తాటకిని ఎందుకు తీహార్ జైలుకు పంపించరూ! | why can't those with power prosecute Sonia Gandhi and send her to Tihar? | Sakshi
Sakshi News home page

తాటకిని ఎందుకు తీహార్ జైలుకు పంపించరూ!

Published Thu, Jun 26 2014 5:11 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

తాటకిని ఎందుకు తీహార్ జైలుకు పంపించరూ! - Sakshi

తాటకిని ఎందుకు తీహార్ జైలుకు పంపించరూ!

తాటకిని ఎందుకు తీహార్ జైలుకు ఎందుకు పంపించరూ అంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఓ కోడ్ ను ఉపయోగించి ట్విటర్ లో ఓ సందేశాన్ని ట్వీట్ చేశారు. తాటకి అంటూ పరోక్షంగా సుబ్రమణ్యం స్వామి కోడ్ భాషలో సోనియాగాంధీని ఉద్దేశించి ట్విట్ చేశారు. 
 
ఎలాంటి పదవిలో లేకుండానే నేషనల్ హెరాల్డ్ కేసులో చాలా చేస్తున్నాను. అధికారంలో ఉండి టీడీకే (తాటకి)ని తీహార్ జైలుకు ఎందుకు పంపించరూ అంటే ట్వీట్ చేశారు.  భారత మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక సంబంధించిన నిధుల దుర్వినియోగం చేశారంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై సుబ్రమణ్యస్వామి కేసు నమోదు చేశారు. ఈకేసులో గురువారం సోనియాగాంధీ, రాహుల్ లకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది.
 
ఈ నేపథ్యంలో సోనియా గాంధీపై సుబ్రమణ్యం పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కోర్టుకు హాజరైతే సోనియా, రాహుల్ లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని.. అలాగే వారి పాస్ పోర్టులను కోర్టుకు దాఖలు చేయాల్సి ఉంటుందని మరో ట్వీట్ లో వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement