సోనియా, రాహుల్‌ గాంధీకి చుక్కెదురు | Supreme Court Directions on National Herald case | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 4 2018 3:10 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Supreme Court Directions on National Herald case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో  యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి 2011-12 సంవత్సరంలో సోనియా, రాహుల్‌ ఆదాయపన్ను వివరాలను పునఃపరిశీలన చేసేందుకు సుప్రీంకోర్టు ఐటీశాఖ అధికారులకు అనుమతిని ఇచ్చింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి సోనియా, రాహుల్‌ పన్ను మదింపు వివరాలను పునఃపరిశీలించేందుకు ఢిల్లీ హైకోర్టు గతంలో అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అనుమతిని సవాలు చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుత దశలో కేసులో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.

అయితే, ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ.. సోనియా వేసిన పిటిషన్‌పై తాము వాదనలు విన్న తర్వాతే.. ఈ మేరకు పన్ను వివరాల పునఃపరిశీలనను ఐటీశాఖ చేపట్టాలని స్పష్టం చేసింది. అలాగే సోనియా, రాహుల్‌ తరఫున దాఖలైన పిటిషన్‌పై తాము ప్రస్తుతం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని, జనవరి 8న ఈ కేసులో తుది విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల విషయమై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సోనియా, రాహుల్‌లకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేయడంతో ఈ వ్యవహారంలో వారి ఆదాయపన్ను వివరాలను మళ్లీ మదింపు చేయాలని కోర్టు ఐటీ శాఖ అధికారులను ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement