national herald
-
సోనియా, రాహుల్‌కు భారీ షాక్.. ఆ ఆఫీస్‌కు ఈడీ సీల్
సాక్షి, ఢిల్లీ: సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ హెరాల్డ్ హౌజ్ బిల్డింగ్‌లో ఉన్న యంగ్ ఇండియన్ ఆఫీస్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED సీల్ వేసింది. మనీల్యాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఆఫీస్ ప్రాంగణం తెరవరాదని ఆదేశాలు జారీ చేసింది ఈడీ. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ గంటల తరబడి ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా న్యూఢిల్లీలోని హెరాల్డ్ హౌజ్‌లో సోదాలు సైతం నిర్వహించింది. ఈ క్రమంలో యంగ్ ఇండియన్ లిమిటెడ్ ఆఫీస్‌కు సీల్ వేసింది ఈడీ. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపించిన అసోషియేట్ జర్నల్స్ లిమిటెడ్ నుంచి యంగ్ ఇండియన్ లిమిటెడ్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు గరిష్ట వాటాల ఉన్నాయి. ఇక హెరాల్డ్ హౌజ్ సీల్‌కు సంబంధించి ఈడీ తరపున స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. Delhi | The Enforcement Directorate seals the National Herald office, instructing that the premises not be opened without prior permission from the agency. pic.twitter.com/Tp5PF5cnCD — ANI (@ANI) August 3, 2022 #CLARIFICATION | ED seals Young Indian office at the Herald House building in Delhi as no one was available in the office during the search & thus they were not able to complete the search The order reads that the "premises not be opened without prior permission" from the agency https://t.co/WgiCNwxqVm pic.twitter.com/UvX9iScyIH — ANI (@ANI) August 3, 2022 తాజాగా నేషనల్ హెరాల్డ్ హౌస్‌తో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. కాంగ్రెస్‌కు చెందిన నేషనల్ హెరాల్డ్ న్యూస్‌పేపర్ కార్యాలయం సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం 10 జన్‌ఫథ్‌లోని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసం వద్ద, ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద అదనపు పోలీస్ బలగాలు మోహరించాయి. ఆఫీస్‌కు ఈడీ సీల్ వేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. -
నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయంలో ఈడీ తనిఖీలు
-
నేడు ఈడీ విచారణకు సోనియా గాంధీ
-
మరో సత్యాగ్రహం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వ తీరు బ్రిటిషర్ల నియంతృత్వాన్ని తలపిస్తోందంటూ కాంగ్రెస్ మండిపడింది. తమ పార్టీని చూసి కేంద్రం ఎంతగా భయపడుతోందో చెప్పేందుకు శాంతియుత నిరసనపై జరిపిన దమనకాండే నిదర్శనమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ పిరికిపంద ప్రభుత్వంపై మరోసారి గాంధీ సత్యాగ్రహం మొదలు పెట్టామని ప్రకటించారు. 23న సోనియా ఈడీ విచారణకు హాజరైప్పుడూ ఇలాగే ప్రదర్శనకు దిగుతారా అని ప్రశ్నించగా పరిస్థితిని బట్టి దీటుగా స్పందించే సామర్థ్యం కాంగ్రెస్‌కు ఉందని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ బదులిచ్చారు. తమ నిరసన సందర్భంగా ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీ మోహరింపులనుద్దేశించి ‘బుల్డోజర్లే తక్కువయ్యాయి’ అంటూ కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఎద్దేవా చేశారు. చిదంబరం పక్కటెముకలు విరిగాయి శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ నేతలతో ఢిల్లీ పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారని సుర్జేవాలా ఆరోపించారు. ‘‘మా వారిపై పోలీసులు ప్రాణాంతక దాడికి దిగారు. కేసీ వేణుగోపాల్‌ను, ఎంపీ శక్తిసింగ్ గోహిల్‌ను విపరీతంగా కొట్టారు. పోలీసుల దాడిలో కేంద్ర మాజీ హోం మంత్రి అయిన పి.చిదంబరంతో పాటు మరో నేత ప్రమోద్ తివారీ పక్కటెముకలు ఫ్రాక్చరయ్యాయి. చిదంబరం కళ్లద్దాలు ఏఐసీసీ కార్యాలయం బయట రోడ్డుపై పగిలిపోయి కన్పించాయి’’ అని చెప్పారు. కేంద్ర మాజీ హోం మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మోదీ సర్కారుకు తెలియదా అని దుయ్యబట్టారు. ఇంకెన్ని దుర్మార్గాలకు దిగుతారో చెప్పాలన్నారు. తనతో పోలీసులు దురుసుగా వ్యవహరించారంటూ చిదంబరం కూడా ట్వీట్ చేశారు. ‘‘ముగ్గురు భారీకాయులైన పోలీసులు నాపై పడ్డారు. అదృష్టం కొద్దీ కేవలం ఫ్రాక్చర్‌తో తప్పిం చుకున్నా. అది హెయిర్‌లైన్ ఫ్రాక్చరైతే 10 రోజుల్లో మానుతుందని డాక్టర్లు చెప్పారు. నేను బానే ఉన్నా. రేపట్నుంచి మళ్లీ రంగంలో దిగుతా’’ అని చెప్పారు. వేణుగోపాల్‌ను పోలీసులు ఈడ్చుకెళ్తున్న ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్ పోస్ట్ చేసింది. -
నేషనల్ హెరాల్డ్‌పై 5,000 కోట్ల దావా
అహ్మదాబాద్: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికపై రూ.5,000 కోట్ల పరువునష్టం దావాను దాఖలు చేసింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో నేషనల్ హెరాల్డ్‌లో ప్రచురితమైన ఓ కథనం తమ కంపెనీపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా, చైర్మన్ అనిల్ అంబానీ పరువుకు నష్టం కలిగించేలా ఉందని చెప్పింది. అలాగే రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు విషయంలో అసత్య ఆరోపణలు చేశారంటూ గుజరాత్ కాంగ్రెస్ నేత శక్తిసిన్హ్ గోహిల్‌పై మరో రూ.5,000 కోట్ల పరువునష్టం దావాను రిలయన్స్ గ్రూప్ వేసింది. ఈ సందర్భంగా కోర్టులో రిలయన్స్ న్యాయవాది మాట్లాడుతూ.. ‘రాఫెల్ ఒప్పందం ప్రకటించడానికి 10 రోజులకు ముందు అనిల్ కంపెనీ పెట్టారు’ అంటూ నేషనల్ హెరాల్డ్‌లో తప్పుడు, అసత్య కథనం రాశారని తెలిపారు. గోహిల్ కూడా పలుమార్లు తామేదో అక్రమంగా లాభపడినట్లు విమర్శలు చేశారన్నారు. -
నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ కన్నుమూత
చెన్నై: ప్రముఖ జర్నలిస్ట్, నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ ఇన్ చీఫ్ నీలబ్ మిశ్రా(57) శనివారం కన్నుమూశారు. నీలబ్ కొంత కాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారని నేషనల్ హెరాల్డ్ వెబ్సైట్ వెల్లడించింది. నీలబ్ అంత్యక్రియలు నుంగంబాకంలో నిర్వహించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. నీలబ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. నీలబ్‌ను ‘ఎడిటర్స్ ఎడిటర్’గా సంబోధిస్తూ ట్వీట్ చేశారు. 2016లో నేషనల్ హెరాల్డ్‌ను పునఃప్రారంభించడంలో నీలబ్ కీలక పాత్ర పోషించారు. జైపూర్‌లో ‘న్యూస్‌టైమ్’కు కరస్పాండెంట్‌గా పనిచేశారు. ‘ఔట్లుక్ హిందీ’కి ఎడిటర్‌గా పనిచేశారు. -
బోనులో సోనియా
త్రికాలమ్ ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకీ, ఆ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులకీ బలమైన ఎదురుదెబ్బ. రాబోయే రాష్ట్ర పతి ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించేందుకు ప్రతిపక్షాలతో సోనియా గాంధీ సమాలోచనలు జరుపుతున్న దశలో కోర్టు తీర్పు ప్రతికూలంగా రావడం విశేషం. యూపీఏ–3ను నిర్మించే సంకల్పంతో ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ఒక కొలిక్కి రాకముందే వెలువడిన కోర్టు నిర్ణయం సోనియా గాంధీ ప్రతిష్ఠపైన శరాఘాతం. 2014 ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్న శరపరంపరలో ఇది తాజాదీ, అత్యంత నష్టదాయకమైనదీ. ఆదాయం పన్ను శాఖ (ఐటీ)ను ‘నేషనల్ హెరాల్డ్’కి సంబంధించిన అంశా లలో దర్యాప్తు చేయకుండా నిలువరించాలని అభ్యర్థిస్తూ యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఎల్) కంపెనీ పెట్టుకున్న పిటిషన్‌ను కంపెనీ తరఫు న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ హైకోర్టు సూచన మేరకు ఉపసంహరించుకోగా పిటిషన్‌ను కొట్టివేసినట్టు కోర్టు ప్రకటించింది. ఫలితంగా ఈ కేసులో నిందితులైన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెస్, జర్నలిస్టు సుమన్ దుబే, సాంకేతిక శాస్త్ర ప్రవీణుడు శ్యామ్ పిత్రోడాల ఎదుట రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, హైకోర్టు ఆదేశం శిరసా వహించి ఐటీ అధికారుల పరిశీలనను స్వాగతించడం. రెండు, సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడం. రెండు మార్గాలూ కంటకప్రాయమైనవే. సంస్థ లావా దేవీలను తెలిపే డైరీలనూ, పత్రాలనూ పరిశీలించే అవకాశం ఐటీ అధికారు లకు ఇస్తే వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. వెలిబుచ్చే సందే హాలను నివృత్తి చేయాలి. ఒక విషయం పరిశీలిస్తుంటే, దృష్టి కొత్త విష యంలోకి దారితీయవచ్చు. తవ్వినకొద్దీ కొత్త సమాచారం బయటపడవచ్చు. ఫలితం ఏదైనా కావచ్చు. సుప్రీంకోర్టుకు అప్పీలు చేసిన తర్వాత సర్వోన్నత న్యాయస్థానం అప్పీలును కొట్టివేస్తే అప్పుడైనా ఐటీ అధికారులను అనుమతిం చక తప్పదు. వారితో సహకరించకా తప్పదు. హైకోర్టు తీర్పు వల్ల హెరాల్డ్ విషయంలో అక్రమాలు జరిగాయనీ, వాటిలో సోనియా గాంధీకీ, రాహుల్కీ ప్రమేయం ఉన్నదనే అభిప్రాయం ప్రజలలో బలపడుతుంది. ఇటువంటి అభి ప్రాయం వాస్తవం కంటే బలమైనది (perception is more powerful than reality). అసలే కాంగ్రెస్ కార్యకర్తలు డీలాపడి ఉన్నారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత సాధించి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించే క్రమంలో నాయకత్వ పాత్ర పోషిస్తున్న సోనియా గాంధీపైన అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావచ్చు ననే అనుమానం సైతం ఆమె నాయకత్వాన్ని బలహీనపరుస్తుంది. నెహ్రూ నుంచి రాహుల్ దాకా.... స్వాతంత్య్ర సమర సమాచారాన్ని దేశ ప్రజలకు తెలియజేయడానికీ, కాంగ్రెస్ పార్టీ వాణిని వినిపించడానికీ ఒక పత్రిక కావాలని స్వాతంత్య్ర సముపార్జనకు పూర్వమే జవహర్లాల్ నెహ్రూ తీర్మానించుకొని ‘నేషనల్ హెరాల్డ్’ పేపరును నెలకొల్పారు. ఈ పత్రికకు ఎక్కువ కాలం సంపాదక బాధ్యతలు సమర్థంగా నిర్వహించిన వ్యక్తి మహోన్నత పాత్రికేయుడు ఎం. చలపతిరావు. నెహ్రూ అన్నా, చలపతిరావు అన్నా నాకు ఎనలేని గౌరవం. పత్రికానిర్వహణ వ్యయంతో కూడిన పని. అధికార పార్టీకి చెందిన పత్రికను నిర్వహించడం ఇటీవలి కాలంలో సులువైంది. నెహ్రూ హయాంలో ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ ‘నేషనల్ హెరాల్డ్’కు ప్రత్యేకంగా ప్రకటనల రూపంలో ఆదాయం సమకూర్చే ప్రయత్నం చేసేవికావు. ఆ పత్రిక నష్టాలలోనే నడిచింది. హెరాల్డ్‌ను నిర్వహి స్తున్న సంస్థ అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజెఎల్)కు ప్రభుత్వం ఢిల్లీలోని ప్రధాన కూడలిలో తక్కువ ధరకు స్థలం కేటాయించింది. అక్కడ నిర్మించిన భవనం నుంచే హెరాల్డ్ ప్రచురణ 2008 వరకూ సాగింది. ఈ పత్రిక నిర్వహ ణను ఇందిరా గాంధీ హయాంలో మహమ్మద్ యూనస్ పర్యవేక్షించేవారు. ఆ తర్వాత మోతీలాల్ వోరా. మూతపడేవరకూ పత్రికను నడిపేందుకు అవసర మైన నిధులను కాంగ్రెస్ పార్టీ వడ్డీలేని రుణంగా అందజేసింది. ఆ మొత్తం రూ. 90.26 కోట్లు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఏజెఎల్ చెల్లించవలసిన అప్పు. ఏజేఎల్‌లో వోరా, ఫెర్నాండెస్‌లు డైరెక్టర్లు. వోరాయే ఆ సంస్థకు అధ్యక్షుడు కూడా. ఈ వ్యవ హారంలో కాంగ్రెస్ మేధావులు ఒక ఎత్తుగడ వేశారు. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెyŠ పేరుతో ఒక కొత్త సంస్థను నెలకొల్పారు. అందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వోరా, ఫెర్నాండెస్‌లు వాటాదారులు. సోనియా, రాహుల్‌కి చెరి 38 శాతం వంతున ఇద్దరికీ కలిపి 76 శాతం ఉన్నాయని ఒక వాదన. తల్లీకొడు కులకు కలిపి 86 శాతం ఉన్నాయని ఐటీ లెక్కలు సూచిస్తున్నాయి. ఐటీ శాఖ దగ్గర ఉన్న వివరాల ప్రకారం సోనియా, రాహుల్‌కి వైఐఎల్‌లో 83.3 శాతం వాటా ఉంది. వోరాకి 15.5 శాతం, ఫెర్నాండెస్కి 1.2 శాతం వాటా. వైఐఏల్ ఆవిర్భావం, ఏజెఎల్ను ఆస్తులను కొత్త సంస్థ వాల్చుకున్న తీరూ సోనియా, తదితరులపైన ప్రైవేట్ క్రిమినల్ కేసు వేసేందుకు డాక్టర్ సుబ్రమణ్య స్వామికి అవకాశం ఇచ్చింది. వైఐఎల్ మూలధనం కేవలం రూ 5 లక్షలు. అంత తక్కువ పెట్టుబడితో నిర్మించిన సంస్థ కాంగ్రెస్ పార్టీకి రూ. 50 లక్షలు చెల్లిం చింది. ఏజెఎల్ కాంగ్రెస్‌కు కోట్లలో బకాయి ఉన్నది కనుక కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందంటే దానికి రావలసిన మొండి బకాయీని వసూలు చేసుకునే అధికారం వైఐఎల్‌కు దఖలు పరిచింది. అంటే, రూ 50 లక్షలు చెల్లించిన సంస్థకు రూ. 90.26 కోట్లు వసూలు చేసుకునే హక్కు ఇచ్చింది. అప్పు తీర్చలేక పోయింది కనుక ఏజెఎల్ సంస్థ వాటాలను వైఐఎల్ సంస్థకు బదలాయిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అంతవరకూ ఏజెఎల్ సంస్థలో వాటాదారులుగా కొనసా గిన 761 మందికీ కలిపి కొత్త సంస్థలో ఒకే ఒక శాతం వాటా దక్కింది. ఈ దశలో ఘటనాఘటన సమర్థుడు, హేమాహేమీలను లిటిగేషన్‌తో మట్టికరిపించిన అద్వితీయమైన మేధావి సుబ్రమణ్యస్వామి రంగప్రవేశం చేశారు. 2012లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులను నిందితులుగా పేర్కొంటూ ప్రైవేట్ క్రిమినల్ కేసు దాఖలు చేశారు. సంస్థలలో వాటాల బదలాయింపు అంతవరకూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారంగా పరిగణించిన సమాజం స్వామి వ్యాజ్యంతో భిన్న కోణంలో చూడటం ప్రారంభించింది. నిరుడు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్గౌర్ ఈ కేసును ‘ప్రత్యేకమైనది’ ('one of its kind') అంటూ అభివర్ణించారు. సోనియాపై స్వామి ధ్వజం ఏజెఎల్‌కు చెందిన ఆస్తులను కాజేయడానికి అడ్డదారులు తొక్కారంటూ సోనియా తదితరులపైన సుబ్రమణ్యస్వామి ఆరోపణ చేశారు. వైఐఎల్‌కి బదలా యించిన ఏజెఎల్ ఆస్తుల విలువ రూ. 2,000 కోట్ల వరకూ ఉంటుందని స్వామి అంచనా. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపైన వచ్చిన ఆరోప ణలు బలమైనవని న్యాయవాదులు అంటు న్నారు. ఈ కేసును కక్ష సాధింపు చర్యగా కాంగ్రెస్ పార్టీ పరిగణించింది. కోర్టుకు హాజరు కానవసరం లేకుండా మినహాయింపు ఇవ్వాలని సోనియా బృందం పెట్టుకున్న అర్జీని అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు (ట్రయిల్ కోర్టు)కు సోనియా, రాహుల్, వోరా, ఫెర్నాండెస్‌లు 2015 డిసెంబర్ 19న హాజరైనప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు హంగామా చేశారు. నినాదాలు చేశారు. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పిత్రోడా దేశాంతరంలో ఉండటం వల్ల తర్వాత కోర్టుకు హాజరై బెయిల్ పొందారు. రాహుల్ బెయిల్‌కు జామీను ప్రియాంక చెల్లించగా, సోనియా బెయిల్‌కు పూచీకత్తు మాజీ రక్షణ మంత్రి ఏకె ఆంటోనీ కట్టారు. ఇది న్యాయపరమైన అంశం అయినప్పటికీ మోదీ ప్రభుత్వం తమ నాయకులపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటు శీతాకాల సమావేశాలలో చర్చ జరగకుండా చాలా రోజులు అడ్డుకున్నారు. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు కూడా లేవు. వానా కాలం సమావేశాలు జులైలో జరుగుతాయి. ఇప్పుడు ఉన్నవి రాష్ట్రపతి ఎన్నికలు. ప్రతిపక్షాల తరఫున అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ కేసు ముందుకు రావడం విశేషం. కాంగ్రెస్‌తో సహకరిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్, బహుజన్ సమాజ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్‌లు కూడా అవినీతి ఆరోపణలపైన కేసులు ఎదుర్కొంటున్నాయి. గడ్డి కుంభకోణంలో లాలూ పైన కేసు తిరగదోడా లని సుప్రీంకోర్టు నిర్ణయించింది. మాయావతి సోదరుడిపైనా, మాయావతిపైనా అవినీతి ఆరోపణల విచారణ తిరిగి ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు. నారదా కుంభకోణం, శారదా చిట్స్ అక్రమాలకు సంబంధించిన కేసుల దర్యాప్తుతో తృణ మూల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులూ, ఇతర నాయకులూ గిలగిలలాడుతు న్నారు. ఈ దశలో ప్రతి పక్షాలన్నీ ఒక్క తాటిపైన నిలిచి రాష్ట్రపతి ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి ఎన్డీఏ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వడం కష్టం. కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదం ‘నేషనల్ హెరాల్డ్’ కేసులో దర్యాప్తును అడ్డుకోవడం వల్ల సోనియా గాంధీకి కానీ రాహుల్ గాంధీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రయోజనం ఉంటుందా? ఈ వ్యూహం వల్ల కాంగ్రెస్ పార్టీకీ, అధినాయకత్వానికీ నష్టమే కానీ లాభం లేదు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా జైన్ డైరీలో ఎల్‌కె అని రెండు పొడి అక్షరాలు ఉన్నాయనీ, అది లాల్‌కృష్ణ అడ్వాణీకి సంకేతమనీ ప్రభుత్వం పిటిషన్ వేసిన వెంటనే అడ్వాణీ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను నిర్దోషి అంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఎన్నికై సభలో అడుగు పెట్టారు. అంతే కానీ తన మీద విచారణ జరపరాదంటూ అడ్డుకునే ప్రయత్నం క్షణం కూడా చేయలేదు. ఇప్పుడు సోనియా ప్రభృతులు నడుస్తున్నది దశాబ్దా లుగా చంద్రబాబు నడిచిన బాటలోనే. జనం ఏమనుకుంటారు? నిజంగా నిర్దోషులైతే విచారణను అడ్డుకోవడానికి ఎందుకు తంటాలు పడతారు అని ప్రజలు ప్రశ్నించుకోరా? సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని డిమాండ్ చేయవలసిన సోనియా గాంధీ ఐటీ పరిశీలనను అడ్డుకునేందుకు కోర్టుల చుట్టూ తిరగడం ఆమెకు కానీ పార్టీకి కానీ శోభాయమానంగా ఉంటుందా? కేసు త్వరగా పరిష్కరించాలని బీజేపీ కోరుకోదు. అపరిష్కృతంగా ఉంటేనే ఈ కేసును అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయవచ్చు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ప్రధాని మోదీ అదే పనిచేశారు. యాదవ రాజ్యం కొన సాగాలంటే అఖిలేశ్‌కి ఓటేయండి అంటూ, అవినీతి రాజ్యం రావాలంటే మాయా వతికి ఓటేయండి అంటూ, స్వచ్ఛమైన ప్రజారాజ్యం కావాలంటే బీజేపీని గెలి పించాలంటూ బలంగా ప్రచారం చేసి మట్టి కరిపించారు. కాంగ్రెస్‌పైన అయి దేళ్ళుగా అవినీతి ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టలేక కాంగ్రెస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతూనే ఉన్నారు. అదే స్థితి 2019 లోనూ కొనసాగాలంటే ‘నేషనల్ హెరాల్డ్’ కేసులోనూ, ప్రియాంక భర్త రాబర్డ్ వద్రాపైన వచ్చిన భూకుంభకోణానికి సంబంధించిన కేసులోనూ దర్యాప్తు జర గకూడదనీ, కోర్టులో విచారణ సాగరాదనీ కాంగ్రెస్ కోరుకోవాలి. నిర్దోషిగా తేలి బీజేపీని దీటుగా ఎదుర్కొనే స్థాయికి వచ్చే ఎన్నికల నాటికి రావాలంటే కేసులపై సత్వర విచారణ జరిపించాలని ఉద్యమం చేయాలి. కాలం గడిచే కొద్దీ ప్రజలలో అనుమానాలు పెనుభూతాలై సోనియా, రాహుల్ నిజంగానే అవినీతికి పాల్ప డినట్టు బలంగా నమ్ముతారు. నేరం చేయకపోతే కోర్టు విచారణను ఎందుకు అడ్డుకుంటారనే మౌలికమైన ప్రశ్నకు కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదు. అదే నరేంద్ర మోదీకి వరం. కె. రామచంద్రమూర్తి -
జనం మెచ్చిన జర్నలిస్టు
‘చలపతిరావు భారతదేశంలో అత్యంత సమర్థుడైన పాత్రికేయుడు, అతడి నైతిక ప్రవర్తన ప్రశ్నించడానికి వీలులేనిది’ అన్నారు జవహర్లాల్ నెహ్రూ. నేషనల్ హెరాల్డ్ పత్రిక రజతోత్సవాలు(1963) లక్నోలో జరిగినప్పుడు నెహ్రూ పైవిధంగా కితాబునిచ్చారు. నెహ్రూ యాజమాన్యంలోని నేషనల్ హెరాల్డ్ అనగానే సంపాదకుడు ఎంసీ (మనికొండ చలపతిరావు) గుర్తుకు వస్తారు. ఎంసీయే నేషనల్ హెరాల్డ్గా, నేషనల్ హెరాల్డ్ ఎంసీగా వర్ధిల్లింది. ఆంగ్ల పత్రికారంగాన్ని నాలుగు దశాబ్దాలపాటు శాసించిన మహావ్యక్తి. చరిత్ర, సాహిత్యం, రాజనీతిశాస్త్రాల్లో ఆయన నిష్ణాతుడు. సాహితీవేత్త, మానవతావాది. భారతీయ జర్నలిస్టుల ఉద్యమానికి శంఖారావం పూరించింది ఆయనే. ప్రతిరంగంలో విశేష పరిజ్ఞానం, అభినివేశం, స్పష్టమైన చారిత్రక దృక్పథం, ఆంగ్లభాషపై మంచి పట్టు ఎంసీని మేరునగధీరునిగా నిలిపింది. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఎంసీ శ్రీకాకుళం చిన్న బజారులోని మాదివారి సందు కోవెల సమీపంలో ఓ సంపన్న కుటుంబంలో 1908, ఆగస్టు 11న జన్మించారు. అయితే ఆయన బాల్యం, యవ్వన దశకు విశాఖపట్నం వేదిక అయింది. ఎంఏ (ఆంగ్లం), బీఎల్ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో పూర్తి చేశారు. విశాఖలో కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. ‘ఎథేనియం’ అనే సాంస్కృతిక సంస్థను ప్రారంభించారు. దానికి ఎంసీ కార్యదర్శిగా, డా॥సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షులుగా ఉండేవారు. మద్రాసు నుంచి వెలువడుతుండే ‘పీపుల్స్ వాయిస్’, అలహాబాద్‌కు చెందిన ‘వీక్ ఎండ్’ పత్రికకు సహాయ సంపాదకునిగా పని చేశారు. ‘త్రివేణి’ పత్రికలో ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ప్రత్యేక కథనాలు రాసేవారు. 1938లో నెహ్రూ ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికను లక్నోలో ప్రారంభించారు. ఎంసీ సహాయ సంపాదకునిగా, సంపాదకీయ రచయితగా పనిచేశారు. 1942లో ‘నేషనల్ హెరాల్డ్’ ఆంగ్ల ప్రభుత్వ నిషేధానికి గురైనప్పుడు హిందుస్తాన్ టైమ్స్’లో కొన్నేళ్లపాటు పనిచేశారు. 1945లో తిరిగి ఢిల్లీలో ప్రారంభమైన ‘నేషనల్ హెరాల్డ్’లో చేరి, ఆ మరుసటి ఏడాది సంపాదకునిగా పదోన్నతి పొందారు. నెహ్రూ ఉపన్యాసాలను ఖరారు చేయడంలో ఎంసీదే కీలక భూమిక. అయితే డెస్క్‌లో కూర్చున్నప్పుడు పలు సందర్భాల్లో నెహ్రూ అభిమతానికి భిన్నంగా సంపాదకీయాలు రాసిన సాహసి ఆయన. ఓ సారి నెహ్రూ ప్రశ్నిస్తే ఎంసీ నుంచి మౌనమే సమాధానంగా వచ్చింది. అప్పటి నుంచి ఆయన తన రాజీనామా లేఖను జేబులో ఉంచుకుని కార్యాలయానికి వెళ్లేవారు. కానీ నెహ్రూకు ఆయన పట్ల సానుకూల దృక్పథమే ఉండేది. అంతరాత్జీయ సమస్యలపైన, వర్తమాన రాజకీయ పరిస్థితులు, పరిణామక్రమంపైన, రెండో ప్రపంచ యుద్ధ పరిణామాలను బేరీజు వేయడంలోను, ఆయన సాధికారిక వ్యాఖ్యానాలు ఆ రోజుల్లో సంచ లనం రేకెత్తించాయి. పత్రికా రచయితల సంక్షేమం, హక్కుల పరిరక్ష ణకు 1950లో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే) సంస్థను స్థాపించారు. 1959 వరకు దానికి జాతీయ అధ్యక్షు నిగా ప్రముఖ ప్రాత పోషించారు. 1952లో కేంద్ర ప్రభుత్వం ప్రెస్ కమిషన్ ఏర్పాటు చేయడానికి ఎంసీ ప్రధాన కారకుడు. ‘ది ప్రెస్ ఆఫ్ ఇండియా’’ ‘‘ది ప్రెస్ అండ్ ది రొమాన్స్ ఆఫ్ ది న్యూస్ పేపర్’’ ఫ్రాగ్మంట్స్ ఆఫ్ ఎ రివల్యూషన్’’ ‘‘గాంధీ అండ్ నెహ్రూ’’ వంటి గ్రంథాలను ఆంగ్లంలో రాశారు. పత్రికా రచన విధానాలపై ‘ఆఫ్ ది రికార్డు, మెన్ ఫ్రమ్ మేవార్’ పుస్తకం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎంసీ 1983 మార్చి 25న న్యూఢిల్లీలో కారులో ప్రయాణం చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. ఆయన స్మృతి చిహ్నంగా హైదరాబాద్ జూబ్లీహాల్ కూడలి వద్ద 2007 డిసెంబర్ 31న ఎంసీ విగ్రహాన్ని నాటి సీఎం వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆవిష్కరించారు. న్యాయస్థానాల తీర్పుల్లో జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ ఎలాగో ఆంగ్ల సంపాదకీయ రచనల్లో ఎంసీ అంతటి గొప్పవారని మేధావులు పేర్కొంటారు. ఆయన జాతి గర్వించదగ్గ పాత్రికేయుడు. - (నేడు ఎం.చలపతిరావు 33వ వర్థంతి సందర్భంగా) వాండ్రంగి కొండలరావు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ 9490528730 -
సుప్రీంకోర్టును ఆశ్రయించిన సోనియా, రాహుల్
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గురువారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కింది కోర్టు సమన్లను హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ ఉన్నత న్యాయస్ధానంలో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. కాగా గత ఏడాది డిసెంబరులో ఈ కేసులో ఢిల్లీ కోర్టు సోనియా, రాహుల్‌కు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ ఆంగ్ల దినపత్రిక నష్టాలతో 2008లో మూతపడింది. ఆ పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్‌పై భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి కేసు పెట్టారు. -
ఒడిదుడుకుల వారం..!
ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా * క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం సెలవు * ట్రేడింగ్ నాలుగు రోజులే న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ ఈ వారం ఒడిదుడుకులమయంగా సాగుతుందని నిపుణులంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా శుక్రవారం సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల కదలికలు కీలకం కానున్నాయి. జీఎస్టీ బిల్లు ఆమోదంపై అనిశ్చితి వంటి దేశీయ అంశాల కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులమయంగాసాగుతుందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. ముడి చమురు ధరల పతనం కొనసాగుతున్న నేపథ్యంలో మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్(రీసెర్చ్) వివేక్ గుప్తా చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో సెంటిమెంట్లు, రూపాయి కదలికలు, ముడి చమురు ధరలు కూడా ఈ వారం స్టాక్‌మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. కాగా గత వారంలో సెన్సెక్స్ 478 పాయింట్లు లాభపడి 25,519 పాయింట్ల వద్ద ముగిసింది. అటకెక్కిన జీఎస్టీ బిల్లు..! జీఎస్టీ బిల్లు ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందగలదని అందరూ భావించారు. ఇప్పుడు ఆమోదం పొందితేనే అనుకున్న ప్రకారం ఈ జీఎస్టీ చట్టం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ బుధవారంతో ముగుస్తాయి. నేషనల్ హెరాల్డ్ విషయమై కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును స్తంభింపజేస్లుండటంతో ఈ బిల్లు ఆమోదంపై నీలినీడలు కమ్ముకున్నాయి.మరోవైపు జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడం కష్టమేనని ఆర్థిక మంత్రి జైట్లీ తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. వర్థమాన దేశాల ఈక్విటీల పట్ల జాగ్రత్త న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని షేర్ల ధరలు తక్కువ స్థాయిల్లో ఉండి అంతర్జాతీయ ఫండ్ మేనేజర్లను ట్రాప్‌లో పడేస్తున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీఓఎఫ్ఏ) తాజా సర్వే పేర్కొంది. అయితే వీటి భవిష్యత్తు ఆర్జన అవకాశాలు బలహీనంగా ఉన్నాయని హెచ్చరించింది. చైనా ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుండడం, డాలర్ బలపడుతుండడం, బాండ్‌ఈల్డ్స్ పెరుగుతుండడం వర్థమాన దేశాల స్టాక్మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. చైనా జీడీపీ వృద్ధి 2018 కల్లా 5.5 శాతానికి పడిపోతుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని తెలిపింది. కాగా అందరూ అంచనా వేసినట్లుగానే దాదాపు పదేళ్త తర్వాత అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచింది. ఈ రేట్ల పెంపు కారణంగా భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి విదేశీ నిధులు తరలిపోతాయనే ఆందోళన నెలకొన్నది. -
స్వచ్ఛంద సంస్థగా మార్చుదాం...
లక్నో: ఒకవైపు తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న కేసు నడుస్తుండగా.. నేషనల్ హెరాల్డ్ యాజమాన్య సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అసాధారణ రీతిలో వచ్చే నెల (జనవరి) 21వ తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహించనుంది. సంస్థ నిర్మాణాన్ని వాణిజ్యం నుంచి లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థగా మార్చేందుకు 762 మంది వాటాదారుల అంగీకారం కోరుతూ లక్నోలో ఈ భేటీని ఏర్పాటు చేస్తోంది. అలాగే సంస్థ పేరును మార్చేందుకు కూడా వాటాదారుల సమ్మతి కోరనుంది. ఈ మేరకు అసోసియేటెడ్ జర్నల్స్ మేనేజింగ్ డెరైక్టర్ మోతీలాల్వోరా పేరుతో శనివారం లక్నోలోని దినపత్రికల్లో నోటీసును ప్రచురించింది. -
తప్పు చేయనప్పుడు భయమెందుకు?
న్యూఢిల్లీ : అన్యాయం జరిగినప్పుడు బాధ్యతగల పౌరుడిగా ప్రశ్నించే హక్కు తనకు ఉందని బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన శనివారమిక్కడ తిప్పికొట్టారు. నిరసనలు, ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ వ్యాఖ్యలను సుబ్రహ్మణ్యం స్వామి తిప్పికొట్టారు. ఏ తప్పు చేయకుంటే మామూలుగానే కోర్టుకు హాజరయ్యేవారని ఆయన అన్నారు. ఏ తప్పు చేయకుంటే కాంగ్రెస్ భయపడాల్సిన పనేమీ లేదని, ఈ కేసును వాదించేందుకు ఆరుగురు సీనియర్ న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారని, మరి ఇంకెందుకు భయమంటూ సుబ్రహ్మణ్యం స్వామి ఎద్దేవా చేశారు. అనంతరం పటియాల హౌస్ కోర్టుకు సుబ్రహ్మణ్యం స్వామి తన సతీమణి రుక్సానాతో కలిసి వెళ్లారు. మరోవైపు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కానున్న నేపధ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు సమీపంలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటంతో, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కోర్టు చుట్టూ భారీ భద్రత
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో ఆ కోర్టు చుట్టూ భారీ భద్రతను ఏర్పాటుచేశారు. ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. సుమారు 700 మంది సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలించేందుకు సీసీటీవీ కెమెరాలను, ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. కాగా బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి దాఖలు చేసిన నేషనల్ హెరాల్డ్ కేసు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కూడా దీనిపై దుమారం కొనసాగుతోంది. -
రాజ్యసభలో కీలక పరిణామం
న్యూఢిల్లీ : రాజ్యసభలో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంపై ఇవాళ కూడా సభలో గందరగోళం నెలకొంది. ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు... హెరాల్డ్ వ్యవహారంపై చర్చించాలంటూ డిమాండ్ చేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించవద్దని డిప్యూటీ చైర్మన్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో పదే పదే సభను అడ్డుకోవడంతో విపక్షాలపై సస్పెన్షన్ వేటు పడింది. వెల్‌లోకి దూసుకెళ్లిన 23మంది కాంగ్రెస్, వామపక్ష సభ్యులను డిప్యూటీ చైర్మన్ కురియన్ సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం సభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. సస్పెండ్ అయిన కాంగ్రెస్, వామపక్ష సభ్యులు శాంతించకపోవడంతో సభ మరోసారి మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా పడింది. -
ఉభయసభలు వాయిదా.. ప్రధాని ఆవేదన!
-
ఉభయసభలు వాయిదా.. ప్రధాని ఆవేదన!
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసు రగడ గురువారం కూడా పార్లమెంటు ఉభయసభలను కుదిపేసింది. ఈ విషయమై లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగడంతో రెండు సభలు వాయిదా పడ్డాయి. కాంగ్రెస్ సభ్యుల నిరసనతో మొదట రాజ్యసభ ఉదయం 11.30 గంటలకు వాయిదాపడగా.. లోక్‌సభలోనే అదే పరిస్థితి కొనసాగడంతో స్పీకర్ సభను ఉదయం 11.40 గంటలకు వరకు వాయిదా వేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినాయకులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో ఈ విషయంలో ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నదని ఆ పార్టీ సభ్యులు మండిపోడున్నారు. మరోవైపు పార్లమెంటు పనిచేయకపోవడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు నడువకపోవడం బాధ కలిగిస్తున్నదని ఆయన తెలిపారు. దీంతో పార్లమెంటులో వస్తుసేవల పన్ను బిల్లుతోపాటు పేదలకు మేలు చేసే పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, దీనివల్ల పేదలకు నష్టం వాటిల్లే అవకాశముందని మోదీ పేర్కొన్నారు. ఏ ఒక్కరి ఇష్టాయిష్టాల మేరకు ప్రజాస్వామ్యం పనిచేయబోదని ఆయన కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. -
‘అరచేతి’ని అడ్డుపెట్టి..
పార్లమెంటు సజావుగా సాగడం కోసం పాత తగువుల్ని పరిష్కరించుకుంటూ వస్తున్న ఎన్డీఏ సర్కారుకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. తాజాగా ‘నేషనల్ హెరాల్డ్’ వివాదం పార్లమెంటును కుదిపేస్తున్నది. 2012లో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు పర్యవసానంగా ప్రారంభమైన ఈ వివాదం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీ సహా ఆరుగురికి కింది కోర్టు నిరుడు జూన్‌లో సమన్లు జారీచేసింది. సమన్ల రద్దుపై దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చి కింది కోర్టులో హాజరై వాదనలు వినిపించాల్సిందేనని మంగళవారం తీర్పునిచ్చాక కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ దాడి మొదలుపెట్టింది. అందులో భాగంగా వరసగా రెండు రోజులు పార్లమెంటు ఉభయసభలూ స్తంభించిపోయాయి. ‘నేను ఇందిరాగాంధీ కోడల్ని. ఎవరికీ, దేనికీ భయపడన’ని సమావేశాల ప్రారంభానికి ముందు సోనియాగాంధీ ప్రకటించి యుద్ధభేరి మోగించారు. ఇందులోని సందేశాన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభ, రాజ్యసభల్లో ఆందోళనకు శ్రీకారం చుట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలిచ్చారు. ఈ నిరసన ఎందుకో చెప్పాలంటూ అధ్యక్ష స్థానాల్లో ఉన్నవారు అడిగినా అటువైపు నుంచి జవాబు లేదు. ‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక చరిత్ర ఉన్నతమైనది. జవహర్లాల్ నెహ్రూ 1938లో ప్రారంభించిన ఈ పత్రిక కొన్నాళ్లకే కాంగ్రెస్‌కు అధికార పత్రిక అయింది. సంపాదకీయ వ్యాఖ్యలు రాయడం మొదలుకొని విలేకరి వరకూ నెహ్రూ చాలా బాధ్యతలు నిర్వర్తించారు. స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించిన ఆ పత్రిక స్వాతంత్య్రానంతరం కూడా తన సొంత గొంతును కాపాడుకుంది. ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేనప్పుడు విమర్శించడానికి అది వెనకాడలేదు. అనేకసార్లు మూతపడుతూ, తిరిగి ప్రారంభమవుతూ ఆ పత్రిక సాగించిన ప్రయాణం చివరకు 2008లో ఆగిపోయింది. ఆ పత్రిక ప్రచురణకర్తలైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్) అధీనంలో రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెల్లించాల్సిన అప్పు రూ. 90 కోట్ల వరకూ ఉంది. ఈ అప్పు తీర్చడం కోసం అనుసరించిన విధానమే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైంది. రూ. 50 లక్షల పెట్టుబడితో 2010లో పుట్టుకొచ్చిన యంగ్ ఇండియా లిమిటెడ్(వైఐఎల్)లో సోనియా, రాహుల్‌గాంధీలకు 76 శాతం వాటా ఉండటం...తన అప్పు వసూలు చేసే బాధ్యతను కాంగ్రెస్ ఆ సంస్థకు కట్టబెట్టడం...ఆ పేరిట ఏజేఎల్‌లోని 99 శాతం వాటా వైఐఎల్‌కు వెళ్లడంలాంటి పరిణామాలు ఎవరికైనా అనుమానాలు కలిగిస్తాయి. ఎందుకంటే ఈ మొత్తం లావాదేవీల్లో రూ. 90 కోట్ల అప్పు తీర్చే పేరుమీద రూ. 2,000 కోట్ల ఆస్తులు వైఐఎల్‌కు బదిలీ అయ్యాయి. ‘అందరికీ శాస్త్రం చెప్పే బల్లి’ తీరున గాంధీ కుటుంబం ఇంత అనుమానాస్పద రీతిలో వ్యవహారాన్ని ఎందుకు నడిపినట్టు? నెహ్రూ అంటే వల్లమాలిన ప్రేమాభిమానాలతో ఆ పత్రికను పునఃప్రారంభించడం కోసమే ఇదంతా చేస్తున్నారు కాబోలని మొదట్లో చాలామంది భావించారు. సుమన్ దూబే వంటి సీనియర్ పాత్రికేయుడు ఇందులో భాగస్వామి కావడం వారికా అభిప్రాయాన్ని కలిగించింది. కానీ అలాంటిదేమీ లేదని రాహుల్‌గాంధీ 2011లోనే చెప్పేశారు. మరి ఎవరిని ఉద్ధరించడానికి...ఏ ప్రయోజనాలు సాధించడానికి ఇదంతా సాగించినట్టు? ఈ ప్రశ్నలకు ఇంతవరకూ జవాబు లేదు. ఎవరిపైన ఆరోపణలు చేయడానికైనా, ఫిర్యాదులు దాఖలు చేయడానికైనా వెనకాడని సుబ్రహ్మణ్యస్వామి ఇంత అనుమానాస్పద వ్యవహారాన్ని చూసీచూడనట్టు వదిలేస్తారని అనుకోలేం. కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు ఆయన ఎవరో చెబితే కేసులు పెట్టే రకం కూడా కాదు. అయితే కొన్ని ‘సాంకేతిక కారణాలు’ చూపి ఈ కేసును మూసేయాలని మొన్న ఆగస్టులో నిర్ణయించిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) నెలరోజుల్లోనే మనసు మార్చుకుని దీన్ని ఎందుకు తిరగదోడింది? సంస్థకు కొత్త డెరైక్టర్ రావడానికీ... పాత నిర్ణయం మారడానికీ సంబంధం ఉందా? ఈ విషయంలో కేంద్రాన్ని నిలదీయాలని కాంగ్రెస్ అనుకోవడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే సీబీఐలో అయినా, ఈడీలో అయినా వ్యవహారాలు ఎలా కదులుతాయో అందరికన్నా కాంగ్రెస్‌కే ఎక్కువ తెలుసు. పదేళ్లు అధికారం చలాయించినప్పుడు ఆ సంస్థలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను వేధించడంలోనూ, ఇబ్బందులకు గురిచేయడంలోనూ ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన అపకీర్తి తక్కువేమీ కాదు. వేధింపుల్లో ఇంత అనుభవం గడించిన నేతలు ఇప్పుడు తమదాకా వచ్చేసరికి భూమ్యాకాశాలు ఏకం చేయడమెందుకో ఆ పార్టీ సంజాయిషీ ఇవ్వాలి. పార్లమెంటును ప్రశ్నించే వేదికగా ఉపయోగించుకోకుండా స్తంభింపజేయడం ఎందుకో దేశ ప్రజలకు వివరించాలి. పార్లమెంటు వెలుపల రాహుల్‌గాంధీ మాట్లాడిన సందర్భంలో కేంద్రం న్యాయవ్యవస్థను బెదిరిస్తున్నదని కూడా ఆరోపించారు. ఈ ఆరోపణను కాస్త వివరిస్తే, అలా అనడంలోని ఉద్దేశాన్ని చెబితే జనం సంతోషిస్తారు. కేసు ప్రస్తుతానికి న్యాయస్థానం పరిశీలనలో ఉంది. నిందితుల్లో నేర ఉద్దేశం ఉన్నట్టు ప్రాథమికంగా కనిపిస్తున్నదని న్యాయమూర్తి భావించారు. కాంగ్రెస్ పెద్దలు ఈ విషయంలో తమ వాదనను వినిపించాల్సిన వేదిక న్యాయస్థానం. ఈ కేసులో దురుద్దేశాలో, గూడార్థాలో ఉన్నాయనుకుంటే పార్లమెంటు లోపలా, వెలుపలా కూడా వాటిని దేశ ప్రజలకు వివరించవచ్చు. తమ నిర్దోషిత్వాన్ని లోకానికి చాటవచ్చు. సభలో ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. అంతేతప్ప పార్లమెంటును స్తంభింపజేయడం, దేశ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలు మరుగున పడేలా విలువైన సమయాన్ని వృథాపుచ్చడంవంటివి ఆ పార్టీ ప్రతిష్టను పెంచవు. -
న్యాయవ్యవస్థను భయపెట్టే ప్రయత్నం!
పార్లమెంటు ద్వారా బెదిరిస్తున్నారు ♦ కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణలు ♦ ‘నేషనల్ హెరాల్డ్’ అంశంపై రెండో రోజూ స్తంభించిన పార్లమెంట్ న్యూఢిల్లీ: ‘నేషనల్ హెరాల్డ్’ రభస బుధవారమూ కొనసాగింది. పార్లమెంట్లో నిరసనను తీవ్రం చేసిన కాంగ్రెస్ ఈ అంశంపై వరుసగా రెండో రోజూ సభాకార్యక్రమాలను స్తంభింపజేసింది. కాంగ్రెస్, టీఎంసీ సభ్యుల నిరసనలతో పలు వాయిదాల అనంతరం, ఎలాంటి కార్యక్రమాలను చేపట్టకుండానే రాజ్యసభను వాయిదా వేశారు. కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్యనే లోక్‌సభలో కొంతవరకు సభాకార్యక్రమాలను నడిపించారు. ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని, సొంతపార్టీ వారికి ఒక చట్టం, ప్రతిపక్షానికి మరో చట్టాన్ని అనుసరిస్తోందంటూ కాంగ్రెస్, పార్లమెంట్ ద్వారా న్యాయవ్యవస్థను భయపెట్టాలని, బెదిరించాలని కాంగ్రెస్ కోరుకుంటోందంటూ బీజేపీ ఆరోపణల పదును పెంచాయి. ‘ప్రధాని కార్యాలయం నేతృత్వంలో సాగుతున్న 100% రాజకీయ కక్ష సాధింపు కార్యక్రమం ఇద’ని రాహుల్ మీడియాతో అన్నారు. పార్లమెంటును ఉపయోగించుకుని న్యాయవ్యవస్థను భయపెట్టాలని కాంగ్రెస్ చూస్తోందన్న కేంద్రమంత్రి వెంకయ్య ఆరోపణలపై స్పందిస్తూ.. ‘న్యాయవ్యవస్థను ఎవరు భయపెడ్తున్నారో అందరికీ తెలుసు’ అని ఎన్‌జేఏసీ చట్టాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. నేషనల్ హెరాల్డ్ కేసును మూసేయాలని సముచిత నిర్ణయం తీసుకున్న ఈడీ డెరైక్టర్‌ను వెంటనే మరో స్థానానికి బదిలీ చేశారని, ఆ తరువాత మరో డెరైక్టర్‌ను నియమించి, కేసును మళ్లీ తెరిపించారన్న కాంగ్రెస్ నేత ఆజాద్ రాజ్యసభలో తేల్చిచెప్పారు. స్వపక్షానికో చట్టం.. విపక్షానికో చట్టం నేషనల్ హెరాల్డ్ కేసుపై లోక్‌సభలో చర్చ జరిగింది. అది ప్రభుత్వ, విపక్ష సభ్యుల పరస్పర ఆరోపణలతోనే ముగిసింది. జీరో అవర్‌లో ఈ అంశాన్ని కాంగ్రెస్ నేత ఖర్గే లేవనెత్తారు. కాంగ్రెస్ నేతలైన హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్, రాజస్తాన్ నేత అశోక్ గెహ్లాట్ తదితరులపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఒక రకం చట్టాన్ని.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి నేతలు సుష్మా, వసుంధర రాజె తదితరులపై చర్యలు చేపట్టకుండా మరో రకం చట్టాన్ని వర్తింపజేస్తున్నారని విమర్శించారు. తాము న్యాయవ్యవస్థకు వ్యతిరేకం కాదని, ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత విధానాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. ఖర్గే మాట్లాడుతుండగా, సోనియాఆయనకు కొన్ని సూచనలు ఇస్తుండటం కనిపించింది. ఖర్గే ఆరోపణలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. పార్లమెంటు ద్వారా జ్యుడీషియరీని భయపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, అది జాతి ప్రయోజనాలకు మంచిది కాదన్నారు. యూపీఏ హయాంలోనే ఈ కేసు నమోదయిందని గుర్తు చేశారు. ఆ సమయంలో సుబ్రమణ్యస్వామి బీజేపీ సభ్యుడు కూడా కాదన్నారు. పార్లమెంటును సాగనివ్వకుండా చేస్తూ కాంగ్రెస్ పార్టీ మూకస్వామ్యాన్ని అనుసరిస్తోందని వెంకయ్యనాయుడు విమర్శించారు. ‘ఎవరికో కోర్టు సమన్లు జారీ చేస్తే.. దానికి పార్లమెంటుకు సంబంధం ఏంటి? మీరు న్యాయవ్యవస్థను బెదిరించాలని చూస్తున్నారు. మాకే సమన్లు పంపిస్తావా? నీకెంత ధైర్యం అని న్యాయవ్యవస్థనే సవాలు చేస్తున్నారు’ అంటూ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాగా, నేటి నుంచి పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ముఖ్యనేతలతో సోనియా సమావేశమై చర్చించారు. -
రాజ్యసభను కుదిపేసిన నేషనల్ హెరాల్డ్
-
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాకు ఊరట!
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధుల దుర్వినియోగం కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు ఊరట లభించనుంది. దుర్వినియోగానికి బలమైన సాక్ష్యాలు లేని కారణంగా కేసు మూసేయాలని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘నేషనల్ హెరాల్డ్’ ఆంగ్ల దినపత్రిక నష్టాలతో 2008లో మూతపడింది. పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్‌లపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కేసు వేశారు. దీనిపై సోనియా హైకోర్టుకు వెళ్లడంతో ఆగస్టులో ఈడీ సమన్లపై కోర్టు స్టే విధించింది. -
ఆగస్టు 28న ‘నేషనల్ హెరాల్డ్' విచారణ
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసు విచారణను ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు ఆగస్టు 28వ తేదీకి వాయిదా వేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహ పలువురిపై నేషనల్ హెరాల్డ్ దినపత్రికను సొంతం చేసుకున్న అంశానికి సంబంధించి ఆ కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, వారిపై జారీ చేసిన సమన్లను ఆగస్ట్ 13 వరకు నిలుపుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు బుధవారం స్టే విధించడంతో.. ట్రయల్ కోర్టు గురువారం పై నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విరాళాలతో నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కొనుగోలు చేశారంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సోనియాపై కేసు దాఖలు చేశారు. -
‘గాంధీ’ల చేతిలో నెహ్రూ పత్రిక ఖూనీ
యూపీఏ హయాంలో జరిగిన వాటితో పోల్చినపుడు ‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక కుంభకోణం లెక్కలోకి రాదు. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం కూడా వందల కోట్లు పలికినదే. ‘నేషనల్ హెరాల్డ్’ అనే పత్రికను ఆసరా చేసుకుని సోనియా, రాహుల్ సాగించిన కుంభకోణం ఐదు వేల కోట్ల రూపాయలే. కానీ ఇది జవహర్లాల్ నెహ్రూ స్ఫూర్తినీ, ఆయన జ్ఞాపకాలను ‘గాంధీ’ల నాయకత్వంలోని నేటి కాంగ్రెస్ ఎంత కించపరుస్తున్నదో భారత జాతి గమనించేటట్టు చేసింది. సెప్టెంబర్ 9, 1937న లక్నోలో నెహ్రూ ‘నేషనల్ హెరాల్డ్’ ఆంగ్ల పత్రికను నెలకొల్పారు. భారత జాతీయ కాంగ్రెస్ వాణిని వినిపించడమే విధానంగా తీసుకున్న ‘నేషనల్ హెరాల్డ్’ తొలి సంపాదకుడు ఆయనే. 1938లో కోటంరాజు రామారావు సంపాదకుడి బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే వరకు కూడా నెహ్రూ పాలక మండలి అధ్యక్షునిగా పని చేశారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో వచ్చిన ఆంక్షల కారణంగా 1942-45 మధ్య పత్రిక మూత పడింది. 1946లో మళ్లీ ప్రచురణ ప్రారంభించినపుడు మానికొండ చలపతిరావు (ఎంసీ) సంపాదకత్వ బాధ్యత తీసుకున్నారు. అప్పటి నుంచి 1978లో మరోసారి మూతపడే వరకు ఎంసీ ఆ స్థానంలో కొనసాగారు. ఆ విధంగా ఈ పత్రికతో తెలుగువారికి ఉన్న అనుబంధం బలమైనది. హిందీలో ‘నవజీవన్’, ఉర్దూలో ‘క్వామి ఆవాజ్’ పేర్లతో ఇదే పత్రికను వెలువరించారు. అత్యవసర పరిస్థితి తరువాత కాంగ్రెస్ ఒడిదుడుకులు ఎదుర్కొన్నపుడు(1977-79) ఈ పత్రిక మూతపడినా, మళ్లీ ప్రచురణ సాగించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న నేషనల్ హెరాల్డ్ 1986లో మరోసారి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆదుకున్నారు. 1998లో ల క్నో శాఖ మూతపడింది. ఆ శాఖ తీర్చవలసిన బకాయిల కోసం కోర్డు ఆదేశం మేరకు కొన్ని ఆస్తులను వేలం వేశారు. పదేళ్ల తరువాత ఏప్రిల్ 1, 2008 నుంచి, అంటే యూపీఏ పాలనలోనే నేషనల్ హెరాల్డ్ ఢిల్లీ ప్రచురణ కూడా నిలిచిపోయింది. అప్పటి సంపాదకుడు టీవీ వెంకటాచలం. రూ. 90.25 కోట్ల అప్పు (ఎక్కువ ఉద్యోగుల బకాయిలు)భారంతో ఆ పత్రిక కుంగిపోయింది. 2011లో మరోసారి దీనిని తెరిపించాలని ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాలకు స్వయంగా రాహుల్ అడ్డుపడ్డారని చెబుతారు. ఈ మధ్యలో రాహుల్, సోనియా నేషనల్ హెరాల్డ్ ఆస్తులను దుర్వినియోగం చేయడానికి కుట్ర పన్నారని బీజేపీ నాయకుడు డాక్టర్ సుబ్రమణియం స్వామి ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జరిగిన పరిణామాలను చూస్తే ‘గాంధీ’లు నెహ్రూ కలల పత్రికను చిదిమివేయడానికి ఎంత పథకం పన్నారో సులభంగానే అర్థమవుతుంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) సంస్థ నేషనల్ హెరాల్డ్ (ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ) పత్రికను నిర్వహించేది. పత్రిక మూతపడినా 2010లో కూడా ఏజేఎల్ పని చేసింది. గాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడు మోతీలాల్ ఓరా ఏజేఎల్ పాలక మండలి చైర్మన్. రాహుల్‌గాంధీ, మరో కాంగ్రెస్ ప్రముఖుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ డెరైక్టర్లు. ఆ సంవత్సరంలోనే ఏజేఎల్ స్థానంలో మరో పాలక మండలి ఆవిర్భవించింది. దాని పేరు యంగ్ ఇండియన్ లిమిటెడ్. ఇందులో సభ్యులు వేరెవరో కాదు, ఓరా, రాహుల్, ఫెర్నాండెజ్లే. ఈ కొత్త మండలి ఎందుకు? పత్రికను తిరిగి ప్రచురిస్తామని ఈ మండలి ప్రకటించినా, అది జరగలేదు. అయితే ఏజేఎల్ చెల్లించవలసిన రూ. 90 కోట్ల బకాయిలు వసూలు చేయడానికి కొత్త మండలి హక్కును పొందింది. ఈ అప్పులు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మోతీలాల్ ఓరా (పార్టీ కోశాధికారి) రూ. 90.25 కోట్లు అప్పుగా ఇచ్చారు. ఇదే కాకుండా, బహదూర్షా జఫార్ మార్గంలో (ఢిల్లీ) ఉన్న నేషనల్ హెరాల్డ్ భవంతినీ, ప్రింటింగ్ యంత్రాన్ని అద్దెకు ఇచ్చారు. దాని మీద వచ్చే అద్దెను ఒక ప్రైవేటు సంస్థ వసూలు చేస్తున్నది. ఆ సంస్థలో ప్రధాన సభ్యులు సోనియా, రాహుల్. అందుకే ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సోనియా, రాహుల్‌లకు నోటీసులు జారీ చేశారు. ఆగస్టు ఏడున వీరు కోర్టుకు హాజరు కావాలి. ఢిల్లీలోని భవంతితో సహా ఈ పత్రిక పేర లక్నో, భోపాల్, ఇండోర్, ముంబై, పంచకులా (చండీగఢ్), పాట్నాలలో ఉన్న స్థిరాస్థుల విలువ దాదాపు రూ. 5000 కోట్లు. చివరికి కాంగ్రెస్‌పార్టీ ఏజేఎల్‌కు తాను ఇచ్చిన రుణాన్ని రద్దు చేసి, ఈ ఆస్తులను యంగ్ ఇండియన్ లిమిటెడ్ పరం చేసింది. ఈ వివాదం నుంచి బయటపడతామని సోనియా భృత్యులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ అదంత సులభం కాదు. కల్హణ -
తాటకిని ఎందుకు తీహార్ జైలుకు పంపించరూ!
తాటకిని ఎందుకు తీహార్ జైలుకు ఎందుకు పంపించరూ అంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఓ కోడ్ ను ఉపయోగించి ట్విటర్ లో ఓ సందేశాన్ని ట్వీట్ చేశారు. తాటకి అంటూ పరోక్షంగా సుబ్రమణ్యం స్వామి కోడ్ భాషలో సోనియాగాంధీని ఉద్దేశించి ట్విట్ చేశారు. ఎలాంటి పదవిలో లేకుండానే నేషనల్ హెరాల్డ్ కేసులో చాలా చేస్తున్నాను. అధికారంలో ఉండి టీడీకే (తాటకి)ని తీహార్ జైలుకు ఎందుకు పంపించరూ అంటే ట్వీట్ చేశారు. భారత మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక సంబంధించిన నిధుల దుర్వినియోగం చేశారంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై సుబ్రమణ్యస్వామి కేసు నమోదు చేశారు. ఈకేసులో గురువారం సోనియాగాంధీ, రాహుల్ లకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీపై సుబ్రమణ్యం పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కోర్టుకు హాజరైతే సోనియా, రాహుల్ లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని.. అలాగే వారి పాస్ పోర్టులను కోర్టుకు దాఖలు చేయాల్సి ఉంటుందని మరో ట్వీట్ లో వెల్లడించారు. If I can do this in NH case without power of office why can't those with power prosecute TDK and send her to Tihar? — Subramanian Swamy (@Swamy39) June 26, 2014 Once they appear they will have to take bail and deposit passport — Subramanian Swamy (@Swamy39) June 26, 2014 TDK and son summoned as Accused on August 7th to face trial — Subramanian Swamy (@Swamy39) June 26, 2014 Follow @sakshinews