జర్నలిస్ట్ నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ ఇన్ చీఫ్ నీలబ్ మిశ్రా
చెన్నై: ప్రముఖ జర్నలిస్ట్, నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ ఇన్ చీఫ్ నీలబ్ మిశ్రా(57) శనివారం కన్నుమూశారు. నీలబ్ కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారని నేషనల్ హెరాల్డ్ వెబ్‌సైట్ వెల్లడించింది. నీలబ్ అంత్యక్రియలు నుంగంబాకంలో నిర్వహించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. నీలబ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. నీలబ్‌ను ‘ఎడిటర్స్ ఎడిటర్’గా సంబోధిస్తూ ట్వీట్ చేశారు. 2016లో నేషనల్ హెరాల్డ్‌ను పునఃప్రారంభించడంలో నీలబ్ కీలక పాత్ర పోషించారు. జైపూర్‌లో ‘న్యూస్‌టైమ్’కు కరస్పాండెంట్‌గా పనిచేశారు. ‘ఔట్‌లుక్ హిందీ’కి ఎడిటర్‌గా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment