సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ శనివారం అనూహ్య మలుపు తిరిగింది. కేసు విచారణను ప్రారంభించిన పటియాలా కోర్టుకు బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి ఆదాయ పన్ను శాఖ(ఐటీ) ఆదేశాలను సమర్పించారు. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ పెద్ద తలకాయలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
2012లో రూ. 90.25 కోట్ల రుణాన్ని వడ్డీ లేకుండా నేషనల్ హెరాల్డ్ న్యూస్‌పేపర్‌ను నడుపుతున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంటూ సుబ్రమణియన్ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. అందులో సోనియా, రాహుల్, మోతీలాల్ వోరాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
2016లో స్వామి పిటిషన్‌పై స్పందించాలంటూ కోర్టు సోనియా, రాహుల్‌లను న్యాయస్థానం కోరింది. దీంతో గతేడాది నవంబర్‌లో రాహుల్, ఆయన తల్లి సోనియాలు కోర్టులో స్వామి పిటిషన్‌పై కౌంటర్‌ను దాఖలు చేశారు. శనివారం పటియాలా కోర్టు ఈ కేసులో విచారణను ప్రారంభించగా.. తన పిటిషన్‌ను బలపర్చుతూ స్వామి ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన ఆదేశాల పత్రాలను ఆధారాలుగా సమర్పించారు. రూ. 414 కోట్ల పన్నును కాంగ్రెస్ పార్టీ చెల్లించాలని కోర్టులో వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment