సాక్షి, బెంగళూరు: ప్రముఖ జర్నలిస్ట్, రచయిత రవి బెలగెరే (62) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున బెలగెరేను గుండెపోటుతో ఆస్సత్రికి తరలించగా.. ఆయన చికిత్సకు స్పందించకపోవంతో అప్పటికే మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. కాగా.. చివరిసారిగా నివాళులు అర్పించడానికి అతని మృతదేహాన్ని ప్రార్థనా మందిరానికి తరలించారు. బెలగెరే మృతి పట్ల కర్ణాటక సీఎం యడ్యూరప్ప సంతాపం తెలియజేశారు. ఈ మేరు తన ట్విటర్ ఖాతాలో.. 'రవిగెరే కుటుంబానికి, ఆయన అభిమానులకు ఈ సమయంలో ఆయన లేరన్న బాధను తట్టుకునే దైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. (కర్ణాటకలోనూ బాణాసంచాపై నిషేధం)
మార్చి 15, 1958న బళ్లారిలో జన్మించిన ఆయన జర్నలిస్ట్‌గా, రచయితగా మంచి గుర్తింపు పొందాడు. బెలగెరే కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి చరిత్ర, పురావస్తు శాస్త్రంలో ఎంఏ చేశారు. కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు, రాజ్యోత్సవ అవార్డు, కర్ణాటక మీడియా అవార్డుతో పాటు పలు అవార్డులను అందుకున్నారు. బెలగెరే తన ప్రసిద్ధ కన్నడ టాబ్లాయిడ్ 'హాయ్ బెంగళూరు' నుంచి కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన కల్పన, అనువాదం, కాలమ్, జీవిత చరిత్రలు సహా 70పైకి సాహిత్య రచనలు చేశారు. అతను నేర ప్రపంచంపై రాసిన ప్రసిద్ద కాలమ్ పాపిగళ లోకదల్లి బాగా ప్రాచుర్యం పొందింది. (ప్రీ వెడ్డింగ్ షూట్.. జంట మృత్యువాత)
Comments
Please login to add a commentAdd a comment