సుప్రీంకోర్టును ఆశ్రయించిన సోనియా, రాహుల్ | National Herald Case: Sonia Gandhi, Rahul move supreme court | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టును ఆశ్రయించిన సోనియా, రాహుల్

Published Thu, Feb 4 2016 1:43 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

National Herald Case: Sonia Gandhi, Rahul move supreme court

న్యూఢిల్లీ : నేషనల్‌ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గురువారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కింది కోర్టు సమన్లను హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ ఉన్నత న్యాయస్ధానంలో పిటిషన్ దాఖలు చేశారు.  తదుపరి విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.

 

కాగా గత ఏడాది డిసెంబరులో ఈ కేసులో ఢిల్లీ కోర్టు సోనియా, రాహుల్కు  బెయిల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ ఆంగ్ల దినపత్రిక నష్టాలతో 2008లో మూతపడింది. ఆ పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్‌పై భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి కేసు పెట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement