండి మధ్యస్థ పాఠశాలకు వచ్చేసరికి రాయడం, మాట్లాడటం, చదవడం, వినడం వంటి నైపుణ్యా లను ఒంటబట్టించుకొనే వారు. విద్యతో పాటు శారీరక శ్రమ, ఆటల పోటీలు, సాంస్కృతిక ఉత్సవాలు, విహార యాత్రలు విద్యార్థులలో జీవిత నైపుణ్యాలను పెంపొందించేవి. వీటికి ఇప్పుడు ఎంతమాత్రమూ వీలు లేకుండా పోయింది. ఆన్లైన్ విద్య అందరికీ అందుబాటులో లేకపోయినా కొంత వరకు విద్యను కొనసాగించడానికి వెసులుబాటు కల్పించింది. దీని మూలంగా ఇళ్లే పాఠశాలగా, తల్లిదండ్రులే ఉపాధ్యా యులుగా అవతారం ఎత్తారు. అయినప్పటికీ విద్యార్థి నైపుణ్య శిక్షణలో అవాంతరాలు తలెత్తుతున్నాయి. ఐదు నుండి పద కొండేళ్ల వయసు గల పిల్లలు నీలిరంగు తెరలకు అతుక్కు పోతూ వివిధ ఆరోగ్య రుగ్మతలను కొనితెచ్చుకొంటున్నారు. కౌమార వయసు విద్యార్థులు కూడా పాఠాలను అర్థం చేసుకోవడంలో తీవ్రంగా కష్టపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సాధారణ తరగతులు నిర్వహించడానికే కనీస సౌకర్యాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఫోన్లు, ట్యాబ్‌లు, ఇంటర్నెట్ కనెక్షన్లు వంటి స్మార్ట్ గాడ్జెట్లను కొనుగోలు చేయలేని దయ నీయ స్థితి. ఇంకా కొందరు విద్యార్థులు మిడ్–డే భోజన కార్య క్రమంలో భాగంగా పెట్టే ఒక్క పూట భోజనం కోల్పోయారు. తరగతి గదిలో విద్యార్థుల వైఖరులు, ప్రవర్తనలను గమ నిస్తూ వారిని సక్రమమైన దారిలో మార్గనిర్దేశం చేసి విద్యార్థు లను సామాజిక బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ముఖ్య భూమిక పోషిస్తారు. వాస్తవానికి, చాలా మంది టీచర్లు నల్లబల్ల, సుద్దముక్కను ఉపయోగించి బోధించే నైపుణ్యం గలవారు. ఆన్లైన్ టీచింగ్ మోడ్ చాలా మంది ఉపాద్యాయులకు కొత్తది. ప్రత్యేకించి కంటెంట్‌ను సిద్ధం చేయడానికి, కంటెంట్‌ను పంచుకోవడానికి, ఉపన్యాసం ఇవ్వడానికి, మదిం పులను, మూల్యాంకనాలను రూపొందించడానికి సీనియర్ ఉపాధ్యాయులు చాలా కష్టపడుతున్నారు. ఆన్లైన్ బోధనలో విద్యార్థి పనితీరును అంచనా వేయడం వంటి వాటికి మాత్రమే టీచర్ల పాత్ర పరిమితమైంది. మెంటర్స్, గైడ్స్ మొదలైన ఇతర ముఖ్య పాత్రలను నిర్వర్తించలేకపోతున్నారు. తల్లిదండ్రులు ఆన్లైన్ పాఠశాలల కంటే సంప్రదాయ పాఠ శాల విద్యావిధానంలో సంతోషంగా ఉండేవారు. పిల్లలు రోజుకు ఎనిమిది గంటలు ఇంటి నుండి దూరంగా ఉండేవారు. దీనికి తోడుగా, కొంతమంది తల్లిదండ్రులు వారిని స్పోర్ట్స్, ఫిజికల్ ఫిట్నెస్, డ్రాయింగ్, సంగీతం మొదలైన క్లాసులలో చేర్పించే వారు. ఈ మహమ్మారి ప్రతి విద్యార్థినీ ఇళ్ళలోనే ఉండేలా కట్టడి చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగం చేసే తల్లిదండ్రులు పిల్లల ఆన్లైన్ తరగతులు, హోంవర్క్, అసైన్మెంట్లు, కనెక్టివిటీ సమస్యలతో సతమతమవుతున్నారు. లాక్డౌన్ కారణంగా, చాలామంది తల్లిదండ్రులు తమ ఉద్యోగాలను, ఉపాధిని కోల్పో యారు. ఫలితంగా అనేక మంది పిల్లల విద్య కొనసాగింపు ప్రశ్నార్థకమైంది. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఫార్మసీ షాపులు, కూరగాయల మార్కెట్లు, కిరాణా షాపులు, గాజు దుకాణాలు మొదలైన వ్యాపారాలలో సహాయం కోసం తీసుకువెళ్తున్నారు. మిగులు నగదులో ఉన్న పాఠశాలలు మహమ్మారి సంక్షో భాన్ని ఎదుర్కొన్నాయి. బడ్జెట్ పాఠశాలలను నిర్వహించే నిర్వా హకులు మాత్రం అనేక ఆటుపోటులను ఎదుర్కోవడం వలన పాఠశాల నిర్వహణ కష్టసాధ్యం అవుతోంది. ముఖ్యంగా ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు రుసుములు చెల్లించడంలో విఫలమవ్వటం వలన నగదు సంక్షోభానికి దారితీసింది. బోధన, బోధనేతర సిబ్బంది జీతాలను చెల్లించలేక పోయారు. బడ్జెట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సగం జీతాలు లేదా జీతాలు లేకుండా పనిచేస్తున్నారు. వారిలో కొందరు బోధనా వృత్తిని వదిలి వేరొక వృత్తిని చేపట్టారు. అను భవజ్ఞులైన ఉపాధ్యాయులు తిరిగి విద్యారంగంలోకి రాకపో వచ్చు. ఇది విద్యావ్యవస్థకు భారీ నష్టాన్ని కలిగించే అవకాశం లేకపోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల పట్ల శ్రద్ధ వహించి ఒక బ్లూప్రింట్ రూపకల్పన చేయాలి. అధికారిక తర గతి గది విద్యను పొందకుండా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును మహమ్మారి నాశనం చేసింది. ఇది వారి నైపుణ్యాలు, వైఖరులు, సామాజిక ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుంది. ఒక ప్రధాన, బాధ్యతాయుతమైన వాటాదారుగా ప్రభుత్వం దేశంలోని ప్రతి బిడ్డకు సమాన విద్యను పొందే ప్రణాళికను రూపొందించాలి. డాక్టర్ మైలవరం చంద్రశేఖర్ గౌడ్ వ్యాసకర్త సహాయ ఆచార్యులు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్‌ప్రైజ్, హైదరాబాద్ ‘ 81870 56918 -
వైరల్:కెప్టెన్ అమెరికాగా బైడెన్, థానోస్‌గా ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా ఎన్నికలు 2020 జరిగి ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జో బైడన్ గెలవడం లాంఛనమే అన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత, ఎడిటర్ జాన్ హ్యాండెం పియెట్ ఒక వీడియోను ఎడిట్ చేసి రూపొందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ‘ఎవెంజర్స్: ఎండ్‌గేమ్’ సినిమాలోని పాత్రలను ఎడిట్ చేశారు. ఇందులో బిడెన్‌ను కెప్టెన్ అమెరికాగా, డొనాల్డ్ ట్రంప్‌ను థానోస్‌గా చూపించారు. ఈ వీడియోలో బిడెన్ ట్రంప్‌కు ఎదురుగా నిలుచున్నట్లు కనిపిస్తాడు. 2019 ఈ చిత్రం క్లైమాక్స్ యుద్ధంలో, కెప్టెన్ అమెరికా చూస్తుండగా ఆయనకు మద్దతుగా కొంత మంది వస్తారు. దీనిలో కూడా బైడెన్ చూస్తుండగా ఆయనకు మద్దతుగా కమలా హారిస్, బరాక్ ఒబామా వంటి వారు ఆయనకు సాయాన్ని అందించడానికి వస్తారు. వారు ఉన్న చోట జార్జియా అని రాసి ఉంటుంది. ఈ ఎన్నికల్లో జార్జియా రాష్ట్రం ఎంత కీలకమో తెలిసేలా దానిని క్రియేట్ చేశారు. బైడెన్ నడుస్తుండగా ఆయన వెంట కమలా హారిస్ ఎగురుకుంటూ వస్తుంది. ఆమె తరువాత సెనేటర్లు బెర్నీ సాండర్స్, ఎలిజబెత్ వారెన్ , కోరి బుకర్, బెటో ఓ రూర్కే, పీట్ బుట్టిగెగ్లు కలిసి వస్తారు. అంతేకాకుండా ఈ వీడియోలో స్క్వాడ్ సభ్యులు అయన్నా ప్రెస్లీ, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్, రషీదా తలైబ్, ఇల్హాన్ ఒమర్ ఉన్నారు. హిల్లరీ క్లింటన్, హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి, మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా కూడా పాపప్‌లో కనిపిస్తారు. ప్రతి ఓటు కీలకమే అంటూ కొంతమంది సైన్యం వెనకలా నినాదాలు చేస్తూ ఉంటుంది. మొత్తానికి పోటీపోటీగా జరిగిన అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సూపర్‌గా ఉందంటూ ఈ వీడియో చూసిన కొందరు కామెంట్ చేస్తుంటే, ఈ వీడియో చేసిన వారికి మొక్కాలి అని మరి కొంతమంది ప్రశంసిస్తున్నారు. చదవండి: ట్రంప్‌కు మరో తలనొప్పి : వైట్ హౌస్ చీఫ్‌కు కరోనా -
లైంగిక వేధింపులు: ఎడిటర్ హత్య!
ముంబై: ఇంటర్న్‌షిప్ చేస్తున్న మహిళ చేతిలో మ్యాగజీన్ ఎడిటర్ హత్యకు గురైన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. నిత్యానంద్ పాండే(44) ముంబై కేంద్రంగా నడిచే న్యూస్ పోర్టల్ మ్యాగజీన్ ఎడిటర్. న్యూస్ పోర్టల్ సంస్థలో ఇంటర్న్‌గా పనిచేసే మహిళ, అదే అఫీసులో ప్రింటింగ్ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న సతీష్ మిశ్రా (34) కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దాడికి పాల్పడిన ఇద్దర్నీ వారి ఫోన్ కాల్ రికార్డుల (సీడీఆర్) ఆధారంగా పోలీసులు పట్టుకున్నట్టు సమాచారం. ఈ ఘటనపై మీడియాతో భివండీ ఎస్సై సంజయ్ హజారే మాట్లాడుతూ ‘‘రెండు సంవత్సరాలుగా న్యూస్ పోర్టల్ సంస్థలో ఇంటర్న్‌గా పని చేస్తున్న మహిళను ఆ మ్యాగజీన్ ఎడిటర్ పాండే పదేపదే లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. ఆ మహిళ ఎదురుతిరగడంతో ఆమెకు ప్రమోషన్ ఇవ్వడానికి అతడు నిరాకరించాడు. విసుగెత్తిన మహిళ పాండే బారి నుంచి తప్పించుకోవడానికి అదే ఆఫీసులో ప్రింటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే మిశ్రా సహాయం కోరింది. కొంతకాలంగా ఎడిటర్ పాండే తన వేతన చెల్లింపుల్లో ఆలస్యం చేస్తుండటంతో అతడి మీద మిశ్రా కోపంగా ఉన్నాడు. దీన్ని అదనుగా తీసుకున్న నిందితురాలు.. పాండే అడ్డును మిశ్రా సహాయంతో తొలగించాలని పథకం వేసింది. నిందితులిద్దరూ పాండేను ముంబైకి 8 కి.మీల దూరంలోని ఉత్తర భయందర్‌కు వెళ్లేలా ఒప్పించి తీసుకెళ్లారు. అలా వెళ్తున్న సమయంలో పాండేకు మత్తు మందు కలపి ఉన్న మద్యం తాగించారు. అతడు స్పృహ కోల్పోయిన అనంతరం తాడు సహాయంతో చంపి, భివండీ సమీపంలో పడేసి వెళ్లారని’’ తెలిపారు . -
ఆస్కార్ మారుతోంది!
ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్‌కు సంబంధించిన ప్రతీ విషయం విచిత్రంగానో, వివాదంలానో మారుతోంది. యాంకర్ లేకుండానే వేడుకను నిర్వహిస్తాం అని ఇటీవల నిర్వాహకులు ప్రకటించారు. తాజాగా ‘సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ ఎడిటింగ్, లైవ్‌యాక్షన్ షార్ట్, మేకప్, హెయిర్ స్టైల్’ విభాగాలకు సంబంధించిన అవార్డులను పక్కన పెడుతున్నట్టు అకాడమీ ప్రెసిడెంట్ జాన్ బెయిలీ ప్రకటించారు. పైన పేర్కొన్న అవార్డులను టీవీల్లో యాడ్స్ ప్లే అయ్యే సమయంలో ఇవ్వనున్నారట. ఈ నిర్ణయం గురించి గతేడాది బెస్ట్ డైరెక్టర్‌గా ఆస్కార్ అందుకున్న గులెర్మో డెల్ టొరో మాట్లాడుతూ – ‘‘ఏయే కేటగిరీలను తొలగించాలో నేను చెప్పలేను. కానీ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అనేవి సినిమాకు ప్రాణం. గుండెలాంటివి. వాటిని చిన్నచూపు చూస్తూ.. ఇలా యాడ్స్ ప్లే అయ్యే టైమ్‌లో ఇవ్వాలనుకోవడం కరెక్ట్ కాదని భావిస్తున్నాను’’ అన్నారు. -
సుజుకి హయబుసా -2019 ఎడిషన్ లాంచ్
సాక్షి,న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీదారుమారుతి సుజుకి అనుబంధ సంస్థ సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఎంఐపీఎల్) తన పాపులర్ బైక్‌లో కొత్త ఎడిషన్‌ను విడుదల చేసింది. ఖరీదైన స్పోర్ట్స్ బైక్ హయబుసా 2019 ఎడిషన్‌ను గురువారం ప్రారంభించింది. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా, అప్డేటెడ్ గ్రాఫిక్స్‌తో మెటాలిక్ ఓర్ట్ గ్రే , గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ రెండు కొత్త రంగులలో హయాబూసా 2019 ఎడిషన్‌ను సుజుకి తీసుకొచ్చింది. దీని ధరను రూ. 13.74 లక్షలుగా (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ) నిర్ణయించింది. తమ అన్ని డీలర్‌షిప్‌ల ద్వారా ఈ బైక్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దాదాపు రెండు దశాబ్దాలుగా స్పోర్ట్స్ బైక్‌లలో సుజుకి హయాబూసాకు భారతదేశంలో అద్భుతమైన స్పందన లభించిందనీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా వెల్లడించారు. ఇండియాలోని బైక్ లవర్స్కోసం 2019 ఎడిషన్‌ను రెండు కొత్త రంగుల్లో,మరింత ఆకర్షణీయంగా తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. -
‘సాక్షి’ ఎడిటర్ వర్దెల్లి మురళికి మాతృ వియోగం
-
‘సాక్షి’ ఎడిటర్ వర్ధెల్లి మురళికి మాతృవియోగం
సూర్యాపేట: సీపీఎం సీనియర్ నాయకుడు వర్ధెల్లి బుచ్చిరాములు సతీమణి, ‘సాక్షి’ఎడిటర్ వర్ధెల్లి మురళి మాతృమూర్తి వర్ధెల్లి లక్ష్మమ్మ (78) గుండెపోటుతో మరణించారు. సూర్యాపేటలోని వారి నివాసంలో మంగళవారం మధ్యా హ్నం 1.30 గంటలకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించే లోపే ఆమె తుదిశ్వాస విడిచారు. వీరి స్వగ్రామం తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం కాగా సూర్యాపేటలోని విద్యానగర్‌లో నివాసముంటున్నారు. వర్ధెల్లి బుచ్చిరాములు, లక్ష్మమ్మ దంపతులకు కుమారుడు మురళితో పాటు కుమార్తె పద్మ ఉన్నారు. విషయం తెలుసుకున్న సాక్షి ఎడిటర్ మురళి సూర్యాపేటకు చేరుకుని మాతృమూర్తి భౌతికకాయం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణ ఇంటిపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఆమె భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. లక్ష్మమ్మ మరణంపై ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి వేర్వేరుగా ప్రకటనల్లో తమ సంతాపం తెలిపారు. ఆమె భౌతికకాయాన్ని సీపీఎం నాయకులు సందర్శించి నివాళులర్పించారు. లక్ష్మమ్మ అంత్యక్రియలు బుధ వారం సూర్యాపేటలో జరుగుతాయని తెలిపారు. -
మ్యాగజైన్ ఎడిటర్‌పై టీడీపీ నేతల హత్యాయత్నం
సాక్షి, అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతలు మరోసారి బరితెగించారు. నందు టైమ్స్ మ్యాగజైన్ ఎడిటర్ భాస్కర్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో భాస్కర్ రెడ్డి మ్యాగజైన్ ప్రతులు పంపిణీ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసకుంది. ఈ సంఘటనపై భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. తనను హత్య చేసేందుకు మేయర్ స్వరూప కుట్ర పన్నారని ఆరోపించారు. మేయర్ అనుచరులు 8 మంది తనపై దాడి చేసినట్టు తెలిపారు. వ్యతిరేక వార్తలు రాయవద్దని మేయర్ తనను బెదిరించారని అన్నారు. వారు చెప్పినట్టు వినకపోవడంతోనే తనపై దాడి చేసినట్టు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై డీఎస్పీ వెంకట్రావు స్పందిస్తూ.. జర్నలిస్ట్ భాస్కర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. -
రిలయన్స్ ఇన్ఫ్రా మరో భారీ డిఫమేషన్
సాక్షి, న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూపు మరోసారి భారీ డిఫమేషన్ సూట్‌ను దాఖలు చేసింది. రాఫెల్ డీల్ పై అవాస్తవాలను, అబద్ధాలను ప్రసారం చేశారని ఆరోపిస్తూ ఇటీవల ఎన్డీటీవీ పై 20వేల కోట్ల రూపాయల దావా వేసిన అనిల్ రిలయన్స్ గ్రూపు ఇపుడు మరో మీడియా సంస్థను టార్గెట్ చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ది సిటిజెన్ వ్యవస్థాపకుడు-సంపాదకుడు సీమా ముస్తఫాకు వ్యతిరేకంగా 7వేల కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. రాఫెల్ ఒప్పందంలో తమ కవరేజ్ నేపథ్యంలో తమపై ఈ దావా నమోదైనట్టు సిటిజెన్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై తమకు మద్దతు, సంఘీభావాన్ని ప్రకటించాల్సిందిగా అభ్యర్థిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అంబానీ అరోపణలను తిరస్కరించిరన సిటిజన్ తాము వాస్తవాలకు కట్టుబడి నిజాలను నిర్భీతిగా ప్రజలకు అందించేందుకు, నిజాయితీ, జవాబుదారీతనం, సమగ్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. మీడియా గొంతు నొక్కే ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామని తెలిపింది. అలాగే రాజకీయ లేదా కార్పొరేట్ నిధులు లేని స్వతంత్ర మీడియా జర్నలిజం భవిష్యత్తు కీలకమైనదని విశ్వసిస్తున్నామని పేర్కొంది. -
వ్యక్తి స్వేచ్ఛ న్యాయస్థానాల మౌలిక బాధ్యత
వ్యక్తి స్వేచ్ఛకి, జీవితానికి భారత రాజ్యాంగంలోని అధికరణ 21 చాలా అత్యున్నతమైన స్థానాన్ని కల్పిం చింది. వీటిని కాపాడాల్సిన బాధ్యత అన్ని వ్యవస్థల మీదా ఉంది. మరీ ముఖ్యంగా కోర్టుల మీద ఉంటుంది. ఈ బాధ్యత రాజ్యాంగ న్యాయస్థానాలైన హైకోర్టు, సుప్రీంకోర్టుల మీదనే కాదు. అన్ని కోర్టుల మీదా ఉంటుంది. దిగువ కోర్టు న్యాయమూర్తులు తమపై ఈ బాధ్యత లేదని భావిస్తున్నట్టు అనిపిస్తున్నది. వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పాత్ర మరీ ఎక్కువ. ‘నక్కీరన్’ పత్రిక సంపాదకుడి అరెస్టు, విడుదల సంఘటన జరిగిన నేపథ్యంలో ఈ విషయాలను ప్రస్తావించాల్సి వస్తుంది. పోలీసులు ‘నక్కీరన్’ సంపాదకుడు ఆర్. రాజగోపాల్‌ని అరెస్టు చేశారు. అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 124కింద నేరారోపణ చేశారు. రాజ్‌భవన్ డిప్యూటీ సెక్రటరీ ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నిర్మలాదేవి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ తన దగ్గర చదువుకుంటున్న ఆడపిల్లల్ని మార్కుల కోసం అధికారులకు లైంగికంగా సహకరించమని ప్రోత్సహిస్తున్నదని ఆరోపణలు రావడంతో ఆమెను అరెస్టు చేశారు. ఆమె మాట్లాడిన ఆడియో క్లిప్ కూడా బయటకొచ్చింది. తమిళనాడు గవర్నర్‌తో, అతని కార్యదర్శితో ఆమె చాలాసార్లు సమావేశం అయిందన్న ఆరోపణలున్నాయి. వీటిని గవర్నర్ కార్యాలయం ఖండించింది. నిర్మలాదేవి కామరాజ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఓ కాలేజీలో పనిచేస్తున్నది. పోలీసులు ప్రశ్నించినప్పుడు ఆమె కొంతమంది అధికారుల పేర్లు బయటపెట్టిందని కూడా తెలుస్తోంది. వీటన్నిటిపైనా ‘నక్కీరన్’ పత్రిక కవర్ పేజీ కథనాన్ని ప్రచురించింది. తమ కథనానికి ఆధారం పోలీసుల దర్యాప్తేనని ఆ పత్రిక తెలిపింది. ఆమెకు జైల్లో రక్షణ కల్పించాలని, చాలామంది ఆత్మహత్యల పేరుతో జైళ్లలో మరణిస్తున్నారని పేర్కొంది. మేజిస్ట్రేట్ కోర్టులో గోపాల్ తరఫు న్యాయవాదితోపాటు ‘హిందూ’ దినపత్రిక సంపాదకుడు ఎన్. రామ్ కూడా హాజరయ్యారు. సెక్షన్ 124 వర్తించే నేరమేదీ గోపాల్ చేయలేదని, ఆ కథనానికి ఈ సెక్షన్‌కు ఎలాంటి సంబంధం లేదని వారు వాదించారు. రాష్ట్రపతిని లేదా గవర్నర్‌ను ఉద్దేశపూర్వకంగా ఒత్తిడి తెచ్చి వారి చట్టబద్ధమైన అధికారాలను వినియోగించకుండా ఆటంకపరచడానికి ప్రయత్నించినప్పుడు, దౌర్జన్యం చేసినప్పుడు లేదా అక్రమంగా నిర్బంధించినప్పుడు లేదా అలాంటి ప్రయత్నం చేసినప్పుడు, బల ప్రయోగం చేసినప్పుడు, బెదిరించినప్పుడు ఆ సెక్షన్ వర్తిస్తుంది. ఇది నాన్ బెయిలబుల్ నేరం. ఈ నేరం రుజువైతే ఏడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు. నక్కీరన్ గోపాల్ కథనాన్ని ప్రచురించారు తప్ప గవర్నర్‌తో ప్రత్యక్షంగా కలిసిన సందర్భం లేదు. దౌర్జన్యం శారీరకంగా ఉండాలి. మొత్తానికి గోపాల్ న్యాయవాది, రామ్ వాదనలతో గోపాల్‌ను మేజి స్ట్రేట్ విడుదల చేశారు. దీన్ని పత్రికా విజయంగా భావించవచ్చు. వ్యక్తి స్వేచ్ఛను కాపాడటంలో రాజ్యాంగ న్యాయస్థానాలకు ఉన్నట్టే మేజిస్ట్రేట్ కోర్టుకు కూడా బాధ్యత ఉంటుంది. ఎవరినైనా రిమాండ్‌కి తీసుకొచ్చినప్పుడు అందుకు గట్టి ఆధారాలున్నాయో లేదో మేజిస్ట్రేట్ పరిశీలించాలి. ఆరోపించిన నేరాలను అతను చేశాడని విశ్వసించినప్పుడే రిమాండ్ చేయాలి. అందుకోసం అన్ని సాక్ష్యాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు పేర్కొన్న నేరాల కింద మాత్రమే కాక వేరే నేరాల ప్రకారం కూడా అతన్ని రిమాండ్ చేయవచ్చు. అదేవిధంగా నేరారోపణలు లేవని విశ్వసించినప్పుడు విడుదల చేయొచ్చు కూడా. ఇప్పుడు నక్కీరన్ గోపాల్ విషయంలో చెన్నై 13వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ చేసింది అదే. ఎంతమంది మేజిస్ట్రేట్లు ఈవిధంగా చేస్తున్నారు? ఎంత స్వేచ్ఛగా విధులు నిర్వర్తిస్తున్నారు? ఇది లక్షడాలర్ల ప్రశ్న. వ్యాసకర్త: మంగారి రాజేందర్, టీపీఎస్సీ సభ్యుడు మొబైల్ : 94404 83001 -
జర్నలిస్టు ఇంట్లో చోరీ : దారుణం
తిరువనంతపురం: కేరళలో దారుణమైన చోరీ కలకలం రేపింది. స్థానిక పత్రిక మాతృభూమి కన్నూర్ ఎడిటర్ ఇంట్లో దొంగతనానికి పాల్పడి, భార్యభర్తలను తీవ్రంగా గాయపర్చిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించింది. కన్నూర్ జిల్లా, తజే చొవ్వ ప్రాంతంలో గురువారం తెల్లవారు ఝామున ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నలుగురు దొంగల ముఠా మాతృభూమి సంపాదకుడు వినోద్ చంద్రన్ ఇంటిలోకి చొరబడ్డారు. వినోద్, ఆయన భార్య సరితను, కళ్లకు గంతలు కట్టి, తాళ్లతో కట్టేసి బీభత్సం సృష్టించారు. కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. 35వేల నగదు, 25 తుపాల బంగారాన్ని దోచుకున్నారు. అంతేనా ఏటీఎం కార్డులు, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్స్ ఎత్తుకు పోయారు. దాదాపు గంటసేపు స్వైర విహారం అనంతరం అక్కడినుంచి ఉడాయించారు. అయితే పొరుగువారి సాయంతో బాధితులకు పోలీసులు ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడిన వినోద్ దంపతులు ప్రస్తుతం ఎ.కె.జి. మెమోరియల్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని కన్నూర్ నగర సిఐ ప్రదీపన్ కన్నిప్పాయిల్ తెలిపారు. నేరస్తులు హిందీ, ఇంగ్లీషుల్లో సంభాషించుకున్నారని, ఇది బయటి ముఠా పనికావచ్చనే అనుమానాలను వ్యక్తంచేశారు. సీఐతోపాటు కన్నూర్ డీఎస్పీ ఆధ్వర్యంలోఒక కమిటీ విచారణ చేపట్టిందన్నారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు సంఘటనా స్థలాన్ని పరిశీలించిట్లు తెలిపారు. మరోవైపు దీనిపై పలు అధికార,ప్రతిపక్ష పార్టీనేతలు తీవ్రంగా స్పందించారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర మంత్రి రామచంద్రన్‌పోలీసులను ఆదేశించారు. -
ముగిసిన సవరణ గడువు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి వెబ్ ఆప్షన్ల సవరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. సాంకేతిక సమస్యలతో టీచర్లు ఎంపిక చేసుకున్న ఆప్షన్ల ప్రాధాన్యతా క్రమం ఒక్కసారిగా అస్తవ్యస్తమవడంతో క్షేత్రస్థాయిలో ఆందో ళన వ్యక్తమైంది. దీంతో వెబ్ ఆప్షన్లను సవరించుకునేందుకు ప్రభుత్వం రెండ్రోజులపాటు అవకాశం కల్పించింది. మంగళవారం గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు అవకాశం ఇవ్వగా 11,749 మంది తమ ఆప్షన్లను సవరించుకున్నారు. బుధవారం సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషా పండితులకు ఎడిట్ సౌకర్యం కల్పించింది. రాత్రి 11.59 గంటల వరకు కొనసాగిన ఈ ప్రక్రియలో 10 వేల మందికిపైగా టీచర్లు తమ ఆప్షన్లను సవరించుకున్నారు. ఎడిట్ అవకాశం ముగియడం తో బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను విద్యా శాఖ జారీ చేయాల్సి ఉంది. ఉత్తర్వులను ఒకేసారి ఇవ్వాలా లేక కేటగిరీల వారీగా ఇవ్వాలా అనే అంశంపై విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. ఈ క్రమంలో గురు లేదా శుక్రవారాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఈ నెల 10లోగా బదిలీల ప్రక్రియకు ముగింపు పలకాలని ఆ శాఖ నిర్ణయించింది. నేటితో ముగియనున్న ఐసెట్ వెబ్ ఆప్షన్లు సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులు గురువారం రాత్రి 11:59 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కమిటీ ఒక ప్రకటనలో తెలి పింది. బుధవారం వరకు 24,975 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారని, అందులో 7,548 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని పేర్కొంది. మిగతావారు గడువులోగా ఆప్ష న్లు ఇచ్చుకోవాలని సూచించింది. -
ఎడిట్‌కు చాన్స్!
సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తుల్లో భాగంగా ఇచ్చిన వెబ్ ఆప్షన్ల సవరణలకు విద్యా శాఖ అనుమతినిచ్చింది. ఈ మేరకు బదిలీల వెబ్సైట్లో మార్పులు చేసింది. దరఖాస్తుల్లో తప్పులు దొర్లినట్లు భావించిన టీచర్లు నేటి నుంచి రెండ్రోజులపాటు వెబ్సైట్లో వాటిని సవరించుకోవాలి. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ టీచర్లు మంగళవారం (3వ తేదీన), సెకండరీ గ్రేడ్ టీచర్లు (4వ తేదీన) బుధవారం.. వెబ్ ఆప్షన్లలో తప్పులు సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. తాజా సవరణ ప్రక్రియ కేవలం వెబ్ ఆప్షన్ల వరకే పరిమితం కానుంది. ఇతర అంశాల్లో సవరణ చేసుకునే వీలుండదు. ఈ మేరకు సాంకేతికంగా పక్కాగా ఏర్పాట్లు చేసింది. సుదీర్ఘ పరిశీలన అనంతరం.. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 75,318 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 74,890 దరఖాస్తులను పరిశీలించిన విద్యా శాఖ అధికారులు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఇందులో 72,719 మంది ఉపాధ్యాయులు మాత్రమే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో వెబ్సైట్లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో పెద్ద సంఖ్యలో పొరపాట్లు దొర్లాయి. వరుస క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకున్న తర్వాత ఫ్రీజ్ చేయడంతో ఆప్షన్ల వరుస క్రమం ఒక్కసారిగా గాడితప్పింది. దీంతో ఉపాధ్యాయులంతా ఆందోళనకు గురై విద్యా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పొరపాట్లతోపాటు కొందరు ఉపాధ్యాయులు అవగాహన లేకపోవడంతో ఆప్షన్ల నమోదులో తప్పులు చేశారు. దీంతో ఎడిట్‌కు అవకాశం ఇవ్వాలని విద్యాశాఖకు మొరపెట్టుకున్నారు. సుదీర్ఘ పరిశీలన చేసిన యంత్రాంగం ఎట్టకేలకు ఎడిట్‌కు అవకాశం కల్పించింది. వ్యక్తిగత ఫిర్యాదులపై తర్వాత..: కడియం బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత వ్యక్తిగత ఫిర్యాదులపై స్పందిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు వెబ్సైట్లో ఆప్షన్ల సవరణకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం సచివాలయంలో ఈ మేరకు సమీక్ష నిర్వహించారు. వెబ్ ఆప్షన్ల సవరణ కోసం వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. అవకాశాన్ని ఉపాధ్యాయుల సద్వినియోగం చేసుకోవాలని, వెబ్ ఆప్షన్లలో తప్పులు దొర్లకుంటే అలాంటి టీచర్లు ఈ అంశాన్ని పట్టించుకోవద్దన్నారు. బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యక్తిగతంగా అభ్యంతరాలుంటే విద్యా శాఖ కమిషనర్‌కు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో టీచర్లు ఎన్టైటిల్మెంట్ పాయింట్లు పొందినట్లు విచారణలో తేలితే వారి బదిలీ ఉత్తర్వులు రద్దు చేయడంతోపాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాబితాలోని పొరపాట్లూ సరిదిద్దాలి వెబ్ ఆప్షన్లలో దొర్లిన తప్పులు సవరించేందుకు ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలోని తప్పులను, టీచర్ల అభ్యంతరాలను పరిశీలించి సవరించాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఉపముఖ్యమంత్రిని సచివాలయంలో కలిసిన పలు సంఘాలు వినతులు సమర్పించాయి. సీనియార్టీ జాబితాలో అవకతవకలను సరిదిద్దాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.సరోత్తంరెడ్డి, డి.నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. బదిలీ కౌన్సెలింగ్‌లో సాంకేతిక లోపాలను సవరించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు భుజంగరావు, జి.సదానంద్‌గౌడ్ కోరారు. వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్‌లో అవసరమున్న టీచర్లు మాత్రమే పాల్గొనాలని, దీంతో సర్వర్ ఇబ్బందులుండవని ఆర్‌యూపీపీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సి.జగదీశ్, ఎస్.నర్సిములు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ రాములు, చావ రవి సూచించారు. -
పాక్‌లోనే బుఖారీ హత్యకు కుట్ర
శ్రీనగర్: రైజింగ్ కశ్మీర్ ఎడిటర్ ఇన్ చీఫ్ షుజాత్ బుఖారి హత్యకు పాకిస్తాన్‌లోనే కుట్ర జరిగిందని కశ్మీర్ ఐజీ స్వయంప్రకాశ్ పానీ తెలిపారు. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తోయిబా బుఖారి హత్యకు పథకరచన చేసిందన్నారు. బుఖారి హత్యకు పాకిస్తాన్‌లోనే కుట్ర జరిగిందనటానికి తమవద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. లష్కరే తోయిబాకు చెందిన నవీద్ జాట్, ముజఫర్ అహ్మద్, ఆజాద్ మాలిక్ అనే ఉగ్రవాదులు బుఖారీని తుపాకీతో కాల్చిచంపారని పానీ వెల్లడించారు. బుఖారీ హత్య జరిగిన కొద్దిసేపటికే పాకిస్తాన్‌కు చెందిన ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల ద్వారా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభమైందని తెలిపారు. గతేడాది మార్చిలో పాకిస్తాన్‌కు పారిపోయిన సాజద్ గుల్ ఈ ప్రచారానికి తెరలేపాడన్నారు. సర్వీస్ ప్రొవైడర్లు అందించిన వివరాల ప్రకారం సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన కామెంట్లు పాకిస్తాన్ నుంచి వచ్చినట్లుగా తేలిందన్నారు. 2003, 2016లో ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి రెండు సార్లు అరెస్టయినప్పటికీ గుల్ అక్రమ మార్గాల్లో పాస్‌పోర్టును సంపాదించగలిగాడని వెల్లడించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు వీలుగా నాన్‌బెయిలబుల్ వారంట్ కోసం కోర్టును ఆశ్రయిస్తామని పానీ తెలిపారు. -
ఎడిటర్‌కు సంతాపం
కొరాపుట్ ఒరిస్సా: జమ్ము-కాశ్మీర్ సీనియర్ జర్నలిస్ట్, రైజింగ్ కశ్మీర్ ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ సయ్యద్ షుజాత్ బుఖారిని గురువారం ఉగ్రవాదులు దారుణంగా హత్య చేసిన సంఘటనను ఖండిస్తూ, కొరాపుట్ ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యులు శుక్రవారం సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల మౌనం పాటించారు. సమావేశంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు భవానీ శంకర్ మిశ్రా, సీనియర్ జర్నలిస్ట్ కీర్తిచంద్ర సాహులు మాట్లాడుతూ దేశంలో మీడియా ప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఎప్పటికప్పడు దేశంలో ఎక్కడో ఒకచోట నిత్యం జర్నలిస్టులు దాడులు, హత్యలకు బలవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన విధంగా స్పందించడం లేదని ఆరోపించారు. సమాజ శ్రేయస్సు కోరి పనిచేస్తున్న జర్నలిస్టుల ప్రాణ రక్షణకు తగిన చట్టం తీసుకు రావలసిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. ఇటువంటి దుశ్చర్యలను దేశంలో గల మీడియా ప్రతినిధులంతా ఏకమై ప్రతిఘటించాలని కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిని ఉద్దేశించిన మెమొరాండాన్ని ప్రెస్‌క్లబ్ తరఫున శనివారం కొరాపుట్ కలెక్టర్‌కు అందచేసేందుకు నిర్ణయించారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యులు డి.శంకర రావు, విద్యా చౌదరి, రంజన్ దాస్,ఘనశ్యాం రథ్, జితు మిశ్రా, సత్యనారాయణ పండా తదితరులు పాల్గొన్నారు. -
బుఖారి హత్య : అనుమానితుల ఫొటోలు విడుదల
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ సీనియర్ జర్నలిస్ట్, రైజింగ్ కశ్మీర్ ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ సయ్యద్ షుజాత్ బుఖారి ఉగ్రవాదుల చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు అనుమానితుల ఫొటోలను గురువారం రాత్రి పోలీసులు విడుదల చేశారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా మాస్కులు ధరించి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తుల కదలికలను గుర్తించామని పోలీసులు తెలిపారు. అనుమానితుల ఫొటోలను విడుదల చేయడం ద్వారా స్థానికుల సాయంతో వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నేరస్తులకు సంబంధించిన సమాచారం అందించిన పౌరుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలియజేశారు. కాగా గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందుకు వెళ్లేందుకు బుఖారి శ్రీనగర్‌లోని తన ఆఫీస్ నుంచి బయటకు రాగానే దుండగులు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బుఖారితో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇద్దరు చనిపోయారు. అయితే ఉగ్రవాదులే బుఖారిని హత్య చేశారని భావిస్తుండగా.. ఈ హత్యను తామే చేసినట్లు ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించకపోవడం గమనార్హం. -
రైజింగ్ కశ్మీర్ ఎడిటర్ హత్య
శ్రీనగర్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ సీనియర్ జర్నలిస్ట్, రైజింగ్ కశ్మీర్ ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ సయ్యద్ షుజాత్ బుఖారి(53) గురువారం దారుణ హత్యకు గురయ్యారు. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో ఉన్న పత్రిక కార్యాలయం నుంచి ఆయన బయటకు రాగానే ముగ్గురు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి బైక్‌పై పరారయ్యారు. ఈ ఘటనలో బుఖారితో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పొయారు. ఈ దాడిలో గాయపడ్డ మరొక భద్రతా సిబ్బందిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ పౌరుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఇఫ్తార్ విందుకు వెళ్లేందుకు గురువారం సాయంత్రం 7 గంటలకు బుఖారి ఆఫీస్ నుంచి బయటకు రాగానే దుండగులు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. 2000లో తొలిసారి బుఖారిపై దాడి జరగడంతో ఆయనకు భద్రతను కట్టుదిట్టం చేశామని వెల్లడించారు. 2006లో బుఖారిని ఇద్దరు ఉగ్రవాదులు కిడ్నాప్‌చేసి చంపడానికి యత్నించగా తుపాకీ పనిచేయకపోవడంతో ఆయన అక్కడ్నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న బష్రత్ అహ్మద్ బుఖారికి ఈయన స్వయానా సోదరుడు. ఢిల్లీలోని కొందరు జర్నలిస్టులు మీరు పక్షపాతంతో రిపోర్టింగ్ చేస్తున్నారని గురువారం ఆరోపించగా వాటిని ఖండిస్తూ బుఖారి ట్విట్టర్లో బదులిచ్చారు. కశ్మీర్‌లోయలో శాంతి నెలకొనేందుకు గతంలో బుఖారి పలు సమావేశాల్ని నిర్వహించారు. అంతేకాకుండా కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం భారత్–పాక్‌ల మధ్య సాగిన అనధికార ట్రాక్–2 చర్చల్లో సైతం ఆయన భాగస్వామిగా ఉన్నారు. తాజాగా బుఖారి హత్య నేపథ్యంలో మిలటరీ ఆపరేషన్లను రంజాన్ తర్వాత కేంద్రం పునఃప్రారంభించే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కాగా, ఈ దాడిని తామే చేసినట్లు ఏ ఉగ్రసంస్థా ప్రకటించుకోలేదు. ఇది పిరికిపందల చర్య: రాజ్‌నాథ్ సీనియర్ జర్నలిస్ట్ బుఖారిని ఉగ్రవాదులు హత్య చేయడాన్ని పిరికిపందల చర్యగా హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. జమ్మూకశ్మీర్‌లో శాంతిస్థాపనకు, న్యాయం కోసం బుఖారి అవిశ్రాంతంగా శ్రమించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలిపారు. బుఖారి హత్యపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎడిటర్ గిల్డ్స్ ఆఫ్ ఇండియా బుఖారి హత్యను ఖండించింది. సీనియర్ జర్నలిస్ట్: శ్రీనగర్‌కు చెందిన షుజాత్ బుఖారి రైజింగ్ కశ్మీర్ అనే ఇంగ్లిష్ దినపత్రికతో పాటు బులంద్ కశ్మీర్ అనే ఉర్దూ పత్రికల్ని స్థాపించారు. వీటికి ఆయనే ఎడిటర్‌గానూ వ్యవహరిస్తున్నారు. 1997 నుంచి 2012 వరకూ కశ్మీర్లో హిందూ పత్రిక స్పెషల్ కరస్పాండెంట్‌గా పనిచేశారు. మనీలాలోని అటెనియో డీ మనీలా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో మాస్టర్స్ చేశారు. -
సాక్షి ఎడిటర్‌కు ‘మాదల’ పురస్కారం
-
‘ప్రజా ప్రస్థానం’ నుంచి ‘ప్రజాసంకల్పయాత్ర’ దాకా..!
సందర్భం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక వినూత్నమైన చారిత్రక పరిణామాలు మే నెలలోనే ప్రత్యేకించి పశ్చిమగోదావరి జిల్లాలోనే జరిగాయి. 15 ఏళ్ల క్రితం వైఎస్ రాజ శేఖర రెడ్డి తన ‘ప్రజా ప్రస్థానం’ చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురానికి పాదయాత్ర చేపట్టిన సందర్భంగా మే నెలలోనే 15వ తేది పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. ఇడుపులపాయ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్ఛాపురం వరకూ వైఎస్ తనయ వైఎస్ షర్మిల జరిపిన ‘మరో ప్రజా ప్రస్థానం’ కూడా 2,000 కిలోమీటర్ల పాదయాత్ర సాగిన తర్వాత మే నెలలోనే పశ్చిమగోదావరిలోకి ప్రవేశించింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘ప్రజాసంకల్పయాత్ర’ కూడా 2,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఈ నెల 14న ఏలూరులో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగుదేశం పాలనలో, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, వలసలు వెళ్లడం లాంటి ఒక బీభత్స సామాజిక వాతావరణం నేపథ్యంలో తన పాదయాత్రను కొనసాగించారు. ఆత్మహత్యలు చేసుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సువర్ణ పాలన సాధిస్తాం అధైర్యపడొద్దంటూ తన పాదయాత్రలో ఆయన ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో చీకటి ఒప్పందాలు చేసుకుని వైఎస్ కుటుంబంపై ప్రత్యేకించి వైఎస్ జగన్‌పై అనేక అక్రమ, అవినీతి కేసులు బనాయించి కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా 16 నెలలు జైలులో నిర్భంధించింది. ఎల్లోమీడియాగా పేరుపడిన పత్రికలు వైఎస్ కుటుంబంపై ప్రత్యేకించి వైఎస్ జగన్‌పై నీచ నికృష్ట్టమైన అవినీతి ఆరోపణలు చేస్తూ ఒక ప్రచార యుద్ధం లాంటిది చేపట్టారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ వైఎస్ షర్మిల మరో ‘ప్రజాప్రస్థానం’ చేపట్టారు. ఆమె తన 2,000 కిలోమీటర్ల పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోనే పూర్తి చేసుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సైతం పాదయాత్రలో భాగంగా మే నెలలోనే పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. ఇప్పుడు మే 14వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ ఒక చారిత్రక స్థూపం (పైలాన్)ను ఆవిష్కరించనున్నారు. చంద్రబాబు పరిపాలనకు వ్యతిరేకంగా లేదా బాబుతో కలగలసి ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంపై పాదయాత్రలు జరిగాయి. నేడు కూడాబాబు, కాంగ్రెస్ పార్టీ ఒకరకంగా బహిరంగ రహస్య ఒప్పందంతో పాలన సాగించడం జరుగుతోంది. కాంగ్రెస్, తెలుగుదేశం వైఎస్ జగన్‌కి వ్యతిరేకంగా ఒకరకంగా చెప్పాలంటే వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా చేతులు కలిపి పనిచేస్తున్నాయి. నేడు మండుటెండలో వైఎస్ జగన్ అకుంఠిత దీక్షతో జరుపుతున్న పాదయాత్రకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు జేజేలు పలుకుతున్నారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. కానీ వైఎస్ జగన్ బీజేపీతో లాలూచీ పడ్డాడు అంటూ ఎల్లో మీడియా, బాబు అనుచర వర్గం తీవ్ర ప్రచారం చేస్తున్నారు. మరోవైపు సినీ నటుడు పవన్ కల్యాణ్ కూడా జగన్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. బాబు కుట్రలు, కుతంత్రాలు, కపట నాటకాలతో ప్రజలను నమ్మించి మోసగించడంలో దిట్ట. ఆయన ఎన్టీ రామారావును మొదలుకుని వామ పక్షాలను, చివరకు బీజేపీని నమ్మించి, మోసగించి తన పని చేసుకోగల దిట్ట. ఆయనకు బిడియం, ఎగ్గు, సిగ్గులలో నమ్మకం లేదు. ఆయన హయాంలో ప్రజల కోసం చేపట్టిన పథకాలంటూ ఏవీ లేవు. నేడు రాష్ట్రంలో సేద్యపు నీటి రంగంలో అవినీతి, అక్రమాలు ఏరులై పారుతున్నాయి. రాజకీయ వ్యవస్థలను పోలీసు, రెవెన్యూ న్యాయ యంత్రాంగాన్ని తనదైన శైలిలో నిస్తేజపరిచి ప్రజాస్వామిక సూత్రాలకు తిలోదకాలు ఇచ్చి పరిపాలన కొనసాగిస్తున్నాడు. 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను ఇంకా అనేక మంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులను తన అవినీతి, అక్రమ పద్ధతుల ద్వారా కొనుగోలు చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తన అనుచర వర్గాన్ని రూపొందించారు. పాత్రికేయులకు నెలసరి జీతాలు ఇచ్చిన ముఖ్యమంత్రి బాబే! ఎన్నికలను తనకు అనుకూలంగా మలుచుకోగలనని తన వద్ద ఉన్న డబ్బు పోగేసి రెవెన్యూ యంత్రాంగం ద్వారా నెగ్గుకురాగలననే విశ్వాసంతో బాబు పాలన కొనసాగిస్తున్నారు. మరోవైపు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్ర ద్వారా లక్షలాది మంది ప్రజలను కలుస్తూ వందలాది బహిరంగ సభలను రాజకీయ పాఠశాలలుగా మార్చి రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరిస్తూ మరో ‘ప్రజాసంకల్పయాత్ర’ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు వైఎస్ జగన్ కల్పించిన సానుకూల రాజకీయ వాతావరణంతో విపరీతమైన ఆత్మవిశ్వాసంలోకి వెళ్లకుండా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను ప్రజల్లో ఎండగడుతూ ప్రజలకు చేరువ కావడానికి కృషి చేయాలి. ఆ రకంగా జగన్‌కు ప్రోత్సాహం అందించినవారవుతారు. - ఇమామ్ వ్యాసకర్త కదలిక సంపాదకులు మొబైల్ : 99899 04389 -
సీనియర్ ఎడిటర్ అనిల్ మల్నాడ్ ఇకలేరు
ప్రఖ్యాత ఎడిటర్ అనిల్ మల్నాడ్ (66) ఇకలేరు. కర్నాటకలోని మల్నాడులో పుట్టిన అనిల్ అసలు పేరు జీఆర్ దత్తాత్రేయ. సినిమాటోగ్రఫీ కోర్స్‌లో చేరాలనే ఆశయంతో 17వ ఏట మద్రాసులో అడుగుపెట్టారు దత్తాత్రేయ. సీటు దొరక్కపోవడంతో దర్శకత్వ శాఖలో చేరారు. ప్రముఖ దర్శకుడు బాపు తీసిన ‘సంపూర్ణ రామాయణం’ చిత్రానికి సహాయ దర్శకుడిగా చేరారు. మరోవైపు ఎడిటింగ్‌పైనా దృష్టి పెట్టారు. దత్తాత్రేయ పని తీరు నచ్చి తాను దర్శకత్వం వహించిన ‘వంశవృక్షం’ చిత్రం ద్వారా ఎడిటర్ని చేశారు బాపు. ఒక్క బాపూ దగ్గరే 22 సినిమాలకు దత్తాత్రేయ ఎడిటర్‌గా చేయడం విశేషం. అప్పుడే దర్శకుడు వంశీ చిత్రాలకూ చేయడం మొదలుపెట్టారు. వంశీ తెరకెక్కించిన ‘సితార’ ద్వారా ఉత్తమ ఎడిటర్‌గా దత్తాత్రేయ జాతీయ అవార్డు అందుకున్నారు. పలు నంది అవార్డులూ సొంతం చేసుకున్నారు. తెలుగులో కె. రాఘవేంద్రరావు, గీతాకృష్ణ వంటి పలు దర్శకుల చిత్రాలకూ, తమిళంలో ఆర్వీ ఉదయ్‌కుమార్, ఆర్.కె. సెల్వమణి తదితరుల చిత్రాలకూ పని చేశారు. తెలుగుతో పాటు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్.. ఇలా దాదాపు 9 భాషల్లో 200 చిత్రాలకుపైగా పని చేసిన ఘనత దత్తాత్రేయది. ఇన్ని భాషల్లో ఎడిటర్‌గా చేసిన అతి కొద్దిమందిలో దత్తాత్రేయ ఒకరు కావడం విశేషం. ఈయన పేరు అనిల్‌గా మారడానికి కారణం.. తమిళీయులు ‘దత్తాత్రేయ’ పేరుని సరిగ్గా ఉచ్ఛరించలేకపోవడమే. అక్కడివారు అనిల్ దత్ అని పిలిచేవారు. పుట్టిన ఊరు తన పేరులో ఉండాలనుకుని తన పేరుని ‘అనిల్ మల్నాడ్’గా మార్చుకున్నారు. గతేడాది డిసెంబర్ 4న అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. తలలో రక్తం గడ్డ కట్టడంతో శస్త్ర చికిత్స జరిగింది. అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వచ్చారు. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. అనిల్ మల్నాడ్‌కు భార్య శ్రీలక్ష్మీ, కొడుకు సూరజ్, కూతురు అఖిల ఉన్నారు. మంగళవారం ఉదయం చెన్నై, క్రోమ్‌పేటలోని శ్మశాన వాటికలో అనిల్ మల్నాడ్ అంత్యక్రియలు జరగనున్నాయి. -
జగన్.. పోరుబాట.. బాబు.. పూటకోమాట
రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం నాది. దేశంలోనే అత్యంత అనుభవజ్ఞుడిని... విజన్ ఉన్న నాయకుడిని... అని చెప్పుకొనే ముఖ్యమంత్రి చంద్రబాబు... ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల విషయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చెబుతున్న విషయాలు కరెక్టేనని అంగీకరించక తప్పలేదు. ఇన్నాళ్లు హోదా వల్ల ఒరిగేదేముందని ప్రశ్నించిన చంద్రబాబు... హోదా వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఒప్పుకునేలా జగన్ ఉద్యమాన్ని నడిపారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ దాన్ని సజీవంగా ఉంచారు. నాలుగేళ్ల నుంచి వైఎస్ జగన్ డిమాండ్ చేస్తున్న హోదా అవసరాన్ని చంద్రబాబు ఇప్పుడు గుర్తించారు. అంటే... విజన్ ఉన్న నాయకుడు ఎవరు? సమర్థుడు ఎవరు? రాష్ట్రంలో ప్రజల బాగోగులను గుర్తించి ముందుగానే ఆలోచించిన నాయకుడు ఎవరు? దీన్నిబట్టి సమర్థుడు, విజన్ ఉన్న నాయకుడు, శక్తివంతుడు... జగన్మోహన్రెడ్డి అని అంగీకరించినట్టే కదా! 2014 సాధారణ ఎన్నికల సమయం నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకహోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చెప్పారు? ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఏం నినదించారు?... ఒకసారి పరిశీలిద్దాం.... జగన్.. పోరుబాట 12.06.2014: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో రాష్ట్రానికి 20 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్. 05.12.2014: ప్రత్యేక హోదా సాధించని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ ధర్నాలు.. విశాఖలో పాల్గొన్న జగన్ 16.02.2015: లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఏపీకి తక్షణం ప్రత్యేక హోదా ప్రకటించాలని పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ 03.06.2015: ఏడాది గడిచినా సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదని వైఎస్ జగన్ రెండు రోజుల పాటు మంగళగిరిలో సమర దీక్ష చేపట్టారు. బాబు పాలనపై ప్రజా బ్యాలట్ నిర్వహించారు. 15.06.2015: ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వైఎస్ జగన్ వినతి పత్రం 10.08.2015: ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ఒకరోజు ధర్నా 29.08.2015: వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు మేరకు సంపూర్ణంగా రాష్ట్ర బంద్ 07.10.2015: గుంటూరులో ఏడు రోజుల దీక్ష ... ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ 07 నుంచి 13 వరకు జగన్ నిరవధిక నిరాహార దీక్ష. ప్రధాని మోదీ ఏపీకి రానున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా ఆకాంక్ష ఎంత బలీయంగా ఉందో చాటి చెప్పడానికి దీక్ష చేపడితే ప్రభుత్వం పోలీసుల ద్వారా భగ్నం చేసింది. 17.10.2015: జగన్ పిలుపుతో మూడు రోజుల పాటు (17 నుంచి 21 వరకు) పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు 10.05.2016: కలెక్టరేట్ల వద్ద ధర్నా... రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా.. కాకినాడ ధర్నాలో జగన్ పాల్గొన్నారు. 21.07.2016: రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ఏపీకి ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతు 23.07.2016: ఆంధ్రప్రదేశ్‌కు 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని కోరుతూ పార్లమెంట్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రైవేట్ బిల్లు ప్రతిపాదన 29.07.2016: ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం, టీడీపీ, బీజేపీ వైఖరికి నిరసనగా ఆగస్టు 2న రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపు 02.08.2016: ప్రత్యేక హోదాకు మద్దతుగా రాష్ట్ర బంద్ 08.08.2016: ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి జగన్, పార్టీ ఎంపీలు వినతిపత్రం 10.09.2016: ప్రత్యేక హోదాపై జైట్లీ వైఖరి, చంద్రబాబు తీరుకు నిరసనగా రాష్ట్ర బంద్ 10.09.2016: శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా ఆవశ్యకతను చాటిచెప్పిన జగన్, ఇతర నేతలు 26.01.2017: ప్రత్యేక హోదాకు మద్దతుగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనడానికి వైఎస్ జగన్ వెళ్తుండగా ప్రభుత్వం విశాఖలో ఎయిర్‌పోర్టులోనే అడ్డుకుంది. 27.01.2017: ప్రత్యేక హోదాకోసం విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని అప్రజాస్వామికంగా ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించిన టీడీపీ ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్సీపీ శ్రేణుల నిరసనలు 10.03.2017:ప్రత్యేక హోదాను 15ఏళ్లపాటు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. 28.03.2017: పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని లోక్‌సభలో ఎన్ఐటీ, ఎన్ఈఆర్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పార్టీ ఎంపీలు కేంద్రాన్ని కోరారు. 30.03.2017: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. 06.04.2017: జీఎస్టీ కోసం 13, 14వ ఆర్థిక సంఘం సూచనలను పక్కన పెట్టి బిల్లును రూపొందించినట్టే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో జీఎస్టీ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 10.05.2017:ప్రత్యేక హోదా, అగ్రిగోల్డ్, రాష్ట్రంలో అవినీతి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీడీపీ ప్రభుత్వ విధానాలు, మిర్చికి మద్దతు ధర తదితర అంశాలపై మోదీని కలిసి వినతిపత్రం సమర్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 16.07.2017: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డిలు కేంద్రాన్ని కోరారు. 20.11.2017: హోదా సాధనకు విపక్షాలు చేపట్టిన ఛలో అసెంబ్లీ ముట్టడికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు. వైఎస్సార్సీపీ నేతలతో సహా విపక్షాలు, ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేసిన పోలీసులు 10.12.2017: వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన అనంతపురం జిల్లా కూడేరులో జరిగిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, పోలవరం, విశాఖ రైల్వే జోన్‌తోపాటు రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీలన్నింటిని నెరవేర్చేలా కేంద్రాన్ని డిమాండ్ చేయాలని నిర్ణయించారు. 01.03.2018: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్సీపీ ధర్నాలు నిర్వహించింది. 03.03.2018:ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఆందోళనకు బయలుదేరిన వైఎస్సార్సీపీ శ్రేణులకు జెండా ఊపి పంపిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 05.03.2018:ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ ఢిల్లీలో సంసద్‌మార్గ్‌లో ధర్నా నిర్వహించిన వైఎస్సార్సీపీ శ్రేణులు బాబు.. పూటకోమాట 29.04.2014: మనకు ప్రత్యేక హోదా కావాలి. ఐదు సంవత్సరాలే ఇచ్చారు. నేను నరేంద్ర మోదిగారిని కోరుతున్నా∙15 సంవత్సరాలు ఇవ్వండి. తిరుపతిలో ఎన్డీఏ విజయ శంఖారావం సభలో చంద్రబాబు. 02.06.2015: ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందదు. విజయవాడలో జరిగిన నవనిర్మాణ దీక్షలో ముఖ్యమంత్రి. 12.08.2015: హోదాతోనే అన్నీ రావు... విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో.. 13.08.2015: ప్రత్యేక హోదా ఒక్కటే చాలదు.. అదే సరిపోదు.. దాంతోనే అన్నీ సరిపోవు... విజయవాడలో స్మార్ట్ విలేజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ. 25.08.2015: ప్రత్యేక సంజీవని కాదు... న్యూఢిల్లీలో ప్రధాని మోదీ భేటీ అనంతరం విలేకరుల సమావేశంలో.. 23.10.2015: ప్రత్యేక హోదా అనబోయి ప్యాకేజీ అన్నా... విజయవాడలో జరిగిన ప్రెస్మీట్లో... 26.11.2015: కేంద్రంపై ఆశలు లేనట్టే... విజయవాడలో గణతంత్ర వేడుకల అనంతరం ఎమ్మెల్యేల భేటీలో... 18.05.2016: హోదాతో ఏం వస్తుంది? హోదా ఇచ్చి నిధులు ఇవ్వక పోతే ఏం లాభం? ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి? 19.05.2016: హోదాతోనే అంతా కాదు. హోదా సంజీవని కాదు. అందుకే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధానికి విన్నవించా. 08.09.2016: ప్రత్యేక హోదా వీలుకాదు. అదే స్ఫూర్తితో సమాన ప్రయోజనాలు ఇస్తామని చెబుతుంటే వాటిని తీసుకోకుండా ఏం చేద్దాం? 09.09.2016: ప్రత్యేక హోదా ఇవ్వలేం. కానీ దాని వల్ల కలిగే ప్రయోజనాలను లెక్కించి ఆ మేరకు నిధులు ఇస్తామని అరుణ్‌జైట్లీ చెప్పారు. వారు ఇచ్చింది తీసుకుంటాం. అదే సమయంలో మనకు రావాల్సింది అడుగుతాం. 10.09.2016: హోదాకు సమానంగా కేంద్రం ఇస్తామంటున్న నిధులు తీసుకోవద్దా? పోలవరం వద్దా? దెబ్బలు తగిలిన చోటే ప్రతిపక్షం కారం చల్లుతోంది. ప్రతిపక్షం చేస్తున్న బంద్‌కు సహకరించవద్దని ప్రజలను కోరుతున్నా. 11.09.2016: హోదా వస్తే ఏం వస్తుంది? ప్యాకేజీ వద్దంటే అభివద్ధి పనులకు ఆటంకం.. కేంద్రం చెప్పినదానికన్నా అదనంగా ఏమొస్తాయో చెప్పండి. హోదా ఇచ్చినా ఈశాన్య రాష్ట్రాలలో అభివృద్ధి లేదు. 16.09.2016: హోదాతో పరిశ్రమలు రావు. పారిశ్రామిక రాయితీలకు హోదాకు సంబంధం లేదు. 18.09.2016: ప్రత్యేక హోదాతో ప్రయోజనం సున్నా. దానివల్ల పారిశ్రామిక రాయితీలు రావు. వస్తాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధం. 23.09.2016:హోదా కన్నా మెరుగైన ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ప్యాకేజీపై విస్తృత ప్రచారం చేయండి. 26.09.2016: హోదా అంటే జైలుకే... విద్యార్థుల తల్లిదండ్రులకు చంద్రబాబు వార్నింగ్... బాపట్లలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో... 05.10.2016: కేంద్రం నుంచి పది రూపాయలు ఎక్కువే రాబట్టాలని చూస్తాను తప్ప రాష్ట్రప్రయోజనాల విషయంలో రాజీలేదు. ప్రత్యేక హోదాతో వచ్చేవన్నీ ఇస్తున్నందుకే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నాం. 29.10.2016: ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు, పోలవరం ప్రాజెక్టుని సాకారం చేస్తున్నందుకు జైట్లీకి కృతజ్ఞతలు. 13.11.2016: హోదాలో పరిశ్రమలకు రాయితీలు లేవు.. ప్రత్యేక ప్యాకేజీపై విమర్శలు తగవు. రాష్ట్రప్రయోజనాలే ముఖ్యం. రాజీపడను 24.01.2017: జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు ముడిపెట్టి పోరాటం చేయమనడంలో అర్ధంలేదు. 26.01.2017: మనమే ఎక్కువ సాధించాం.. ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా? ఆధారాలుంటే చెప్పండి. ప్రత్యేక హోదాతో సమానమైనవన్నీ వచ్చాయి. హోదాతో వచ్చే లాభాలేమిటో చెప్పండి. లాభాలు వస్తాయని ఏ జీఓలో ఉందో చూపండి. 04.02.2017: హోదా వేస్ట్. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు. 16.02.2017: ప్రత్యేకహోదాతో ప్రయోజనం సున్నా. హోదాతో వచ్చేవన్నీ ప్యాకేజీలో ఇస్తామన్నారు. 16.03.2017: సయోధ్యతోనే సాధ్యమైంది. సంప్రదింపుల ఫలితంగానే ప్రత్యేకసాయానికి కేంద్ర ఆమోదం. రావాల్సినవన్నీ సాధించుకుంటున్నాం. 17.03.2017: మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు.. ప్యాకేజీకి అధికారికంగా ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు. ఈమేరకు అసెంబ్లీ తీర్మానం చేస్తున్నాం. 06.06.2017: అదనంగా వచ్చేదేంటో.. ప్యాకేజీ కంటే ప్రత్యేక హోదా వల్ల జరిగే మేళ్లేంటి? ప్యాకేజీకి ప్రత్యేక హోదాకు వ్యత్యాసం ఏంటి? ప్యాకేజీలో లేనిదేంటి? నేను దేశంలోనే సీనియర్ నేతను. నేను ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. 27.02.2018: ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఏమొస్తాయి. హోదాతో రాయితీలు వస్తాయని ఏ జీఓలో ఉందో చూపించమంటే చూపలేకపోతున్నారు. హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు వచ్చేస్తాయని కొందరు మభ్య పెడుతున్నారు. 02.03.2018: టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం... రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని తెలుగుదేశం పార్టీ ఎక్కడా, ఎప్పుడూ అనలేదు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అడ్డంకులు ఉన్నాయని కేంద్రం చెప్పడం వల్లే ప్రత్యేక సాయానికి అంగీకరించాం. 06.03.2018: టీడీపీ శాసనసభాపక్ష సమావేశం... రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నదే మన డిమాండ్? ఎవరూ ప్రత్యేక ప్యాకేజీ అనే ప్రస్తావన కూడా తేవద్దు. ప్రత్యేక హోదా గురించే అందరూ మాట్లాడాలి. 07.03.2018: ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని అరుణ్ జైట్లీ అవమానకరంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా ఎవరికీ ఇవ్వడంలేదని, అందులో ఉన్న అంశాలన్నింటినీ ప్రత్యేక సాయం కింద ఇస్తామని అప్పుడు ప్రకటించారు. హోదా సాధనకు యువభేరీలు.. 15.09.2015: తిరుపతి 22.09.2015: విశాఖపట్నం 27.01.2015: కాకినాడ 02.02.2016: శ్రీకాకుళం 04.08.2016: నెల్లూరు 22.09.2016: ఏలూరు 25.10.2016: కర్నూలు 19.12.2016: విజయనగరం 16.02.2017: గుంటూరు 10.10.2017: అనంతపురం రాష్ట్రపతితో భేటీ 09.06.2015: వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రతినిధివర్గం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యింది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విధంగా చూడాలని విజ్ఞప్తి చేసింది. 23.02.2016: ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసిన వైఎస్ జగన్.. ప్రత్యేక హోదాతో పాటు విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేలా చూడాలని వినతి ప్రధానిని కలిసిన జగన్ 19.05.2014: ప్రత్యేక హోదాతో పాటు విభజన బిల్లులోని హామీలు నెరవేర్చాలని వైఎస్ జగన్మోహ¯న్ రెడ్డి.. కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలోని గుజరాత్ భవన్లో కలిసి విజ్ఞప్తి చేశారు. 30.03.2015:ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగ¯న్ నేతృత్వంలోని ప్రతినిధి వర్గం విభజన హామీలను నెరవేర్చాలని వినతి పత్రం కేంద్ర మంత్రులకు వినతి 11.06.2015:ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని జగన్, పార్టీ నేతలు కలిసి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 27.04.2016:ఢిల్లీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి జగన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం వినతిపత్రం. - ఇమామ్, ఎడిటర్, కదలిక -
నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ కన్నుమూత
చెన్నై: ప్రముఖ జర్నలిస్ట్, నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ ఇన్ చీఫ్ నీలబ్ మిశ్రా(57) శనివారం కన్నుమూశారు. నీలబ్ కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారని నేషనల్ హెరాల్డ్ వెబ్సైట్ వెల్లడించింది. నీలబ్ అంత్యక్రియలు నుంగంబాకంలో నిర్వహించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. నీలబ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. నీలబ్‌ను ‘ఎడిటర్స్ ఎడిటర్’గా సంబోధిస్తూ ట్వీట్ చేశారు. 2016లో నేషనల్ హెరాల్డ్‌ను పునఃప్రారంభించడంలో నీలబ్ కీలక పాత్ర పోషించారు. జైపూర్‌లో ‘న్యూస్‌టైమ్’కు కరస్పాండెంట్‌గా పనిచేశారు. ‘ఔట్లుక్ హిందీ’కి ఎడిటర్‌గా పనిచేశారు. -
వన్ ప్లస్ 5టి కొత్త ఎడిషన్
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లోన్ తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌పోన్ వన్ ప్లోస్ 5 టిలో కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. లిమిటెడ్ ఎడిషన్‌గా వన్ ప్లస్ 5టీ "లావా రెడ్" ఎడిషన్ ఇండియన్ మార్కెట్లో గురువారం విడుదల చేసింది. ఈ డివైస్ రిజిస్ట్రేషన్లు నేటినుంచి అమెజాన్ లో ప్రారంభమైనాయని, జనవరి 20వ తేదీ మధ్యాహ్నంనుంచి విక్రయానికి అందుబాటులో ఉంటాయని ప్రకటించింది అయితే 6జీబీర్యామ్, 64 జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లభిస్తున్న ఒరిజినల్ వన్‌ప్లస్ 5 టీ లా కుండా 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులో ఉంచినట్టు సంస్థ తెలిపింది. దీని ధరను రూ .37,999 గా నిర్ణయించింది. అందమైన డిజైన్, పవర్ఫుల్ ఫీచర్స్లకై ఎదురుచూస్తున్న తమ వినియోగదారులకు కోసం మొట్టమొదటి 'లావా రెడ్' ఎడిషన్‌తో 2018నూతన సంవత్సరం ప్రారంభించడం సంతోషంగా ఉందని వన్ ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 6అంగుళాల ఫుల్ అమోలెడ్ డిస్ ప్లే,16ఎంపీ + 20ఎంపీ డ్యూయల్ రియర్‌కెమెరా, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835 చిప్సెట్ ,డాష్ ఛార్జ్ తదితర ఫీచర్లను ఈ డివైస్‌లో పొందుపర్చినట్టు చెప్పారు. Presenting the Powerfully Radiant OnePlus 5T Lava Red Learn more 👉 https://t.co/RsH6cbwCeK pic.twitter.com/nLcf6JYqCW — OnePlus India (@OnePlus_IN) January 11, 2018 -
ఫోర్డ్ ‘ఫిగో’, ‘యాస్పైర్’లలో స్పోర్ట్స్ ఎడిషన్లు
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోర్డ్ ఇండియా’ తాజాగా తన హ్యాచ్‌బ్యాక్ ‘ఫిగో’, కాంపాక్ట్ సెడాన్ ‘యాస్పైర్’లలో కొత్త స్పోర్ట్స్ ఎడిషన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఫిగో స్పోర్ట్స్ ఎడిషన్ డీజిల్ వేరియంట్ ధర రూ.7.21 లక్షలుగా, పెట్రోల్ వేరియంట్ ధర రూ.6.31 లక్షలుగా ఉందని కంపెనీ తెలిపింది. ఇక యాస్పైర్ స్పోర్ట్స్ ఎడిషన్ (1.5 లీటర్ డీజిల్ టైటానియన్ వెర్షన్) ధరను రూ.7.6 లక్షలుగా, 1.2 లీటర్ పెట్రోల్ టైటానియమ్ వెర్షన్ యాస్పైర్ స్పోర్ట్స్ ఎడిషన్ ధరను రూ.6.5 లక్షలుగా నిర్ణయించామని పేర్కొంది. కాగా ఈ ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. కస్టమర్లకు నచ్చే ప్రొడక్టులను తీసుకువస్తూ, పోర్ట్‌ఫోలియోను విస్తరించుకుంటూ, మార్కెట్లో తమ వాటాను మరింత పదిలం చేసుకుంటామని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు. కొత్త వెర్షన్లలో 15 అంగుళాల అలాయ్ వీల్స్, డ్యూయెల్ ఫ్రంట్ డ్రైవర్ అండ్ ప్యాసెంజర్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. -
తప్పులు సరిదిద్దుకునే అవకాశం
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్లలో విద్యార్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ తదితర వాటిల్లో తప్పులను సరిదిద్దుకునేందకు చివరి అవకాశం కల్పించినట్లు డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. బోర్డు నుంచి వచ్చిన కంప్యూటర్ ఎన్ఆర్లో తప్పులు సరిచేసి సంబంధిత పాఠశాల హెచ్ఎం సంతకం చేయించి వాటిని ఈ నెల 28లోగా ఎస్. వరలక్ష్మి, డైరెక్టర్ ఆఫ్ ప్రభుత్వ పరీక్షలు, చాపెల్‌రోడ్డు, నాంపల్లి, హైదరాబాద్ చిరునామాకు పంపాలని సూచించారు. ఫొటోలు మార్పులు పడిన వారు డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
రెండో ప్రపంచ ప్రేమ
ఎడిత్ స్టెయినర్ వయసు 92 ఏళ్లు. ఆమెది హంగేరి. జాన్ మ్యాకీ వయసు 96 ఏళ్లు. అతడిది స్కాట్లాండ్. మొన్న ఈ దంపతులు 71వ వాలెంటైన్స్ డేని జరుపుకున్నారు! వీళ్లదొక అపురూపమైన ప్రేమకథ. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు జర్మనీలోని ఔష్విట్జ్ క్యాంప్‌లో వందలమందిని నిర్బంధించారు. వారిలో ఎడిత్ కూడా ఒకరు. అప్పుడు ఆమె వయసు 20 ఏళ్లు. యుద్ధం అయ్యాక నిర్బంధ శిబిరాల్లో ఉన్నవాళ్లను విడిపించే క్రమంలో ఔష్విట్జ్ శిబిరానికి వెళ్లిన సైనికులలో జాన్ మ్యాకీ కూడా ఉన్నాడు. అప్పుడు అతడి వయసు 23. ఆ రోజు ఎడిత్, జాన్ ఒకర్నొకరు పరిశీలనగా చూసుకోలేదు. 'బతుకు జీవుడా' అని ఎడిత్ బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుంది. జాన్ మ్యాకీ మిగతా శిబిరాల్లోని వారికి విముక్తి కల్పించే పనిలో పడిపోయాడు. తర్వాత కొన్నాళ్లకు ఇద్దరూ ఒక డాన్స్ హాల్లో కలుసుకున్నారు. 'ఆ రోజు థ్యాంక్స్ చెప్పలేకపోయాను' అంది ఎడిత్. 'ఇవాళ గానీ చెబుతారా ఏంటీ?' అని భయం నటించాడు జాన్. అమ్మాయి నవ్వింది. ఆ నవ్వు అబ్బాయికి నచ్చింది. ప్రేమ మొదలైంది. యుద్ధం ముగియగానే 1946లో పెళ్లయింది. వధువును స్లాట్లాండ్ తీసుకెళ్లాడు వరుడు. అప్పట్నుంచీ ఏటా వాలెంటైన్స్ డేని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జంట డుండీ సిటీలోని కేర్ హోమ్‌లో ఉంటోంది. ఎడిత్, జాన్ మ్యాకీ -
ట్విట్టర్ యూజర్లకు ఆ ఫీచర్ వచ్చేస్తోంది!
సామాజిక మాధ్యమిక సాధనాల్లో ఒకటైన ట్విట్టర్ తన వినియోగదారులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. యూజర్లు తమ ట్వీట్లను ఎడిట్ చేసుకునేలా అవకాశం కల్పించేందుకు సన్నద్ధమవుతోంది. యూజర్లకు అనుకూలంగా ట్విట్టర్‌ను మార్చాలని భావించిన కంపెనీ సీఈవో జాక్ డోర్సే ప్రజల అభిప్రాయాల కోసం గురువారం ఓ ట్వీట్ చేశారు. 2017 ట్విట్టర్లో మెరుగుపరచదలిచిన లేదా సృష్టించదగిన అత్యంత ముఖ్యమైన విషయమేమిటని ట్విట్టర్లో కోరారు. దీనికి సమాధానంగా చాలామంది యూజర్లు ఎడిటింగ్ ట్వీట్స్ ఫీచర్‌ను అందుబాటులోకి తేవాలని కోరారు. అదేవిధంగా ట్వీట్లను ఆర్గనైజ్ చేసుకునేలా అవకాశం కల్పించాలన్నారు. ప్రజాభిప్రాయానికి అనుకూలంగా త్వరలోనే ట్వీట్లను ఎడిట్ చేసుకునే ఫీచర్‌ను తీసుకొస్తామని డోర్సే పేర్కొన్నారు. ఒకే ట్వీట్‌పైనే వివిధ వెర్షన్లలో యూజర్లు సమీక్షించాల్సినవసరం కూడా ఉందన్నారు. అదేవిధంగా ట్విట్టర్లో వచ్చే అంశాలపై కూడా పారదర్శకత తీసుకురావడానికి అత్యధిక ప్రాముఖ్యం ఇవ్వాలని యూజర్లు కోరారు. సోషల్ నెట్వర్కింగ్లో ఎక్కువగా పాపులర్ అయిన ట్విట్టర్ ఎన్నికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన యూజర్ల వృద్ధి రేటును మాత్రం పెంచుకోలేకపోతోంది. ప్రజల ట్వీట్ల మేరకు ట్విట్టర్‌ను రీడిజైన్ చేయాలని భావిస్తోంది. 140 క్యారెక్టర్ లిమిట్ నుంచి వీడియోలను, ఫోటోలను ట్విట్టర్ వైదొలగించింది. సైట్‌పై లైవ్ 360 డిగ్రీ వీడియోలను నిన్ననే ట్విట్టర్ ఆవిష్కరించింది. Following in the footsteps of Brian Chesky: what's the most important thing you want to see Twitter improve or create in 2017? #Twitter2017 @jack Ability to edit tweets and organize Twitter lists. — Anthony Quintano (@AnthonyQuintano) December 29, 2016 -
వావ్.. వాట్సప్‌లో మరిన్ని ఫీచర్లు!
వాట్సప్‌లో ఒక మెసేజి పంపిన తర్వాత అందులో ఏమైనా పొరపాటు ఉంటే.. అరెరె అంటూ నాలుక కరుచుకుని మళ్లీ దాన్ని సవరిస్తూ కొత్త మెసేజి పంపాల్సిందే తప్ప పాత దాన్ని ఏమీ చేయలేం. కానీ అది గతమే. ఇందులో కొత్తగా ప్రవేశపెడుతున్న ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే. ఒకసారి పంపిన మెసేజిని 'అన్ సెండ్' చేయడం, లేదా దాన్ని ఎడిట్ చేయడం కూడా సాధ్యం అవుతుందట. ఇంతకుముందు మనం ఒక మెసేజి పొరపాటున పంపి, దాన్ని డిలీట్ చేసినా.. అది కేవలం మన ఫోన్లో మాత్రమే డిలీట్ అవుతుంది తప్ప అవతలి వాళ్ల ఫోన్లో అలాగే ఉండిపోతుంది. కానీ ఇప్పుడు వాట్సప్ కొత్తగా తేబోతున్న ఫీచర్ పుణ్యమాని అవతలి వాళ్ల ఫోన్లోంచి కూడా అది పోతుందని చెబుతున్నారు. వాబీటాఇన్ఫో అనే సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. వాట్సప్ బీటా వెర్షన్లో కొత్తగా రివోక్ అనే బటన్ ఉంటుందని, దాన్ని ట్యాప్ చేస్తే పంపిన మెసేజ్ కూడా పోతుందని అంటున్నారు. కేవలం మెసేజ్‌లు మాత్రమే కాదు.. పొరపాటున పంపిన ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు.. ఇలా ఏవైనా కూడా అలాగే తీసేయొచ్చని వివరించారు. ప్రస్తుతానికి ఇది అందరికీ అందుబాటులో లేదు గానీ, త్వరలోనే వచ్చేస్తుందని హామీ ఇస్తున్నారు. ఇంతకుముందు గత సంవత్సరం నుంచి జీమెయిల్ కూడా ఇలాంటి ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పొరపాటున ఒక మెయిల్ పంపినా, దాన్ని కావాలంటే అన్డూ చేయొచ్చు. అలా చేస్తే, అవతలివాళ్ల ఇన్‌బాక్స్ లోంచి కూడా అది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు వాట్సప్‌లో ఇది వస్తే.. అందులో రెండో అతిపెద్ద అప్‌గ్రేడ్ అవుతుంది. ఇంతకుముందు ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండు వెర్షన్ల కోసం వీడియో కాలింగ్ సదుపాయాన్ని వాట్సప్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది భారతదేశం సహా 180 దేశాల్లో వచ్చింది. ఆండ్రాయిడ్ పాతవెర్షన్లు సహా ఐఫోన్ పాత వెర్షన్లలోను, కొన్ని విండోస్ ఫోన్లలోను వాట్సప్ పనిచేయదంటూ ఒక బాంబు కూడా పేల్చిన సంగతి తెలిసిందే. -
ఆల్టో ఎంఎస్ ధోని ఎడిషన్ ప్రారంభం
సాక్షి, రాజమహేంద్రవరం : యువతను ఆకట్టుకునే విధంగా ఎంఎస్ ధోని ఎడిషన్ పేరుతో రూపొందించిన ఆలో్ట–800, ఆలో్టకే10 వాహనాలు ఎస్బీ మోటార్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. ‘సాక్షి’ మెగా ఆటో షోలో ఈ వాహనాలను రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్, మేయర్ పంతం రజనీ శేషసాయి మార్కెట్లోకి విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న మారుతి ఆల్టో ఈ ఎడిషన్ద్వారా యువతను కూడా ఆకట్టుకుంటుందని అభిలషించారు. ఎస్బీ మోటార్స్ జీఎం ఎంవీఎస్ఎస్ఆర్ గుప్తా మాట్లాడుతూ ధరలో మార్పులేకుండా ఎంఎస్ ధోని సంతకంతో కూడిన సీటు కవర్లు, ఆకట్టుకునేలా గ్రాఫిక్ స్టిక్కర్లతో ఈ వాహనాలు ఉంటాయన్నారు. పెట్రోల్, సీఎన్జీ వేరియేషన్లో లభించే ఈ వాహనాలు 24 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయని చెప్పారు. రెడ్, బ్లూ కలర్లలో లభిస్తాయన్నారు. -
ఇక ఆ మెసేజ్ లను ఎడిట్ చేసుకోవచ్చట
100 కోట్ల యాక్టివ్ యూజర్లున్న వాట్సాప్ గాని, దాన్ని ప్రత్యర్థి స్థానంలో ఉన్న టెలిగ్రాం కు గాని ఇప్పటివరకూ పంపించిన మెసేజ్ లను ఎడిట్ చేసుకునే సౌకర్యం అందుబాటులో లేదు. అయితే ఎలాగైనా వాట్సాప్ ను అధిగమించి యూజర్లను ఆకట్టుకోవాలని టెలిగ్రాం నిర్ణయించుకుంది. ఇప్పటివరకూ అందుబాటులో లేని మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్ ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. నెలకు 1,000లక్షల యూజర్లున్న టెలిగ్రాం, దాన్ని యూజర్లకి మెసేజ్ లను పంపించిన తర్వాత దానిలో ఏమైనా తప్పులో దొర్లితే ఎడిట్ చేసుకునే సౌకర్యం నేటి నుంచి కల్పించనున్నట్టు పేర్కొంది. అన్నీ టెలిగ్రాం చాట్స్ గ్రూప్స్, వన్ టూ వన్ సంభాషణల్లో మెసేజ్ లకు ఈ ఎడిటింగ్ ఆప్షన్ ను అందిస్తున్నట్టు తన బ్లాగ్ లో పేర్కొంది. పంపించిన మెసేజ్ ను ఎడిట్ చేయాలనుకున్నప్పుడు మెసేజ్ ను అలాగే హోల్డ్ చేసి పట్టుకుని ఎడిట్ ను ప్రెస్ చేయాలి. ఒకవేళ డెస్క్ టాప్ లో టెలిగ్రాం వాడుతున్నప్పుడు, పైన యారో బటన్ ను ప్రెస్ చేసి, చివరి మెసేజ్ ను ఎడిట్ చేసుకోవచ్చని తెలిపింది. నెలకు 1,000లక్షల యాక్లివ్ యూజర్లను టెలిగ్రాం కలిగిఉందని కంపెనీ ఇటీవలే ప్రకటించింది. 3,50,000మంది కొత్త యూజర్లు ప్రతిరోజు టెలిగ్రాంలో చేరుతున్నారని తెలిపింది. రోజుకి 1500కోట్ల మెసేజ్ ల సంభాషణను టెలిగ్రాం కలిగి ఉంది. ఈ కొత్త ఫీచర్లతో టెలిగ్రాంకు యూజర్ల సంఖ్య పెరుగుతుందని కంపెనీ ఆశిస్తోంది. -
సర్కారీ లేబుళ్లు
జీవన కాలమ్ పదిహేను సంవత్సరాల కిందట రాసిన ‘సాయంకాల మైంది’ నవలలో కథానాయ కుడికి విదేశాలలో ఉద్యోగానికి ఆహ్వానం వస్తుంది. ఛాంద సుడైన తండ్రి ‘నా కొడుకే ఎందుకు వెళ్లాలి?’ అని వాపో తాడు. అతనికి అవకాశం కల్పించిన అమెరికన్ సంస్థ ప్రతినిధి ఎడిత్ కామెరాన్ సమాధానం: ‘‘మీ దేశంలో చదువులకీ, అర్హతకీ, సామ ర్థ్యానికీ ‘కులాల’ గుర్తులు పెట్టుకున్నారు. మేము విజ యానికీ, వినియోగానికీ గుర్తులు పెట్టుకున్నాం. మీ పద్మభూషణ్‌లూ, భారతరత్నలూ జీవితం ఆఖరి దశలో ఉన్నవారిని సత్కరించి సంబరపడే సెంటిమెంటల్ గుర్తులు. మా దేశంలో ప్రతియేటా నోబెల్ బహు మతులు పుచ్చుకునే యువరక్తం కావాలి. మీరు ముసలి వాళ్లని గౌరవించి సాంప్రదాయాన్ని నిలబెడుతున్నామని చంకలు గుద్దుకుంటారు. మేం యువకుల సామర్థ్యాన్ని గుర్తుపట్టి, చేతులు సాచి వాళ్లని మా వైపు లాక్కుంటాం’’. మన పద్మభూషణ్‌లూ, భారతరత్నలూ గొప్పవాళ్లే. సందేహం లేదు. మొన్న దిలీప్‌కుమార్‌కి ఆయన 93వ యేట పద్మవిభూషణ్‌ని ఆయన ఇంటికి వెళ్లి ఇచ్చి వచ్చారు. ఆయన గౌరవాన్ని అందుకోలేని, సరిగా నిల బడనైనా నిలబడలేని స్థితిలో ఉన్నారు. నిన్నకాక మొన్న దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం 78 ఏళ్ల మనోజ్ కుమార్‌కి ప్రకటించారు. ‘నేను ఆనందపడుతూనే ఆశ్చర్యపోయాను’’ అన్నారు. ఈ తరానికి - అప్పు డప్పుడు టీవీల పుణ్యమా అంటూ తప్ప - వారి వైభవం తెలియదు. 19వ యేట నుంచీ సంగీత సాధన చేస్తూ కీర్తి శిఖరాలను అధిరోహించిన అద్భుత గాయకుడు భీమ్ సేన్ జోషీకి 2009లో ఆయన 87వ యేట భారతరత్న అయిన రోజుల్లో దాదాపు మూలనపడిన పరిస్థితి. ఆ గౌరవం ఏమిటో, దాని స్థాయి ఏమిటో ఎరిగే స్థితిలో లేడు. ఫిబ్రవరి 16, 2009న నేనొక కాలమ్ రాశాను ‘జాతి గర్వించే ప్రమాదం’ అని. ఈ వ్యంగ్యాస్త్రాన్ని యథాతథంగా ఇప్పుడు చదివినా సుఖంగా ఉంటుంది. అది కేవలం కల్పితం. ఆయన మనుమరాలు పరుగున వచ్చి ఈ శుభవార్తని తాతకి చెప్పింది. ఆయన తలమీద చుండ్రుని గోక్కుంటున్నాడు. ‘‘నీకు ఢిల్లీలో గొప్ప బహుమతి వచ్చింది తాతయ్య’’ ‘‘ఏం వచ్చింది?’’ ‘‘గొప్ప గౌరవం’’ ‘‘ఇప్పుడెందుకొచ్చింది?’’ ‘‘నువ్వు గొప్పవాడివి కనుక’’ ‘‘అని ఎవరన్నారు?’’ ‘‘నువ్వు బాగా పాడతావని’’ ‘‘ఇప్పుడు గొంతు పోయింది కదా? అప్పుడు విన్నవాళ్లు ఢిల్లీలో ఉన్నారా?’’ ‘‘ఎవరో చెప్పి ఉంటారు’’ ‘‘చెప్పుడు మాటలు వినకూడదుకదా? ఈ చుండ్రు ప్రాణం తీస్తోంది’’ ఇలా సాగుతుంది. గొప్ప గౌరవానికి రెండు ప్రయోజనాలు. కళా కారుడికి ప్రోత్సాహం. మరింత గొప్ప కృషికి ఉత్సాహం. ఈ ప్రపంచంలోనే గొప్ప పురస్కారం - నోబెల్ బహుమతి సెంటిమెంట్‌గా వీపు తట్టడం కాదు. ప్రపంచ ప్రఖ్యాత నవలా రచయిత్రి పెరల్ బక్కి నోబెల్ బహుమతి 46వ యేట ఇచ్చారు. తర్వాత 34 సంవ త్సరాలు రచనలు చేసింది. సర్ సి.వి.రామన్‌కి 42వ యేట ఇచ్చారు. మరో 46 సంవత్సరాలు శాస్త్ర పరి శోధనలు జరిపారు. వారి ప్రపంచ ప్రఖ్యాత ‘రామన్ ఎఫెక్ట్’ ఆ తర్వాతిదే. ఆయనకి మన దేశం భారతరత్న 66వ యేట ఇచ్చింది! రవీంద్రునికి నోబెల్ బహుమతి 52వ యేట ఇచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రఖ్యాత క్రికెట్ ఆటగాడు గార్ఫీల్డ్ సోబర్స్‌కి 39వ యేట ‘సర్’ గౌర వాన్ని ఇచ్చింది. ఇప్పుడాయన వయసు 79. జాతి తరఫున ఒక కళాకారుడికి అర్పించే సత్కారం అతనికి మరింత స్ఫూర్తినీ, జాతికి ఆయన అందించగల కృషికి మరింత ఉత్సాహాన్నీ ఇవ్వగలగాలి. ప్రతియేటా మనం ఒడిలిపోయి, ఆ సత్కారం ఏమిటోకూడా గుర్తు పట్టలేని ముసిలి ఒగ్గులను వెదుకుతాం. ఎందుకు? మన పెద్దల్ని మనం మరిచిపోలేదని చంకలు గుద్దు కోవడానికి. మన పురస్కారాలు గొప్పతనాన్ని గుర్తు పట్టామని చెప్పుకోడానికి ఆలస్యం అంటించిన లేబుళ్లు. మన అభిరుచిని చాటుకోడానికి సిద్ధం చేసుకున్న సాకులు. నాదయోగి నేదునూరి కృష్ణమూర్తి గారికి బతి కుండగా (87) పద్మభూషణ్ గౌరవాన్ని ఇవ్వలేదు. ఒక గుమ్మడి, ఎస్వీ రంగారావు, పీబీ శ్రీనివాస్‌లకు (82) ఈ పురస్కారాలు దగ్గరగానయినా రాలేదు. 2009లో రాసిన కాలమ్ ఆఖరి వ్యాఖ్యాలు ఇక్కడ మళ్లీ ఉటంకించాలనిపిస్తోంది. భీమ్సేన్ జోషీ: ఏమిటో సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టపెడుతున్నారు. ఆ పాటా అవీ పోయి ఎన్నో ఏళ్లయింది. దొంగలు పడి ముప్పై ఏళ్లయింది. ‘‘దొంగలుకాదు తాతయ్యా. ఇచ్చేవాళ్లు దొరలు..’’ ‘‘పోన్లే. గొడవలేదంటున్నావు. అదే పదివేలు. ముందు ఈ చుండ్రుకి మందు రాయి. ఆ గౌరవమేదో చుండ్రుకన్నా ఇబ్బంది పెట్టేట్టు ఉంది...’’ ఇలాంటి నిస్పృహ మన పెద్దలకి మనస్సుల్లో నయినా కలిగి ఉంటుందని నాకనిపిస్తుంది. గొల్లపూడి మారుతీరావు -
సీనియర్ జర్నలిస్టు అరుణ్‌సాగర్ మృతి
♦ గుండెపోటుతో హఠాన్మరణం ♦ గవర్నర్, కేసీఆర్, బాబు, వైఎస్ జగన్ తదితరుల సంతాపం ♦ అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు, కవి, రచయిత, టీవీ5 ఎడిటర్ అరుణ్‌సాగర్ (49) గుండెపోటుతో మరణించారు. కొద్ది నెలలుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం హఠాత్తుగా గుండెపోటు రావడంతో హైదరాబాద్ అమీర్‌పేటలోని ఓ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య ప్రసన్న, కుమార్తె స్రిత ఉన్నారు. అరుణ్‌సాగర్ ఆకస్మిక మృతి పట్ల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, సీఎం కె.చంద్రశేఖరరావు, ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్ సహా పలువురు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పత్రికా రంగంతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అరుణ్‌సాగర్ అందించిన సేవలను కొనియాడారు. బంధుమిత్రులు, జర్నలిస్టు మిత్రుల అశ్రునయనాల మధ్య హైదరాబాద్ రాయదుర్గంలోని మహాప్రస్థానం విద్యుత్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీవీ5 అధినేత బీఆర్ నాయుడు, సినీ నటుడు తనికెళ్ల భరణి, ప్రజా గాయకుడు గోరటి వెంకన్న, గద్దర్, పలువురు సీనియర్ జర్నలిస్టులు తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు అరుణ్‌సాగర్ భౌతికకాయానికి మోతీనగర్‌లోని ఆయన నివాసంలో మంత్రులు కేటీఆర్, హరీశ్, తుమ్మల నాగేశ్వరరావు, టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి, జర్నలిస్టు నేతలు తెలకపల్లి రవి, కె.శ్రీనివాస రెడ్డి, దేవులపల్లి అమర్, విరాహత్ అలీ తదితరులు నివాళులర్పించారు. అరుణ్‌సాగర్ ఎన్నో చక్కని రచనలు చేయడమే గాక జర్నలిజంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. మేల్కొలుపు, మాగ్జిమం రిస్క్ వంటి రచనలు, కవితలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారన్నారు. అరుణ్‌సాగర్ అకాల మరణంపై సీపీఎం సంతాపం ప్రకటించింది. వామపక్ష విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన, జర్నలిజంలో ప్రజాస్వామ్య, అభ్యుదయ భావాలకు అంకితమై పనిచేశారంది. అరుణ్‌సాగర్ అంత్యక్రియల నిమిత్తం తక్షణ సాయం కింద రూ.50 వేలను కేసీఆర్ విడుదల చేశారు. మరోవైపు, శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం అధ్యక్షునిగా పని చేసిన ఎం.ఎల్.నరసింహారావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. -
రేలాపువ్వుల అరుణోదయం...
అతని వాక్యం నిర్మొహమాటంగా మనలని వాటేసుకుంటుంది. అప్పుడే వికసించిన పువ్వు లాంటి వాక్యం యెక్కడ రాయాలో, అప్పుడే ఓవెన్ లోంచి తీసిన నిండు కాఫీ కప్ లాంటి వాక్యం యెక్కడ రాయాలో అతనికి బాగా తెలుసు. ఒక చీకటిమయ ప్రపంచపు లోలోపల తిరుగాడుతున్న క్రిమిపై అతని వాక్యం లేజర్ కిరణంలా ప్రసరించి మనలని అలెర్ట్ చేస్తుంది. సూర్యోదయానికి, సూర్యాస్తమయా నికి అతనులేడు. అరుణ్ సాగర్ కనిపిం చగానే రేలా పాటవలే అతని నవ్వు వినిపిస్తుంది. అరుణ్ సాగర్ యెదుర వ్వగానే తుమ్మెదరెక్కల కళ్ళల్లోంచి నవ్వు కాంతుల జలపాతమై మనలని పలకరిస్తుంది. నిత్యం పొంచి వున్న ఆపదను తనలోనే మోసుకు తిరుగుతున్నా ప్రతినిత్యం జీవితోత్సాహంతో చెంగుచెంగున దుమికే పసితారంగం. వుదయంవుదయమే అనేక రింగ్ టోన్స్‌తో అనేక సెల్ ఫోన్స్ మోగుతుంటే అంతా వొక తత్తరపాటుతో మేల్కొన్నారు. వింటున్న మాటలు, మాటల్లో వినిపిస్తున్న పేరు వింటూ సరిగ్గా విన్నామా అనే వొక సందేహం. తిరిగితిరిగి వొకరికొకరు ఫోన్స్. హడావుడిగా టీవీ పెట్టేవాళ్ళు, ఫేస్బుక్ తెరిచేవాళ్ళు నిజమా కాదా తేల్చుకోడానికి అందుబాటులో వున్న అన్ని మాధ్యమాలని తిప్పు తూనే ఉన్నారెందరో. నిజమా నిజమా అని యెక్కడెక్కడి నుంచో అందరూ అందర్నీ అపనమ్మకంగా అడుగుతుండగానే అతను బేనరై కనిపించారు. అవును మన అరుణే... మన అరుణ్ సాగరే... అపనమ్మకం నిదానంగా నమ్మకమైంది. ఆ బ్రేకింగ్ న్యూస్ అసత్యమైతే బాగుండునని కోరుకోని హృదయం లేదా సమ యంలో. కాని అతను మన హృదయాలని వినదల్చుకోలేదు. ‘ఇది నిజమే బాస్’ తనదైన నవ్వుతో అంటూనే ఉన్నాడు. అప్పుడు ఆ వార్త నిజమని పోల్చుకున్న నిశ్శబ్దం అంతటా. పూర్ణ అశ్రు ధారలైనారు. రెప్పపాటులో అతను జ్ఞాపకాల కలనేతైనాడు. ఒకటా రెండా.. ‘సుప్రభాతం’ నుంచి ఇప్పటి టీవీ5 సీఈఓ వరకు పాత్రికేయ వృత్తిలో అతను వొక కొత్త వొరవడి. ఎప్పటి కప్పుడు కొత్త మాట. కొత్త వాక్యం. కొత్తదనం. అతని వాక్యం నిర్మొహమాటంగా మనలని వాటేసుకుంటుంది. అప్పుడే వికసించిన పువ్వు లాంటి వాక్యం యెక్కడ రాయాలో, అప్పుడే ఓవెన్ లోంచి తీసిన నిండు కాఫీ కప్ లాంటి వాక్యం ఎక్కడ రాయాలో అతనికి బాగా తెలుసు. వొక చీకటిమయ ప్రపంచపు లోలోపల తిరుగాడుతున్న క్రిమిపై అతని వాక్యం లేజర్ కిరణంలా ప్రసరించి మనలని అలర్ట్ చేస్తుంది. అంతే కాదు అతను టీవీ9 లో అనేక కథనాలకి గొంతై ఏమరుపాటున సైతం అలర్ట్ చేసేవారు. అదే స్వరం ఒక వాత్సల్య సుగంధంతో మనలోని దుర్గంధాన్ని తరిమేస్తుంది. అరుణ్‌కి పాటలంటే ప్రాణం. మైఖేల్ జాక్సన్ అన్నామ నుకోండి అరుణ్ మూన్ వాక్ అవుతాడు. బాబ్ డిలాన్ అంటూండ గానే వొక వొత్తై నల్లని మేఘ ధ్వనిలా ప్రతిధ్వనిస్తాడు. గోదా వరిని నిత్యం తన లోలోపల ప్రవహింప చెయ్యాలనుకునే అరుణ్, విశాఖ సముద్ర కెరటాల వొంపులోని సూర్య కిరణాలని, చంద్ర కిరణాలని యెంత తదేకంగా చూస్తారో నక్షత్రాలతో మాత్రమే మిణుకుమిణుకు మంటున్న ఆకాశం కింద ఉన్న యెగిసే సముద్రపు వాలులోని నల్లని నలుపుని అంతే ఆసక్తిగా చూస్తారు. యెంతైనా andromeda’ ని ప్రేమించిన వారు కదా. అతని పుస్తకాలని ‘andromeda’ ప్రచురణలుగా ప్రచురించారు. అరుణ్ సమకాలీన విషయాలకి స్పందించే రచనలు భలే భిన్నమైనవి. పైపై మెరుగులు దిద్ది అంతా బాగుందనే భ్రమలు కలిపించే ఏ శక్తిని అతను పోనీలే అనుకోలేదు. హైదరాబాద్ అభివృద్ధి అని రాజకీయ నాయకులు తమ ఖాతాలో వేసుకుంటున్న మాటలని ధనవంతుల ఇళ్లలోంచి వచ్చే వాటర్ ఫౌంటైన్ల నుంచి వారి ప్రహారీ గోడలు దాటి వచ్చే నీటి తుంపరని చెప్పేసి చాల మందిని వొప్పించేశారు. అత్యుత్తమ బాహు వులని నిలువెత్తు పొగిడే సినిమా కావచ్చు, టీవీ టీఆర్పీ మాయాజాలం సంపన్నులు కాని పల్లె స్త్రీల జీవితాలని యెలా పట్టించుకోదో చెప్పటం కావొచ్చు. విషయం యేదైనా కావొచ్చు.. అతను యెల్లప్పుడు సామాన్యుల పక్షాన్నే. స్త్రీ వాదాన్ని బలంగా నమ్ముతూ రాస్తున్న నాకు తన పురుష దృక్పధపు మగవాని ఫీలింగ్స్ రాసి ఆ పుస్తకం నా చేతిలో వుంచి, తానెలా పరీక్ష రాసానో స్పష్టంగా స్టూడెంట్‌లా నా ముఖంలోకి తన నిశితమైన చూపుని సారించి నిలబడిన అరుణ్‌ని చూసి ఆ రోజెంత నవ్వానో. మృదు స్వభావి హృదయమంతా స్నేహం నింపుకొన్న అరుణ్.. అదీ కాక బాబ్ మార్లే ‘నో ఉమన్ నో క్రై ’ పాటని ఇష్టపడే అరుణ్ మమ్మల్ని నొప్పిస్తారా... మనకి మేల్ కొలుపు జీటజీజజ్టిజఠ మగవాడి దృక్కోణం కావాలి కదా అంటూ వొప్పిస్తారు కాస్త సహనంతోనో మరింత మృదువు గానో. బెస్సీ స్మిత్ బ్యాక్ వాటర్ బ్లూస్ని హమ్ చేస్తే చాలు అరుణ్ సాగర్లాంటి జీవితాలని అలా యెలా ముంచేస్తారు అనేవారు. అరుణ్ లాంటి సున్నిత మనస్కులని మనం చాల అరుదుగా చూస్తాం ఇప్పటి సమాజంలో. అరుణ్ సాగర్ పోయిన నెల ఆవిష్కరించిన ‘మ్యూజిక్ డైస్’ అత్యంత విలువైన కవిత్వ సంకలనం. పోలవరం ప్రాజెక్ట్ కడతామన్నప్పటి నుంచి అతను ఆ వనాల వానైనాడు. ఆకుపచ్చని నీడైనాడు. వెదురుపొదల పుప్పొడి అయినాడు . పుట్టతేనె తీయ్యని గాలైనాడు. విప్పపూల నిషా అయ్యాడు. ఆదివాసీ ప్రశ్నైనాడు. ఆదివాసీ ఊపిరైనాడు. ఆదివాసీ హృదయమైనాడు. అతనే ఆది వాసి అయ్యాడు. వొక విలువైన కవితా సంకలనమే కాదది. ఒక ముఖ్యమైన జీవన పోరాటం మన ముందుంచారు సాగర్. ప్రకృతి విధ్వంసం, జాతుల సంస్కృతుల ముంపు, పర్యావరణ కాలుష్యం మనం వెంటనే మాట్లాడాల్సిన విషయాలని యెందుకు మాట్లా డాలో కూడా సుస్పష్టంగా రాసిన కవిత్వమది. మనలని కదిలి స్తుంది. మనలని ఆలోచింపచేస్తుంది. మనలని మైమరపిస్తుంది. ఒక సౌందర్యవంతమైన జీవనాన్ని విధ్వంసపు లోయగా మారుస్తూ అభివృద్ధి అని గట్టిగా మాట్లాడుతున్న వాళ్ళని మనం ప్రశ్నించటమే కాదు.. మనం ఆ జీవితాలని హృదయమంతటితో పదిలపరచు కోవాలనిపిస్త్తుంది ఆ కవిత్వం చదివితే. అందమైన అరుణ్ సాగర్.. సోగ్గాడు శోభన్‌బాబు గారిని పరవశంతో తన రచనలో ఆవిష్కరించే అరుణ్ సాగర్ చక్కని సౌందర్యారాధకుడు. స్వతహాగా స్వాప్నికుడు. మంచి చదువరి చక్కని రచయితా, చురుకైన జర్నలిస్ట్, లలితమైన పలకరింపు, ప్రేమించటం మాత్రమే వచ్చిన అరుణ్ సాగర్ని ప్రేమించకుండా ఉండలేం. అరుణ్ నవ్వితే సాగరం మెరుస్తుంది... మరి యిప్పుడు... (అరుణ్‌సాగర్‌కు నివాళి) - కుప్పిలి పద్మ వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి మొబైల్: 9866316174 -
మందుల మాయాజాలం
-
నవ్వుల సంతకం
-
ఆస్కార్ హంగామా
-
గీత కాంతి..
-
పట్నంలో పండగ సందడి..
-
వివిధ దేవతా గాయత్రీ మంత్ర సంకలనం
సాధారణంగా గాయత్రీ మంత్రమనగానే అందరూ ‘ఓం భూర్భువస్సువః...’ అనే మంత్రాన్నే మననం చేసుకుంటారు. అయితే ప్రతి దేవతకీ ఓ గాయత్రి ఉంటుంది. ఆ గాయత్రిని ఉపాసించడం వల్ల సత్వర ఫలం లభిస్తుంది. ఉదాహరణకు బ్రహ్మ గాయత్రి, విష్ణుగాయత్రి, మహాలక్ష్మీ గాయత్రి, వేంకటేశ గాయత్రి... ఇలాగన్నమాట. సాధకులు ఆయా గాయత్రులను ఉపాసించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చునని పెద్దలు చెబుతారు. అయితే అవన్నీ ఒకేచోట ఉండవు. ఎక్కడో ఒకటీ అరా మాత్రమే లభిస్తాయి. శ్రీ వాల్మీకి రామాయణమనే వచనకావ్యాన్ని, శ్రీ దత్తసాయి చరితామృతమనే గ్రంథాన్నీ రచించిన తంగిరాల శ్రీధర శర్మ గాయత్రీ మంత్రం పట్ల అనురక్తితో మరికొందరు పెద్దలు, పండితుల సహకారంతో వివిధ దేవతలకు సంబంధించిన 660 పైచిలుకు గాయత్రీ మంత్రాలను సేకరించారు. వాట న్నింటిని ఒక చోట కూర్చి, ‘వివిధ గాయత్రీ దేవతా మంత్రములు’ అనే పుస్తక రూపాన్నిచ్చారు. ఇందులో శ్రీ గాయత్రీ మంత్ర మహాత్మ్యాన్ని ముందుమాటగానూ, శ్రీ సూక్తం, దుర్గాసూక్తం, మన్యుసూక్తం తదితరాలను అనుబంధాలగానూ అందించి, పుస్తక విలువను, పఠనీయతను పెంపొందించారు. శ్రీ గాయత్రీ మంత్ర మహాత్మ్య సహిత వివిధ దేవతా గాయత్రీ మంత్రములు పుటలు: 256; వెల రూ. 150, ప్రతులకు: తంగిరాల శ్రీధర శర్మ, ఫ్లాట్ నం. 101, వేదప్రణతి, 6-3-609/165, ఆనందనగర్, హైదరాబాద్- 500 004. మెయిల్ ఐడీ: sthangirala@gmail.com - డి.వి.ఆర్. -
కార్తీ చిదంబరంపై ఈడీ ఫోకస్
-
‘ప్రాథమిక’మే ప్రథమం!
ఇదీ ఏడు చేపల కథే. కాకపోతే ఇవన్నీ రాజకుమారులు వేటాడేసి.. ఎండలో పెట్టిన చిన్న చేపలు కావు. దేన్నయినా అమాంతం మింగేసే షార్క్‌లు! ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి మొదలుపెడితే... ప్రభుత్వాసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఫార్మా కంపెనీలు, నియంత్రణ వ్యవస్థలు, బీమా కంపెనీలూ అన్నీ షార్క్‌లే. తినటానికి అలవాటుపడ్డవే. ఎండకపోవటానికి చిన్నచేపలు సాకులు చెబితే.. ఇవి మాత్రం మా నోటి దగ్గరకు వస్తే తినకుండా వదిలిపెడతామా? అని ఎదురు ప్రశ్నిస్తాయి. మరి వీటి రోగం కుదిరేదెలా? వాణిజ్య కేంద్రాలుగా మారిపోయిన వైద్యాలయాల్ని మార్చటమెలా? ఈ వైద్య విధ్వంసాన్ని ఆపటమెలా? ఐదు రోజులుగా ఈ విషయమై ‘సాక్షి’ ప్రచురిస్తున్న కథనాలకు వచ్చిన స్పందన అనూహ్యం. పలువురు తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఆసుపత్రుల ధనదాహాన్ని కళ్లకు కట్టారు. కొందరు సూచనలూ చేశారు. స్థలాభావం వల్ల అన్నిటినీ ప్రచురించటం అసాధ్యం. అందుకే అత్యధికుల సూచనల ఉమ్మడి సారాంశం ప్రచురిస్తున్నాం. - సాక్షి ప్రత్యేక బృందం * ‘వైద్య విధ్వంసం’కు ఇదే ప్రథమ చికిత్స * ‘సాక్షి’ వరుస కథనాలకు విశేష స్పందన * అన్ని వర్గాల నుంచి సూచనల వెల్లువ పీహెచ్‌సీలే కీలకం ఈ విధ్వంసానికి ప్రథమ చికిత్స చేయాలంటే తొలుత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని పటిష్టం చేయాలన్నది నిష్ఠుర సత్యం. దగ్గర్లో చక్కని వసతులు, వైద్యుడు అందుబాటులో ఉంటే చాలా సమస్యలు అక్కడే పరిష్కారమైపోతాయి. కానీ ఇపుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని చూస్తే... ఎక్కడా కనీస మందులు కూడా అందుబాటులో ఉండడం లేదు. వైద్యుడు అందుబాటులో ఉండటమూ కష్టమే. ఇక పరికరాల ఊసెత్తకపోతేనే మంచిది. అందుకే ఏ చిన్న జ్వరం, దగ్గు, జలుబుకైనా పెద్దాసుపత్రికో, డబ్బులుంటే ప్రైవేటు ఆసుపత్రికో పరుగెత్తాల్సిన దుస్థితి. దీనికితోడు ఇటీవల బాగా పెరిగినజాఢ్యం ఏమిటంటే నేరుగా స్పెషలిస్టుల్ని సంప్రతించటం. చిన్నచిన్న నొప్పులొచ్చినా, ఒంట్లో నలతగా ఉన్నా మొద ట సంప్రతించాల్సింది జనరల్ ఫిజీషియన్‌నే. కొన్ని జ్వరాలు, చిన్నచిన్న నలతలు వచ్చి నిర్ణీత కాలంలో తగ్గిపోతాయి. ఇది గ్రహించేది ఫిజీషియన్ మాత్రమే. అప్పటికీ తగ్గకుంటే సదరు ఫిజీషియనే ఏ స్పెషలిస్ట్‌ను సంప్రతించాలో రిఫర్ చేస్తాడు. కానీ చెయ్యి నొప్పి వస్తోందంటే నేరుగా ఆర్థోపెడిక్నో, న్యూరాలజిస్ట్నో, ఛాతీలో కాస్తా నొప్పిగా అనిపిస్తే నేరుగా కార్డియాక్ విభాగానికి వెళ్లడం చేస్తున్నారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఫిజీషియన్‌ను సంప్రతించినప్పుడు... తనకు పెట్టిన టార్గెట్ మేరకు ఆ ఫిజీషియన్ వారిని అవసరం లేకపోయినా స్పెషలిస్ట్‌ల దగ్గరకు పంపిస్తున్న సందర్భాలూ లేకపోలేదు. కాకపోతే ఇలా జరిగేది తక్కువసార్లు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పటిష్టంగా ఉంటే... అక్కడి ఫిజీషియన్ల చేతుల్లోనే చాలా సమస్యలు పరిష్కారమవుతాయన్నది చాలామంది వ్యక్తంచేసిన అభిప్రాయం. అందరికీ బీమా ధీమా ఉండాలి... ఇప్పుడు ఆరోగ్య శ్రీ కింద... ప్రభుత్వ హెల్త్ కార్డుల కింద బీమా పొందినవారు... ప్రైవేటు బీమా కంపెనీల నుంచి నేరుగా బీమా తీసుకున్నవారు... తాము ఉద్యోగం చేసే ఆఫీసుల ద్వారా బీమా పొందినవారు.. ఇలా అందరినీ కలిపినా ఇంకా చాలామంది బీమా లేనివారు ఉంటున్నారు. ఇలా కాకుండా ప్రభుత్వమే నామమాత్రపు ప్రీమియంతో ప్రజలందరికీ సామాజిక బీమాను తప్పనిసరి చేయాలన్నది మరో సూచన. డబ్బున్నవారు, లేనివారు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ ఈ బీమా పరిధిలో ఉండేలా ప్రభుత్వమే చొరవచూపాలి. అప్పుడు ప్రతి ఒక్కరికీ తనకేం జరిగినా బీమా ఉందనే భరోసా ఉంటుంది. ప్రభుత్వం తరఫున చికిత్స అందుతుందనే నమ్మకం ఉంటుంది. ఈ బీమా సరిపోదనుకునే వారు, కాస్త స్థితిమంతులు వేరే బీమా చేయించుకోవచ్చు. అలా చేస్తే ఈ సామాజిక బీమాలో క్లెయిముల సంఖ్య తక్కువే ఉంటుంది. ఫలితంగా బీమా కంపెనీలు తిరస్కరించటం, ఆసుపత్రులు కూడా అనుచిత విధానాలకు పాల్పడటం వంటివి కూడా తక్కువే ఉంటాయి. డాక్టర్లు అందరిలాంటి వారేనా? డాక్టర్లూ అందరిలాంటి వారేనని, ఇక్కడ కూడా మిగతా రంగాల మాదిరిగా కొందరు తప్పులు చేయొచ్చని, అవినీతికి పాల్పడే అవకాశం ఉందని కొందరు వైద్యులు వ్యక్తం చేసిన అభిప్రాయంతో సామాన్యులు ఏకీభవించలేదు. ‘‘ఒక ఐటీ ఉద్యోగితో డాక్టర్లను పోల్చలేం. ఎందుకంటే ఐటీ ఉద్యోగి పడే కష్టం ఎక్కడో జీడీపీలో కనిపిస్తుంది. కానీ డాక్టరు కష్టం రోగుల మొహాల్లో కనిపిస్తుంది. ఒక వ్యక్తి తన శరీరాన్ని కోయటానికి ఎవరికైనా అనుమతిస్తాడంటే... అది డాక్టరుకే. అలాంటి డాక్టరు తప్పు చేస్తే ప్రాణాలు పోతాయి’’ అనేది మెజారిటీ మాట! వైద్యుడి హిస్టరీ కనిపించదేం? మనం డాక్టర్ల దగ్గరకు వెళ్లేటపుడు వారినో, వీరినో అడిగో లేదా వారికున్న మంచిపేరు చూసో వెళ్తుంటాం. కానీ వాస్తవంగా ఆ డాక్టరు అప్పటిదాకా చేసిన ఆపరేషన్లెన్ని? అందులో విజయవంతమైనవెన్ని? పేషెంట్లు సదరు డాక్టరు విషయంలో ఏం చెప్పారు? ఇలాంటి హిస్టరీ ఎక్కడా కనిపించదు. ఏ ఆసుపత్రీ చెప్పదు కూడా. రూ.100 పెట్టి సినిమా చూసినప్పుడో, ఓ రెస్టారెంట్లో భోజనం చేసేటప్పుడో అది బాగుందో లేదో తెలుసుకునే అవకాశం ఉన్నపుడు... తన ప్రాణాన్ని అప్పగించే రోగికి తనకు వైద్యం చేసే వైద్యుడి వృత్తిగత చరిత్ర తెలియజేస్తే తప్పా? ఇందుకు రోగుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవటం, దాన్ని నిజాయితీగా ప్రదర్శించటం వంటివి ఆసుపత్రులు చేసి తీరాలన్నది పలువురి లేఖల్లో వ్యక్తమైంది. ఇక ఎన్నికల ముందు అన్ని అంశాలనూ చర్చించే రాజకీయ పార్టీలు... వైద్యంపై తమ విధానాన్ని ప్రకటించాలన్నది మరికొందరి భావన. వాణిజ్య శక్తులపై గట్టి నియంత్రణ! మొత్తంగా వైద్యంపై పటిష్ఠమైన నియంత్రణ ఉండాలని అందరూ ముక్తకంఠంతో చెప్పారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నియంత్రణ వ్యవస్థలది ఏనుగులు స్వైర విహారం చేస్తుంటే.. ఎలుకల కోసం నిఘా వేసే స్థాయి. రాష్ర్టంలో ప్రైవేటు ఆస్పత్రుల ఏర్పాటు, నిర్వహణ కోసం 2007లో ఏపీ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌ను తెచ్చినా... ఇది కేవలం ఆస్పత్రుల ఏర్పాటు, లెసైన్సులు, రెన్యువల్ వంటి అంశాలకే పరిమితమవుతోంది. బాధిత రోగులకు అన్యాయం జరిగినప్పుడు ఆయా ప్రైవేటు ఆస్పత్రులపై ఏ చర్యలు తీసుకోవాలన్నది ఏ చట్టంలోనూ లేదు. అలోపతిక్ ఆస్పత్రులను మాత్రమే కవర్ చేసే ఈ చట్టం పరిధిలో... ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలున్నా వీటికెలాంటి అధికారాలూ లేవు. ఇక ఆసుపత్రులపై ఫిర్యాదుల్ని చూసేది జిల్లా వైద్యాధికారి. అప్పిలేట్ అథారిటీ అధికారిగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఉంటున్నారు. ప్రతి ఆసుపత్రీ... ఏ చికిత్సకు ఎంత రేటు వసూలు చేస్తున్నారో తెలుగు, ఇంగ్లిషు భాషల్లో నోటీసు బోర్డులో విధిగా చూపించాలన్నది ఈ చట్టం పెట్టిన నియమం. కానీ దీన్ని పాటిస్తున్న ఆసుపత్రులు ఒక్కటీ ఉండదు. ఒకవేళ దీనిపై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేసినా... దిగ్గజాల్లాంటి కార్పొరేట్ ఆస్పత్రులపై ఆయన చర్యలు తీసుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న! పరిహారం ఉండాలి.. నిషేధించాలి.. ‘కాసు’పత్రుల నియంత్రణకు జిల్లా స్థాయిల్లో బలమైన నియంత్రణ వ్యవస్థలుండాలని, ఒకవేళ వాటివల్ల జరిగిన పొరపాటు రుజువైతే సదరు ఆసుపత్రి భారీ పరిహారాలు చెల్లించటంతో పాటు మళ్లీ సేవ లందించకుండా నిషేధించాలనేది కొందరి సూచన. ఇటీవల దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన సంఘటన చూస్తే... వైద్యుడి నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం పోయింది. అది వైద్యుడి నిర్లక్ష్యమేనని తేల్చిన రాష్ట్ర వైద్య మండలి... తనను మందలించి వదిలిపెట్టింది. కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అప్పీ లు చేస్తే... అది ఆ డాక్టరును కొన్నాళ్లు వైద్యం చేయకుండా నిషేధించింది. ఇలా మందలించి వదిలిపెట్టే స్థాయిలో శిక్షలుంటే ఏ డాక్టరు భయపడతాడన్నది సమాధానం లేని ప్రశ్నే. ఈ పోరు కొనసాగిద్దాం.. ‘వైద్య విధ్వంసం’పై ఈ-మెయిల్స్, లేఖల రూపంలో అసంఖ్యాకంగా స్పందించిన పాఠకులందరికీ ధన్యవాదాలు. స్థలాభావం వల్ల కొన్నిటినే ఇక్కడ ప్రచురించినా... మిగిలిన వాటిని కూడా సందర్భానుసారం ప్రచురించే ప్రయత్నం చేస్తాం. మా దృష్టికి వచ్చిన సమస్యలు, పరిష్కారాల సూచనలతో తగు వినతిపత్రాన్ని కూడా ప్రభుత్వ యంత్రాంగానికి అందజేస్తాం. వైద్యానికి సంబంధించి ఏ సంఘటననైనా, ఏ అభిప్రాయాన్నయినా sakshihealth15@gmail.com ద్వారా మీరు ఎప్పుడైనా మా దృష్టికి తేవొచ్చు. వాటిని తగు వేదికపై ప్రస్తావిస్తాం. - ఎడిటర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణం ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేయటం ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం. ప్రతి మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలి. ఆసుపత్రిలో అన్ని రకాల పరికరాలు, రోగికి కావాల్సిన సౌకర్యాలను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉండేలా వారికి సమీపంలోనే క్వార్టర్స్ ఏర్పాటు చేయాలి. ప్రైవేటు ఆసుపత్రులలో జరిపే ప్రతి టెస్ట్‌కూ ప్రభుత్వమే ఫీజు నిర్ణయించాలి. - బి.శివప్రసాదం, పరకాల(వరంగల్) హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి చేయాలి హెల్త్ ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేయాలి. ఉచితంగా కాకున్నా ప్రజలు- ప్రభుత్వం కలిసి 50-50 భాగస్వామ్యంతో దీన్ని కొనసాగించాలి. అప్పుడు సామాన్యులకు వైద్యమనేది భారం కాకుండా ఉంటుంది. - రమేష్, ఖమ్మం ప్రజారోగ్య సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలి ‘వైద్య విధ్వంసం’పై సాక్షి పత్రికలో వస్తున్న వరుస కథనాలు అక్షర సత్యాలు. ప్రస్తుతం కార్పొరేట్ రంగంలోని వైద్యం గురించి చెప్పుకోవడం.. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్న చందంగా ఉంటుంది. అది బాధాకరమైనా సత్యం! కార్పొరేట్ ఆసుపత్రుల్లో సమర్థులైన వైద్యులతో అధునాతన చికిత్స అందుతుందని భావిస్తాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పథకం.. ప్రతి ఒక్కరినీ అలాంటి చికిత్సకు అర్హుడిగా చేయడానికి వేసిన ఒక అడుగు. అయితే ఆ పథకాన్ని దుర్వినియోగం చేసి కొన్ని ఆసుపత్రులు తమ లాభార్జనకు వాడుకున్నాయనే విమర్శల్లో వాస్తవం లేకపోలేదు. ఈ పథకాన్ని లోపాలు లేకుండా అమలు చేయాలి. ప్రభుత్వం వివిధ స్థాయిల్లో పౌరసమాజ కమిటీలను నియమించాలి. నైతిక వర్తనతో ఉండే రిటైరైన ఉద్యోగులు, విశ్రాంత విద్యావంతులను, చదువుకున్న గృహిణులు, కొంత సమయం వెచ్చించగలిగే యువతీయువకులను అందులో భాగం చేయాలి. వీళ్లతో ‘ప్రజారోగ్య సంరక్షణ కమిటీ’లు ఏర్పాటు చేసి, వాటికి కొంత సాధికారిత కల్పిస్తే ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలవుతుంది. - డాక్టర్ ఏపీ విఠల్, ప్రజావైద్యశాల వ్యవస్థాపకులు, సూర్యాపేట, నల్లగొండ జిల్లా అత్యవసర చికిత్స చేసే వైద్యులు ఎక్కడ? కోట్లు పెట్టి ఆసుపత్రులు పెట్టేవారు.. అత్యవసర సమయాల్లో చేసే చికిత్సలను పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు కొన్ని సందర్భాల్లో ఊపిరి ఆగిపోయినప్పుడు.. రోగి ఊపిరితిత్తుల్లోనికి రెండు నిమిషాల్లోనే గొట్టం (ఎండోట్రాకియల్ ట్యూబ్) వేయగలిగే డాక్టర్ చాలా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండడం లేదు. డ్యూటీ నర్సుకు గానీ, డ్యూటీ డాక్టరుకు గానీ, స్పెషలిస్టు డాక్టర్లకుగానీ ఈ చికిత్స విధానాన్ని నేర్పరెందుకు? అన్ని ఆసుపత్రులు ఈ ట్యూబ్‌ను అమర్చగల నిపుణులనూ, ట్యూబ్‌నూ అందుబాటులో ఉంచుకోవాలి. ఏ వైద్య విధానానికి సంబంధించిన కోర్సు అయినా.. అది పూర్తయ్యేనాటికి ‘బేసిక్ లైఫ్ సపోర్టు’ (బీఎల్ఎస్), అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్టు (ఏసీఎల్ఎస్) అంశాలపై తర్ఫీదు ఇవ్వాలి. రోగులు సైతం.. అత్యవసర చికిత్స అందించగల నిపుణులు అందుబాటులో ఉన్నారా లేదా అని ఆసుపత్రుల యాజమాన్యాలను అడగాలి. - డాక్టర్ బ్రహ్మారెడ్డి, సూపరింటెండెంట్, ప్రజావైద్యశాల, జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపక సభ్యుడు, కర్నూలు అవి నిరూపితమయ్యే తప్పులు కావు అనవసరంగా పరీక్షలు రాయడం, రోగిని పిండుకోవడం వంటివి చెప్పుకోవడానికేగానీ వాటిని నిరూపించలేరు. ఆ టెస్టు ఎందుకు చేశారని అడిగితే... ‘ఆ పరీక్ష ద్వారా నే జబ్బు కనుక్కోవచ్చని అనుకున్నా’ అని వైద్యుడు అంటా డు. ఇది తప్పు అని చెప్పలేం. అయినా ప్రొసీజర్ ప్రొటోకాల్, స్టాండర్డ్ ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్ వంటివి అమలు చేయకపోవడంతో ప్రశ్నించలేక పోతున్నాం. రోగి అవగాహన పెంచుకుని డాక్టరును ఎంపిక చేసుకోవాలి. అయినా హోటళ్లకు, హాస్పిటల్లకూ పెద్దగా తేడా ఉందని నేననుకోవడం లేదు. - డా.కె.వెంకటేష్, అదనపు వైద్య విద్యా సంచాలకులు, ఎంసీఐ మాజీ సభ్యుడు టార్గెట్లు ఉంటే నమ్మకమైన వైద్యం దొరకదు ప్రైవేటు ఆస్పత్రుల్లో స్టెంట్లు, ఇంప్లాంట్స్ వంటివాటితో రోగిని పీల్చేస్తున్నారు. ఇక్కడే రోగులు ఎక్కువగా నష్టపోతున్నారు. ప్రభుత్వాలు వీటిపై తక్షణమే వ్యయ నియంత్రణ (కాస్ట్ రెగ్యులేటరీ) చేయాలి. కార్పొరేట్ ఆస్పత్రులు విధించే బిజినెస్ టార్గెట్లతో రోగికి-వైద్యుడికి మధ్య నమ్మకమైన వైద్యం సాగడం సాధ్యం కాని పని. - డా.కె.రమేశ్‌రెడ్డి, పీడియాట్రిక్ ప్రొఫెసర్, ఎంసీఐ ఎథిక్స్ కమిటీ మాజీ సభ్యుడు -
రంజాన్ స్పెషల్ ఎడిషన్
-
చెత్త బంగారం
నా పేరు చెత్తకుండీ. మనుషులు నాలో చెత్తను పారేస్తారు. నా చెత్తను రీసైకిల్ చేసి బంగారంగా మార్చే వాళ్లున్నారు. కాని ఈ తెలివైన మనుషులే ఒక్కోసారి నా కడుపులో బంగారమే పారేసి పోతారు. అప్పుడు నాకు అనుమానం వేస్తుంది... చెత్తకుండీ నేనా? సమాజమా అని... నా పేరు సమాజం. చెత్తకుండీ అనేది కొద్దివరకు నిజమే కావచ్చు కాని... ఒక తల్లి బిడ్డను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఆమె కష్టం ఎంత పెద్దది కాకపోతే బిడ్డను పారేసి పోతుంది? అయినా సమాజాన్ని మించిన తల్లి లేదని... నేను ఎప్పుడూ నిరూపించుకుంటూనే ఉన్నాను. పేగు తెంచుకుంటేనే తల్లి కాదు... ఇంటి పేరు పంచుకుంటే కూడా తల్లి కావచ్చు... - రామ్ ఎడిటర్,ఫీచర్స్ ఒక తల్లి పారేసుకుంది. కాని వేయిమంది తల్లులు చేతులు సాచారు. ఒక నిర్దయ వద్దనుకుంది. కాని లక్ష గుండెలు అక్కున జేర్చుకున్నాయి. కడుపున పుట్టిన బిడ్డను ఆ తల్లి వద్దనుకోవడానికి కారణాలు ఏమిటో ఎవరికి తెలుసు. ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి చూస్తే తప్ప ఆమె చేసింది మంచో చెడో తేల్చలేము. కాని విజయవాడలో జరిగిన ఆ సంఘటన మాత్రం ఒక విషయాన్ని నిర్థారిస్తోంది. అది- ఈ సమాజం ఒక దయగల అమ్మ అని, దానికి అమ్మతనం నిండుగా ఉంది అని. తేది: జూన్ 18, 2015. సమయం: తెల్లవారుజాము ప్రాంతం: విజయవాడ వర్షం కురుస్తోంది. జనసంచారం పలుచగా ఉంది. వీధులు ఊడ్చే రాజేశ్వరికి దూరం నుంచి పసిపాప ఏడుపు వినిపిస్తూ ఉంది. ఎక్కడి నుంచి ఆ ఏడుపు? చుట్టుపక్కల ఇళ్లలో ఎవరో తల్లి పిల్లకు పాలు ఇవ్వడం ఆలస్యం చేస్తున్నట్టుగా భావించింది. ఐదు నిమిషాలు... పది నిమిషాలు... ఏడుపు ఆగడం లేదు. రాజేశ్వరి పరీక్షగా చూసింది. ఆమె గుండె గుభిల్లుమంది. ఆ ఏడుపు వినిపిస్తున్నది ఇళ్ల నుంచి కాదు... దూరంగా ఉన్న చెత్తకుండీ నుంచి. ఒక్క ఉదుటున చీపురు పారేసి అక్కడకు పరిగెత్తింది. ఆమె శరీరం ఒణికింది. కళ్లల్లో నీళ్లు ఉబికాయి. అక్కడొక శిశువు. అప్పుడే పుట్టింది. ఇంకా బొడ్డు పేగు రక్తపు చారలు కూడా ఆరలేదు. తల్లి ఒడిలో వెచ్చగా పడుకుని స్తన్యం అందుకోవాల్సిన ప్రాణం... ఇక్కడ ఆర్తనాదాలు చేస్తూ ఉంది.... వెంటనే ఒడిలోకి తీసుకుంది. ఊరుకోబెట్టింది. సాటి మనిషి స్పర్శ సోకడంతో పాప ఏడుపు ఆపింది. వేయి చేతులు.... ఆనోటా... ఈ నోటా... చుట్టుపక్కల వారందరికీ ఈ సంగతి తెలిసింది. జనం పోగయ్యారు. తల్లికి దూరమైన పాప దైవంతో సమానం. అందరూ మాకు కావాలి మాకు కావాలి అని చేతులు సాచారు. పోలీసులు వచ్చారు. ఎవరికి ఇస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయోనని పోలీసులు సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రానికి అప్పగించారు. ఈతల్లులే కాదు వేలాది లక్షలాది మంది తల్లులు తమకు పిల్లలు ఉన్నా లేకపోయినా ఇలాంటి పసికందులను దత్తత తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే దానికో పద్ధతి ఉంటుంది. నియమ నిబంధనలు ఉంటాయి. అవి పాటించి పాపను చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలి. లేకుంటే మున్ముందు సమస్యలు వస్తాయి. దొరికిన పాపను పెంచుకుంటే కొన్నాళ్లకు ఆ పాప సంబంధీకులు వచ్చి తీసుకువెళితే అప్పటి వరకూ పెంచుకున్న మమకారం వల్ల క్షోభ పడాల్సి వస్తుంది. శిశుగృహ నుంచి ఈ పిల్లలను దత్తత తీసుకోవాలంటే... ♦ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకు ఒక శిశుగృహ కేంద్రం ఉంటుంది. వీరిని నేరుగా సంప్రదించి, దరఖాస్తు చేసుకోవచ్చు. ♦ www.adoptionindia.nic.in కూడా లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు. ♦ ఏడాది లోపు వయసున్న పిల్లలు కావాలంటే దంపతులిద్దరికీ కలిపి 90 ఏళ్ల లోపు వయసుండాలి. దంపతుల వయసు పెరిగే కొద్ది దత్తత పిల్లల వయసు కూడా పెరుగుతుంది. చెత్తకుండీల్లో, ముళ్ల పొదల్లో, రోడ్డు వెంబడి, ఆసుపత్రులలో... రోజుల శిశువులను ఎవరైనా వదిలేసి వెళితే, వారిని తీసుకెళ్లి పెంచుకోకూడదు. ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. పోలీసులు, సీడీపీవో అధికారులు వెంటనే ఆ శిశువును స్థానిక శిశు గృహకు తరలించి, అన్ని సదుపాయాలను కల్పిస్తారు. అలాగే.. సీడీపీవో, పోలీసులు ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయేమో తెలుసుకుంటూ ఉండాలి. వెంటనే స్పందించాలి. ♦ దరఖాస్తు చేసుకునే దంపతులు తమ ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలియజేస్తూ ప్రభుత్వాసుపత్రి వైద్యుడితో ధృవీకరణ పత్రం తీసుకొని, ఇవ్వాలి. ♦ దంపతులు ఇరువురూ విడివిడిగా నాలుగు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, ఇద్దరూ కలిపి దిగినవి నాలుగు ఫొటోలు ఇవ్వాలి. ♦ వివాహ పత్రం (పెళ్లి కార్డు) జిరాక్స్ కాపీ, పెళ్లి సమయంలో ఇద్దరూ కలిసి దిగిన పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటో ఇవ్వాలి. ♦ ఉద్యోగస్తులైతే జీతం సర్టిఫికెట్ ఇవ్వాలి. లేకుంటే నెలకు రూ. 6 వేల చొప్పున ఏడాదికి రూ. 72 వేలు ఆదాయం తగ్గకుండా ఉండాలి. వారు నివసించే ప్రాంతంలోని తహశీల్దార్ నుంచి ఆదాయ ధృవీకరణ పత్రం తీసుకోవాలి. ♦ ఉద్యోగస్తులైతే బ్యాంక్ స్టేట్మెంట్ ఒరిజినల్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీ ఇవ్వాలి. ♦ ఆస్తికి సంబంధించిన పత్రాల జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించి ఇవ్వాలి. ♦ చదువుకున్న వారైతే పదో తరగతి మార్కుల జాబితా అటెస్టేషన్ చేసి ఇవ్వాలి. చదువుకోని వారయితే రేషన్ కార్డు, ఓటర్ కార్డు జిరాక్స్ కాపీ ఇవ్వాలి. ♦ పిల్లలు కలిగే అవకాశం లేదని లేడీ డాక్టర్ నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ♦ దరఖాస్తు చేసిన దంపతులు వారికి తెలిసిన ఇద్దరు వ్యక్తుల నుంచి వీరిద్దరూ భార్య భర్తలేనని, దత్తత తీసుకునే బిడ్డకు మంచి తల్లిదండ్రులుగా ఉంటారని, బిడ్డకు మంచి భవిష్యత్తు అందిస్తారని తెలియజేస్తూ సిఫార్సు లేఖలు ఇవ్వాలి. ♦ దరఖాస్తు చేసుకున్న వారు తమ పరిధిలోని పోలీస్‌స్టేషన్ నుంచి వెరిఫికేషన్ సర్టిఫికెట్ తీసుకురావాలి. ♦ రూ.6 వేల విలువ గల బ్యాంక్ డి.డిని అందజేయాలి. ♦ ఇవన్నీ పరిశీలించి, నిర్ధారించడంతో పాటు ముందుగా వచ్చిన దరఖాస్తుకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. - జి.పి. వెంకటేశ్వర్లు, సాక్షి ప్రతినిధి, విజయవాడ రిజిస్ట్రేషన్ తప్పనిసరి బంధువుల పిల్లలనైనా సరే దత్తతు తీసుకోవాలనుకుంటే ‘అడాప్షన్ డీడ్’ను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని పత్రాలు ఉండాలి. లేదంటే భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశాలు అధికం. రిజిస్ట్రేషన్ చేయకుండానే దత్తతు తీసుకున్న తల్లిదండ్రులు చనిపోతే, ఆ తర్వాత ఆస్తుల విషయంలో పిల్లలకు అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ. చట్టబద్ధంగా దత్తతు వెళ్లిన పిల్లలకు సొంత తల్లిదండ్రుల ఆస్తిలో వాటా వర్తించదు. - హజీమ్ఖాన్, న్యాయవాది -
జాడీ నం.1
కర్షకుడి చద్దిమూటలో కార్మికుడి లంచ్ డబ్బాలో ఆఫీసర్‌గారి క్యారియర్‌లో అమ్మాయి స్కూల్ టిఫిన్ బాక్స్‌లో స్టీల్ కంచంలో, పింగాణి ప్లేట్లో దర్శనమిచ్చే ఆవకాయ... చందమామ లాంటి అన్నంలో ఉదయిస్తున్న సూరీడులా ఉంటుంది! ఆకలిని బజ్జోపెట్టే అమ్మలా క్రాంతిని మేల్కొలిపే నాన్నలా అవ్వాతాతల వారసత్వంలా చల్లగా, నిప్పులా, నిజాయితీగా అనిపిస్తుంది. నిలవ ఉంచుకోవచ్చు. నిమిషంలో పంచేయవచ్చు. రామ్,ఎడిటర్, ఫీచర్స్ ఆవకాయ్... తెలుగువారికి ఎలా ప్రత్యేకమో, హీరోయిన్లలో స్వాతి అంత ప్రత్యేకం. మిరపకాయలు చిటా పటామన్నట్టు, మాటలు పేల్చడంలో స్వాతి దిట్ట. అష్టాచెమ్మా, అనంతపురం, స్వామి రారా, కార్తికేయ... ఆమె నటించిన కమ్మని సినిమాలు. తెలుగు టాలెంట్ తమిళ, మలయాళ భాషల్లో స్వాతి వల్లే తెలుస్తోంది. అక్కడ కూడా తను పాపులర్ హీరోయిన్. ఈ ఆవకాయ సీజన్లో ‘సాక్షి’ కోసం స్వాతి కలిపిన మాటలివి... సమ్మర్ ఎలా ఉంది? నీ పని చెప్తా అన్నట్టు ఉంది. ఎండలు విజృంభిస్తున్నాయ్. ఇంకో నెలరోజులు అవస్థ తప్పదు. అయినా ఎండల్ని తిట్టుకోవాల్సిన పని లేదు. మల్లెల్ని, కొత్త ఆవకాయల్ని తీసుకొచ్చే సీజన్ కదా! ఆవకాయ్ ఇష్టమేనా? ఓ... ఏడాది పొడవునా తినమన్నా తినేస్తాను. పచ్చడి తయారు చేసేటప్పుడు దగ్గరుండి చూస్తుంటారా? వైజాగ్‌లో మా అమ్మమ్మ, నాన్నమ్మ ఇద్దరూ తయారు చేసేవాళ్లు. ఆవకాయ్ తయారు చేయడం అనేది మాకో చిన్న సైజ్ పండగలా అనిపించేది. మామిడికాయలు కొనడం, వాటిని కడగడం, తుడిచి ముక్కలు కొట్టి, మొత్తం పచ్చడి తయారయ్యేవరకూ నేను, మా అన్నయ్య దగ్గరుండి చూసేవాళ్లం. నానమ్మ కత్తిపీట మీద కూర్చుని ముక్కలు కోసేది. అన్నయ్య ఒక్కో మామిడికాయ కత్తి కింద పెడితే ఆవిడ కోసేది. ఓసారి ఎటో చూస్తూ, ముక్కకి బదులు అన్నయ్య వేలి మీద కత్తి వేసింది. వేలి నుంచి బాగా రక్తం కారడం, అన్నయ్యేమో ఇల్లు పీకి పందిరేసినంత పని చేస్తూ, గట్టిగా ఏడవడం, తనని ఓదార్చడం... బాగా గుర్తు. అప్పుడు అందరూ అన్నయ్యను బాగా గారం చేశారు. దాంతో ‘సచ్చినోడా’ అని ఉక్రోషంగా తిట్టుకున్నా (నవ్వుతూ). పచ్చడి పాళ్లు మీకు తెలుసా? అంత తెలియదు కానీ, ఏయే దినుసులు కావాలో తెలుసు. నాకైతే ముక్క మాత్రమే కాదు.. పచ్చడిలో వేసే మెంతులు, వెల్లుల్లిపాయ కూడా ఇష్టమే. మా అమ్మా, నాన్న, నేనూ భోజనం చేస్తున్నప్పుడు మెంతులూ, వెల్లుల్లిపాయలూ ఏరి నా ప్లేట్లో వేస్తారు. ఎప్పుడైనా హోటల్ నుంచి బిర్యానీ తెప్పించుకుని, టీవీ చూస్తూ తింటుంటాను. అప్పుడు బిర్యానీ రుచిగా లేకపోతే, ఓ ఆవకాయ ముక్క పెట్టుకుని తినేస్తాను. మామిడికాయల వల్ల మొహం మీద గడ్డలు వస్తాయనీ, పచ్చళ్లు శరీర బరువుని పెంచుతాయంటారు కదా? నాకలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. బరువు గురించి కూడా అస్సలు ఆలోచించను. కమ్మని ఆవకాయ్ తినని జీవితం ఎందుకండీ? షూటింగ్స్ కోసం దేశ, విదేశాలు తిరుగుతుంటారు కదా.. ఎక్కడికెళ్లినా ఆవకాయ్ దొరుకుతుందా? మన తెలుగువాళ్ల గొప్పదనం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా తమతో పాటు ఆవకాయ ఉంచుకుంటారు. చెన్నయ్‌లో షూటింగ్ అనుకోండి, అక్కడ వడ్డించే పచ్చళ్లల్లో మన ఆవకాయ్ ఉంటుంది. విదేశాల్లోని సూపర్ మార్కెట్స్‌లో, తెలుగు హోటల్స్‌లో కూడా దొరుకుతుంది. అవునూ.. మీ ఇంట్లో పచ్చడి జాడీలున్నాయా? ఉన్నాయి. అప్పట్లో అమ్మమ్మ, నాన్నమ్మ పచ్చడిని జాడీలో పెట్టి, జాడీ మూతకు తెల్లటి గుడ్డ కట్టి, భద్రపరిచేవారు. అది చూడ్డానికే ఎంతో బాగుండేది. - డి.జి. భవాని చరిత్ర అడగొదు ఆదియందు అక్షరమే తప్ప ఆవకాయ లేకపోవచ్చు. వేదము వలె ఆవకాయ సత్య సనాతనమైనది కాకపోవచ్చు. అయినా, ఆవకాయ కూడా వేదం వలెనే అపౌరుషేయం. శాకాహార, మాంసాహార పదార్థాలను ఎక్కువకాలం నిల్వ చేసేందుకు ఊరవేసే ప్రక్రియ దాదాపు నాలుగువేల ఏళ్ల కిందటే మొదలైనట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రాచ్య, అప్రాచ్య దేశాలలో కూరగాయ ముక్కలను, మాంసం ముక్కలను ఉప్పునీటిలో లేదా వెనిగర్‌లో ఊరవేసేవారు. అంతకంటే పెద్దగా కష్టపడేవారు కాదు, కొత్తగా ఆలోచించేవారు కాదు. అవన్నీ ఆదిమ పద్ధతుల్లో తయారయ్యే ఊరగాయలు! దే ఆర్ వెరీ ప్రిమిటివ్ పికిల్స్! వాటి తయారీ పద్ధతిలో నేటికీ పెద్దగా మెరుగుదల లేదు. ఆవకాయ రుచి ఎరుగని అమాయకులు పాపం వాటితోనే నెట్టుకొచ్చేస్తున్నారు. ఆవకాయ ఆవిర్భావాన్ని గురించి మనకు ఇదమిత్థమైన పౌరాణిక, ఐతిహాసిక ఆధారాలేవీ లభించడం లేదు. నానా రుచులను నోరారా వర్ణించిన కవిసార్వభౌముడు శ్రీనాథుడి కావ్యాలలో సైతం ఆవకాయ ప్రస్తావన లేదు. అంటే, ఆవకాయ నిస్సందేహంగా శ్రీనాథుడి తర్వాతి కాలం నాటి ఆవిష్కరణే. ఆవకాయ పెట్టడానికి మామిడికాయలు, ఆవాలు, మిరపకాయలు, ఉప్పు, నూనె కావాలి. మామిడి, ఆవాలు, ఉప్పు, నూనె వాడుక మన దేశంలో క్రీస్తుపూర్వం నుంచే ఉండేది. ఆవకాయ ఘాటులో, ఎర్రని రంగులో కీలక పాత్ర పోషించే మిరపకాయలు మాత్రం క్రీస్తుశకం 15-16 శతాబ్దాల మధ్యకాలంలో విదేశీ వర్తకుల ద్వారా మన దేశానికి వచ్చాయి. కొలంబస్ రాక తర్వాత.. అంటే 1492 తర్వాత మిరపకాయలు ఇక్కడకు చేరాయి. పోర్చుగీసు, డచ్ వర్తకుల ప్రోత్సాహంతో మిరపకాయల సాగు నెమ్మదిగా విస్తరించింది. వారి ప్రాబల్యంతోనే తెలుగువారు ఎగుమతుల కోసం తయారుచేసే మామిడి ఊరగాయకు మిరపపొడిని జోడించడం మొదలుపెట్టారు. మన తెలుగువారికి ఆమాత్రం ప్రోత్సాహం దొరకాలే గానీ, ఇక ఆగుతారా..? మనవాళ్లవి అసలే క్రియేటివ్ బ్రెయిన్స్! ప్రయోగాల మీద ప్రయోగాలు సాగించి, సాగించి, చివరకు ఆవకాయ ఫార్ములాను సాధించారు. మిరపపొడి ధాటికి మనకంటూ ఓ ఫైర్‌బ్రాండ్ నిల్వపచ్చడి తయారైంది. రుచి అమోఘం మాత్రమే కాదు, రంగు కూడా అత్యంత ఆకర్షణీయం.. కంచంలో వేడివేడి అన్నం వడ్డించుకుని, కొత్తావకాయ కలుపుకుంటేనా..! ఆ దృశ్యాన్ని చూస్తేనే చాలు, కంచంలో మర్డర్ జరిగినట్లుంటుంది.. ఇదీ మన తెలుగోళ్ల కలాపోసన! ఆవకాయ ఫార్ములా కనిపెట్టాక, ఒకే రకమైన మూసపద్ధతిలోనే మనవాళ్లు ఆగిపోలేదు. సామవేద పారంగతులైన విద్వద్వరేణ్యులు చిన్న చిన్న స్వరభేదాలతో అద్భుత, అమోఘ, అపురూప రాగాలను సృష్టించిన రీతిలోనే, చిన్న చిన్న రుచిభేదాలతో చవులూరించే రకరకాల ఆవకాయలను సృష్టించారు. ఆవకాయ సృష్టికర్త ఎవరో, పేరేమిటో చరిత్రకెక్కలేదు. ఆవకాయను ఆత్మగౌరవ చిహ్నంగా మార్చుకున్న ఆంధ్రులు.. ఆవకాయ సృష్టికర్తకు ఆజన్మాంతం రుణగ్రస్తులై ఉంటారు. అయితే, ప్రాతఃస్మరణీయుడై, పూజలందుకోవలసిన ఆవకాయ సృష్టికర్తను విస్మరించినందుకు మాత్రం మన తెలుగువాళ్లను చరిత్ర క్షమించదు! - పన్యాల జగన్నాథదాసు తెలంగాణ ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా., మెంతులు - 100 గ్రా., నూనె - 2 కిలోలు, ఆవాలు - 50 గ్రా, జీలకర్ర - 50 గ్రా, కరివేపాకు - 1 కట్ట తయారీ: మెంతుల్ని నూనె లేకుండా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓ బేసిన్లో మామిడి ముక్కలు, కారం, ఉప్పు, ఆవపిండి వేసి బాగా కలపాలి. మొత్తం నూనెను వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. వేగిన తర్వాత దించేసి చల్లార్చుకోవాలి. వేడి లేదని నిర్ధారించుకున్నాక ముక్కల మిశ్రమంలో వేసి బాగా కలపాలి. తర్వాత పచ్చడిని జాడీలో వేసి, మూడు రోజుల పాటు ఊరనివ్వాలి. బెల్లం ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, బెల్లం - 1 కిలో, నూనె - తగినంత తయారీ: బెల్లాన్ని తురుముకోవాలి. మామిడి ముక్కల్లో కారం, ఉప్పు, ఆవపిండి, బెల్లం తురుము వేసి బాగా కలపాలి. ముక్కలు తడిసేలా కొద్దిగా నూనె కూడా వేసి కలపాలి. తర్వాత ఈ ముక్కల్ని ఎండలో పెట్టాలి. రెండు రోజుల్లో ముక్కలకు పట్టిన బెల్లం పాకంలాగా తయారవుతుంది. అప్పుడు ముక్కల్ని జాడీలో వేసి, మునిగేవరకూ నూనె వేసి మూత పెట్టెయ్యాలి. మగ్గిన తర్వాత తీసుకోవాలి. కొందరు తాలింపు కూడా వేసుకుంటారు. నచ్చితే వేసుకోవచ్చు. లేదంటే మామూలుగా కూడా బాగుంటుంది. ఆంధ్ర ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా., మెంతులు - 100 గ్రా., నూనె - తగినంత తయారీ: ఓ బేసిన్లో మామిడి ముక్కలు, కారం, ఉప్పు, ఆవపిండి వేసి బాగా కలపాలి. జాడీ తీసుకుని... కాసిని మామిడి ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కాసిన్ని మెంతులు... ఇలా పొరలుగా వేసుకోవాలి. చివరగా ముక్కలు మునిగేవరకూ నూనె వేసి మూత పెట్టెయ్యాలి. మూడు రోజుల తర్వాత మూత తీసి, ఒకసారి కలిపి మళ్లీ మూత పెట్టెయ్యాలి. రెండు మూడు రోజుల్లో ఆవకాయ రెడీ అయిపోతుంది. నువ్వు ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, నువ్వులు - అరకిలో, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, అల్లం వెల్లుల్లి ముద్ద - అరకప్పు, ఆవపిండి - 100 గ్రా., జీలకర్ర పొడి - 50 గ్రా., మెంతి పొడి - 2 చెంచాలు, ఇంగువ - చిటికెడు, పసుపు - 2 చెంచాలు, ఆవాలు - 3 చెంచాలు, జీలకర్ర - 3 చెంచాలు తయారీ: నువ్వులను దోరగా వేయించి, మెత్తగా పొడి చేసుకోవాలి. ఓ గిన్నెలో నువ్వుల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతిపొడి, పసుపు, ఆవపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కొద్దిగా నూనె వేడి చేసి... జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి. చల్లారిన తర్వాత కలిపి పెట్టుకున్న పొడుల మిశ్రమంలో వేయాలి. తర్వాత వీటన్నిటినీ మామిడి ముక్కల్లో వేసి బాగా కలపాలి. కొన్ని నువ్వుల్ని దోరగా వేయించి వాటిని కూడా కలిపి, తర్వాత జాడీలో వేసి నిండుగా నూనె వేయాలి. ఆత్రేయపురం రండి... ఆత్రేయపురం పూతరేకులు ఎంత ఫేమస్సో, పచ్చళ్లూ అంతే ఫేమస్. మా ఊళ్లో చాలా కుటుంబాలు పచ్చళ్ల వ్యాపారం మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. దాదాపు మూడు వేల కుటుంబాలు రుణాలు తెచ్చుకుని మరీ పచ్చళ్లు తయారు చేస్తున్నాం. యేటా దాదాపు వంద కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి ఇక్కడ. సీజన్‌కి తగ్గట్టుగా పచ్చళ్లు చేసినా, వేసవిలో పని మరింత ఎక్కువ ఉంటుంది. మేం తయారు చేసిన పచ్చళ్లు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. - పెన్నాడ గాంధీ, పచ్చళ్ల వ్యాపారస్తుడు, ఆత్రేయపురం జబ్బ బలం... కాయ ఖతం పదిహేనేళ్లుగా ముక్కలు కొట్టే పని చేస్తున్నాను. యేటా మే నెల నుంచి జూన్ మొదటి వారం వరకూ చేతి నిండా పని ఉంటుంది. చాలామంది వచ్చి మామిడి కాయలు కట్ చేయించుకుని వెళ్తుంటారు. కాయకి మూడు నుంచి ఐదు రూపాయల వరకూ తీసుకుంటాను. మరీ అంత తీసుకుంటే ఎలా అని కొందరు అంటుంటారు. కానీ ఏం చేస్తాం? ముక్కలు కొట్టడం అంత తేలికైన పనేమీ కాదు. చాలా బలం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ మాత్రం తీసుకోకపోతే గిట్టుబాటు కాదు కదా! - అబ్దుల్, మెహదీపట్నం రైతుబజార్ గుంటూరుతో గేమ్స్ వద్దు ఆవకాయ అనగానే అందరికీ గుర్తొచ్చేది గుంటూరే. పల్నాడు ప్రాంతంలో పండే మిరపతో పెట్టే ఆవకాయ రుచి మరి దేనికీ రాదన్నది అందరూ అనేమాట. ఇక్కడ ఏ యేటికా ఏడు వ్యాపారం పెరుగుతూ ఉండటానికి కారణం ఆ నమ్మకమే. ఆ నమ్మకాన్ని పాడు చేయకూడదని పూర్వం నుంచి పెద్దవాళ్లు పాటించిన విధానాలనే మేము ఇప్పటికీ పాటిస్తున్నాం. రెడీమేడ్ పొడులు వాడం. మేమే ఇళ్లలో పొడులు తయారు చేసుకుంటాం. నాణ్యమైన నువ్వుల నూనె వాడుతున్నాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇప్పటికీ మా పచ్చళ్లకు ఆదరణ తగ్గలేదు. మా జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. - పొదిలే రమాదేవి, అతిథిగృహ ఫుడ్స్, గుంటూరు జాడీ... మామిడీ... మేలైన జోడీ... తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పచ్చళ్ల వ్యాపారం పెద్ద స్థాయిలో జరుగుతుంది. దాన్ని ఆధారంగా చేసుకునే రాజమండ్రి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జాడీలు తయారు చేసే ఫ్యాక్టరీలు చాలా ఏర్పడ్డాయి. వీటి నుంచి వేల సంఖ్యలో జాడీలు రవాణా అయ్యేవి. అయితే ప్లాస్టిక్ డబ్బాల వాడకం పెరిగాక జాడీలు కొనేవాళ్లు తగ్గారు. దాంతో 42 యూనిట్లలో కేవలం మూడు మాత్రమే మిగిలాయి. పచ్చడి నిల్వ ఉండటానికి, ఆరోగ్యానికి హాని జరక్కుండా ఉండటానికి జాడీలే మంచివని ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోవడం లేదు. - గొర్రిపాటి అప్పల్రాజు, తూ.గో. జిల్లా సెరామిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు గోంగూర ఆవకాయ కావలసినవి: గోంగూర - 20 కట్టలు, నూనె - 1 కిలో, వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా., ఆవపిండి - 1 కప్పు, ఉప్పు - 1 కప్పు, కారం - 1 కప్పు, ఆవాలు - 4 చెంచాలు, మెంతిపిండి - 2 చెంచాలు తయారీ: గోంగూర ఆకుల్ని కాడల్నుంచి వేరు చేసి శుభ్రంగా కడగాలి. తర్వాత తడి పోయేలా నీడలో ఆరబెట్టాలి. ఆపైన నూనెలో వేయించి తీయాలి. ఆవాలు, వెల్లుల్ని రెబ్బల్ని కూడా నూనెలో వేయించి తీయాలి. ఓ గిన్నెలో గోంగూర, కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి వేసి బాగా కలపాలి. తర్వాత ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కలిపి జాడీలో వేయాలి. చివరగా నూనె పోసి మూత పెట్టాలి. కావాలంటే తాలింపులో వేరుశెనగలు, జీలకర్ర, ఇంగువ వంటివి కూడా వాడుకోవచ్చు. ఉసిరి ఆవకాయ కావలసినవి: ఉసిరికాయలు - 2 కిలోలు, నూనె - 2 కిలోలు, కారం - అరకిలో, ఆవపిండి - అరకిలో, ఉప్పు - అరకిలో, మెంతులు - 50 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా. తయారీ: మెంతుల్ని నూనె లేకుండా వేయించి పక్కన పెట్టాలి. ఉసిరికాయల్ని కడిగి, గాట్లు పెట్టి, తడి లేకుండా తుడిచి ఆరబెట్టాలి. తర్వాత వీటిని నూనెలో వేయించి తీయాలి. వీటిలో ఉప్పు, కారం, ఆవపిండి వేసి బాగా కలపాలి. తర్వాత మెంతులు, వెల్లుల్లి కూడా కలిపి జాడీలో వేయాలి. ముక్కలు మునిగేదాకా నూనె పోసి మూత పెట్టాలి. మునగావకాయ కావలసినవి: మునక్కాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, చింతపండు గుజ్జు - 1 కప్పు, ఇంగువ - చిటికెడు, మెంతిపిండి - 4 చెంచాలు, జీలకర్ర పొడి - 2 చెంచాలు, వెల్లుల్లి రెబ్బలు - 50 గ్రా., నూనె - తగినంత, కరివేపాకు - 4 రెమ్మలు, ఆవాలు - 2 చెంచాలు, జీలకర్ర - 2 చెంచాలు తయారీ: మునక్కాయ ముక్కల్ని కడిగి ఆరబెట్టాలి. తర్వాత వాటిని నూనెలో వేయించుకోవాలి. చల్లారిన తర్వాత కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ఆవపిండి వేసి కలిపి జాడీలో పెట్టెయ్యాలి. ముక్కలు మునిగేవరకూ నూనె పోసి మూత పెట్టాలి. రెండు రోజుల తర్వాత కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువతో పోపు పెట్టి పచ్చడిలో కలపాలి. మళ్లీ మూత పెట్టేసి రెండు రోజులు ఊరనిస్తే ఆవకాయ రెడీ. కాలీఫ్లవర్ ఆవకాయ కావలసినవి: కాలీఫ్లవర్ ముక్కలు - 4 కప్పులు, నూనె - 2 కప్పులు, వెల్లుల్లి రెబ్బలు - అరకప్పు, కారం - 1 కప్పు, ఉప్పు - 1 కప్పు, ఆవపిండి - 1 కప్పు, పసుపు - 2 చెంచాలు తయారీ: కాలీఫ్లవర్స్ ముక్కల్ని వేడి నీటిలో వేసి రెండు నిమిషాలు ఉంచి తీస్తే పురుగులు ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత ఈ ముక్కల్ని ఎండలో ఆరబెట్టాలి. ఆపైన నూనెలో దోరగా వేయించి తీసేయాలి. ఈ ముక్కల్లో ఉప్పు, ఆవపిండి, కారం, పసుపు వేసి బాగా కలపాలి. చివరగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి, జాడీలో పెట్టి, నూనె పోసి మూత పెట్టెయ్యాలి. ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు. నిమ్మ ఆవకాయ కావలసినవి: నిమ్మకాయలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఆవపిండి - 50 గ్రా., మెంతిపిండి - 6 చెంచాలు, ఉప్పు - అరకిలో, నూనె - సరిపడా, ఆవాలు - 4 చెంచాలు, ఎండు మిరపకాయలు - 15, కరివేపాకు - 1 కట్ట, వెల్లుల్లి రెబ్బలు - 1 కప్పు తయారీ: నిమ్మకాయల్ని నాలుగు బద్దలుగా నిలువుగా కోసుకోవాలి. జాడీలో ఓ పొర నిమ్మకాయ ముక్కలు, ఓ పొర ఉప్పు... ఇలా పొరలు పొరలుగా వేసుకుని మూత పెట్టేయాలి. మూడు రోజుల తర్వాత ముక్కల్ని తీసి ఎండలో పెట్టాలి. నిమ్మరసం ఊరి జాడీలో పడుతుంది. దాన్ని కూడా ఎండలో పెట్టాలి. ఎండ తగ్గాక తీసి రెండిటినీ జాడీలో వేసి మూత పెట్టాలి. మూడు రోజుల పాటు ఇలానే చేయాలి. తర్వాత ముక్కల్ని ఓ బేసిన్లో వేసుకుని.. ఆవపిండి, మెంతిపిండి, కారం కలిపి మళ్లీ జాడీలో పెట్టి, నిండా నూనె వేయాలి. మూడు రోజుల తర్వాత తీసి... ఎండుమిర్చి ముక్కలు, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు నూనెలో వేయించి, ఆ తాలింపును నిమ్మకాయ మిశ్రమంలో కలపాలి. కాకర ఆవకాయ కావలసినవి: కాకరకాయ ముక్కలు - 2 కిలోలు, ఉప్పు - అరకిలో, చింతపండు - పావుకిలో, కారం - అరకిలో, ఆవపిండి - 4 చెంచాలు, నూనె - తగినంత, ఆవాలు - 4 చెంచాలు, జీలకర్ర - 4 చెంచాలు, కరివేపాకు - 2 రెమ్మలు తయారీ: కాకరకాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి, ముక్కలుగా కోసుకోవాలి. చింతపండులో నీళ్లుపోసి స్టౌమీద పెట్టాలి. మెత్తగా ఉడికాక దించేసి చల్లారబెట్టి, మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి, కాకరకాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. తర్వాత ఈ ముక్కల్లో చింతపండు గుజ్జు, కారం, ఆవపిండి, ఉప్పు వేసి కలిపి జాడీలో పెట్టి నూనె పోయాలి. రెండు రోజుల తర్వాత... జీలకర్ర, ఆవాలు, కరివేపాకుతో తాలింపు పెట్టి, ఆ తాలింపును పచ్చడిలో వేసి కలపాలి. పెసర ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, పెసర పిండి - అరకిలో (రెడీమేడ్ కంటే పెసల్ని కాస్త వేయించుకుని, పిండి పట్టించి వాడుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది), వెల్లుల్లి రెబ్బలు - 100 గ్రా., మెంతులు - 100 గ్రా. తయారీ: మెంతుల్ని నూనె లేకుండా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓ బేసిన్లో మామిడి ముక్కలు, కారం, ఉప్పు,పెసరపిండి వేసి బాగా కలపాలి. జాడీ తీసుకుని... కొన్ని ఆవకాయ ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కాసిన్ని మెంతులు... ఇలా పొరలుగా వేసుకోవాలి. చివరగా ముక్కలు మునిగేవరకూ నూనె వేసి మూత పెట్టెయ్యాలి. మూడు రోజుల తర్వాత మూత తీసి, ఒకసారి కలిపి మళ్లీ మూత పెట్టెయ్యాలి. రెండు మూడు రోజుల్లో ఆవకాయ రెడీ అయిపోతుంది. టొమాటో ఆవకాయ కావలసినవి: టొమాటోలు - 2 కిలోలు, ఉప్పు - అరకిలో, కారం - అరకిలో, ఆవపిండి - 50 గ్రా., వెల్లుల్లి రెబ్బలు - 50 గ్రా., నూనె - సరిపడా, చింతపండు - పావుకప్పు, కరివేపాకు - 1 కట్ట, ఆవాలు - 6 చెంచాలు, ఎండుమిర్చి - 15 తయారీ: టొమాటోలను ముక్కలుగా కోసుకోవాలి. వీటికి ఉప్పు చేర్చి జాడీలో పెట్టాలి. మూడో రోజు తీసి ఎండలో పెట్టాలి. జాడీలోకి ఊరిన టొమాటో రసాన్ని కూడా ఎండలో పెట్టాలి. మళ్లీ సాయంత్రం రెండిటినీ కలిపి జాడీలో పెట్టేయాలి. మూడు రోజులు అలా ఎండబెట్టిన తర్వాత... టొమాటో ముక్కలు, రసం, చింతపండు కలిపి మిక్సీ పట్టాలి. మరీ పేస్ట్‌లా అవ్వకుండా కొంచెం ముక్కలుగా ఉండేలా చూసుకోవాలి. ఈ మిశ్రమానికి ఆవపిండి, ఉప్పు, కారం బాగా పట్టించి జాడీలో పెట్టి, మునిగేవరకూ నూనె పోయాలి. రెండు రోజుల తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలను నూనెలో వేయించి పచ్చడిలో కలపాలి. అల్లం ఆవకాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 2 కిలోలు, కారం - అరకిలో, ఉప్పు - అరకిలో, ఆవపిండి - అరకిలో, అల్లం - 200 గ్రా., వెల్లుల్లి రెబ్బలు - 200 గ్రా., మెంతులు - 25 గ్రా., జీలకర్ర - 25 గ్రా., ఎండుమిర్చి - 10, ఆవాలు - 2 చెంచాలు, నూనె - తగినంత తయారీ: అల్లం, వెల్లుల్లి రెబ్బల్ని శుభ్రం చేసి... నీళ్లు కలపకుండా మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. మెంతులు, జీలకర్రను వేయించి పొడి చేసుకోవాలి. ఈ పొడితో పాటు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్ద మామిడి ముక్కల్లో వేసి కలపాలి. తగినంత నూనె వేసి కలిపి జాడీలో పెట్టాలి. మూడు రోజుల తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు పెట్టి, దాన్ని పచ్చడిలో కలపాలి. డాక్టర్ ఆవకాయ! పచ్చిమామిడిలో విటమిన్ ‘బి’తో పాటు విటమిన్ ‘సి’ కూడా ఎక్కువ. ఈ రెండు విటమిన్ల కారణంగా మామిడికాయ పచ్చడితో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో ఈ రెండు విటమిన్లు తోడ్పడతాయి. ⇒ ఆవపిండిలో మినరల్స్ ఎక్కువ. పైగా క్యాన్సర్‌తో పోరాడే శక్తి ఉంటుంది. అలాగే మెంతిపిండిలో ప్రోటీను, విటమిన్ సి, నియాసిన్, పొటాషియమ్, ఐరన్ ఉంటాయి. ఫలితంగా శరీరానికి అవసరమైన కీలక పోషకాలు, మైక్రోన్యూట్రియెంట్స్ లభ్యమవుతాయి. ⇒ ⇒ ⇒మామిడిలోని పీచుతో పాటు, మెంతిలోని పీచు కలిసి శరీరానికి అవసరమైన ఫైబర్‌ని సమకూరుస్తాయి. ఇక మెంతుల్లో కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉండటం వల్ల గుండెజబ్బుల ఆస్కారం తగ్గుతుంది. ⇒ఆవకాయలో ఉపయోగించే వెల్లుల్లిలో యాంటీక్యాన్సర్ గుణాలు ఉండటం వల్ల ఇది క్యాన్సర్‌ను నిరోధించడంతో పాటు, కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ⇒ నువ్వుల నూనెలో మెగ్నీషియమ్ పుష్కలంగా ఉంటుంది. దానిలో రక్తపోటును తగ్గించే గుణాలతో పాటు, డయాబెటిస్‌నూ నివారించే గుణాలున్నాయి. ఈ రెండు గుణాలూ కలగలసి ఉండటం వల్ల గుండెజబ్బులూ తగ్గుతాయి. కాబట్టి ఆవకాయలో నువ్వుల నూనెను ఉపయోగించడం ఎంతైనా ఉత్తమం. ⇒ కొందరు ఆవకాయలో పల్లీల నూనె (వేరుశెనగనూనె)ను వాడతారు. పల్లీ నూనె మంచిదే. దీనివల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఎందుకంటే 100 గ్రాముల నూనెలో 884 క్యాలరీల శక్తి ఉంటుంది. పల్లీ నూనెలోని ఒమెగా - 6 ఫ్యాటీ ఆసిడ్స్ శరీరానికి మంచి పోషకాలు ఇస్తాయి.పైగా ఇందులోని యాంటీఆక్సిడెంట్లు వయసు తగ్గినట్లు కనిపించడానికి సాయం చేస్తాయి. అలాగే ఎన్నో క్యాన్సర్లను, ఆల్జైమర్స్ వంటి కొన్ని వ్యాధులను సమర్థంగా నివారించేందుకు పోరాడతాయి. (ఆవకాయలో నువ్వుల నూనె లేదా పల్లీల నూనె ఉపయోగించడం వ్యక్తిగత అభిరుచిమీద ఆధారపడి ఉంటుంది. పల్లీల నూనెతో రుచి ఎక్కువ. నువ్వుల నూనెలో పోషకాలు ఎక్కువ). మితిమీరితే అనర్థమే... పోషకగుణాలు ఉన్నప్పటికీ కొత్త ఆవకాయతో అనర్థాలూ ఉన్నాయి. పచ్చడి చెడిపోకుండా ఉండేందుకు ఉప్పును ఎక్కువగా వేసి ప్రిజర్వేటివ్‌లా ఉపయోగిస్తారు. దాని వల్లబీపీ పెరిగే అవకాశాలు ఎక్కువ ఇక పచ్చడిలో కారంపాళ్లు అధికంగా ఉండటం వల్ల కడుపులో ఏవైనా పుండ్లు, అల్సర్లు ఉంటే అవి మరింతగా మంట పుట్టించవచ్చు నూనెలో ఉండే కొవ్వు పదార్థాలు ఆలస్యంగా జీర్ణమయ్యే గుణాలను కలిగి ఉంటాయి. దాంతో కొందరిలో పచ్చడి తిన్నప్పుడు జీఈఆర్డీ (గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్) లక్షణాలు కనిపిస్తూ, ఛాతిలో మంట (హార్ట్‌బర్న్) అనిపిస్తుంటుంది. కాబట్టి పచ్చడి వేసుకునే సమయంలో నూనెను తక్కువగానే వేసుకోవాలి. పైగా నూనెలోని కొవ్వులు గుండెకు అంత మేలు కూడా కాదు. - సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్టు పికిల్ ప్రికాషన్స్ ⇒పచ్చడి పెట్టేముందు కాయల ముచికలు కోసేసి, ఒకట్రెండు గంటల పాటు నీటిలో వేసి ఉంచాలి. దానివల్ల సొన అంతా కారిపోతుంది. తర్వాత కాయల్ని శుభ్రంగా కడిగి, తుడిచి, తడి ఆరాక కోసుకోవాలి. ⇒వాడే పాత్రలు, గరిటెలు, నిల్వ చేసే జాడీలు అన్నీ శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరబెట్టాలి. ⇒పచ్చడి జాడీలో వేసిన తర్వాత గుడ్డ చుడతారు. ఆ గుడ్డ కచ్చితంగా శుభ్రమైనదై ఉండాలి. ⇒ స్టీలు, రాగి, ప్లాస్టిక్ డబ్బాల్లో పచ్చడిని భద్రపర్చకూడదు. ⇒ఒకవేళ చేతితో కలుపుతుంటే చేతికి తడి లేకుండా చూసుకోవాలి. గరిటెతో కలపాలి అనుకుంటే చెక్క గరిటెతో కలపడం మంచిది. అలాగే పచ్చడి జాడీలోంచి తీసుకున్న ప్రతిసారీ తడి గానీ, చల్లని గాలి గానీ తగలకుండా జాగ్రత్తపడాలి. ⇒పచ్చడి జాడీలో వేశాక ఊరేలోపు అప్పుడప్పుడూ చెక్ చేసుకోవాలి. నూనె సరిపోకపోతే వెంటనే నూనె వేసుకోవాలి. లేకపోతే బూజు వచ్చేస్తుంది. ⇒పచ్చడికి ఏ నూనె పడితే ఆ నూనె వాడకూడదు. మంచి వేరుశెనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుంది. ⇒ వీలైనంత వరకూ రెడీమేడ్ పిండి కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న ఆవపిండి, మెంతిపిండి వాడితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పదార్థాల్లో శార్దూలం సీ. మామిళ్లముక్కపై మమకారమున్ జల్లి అందింపంగా జిహ్వ ఆవకాయ ఎండకాలమునందు ఎండిపోయిన గుండెకు అభినందనము దెల్పు నావకాయ కూరలే లేనిచో కోమలి వేయుచో అనురాగమున్ జూపు నావకాయ చీకుచున్నను గాని పీకుచున్నను గాని ఆనందమే ఇచ్చు నావకాయ ఆపదల నాదుకొను కూర ఆవకాయ అతివ నడుమైన జాడీయె ఆవకాయ ఆంధ్రమాత సింధూరమ్మె ఆవకాయ ఆంధ్రదేశమ్మె తానొక్క ఆవకాయ - మహాసహస్రావధాని డా. గరికపాటి నరసింహారావు ముక్క మహత్తరి మామిడి, ఆవాలు, మిరపకాయలు అని ఆవకాయలో మూడు ద్రవ్యాలుంటాయి. వాటిలో ఆవాలతో సర్షప హోమం, మిర్చితో ప్రత్యంగిరా హోమం, మామిడి ముక్కలు, కారంతో భగళాముఖి హోమం చేస్తారు. చూతవృక్షం అంటే మామిడి చెట్టు దైవవృక్షం. అంచేతనే సంప్రదాయ కుటుంబాలలో ఆవకాయను మడిగా పెడతారు. దానిని మడిగా కొయ్యజాడీలలో పెట్టి అటకెక్కిస్తారు. కావలసినప్పుడల్లా మడిగానే తీసుకుని వాడుకుంటారు. ఇక మాగాయ పచ్చడి గురించి పోతన భాగవతంలో పద్యాలు కూడా ఉన్నాయి. దానిని శ్రీకృష్ణుడికి నివేదన ద్రవ్యంగా వాడతారు. కొన్ని గిరిజన కుటుంబాలలో ఇప్పటికీ కూడా తమ దేవతకు పెరుగన్నంలో ఆవకాయ వేసి నివేదన చేస్తుంటారు. అంటే ఆవకాయ ఇప్పటిది కాదు.. ఎప్పటినుంచో ఉందన్నమాటేగా! - డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు, పౌరాణిక పండితులు ఎర్రగా నవ్వండి భర్త: ఇవాళ ఏం వండావ్..? భార్య: ఆవకాయ.. మీకిష్టమే కదా! సేల్స్‌మేన్: ‘స్వచ్ఛభారత్’ సబ్బు తీసుకుంటారా..? కస్టమర్: దీని స్పెషాలిటీ ఏంటి..? సేల్స్‌మేన్: ఆవకాయ మరకల్ని కూడా ఇట్టే వదిలిస్తుంది. పనిమనిషి: అమ్మా! కంచాలన్నీ శుభ్రంగా కడిగేసినట్లున్నారు.. నేనేం కడగాలి..? ఆండాళు: కొత్తావకాయ వడ్డించా..! అందరూ శుభ్రంగా నాకేశారు. వాటినింకా కడగలేదు.. డోసుబాబుని నెలాఖర్లో మందుపార్టీకి ఆహ్వానించాడు గ్లాసుబాబు డోసుబాబు: మందులోకి మంచింగ్ ఏంట్రా..? గ్లాసుబాబు: ఓన్లీ ఆవకాయ్.. మన్దసలే బడ్జెట్ పార్టీ కదా.. మటన్ ఆవకాయ కావలసినవి: మటన్ - 2 కిలోలు, కారం - కిలోన్నర, ఆవపిండి - 10 చెంచాలు, జీలకర్ర పొడి - 10 చెంచాలు, మెంతిపిండి - 10 చెంచాలు, ఆమ్చూర్ పౌడర్ - 10 చెంచాలు, పసుపు - 2 చెంచాలు, ఉప్పు - 1 కిలో, నూనె - తగినంత తాలింపు కోసం: ఎండుమిర్చి - 10, వెల్లుల్లి రెబ్బలు - పావుకిలో, కరివేపాకు - 4 రెమ్మలు, జీలకర్ర - 2 చెంచాలు, ఆవాలు - 2 చెంచాలు తయారీ: మటన్‌ను ముక్కలుగా కోసి శుభ్రంగా కడగాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి ఉడికించి కాసేపు ఎండబెట్టాలి. తర్వాత వాటిని నూనెలో వేయించాలి. చల్లారాక మెంతిపిండి, ఆవపిండి, కారం, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ వేసి బాగా కలపాలి. కొద్దిగా నూనె వేడిచేసి... కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలతో తాలింపు పెట్టాలి. ఈ తాలింపును మటన్ ముక్కల్లో వేసి కలిపి, మూత బిగుతుగా ఉండే జాడీలో వేయాలి. పచ్చడి అంతా మునిగేవరకూ నూనె పోసి మూత పెట్టెయ్యాలి. మూడు నాలుగు రోజులు ఊరిన తర్వాత తింటే బాగుంటుంది. ఫిష్ ఆవకాయ కావలసినవి: చేపముక్కలు - 2 కిలోలు, కారం - 1 కిలో, అల్లం తురుము - పావుకప్పు, వెల్లుల్లి తురుము - పావుకప్పు, నల్ల మిరియాల పొడి - 4 చెంచాలు, వెనిగర్ - 5 చెంచాలు, పసుపు - 2 చెంచాలు, ఉప్పు - అరకిలో, నూనె - తగినంత తయారీ: చేపముక్కలకు పసుపు, మిరియాల పొడి, ఉప్పు కలిపి అరగంట పాటు ఉంచాలి. తర్వాత ఈ ముక్కల్ని నూనెలో ఎరుపు రంగు వచ్చేవరకూ వేయించాలి. తర్వాత మరో గిన్నె స్టౌ మీద పెట్టి నూనె వేయాలి. వేడెక్కాక అల్లం తురుము, వెల్లుల్లి తురుము వేసి వేయించాలి. వీటిని చేపముక్కల్లో వేసి కలపాలి. కారం, వెనిగర్ కూడా వేసి కలిపి జాడీలో వేయాలి. ముక్కలు మునిగేవరకూ నూనె పోసి మూత బిగించాలి. ఒకట్రెండు రోజులు ఊరనిస్తే పచ్చడి రెడీ అవుతుంది. కావాలంటే ముల్లు తీసేసి, మెత్తని భాగాన్ని ముక్కలుగా చేసుకుని కూడా పచ్చడి పెట్టుకోవచ్చు. చికెన్ ఆవకాయ కావలసినవి: బోన్‌లెస్ చికెన్ - 2 కిలోలు, కారం - కిలోన్నర, ఆవపిండి - 10 చెంచాలు, జీలకర్ర పొడి - 10 చెంచాలు, మెంతిపిండి - 10 చెంచాలు, ఆమ్చూర్ పౌడర్ - 10 చెంచాలు, పసుపు - 2 చెంచాలు, ఉప్పు - 1 కిలో, నూనె - తగినంత తాలింపు కోసం: ఎండుమిర్చి - 10, వెల్లుల్లి రెబ్బలు - పావుకిలో, కరివేపాకు - 4 రెమ్మలు, జీలకర్ర - 2 చెంచాలు, ఆవాలు - 2 చెంచాలు తయారీ: చికెన్‌ను ముక్కలుగా కోసి శుభ్రంగా కడగాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఓ రోజంతా ఎండబెట్టాలి. తర్వాతి రోజు ఈ ముక్కల్లో మెంతిపిండి, ఆవపిండి, కారం, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్ వేసి బాగా కలపాలి. కొద్దిగా నూనె వేడిచేసి... కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలతో తాలింపు పెట్టాలి. ఈ తాలింపును మటన్ ముక్కల్లో వేసి కలిపి, మూత బిగుతుగా ఉండే జాడీలో వేయాలి. పచ్చడి అంతా మునిగేవరకూ నూనె పోసి మూత పెట్టెయ్యాలి. మూడు నాలుగు రోజులు ఊరిన తర్వాత తింటే బాగుంటుంది. రొయ్యల ఆవకాయ కావలసినవి: రొయ్యలు - 2 కిలోలు, నూనె - 2 కిలోలు, కారం - 1 కిలో, ఉప్పు - ముప్పావు కిలో, లవంగాల పొడి - 4 చెంచాలు, వెల్లుల్లి పేస్ట్ - 4 చెంచాలు, నిమ్మకాయలు - 5 తయారీ: రొయ్యల్ని శుభ్రం చేసి, ఐదు నిమిషాల పాటు వేడి నీటిలో వేసి ఉంచాలి. తర్వాత నీళ్లు తీసేసి, ఆరబెట్టాలి. తడి పోయిన తర్వాత నూనెలో వేయించుకోవాలి. తర్వాత వీటిలో లవంగాల పొడి, కారం, ఉప్పు, వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి నిమ్మరసం పిండాలి. తర్వాత పచ్చడిని జాడీలో వేసి, నూనె పోసి మూత పెట్టెయ్యాలి. నాలుగు రోజులు ఊరిన తర్వాత తీసుకుని తినవచ్చు. జ్ఞాపకం అప్పు చేసైనా ఆవకాయ పెట్టాల్సిందే! ఇప్పుడంటే ఏ కాయ పడితే ఆ కాయతో ఏదో ఆవకాయ పెట్టామని పించుకుంటున్నాం కానీ, మా తాతయ్య హయాంలో మాత్రం ఆవకాయ పెట్టడమంటే ఓ వైభోగమే. వేసవి వచ్చీ రాగానే తాతయ్య ఆవకాయ, మాగాయ ఎట్లా పెట్టించాలా అని హడావుడి పడేవారు. మాది పెద్ద కుటుంబం కావడాన కనీసం వంద కాయలకు తక్కువ కాకుండా ఆవకాయ, అంతకు ఓ పాతిక ముప్పై కాయల పెచైర్ల మాగాయా పెట్టేవాళ్లు. ముందు సన్న ఆవాలు తెప్పించి, వాటిని చెరిగి, ఎండబెట్టి, ఆవపిండి కొట్టించేవారు. బళ్లారి మిరపకాయలు కొనుక్కొచ్చి, తొడిమలు తీయించి ఎండబెట్టి, కారం కొట్టించేవారు. ఉప్పూ, పప్పునూనే ముందే సిద్ధంగా ఉండేవి. ఆనక తోటకు వెళ్లి, కాయలు కోయించి, గోతాల్లో తెచ్చి, మా మామ్మ ముందు పోసేవారు. ఆమె, అమ్మ, పిన్నులు, నాన్నగారి మేనత్తలు... అందరూ కలిసి తలా ఓ కత్తిపీట ముందేసుకుని కాయలన్నింటికీ ముచికలు తీసి, నీళ్లతొట్లో వేసేవారు. సొన అంతా పోయాక, వాటిని తీసి, బట్టతో శుభ్రంగా తుడిచిపెట్టేవాళ్లు. మా నాన్న, బాబాయిలు ముక్కలు కొట్టేవారు. అంతసేపూ ‘టెంక చెదిరిపోతోంది, ముక్క నలిగిపోతోంది, కొంచెం పెద్ద ముక్కలు కొట్టండర్రా ... అలాగని మరీ పెద్దగా కాదు... వేళ్లు జాగర్త...’’ అంటూ తెగ హడావుడి పెట్టేవారు తాతయ్య. రాసులుగా తరిగిపోసిన మామిడికాయ ముక్కలు, ఉప్పు, ఆవపిండి, కారం, నూనె.. అన్నింటినీ పెద్ద పెద్ద బేసిన్లలో పోసి, చేత్తోనే కలిపేసేది మామ్మ. మా ప్రభాతత్త రుచులు చూడటంలో స్పెషలిస్టు. తనకి నచ్చితే... అందరికీ నచ్చి తీరేది! పచ్చడి కలిపిన బేసిన్లోనే మరో నాలుగ్గరిటెల ఆవకాయ వేసి, వేడి వేడి అన్నం అందులో దిమ్మరించి, ఆపైన ఆరారగా నెయ్యి వేసి, మా అందరికీ కలిపి ముద్దలు పెట్టేది మామ్మ. అప్పుడే కలిపిన ఆవఘాటుకి, కారానికి ముక్కుల్లోనుంచి, ఆ రుచికి కళ్లల్లోంచి నీళ్లు కారేవి అందరికీ. ఆ తర్వాత పచ్చడిని జాగ్రత్తగా చిన్న, పెద్ద జాడీల్లో వేసి, వాటి మూతికి వాసెన కట్టి పెట్టేది మామ్మ. ఓ రెండు మూణ్ణెల్లపాటు ఇంటికి బంధువులెవరొచ్చినా... ‘‘కొత్తావకాయ రుచి చూపించి కానీ పంపేవారు కాదు. బాగా బతికినప్పుడు వంద, రెండువందల కాయలకు తక్కువ కాకుండా పచ్చడి పెట్టించిన తాతయ్య, చితికి పోయిన తర్వాత కూడా పచ్చళ్ల విషయంలో రాజీ పడలేదు. అప్పు చేసైనా సరే, ఆవకాయ పెట్టించి అందరికీ రుచి చూపించేవారు. అందుకే పచ్చళ్ల సీజన్ వచ్చిందంటే మామ్మా తాతయ్యా కళ్ల ముందు మెదులుతూనే ఉంటారు. - బాచి మాగాయ కావలసినవి: మామిడికాయ ముక్కలు - 1 కిలో, కారం - పావు కిలో, ఉప్పు - పావుకిలో, మెంతిపిండి - 4 చెంచాలు, ఆవపిండి - 4 చెంచాలు, ఇంగువ - చిటికెడు, ఎండుమిర్చి - 10, పసుపు - చిటికెడు, ఆవాలు - 4 చెంచాలు, జీలకర్ర - 2 చెంచాలు తయారీ: మామిడికాయలు చెక్కు తీసి, సన్నగా తరగాలి. వీటిలో ఉప్పు కలిపి రెండు రోజులు ఉంచాలి. ఈలోపు రసం బాగా ఊరుతుంది. రెండు రోజుల తర్వాత రసంలోంచి ముక్కలు వేరు చేసి ఎండబెట్టాలి. రసాన్ని కూడా కాసేపు ఎండలో ఉంచి తర్వాత ఆవపిండి, మెంతిపిండి, కారం వేసి కలపాలి. తర్వాత ఇందులో ముక్కలు కూడా వేసి కలపాలి. చివరగా నూనె వేడిచేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువతో తాలింపు వేసి పచ్చడిలో కలపాలి. వెంటనే కాకుండా ఒకట్రెండు రోజుల తర్వాత తింటే బాగుంటుంది. -
‘జ్యేష్టంలో భూమి పూజా? హవ్వ!'
అక్షర తూణీరం వేర్లు పడ్డాం. ఇల్లూ వాకిలీ లేదు. కుండా చట్టీ లేదు. చేట జల్లెడ, మంచం కుంచం లేవు. పాడీ పశువూ లేదు. ఆఖరికి చెట్టూ చేమా కూడా ఆ వాటా లోకే వెళ్లాయి. విడిపోయినా పదేళ్లపాటు సాధన సంపత్తిని ఉమ్మడిగా వాడుకోండని విడ గొట్టిన పెద్దలు చెప్పారు. ఏడాది తిరక్కుండా రాజకీయాలు మొదలైనాయి. ఆ గోడ మీది బల్లి ఈ గోడ మీద పాకకూడదన్నారు. అసలే రోష స్వభావి. దానికి తోడు దాయాది పోటీ. చంద్ర బాబు అర్జంటుగా కృష్ణాతీరానికి స్పాట్ పెట్టి, పాతికవేల ఎకరాలు పట్టేశారు. అలనాటి అమరావతికి గొప్ప వైభవం ఉంది. ఘన చరిత్ర ఉంది. వాస్తుబ్రహ్మలు అక్కడ ప్రతి అంగుళాన్ని తడిమి చూసి, బాగు బాగు అన్నారు. ఇప్పుడక్కడ ఒక మహాద్భుత మహానగరం రాబోతోంది. ఇహ అన్ని హంగులూ ఉన్న తెలంగాణలో కూడా నిర్మాణాత్మక మాటలు, అంటే కాంక్రీట్ కబుర్లు విరివిగా వినిపిస్తున్నాయి. ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ భవనాలు నిర్మిస్తామంటున్నారు. ఒకవైపు మిషన్ కాక తీయ కింద మట్టిపనులు, మరోపక్క స్వచ్ఛభారత్ కింద చెత్తపనులు జోరుగా సాగుతున్నాయి. నేల దొరికితే తాపీపనులు మొదలవుతాయి. అసలు సగం ఆఫీసులు, సగం ఉద్యోగులు, సగం కాపురాలు వెళ్లిపోయాయి కదా, ఇప్పుడీ కరువులో కొత్త నిర్మాణాలు అవసరమా అన్నాడు మా రామలింగేశ్వర్రావ్. దేవాలయాలకీ, విద్యా లయాలకీ, వైద్యాలయాలకీ సువిశాల ప్రాంగణాలు ఉండాలన్నాడు. ఐఐటీలన్నీ వేల ఎకరాల్లో ఎందుకుం టాయో తెలుసుకోవాలన్నాడు. ఇంతకీ ఎవడా రామలిం గేశ్వర్రావ్ అన్నాను. వాడొక ఓటరు. అయితేనేం, వాడు సలహా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. ‘పొయ్యి మీదకూ పొయ్యి కిందకూ ఉంటే; చెట్టు కిందైనా వండుకు తినొచ్చు’ అనేది మా అవ్వ. ఇప్పుడు ప్రపంచ స్థాయి కలల రాజధాని మనకి అవసరమా? ‘మన బతుక్కి మీసాలే దండగ, దానికి తోడు సంపెంగ నూనె కూడానా!’ అంటోంది మా అవ్వ. చంద్రబాబు వేదాంతాన్ని, ఇలాంటి నిర్వేదాంతాన్ని భరించడు. అసలు సహించడు. పైగా దైవజ్ఞులు నిర్ణయించిన శంకు స్థాపన ముహూర్తం మీద దుమారం రేగి, చెలరేగి సాగు తోంది. ‘జ్యేష్టంలో భూమి పూజా? హవ్వ!’ అంటూ అపోజిషన్ జ్యోతిష్కులు బుగ్గలు నొక్కుకుంటున్నారు. మోదీ రాయి వెయ్యడానికి స్వయంగా వస్తున్నారు కాబట్టి, హస్తినలో ఉన్న కేంద్ర పంచాంగ వేత్తలు కూడా ముహూర్తంపై దృష్టి సారిస్తారు. భూమి పూజకు జ్యేష్ట మాసం ప్రశస్తం. ఏరువాక వచ్చేదీ, భూమి దున్నడం ఆరంభించేదీ జ్యేష్టమాసంలోనే. కనుక ఆక్షేపణ లేదని కొందరి వాదన. జనన మరణాలకు, మంచి పనులు ఆరంభించడానికి ముహూర్తాలుండవని మరో వాదన. చంద్రబాబు గతంలో ఎన్నో ఘనకార్యాలు చేశారు. వాటికి ముహూర్తాలు ఎవరైనా పెట్టారా? కార్యసాధ కులు పరిస్థితులు డిమాండ్ చేసినపుడు దిగిపోతారంతే. ఆమాటకొస్తే అంతా ఘటన. ఏదీ మన చేతుల్లో లేదు. విజయనగర సామ్రాజ్యానికి పునాది వేస్తూ, విద్యారణ్యస్వామి ముహూర్తం నిర్ణయించారు. నక్షత్ర కదలికలను బట్టి నేను శంఖం పూరిస్తా, అప్పుడు శంకు స్థాపన జరగాలని ఆదేశించి ఆయన కొండెక్కి కూర్చు న్నారు. కాసేపటికి శంఖనాదం వినిపించింది. స్థాపన జరిగింది. అసలు ముహూర్తానికి స్వామి శంఖం విని పించింది. ముందు వినిపించింది ఓ జంగందేవర భిక్షా టనలో ఊదిందట. అందువల్ల కలకాలం ఉండాల్సిన విజయనగర సామ్రాజ్యం ఉండలేదని చెబుతారు. ముహూర్తబలం ఉంటుంది. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
లాడెన్ పత్రాలు... నిజాలు
ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉగ్రవాద ఘటనలకు కారకుడైన అల్ కాయిదా అగ్రనేత బిన్ లాడెన్‌ను హతమార్చి నాలుగేళ్లు కావస్తున్న సందర్భంగా అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన పత్రాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. నిజానికి ఆ పత్రాలు వెల్లడించిన అంశాల్లో చాలా భాగం అందరికీ తెలిసినవే. లాడెన్ గురించి ఇన్నాళ్లుగా అనుకుంటున్నవే... అంచనా వేస్తున్నవే. అయితే ఈ పత్రాలద్వారా వాటికి సాధికారత వచ్చింది. పరిమిత సంఖ్యలో విడుదలైన పత్రాలు గనుక ఇందులో లాడెన్ సంపూర్ణ చిత్రం ఆవిష్కృతం కాలేదు. అవన్నీ పూర్తిగా విడుదలైతే వివిధ అంశాల విషయంలో అతని ఆలోచనా ధోరణులెలా ఉన్నాయో...ఉగ్రవాదానికి తానే ఊపిరీ, ఊతం కావడానికి దారితీసిన పరిస్థితులేమిటో అంచనా వేయడానికి వీలవుతుంది. ఇప్పుడు విడుదలైన పత్రాల్లో రేఖామాత్రంగా లాడెన్ ఆలోచనలు తెలుస్తున్నాయి. అంతేకాదు...పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో అతనికీ, అతని సహచరులకూ ఉన్న సంబంధాలూ, చుట్టరికాలూ ప్రపంచానికి ‘సాధికారికంగా’ అర్థమవుతున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు సమీపంలోని అబ్తాబాద్లో ఉన్న లాడెన్ స్థావరంపై 2011 మే 2న అమెరికా దళాలు మెరుపుదాడి చేసి మట్టుబెట్టాయి. ఎక్కడో పాకిస్థాన్-అఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో తోరాబోరా కొండల్లో అజ్ఞాతజీవితం సాగిస్తుంటాడని అందరూ అంచనా వేసిన లాడెన్ తమ గడ్డపైనే పట్టుబడటంతో పాకిస్థాన్ ఇరకాటంలో పడింది. లాడెన్ ‘చంపదగిన శత్రువే’ కావొచ్చు. పలు దేశాల్లో మారణహోమం సృష్టించిన అల్ కాయిదా సంస్థకు ఆద్యుడు కావొచ్చు. కానీ, వ్యక్తులుగా అలాంటి వారిని హతమార్చినంత మాత్రాన సాధారణ పరిస్థితులు ఏర్పడతాయనుకోవడం భ్రమే. లాడెన్ స్వయంగా యుద్ధంలో పాల్గొన్నవాడు కాదు. విధ్వంసక చర్యల్లో నేరుగా పాల్గొన్న అనుభవమైనా అతనికి ఉన్నట్టులేదు. కానీ, అతను నెలకొల్పిన సంస్థ వివిధ దేశాల్లో వ్యాప్తి చెందడమేకాక... దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పుట్టి విస్తరించినవి ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఇతర సంస్థలతో సమన్వయం సాధించి ముందుకెళ్తుంటే, మరికొన్ని ఎక్కడికక్కడ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయి. వాటిల్లో చాలా సంస్థలు దెబ్బతిన్నట్టే తిని మళ్లీ మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. కనుక లాడెన్ ఆలోచన లు, అభిప్రాయాలు ఏమిటో...అవి ఉగ్రవాద సంస్థలకు ఎలా తోడ్పడ్డాయో అధ్యయనం చేయడంవల్ల వాటి నియంత్రణకు ఒక దోవ దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బయటపెట్టిన పత్రాల్లోని కొన్ని అంశాలు ఆసక్తి కలిగిస్తాయి. ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాలను నాలుగేళ్లక్రితం ప్రజాస్వామిక విప్లవం ఊపేసినప్పుడు అందరూ దాన్ని కీర్తించారు. ఆ దేశాల్లో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న నియంతలు మట్టికరిచి అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఆవిర్భవిస్తాయని అంచనావేశారు. కానీ, బిన్ లాడెన్ వేరేలా ఆలోచించాడు. అక్కడ సాగుతున్న ఆందోళనలు ఉగ్రవాద సంస్థల విస్తరణకు దొరికిన మంచి అవకాశంగా భావించాడు. ఇస్లామిస్టులు వాటిల్లో పాలుపంచుకుని, ఆ ఉద్యమాల తీరుతెన్నులను మార్చాలని సూచించాడు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లోని చాలా దేశాలు ఉగ్రవాదంతో ఉసూరుమంటున్న తీరును గమనిస్తే చివరకు లాడెన్ కోరికే నెరవేరిందని అర్థమవుతుంది. సమస్త వనరులూ అందుబాటులో ఉన్న అమెరికా తదితర దేశాలకు ఇలాంటి ప్రమాదాన్ని ముందే పసిగట్టడం, జాగ్రత్తపడటం కష్టమేమీ కాదు. అవి బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి వేరొకలా ఉండేది. కానీ, కొన్నిచోట్ల ఆ ఉద్యమాలను సమర్థిస్తున్నట్టే నటించి వాటిని నట్టేట ముంచడం, తమ తైనాతీలు నియంతలుగా ఉన్నచోట వాటిని అణిచేందుకు తోడ్పడటం వంటి చర్యలకు పూనుకున్నాయి. పర్యవసానంగా ఆ దేశాల్లో ఉగ్రవాదం ఇప్పుడు బలంగా వేళ్లూనుకుంది. చివరిరోజుల్లో బిన్ లాడెన్‌ను ఎవరూ పట్టించుకోని స్థితి ఏర్పడిందని, అతను దాదాపు ఒంటరయ్యాడన్నది కూడా నిజం కాదని ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి. పశ్చిమాసియాలో పాలకులతో సంఘర్షిస్తున్న తీరు సరికాదని... ఇందువల్ల ప్రధాన శత్రువు అమెరికాను దెబ్బతీసే లక్ష్యానికి విఘాతం కలుగుతుందని హెచ్చరించడం...అందుకనుగుణంగా యెమెన్‌లో అల్‌కాయిదా సంస్థ తన ధోరణిని మార్చుకోవడం ఇందులో కనిపిస్తుంది. అల్ కాయిదా ఏ తరహా దాడులు నిర్వహించాలన్న విషయంలోనూ లాడెన్‌తో అబూ ముసబ్లాంటి నేతలు విభేదించిన సంగతి ఈ పత్రాల్లో వెల్లడైంది. భారీ దాడులు జరపాలని లాడెన్ భావిస్తే చిన్న తరహా దాడులతోనే పాశ్చాత్య దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయగలమని అబూ ముసబ్ వాదించాడు. ఈ పత్రాల ద్వారా అల్ కాయిదా సంస్థకూ, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకూ మధ్య ఉన్న సంబంధాలు వెల్లడయ్యాయి. పాక్ సైన్యం తమపై దాడులు విరమించు కుంటే... వారిపై తెహ్రీక్-ఎ-తాలిబన్(టీటీపీ) దాడులు చేయకుండా చూస్తామని అల్ కాయిదా నేత ఒకరు ఐఎస్ఐతో బేరసారాలాడటం ఇందులో కనబడుతుంది. ఉగ్రవాదం వేళ్లూనుకోవడానికీ, విస్తరించడానికీ దానికి ప్రభుత్వాలపరంగా అందు తున్న అండదండలే కారణమని లాడెన్ పత్రాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఒక దేశంలో ఉగ్రవాది మరోచోట దేశభక్తుడు కావొచ్చునని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్ ఎప్పుడో అన్నారు. అలా అనుకోవడంవల్లే లష్కరే తొయిబావంటి సంస్థలకు ఆ దేశ పాలకులు అండగా నిలిచారు. చివరకు ఆ ఉగ్రవాదం వారినే కాటేసే స్థాయికి చేరింది. లిబియా, సిరియా వంటి దేశాల్లో తమ చర్యలవల్ల ఉగ్రవాద ముఠాలు లాభ పడుతున్నాయని...తమ ఆయుధాలు, డబ్బు ఆ ముఠాలకు చేరుతున్నదని తెలిసినా అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలూ తమ వైఖరిని మార్చుకోలేదు. ఫలితంగానే ఐఎస్ఐఎస్ ఇరాక్, సిరియావంటిచోట్ల మారణ హోమాన్ని సృష్టిస్తున్నది. లాడెన్ పత్రాలనుంచి గుణపాఠాన్ని గ్రహిస్తే...ఇకపై సరిగా వ్యవహరిస్తే ఉన్నంతలో పరిస్థితి మెరుగవుతుందని అమెరికా తదితర దేశాలు గుర్తించాలి. -
కార్మికోద్యమ పితామహుడు పర్సా సత్యనారాయణ
ఉద్యమాలనే ఊపిరిగా చేసుకుని కార్మికుల హక్కు ల కోసం రాజీలేని పోరాటం చేసిన ఉద్యమ కెరటం నింగికేగింది. కార్మిక ఉద్యమ ధ్రువతారగా వెలిగిన పర్సా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కార్మిక ఉద్య మం వేళ్లూనడానికి, కార్మికులు తమ హక్కులకోసం ప్రశ్నించే చైతన్యం రావడానికి పర్సా సత్యనారా యణ చేసిన కృషి అనిర్వచనీయం. 1924 జూన్ 2వ తేదీన జన్మించిన పర్సా కేవలం 19 సంవత్సరాల వయస్సులోనే కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరారు. కార్మిక ఉద్యమ వ్యూహలను రూపొందించడంలో దిట్టగా పేరున్న ఆయన తన జీవితమంతా ఉద్య మాలకే ధారపోసారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరిన తొలి నాళ్లలోనే నైజాం ప్రభుత్వానికి వ్యతి రేకంగా ప్రజలను సమీకరించి సాయుధ పోరుకు సిద్ధం కావడమే కాకుండా పాల్వంచ ఏరియా దళ కమాండర్‌గా పనిచేసి నిజాం అకృత్యాలపై పోరు సలిపిన నేతగా పేరొందారు. కార్మికులకు ప్రత్యే కంగా సంఘం ఉండాలని, కార్మికుల హక్కుల సాధన నిరంతర పక్రియ అనీ భావించిన పర్సా సి.ఐ.టి.యు. కార్మిక సంఘం వ్యవస్థాపకులలో అగ్రగణ్యుడిగా నిలిచారు. శత్రు వుకు తలవంచడం అంటే తెలి యని పర్సా కార్మికుల జీవితాలలో వెలుగు నింప డానికి ఉద్యమాలను ఆయుధంగా చేసుకున్నాడు. ఈక్రమంలోనే సింగ రేణి కార్మికులెదుర్కొంటున్న సమస్య లపై సమర శంఖం పూరించడానికి ఆయన ఆద్యు డిగా నిలిచారు. ఇందుకుగాను పర్సా సింగరేణి కాల రీస్ ఎంపాయిస్ యూనియన్ ను స్దాపించారు. గని కార్మికుల జీవితాల్లో మార్పు కోసం అనేక పోరాటా లను ఈ యూనియన్ ద్వారా నిర్వహించారు. కార్మి కులకు మెరుగైన వేతనం ఇప్పించడానికి ఆయన చేసిన కృషి గని కార్మికులు ఇప్పటికీ చెప్పు కుం టారు. గుంటూరు జిల్లాకు చెందిన పర్సా ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో 1943 లో స్థిరపడ్డారు. ఆయ నకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. నిజాంకు వ్యతిరే కంగా పోరాడుతున్న క్రమంలో అరె స్టయిన పర్సా 2 సార్లు ఔరం గాబాద్ జైలు గోడలు దూకి తప్పిం చుకున్నాడు. దీంతో పర్సా సత్యనా రాయణ ఉద్యమ కదలికలపై ప్రత్యే క నిఘా పెట్టిన నైజాం సర్కార్ ఆయనను డేంజరస్ ప్రిజనర్‌గా ప్రక టించింది. సాధారణంగా ఖైదీలను ఉంచే చెర సాలలో కాకుండా ఆయనను 6 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తున్న చీకటి చెరసాలలో నెలల తరబడి బంధించింది. కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేరిన నాటి నుండి కార్మిక శ్రేయస్సు కోసం పాటుబడిన పర్సా 1970 నుండి 2002 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఐటియు రాష్ర్ట అధ్యక్షుడిగా సుధీర్ఘకాలం పనిచే శారు. అలాగే సిఐటియు అఖిల భారత కమిటీ ఉపా ధ్యక్షుడిగా పనిచేసిన పర్సా దేశంలోని కార్మికచట్టాలు కార్మికులకు ఉపయోగపడేలా ఉద్యమాలు నిర్వహిం చారు. సిపిఎం పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న ఆయన 1962లో పాల్వంచ శాసనసభా నియోజక వర్గంనుంచి ఎంఎల్ఏగా గెలుపొందారు. 1984లో ఖమ్మం లోక్‌సభా స్థానం నుండి జలగం వెంగళరా వుపై పోటీచేసి ఓడిపోయారు. సుదీర్ఘకాలం కమ్యూ నిస్ట్ ఉద్యమంలో వివిధ హోదాల్లో పనిచేసిన పర్సా కార్మిక పక్షపాతిగానే గుర్తింపు పొందారు. వృద్ధాప్యం దరి చేరినా ఉద్యమాల్లో తన క్రియాశీలతను మాత్రం తగ్గించలేదు. పార్టీ సభలు సమావేశాలు ఎక్కడ ఉన్నా క్రమంతప్పకుండా హజరుకావడం కమ్యూ నిస్ట్ పార్టీపట్ల ఆయనకు గల నిబద్ధతకు నిదర్శనం. 91 సంవత్సరాలపాటు కమ్యూనిస్ట్‌గా జీవించిన పర్సా మే 22వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూ రులో కుమార్తె ఇంటివద్ద తుది శ్వాస విడిచారు. - పి.రాజారావు (సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొబైల్: 9441209559) -
మోదీ రాజ్యం.. కుబేరుల భోజ్యం
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 26 నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ తొలి ఏడాది పాలనా కాలంలో అది ప్రజా వ్యతిరేకమైనదిగా, కార్మిక వర్గానికి, రైతాంగానికి వ్యతిరేకమైనదిగా, కార్పొరేట్, ధనికవర్గాలకు అనుకూలమైనదిగా అత్యంత సిగ్గుచేటైన పేరు సంపాదించుకుంది. కుల, మత, ప్రాంతీయతల ప్రాతిపదికపై ప్రజలను చీల్చి సెక్యులర్, సోషలిస్టు, సార్వభౌమ రాజ్యమైన మన భారత దేశ చరిత్రను వెనక్కు మరల్చాలనే దుష్ట పన్నాగాలు సైతం ఈ ఏడాది ఎన్డీఏ దుష్పరిపాలన ఘనతే. ఎన్డీఏ ప్రభుత్వం చేతల ఆధారంగానే దాని ఏడాది పని తీరును అంచనా వేద్దాం. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్పొ రేట్ సంస్థలకు ఆరు లక్షల కోట్ల రూపాయలు రాయితీలుగా కట్టబెట్టిందం టేనే ఇది కార్పొరేట్ సంస్థలకు, ధనవంతులకు ప్రియమైన ప్రభుత్వమ నేది స్పష్టమే. నిజానికి పుట్టుక నుంచీ ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్), దాని అనుబంధ సంస్థలు, రాజకీయ విభాగమైన ఒకప్పటి జనసంఘ్, నేటి బీజేపీ హిందువుల్లోని పేదవారితోసహా పేద ప్రజానీకానికి అను కూలమైనవి కావు. దాని మితవాద భావజాలంలో పేదలు, శ్రామిక ప్రజల పట్ల ఎలాంటి పట్టింపూ ఎన్నడూ చూసి ఎరుగం. ఒకే ఒక్క ఈ-వేలంలోనే బొగ్గు గనులను ఏకధాటిగా 30 ఏళ్లు లీజుకు ఇచ్చేయడం కోసం మోదీ ప్రభుత్వం అహోరా త్రాలు పనిచేసింది. ఈ ప్రభుత్వ మొదటి పూర్తి స్థాయి బడ్టెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కార్పొరేట్ గుత్త సంస్థలను నెత్తినెక్కించుకోవడంలో ఏ మాత్రం తటపటాయింపు చూపలేదు. కార్పొరేట్ పన్ను బేసిక్ రేట్‌ను 30 శాతం నుంచి 25 శాతానికి నిస్సిగ్గుగా తగ్గించారు. పేద, మధ్య తరగతుల పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తూనే అదానీ, అంబానీ తదితర కార్పొరేట్ గుత్తాధిప తులకు అసాధారణ రాయితీలను విస్తరించారు. ఏడాది పూర్తి కాకముందే మోదీ బండారం పూర్తిగా బట్టబయలైంది! సంప న్నులపై మోజుతో సంపద పన్నును సైతం రద్దు చేసిపారేశారు. ఫలితంగా జనాభాలో 90 శాతం ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. కాబట్టే ఈ ఏడాది మోదీ పాలనలో ధనవం తులు మరింత ధనవంతులయ్యారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు ప్రత్యేకించి అదానీకి చెందినవి అత్యంత వేగంగా అభివృద్ధి చెందాయి. పచ్చి ప్రతీఘాతుక ధోరణులు, విచ్ఛిన్నకర చర్యలు గత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాక ఎంతోకాలం కాకుండానే సంఘ్ పరివార్, దాని అనుబంధ సంస్థలు ఒకప్పటి తమ రహస్య ఎజెండాను బహిరంగం చేశాయి. ఏడాది గడిచేసరికే ప్రజలు మోదీ ప్రభుత్వంపై ఏ ఆశలు పెట్టుకుని గెలిపించారో అవన్నీ ఒక్కొక్కటిగా వమ్ము చేస్తూ వచ్చారు. సార్వ త్రిక ఎన్నికల్లో లోక్‌సభలో తమ పార్టీకి ఒంటరిగా ఆధిపత్యం లభించడం బీజేపీని సైతం ఆశ్చర్యంలో ముంచింది, కింది నుంచి పైవరకు ఆ పార్టీ నేతల్లో అహంకారాన్ని అతిశయింపజేసింది. ఏదేమైనా బీజేపీ, ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలు ఏవీ తమ నేతలు అహంకారంతో మైనారిటీలను దుర్భాషలాడటాన్ని, వారిపై విరుచుకుపడటాన్ని మానేలా చేయలేకపో యాయి. విశ్వహిందూ పరిషత్ చేపట్టిన ‘ఘర్ వాపసీ’ నినాదం, అమాయక ముస్లిం యువతను లక్ష్యం చేసుకుని సాగించిన ‘లవ్ జిహాద్’ వంటి విచ్ఛిన్న కర మతోన్మాద కార్యకలాపాలు ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర సున్నిత ప్రాంతాల్లో అరాచకాన్ని సృష్టించాలనే లక్ష్యంతో రచించిన ముందస్తు ప్రణా ళికల ఫలితాలే. ప్రజల దృష్టిని మరల్చి, తమ రహస్య ఎజెండాను అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం, పార్టీ ప్రయత్నిస్తున్నాయి. హిందూ ఓట్లను సంఘటితం చేసుకోవాలనే దుష్ట లక్ష్యంతోనే అవి మైనారిటీల వ్యతిరేక వైఖ రితో హిందువుల పట్ల ప్రేమను ఒలకబోస్తున్నాయి. ఫాసిస్టు అభివృద్ధి నిరోధకత్వం బీజేపీ, ఆరెస్సెస్, వాటి అనుబంధ సంస్థల నేతలు ఫాసిస్టు ఉన్మాదంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర ప్రాంతాల్లో జరిపిన దాడులు మైనారిటీలన్ని టిలో అభద్రతను, మానసిక భయోత్పాతాన్ని రేకెత్తించడానికి ఉద్దేశించినవే. ముందు ముందు వారిని మత మార్పిడి చెందించడానికి బాట వేయాలనే లక్ష్యంతో సాగినవే. అందుకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం కోసం బీజేపీ నేతలు హిట్లర్ రోజుల నాటి అభివృద్ధి నిరోధకతత్వాన్ని వంటబట్టిం చుకుని చరిత్రకారులు, రచయితలు, పాత్రికేయులపై దాడులను ప్రారంభిం చారు. కరుడుగట్టిన ఆరెస్సెస్ వ్యక్తులను గవర్నర్లుగానూ, ఐసీహెచ్ఆర్ (భారత చరిత్ర పరిశోధక మండలి) వంటి సంస్థల అధిపతులుగానూ, స్వయంప్రతిపత్తిగల ఇతర శాస్త్రీయ, సాంస్కృతిక, పరిశోధనా సంస్థల్లోని కీలక స్థానాల్లోనూ నియమిస్తున్నారు. రోమిలా థాపర్, ఇర్ఫాన్ హబీబ్ తదితర సుప్రసిద్ధ చరిత్రకారులను ఐసీహెచ్ఆర్ సలహా బోర్డు నుంచి తొల గించారు. చరిత్ర పుస్తకాలనన్నిటినీ తగులబెట్టేయమని బీజేపీ నేత సుబ్ర హ్మణ్యస్వామి పిలుపునిచ్చారు. రచయితలు, కళాకారులను భయపెడుతు న్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు ఉన్న హక్కుపై దాడి జరుగుతోంది. మహా త్మాగాంధీలాంటి జాతీయోద్యమ నాయకులను అప్రతిష్టపాలు చేస్తూ, గాడ్సే సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. మరిన్ని అల్లర్లను సృష్టించాలనే లక్ష్యంతోనే హరియాణా, మహారాష్ట్రలలో గోమాంసాన్ని నిషేధించారు. కాగా వాటికి పొరుగునే ఉన్న గుజరాత్ గోమాంస ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉండటం విశేషం! పేదలు, ప్రత్యేకించి ఆదివాసీలు, దళితులు, మైనారిటీలు, ఓబీసీల ఆహారంలో గోమాంసం ఒక ప్రధాన అంశం. మోదీ బాధ్యత వహించక తప్పదు ఆరెస్సెస్ చేస్తున్న ఈ విన్యాసాలలో మోదీ కూడా భాగస్వామే కాబట్టి లేదా ఆయన సొంత మనుషులే వివాదాలను రేకెత్తింపజేసినా మౌనం వహిస్తు న్నారు కాబట్టి ఆయన వీటికి బాధ్యత వహించక తప్పదు. ‘‘అందరినీ ఉద్ధరించేవాడిని నేనే’’ అనే శైలితో ఆయన ప్లాస్టిక్ సర్జరీలో పురాతన భారత నైపుణ్యాన్ని పురాణ గాథలతో రుజువు చేసేస్తానంటున్నారు. మూఢవిశ్వా సాల వ్యాప్తి ద్వారా హిందుత్వ దాడులకు, హిందూ మహాపురుషునిగా తన నియంతృత్వ పని విధానానికి అనువైన పరిస్థితులను సృష్టించాలని ప్రయ త్నిస్తున్నారు. ఒక వ్యక్తిగా మోదీలోని స్వాభావికమైన సంక్లిష్టత, పార్టీ లోపలా బయటా, తన చుట్టూ ఉన్నవారు ఏ క్షణానైనా తనపై తిరుగుబాటు చేయ వచ్చనే అనుమానం ఆయన్ను పట్టిపీడిస్తున్నాయి. హిట్లర్‌లాగే నియంతృత్వ ధోరణులతో క్రమక్రమంగా ప్రభుత్వం పనిని, నిర్ణయాలనన్నిటినీ తన చుట్టూ కేంద్రీకృతం చేసుకుంటున్నారు. మంత్రులనందరినీ కీలుబొమ్మలుగా మార్చి, అత్యున్నత అధికారులంతా ప్రత్యక్షంగా తనకే జవాబుదారీ వహిం చాలని శాసించారు. ఈ ఒక్క ఏడాది కాలంలో మోదీ 18 దేశాలు సందర్శిం చడం చెప్పుకోదగిన రికార్డే. కానీ ఈ పర్యటనలన్నీ విదేశాంగ మంత్రి లేకుండా సాగడం విశేషం. నిజంగా భారతీయమైన ప్రతిదాన్నీ నిర్మూలించడం ద్వారా ప్రధాని దేశా న్ని మోదీ, గాడ్సేల రాజ్యంగా మార్చేయాలనుకుంటున్నారు. ఆయన అహం కారానికి మొదట బలైనది ప్రణాళికా సంఘం. అది మోదీ ‘నీతి ఆయోగ్’గా మారింది. ఇక ఆ తర్వాతది ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక హోదాను తిరస్కరిం చడం. తద్వారా మోదీ కేంద్రం తానా అంటే రాష్ట్రాలన్నీ తందానా అనేట్టు చేయాలని భావిస్తున్నారు. పోటీతోకూడిన సమాఖ్యతత్వం నేడు సహకార సమాఖ్యతత్వంగా మారింది. అంటే ‘‘అవును, ప్రధానమంత్రిగారు ఎప్పుడూ కరెక్టే’’ అని అర్థం. కాబట్టి మోదీ పాలనలోని నేటి హిందుత్వ... భౌతిక, సాంస్కృతిక, మత, కుల, మానసికపరమైన ఉగ్రవాదం తప్ప మరేమీ కాదు. పచ్చి కార్మికవర్గ, రైతాంగ వ్యతిరేకత కార్మిక చట్టాల సంఖ్యను కుదించి, సమర్థవంతం చేయడం పేరిట అతి తెలివిగా కార్మిక చట్టాలకు సవరణల పేరిట చేపట్టిన చర్యలు కార్మికులను హీనమైన, కట్టుబానిసల్లాంటి ఉద్యోగులుగా మార్చేవే. అలాగే 2013 నాటి భూసేకరణ చట్టాన్ని సవరించే లక్ష్యంతో తెచ్చిన 2015 భూసేకరణ బిల్లు కార్పొరేట్ సంస్థలు, రియల్టర్లు రైతుల భూములను సులువుగా స్వాధీనం చేసుకోవ డానికి వీలుకల్పించేది మాత్రమే. పైగా అది రైతులకు అనుకూల మైనదనే సిగ్గు మాలిన అబద్ధాలు! ఎస్సీ, ఎస్టీలకు నామ మాత్రపు కేటాయిం పులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కోత, మొదలైనవి బీజేపీ పేదల వ్యతిరేక మనస్తత్వానికి అద్దంపడతాయి. క్రోడీకరించి చెప్పాలంటే బీజేపీ, మోదీల తొలి ఏడాది పాలనలో వారి ఎన్నికల వాగ్దానాలన్నీ పగటి కలలుగానే మిగిలిపోయాయి. వాటి జాబితాను విప్పడమూ దండగే. అయినా, విదేశాల్లోని నల్లధనాన్ని తిరిగి తెచ్చి ప్రతి కుటుంబం ఖాతాలో రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తామని ఘోరంగా విఫలం కావడం, నిత్యజీవితావసర వస్తువుల ధరల అదుపునకు చర్యలు చేపట్టక పోవడం, బాల కార్మిక వ్యవస్థకు ముగింపు పలకడానికి బదులు పారిశ్రామిక వేత్తలకు తోడ్పడేలా ఆ చట్టాన్ని సవరించడం, ‘జన ధన్ యోజన’ పేరిట నిరక్షరాస్య ప్రజలను వెర్రివాళ్లను చేయాలనుకోవడం వంటివి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మోదీ, లింకన్ ప్రజాస్వామ్యం నిర్వచనాన్ని తిరగరాసి... కార్పొరేట్ల చేత, కార్పొరేట్లే, కార్పొరేట్ల కొరకే పాలించే ప్రభుత్వంగా మార్చారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ఒప్పందం కుదరడం మాత్రమే ఈ ఏడాది పాలనలోని ఏకైక సానుకూల అంశం. ఈ నేపథ్యంలో మోదీ ప్రభు త్వం నుంచి ప్రజానుకూల చర్యలేమీ ఆశించలేం. ప్రజాస్వామ్యంపైనా, వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తిగత, సామూహిక హక్కులు మొదలైన వాటిపైనా సాగుతున్న తీవ్ర దాడులను నిలవరించడం కోసం మిలిటెంటు ప్రజాపోరాటాలను నిరం తరాయంగా సాగించడం మాత్రమే ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం. శాంతి యుత, ప్రజాస్వామిక జీవనానికి వ్యతిరేకంగా మోదీ సాగిస్తున్న కుతం త్రాలను ఓడిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. - సురవరం సుధాకరరెడ్డి (వ్యాసకర్త ‘భారత కమ్యూనిస్టు పార్టీ’ ప్రధాన కార్యదర్శి) మొబైల్: 9440066066 -
జీవో 13ను సవరించాల్సిందే!
ఎస్కలేషన్ కమిటీకి తేల్చి చెప్పిన బిల్డర్స్ అసోసియేషన్ హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా ధరల పెంపు (ఎస్కలేషన్) చేయాలని కోరుతున్న కాం ట్రాక్టర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన జీవో 13ను అమలు పరుస్తూనే దానిలో మార్పులు చేయాలని కోరుతున్నారు.ఇదే సమయంలో ఏపీలో చిన్నపాటి మార్పులు చేస్తూ కొత్తగా ఇచ్చిన జీవో 22ను అమలు చేసినా తమకు ప్రయోజనం చేకూర్చలేదని స్పష్టం చేస్తున్నారు. ఎస్కలేషన్‌పై గత ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో 13 అమలుతో ఎదురయ్యే పరిణామాల అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ ఇంజనీర్ బి.అనంతరాములు చైర్మన్‌గా, ఇరిగేషన్ ఈఎన్సీ మెంబర్ కన్వీనర్‌గా, మరో ఇద్దరు రిటైర్డ్ ఇంజనీర్లు ఎస్.చంద్రమౌళి, జి.ప్రభాకర్‌లు సభ్యులుగా ఉన్న కమిటీ మంగళవారం బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమైంది. జీవో 13 అమలు అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుతం పనులు చేయలేమని ప్రతినిధులు స్పష్టం చేశారు. దాదాపు అన్ని ప్రాజెక్టుల్లోనూ పనులు చేయడం కాంట్రాక్టర్లకు భారంగా మారిందని కమిటీ దృష్టికి తెచ్చారు. జీవో 13లో సమూల మార్పులు అవసరమని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 22ను అమలు చేసినా ప్రయోజనం ఉండదని అభిప్రాయపడినట్లు తెలిసింది. ఇక సబ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ తరఫున కొందరు ప్రతినిధులు మాట్లాడుతూ జీవో 13ను అమలు చేసినా గౌరవెల్లి, తోటపల్లి వంటి ప్రాజెక్టుల పనుల్లో కాంట్రాక్టర్లు పనిచేసే పరిస్థితి లేదని, అక్కడ 60(సి) కింద సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని కోరినట్లుగా సమాచారం. -
నేటినుంచి ‘పట్టభద్రుల’ ఓటరు జాబితా సవరణ
ఇదీ..షెడ్యూల్ ఫొటో గుర్తింపు కార్డుసంఖ్య సేకరణ : ఈ నెల 1 - 10 వరకు కంప్యూటరీకరణ : 11 -15 వరకు అనుబంధ జాబితాల అనుసంధానం : 16 - 20 వరకు ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ : 23 ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ : 25 - డిసెంబర్ 16 వరకు అభ్యంతరాలపై విచారణకు తుది గడువు : జనవరి 5 అనుబంధ జాబితాల తయారీ, ముద్రణ : జనవరి 13 తుది ఓటర్ల జాబితా ప్రచురణ : జనవరి 15 నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నియోజకవర్గం ఎన్నిక కాలపరిమితి వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. దీంతో తిరిగి అదే నెలలో పట్టభద్రుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎన్నికకు రెండు మాసాల ముందుగానే ఓటరు జాబితా సవరణను ప్రారంభించాలని ఎన్నికల కమిషన్ శుక్రవారం షెడ్యూల్ జారీ చేసింది. దీనిలోభాగంగా పట్టభద్రుల నియోజకవర్గం ఓటరు జాబితా-2008ని మండలాల వారీగా వీఆర్వోకు అందజేస్తారు. ఈ జాబితాపై ప్రతి ఓటరు వివరాలు కాలం నంబర్ 2 నుంచి 7 వరకు తాజా వివరాలతో జతపర్చాలి. ఈ కార్యక్రమం శనివారం నుంచి 10వ తేదీ వరకు జరుగుతుంది. ఈ జాబితాలోని ఓటరు ఫొటోగుర్తింపు సంఖ్య, సెల్ఫోన్నంబర్ సేకరించి నమోదు చేయాలి. గత సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితాతో ఈ వివరాలను సరిచూడాలి. ఒకవేళ శాసనసభ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు కాని పక్షంలో ఆ వివరాలు కూడా నమోదు చేయాలి. సదరు ఓటరు నుంచి కలర్ ఫొటో సేకరించి తాజా ఓటరు జాబితాతోపాటు తహసీల్దారు కార్యాలయంలో అందజేయాలి. ఈ జాబితాలో ఓటరుగా నమోదు అయిన వ్యక్తి సదరు చిరునామాలో/గ్రామంలో నివాసం లేనట్లయితే ఆ వివరాలను ఇచ్చిన నియామావళి పత్రంలోని కాలం నంబర్ 2లో నమోదు చేయాలి. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ నెల 10వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సేకరించిన వివరాలను 11 నుంచి 15వ తేదీ వరకు కంప్యూటరీకరిస్తారు. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాలు తయారు చేసి 25వ తేదీన ఫొటో ఓటర్ల జాబితా నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచురిస్తారు. ఈ జాబితాపై 25 నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను జనవరి 5వ తేదీలోగా విచారిస్తారు. తుది ఓటర్లు జాబితాను జనవరి 15న అధికారికంగా ప్రకటిస్తారు. రెండు మాసాల్లో ఎన్నిక... 2008 ఓటరు జాబితా ప్రకారం ఈ మూడు జిల్లాల్లో ఓటర్లు లక్షా 34 వేల మంది ఉన్నారు. వీటిలో వరంగల్ జిల్లాలో 45వేలు, ఖమ్మంలో 42 వేలు, నల్లగొండ జిల్లాలో 47వేల మంది ఉన్నారు. ఈ నియోజకవర్గానికి 2009 జనవరి13 ఎన్నికల నోటిఫికేషన్ జారీచేశారు. ఫిబ్రవరి 6 తేదీన ఎన్నికలు జరగ్గా... 9 తేదీన ఓట్ల లెక్కింపు పూర్తియ్యింది. నాటి ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో కపిలవాయి దిలీప్‌కుమార్(టీఆర్ఎస్), ఎ. అశోక్‌రెడ్డి (బీజేపీ), ఎం.శ్రీనివాస్‌రెడ్డి (నేషనలిస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి), దునుకు వేలాద్రి (స్వతంత్ర అభ్యర్థి) పోటీ చేశారు. టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన దిలీప్‌కుమార్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం జనవరితో పూర్తికానుంది. -
నా సభ, నా ప్రసంగం, నా ఇష్టం
కొన్ని గొప్ప వాక్యాలు దొర్లినప్పుడు కరతాళాల కోసం కొంచెం వ్యవధి ఇవ్వాల్సిన సంప్రదాయాన్ని వదిలేది లేదు. ప్రసంగం అర్ధగంట దాటితే, అధ్యక్షుని అనుమతి కోసం అన్నట్టు చూసి మళ్లీ కొనసాగించేవాడిని. సభా మర్యాదల్ని తు.చ. తప్పించే సమస్య లేదు. అక్షర తూణీరం జనం మె చ్చారు. అశేష పాఠకులు మె చ్చకుండా ఉం డలేకపోయా రు. చివరకు మెచ్చే పోయా రు. అంత గొప్ప సాహిత్యాన్ని బ్లాగ్కే పరిమితం చేయడం దేశద్రోహం కంటె నేరం- అంటూ నిందాస్తుతి చేశారు. చివరకు పుస్తకంగా తీసుకురాకుండా ఉండలేకపోయాను. ఒక శుభోదయాన బొడ్డు తెంచుకుని భూమ్మీ ద పడింది నా తొలి పుస్తకం. ఉద్వేగ భరితంగా చెప్పుకు వెళ్తుంటే కళ్లు చెమర్చాయి. బ్లాగ్ మీదే కదా, కలం పేరు పెట్టుకున్నారు దేనికి- అని అడిగితే నా బ్లాగు నా ఇష్టం. నేను రాసుకుంటా, నేనే ఎడిట్ చేసుకుంటా, చివరకు నా చావేదో నే చస్తా... అనే సరికి ఎరక్కపోయి అడిగానని నోరు మూసుకున్నాను. అయితే సిద్ధార్థుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు, ‘‘నా చావేదో నే చస్తా’’ అన్న ఏడక్షరాలు నాకు దిశానిర్దేశం చేశాయి. నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పాయి. మా అపార్ట్మెంట్కి ముందువైపు బాల్కనీ ఉంది. అలవోకగా నాలుగు కుర్చీలు పడతాయి. రోజూ పగలు భోజనం చేశాక బాల్కనీలో కుర్చీలు వేసి, ముందొక టీపాయ్ అమర్చి అప్పుడు నిద్రకు మళ్లేవాడిని. సరిగ్గా ఆరు గంటలు కాగానే ఎవరో పిలిచినట్టు - కాదు, సాదరంగా ఆహ్వానించినట్టు బాల్కనీ మధ్య కుర్చీలో కూర్చుంటాను. అప్పుడు నా చేతిలో కొన్ని కాగితాలుంటాయి. కుర్చీలో లాం ఛనప్రాయంగా కూర్చున్నాక, నిలబడి మైకు ముం దుకు వచ్చేవాణ్ణి. మైకు ఉన్నట్టు నన్ను నేనే భ్రమిం పచేసేవాణ్ణి. ఏరోజు టాపిక్ ఆరోజు తాజాగా అనుకుని, దానికి తగిన హోమ్‌వర్క్ తప్పనిసరి అయ్యే ది. అవసరమైతే పాయింట్స్ నోట్ చేసుకునేవాణ్ణి. ముందు, అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్పడం మరిచేది లేదు. కొన్ని గొప్ప వాక్యా లు దొర్లినపుడు కరతాళాల కోసం కొంచెం వ్యవధి ఇవ్వాల్సిన సంప్రదాయాన్ని వదిలేది లేదు. ప్రసం గం అర్ధగంట దాటితే, అధ్యక్షుని అనుమతి కోసం అన్నట్టు చూసి మళ్లీ కొనసాగించేవాడిని. సభా మర్యాదల్ని తు.చ. తప్పించే సమస్య లేదు. ఆ రోజు ఏడు కావస్తున్నా సభ ప్రారంభం కాలే దు. లోపల్నించి ఏమైందని కేక. ‘‘ట్రాఫిక్ జామ్’’ అన్నాను. ‘‘బాగా ముదిరింది. కొంపలో ట్రాఫిక్ జామ్ ఏమిటండీ!’’ అని అరిచింది. అదే ఇవ్వాళ్టి అంశం. ఉపగ్రహాలు తోకచుక్కలు ఉల్కలతో అంతరిక్షంలో ట్రాఫిక్‌జామ్‌లు అవుతున్నాయి. ప్రతి ఇల్లూ బోలెడు అభిప్రాయాలు అభిరుచులు ఆశలతో జామ్ అవుతోంది. ఏమి, త్యాగరాయ గానసభలో ఆలస్యంగా మొదలవడం లేదా? ప్రతిదానికీ నన్నూ, నా ముఖ్యమంత్రిని కార్నర్ చేస్తారేంటి? సహించను కోస్తా... తీస్తా... తిత్తితీస్తా..’’ నా ధోరణిని అడ్డుకుని, ‘‘దానికంత సీనెందుకు, ఇంతోటి బోడి సభకి’’ అనేసి లోపలికి వెళ్లిపోయింది. నవ్విపోదురు గాక, నాకేటి వెరపు అనుకుని నా దినచర్య నేను నడుపుకుంటున్నా. ఒక రోజు గ్రంథావిష్కరణ, మరోరోజు మహామహుల సంస్మరణ, ఇంకోరోజు సంతాపం- ఇలాగ ఎంతో వైవిధ్యం పాటించే వాణ్ణి. గురువారం సభ ఉండదు. ఆ రోజు బాబా హారతికి వెళ్లడం ముఖ్యం. నన్ను గమనించిన ఇరుగు పొరుగులో ఒకరిద్దరు తాము కూడా పాల్గొంటామని ఐచ్ఛికంగా ముందుకు వచ్చారు. అభిప్రాయభేదాలొస్తాయేమో, అందుకని ఆలోచించి చెబుతానన్నాను. ఇంటా బయటా కూడా నా సభా కార్యక్రమాలకి ప్రాచుర్యం వచ్చింది. మనవడు మనవరాలు సాయంత్రం అయితే చాలు, తాతగారు ఆడుకుంటున్నారని అనుకునేవారు. కొంతవరకు నా నాలిక దురద తీరుతోంది. అయినా ఏదో వెలితి. ఒకరోజు పొద్దున్నే మా కోడలు నా చేతికి రెండు కాగితాలు ఇచ్చింది. ఒక ఫొటో, ఏవేవో వార్తలతో ఉన్న ఫొటోస్టాట్ కాగితాలవి. ‘‘మావయ్య గారూ! ఇది డైలీ సిటీ ఎడిషన్. మీరు పొద్దుటే చదువుకుంటే సాయంత్రం సభకి ఒక నిండుతనం వస్తుంది...’’ అనే సరికి నా వెలితి తీరింది. ఇప్పుడు మా కాలనీలో ‘‘బాల్కనీ దీక్షితులు’’గా నా పేరు ప్రసిద్ధమైంది. శ్రీరమణ -
నవలోకం సృష్టికర్తలు!
ఆటబొమ్మలు పట్టుకోవాల్సిన చేతులు... సత్తు బొచ్చెలు పట్టుకుంటున్నాయి. బడిదారి పట్టాల్సిన పాదాలు... గుడి మెట్ల దగ్గరకు నడుస్తున్నాయి. అక్షరాలు వల్లె వేయాల్సిన పెదాలు... ‘అమ్మా, భిక్షమేయండి’ అని అడుక్కుంటున్నాయి. సిగ్నళ్ల దగ్గర, ఆలయాల ముందర, దుకాణాల పంచన... ముష్టివాళ్ల రూపమెత్తిన పసివాళ్లను చూస్తే గుండె భగ్గుమంటుంది. కానీ వారి జీవితాలను మార్చాలన్న ఆలోచన ఎందరి మస్తిష్కాల్లో మెదులుతుంది? కానీ ఆ నలుగురికీ ఆ ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా ఆ వైజాగ్ కుర్రాళ్లు వడివడిగా అడుగులు వేశారు. నవలోకాన్ని నిర్మించారు! విలువలు పతనమైపోతున్న ఈ రోజుల్లో కొత్త తరానికి విలువల్ని నేర్పేందుకు ఓ నూతన ప్రాజెక్టును ప్రారంభించారు నరేశ్ బృందం. ఇందులో భాగంగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కొంత స్థలాన్ని నెలకు రూ.15 వేలకు అద్దెకు తీసుకున్నారు. ఇక్కడ పూర్తి గ్రామీణ వాతావరణం ప్రతిబింబించే విధంగా నిర్మాణాలు చేపట్టారు. రెల్లుగడ్డి, వెదురు, తాటి దుంగలతో కాటేజులు నిర్మించారు. మధ్యలో కొలను ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై నిపుణుల సాయంతో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు. ఉపాధి కల్పనకు సంబంధించిన శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. యువకుల్లో సామాజిక సేవాదృక్పథం కల్పించేందుకు శిక్షణనిస్తారు. పిల్లలు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నైతిక విలువల్ని నేర్పిస్తున్నారు! నరేశ్‌కుమార్ బీటెక్ చేశాడు. ఎమ్మెస్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్లేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. అంతలో అతడిలో మథనం మొదలైంది. ఎక్కడికో వెళ్లి ఏదో చేయడమేంటి! ఎమ్మెస్ చేసి, లక్షలు సంపాదించడం వల్ల కలిసొచ్చేదేంటి! మనవల్ల మన ప్రాంతానికి, మనవాళ్లకి ఏం ఒరిగింది అని! దాంతో విదేశాలకు వెళ్లాలన్న ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. సమాజం కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. తన క్లాస్మేట్సతో కలిసి ఆశ్రమాలకు వెళ్లేవాడు. రకరకాల సేవా కార్యక్రమాలు చేసేవాడు. ఆ క్రమంలో అతడికి కోటా రాకేష్‌రెడ్డి, సాల్మన్ జార్జ్ క్యాంప్‌బెల్, రాజశేఖర్‌లు పరిచయమయ్యారు. రాకేష్‌రెడ్డి బీటెక్, ఎంబీఏ చే సి రూ.లక్ష జీతాన్ని ఇచ్చే ఎల్అండ్టీలో జాబ్ వదిలేసాడు. సాల్మన్ మంచి జీతం వచ్చే సాఫ్ట్వేర్ జాబ్ వదిలి పెట్టేశాడు. రాజశేఖర్ కెనడాలోని ఐబీఎంలో సుమారు రూ.2 లక్షలు జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి ఇండియా వచ్చేశాడు. వాళ్లు కూడా నరేశ్లాగే సమాజానికి ఏదైనా చేయాలన్న తపనతో ఉన్నారు. ఆలోచనలు కలిశాయి. అభిప్రాయాలు ఒకటయ్యాయి. దాంతో నలుగురూ కలిసి వైజాగ్‌లో ‘జెన్యువ’ అనే స్వచ్చంద సంస్థను ప్రారంభించారు. బతుకుదెరువు కోసం వేర్వేరు వృత్తులు చేపట్టినా... ఎక్కువ సమయాన్ని తమ ఎన్జీవోకే కేటాయిస్తున్నారు. బాలల బంధువులయ్యారు... తమ సేవను విస్తరించేందుకు మురికివాడల్లో తిరుగుతున్నప్పుడు నరేశ్ బృందాన్ని ఓ విషయం బాధపెట్టింది. చాలామంది పిల్లలు బడికి వెళ్లకుండా వీధుల్లో తిరుగుతున్నారు. మాసిన గుడ్డలు, మురికి అంటిన దేహాలతో ఉన్న వారిని చూసి వీరి మనసులు కలుక్కుమన్నాయి. వారందరినీ బడికి పంపాలని తీర్మానించుకుని కంచరపాలెం వంతెన వద్ద సామాజిక భవనంలో చిన్నారులకు చదువు చెప్పడం మొదలు పెట్టారు. కొందరిని వేర్వేరు పాఠశాలల్లో చేర్పించారు. కానీ వాళ్లు చదువుకోవడానికి ఇష్టపడేవారు కాదు. బడికెళ్లకుండా రోడ్లమీద తిరుగుతుండేవారు. వారి తల్లిదండ్రులకు చెప్పినా ఫలితం ఉండేది కాదు. మరీ బాధాకరమైన విషయం ఏమిటంటే... వారిలో చాలామంది పిల్లలు యాచకులు కావడం! తల్లిదండ్రుల నిర్లక్ష్యం, కుటుంబ తగాదాలు వంటి వాటి కారణంగా ఆ పిల్లలు అలా తయారయ్యారని అర్థమైంది నరేశ్ బృందానికి. వెంటనే ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. పిల్లలందరినీ ఓ చోట చేర్చి, కౌన్సెలింగ్ చేయాలని ప్రయత్నించారు. కానీ వారి రియాక్షన్ వింతగా ఉండేది. ముష్టి ఎత్తితే రోజుకు నాలుగొందలు వస్తాయి, చక్కగా బిర్యానీ తిని జగదాంబలో సినిమా చూసొచ్చి హాయిగా నిద్రపోతాం, ఆ పని మానేస్తే మాకవన్నీ ఎవరిస్తారు అనేవారు వాళ్లు. అంతకన్నా దారుణం ఏమిటంటే వారిలో చాలా మంది డ్రగ్ ్సకు కూడా అలవాటుపడ్డారు. తల్లిదండ్రులు తమ స్వార్థం కోసం వారిని సంపాదించే యంత్రాలుగా మార్చేశారు. అవన్నీ తెలిశాక తాము అనుకున్నది సాధించడం అంత తేలిక కాదని తెలిసొచ్చింది. అయినా వెనకడుగు వేయలేదు. ఏడాది పాటు కృషి చేసి ఓ ఇద్దరిని మాత్రం మార్చగలిగారు. పిల్లలకు డబ్బులు అందకుండా చేస్తే అనుకున్న ఫలితాలు సాధించవచ్చని నిర్ణయించుకుని... తాము కూడగట్టిన ఓ 50 మంది యువకులతో చైతన్య కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకువ చ్చారు. 13 లక్షల కరపత్రాలను పంపిణీ చేసి బాల యాచకులకు డబ్బులు అందకుండా చేశారు. బాల యాచకులకు డబ్బులు ఇవ్వద్దంటూ బీచ్, ప్రధాన కూడళ్లలో ప్లకార్డులు, బ్యానర్లతో ప్రచారం నిర్వహించారు. పిల్లల్ని యాచకవృత్తి వదిలేవరకు ఓపిగ్గా వెంటపడ్డారు. దీంతో పిల్లలతో పాటు వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల్లో కూడా మార్పు వచ్చింది. పిల్లలూ పెద్దలూ కలిసి సుమారు 1800 మంది యాచక వృత్తిని వదిలేశారు. వేరే ప్రాంతాల నుంచి యాచకత్వానికి వచ్చేవారికి కూడా అక్కడ జనం డబ్బులు వేయరని తెలిసిపోయింది. అందుకే బయటివాళ్లు కూడా రావడం లేదు. యాచక వృత్తిని వదిలేసిన యాభై మంది చిన్నారులు జెన్యువ ఆశ్రమంలో వసతి పొందుతూ, భారతీయ విద్యాభవన్స్ పబ్లిక్ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం చదువులు చదువుత్నారు. మరొక 50 మందికి వసతి కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న తన సొంత భవనాన్ని నరేష్కుమార్ హోమ్‌కు ఇచ్చేశారు. దాతల సాయం తో కొత్త నిర్మాణాలను ప్రారంభించారు. పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు... వారికి ఉపాధి కల్పించడానికి ఎకోఫ్రెండ్లీ అలంకరణ వస్తువుల షోరూమ్‌ను నిర్వహిస్తున్నారు. ఓ నర్సరీని కూడా పెట్టి, దాని ద్వారా కొందరికి ఉపాధి కల్పించారు. ఈ కృషి ఇలాగే కొనసాగితే, అందరూ నడుం బిగిస్తే... మన దేశంలో అసలు యాచక వృత్తి అన్నదే ఉండదు అంటారు నరేశ్‌కుమార్. నిజమే. కృషి ఉంటే కానిది ఏముంది! - వి.ఆర్.కాశిరెడ్డి, గమనిక ఫ్యామిలీ లోపలి పేజీల్లో కొన్ని శీర్షికలు ఈవారం నుంచి కొన్ని మార్పులతో కొత్తరూపు సంతరించుకోనున్నాయి. ఇప్పటివరకు మెయిన్‌లో వస్తున్న ‘సాగుబడి’, ‘సాహిత్యం’ పేజీలు ఇకపై ప్రతి గురు, శనివారాల్లో ఫ్యామిలీ లోపలి పేజీల్లో మరింత సమగ్రంగా, ఆకర్షణీయంగా రానున్నాయి. ప్రతి బుధవారం వస్తున్న ఆమె-అతడు స్థానంలో అస్త్ర - శాస్త్ర పేజీలు మరింత ఆసక్తికరంగా, మరింత సాధికారికంగా రాబోతున్నాయి. పాఠకులు ఈ మార్పును గమనించగలరు. - ఎడిటర్ -
మీ సమయాన్ని ఆదాచేసే 7 ఉచిత పీడీఎఫ్ టూల్స్
టూల్స్ ఎప్పుడైనా పీడీఎఫ్ ఫైలుతో మీరు విసిగిపోయారా? పీడీఎఫ్ ఫైల్ ఫార్మాట్‌ను మనం విరివిగా ఉపయోగిస్తున్నా కూడా.. అది కొన్నిసార్లు మనల్ని చాలా విసిగిస్తుంటుంది. పీడీఎఫ్ కేవలం చదవడమే అయితే ఈజీనే. కానీ, దాన్ని క్రియేట్ చేయడమో లేక ఎడిట్ చేయడమో చేయాలంటే కొన్నిసార్లు తలప్రాణం తోకకొస్తుంటుంది. ఇంతకుమించిన పనులేమైనా పీడీఎఫ్‌తో చేయాలంటే.. ఆ పని ఎక్కడో చోట ఆగినా ఆగిపోతుంది. అదష్టవశాత్తూ వెబ్‌లో మనకు ఎన్నెన్నో పీడీఎఫ్ పనిముట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అందరికీ పెద్దగా తెలియని ఉపయుక్తమైన టూల్స్ మీ కోసం. వీటిలో సాదాసీదా ఎడిటింగ్, క్రియేటింగ్ గురించి కాకుండా కొన్ని కొత్త సంగతులకు సంబంధించిన వాటినే వివరించాం.. జొటి మాల్వేర్ స్కాన్ EXE , ZIP ఫైల్లో వైరస్లు దాక్కొని ఉండే అవకాశముందని మనకు తెలిసిందే. కానీ పీడీఎఫ్‌లలో కూడా అంతర్గతంగా వైరస్లు ఉండే చాన్స్ ఉందని ఎంత మందికి తెలుసు? అలా ఏదైనా పీడీఎఫ్‌లో వైరస్ ఉందా అని చెక్ చేయాలంటే ఈ జొటి మాల్వేర్ స్కాన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ వెబ్సైట్లోకి మీ ఫైలును అప్లోడ్ చేస్తే అది 20కిపైగా వేర్వేరు మాల్వేర్ స్కానర్లతో పరీక్షిస్తుంది. కేవలం క్షణాల్లోనే ఫలితం చూపిస్తుంది. ఆన్లైన్ ఓసీఆర్ మీరు ఓ పీడీఎఫ్ ఫైలు నుంచి ఒక పారాను టెక్ట్స్ రూపంలో కాపీ చేసుకోవాలనుకున్నారు. కొన్ని రీడర్లలో ఈ పని చాలా సులువుగా అయిపోతుంది. కానీ కొన్నిసార్లు మాత్రం చాలా చికాకు తెప్పిస్తుంది. దీనికి సరైన సలహా.. ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (ఓసీఆర్) టూల్ వాడడమే. ఇది ఫైలులోని ప్రతి క్యారెక్టర్‌నూ టెక్ట్స్ రూపంలో మార్చి అందిస్తుంది. చూడ్డానికి పీడీఎఫ్‌ను వర్డ్ లోకి కన్వర్ట్ చేసినట్లు అనిపించవచ్చుగానీ.. నిజానికి ఇది కొంచెం వేరే ప్రక్రియే. ఇందులో కేవలం టెక్ట్స్ మాత్రమే కన్వర్టవుతుంది. ఇది కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. డిఫ్ నౌ మీరు ఎప్పుడైనా ఒకే ఫైలుకు సంబంధించి రెండు వర్షన్లు అందుకొని వాటిలో ఏం మార్పు జరిగిందబ్బా అని ఆలోచించే పరిస్థితి ఎదుర్కొన్నారా? అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఫైళ్లను డిఫ్ నౌ లోకి అప్లోడ్ చేస్తే.. ఏమేం మార్పులు జరిగాయో అది ఇట్టే చెప్పేస్తుంది. ఏం కలిపారు? ఏం తీసేశారు? ఏం మార్చారు? అన్న వివరాలు తెలియజేస్తుంది. హెచ్‌టీఎంఎల్ టు పీడీఎఫ్ ఏదైనా వెబ్ పేజీని పీడీఎఫ్‌లో సేవ్ చేసుకోవాలంటే ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఈ ఆన్లైన్ టూల్‌లోకి మీరు కోరుకున్న యూఆర్ఎల్ ఇచ్చి పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడమే. అలాంటి మరికొన్ని టూల్స్: పీడీఎఫ్ ప్రొటెక్ట్, పీడీఎఫ్ అన్‌లాక్, పీడీఎఫ్ కంప్రెస్... వీటి పేరును బట్టి అవి ఎందుకు ఉపయోగపడతాయో అర్థమైపోతుందిగా. -razesh007@gmail.com -
ఉద్యోగులను చంపిన సంపాదకుడికి జీవితఖైదు
కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఉద్యోగులను చంపిన నేరంలో ఓ సంపాదకుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. త్రిపురలో ఓ బెంగాలీ స్థానిక దినపత్రికకు సంపాదకుడు, యజమాని కూడా అయిన సుశీల్ చౌధురికి స్థానిక కోర్టు ఈ శిక్ష విధించింది. ఇది అరుదైన కేసుల్లోనే అత్యంత అరుదైనదని ఈ సందర్భంగా జడ్జి వ్యాఖ్యానించారు. 'దైనిక్ జ్ఞానదూత్' అనే పత్రిక సంపాదకుడైన 76 ఏళ్ల చౌధురి పాత్ర ఈ నేరంలో ప్రత్యక్షంగా ఉంది కాబట్టి ఆయనకు మరణశిక్ష విధించాలని ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన దిలీప్ సర్కార్ వాదించారు. ఉద్యోగులను కాపాడాల్సింది పోయి.. రంజిత్ చౌధురి, బలరాం ఘోష్, సుజిత్ భట్టాచార్జీ అనే ముగ్గురిని ఆయనే చంపాడని సర్కార్ ఆరోపించారు. అయితే, తాను నిర్దోషినని, కనీసం తన వయసు చూసైనా క్షమాభిక్ష పెట్టాలని చౌధురి కోర్టును వేడుకున్నారు. అయితే.. ''మీరు మగ్గురు ఉద్యోగులను చంపినట్లు రుజువైంది. వాస్తవానికి ఇది ఉరిశిక్ష విధించాల్సిన కేసే గానీ, దోషి వయసును దృష్టిలో పెట్టుకుని ఆయనకు యావజ్జీవ ఖైదు విధిస్తున్నాం. అంటే, ఆయన సహజంగా మరణించేవరకు జైల్లోనే ఉండాలి'' అని పశ్చిమ త్రిపుర అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి కృపాంకర్ చక్రవర్తి తన తీర్పులో తెలిపారు. దాంతోపాటు 50 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. గత సంవత్సరం మే 19వ తేదీన పత్రిక కార్యాలయంలోనే ముగ్గురు ఉద్యోగులు మరణించారు. ఈ సంఘటన రాష్ట్రం మొత్తాన్ని కుదిపేసింది. ఈ కేసును దర్యాప్తు చేసిన మానస్ పాల్ 562 పేజీల ఛార్జిషీటు సమర్పించారు. -
సువర్ణాంధ్ర సంకల్పానికి సాక్షి సంతకం
ఇష్టదైవానికి మొక్కేముందు సంకల్పం చెప్పుకోవడం మనకు తరాలనుంచి వస్తున్న ఆచారం. గత ఆరున్నర దశాబ్దాలుగా ఉనికిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు మరో జన్మ ఎత్తబోతున్న నేపథ్యంలో అలాంటి సంకల్పాన్నే కొత్త అర్థంలో చెప్పుకోవాల్సి ఉంటుంది. 23 జిల్లాలుగా ఉన్న ఈ రాష్ట్రం నుంచి 10 జిల్లాల ప్రాంతం విడిపోయి నేడు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది. ఇక 13 జిల్లాల అవశేషాంధ్ర ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించవలసి ఉంటుంది. ఇదొక చారిత్రక సందర్భం. మెజారిటీ మనోగతం వేరుగా ఉన్నా, భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా... ప్రజల్లో అనేక సందేహాలూ, అభ్యంతరాలూ గూడుకట్టుకుని ఉన్నా, వాటన్నిటినీ తోసిరాజని కేవలం రాజకీయ నిర్ణయంగా రాష్ట్రం రెండు ముక్కలైంది. నాలుగు దశాబ్దాలు పైబడి ఈ గడ్డపై అలుపెరుగని ఉద్యమాలు సాగించి, మహాత్ముడిని సైతం ఒప్పించి దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల నిర్మాణానికి మార్గదర్శకులైనదీ...దాన్ననుసరించి ప్రథమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించుకున్నదీ ఇక్కడి ప్రజలే. ఇంతటి సుసంపన్నమైన చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక నేపథ్యంగల ప్రాంతం దేశంలో మరొకటి కనబడదు. కానీ, ఒకే ఒక్క రాజకీయ నిర్ణయం ఆ చరిత్రనంతటినీ పూర్వపక్షం చేసింది. కారణాలేమైనా...కారకులెవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో నవ నిర్మాణానికి, సువర్ణాంధ్రగా అభివృద్ధి చెందడానికి నడుంకట్టాల్సి ఉంటుంది. చాలినన్ని మౌలిక సదుపాయాలు, అవసరమైనన్ని వ్యవస్థలు మనకు లేకపోవచ్చు. ప్రారంభ లోటే వేలకోట్ల రూపాయలుండవచ్చు. రాజధాని నిర్మాణం మొదలుకొని అనేకానేక సమస్యలు చుట్టుముట్టడం తప్పకపోవచ్చు. చేరవలసిన గమ్యం సుదీర్ఘమైనదే కావొచ్చు. అంతమాత్రంచేత ఖేదపడవలసిన అవసరం లేదు. భీతిల్లవలసిన పని అసలే లేదు. భవిష్యత్తు ఎలాగని బెంగటిల్లవలసిన అవసరం లేనే లేదు. మనకు అపారమైన, అపురూపమైన మానవ వనరులున్నాయి. ప్రకృతి మాత అందించిన పుష్కలమైన వనరులు అందుకు అదనం. ఇదిగాక దాదాపు వేయి కిలోమీటర్లమేర తీర ప్రాంతం ఉన్నది. కావలసిందల్లా సంకల్పబలమే. ఈ సంకల్పబలంతో అవరోధాలన్నిటినీ అవలీలగా జయించగలం. ఈ సంకల్పబలంతో ఎన్ని కష్టాలనైనా అధిగమించగలం. ‘సత్యమేవ జయతే’ సూక్తిని శిరోభూషణం చేసుకున్న మీ హృదయ ‘సాక్షి’ ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీ అందరికీ తోడుగా, నీడగా నిలబడుతుందని...తనవంతు సంపూర్ణ సహకారాన్నందిస్తుందని...మీ అడుగులో అడుగై నడుస్తుందని హామీ ఇస్తున్నాం. పోటెత్తే సాగరజలాలను మధిస్తూ, అనునిత్యం మృత్యువుని సవాల్ చేస్తూ ధైర్యమే కవచంగా ముందుకురికే జాలరి మనోసంకల్పంలో...కొండకోనల్లోని దుర్గమారణ్యాల్లో వన్యమృగాలమధ్య స్వేచ్ఛగా తిరుగాడుతూ, దోపిడీ పీడనలను ఎదిరించే గిరిపుత్రుల కంఠస్వరంలో...కష్టాల సాగుబడిలో నిత్యమూ శిథిలమవుతున్నా జనావళికి గుక్కెడు బువ్వ అందించడానికి రాత్రింబగళ్లు శ్రమించే అన్నదాత చెమట బిందువుల్లో ...కుటుంబం కోసం, దాని బంగరు భవితవ్యం కోసం పంటచేలలో, నిర్మాణాల్లో భాగస్వాములవుతున్న అక్కచెల్లెమ్మల, కూలి తల్లుల శ్రమైక జీవన సౌందర్యంలో...‘యంత్రభూతముల’ కోరలు తోముతూ కర్మాగారాల్లో రెక్కలు ముక్కలు చేసుకుని అపార సంపద సృష్టించే కార్మికుల శ్రమలో ‘సాక్షి’ ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షర సత్యమవుతుంది. మనకు బంగారం పండించే పంట భూములున్నాయి. మన రాష్ట్రానికి అన్నపూర్ణగా ఖ్యాతి తెచ్చిన భూములవి. సాగరజలాల్లో అపారమైన మత్స్యసంపద మాత్రమేకాదు...దాని గర్భంలో దశాబ్దాలైనా తరగని సహజవాయు, చమురు నిక్షేపాలున్నాయి. ఈ నేలలో ఇనుము, రాగి, మాంగనీసు, బాక్సైట్, బెరైటీస్, గ్రానైట్, సున్నపురాయి గనులున్నాయి. ప్రకృతి మాత వరంగా ఇచ్చిన ఇలాంటి సంపదంతటినీ మానవ వనరులతో అనుసంధానిస్తే...పేద, బడుగువర్గాల పిల్లలకు ఉన్నతశ్రేణి చదువులకు అవకాశమిస్తే, మన నిరుద్యోగుల చేతులకు పని కల్పిస్తే, ప్రాణాంతక వ్యాధులు చిత్తగించేలా తగిన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తెస్తే...సువర్ణాంధ్రను సాకారం చేసుకోవడం సుసాధ్యమే. కావలసిందల్లా నిజాయితీ, చిత్తశుద్ధి, మొక్కవోని పట్టుదల. ఈ పదమూడు జిల్లాలలోనూ అందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయడానికి ముందుకొచ్చే పాలకులకు ‘సాక్షి’ సైదోడుగా నిలుస్తుంది. ఈ కృషిలో వలపక్షాన్ని ప్రదర్శించినా, ఏమరుపాటు, తొట్రుపాటు, అలసత్వం కానవచ్చినా ప్రజల పక్షాన నిలబడి ‘సాక్షి’ ప్రశ్నిస్తుంది. న్యాయం జరిగేవరకూ పోరాడుతుంది. ఇది సువర్ణాంధ్ర సంకల్పానికి ‘సాక్షి’ చేస్తున్న సంతకం. - ఎడిటర్ -
షాహిన్ భట్ వచ్చేస్తోంది!
పరిచయం ఇప్పుడు అందరి కళ్లు ఆమె మీదే... ‘షాహిన్ ఎవరు?’ ??? ‘పోనీ... షాహిన్ భట్ ఎవరు?’ ఫోటో చూసి మీరు ఊహించింది నిజమే. అక్షరాల అలియా భట్ చెల్లెలు. ఇప్పుడు అందరి దృష్టి ఇరవై సంవత్సరాల ఈ అమ్మాయి మీదే ఉంది. తండ్రిలా డెరైక్టర్ అవుతుందా? అక్కలా హీరోయిన్ అవుతుందా? అనేది తరువాత విషయంగానీ ముందు ఈ ముద్దు గుమ్మ చెబుతున్న విషయాలు చదువుదాం... ‘జెహెర్’, ‘జిస్మ్2’ సినిమాకు కొన్ని సీన్లు రాశాను. ‘రాజ్-3’కి అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశాను. ‘సన్ ఆఫ్ సర్దార్’ కు సహ రచయితగా పనిచేశాను. లండన్‌లో ఎడిటింగ్, ఫిల్మ్ మేకింగ్ కోర్సులు చేశాను. ఇటీవలే మేకప్ కోర్సు కూడా పూర్తి చేశాను. ఎడిటింగ్ నేర్చుకోవడం అనేది బెస్ట్ డెరైక్టర్ కావడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఆసక్తిగా నేర్చుకున్నాను. ప్రొడక్షన్ విషయాలను కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. స్కూల్లో చదువు మీద కంటే సృజనాత్మక విషయాల పైనే ఎక్కువ దృష్టి ఉండేది. కవిత్వం, నటన నన్ను బాగా ఆకర్షించేవి. కెమెరాలకు పోజు ఇవ్వడం ఎందుకో నాకు నచ్చదు. కెమెరా వెనక తప్ప కెమెరా ముందు నిల్చోలేను. నాన్న నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ముఖ్యంగా క్రమశిక్షణ. -
సత్వం: సాంఘిక చరిత్రకారుడు
సంపాదకుడిగానేకాదు, మేనేజర్, సబ్ ఎడిటర్, ప్రూఫ్ రీడర్, గుమస్తా, చప్రాసీగా అన్ని బాధ్యతల్నీ తనే మోయాల్సిన గడ్డుకాలంలో కూడా పత్రికను తెచ్చారు.‘మనము కూడా చరిత్ర కెక్కదగినవారమే’నంటూ చరిత్రను సామాన్యీకరించి, దానిలో ఆత్మమాంసాల్ని నింపారు సురవరం ప్రతాపరెడ్డి. ‘రాజుల చరిత్రలు మనకంతగా సంబంధించినవి కావు. సాంఘిక చరిత్రలు మనకు పూర్తిగా సంబంధించినట్టివి. అవి మన పూర్వుల చరిత్రను మనకు తెలుపును. మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో, మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, యెట్టి అలంకరణములతో నుండిరో, మన పూర్వులే దేవతలను గొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగియుండిరో, ఏ యాటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు దోపిడీలు చేసినప్పుడు క్షామాదీతి బాధలు కలిగినప్పు డెటుల రక్షణము చేసుకొనిరో, జాడ్యాల కే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు ప్రీతి కలవారై యుండిరో, ఏయే దేశాలతో వ్యాపారాలు చేసిరో యవన్ని తెలుసుకొనవలెనని మనకు కుతూహలముండును. అదే విధముగా మన తరమును గురించి ముందు వచ్చువారు తెలుసుకొన నభిలషింతురు. తేలిన సారాంశమేమన సాంఘిక చరిత్ర మన చరిత్రయే!’ అన్నారు సురవరం- ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ పీఠికలో. ‘తెనుగు సారస్వతము, శాసనములు, కైఫీయత్తులు, నాణెములు, సామెతలు, దానపత్రములు, సుద్దులు, జంగమకథలు, పాటలు, చాటువులు, పురావస్తు సంచయములు’ ఇలాంటి సాంఘిక చరిత్రకు పనికివచ్చు సాధనములను సమగ్రదృష్టితో చూస్తూ, నిఘంటువులలో లేని పదాలకు అర్థనిర్ణయం చేస్తూ, ‘ఒక జీవితకాలపు ముక్తఫలం’ వంటి గ్రంథరాజాన్ని తెలుగునేలకు కానుక చేశారు. ఇంకెన్నో జీవితాలకు సరిపడిన సాఫల్యతను కూడా ఆయన అందుకున్నారు. ‘ప్రచారకుడుగా, పరిశోధకుడుగా, విద్యార్థి వసతిగృహ నిర్వాహకుడిగా, న్యాయవాదిగా, పత్రికా రచయితగా, పుస్తక ప్రచారకుడిగా, ఉపాధ్యాయుడిగా, ఆంధ్ర మహాసభ నాయకుడిగా, గ్రంథాలయోద్యమ సారథిగా, అనేక ప్రజా ఉద్యమాల, సంఘాల ప్రోత్సాహకుడిగా’ అనేక పాత్రల్లోకి పరిణమించిన ప్రతాపరెడ్డి... అప్పటి కాలం విసిరిన సవాలుకు ఒక దీటైన జవాబు. సాహిత్యమూ రాజకీయమూ విడదీయలేని కాలంలో, తెలంగాణను తట్టి మేల్కొల్పవలసిన సందర్భంలో ‘గోల్కొండ’ పత్రికను నడిపారు. సంపాదకుడిగానేకాదు, మేనేజర్, సబ్ ఎడిటర్, ప్రూఫ్ రీడర్, గుమస్తా, చప్రాసీగా అన్ని బాధ్యతల్నీ తనే మోయాల్సిన గడ్డుకాలంలో కూడా పత్రికను తెచ్చారు. తానూ మూడు నాలుగు కలంపేర్లతో రాశారు. అత్యధిక ప్రజానీకపు భాషకు మన్నన దక్కని వాస్తవాన్ని మ.ఘ.వ.(మహా ఘనత వహించిన) నిజాం ప్రభువువారికి మరాఠీలు, కన్నడిగులను కూడా కలుపుకొని ఇలా నివేదించారు: ‘తమ మాతృభాషలను ప్రేమించుట ఉర్దూవారికివలెనే ఇతర మూడు భాషల వారికిని సహజమనుట గమనించవలసియుండును’. ‘రెండు కోట్ల రూపాయీల’ పైబడిన వ్యయంతో భాగమతి కోసం ఖులీ కుతుబ్‌షా తలపెట్టిన భాగ్యనగరం నిర్మాణం గురించి పాదుషా ఆజ్ఞను ఇలా ప్రస్తావిస్తారు: ‘గోలకొండ ఇరుకటంగా ఉంది. మా దర్జాకు తగినట్టుగా లేదు. ఆమిర్లకు ఇబ్బందిగావుంది. నదికి అవతలిభాగంలో నగరనిర్మాణం చేయవలసింది. నాలుగుబాటలు నాలుగువీధులుండవలెను. నాలుగుకమానులు నాలుగుదిక్కుల కట్టవలెను. 14,000 దుకాణాలుండవలెను. 12,000 మొహల్లాలు(వాడలు) ఉండవలెను’. తెలంగాణలో కవులే లేరన్న విమర్శకుగానూ 354 మంది కవుల కవితలతో కూడిన ‘గోల్కొండ కవుల ప్రత్యేక సంచిక’ ద్వారా ఆరోగ్యకరమైన సమాధానమిచ్చారు. అశ్లీల కథలుగా ముద్రపడి తిరస్కరణకు గురవుతున్న చలం కథల్ని ధైర్యంగా ‘సుజాత’లో ప్రచురించారు.సంస్కృతం, ఉర్దూ, ఫార్సీ, ఇంగ్లీషు, హిందీ, కన్నడ భాషలు తెలిసిన ప్రతాపరెడ్డి ‘హిందువుల పండుగలు’, ‘రామాయణ విశేషములు’, ‘హైందవ ధర్మవీరులు’, కథలు, వ్యాసాలు రాశారు. మతపరమైన అంశాలు రాసినప్పుడు, ఆయనలోని ఆస్తికుడిని హేతువాది త్రోసిరాజన్నాడు. ‘ఇట్టి విమర్శ పూరాచారాభిమానులకు సరిపడద’నీ, వారికి ఆగ్రహము కలుగునని ఎరిగినప్పటికీ... చారిత్రక విమర్శలలో ఆగ్రహానుగ్రహములకు తావులేదని కూడా ఆయన ఎరుగును. హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ్యుడిగా కూడా పనిచేసిన ఈ నిక్కమైన వైతాళికుడు, ‘ఈ రాజకీయపు చీకటి బజారులో నేను, నావంటివారు ఏమియును పనికిరారు’ అని బాధపడ్డారు. కానీ సాహిత్యపు వీధుల్లో ఆయన అధిరోహించిన పల్లకీకి భుజం ఆనడానికి సిద్ధపడేవాళ్లెందరో! -
ఎడిటర్ థ్రిల్ ఫీలైతే సినిమా దాదాపు హిట్టే!
రెండు టేబుళ్లు ఓ సినిమా భవితవ్యాన్ని తేలుస్తాయంటారు. ఒకటి రైటింగ్ టేబుల్, రెండోది ఎడిటింగ్ టేబుల్. అంత కీలకమైన ఎడిటింగ్ టేబుల్ దగ్గర తన ‘కూర్పరితనం’తో ఎన్నో సినిమాలను విజయతీరాలకు చేర్చిన ఘనత మార్తాండ్ కె. వెంకటేష్‌ది. సినీ నేపథ్యం నుంచి వచ్చిన ఈ సీనియర్ టెక్నీషియన్‌తో భేటీ.. ఒక సినిమా జయాపజయాల్లో ‘ఎడిటింగ్’కి ఎంత భాగం ఉంటుందంటారు? ఎడిటింగ్ బాగా చేసిన సినిమా ‘హిట్’ నుంచి ‘సూపర్ హిట్’కి వెళుతుంది. అలాగే, యావరేజ్ సినిమా కూడా హిట్టవుతుంది. కానీ బాగా లేని సినిమాను ఎడిటింగ్‌తో అద్భుతం చేయలేము! ఏ సినిమా అయినా కథ బాగుంటేనే ఆడుతుంది! ఏ సినిమాకైనా తొలి ప్రేక్షకుడు మీరే కదా! మరి.. ఓ సినిమా ఫలితాన్ని అంచనా వేయడానికి మీరు ఎలాంటి కొలమానాలు పెట్టుకుంటారు? మామూలుగా కొంతమంది ఎడిటర్లు కథ వింటారు. కానీ, నేను వినను. ఎందుకంటే, కథ వింటే సినిమా ఏంటో అర్థమవుతుంది. అదే వినలేదనుకోండి.. ఒక్కో సీన్ ఎడిట్ చేస్తున్నప్పుడు, తర్వాతి సీన్ ఇలా ఉంటుందని ఊహించుకోవడం జరుగుతుంది. నా ఊహకు భిన్నంగా సీన్ ఉన్నప్పుడు సినిమా హిట్ అవుతుందని ఫిక్స్ అవుతాను. ఎడిటర్ థ్రిల్ ఫీలైతే సినిమా దాదాపు హిట్ కిందే లెక్క! ఎడిటింగ్ టైమ్‌లో దర్శక, నిర్మాతలు ‘ఎలా ఉంది’ అని అడుగుతారు కదా... అది ఒక్కోసారి ఇబ్బంది అనిపించదా? నిజంగా అది క్లిష్టమైన పరిస్థితే. అయితే నేను మాత్రం సినిమా బాగున్నా, బాగా లేకపోయినా ఫ్రాంక్‌గా చెప్పేస్తాను. నేను అంతలా ఇన్వాల్వ్ అయ్యి ఫ్రాంక్‌గా ఉంటాను కాబట్టే, చాలామంది నన్ను ఎడిటర్‌గా పెట్టుకుంటారు. జనరల్‌గా ఒక సినిమా ఎడిటింగ్‌కి ఎన్ని రోజులు పడుతుంది? యాక్షన్ సినిమాల ఎడిటింగ్ సులువు. కానీ, ‘కలిసుందాం రా’, ‘బొమ్మరిల్లు’, ‘ఆనంద్’ లాంటి ఫీల్‌గుడ్ మూవీస్‌ని ఎడిట్ చేయడమే కొంచెం కష్టం. కాలక్రమేణా ఎడిటింగ్ పరంగా వచ్చిన మార్పుల గురించి చెబుతారా? మొదట్లో సింగిల్ పాజిటివ్ ఎడిటింగ్ అనేవాళ్లు. లొకేషన్లో సౌండ్‌ను రికార్డ్ చేసేవారు. పిక్చర్పైనే సౌండ్ ఉంటుంది. దాన్ని ‘మ్యారీడ్ ప్రింట్’ అనేవారు. అది నాన్నగారి టైమ్‌లో ఉండేది. ఆ తర్వాత డబుల్ పాజిటివ్ అని ఉండేది. దానికేంటంటే, సౌండ్ విడిగా రికార్డ్ చేసేవారు. అప్పట్లో ఫిల్మ్ వాడేవారన్న సంగతి తెలిసందే. అందుకే, ఫిల్మ్ కట్ చేసే ముందు ఒకటికి, రెండు సార్లు ఆలోచించేవాళ్లం. డబుల్ పాజిటివ్ నుంచి స్టీమ్ బ్యాక్ విధానం వచ్చింది. అది కొద్దిగా స్మూత్‌గా ఉంటుంది. తర్వాత ‘యావిడ్’ వచ్చింది. కంప్యూటర్లో చేసేస్తున్నాం. ఈ విధానం వచ్చాక పని సులువైంది. అంటే.. పని గంటలు కూడా తగ్గుతాయేమో? అప్పట్లో ఫిల్మ్ కటింగ్ అంటే మెదడుకి పని ఎక్కువ ఉండేది... కత్తిరించిన ముక్కలను జాగ్రత్తగా దాచుకోవడం, ఏయే సీన్ ఎక్కడ రావాలో పేపర్ మీద మార్క్ చేసుకోవడం... ఇలా! ఇప్పుడు అలా కాదు. ‘కట్ చేసి చూద్దాం.. బాగా లేకపోతే మళ్లీ చేయొచ్చు’ అనే వెసులుబాటు ఉంది. ఆ రకంగా ఇప్పుడు ఒత్తిడీ తగ్గింది, పని గంటలూ తగ్గాయి. మీ ఇన్వాల్వ్మెంట్లోనూ అప్పటికీ ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా? డిజిటల్ విధానం వచ్చిన తర్వాత ఇన్వాల్వ్ అవ్వడం కొంచెం తగ్గించుకున్నాను. ఇంతకు ముందు దర్శక, నిర్మాతలు, హీరోలతో కలిసి మేం చర్చించేవాళ్లం. ఎడిటింగ్ రూమ్‌లో ఓ డిస్కషన్ జరిగేది. కానీ, ఇప్పుడది పోయింది. నేను ఎడిట్ చేసిన వెర్షన్‌ని డెరైక్టర్, ప్రొడ్యూసర్ కాపీ చేసుకుని, ఎవరికి వాళ్లు కంప్యూటర్లో చూస్తారు. ‘ఈ సీన్స్ తీసేయొచ్చు’ అని పేపర్ మీద రాసి పంపిస్తుంటారు. ఫిల్మ్ ఉన్నప్పుడు ఏం చేసినా ఎడిటింగ్ రూమ్‌లోనే చేయాలి. కానీ, ఇప్పుడు రూమ్ దాటింది. అసలు ఎడిటింగ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తే మంచిదంటారా? కచ్చితంగా మంచిదే... వేస్టేజ్ తగ్గుతుంది. ఎడిటింగ్ అంటే కేవలం కట్ చేయడం, జాయిన్ చేయడమే కాదు, ఒక సరైన స్క్రీన్‌ప్లే క్రియేట్ చెయ్యడం. ఆర్ట్ డెరైక్టర్‌కీ, కెమెరాకీ ఎలా లింకుంటుందో, స్క్రీన్‌ప్లేకి, ఎడిటింగ్‌కి అంతే లింకుంటుంది. ఎడిటింగ్‌లోనే ఫైనల్ స్క్రీన్‌ప్లే వస్తుంది. విడుదలైన తర్వాతా కొన్ని సినిమాలను ట్రిమ్ చేస్తుంటారు కదా...? అవును. అయితే ఒకసారి థియేటర్‌కి వెళ్లి, మళ్లీ ట్రిమ్ అయిన సినిమాలకు అవార్డు ఇవ్వకూడదు. ఒక్కోసారి దర్శకుడి సూచన మేరకు చేసేస్తుంటాం. ఏది ఏమైనా మళ్లీ సినిమా ట్రిమ్ చేయాల్సి వస్తే, అది ఎడిటర్‌కి బ్యాడ్ అని నా ఫీలింగ్. సినిమా సక్సెస్‌కి ఎడిటింగ్ చాలా కీలకం. కానీ, సినిమా హిట్టయితే హీరో, దర్శకుడు, సంగీతదర్శకుడు, మహా అయితే కెమెరామేన్, ఆర్ట్ డెరైక్టర్‌కి క్రెడిట్ ఇస్తారు. అప్పుడు మీకేమనిపిస్తుంది? కొంచెం బాధగానే ఉంటుంది. సినిమాలో ఎక్కడో ఒకటి, రెండు సీన్స్ చేసిన ఆర్టిస్టులను కూడా వేదిక పైకి పిలుస్తారు. అది నేను తప్పనడంలేదు. కానీ, పూర్తి సినిమాకి పని చేసిన మమ్మల్ని పిలవరు. అందుకే నేను 90 శాతం ఫంక్షన్స్‌కి వెళ్లను. శేఖర్ కమ్ముల లాంటి ఒకరో, ఇద్దరో తప్ప మమ్మల్ని స్టేజి మీదకు ఎవరూ పిలవరు. కళకు భాషతో సంబంధం లేదంటారు. ఎడిటింగ్కూ అది వర్తిస్తుందా? లేదు. భాష కచ్చితంగా తెలిసుండాలి. పాత్రలేం మాట్లాడుతున్నాయో తెలిస్తేనే పర్ఫెక్ట్గా ఎడిట్ చేయొచ్చు. పక్కన ఎవరైనా ఉండి అర్థం చెప్పినా, నా వల్ల కాదు. నేను చెయ్యను. మీకు సొంత ఎడిటింగ్ సూట్ ఉందా? లేదు. కావాలనే పెట్టుకోలేదు. సొంత సూట్ పెట్టుకుంటే ఏడాదిలోనే పెట్టుబడి వచ్చేస్తుంది. కానీ, ఎక్కువ పని గంటలు రాసి, డబ్బులు తీసేసుకుంటున్నానని సందేహించవచ్చు. నాకెందుకా చెడ్డపేరు? మాట్లాడుకున్నదే చాలామంది ఇవ్వరు. ఎడిటింగ్‌కి వచ్చేసరికి డబ్బులైపోతాయ్. ఎడిటర్లో మంచి డెరైక్టరూ ఉంటాడంటారు. డెరైక్షన్ ఎప్పుడు? మొన్నటి వరకు ఆ ఆలోచన లేదు. ఈ మధ్య డెరెక్షన్ చేయమని ఓ వ్యక్తి బాగా ఒత్తిడి చేస్తున్నారు. అన్నీ కుదిరితే త్వరలోనే చేయచ్చు. - గోల్డీ మీ నాన్నగారు కె.ఎ.మార్తాండ్ ఎడిటర్ కాబట్టి, సహజంగానే మీరు కూడా ఈ శాఖలోకి వచ్చారా? మా నాన్నగారి మామయ్య బీఏ సుబ్బారావుగారు పేరొందిన దర్శక, నిర్మాత. అప్పట్లో మా నాన్నగారు కెమెరామేన్ అవ్వాలనుకున్నారట. కానీ, ఎడిటింగ్ నేర్చుకోమని బీఏ సుబ్బారావుగారు చెప్పడంతో నాన్నగారు ఈ శాఖలోకి వచ్చారు. నాకు మాత్రం సినిమా పరిశ్రమ అంటే ఎందుకో భయం ఉండేది. అందుకే బ్యాంక్ జాబ్ చేయాలనుకున్నాను. కానీ, నాన్నగారు మాత్రం ఎడిటింగ్ ఫీల్డ్ అన్నారు. దాంతో ఆయనతో ఆరు నెలలు మాట్లాడలేదు. అయితే నేను ఇంటర్ చదువుకుంటున్నప్పుడు నాన్నగారి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నేను ఆయనకు అసిస్టెంట్‌గా వెళ్ళాల్సివచ్చింది. అలా అనుకోకుండా నేను ఈ ఫీల్డ్‌లోకి వచ్చాను. రెండేళ్లు ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేశాక, 1994లో సొంతంగా ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టాను. మంచి పేరొచ్చింది. డబ్బూ వస్తోంది. వృత్తిపరంగా హ్యాపీగానే ఉండడంతో ఇలా కంటిన్యూ అయిపోయాను. అయితే నేను ఎడిటర్ అయిన మొదటి సంవత్సరంలోనే నాన్నగారు చనిపోయారు. నా సక్సెస్‌ను ఆయన చూడలేదు. అది మాత్రం నాకెప్పటికీ బాధగా ఉంటుంది. -
గాంధీ’ సాక్షిగా వైద్యుల తగాదా
విధులను బహిష్కరించిన అనస్థీషియా వైద్యులు నిలిచిపోయిన 90 శస్త్రచికిత్సలు ఇబ్బందుల్లో రోగులు రాజీ కుదిర్చిన సూపరింటెండెంట్ గాంధీ ఆస్పత్రి, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు వైద్యుల మధ్య జరిగిన వివాదం రోగులకు శాపంగా మారింది. అనస్థీషియా వైద్యులు విధులను బహిష్కరించడంతో గురువారం జరగాల్సిన 90 శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్.. రాజీ కుదర్చడంతో విధులకు హాజరయ్యారు. గాంధీ ఆస్పత్రి ఆర్థోపెడిక్ హెచ్ఓడీ రవిబాబు బుధవారం.. మొదటి అం తస్తులోని ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లేటప్పటికీ అతని కుర్చీలో అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగార్జున కూర్చున్నారు. ‘నా కుర్చీలోనే ఎందుకు కూర్చున్నావు.. లెగు’ అన్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన నాగార్జున విషయాన్ని సహచర వైద్యులకు చెప్పడంతో వివాదం ముదిరింది. సూపరింటెండెంట్ ఇరువురికి సర్దిచెప్పిడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. గురువారం ఉదయం అనస్థీషీయా విభాగ వైద్యులంతా సమావేశమై రవిబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తు హఠాత్తుగా విధులను బహిష్కరించారు. శస్త్రచికిత్సల్లో వీరే కీలకం కావడంతో ఆస్పత్రిలోని 26 థియేటర్లలో ఆపరేషన్లు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆపరేషన్ టేబుల్‌పై గంటల తరబడి ఎదురుచూసినా వైద్యులు రాకపోవడంతో విషయం తెలుసుకున్న రోగుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఇరువర్గాలకు చెందిన వైద్యులను సమావేశపర్చి చర్చించారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చడంతో విధులకు హజరయ్యేందుకు అన స్థీషియా వైద్యులు అంగీకరించారు. చివరకు వివాదం సద్దుమణిగింది. పోలీసుల ఆరా.. గాంధీ ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు నిలిచిపోయావని మీడియా ద్వారా తెలుసుకున్న పోలీసులు పెద్దసంఖ్యలో గాంధీ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. ఉత్తరమండలం డీసీపీ జయలక్ష్మీ ఆదేశాల మేరకు అడిషనల్ డీసీసీ పీవై గిరి, గోపాలపురం ఏసీపీ వసంతరావు, చిలకలగూడ సీఐ మోహన్‌లతోపాటు స్పెషల్‌బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులు గాంధీలో జరుగుతున్న వివాదాంపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎలర్ట్‌గా ఉన్నట్లు ఈ ఘటన రుజువుచేసింది. ఆరోగ్యశ్రీ నుంచి తప్పించాలనే.. గాంధీ ఆస్పత్రి ఆరోగ్యశ్రీ ర్యాంకో చీఫ్‌గా ఉన్న తనను ఆ పదవి నుంచి తప్పించాలనే తప్పడు ఆరోపణలు చేస్తున్నారు. నా కుర్చీలో కూర్చున్న నాగార్జునను అక్కడి నుంచి లెమ్మని చెప్పానే తప్ప మరే మీ అనలేదు. కావాలనే నాపై తప్పడు ప్రచారం చేస్తున్నారు. - రవిబాబు, ఆర్థోపెడిక్ హెచ్ఓడీ పునరావృతమైతే చర్యలు చిన్నవిషయమే వివాదానికి కారణం. ఫలితంగా మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారు 45 ఆపరేషన్లు నిలిచిపోయాయి. అందుకే వివాదానికి కారణమైన వైద్యులిద్దరికీ మెమోలు ఇచ్చాం. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు. - చంద్రశేఖర్, సూపరింటెండెంట్ -
రికార్డుల కోసం ఎప్పుడూ పని చేయలేదు! :శ్రీకర్‌ప్రసాద్
మణిరత్నంలాంటి ఎందరో సృజనాత్మక దర్శకులకు ఆస్థాన ఎడిటర్ అయిన అక్కినేని శ్రీకర్ప్రసాద్కు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. 15 భాషల్లో సినిమాలకు ఎడిటింగ్ చేయడం ఒక రికార్డ్ కాగా, అత్యధిక జాతీయ అవార్డులు కైవసం చేసుకోవడం మరో రికార్డ్. ఈ రెండు రికార్డుల పరంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి రెండు ధ్రువపత్రాలు అందుకున్నారాయన. ఈ సందర్భంగా శ్రీకర్ప్రసాద్తో ‘సాక్షి’ జరిపిన ఇంటర్వ్యూ... కంగ్రాట్స్ సార్... థ్యాంక్సండీ. రెండు రోజుల క్రితమే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి రెండు సర్టిఫికెట్స్ వచ్చాయి. 15 భాషల్లో ఎడిటింగ్ ఎలా చేయగలిగారు? ఇన్ని భాషల్లో చేయాలని లక్ష్యం పెట్టుకుని మాత్రం చేయలేదు. అవకాశాలు వచ్చాయి. చేసుకుంటూ వెళ్లిపోయానంతే. రికార్డుల కోసం మాత్రం చేయలేదు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లిష్, సింహళీ, కర్బీ, కన్నడం, బెంగాలీ, మరాఠీ, అస్సామీ, ఒరియా, మిషింగ్, నేపాలీ, పంజాబీ భాషల్లో 400 పై చిలుకు సినిమాలకు ఎడిటింగ్ చేశాను. భాష తెలియకుండా ఎడిటింగ్ చేయడం కష్టమేమో? భాష తెలియకపోయినా కథను అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటే చాలు. దర్శకుడి ద్వారా కథపై ఒక అవగాహన తెచ్చుకుని ఎడిటింగ్ చేసేస్తాను. భాషలు, సంస్కృతులు వేర్వేరు అయినా కూడా సినిమాల పరంగా ఎమోషన్స్, సెంటిమెంట్స్ మాత్రం ఒక్కటే. అందుకే పెద్ద ఇబ్బంది అనిపించదు. అయినా భావోద్వేగానికి భాష అడ్డంకి కాదనేది నా ఉద్దేశం. ఇంతకూ ఏ భాషల్లో ఎడిటింగ్ చేయడాన్ని ఎక్కువ ఆస్వాదిస్తారు? తెలుగు నా మాతృభాష కాబట్టి, కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. అయినా సినిమా అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. భాష ఏదైనా స్టోరీ టెల్లింగే ప్రధానం. అయినా ఒకే భాషలో ఎక్కువ పనిచేస్తే, నాకు మొనాటనీ అనిపిస్తుంది. అదే రకరకాల భాషల్లో పనిచేయడం వల్ల రకరకాల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి రకరకాల అనుభవాలతో కెరీర్ ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఏఏ సినిమాలకు పని చేస్తున్నారు? తెలుగులో ‘రుద్రమదేవి’, హిందీలో ‘దేద్ ఇష్కియా’, తమిళంలో ‘పన్నియారం పద్మినిం’, మలయాళంలో ‘సోపానం’. ఎడిటర్‌గా మీ విజయ రహస్యం? ఇందులో రహస్యం ఏమీ లేదు. ఏదైనా వందశాతం ఫలితం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఎడిటింగ్ అనేది స్టోరీ టెల్లింగ్‌లో ఓ భాగం. ఒక కథను షార్ట్‌గా, స్వీట్‌గా, ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ఎడిటింగ్ ఓ సాధనం. ఇన్నేళ్లలో ఎంతోమంది ప్రతిభావంతులతో పనిచేసి, ఎంతో నేర్చుకున్నాను. నేర్చుకుంటాను కూడా. ఈ అనుభవాలు నాకెప్పటికీ ఉపకరిస్తాయి. ఏడు జాతీయ అవార్డులు గెలుచుకోవడమంటే మాటలు కాదే! నేను అవార్డుల కోసం ఎప్పుడూ పని చేయలేదు. ఎడిటర్‌గా నా తొలి సినిమా ‘సింహ స్వప్నం’ (తెలుగు). అయితే తొలి అవకాశం వచ్చింది మాత్రం ‘రాక్’ (1989) అనే హిందీ సినిమాకి. దానికే ఉత్తమ ఎడిటర్‌గా జాతీయ అవార్డు వచ్చింది. ఆ తర్వాత రాగ్ బిరాగ్ (1997), నౌక కారిత్రము (1997), ది టైస్ట్ (1998), వానప్రస్థం (2000), కన్నత్తిల్ ముత్తమిట్టాల్ (2002), ఫిరాక్ (2008) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాను. 2010లో స్పెషల్ జ్యూరీ కూడా వచ్చింది. 24 ఏళ్ల ఎడిటింగ్ అనుభవంతో దర్శకత్వం ఏనాడూ చేయాలనుకోలేదా? చాలాసార్లు అనుకున్నా. నేను ఎంతోమంది దర్శకులతో పనిచేశాను. ఆ అనుభవంతో వాళ్లకన్నా బెటర్‌గా చేయాలనే ఒత్తిడి నాపై ఉంటుంది. ఏం చేసినా ఆసక్తికరంగా ఉండేలా చేయాలి. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తాను కానీ, ఎప్పుడనేది మాత్రం చెప్పలేను. అయినా నన్ను ఉద్వేగానికి గురి చేసే కథ దొరకాలిగా. మై టాప్ టెన్ ఫిలిమ్స్ 1. సీతారామయ్యగారి మనవరాలు (తెలుగు), 2. ఒక్కడు (తెలుగు), 3. కన్నత్తిల్ ముత్తమిట్టాల్ (తమిళం), 4. అలైపాయుదే (తమిళం), 5. ది టైస్ట్ (తమిళం), 6. వానప్రస్థం (మలయాళం), 7. దిల్ చాహతాహై (హిందీ), 8. కమీనే (హిందీ), 9. అశోక (హిందీ), 10. రాగ్ బిరాగ్ (అస్సామీ) -
కాబోయే డెరైక్టర్ గారూ... కాస్త ఇటు చూడండి
సినిమా డెరైక్టర్లుగా తమ ప్రతిభను నిరూపించుకోవాలనుకునే ఈతరం పిల్లలు మునుపటిలా సినిమా ఆఫీసుల చుట్టూ చెప్పులరిపోయేలా తిరగనక్కర్లేదు. ఆకట్టుకునేలా తీయగలిగే టాలెంట్ ఉంటే చాలు... అవకాశాలు అనేవి అడ్రస్ వెదుక్కుని వస్తాయి. మీ ఇంటి కాలింగ్ బెల్‌ను నొక్కుతాయి. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక షార్ట్‌ఫిల్మ్‌ను తీయడమే. అందులో ఏ కాస్త సత్తా ఉన్నా... ఆ ఫిల్మ్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళుంది. ‘ఇదేదో బాగుందే’ అనుకొని ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ తీసి చేతులు దులుపుకున్నంత మాత్రాన అవకాశం దరి చేరుతుందా? అదేమీ కాదు. లఘుచిత్రాల నిపుణులు, లఘుచిత్రాల ద్వారా చిన్న వయసులోనే ఖ్యాతి గడించిన దర్శకులు ఏమంటున్నారో వినండి... ‘‘చాలామంది కుర్రాళ్లకు షార్ట్‌ఫిల్మ్ తీయాలనే ఉత్సాహం ఉంటుంది గానీ ఏమి తీయాలో ఎలా తీయాలో అనే దాని గురించి బొత్తిగా అవగాహన ఉండదు’’ అని. చేతిలో కెమెరా, నలుగురు ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రానే ‘షార్ట్ ఫిల్మ్’ రూపుదిద్దుకోదు. ‘తీయాలి కాబట్టి తీశాం’ అని తీస్తే అందులో ‘ఆత్మ’ అడ్రస్ గల్లంతవుతుంది. ఈ నేపథ్యంలో షార్ట్‌ఫిల్మ్ తీయాలనుకునే ఉత్సాహవంతులకు కొన్ని సూచనలు ఇవి... ప్రీ-ప్రొడక్షన్: ఏదో ఒక కథను హడావిడిగా ఎంచుకోవడం కాకుండా నలుగురు మెచ్చే కథను తయారుచేసుకోండి. స్క్రిప్ట్ మీద బాగా వర్క్ చేయండి. మీకు స్క్రిప్ట్ సంతృప్తిని ఇచ్చాకే ప్లానింగ్‌లోకి దిగండి. ప్రొడక్షన్: కథకు తగిన పరిసరాలు ఎంచుకోండి. నటుల విషయంలో మొహమాటాలొద్దు. ‘‘ఫ్రెండే కదా! ఏదో ఒక పాత్ర ఇస్తే సరి’’ అనుకోవడానికి లేదు. ఈ విషయంలో రాజీ పడవద్దు. పోస్ట్-ప్రొడక్షన్: ఎడిటింగ్ ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయాలి. ఈ విషయంలో పెద్దల అభిప్రాయాలను తీసుకోండి. విజ్వల్ ఎఫెక్ట్స్ విషయంలో అతి ఉత్సాహం మంచిది కాదు. అపోహ: ఖర్చు ఎంత ఎక్కువగా చేస్తే ఫిల్మ్ అంత బాగా వస్తుందనేది అపోహ మాత్రమే. దాని నుంచి బయటపడాలి. చాలా తక్కువ ఖర్చుతో రూపొందించిన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయాన్ని మరవొద్దు. షార్ట్‌ఫిల్మ్‌లు తీసి పేరు గడించిన వాళ్ల దగ్గరకు వెళ్లి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. వాళ్లతో మాట్లాడితే ‘షార్ట్ ఫిల్మ్ మేకింగ్’కు సంబంధించి కొన్ని మంచిపుస్తకాలు చదివినట్లే కదా! ఇగోను పూర్తిగా వదిలేయండి. ‘ఫలానా సన్నివేశం బాగోలేదు’ అంటే కోపం తెచ్చుకోకుండా ఎందుకు బాగోలేదో అడగండి. తప్పులు సవరించుకోండి. ‘షార్ట్ ఫిల్మ్ తీయాలి’ అనే ఉత్సాహం మాత్రమే మిమ్మల్ని ‘బెస్ట్ డెరైక్టర్’ని చేయదు. ఎంత అందమైన భవనానికైనా, పెద్ద భవనానికైనా ‘పునాది’ ముఖ్యం. అది గట్టిగా ఉండాలి. డెరైక్టర్‌గా మన పునాది గట్టిగా ఉండాలంటే కెమెరా యాంగిల్స్లాంటి టెక్నికల్ విషయాలు మాత్రమే తెలిస్తే సరిపోదు. సాహిత్యాన్ని విరివిగా చదవాలి. ప్రపంచ ప్రసిద్ధ చిత్రాలను చూడాలి. అధ్యయన శక్తిని పెంపొందించుకోవాలి. మ్యాట్ వైట్‌క్రాస్ అనే డెరైక్టర్ ఒకసారి ఇలా ఆత్మవిమర్శ చేసుకున్నాడు. ‘‘కొన్నిసార్లు రెండు గంటలు చెప్పాల్సిన కథను పదినిమిషాల్లో చెప్పాను. పదినిమిషాల్లో ముగించాల్సిన కథను రెండు గంటలు సాగతీశాను. తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటాం. అయితే వాటి నుంచి త్వరగా బయటపడడం అవసరం. నేను అదే చేశాను.’’ బ్యాడ్ ఫిల్మ్ తీయడం కంటే తీయకపోవడమే ఉత్తమం. కాబట్టి బెస్ట్ కథను ఎంచుకోండి. బెస్ట్ నటులను ఎంచుకోండి. బెస్ట్‌గా తీయండి. బెస్ట్ ఆఫ్ లక్! -
Special edition on 'Praja kavi kloji'