National Herald Case
-
మళ్లీ ‘ఈడీ’ విచారణకు రాహుల్‌గాంధీ..?
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మళ్లీ విచారణకు పిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాహుల్, సోనియాగాంధీ ప్రధానవాటాదారులుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ ఇప్పటికే విచారణ జరుపుతోంది. ఈ కేసులో చార్జ్‌షీట్ ఫైల్ చేసేముందు ఈడీ రాహుల్‌ను విచారించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.దర్యాప్తునకు ముగింపు పలికి కేసు విచారణకు వెళ్లాల్సిఉందని, ఇందుకోసం కేసుతో సంబంధమున్న అందరినీ చివరిసారిగా విచారించాలనుకుంటున్నట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కేసులో మరో నిందితురాలిగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని ఈడీ విచారణకు పిలుస్తుందా లేదా అన్నది తెలియాల్సిఉంది. కాగా, నేషనల్హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాలను ఈడీ ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. -
నేషనల్ హెరాల్డ్ కేసులో రూ.752 కోట్లు ఈడీ సీజ్
ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు సంబంధం ఉన్న యంగ్ ఇండియన్, అసోసియేటెడ్ జర్నల్(ఏజేఎల్)కు చెందిన రూ. 752 కోట్ల విలువైన ఆస్తిని ఈడీ అటాచ్ చేసింది. యంగ్ ఇండియాకు చెందిన రూ.90 కోట్ల ఆస్తిని, నేషనల్ హెరాల్డ్‌కు చెందిన ఢిల్లీ, ముంబయిలోని భవనాలు, లక్నోలోని నెహ్రూ భవన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఏజేఎల్ భవనాల విలువ రూ.661.69 కోట్లు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ED has issued an order to provisionally attach properties worth Rs. 751.9 Crore in a money-laundering case investigated under the PMLA, 2002. Investigation revealed that M/s. Associated Journals Ltd. (AJL) is in possession of proceeds of crime in the form of immovable properties… — ED (@dir_ed) November 21, 2023 నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కొనుగోలులో మోసం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వార్తాపత్రికలను ప్రచురించడానికి రాయితీ ధరలకు భూమిని పొందిన అసోసియేటెడ్ జర్నల్.. 2008లో తన కార్యకలాపాలను మూసివేసింది. ఆ ఆస్తులను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందనేది ప్రధాన ఆరోపణ. ఏజేఎల్‌తో వందల కోట్ల ఆస్తులు సంపాదించేందుకు కుట్ర జరిగినట్లు తేలింది. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను ఈడీ ఇప్పటికే ప్రశ్నించింది. Reports of attachment of AJL's properties by the Enforcement Directorate are a clear indication of the BJP's panic in the ongoing elections. Staring at defeat in Chhattisgarh, Madhya Pradesh, Rajasthan, Telangana and Mizoram, the BJP Govt feels compelled to misuse its… pic.twitter.com/pnJYnVartI — Mallikarjun Kharge (@kharge) November 21, 2023 కాగా.. ఎన్నికల ముందు అసోసియేట్ జర్నల్ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం బీజేపీ భయాన్ని సూచిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్దే ఎద్దేవా చేశారు. ఓటమిని దారి మళ్లించడానికి అసోసియేట్ జర్నల్ ఆస్తుల వ్యవహారాన్ని కేంద్రం ముందుకు తీసుకువచ్చిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సంఘ్వీ ఆరోపించారు. ప్రతీకార రాజకీయాలు కాంగ్రెస్‌ను నాశనం చేయలేవని అన్నారు. ఇదీ చదవండి: 'అలా అయ్యుంటే టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచేది! -
ముగిసిన అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణ!
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి యంగ్ ఇండియా లిమిటెడ్ కేసులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్(హైదరాబాద్), మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈడి విచారణ ముగిసింది. ఈ మేరకు రెండు గంటలపాటు ఈడీ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ఈ కేసులో అంజన్ కుమార్‌కు నోటీసులు జారీ చేయడంతో.. నేడు ఆయన ఢిల్లీలో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈడీ కక్ష్య పూరిత చర్య.. కాంగ్రెస్ నాయకులపై ఈడీ కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని అంజన్ కుమార్ అన్నారు. యంగ్ ఇండియా సంస్థకు రూ.20 లక్షలు విరాళం ఇచ్చినట్లు ఈడీ ముందు ఒప్పుకున్నానని చెప్పారు. సోనియా కుటుంబం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని అన్నారు. కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్లను వదిలేసి.. తమలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని ఈడీ పనిచేస్తోందని ఆరోపించారు. గతేడాది నవంబర్‌లో విచారణకు హాజరైన సందర్భంగా అంజన్ కుమార్‌ను ఈడీ మూడు గంటల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచన మేరకే యంగ్ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చానని అంజన్ కుమార్ గత విచారణ సందర్భంగా ఈడీ అధికారులకు తెలిపిన విషయం తెలిసిందే. ఆ టైంలో దాదాపు రెండున్నర గంటలపాటు అంజన్ కుమార్‌ను విచారించిన ఈడీ.. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఇప్పుడు మరోసారి విచారణకు పిలవడం గమనార్హం. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ప్రశ్నించిన విషయం తెలిసిందే. -
రాహుల్ కొత్త పాస్‌పోర్ట్ ప్రయత్నం.. సుబ్రమణ్యస్వామి కౌంటర్ ఇదే..
ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు. ఈ నెల 31 నుంచి రాహుల్.. పది రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, రాహుల్.. జూన్ 4న న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో ఏర్పాటు చేసే బహిరంగ సభతో పాటు వాషింగ్టన్, కాలిఫోర్నియాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక, రాహుల్ అమెరికా పర్యటన నేపథ్యంలో కొత్త పాస్‌పోర్టు కోసం ఢిల్లీ హైకోర్టును కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సాధారణ పాస్‌పోర్టును పొందేందుకు అనుమతి(ఎన్వోసి) ఇవ్వాలని రాహుల్ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. మే 26(శుక్రవారం)తేదీన విచారణ జరుపనున్నట్టు స్పష్టం చేసింది. అయితే, మోదీ ఇంటి పేరు వ్యవహారంలో రాహుల్‌కు సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీంతో, రాహుల్ తన లోక్‌సభ సభ్యత్వం కోల్పోవడం, అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చింది. అందులో భాగంగానే రాహుల్ తన పాస్‌పోర్టు సహా అన్ని రకాల ప్రయాణ పత్రాలను సంబంధిత అధికారులు సమర్పించారు. అంతకు ముందు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ.. రాహుల్ పాస్‌పోర్టును సీజ్ చేసింది. దీంతో ఇప్పుడు కొత్తగా సాధారణ పాస్‌పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. అందుకే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ కొత్త పాస్‌పోర్టుపై కోర్టును ఆశ్రయించడంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి స్పందించారు. రాహుల్ విజ్ఞప్తిని ఆయన వ్యతిరేకించారు. ఇప్పుడు రాహుల్ గాంధీని విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు ఆటంకం కలుగుతుందని సుబ్రమణ్యస్వామి తెలిపారు. పాస్‌పోర్టు ఇవ్వకపోవడమే మంచిదని పరోక్షంగా స్పష్టం చేశారు. #Breaking BJP leader Subramanian Swamy opposes Rahul Gandhi's plea for grant of a fresh passport. Swamy says that if Gandhi is allowed to travel abroad, it may hamper the probe in the National Herald case. #RouseAvenueCourt @RahulGandhi @Swamy39 #Passport pic.twitter.com/tO28Q5ykjm — Bar & Bench (@barandbench) May 24, 2023 ఇది కూడా చదవండి: పెద్ద నోట్ల రద్దు.. ఇంతకీ వాటిని ఏం చేశారు.. ఎక్కడున్నాయో తెలుసా? -
ముగిసిన అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణ..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి తెర మీదికి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరయ్యారు. యంగ్ ఇండియాకు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. దాదాపు రెండున్నర గంటలపాటు అంజన్ కుమార్‌ను విచారించిన ఈడీ.. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. యంగ్ ఇండియన్ ఫౌండేషన్ అనే ఛారిటీ సంస్థకు గతంలో అంజన్ కుమార్ యాదవ్ రూ. 20 లక్షలు డొనేషన్ ఇచ్చారు. విచారణ అనంతరం అంజన్ కమార్ యాదవ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సూచన మేరకే యంగ్ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని ఈడి అధికారులకు తెలిపినట్లు చెప్పారు. సంస్థ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉందనే స్వచ్చందంగా విరాళాలు ఇచ్చానన్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ కాంగ్రెస్ నేతలను విచారిస్తుందని విమర్శించారు. మళ్ళీ విచారణ ఉంటే పిలుస్తామని అధికారులు చెప్పినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ప్రశ్నించిన విషయం తెలిసిందే. చదవండి: మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారు: రఘునందన్ రావు -
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు ఈడీ నోటీసులు..!
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలను ప్రశ్నిస్తారనే అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అసలు నేషనల్ హెరాల్డ్ కేసులో వీరికేం సంబంధమన్న చర్చ జరుగుతోంది. ఈ కేసులో ఇంతకుముందే కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు ఈడీ నోటీసులు ఇచ్చి విచారించింది. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక యాజమాన్య కంపెనీ యంగ్ ఇండియన్‌కు తాము ఇచ్చిన విరాళాలపై ఈడీ ప్రశ్నించినట్టు ఆయన వెల్లడించారు కూడా. మొదట నలుగురికి! రాష్ట్ర కాంగ్రెస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, కోశాధికారి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, పార్టీ పొలిటికల్ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీలకు ఈడీ నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నా యి. ఈ ప్రచారం పార్టీ శ్రేణుల్లో కొంత ఆందోళన రేపుతోంది. అయితే ఈ నేతలు ఇప్పటివరకు తమకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్తున్నారు. మరోవైపు ఈ నలుగురితోపాటు కేంద్ర మాజీ మంత్రి, ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి, మరికొందరికి కూడా హెరాల్డ్ కేసులో నోటీసులిచ్చే అవకాశాలు ఉన్నట్టు ఈడీ వర్గాల ద్వారా తెలిసింది. ముందు కొందరు.. తర్వాత మరికొందరు.. వచ్చే నెల 10వ తేదీన మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఆ తర్వాతిరోజు షబ్బీర్ అలీ ఢిల్లీలో విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. ఆ తర్వాతి దశలో మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌లను ఈడీ విచారించాలని భావిస్తున్నట్టు తెలిసింది. మనీ ల్యాండరింగ్ యాక్ట్ 2005 అండర్ సెక్షన్ 50 కింద నోటీసులు ఇస్తున్నట్టు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. నోటీసులు రాలేదు.. వస్తే గర్వంగా వెళ్తాం: అంజన్‌కుమార్ తమకు ఇప్పటివరకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ చెప్పారు. తాను నేషనల్ హెరాల్డ్ పత్రిక కోసం రూ.20 లక్షలు విరాళం చెక్ రూపంలో ఇచ్చానని తెలిపారు. ఆ డబ్బుకు ట్యాక్స్ కూడా కట్టానని, ఈడీ పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని ఏమాత్రం భయపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. అయినా ఈ కేసులో తనను ఈడీ పిలిస్తే గర్వపడతానని.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన కేసులో తనను కూడా పిలవడం గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. దర్జాగా ప్రెస్‌మీట్ పెట్టి చెప్తా: సుదర్శన్‌రెడ్డి నేషనల్ హెరాల్డ్‌కు నాలుగు నెలల క్రితం రూ.15 లక్షల విరాళం ఇచ్చానని, అది పన్ను కట్టిన డబ్బేనని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి చెప్పారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, వస్తే దర్జాగా ప్రెస్‌మీట్ పెట్టి మీడియాకు చెప్తానని పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు ఎలాంటి భయం లేదన్నారు. ఎప్పుడు పిలిచినా వెళ్తా..: గీతారెడ్డి తాను నేషనల్ హెరాల్డ్‌కు కొంత మేర చెక్ రూపంలో విరాళం ఇచ్చానని.. ఈ కేసులో ఈడీ పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి గీతారెడ్డి చెప్పారు. పార్టీలో చాలా పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీని విడిచి వెళ్లిన వాళ్లకు సిగ్గు వచ్చేలా ధైర్యంగా వెళ్లి విచారణ ఎదుర్కొంటానని తెలిపారు. తాను ఇచ్చిన డబ్బుకు లెక్కాపత్రం అన్నీ ఉన్నాయన్నారు. -
టీకాంగ్రెస్ నేతలకు షాక్.. ఈడీ నోటీసులు జారీ!
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో టీకాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డికి నోటీసులు అందినట్టు సమాచారం. ఈ నోటీసులు కాంగ్రెస్ నేతలను అక్టోబర్ 10న విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. మరోవైపు.. నోటీసులపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. శుక్రవారం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. నోటీసులు వస్తే మాత్రం విచారణకు హాజరవుతాను అని స్పష్టం చేశారు. -
మల్లికార్జున్ ఖర్గేపై ఈడీ ప్రశ్నల వర్షం!
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్- యంగ్ ఇండియాకు చెందిన ఆస్తుల మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇప్పటికీ హస్తం జాతీయ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను పలు దఫాలు విచారించింది ఈడీ. తాజాగా.. మరోమారు విచారణకు హాజరుకావాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గేకు సమన్లు పంపించింది. ఈ సమన్లపై రాజ్యసభలో కొద్దిసేపు కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉద్రిక్త వాతారవణ నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ సందర్భంగా.. తాము చట్టాన్ని గౌరవిస్తామని తెలిపారు ఖర్గే. అనంతరం హెరాల్డ్ కార్యాలయం వద్దకు వెళ్లారు. ఆయన సమక్షంలోనే యంగ్ ఇండియా ఆఫీసులో మరోమారు సోదాలు నిర్వహించింది ఈడీ. అనంతరం ఖర్గే వాగ్మూలాన్ని నమోదు చేసింది. సుమారు నాలుగున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం కురిసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: అనారోగ్యానికి గురైన షిండే.. ఆ బాధ్యతలు ఫడ్నవీస్‌కు! -
నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో ఈడీ సోదాలు!
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్-ఏజేఎల్ ఆస్తులకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ప్రశ్నించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. తాజాగా నేషనల్ హెరాల్డ్ హౌస్‌లో మంగళవారం సోదాలు నిర్వహించింది. నేషనల్ హెరాల్డ్ హౌస్‌తో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. కాంగ్రెస్‌కు చెందిన నేషనల్ హెరాల్డ్ న్యూస్‌పేపర్ కార్యాలయం సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు అధికారవర్గాలు తెలిపాయి. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మూడు రోజుల పాటు ప్రశ్నించిన వారంలోపే ఈ దాడులు చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది. సోనియా విచారణ సందర్భంగా.. న్యూస్‌పేపర్ నిర్వహణపై పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియాల్లో సోనియా, రాహుల్ గాంధీల పాత్రపై పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అంతకు ముందు జూన్‌లో రాహుల్ గాంధీని ఐదు రోజుల పాటు విచారించింది ఈడీ. Delhi | ED raids are underway at multiple locations in Delhi pertaining to alleged National Herald money laundering case pic.twitter.com/fUmD1YxI9a — ANI (@ANI) August 2, 2022 ఇదీ చదవండి: National Herald case: సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం -
సోనియా నోటి వెంట రాహుల్ సమాధానాలు!
సాక్షి,న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మూడు రోజులు విచారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె రాహుల్ గాంధీ చెప్పిన సమాధానాలనే చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విచారణలో భాగంగా మొదటి రెండు రోజులు సోనియాను అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్(ఏజేఎల్), యంగ్ ఇండియా లావాదేవీలకు సంబంధించిన ప్రశ్నలనే అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ లావాదేవీలన్నింటినీ కాంగ్రెస్ దివంగత నేత మోతీలాల్ వోరానే చూసుకున్నట్లు సోనియా బదులిచ్చారని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక కాలం కోశాధికారిగా పనిచేసిన మోతీలాల్ వోరా 2020లో కన్నుముశారు. అంతకుమందు రాహుల్ గాంధీ కూడా ఈడీ విచారణలో ఇదే సమాధానం చెప్పినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, పవన్ కుమార్ బన్సాల్ కూడా ఈడీ విచారణలో ఇదే సమాధానం చెప్పారని తెలిపాయి. అలాగే యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించి ఈడీ అధికారులు గతంలో రాహుల్‌ను ప్రశ్నించగా.. అధి లాభాపేక్ష లేని సంస్థ అని దాని నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన సమాధానం చెప్పినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు సోనియా గాంధీ నోటి వెంట కూడా ఇవే సమాధానాలు వచ్చినట్లు పేర్కొన్నాయి. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని జూన్‌లో 50 గంటలపాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఇప్పుడు సోనియా గాంధీని మూడు రోజుల పాటు 10 గంటలకుపైగా విచారించారు. ఈమె కూడా జూన్‌లోనే విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికి కరోనా కారణంగా అధికారులను సమయం కోరడంతో వారు అంగీకరించారు. చదవండి: శివసేన నుంచి మరో సీఎం వస్తారు.. బీజేపీ మాట తప్పడం వల్లే ఎంవీఏ పుట్టింది -
ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈడీ విచారణ ముగిసింది. దీంతో ఈడీ కార్యాలయం నుంచి ఆమె బయటకు వచ్చేశారు. ఈ కేసులో సోనియాను ఇప్పటి వరకు ఈడీ మూడు రోజులు విచారించింది. మొత్తం 12 గంటలపాటు సోనియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. అయితే నేటితో ఆమె విచారణ ముగిసినట్లే తెలుస్తోంది. మరోసారి విచారణకు హాజరు కావాలని సోనియాకు తాజా సమన్లు జారీ చేయలేదు. ఇక సోనియా గాంధీ ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంట్ సమీపంలోని విజయ్ చౌక్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే తనతో సహా మొత్తం 65 మంది ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ పేర్కొన్నారు. తమను ఎటో గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్తున్నారని ట్వీట్ చేశారు. మరోవైపు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించినందుకు నిరసనగా రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సచిన్ పైలట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడానికి బ్రూట్ ఫోర్స్‌ను ఉపయోగించారని, ఢిల్లీ పోలీసులతో జరిగిన ఘర్షణలో పలువురు పార్టీ కార్యకర్తలు గాయపడ్డారని ఆయన ఆరోపించారు. చదవండి: ఈడీనే కరెక్ట్.. అరెస్ట్‌లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు! -
National Herald case: మూడో రోజు ఈడీ ముందుకు సోనియా గాంధీ
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్- ఏజేఎల్ ఆస్తులకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈ క్రమంలోనే మూడో రోజు విచారణకు హజరయ్యారు. తన కుమార్తె ప్రియాంక గాంధీలతో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఈడీ పరిసరలా మంగళవారం సుమారు ఆరు గంటల పాటు విచారించింది ఈడీ. ఈ సమయంలో ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగింది కాంగ్రెస్. దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కీలక నేతలు, వందల మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విడిచిపెట్టారు. మూడో రోజు విచారణ సందర్భంగా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. Delhi | Congress interim president Sonia Gandhi accompanied by her daughter Priyanka Gandhi Vadra arrives at the Enforcement Directorate office for the third round of questioning in the National Herald case pic.twitter.com/tmnUsjSXuB — ANI (@ANI) July 27, 2022 -
National Herald case: సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ఎంపీ సోనియా గాంధీ మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆమె ఉదయం 11 గంటలకు తన కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకాగాంధీ వాద్రాతో కలిసి సెంట్రల్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రియాంక తన తల్లి సోనియా వెంటే ఉండగా, రాహుల్ అక్కడి నుంచి కొద్దిసేపటి తర్వాత వెళ్లిపోయారు. సమన్ల పరిశీలన, హాజరు పత్రంపై సంతకాల తర్వాత ఉదయం 11.15 గంటలకు విచారణ ప్రారంభమయ్యింది. అధికారులు పలు కీలక అంశాలపై సోనియాను ప్రశ్నించారు. ఈ సమయంలో ప్రియాంక ఈడీ ఆఫీసులోని మరో గదిలో ఉండిపోయారు. దాదాపు 2.50 గంటలపాటు విచారణ అనంతరం మధ్యాహ్నం భోజనం కోసం సోనియా 2 గంటలకు బయటకు వెళ్లారు. 3.30 గంటలకు తిరిగివచ్చారు. ఈడీ అధికారులు విచారణ కొనసాగించారు. మళ్లీ 3 గంటలపాటు సోనియాను ప్రశ్నించారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. బుధవారం కూడా విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు సోనియాకు సూచించారు. ఆ సంస్థల్లో మీ పాత్ర ఏమిటి? సోనియా నివాసం నుంచి ఈడీ కార్యాలయం వరకూ ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ సిబ్బంది సైతం మోహరించారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 21న సోనియా ఈడీ ఎదుట హాజరైన సంగతి తెలిసిందే. అధికారులు అడిగిన 28 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. నేషనల్ హెరాల్డ్ పత్రికతోపాటు యంగ్ ఇండియా సంస్థ కార్యకలాపాల్లో సోనియా, రాహుల్ గాంధీ పాత్రపై మంగళవారం అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. యంగ్ ఇండియాలో మెజారిటీ వాటాదారు అయిన రాహుల్‌ని ఈడీ గత నెలలో విచారించింది. రాహుల్ గాంధీ అరెస్టు సోనియా గాంధీను ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు విజయ్ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్రపతి భవన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దాంతో కాంగ్రెస్ ఎంపీలు విజయ్‌చౌక్ వద్ద రోడ్డుపై బైఠాయించగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్‌సహా ఎంపీలను అరెస్ట్ చేశారు. వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించారు. ధర్నా సందర్భంగా పోలీసులు తన పట్ల కర్కశంగా వ్యవహరించారని, వాహనంలోకి నెట్టేశారని అఖిల భారత యువజన కాంగ్రెస్ నేత బీవీ శ్రీనివాస్ ఆరోపించారు. ధర్నాలో ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్‌బాబు, గిడుగు రుద్రరాజు, చల్లా వంశీచంద్‌రెడ్డి, సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. -
National Herald Case: రెండో రోజు ఈడీ విచారణకు సోనియా గాంధీ
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్- ఏజేఎల్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం మరోమారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో కలిసి వచ్చారు సోనియా. సోనియా గాంధీ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమెకు సహాయకారిగా ఉండేందుకు ప్రియాంకకు ఈడీ అనుమతిచ్చింది. గత గురువారం నేషనల్ హెరాల్డ్ కేసులో తొలిసారి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు సోనియా గాంధీ. దాదాపు మూడు గంటల పాటు సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. అనంతరం సోమవారం మరోమారు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది ఈడీ. ఆ తర్వాత మంగళవారానికి విచారణ తేదీని మార్చింది. ఇదీ చదవండి: సోనియా గాంధీ గురించి అలా మాట్లాడుతారా? బీజేపీ యాంటీ వుమెన్: జైరాం రమేశ్ -
ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ..
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు గురువారం హాజరయ్యారు. దాదాపు మూడు గంటలపాటు సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. మధ్యాహ్నం తన ఇంటి నుంచి బయల్దేరిన సోనియా వెంట ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. సోనియాగాందీ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమెకు సహాయకారిగా ఉండేందుకు ప్రియాంకకు ఈడీ అనుమతిచ్చింది. విచారణ సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. సోనియాగాంధీ నేటి ఈడీ విచారణ ముగిసింది. సోమవారం మరోసారి విచారణకు రావాలని ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది. వాస్తవానికి సోనియా గాంధీ గత నెలలోనే ఈడీ ముందు హాజరుకావాల్సి ఉన్నా కోవిడ్ కారణంగా హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ కోవిడ్ అనంతరం సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలిని దర్యాప్తు సంస్థలు విచారించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అదనపు డైరెక్టర్ స్థాయి మహిళా అధికారి నేతృత్వంలోని అయిదుగురు అధికారుల బృందం సోనియాను ప్రశ్నించింది. చదవండి: వాళ్లకు మైండ్ పనిచేయట్లే.. వచ్చేవి బీజేపీ తిరస్కరణ ఎన్నికలే: మమత ఇక ఇదే కేసులో ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. జూన్ 13న తొలిసారి ఈడీ ముందు హాజరైన రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ నాలుగు సిట్టింగ్స్‌లో 40 గంటల సేపు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. అయితే సోనియాను ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. రాజకీయ కుట్రలో భాగంగానే దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని ఆ పార్టీ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ నిరసనలు సోనియా గాంధీపై ఈడీ కేసులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధఙర్ రంజన్ చౌదరీ, సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ తదితరలు పాల్గొనగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ ధర్నాకు దిగింది. కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు బైక్‌ను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తగలబడుతున్న బైక్‌ను మంటలు ఆర్పారు. ఈడీ కార్యాలయం ముందు పోలీసులు భారీగా బందోబస్తు చేపట్టింది. -
ఈడీ ముందుకు సోనియా
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్–ఏజేఎల్ వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం ఈడీ నడుచుకుంటోందని, ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనిగా పెట్టుకుందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పార్టీ ఎంపీలు, నేతలు గురువారం కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసు దాకా పాదయాత్ర చేయనున్నారు. అలాగే రాజ్‌భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం పట్ల పార్టీపరంగా ఎలా స్పందించాలన్న దానిపై వ్యూహాన్ని ఖరారు చేయడానికి ఎంపీ మల్లికార్జున ఖర్గే నివాసంలో నేతలు సమావేశమయ్యారు. సోనియా గాంధీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. -
ఇక తప్పదు రావాల్సిందే.. సోనియాకు ఈడీ నోటీసులు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఊహించని షాక్ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోనియాకు మరోసారి సమన్లు పంపించింది. ఈ సందర్భంగా జూలై 21న విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియాను ఈడీ గత నెలలోనే విచారించాల్సి ఉండగా.. సోనియా కరోనా వైరస్ బారినపడటంతో విచారణ వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా ఆమె విచారణకు హాజరుకాలేదు. విచారణకు హాజరుకాలేనని, మరెప్పుడైనా వస్తానంటూ ఈడీని సోనియా గాంధీ కోరారు. ఆ అభ్యర్థనకు స్పందించిన ఈడీ.. విచారణను వాయిదా వేసింది. ఈ క్రమంలో సోమవారం మళ్లీ సమన్లు పంపింది. జూలై 21న విచారణకు హాజరు కావాలని అధికారులు తెలిపారు. ఇక, ఈ కేసు విచారణలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సైతం ఈడీ పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. ED summons Congress interim President Sonia Gandhi to join investigation in the National Herald Case on July 21: Official sources (File pic) pic.twitter.com/MlUWVdzLbO — ANI (@ANI) July 11, 2022 ఇది కూడా చదవండి: ఎమ్మెల్యేలకు భారీ ఆఫర్.. కాషాయ తీర్థం పుచ్చుకుంటే రూ. 50 కోట్లు! -
ప్లీజ్..కొంచెం సమయం ఇవ్వండి: ఈడీని కోరిన సోనియా
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట గురువారం నాడు హాజరు కావాల్సి ఉన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విచారణ కొన్ని వారాలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆమె తాను ఇంకా కోలుకోలేదని, సంపూర్ణంగా కోలుకున్నాక విచారణకు హాజరవుతానని ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. రెండు రోజుల కిందటే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియాగాంధీకి వైద్యులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో ఆమె ఈడీకి విచారణ వాయిదా వేయాలంటూ విజ్ఞప్తి చేశారని పార్టీ నేత జైరామ్ రమేష్ తన ట్విటర్ అకౌంట్లో వెల్లడించారు. ఇప్పటికే సోనియా కుమారుడు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు గత అయిదు రోజులుగా గంటల తరబడి విచారించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ కోసులో ఐదు రోజుల పాటు 50 గంటలకు పైగా రాహుల్ గాంధీని విచారించారు. ఈ సందర్భంగా ఈడీ విచారణ సాగిన తీరుతెన్నులను వారితో సరదాగా పంచుకున్నారు. ‘‘అలుపు సొలుపు లేకుండా గంటల తరబడి కదలకుండా కుర్చీలో కూర్చునేంత ఓపిక ఎలా వచ్చిందని అధికారులు నన్ను ప్రశ్నించారు. ముందు చెప్పను పొమ్మన్నాను. విపాసన ధ్యానప్రక్రియను సాధన చేస్తుండటమే అందుకు కారణమని తర్వాత సరదా కారణం చెప్పా. అసలు కారణమేంటో తెలుసా? ఆ చిన్న గదిలో, ముగ్గురు ఈడీ అధికారుల సమక్షంలో కూర్చున్నా నేను ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ కలగలేదు. కాంగ్రెస్ కార్యకర్తలంతా స్ఫూర్తి నా వెంటే ఉంది. పైగా 2004 నుంచీ ఓ కార్యకర్తగా పార్టీ కోసం చేస్తున్న పని నాకు ఎంతో ఓపికను నేర్పింది’’ అన్నారు. ఇది కూడా చదవండి: అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన సీఎం ఉద్దవ్ ఠాక్రే -
నా ఓర్పు చూసి ఈడీ షాకైంది
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కోసులో ఐదు రోజుల పాటు 50 గంటలకు పైగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు ఆయన ఎలాంటి విసుగూ లేకుండా ఎంతో ఓర్పుగా, సహనంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారట. విచారణ నేపథ్యంలో బుధవారం తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలతో ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. తనకు మద్దతుగా పలు కార్యక్రమాలు చేపట్టినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఈడీ విచారణ సాగిన తీరుతెన్నులను వారితో సరదాగా పంచుకున్నారు. ‘‘అలుపు సొలుపు లేకుండా గంటల తరబడి కదలకుండా కుర్చీలో కూర్చునేంత ఓపిక ఎలా వచ్చిందని అధికారులు నన్ను ప్రశ్నించారు. ముందు చెప్పను పొమ్మన్నాను. విపాసన ధ్యానప్రక్రియను సాధన చేస్తుండటమే అందుకు కారణమని తర్వాత సరదా కారణం చెప్పా. అసలు కారణమేంటో తెలుసా? ఆ చిన్న గదిలో, ముగ్గురు ఈడీ అధికారుల సమక్షంలో కూర్చున్నా నేను ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ కలగలేదు. కాంగ్రెస్ కార్యకర్తలంతా స్ఫూర్తి నా వెంటే ఉంది. పైగా 2004 నుంచీ ఓ కార్యకర్తగా పార్టీ కోసం చేస్తున్న పని నాకు ఎంతో ఓపికను నేర్పింది’’ అన్నారు. ‘‘ఐదు రోజులూ ఈడీ ప్రశ్నలన్నింటికీ జవాబిచ్చాను. వాటిని చెక్ చేసుకున్నాను’’ అన్నారు. అగ్నిపథ్ పథకంతో సాయుధ దళాలను మోదీ సర్కారు బలహీనపరుస్తోందని రాహుల్ దుయ్యబట్టారు. మన భూభాగాన్ని చైనా క్రమంగా ఆక్రమించుకుంటుంటే కళ్లు మూసుకుంటోందని ట్వీట్ చేశారు. 27న దేశవ్యాప్త ర్యాలీ అగ్నిపథ్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌తో 27న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా భారీ ర్యాలీ, ప్రదర్శనలు చేపట్టనున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. -
ఈడీ విచారణ: అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పిలుపు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం 10 గంటలకుపై గా ప్రశ్నించింది. ఉదయం 11.15గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న రాహుల్‌కు రాత్రి సుమారు 8 గంటల సమయంలో కొద్ది విరామం ఇచ్చి తిరిగి విచారణ కొనసాగించారు. ఇప్పటి వరకు ఈడీ రాహుల్‌ను ఐదు రోజులపాటు 50 గంటలకుపైగా ప్రశ్నించింది. మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత కూడా విచారణ కొనసాగినట్లు సమాచారం. ఈడీ కార్యాలయం వద్ద 144వ సెక్షన్ అమల్లో ఉండగా, మంగళవారం ఆయన ఈడీ కార్యాలయంలో ఉన్న సమయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ విచారణను రాజకీయ ప్రతీకారంగా అభివర్ణిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే కొనసాగిస్తున్న నిరసనలను మరింత ఉధృతం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ చట్ట సభ్యులకు, ముఖ్యనేతలకు ఢిల్లీకి రావాలని పిలుపు ఇచ్చింది. తద్వారా తమ నిరసన గళాన్ని గట్టిగా వినిపించాలని అనుకుంటోంది. ఇక నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఈనెల 23వ(గురువారం) ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే కరోనా నుంచి కోలుకున్న ఆమె హాజరయ్యేది కాస్త అనుమానంగానే ఉంది. ఇదిలా ఉంటే.. తమ నేతను ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అగ్నిపథ్ పథకంపై వెల్లువెత్తుతున్న నిరసనల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈడీ విచారణ పేరుతో వ్యక్తిగతంగా వేధిస్తోందని ఆరోపించింది. ఈడీ విచారణ అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వి పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థను బీజేపీ సొంతానికి వాడుకోవడం నిజంగా విషాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. -
మళ్లీ ఈడీ ముందుకు రాహుల్
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (52) సోమవారం నాలుగో రోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. ఉదయం 11.05 నుంచి మధ్యాహ్నం 3.15 దాకా, లంచ్ బ్రేక్ తర్వాత 4.45 నుంచి రాత్రి దాకా పలు అంశాలపై ఈడీ ఆయనను లోతుగా ప్రశ్నించింది. మంగళవారం కూడా విచారణకు రావాలని ఆదేశించింది. జూన్ 13, 14, 15 తేదీల్లో రాహుల్‌ను 30 గంటలకు పైగా ఈడీ లోతుగా విచారించడం తెలిసిందే. 16న కూడా విచారణ జరగాల్సి ఉండగా రాహుల్ అభ్యర్థన మేరకు ఈడీ ఒక్క రోజు విరామమిచ్చింది. ఆస్పత్రిలో ఉన్న తన తల్లి సోనియాగాంధీ బాగోగులు చూసుకోవాల్సి ఉందని కోరడంతో సోమవారానికి వాయిదా వేసింది. కాంగ్రెస్ నిరసనల నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద భద్రతా దళాలు భారీగా మోహరించాయి. ఈ కేసులో సోనియాను కూడా 23న ఈడీ విచారణకు పిలవడం తెలిసిందే. యంగ్ ఇండియన్, ఏజేఎల్, నేషనల్ హెరాల్డ్ వ్యవహారాల్లో రాహుల్ కీలక వ్యక్తి గనుక ఆయన వాంగ్మూలం చాలా కీలకమని ఈడీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రపతికి కాంగ్రెస్ ఫిర్యాదు అగ్నిపథ్ పథకాన్ని, రాహుల్ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ వరుసగా రెండో రోజు సత్యాగ్రహం కొనసాగించింది. పార్టీ సీనియర్లు అధీర్ రంజన్ చౌదరి, మల్లికార్జున్ ఖర్గే, అశోక్ గహ్లోత్, భూపేష్ బఘేల్, సచిన్ పైలట్, సల్మాన్ ఖుర్షీద్, కేసీ వేణుగోపాల్, భూపీందర్ హుడా, పీసీసీ అధ్యక్షులు, ఎంపీలు పాల్గొన్నారు. అగ్నిపథ్‌పై తొలుత పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేశారు. రాహుల్‌ను ఈడీ విచారణ పేరిట వేధిస్తున్నారని విమర్శించారు. అనంతరం నేతలంతా వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. తాము జంతర్‌మంతర్ వద్ద నిరసన చేస్తుండగాపోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం వెనక్కు తీసుకొనేలా చూడాలని అభ్యర్థించారు. Rahul Gandhi reaches ED office. he avoided friday to prevent from arrest but the situational arrangements at ED office tells me that He may be arrested today pic.twitter.com/l3aGuY0v2Y — #Bharat-Ek VishwaGuru🇮🇳 (@EkVishwa) June 20, 2022 ఇది కూడా చదవండి: మాజీ మంత్రి కాంగ్రెస్ నేతపై దాడి.. హెల్త్ కండీషన్ సీరియస్ -
‘రాజ్’కున్న ముట్టడి
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాలపై ఈడీ వేధింపులను నిరసిస్తూ, ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ గురువారం రాష్ట్ర కాంగ్రెస్ చేపట్టిన ‘రాజ్‌భవన్ ముట్టడి’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజ్‌భవన్ వైపునకు వెళ్లకుండా పోలీసులు నాలుగంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. వచ్చినవారిని వచ్చినట్టుగా అదుపు లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర వాగ్వాదాలు, తోపులాట, లాఠీచార్జి, అరెస్టులు తదితర ఘటనలతో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ చౌరస్తా అట్టుడికి పోయిం ది. ఉదయం 5:30 నుంచి ప్రారంభమైన ఈ ముట్టడి కార్యక్రమం మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగడం తో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. చివరకు పోలీసులు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలందరినీ అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. తెల్లవారుజాము నుంచే టీపీసీసీ పిలుపు నేపథ్యంలో గురువారం తెల్లవారు జామునే ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు పోలీసుల కళ్లుగప్పి రాజ్‌భవన్ వద్దకు చేరుకుని గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో తక్కువ సంఖ్యలో ఉన్న పోలీసులు అతి కష్టం మీద వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత టీపీసీసీ మత్స్య కారుల కమిటీ చైర్మన్ మెట్టుసాయికుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుల నేతృత్వంలో కార్యకర్తలు 3 దఫాలుగా రాజ్‌భవన్ వద్దకు చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివసేనారెడ్డిని అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన కాలు పోలీస్ వాహనం డోర్లో ఇరుక్కుపోయింది. దీంతో మరో కాలుతో ఆయన ఆ డోర్ అద్దాలను పగులగొట్టడంతో ఆయనతో పాటు ఒకరిద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఖైరతాబాద్ చౌరస్తాలో గురువారం కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన.. నిలిచిపోయిన ట్రాఫిక్ జగ్గారెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డిలకు గాయాలు ఉదయం 10:45 సమయంలో రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, ఏఐసీసీ కార్య క్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్ తదితరులు ఖైరతాబాద్ చౌరస్తాకు చేరుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో వారు అక్కడే బైఠాయించారు. అదే సమయంలో ఆవేశా నికి లోనైన యూత్‌కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు అక్కడ ఉన్న ఓ బైక్‌కు నిప్పు పెట్టారు. కాచిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ గందరగో ళంలో రేవంత్ బృందం నాలుగో అంచె బారికేడ్ల వరకు చేరుకున్నారు. అయితే అక్కడ ముళ్లకంచెలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలీసులు వారిని నిలువరించగలి గారు. భట్టి, రేవంత్‌రెడ్డితో పాటు ఇతర నేతలు కార్యకర్త లను అదుపులోకి తీసుకుని.. పోలీసు వాహనంలో తర లిస్తుండగా కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు. టీపీసీసీ నేత చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని ఐదుగురు పోలీసులు చుట్టుముట్టి లాఠీచార్జి చేయడంతో గాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పోలీసులను తప్పించుకుని దాదాపు రాజ్‌భవన్ వరకు వెళ్లారు. అక్కడ బారికేడ్లను దాటే క్రమంలో ఆయన మోకాలికి గాయమైంది. జగ్గారెడ్డి తదితరులను కూడా పోలీసులు అక్కడినుంచి తరలించారు. మాజీ ఎంపీలు వి.హనుమం తరావు, మల్లురవి, బోసురాజు, శ్రీనివాసకృష్ణన్, ఆది శ్రీనివాస్, కె.మదన్మోహన్రావు తదితరులను కూడా పోలీసులు రాజ్‌భవన్ వైపునకు వెళ్లకుండా అడ్డుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. రేణుక రాకతో మరోమారు ఉద్రిక్తత మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కొందరు మహిళా నేతలతో కలిసి కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి రావడంతో మరోమారు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రాజ్‌భవన్ వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులకు, రేణుకకు మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ పోలీసు అధికారి చేయి తగలడంతో.. ఒక్కసారిగా ఆవేశానికి లోనైన ఆమె ఆయన కాలర్ పట్టుకుంది.. దీంతో వాతావరణం వేడెక్కింది. పోలీసులు అతికష్టం మీద ఆమెను అదుపులోకి తీసుకోగలిగారు. ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుకపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తన చుట్టూ పురుష పోలీసులు ఉండడంతో దురదృష్టకరమైన ఘటన జరిగింది తప్ప తాను కావాలని చేయలేదని రేణుక వివరణ ఇచ్చారు. పోలీసులు తనను వెనకవైపు నుంచి నెట్టేయడం, గిల్లడం లాంటివి చేశారని, తనపైకి దూసుకు వస్తున్న ఎస్సైని రావొద్దంటూ చేయి పెట్టి అడ్డుకున్నానని, కాలర్ పట్టుకోలేదని వివరించారు. వాస్తవానికి గురువారం ఉదయం గవర్నర్ తమిళిసై నగరంలో లేరు. మధ్యాహ్నం పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఆమె కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసా గుతున్న సమయంలోనే రాజ్‌భవన్‌లోనికి వెళ్లారు. -
మూడో రోజు ముగిసిన రాహుల్ ఈడీ విచారణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ మూడో రోజు ముగిసింది. బుధవారం సుమారు తొమ్మిది గంటలపాటు ఆయన్ని ప్రశ్నించారు ఈడీ అధికారులు. అయితే విచారణ ఇక్కడితోనే ముగియలేదని.. శుక్రవారం మరోసారి తమ ఎదుట విచారణ కోసం హాజరుకావాలని రాహుల్‌ను కోరింది ఈడీ. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసిన ఈడీ.. ఢిల్లీ కార్యాలయంలో మూడు రోజులుగా ఆయన్ని ప్రశ్నిస్తోంది. అయితే ఇది కేంద్రంలోని బీజేపీ ఉద్దేశపూర్వకంగా దర్యాప్తు సంస్థతో కలిసి చేయిస్తున్న కక్షపూరిత చర్యగా అభివర్ణిస్తూ.. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తోంది. ఈ క్రమంలో.. బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద హైడ్రామానే నడిచింది. ED asks Congress leader Rahul Gandhi to appear on Friday to rejoin the investigation in the National Herald case. — ANI (@ANI) June 15, 2022 -
National Herald Case: రాహుల్ అరెస్ట్ అవుతారా ??
-
నేషనల్ హెరాల్డ్ కేసు: మూడో రోజు ఈడీ ముందుకు రాహుల్..
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారణ మూడో రోజుకు చేరుకుంది. మనీలాండరింగ్ కేసులో ఈడీ రాహుల్‌పై ప్రశ్నల పరంపరను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో వరుసగా మూడో రోజు ఈడీ ముందుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. గడిచిన 2 రోజుల్లో 21 గంటలపాటు ఈడీ ప్రశ్నించింది. చదవండి: నేషనల్ హెరాల్డ్ కేసేంటి?.. ఈ ప్రశ్నలకు బదులేది? తొలిరోజు 10 గంటల పాటు, రెండో రోజు 11 గంటల పాటు విచారణ జరిపిన ఈడీ.. ఇప్పటికే ఈ కేసులో పలు కీలక విషయాలకు సంబంధించిన ప్రశ్నలను విచారణలో అడిగినట్లు సమాచారం. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు దేశవ్యాప్తంగా రాహుల్ విచారణపై కాంగ్రస్ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. చదవండి: మళ్లీ కరోనా టెన్షన్.. ఒక్క రోజులో 33 శాతం అధికంగా కేసులు నమోదు! -
National Herald Case: రెండో రోజు 11 గంటలు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రిక మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని మంగళవారం రెండో రోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 11 గంటలకు పైగా సుదీర్ఘంగా విచారించింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి బయల్దేరి ఉదయం 11.05కు సోదరి ప్రియాంకతో కలిసి ఆయన ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. 11.30కు విచారణ ప్రక్రియ మొదలైనట్టు అధికారులు తెలిపారు. నాలుగు గంటల అనంతరం మధ్యాహ్న.ం 3.30కు భోజన విరామమిచ్చారు. తర్వాత 4.30 నుంచి రాత్రి 11.30 దాకా విచారణ సాగింది. నేషనల్ హెరాల్డ్–ఏజేఎల్–యంగ్ ఇండియా లావాదేవీలకు సంబంధించిన కీలక అంశాలపై రాహుల్‌ను మరింత లోతుగా ప్రశ్నించి ఆయన సమాధానాలను, వివరణను రికార్డు చేసినట్టు చెబుతున్నారు. వాటిని రాహుల్ కూలంకషంగా పరిశీలించినట్టు సమాచారం. అధికారులు తరచూ విరామమిస్తూ విచారణ కొనసాగించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం కూడా విచారణకు రావాలని ఈడీ అధికారులు రాహుల్‌ను ఆదేశించారు. ఒక క్రిమినల్ కేసులో గాంధీ కుటుంబ వ్యక్తి ఒకరిని దర్యాప్తు సంస్థలు విచారించడం ఇదే తొలిసారి. రాహుల్‌ను సోమవారం తొలి రోజు 10 గంటలకు పైగా ఈడీ విచారించడం తెలిసిందే. ఈ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీని కూడా 23న ఈడీ విచారించనుంది. రాజస్తాన్‌లో ఓ భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ప్రియాంక భర్త రాబర్ట్ వద్రాను ఈడీ కొన్నేళ్ల క్రితం విచారించింది. భారీగా అరెస్టులు విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సోమవారం మాదిరిగానే నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఢిల్లీలో ఆందోళనలు కొనసాగించారు. ఉదయం రాహుల్ నేతృత్వంలో ఏఐసీసీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైరాం రమేశ్, రణ్‌దీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్, అధీర్ రంజన్ చౌధరి, దీపీందర్ హుడా, పలువురు పార్టీ ఎంపీలు, సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగెల్ తదితర నేతలను పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈడీ విచారణను కేంద్రం రాజకీయ కక్షసాధింపు చర్యగా ఈ సందర్భంగా నేతలు అభివర్ణించారు. విచారణను తప్పించుకునేందుకు నిరసనల పేరిట కాంగ్రెస్ ఇలా డ్రామాలాడుతోందని బీజేపీ దుయ్యబట్టింది. -
ఈడీ విచారణ: సోనియా గాంధీని కలుసుకున్న రాహుల్
న్యూఢిల్లీ: ఈడీ విచారణ మధ్యలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(51), తన తల్లి సోనియా గాంధీని కలుసుకున్నారు. కొవిడ్ బారిన పడ్డ సోనియా గాంధీ ప్రస్తుతం గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో సోమవారం ఈడీ విచారణ జరుగుతున్న సమయంలోనే.. మధ్యాహ్నం భోజన విరామం ఇచ్చారు ఈడీ అధికారులు. దీంతో ఇంటికి వెళ్లి భోజనం చేసి.. ఆపై సోదరి ప్రియాంకతో కలిసి రాహుల్ గాంధీ, గంగారాం ఆస్పత్రికి వెళ్లారు. సోనియాను వాళ్లు పరామర్శించినట్లు తెలుస్తోంది. ఇక లంచ్ బ్రేక్ తర్వాత రాహుల్ గాంధీ, తిరిగి ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం రెండో విడత విచారణ కొనసాగుతోంది. చదవండి: సోనియా ఫ్యామిలీపై ఈగ వాలినా ఊరుకునేది లేదు -
బీజేపీ కుట్రలపై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నాం: రేవంత్ రెడ్డి
-
సోనియా ఫ్యామిలీపై ఈగ వాలినా ఊరుకునేది లేదు: రేవంత్
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఎన్స్‌ఫోర్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్ ఎదుట రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గాంధీ కుటుంబంపై బీజేపీ అక్రమ కేసులు పెడుతోంది. సోనియా గాంధీ కుటుంబంపై ఈగ వాలినా ఊరుకునేది లేదు. స్వాతంత్య్ర పోరాటంలో నేషనల్ హెరాల్డ్ పత్రికది కీలక పాత్ర. నేషనల్ హెరాల్డ్ పత్రికను బ్రిటిషర్లు నిషేధించారు. కానీ, దేశ సమగ్రత కోసం నేషనల్ హెరాల్డ్ పత్రికను మళ్లీ నడపాలని యజమాన్యం నిర్ణయించారు. అయితే, పత్రిక నష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ రూ. 90 కోట్లు ఇచ్చింది. 2015లో ముగిసిన విచారణను నరేంద్ర మోదీ సర్కార్ మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. బీజేపీ కుట్రలపై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నాము’’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. 144 సెక్షన్ విధింపు -
మూడు గంటలపాటు రాహుల్ గాంధీ ఈడీ విచారణ
సాక్షి, ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు భోజన విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీస్‌లోకి వెళ్లిన రాహుల్‌ను.. మూడు గంటలపాటు విచారించారు అధికారులు. విచారణ అనంతరం ఈడీ ఆఫీసు నుంచి రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లిపోయారు. లంచ్ తర్వాత తిరిగి ఆయన ఈడీ ఆఫీస్‌కు రానున్నట్లు సమాచారం. సోమవారం ఈడీ విచారణకు హాజరైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ముగ్గురు అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో రాహుల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. మూడు గంటల పాటు నేషనల్ హెరాల్డ్ ఆస్తులు, యంగ్‌ఇండియాతో సంబంధాలపై ప్రశ్నలు సంధించారు అధికారులు. మరోవైపు రాహుల్ ఈడీ విచారణ సందర్భంగా.. దేశం మొత్తం కాంగ్రెస్ నిరసనలకు పిలుపు ఇచ్చింది. ఢిల్లీ ఈడీ ఆఫీస్ బయట కూడా భారీ పార్టీ శ్రేణులతో నిరసనల మధ్యే రాహుల్ గాంధీ లోపలికి ప్రవేశించారు. అనుమతి నిరాకరణతో ఆయన ఒక్కరే లోపలికి వెళ్లారు. మరోవైపు చాలాచోట్ల కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టుల పర్వం జరిగింది. రాహుల్‌తో పాటు ఈడీ కార్యాలయానికి వెళ్లిన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా.. అరెస్ట్ అయి తుగ్లకు రోడ్ జైల్లో ఉన్న కార్యకర్తలను పరామర్శించారు కూడా. Congress leader Rahul Gandhi leaves from the Enforcement Directorate office in Delhi after appearing in the National Herald case pic.twitter.com/8CdbXho6Id — ANI (@ANI) June 13, 2022 చదవండి: నేషనల్ హెరాల్డ్ కేసేంటి?.. అసలేం జరిగిందంటే.. -
నేషనల్ హెరాల్డ్ కేసేంటి?.. ఈ ప్రశ్నలకు బదులేది?
ఒకపక్క దేశమంతా 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబురాలు జరుగుతుంటే మరోపక్క స్వాతంత్య్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ నేషనల్ హెరాల్డ్ కుంభకోణం వివాదంలో నిండా మునిగి తేలుతోంది. ఈ ఉదంతంలో వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ అగ్రనాయకత్వం కారుచౌకగా కొట్టేసిన వైనం ఆ పార్టీ అక్రమార్జనకు పరాకాష్ట. ఏమిటీ నేషనల్ హెరాల్డ్? ♦స్వాతంత్య్రోద్యమ సమయంలో ప్రజలకు దేశీయ వాణి వినిపించాలన్న ఉద్దేశంతో నెహ్రూ సహా పలువురు జాతీయ నాయకులు రూ.5 లక్షల మూలధనంతో 1938లో నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించారు. ♦1937 నవంబర్ 20న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) అనే అన్ లిస్టెడ్ కంపెనీని ఆరంభించారు. దాదాపు 5వేల మంది స్వాతంత్య్ర సమరయోధులు ఇందులో వాటాదారులు. ♦రూ.5 లక్షల మూలధనాన్ని 2 వేల ప్రిఫరెన్షియల్ షేర్లుగా, 30 వేల ఈక్విటీ షేర్లుగా విభజించారు. ఒక్కో ప్రిఫరెన్షియల్ ముఖ విలువ రూ.100, ఈక్విటీ షేరు విలువ రూ.10గా నిర్ణయించారు. వేల కోట్ల ఆస్తులు.. రూ.90 కోట్ల నష్టాలు ♦ఏజేఎల్ నిబంధనల ప్రకారం కంపెనీ ఏ ఒక్కరికీ సొంతం కాదు. వార్తా పత్రిక నిర్వహణ తప్ప ఇతర వ్యాపారాల్లో వేలు పెట్టకూడదు. ♦ఇంగ్లిష్‌లో నేషనల్ హెరాల్డ్, ఉర్దూలో ఖౌమీ ఆవాజ్, హిందీలో నవ్‌జీవన్ పత్రికలను ఏజేఎల్ 2008 దాకా ప్రచురించింది. ♦స్వాతంత్య్రానంతరం పత్రికకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. దాంతో ఏజేఎల్ ఆదాయం తగ్గుతూ వచ్చి చివరకు నష్టాల్లో మునిగింది. మరోవైపు కంపెనీ వాటాదారులు 2010 నాటికి 1,057కు తగ్గిపోయారు. ♦అయితే స్వాతంత్రోద్యమకాలంలో ఉన్న ఆదరణ కారణంగా ఏజేఎల్‌కు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీగా స్థిరాస్తులు సమకూరాయి. ♦ఈ ఆస్తుల విలువ స్వాతంత్రానంతరం భారీగా పెరిగింది. పత్రికలను మూసేసేనాటికి దాదాపు రూ.5వేల కోట్లకు చేరింది. ఇదే సమయంలో కంపెనీ నికర నష్టం రూ.90 కోట్లకు చేరింది. ♦వేల కోట్ల ఆస్తులున్న ఏ సంస్థా రూ.90 కోట్ల నష్టాలకు కంపెనీని అమ్ముకోవడం, రుణం తీసుకోవడం జరగదు. కానీ ఇక్కడే కాంగ్రెస్ మాయ మొదలైంది. తెరపైకి యంగ్ ఇండియన్ ♦2010 నవంబర్‌లో కేవలం రూ.5 లక్షల మూలధనంతో యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ కంపెనీ పుట్టుకొచి్చంది. ♦దీనికి 2010 డిసెంబర్లో రాహుల్‌గాంధీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2011 జనవరిలో సోనియా కూడా డైరెక్టర్ బోర్డులో సభ్యురాలయ్యారు. ♦కంపెనీలో 76 శాతం వాటాలు సోనియా, రాహుల్ సొంతం. మిగతా 24 శాతం వాటాలూ కాంగ్రెస్ నేతలు వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ పేరిటే ఉన్నాయి. ♦కాంగ్రెస్ నుంచి రూ.90 కోట్ల వడ్డీ లేని రుణం తీసుకునేందుకు 2011 ఫిబ్రవరిలో ఏజేఎల్ అంగీకరించింది. ♦తర్వాత సదరు రూ.90 కోట్ల రికవరీ హక్కులను కేవలం రూ.50 లక్షలకు కాంగ్రెస్ నుం చి యంగ్ ఇండియన్ కొనుగోలు చేసింది. రికవరీ ముసుగులో ఏజేఎల్ షేర్లు దాని పరమయ్యాయి. స్వామి ఫిర్యాదుతో... ♦ఏజేఎల్, యంగ్ ఇండియన్ ఒప్పందంపై సుబ్రమణ్యస్వామి 2012లో ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు చేశారు. ♦కేసు కొట్టేయాలన్న సోనియా తదితరుల అభ్యర్థనను 2014లో కింది కోర్టు, 2015లో ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చాయి. ♦సోనియా, రాహుల్, వోరా, ఆస్కార్ తదితరులు కింది కోర్టులో హాజరవాలని హైకోర్టు ఆదేశించింది. ♦2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచి్చంది. ♦ఈ వ్యవహారంపై 2014లో ఈడీ దృష్టి సారించింది. 2019లో దాదాపు రూ.64 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఇలా వేలాది కోట్ల నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాంగ్రెస్ అధినాయకత్వం పథకం ప్రకారం చేజిక్కించుకుందన్న వైనం స్పష్టంగా కళ్లముందు కనిపిస్తున్నా ఆ పార్టీ బుకాయిస్తూనే ఉంది. నిజాయతీ నిరూపించుకునే ప్రయత్నాలు చేయకుండా ఇదంతా బీజేపీ కక్ష సాధింపు అంటూ ఆరోపిస్తోంది. పత్రిక పునరుద్ధరణకు రుణమిచ్చామని చెప్పిన కాంగ్రెస్, దాని రికవరీ హక్కులను యంగ్ ఇండియన్‌కు కారుచౌకగా రూ.50 లక్షలకే ఎందుకు కట్టబెట్టిందీ చెప్పలేదు. ఔరా.. వోరా! ♦యంగ్ ఇండియన్ తరఫున రికవరీ హక్కుల కొనుగోలుకు ప్రతిపాదించిందీ, కాంగ్రెస్ కోశాధికారి హోదాలో అందుకు అంగీకరించిందీ, ఏజేఎల్ ఎండీగా ఒప్పందంపై సంతకం చేసిందీ వోరాయే. తన త్రిపాత్రాభినయంతో ఈ మొత్తం ఉదంతాన్ని రక్తి కట్టించారు. ♦చివరకు రూ.50 లక్షలతో అటు రూ.90 కోట్ల అప్పు మాయమైంది. ఇటు వేలాది కోట్ల ఏజేఎల్ ఆస్తులు రాహుల్, సోనియాలకు దక్కాయి. ♦ఈ వ్యవహారంలో భారీగా మోసపోయింది ఏజేఎల్ వాటాదారులే! కొత్త ఒప్పందాలతో వీరి వాటాలన్నీ కలిపి ఒక్క శాతానికే పరిమితమయ్యాయి. ఈ ప్రశ్నలకు బదులేది? ♦రూ.5 వేల కోట్ల ఆస్తులున్న కంపెనీ రూ.90 కోట్ల నష్టాలను తీర్చేందుకు రుణమెందుకు తీసుకుంది? ♦ తన ఆస్తుల్లో ఏదో ఒకదాన్ని విక్రయించో, తాకట్టు పెట్టో రూ.90 కోట్లు ఎందుకు చెల్లించలేదు? ♦రూ.90 కోట్ల రుణ రికవరీ హక్కులను యంగ్ ఇండియన్‌కు కేవలం రూ.50 లక్షలకు ఎలా ఇచ్చారు? ♦యంగ్ ఇండియన్‌కు ఏదో ఒక ఆస్తి కట్టబెట్టే బదులు ఏకంగా ఏజేఎల్ షేర్లను ఎందుకు కేటాయించారు? ♦కేవలం వోరా సంతకాలతో వేలాది కోట్ల ఆస్తులున్న ఏజేఎల్ ఎలా యంగ్ ఇండియన్ పరం ఎలా అయింది? ♦ఈ కుంభకోణంతో సంబం ధం లేకపోతే ఈ వ్యవహారాన్ని సోనియా, రాహుల్ ఎందుకు సమర్థించారు? -
ఢిల్లీ: సోనియాగాంధీకి మరోసారి ఈడీ నోటీసులు
-
Sonia Gandhi: సోనియాకు మరోసారి సమన్లు జారీ చేసిన ఈడీ
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ(75)కి మరోసారి సమన్లు జారీ చేసింది. కోవిడ్ బారిన పడిన ఆమె ఈనెల 8వ తేదీ నాటి విచారణకు హాజరుకాలేకపోయారు. దీంతో, ఈ నెల 23వ తేదీన విచారణకు రావాలంటూ ఈడీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో ఈనెల 13వ తేదీన రాహుల్ గాంధీ హాజరు కావాల్సి ఉంది. చదవండి: (Presidential Polls: ‘రాష్ట్రపతి’ బరిలో ఉమ్మడి అభ్యర్థి!) -
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు ఈడీ సమన్లు
-
మనీ ల్యాండరింగ్ కేసులో.. సోనియా, రాహుల్‌కు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం నోటీసులు జారీ చేసింది. గురువారం రాహుల్, జూన్ 8న సోనియా ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరవాలని ఆదేశించింది. ఈ మేరకు వారికి సమన్లు పంపినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. సోనియా, రాహుల్‌లకు సమన్ల జారీపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఇలాంటి వాటికి భయపడబోమని కాంగ్రెస్ నేతలు అభిషేక్ మను సింఘ్వి, రణదీప్ సుర్జేవాలా అన్నారు. కేంద్రం కుట్రలకు తలవంచేది లేదని స్పష్టం చేశారు. ‘‘తప్పుల తడకల కేసులు పెట్టినంత మాత్రాన బీజేపీ కుట్రలేవీ ఫలించవు. మోదీ ప్రభుత్వం ఇది తెలుసుకోవాలి. స్వాతంత్య్రోద్యమ వాణి వినిపించిన పత్రిక నేషనల్ హెరాల్డ్. దాన్ని అడ్డు పెట్టుకుని సోనియాను, రాహుల్‌ను భయపెట్టలేరు’’ అన్నారు. కేంద్రం కుట్రలను చట్టపరంగా, సామాజికంగా, రాజకీయంగా కాంగ్రెస్ ఎదుర్కొంటుందని చెప్పారు. రాహుల్ విదేశాల్లో ఉన్నందున విచారణ తేదీని వాయిదా వేయాలని కోరినట్టు సింఘ్వి తెలిపారు. జూన్ 5 తర్వాత అందుబాటులో ఉంటానంటూ ఈడీకి లేఖ రాశారని మీడియాకు వెల్లడించారు. చట్టం తన పని చేస్తుంది: ఠాకూర్ కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ ఎదురు దాడికి దిగింది. దర్యాప్తు సంస్థలు తమ పని చేసుకుంటూ వెళ్తాయని స్పష్టం చేసింది. తప్పు చేయకపోతే వారి నిర్దోషిత్వం కోర్టులో రుజువవుతుందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. అలాంటప్పుడు ఆందోళన దేనికని మంత్రులు ఠాకూర్, కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఏమిటీ కేసు? నేషనల్ హెరాల్డ్ పత్రికను స్వాతంత్రోద్యమ సమయంలో 1938లో నెహ్రూతో పాటు పలువురు స్వాతంత్య్ర యోధులు రూ.5 లక్షల మూలధనంతో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం సిద్ధించాక కాంగ్రెస్ హయాంలో హెరాల్డ్ ప్రచురణ సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు భూములు, భవనాల రూపంలో ఎన్నో ఆస్తులు కట్టబెట్టాయి. 2008కల్లా పత్రిక మూతపడింది. జీతాలు తదితర బకాయిల చెల్లింపు కోసమంటూ పార్టీ నిధి నుంచి ఏజేఎల్‌కు రూ.90 కోట్లు కాంగ్రెస్ అప్పుగా ఇచ్చింది. తర్వాత రెండేళ్లకు సోనియా, రాహుల్ మూడొంతుల వాటాదార్లుగా రూ.5 లక్షల మూలధనంతో యంగ్ ఇండియన్ అనే సంస్థ పుట్టుకొచ్చింది. కాంగ్రెస్ నేతలు, గాంధీల నమ్మకస్తులైన మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ అందులో మిగతా వాటాదార్లు. రూ.90 కోట్ల రుణాన్ని ఏజేఎల్ ఎటూ తీర్చలేదు గనుక దాని తరఫున ఏక మొత్త పరిష్కారంగా 50 లక్షలు చెల్లిస్తానంటూ యంగ్ ఇండియన్ ఇటు కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అటు రుణం తీర్చినందుకు బదులుగా ఏజేఎల్ నుంచి నేషనల్ హెరాల్డ్ వాటాలను తనకు బదలాయించుకుంది. అలా వేల కోట్లు చేసే హెరాల్డ్ ఆస్తులన్నీ కారుచౌకగా సోనియా, రాహుల్ యాజమాన్యంలోని యంగ్ ఇండియన్ పరమయ్యాయని ఎంపీ సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. యంగ్ ఇండియన్ పేరిట హెరాల్డ్ ఆస్తులను గాంధీలు అక్రమంగా సొంతం చేసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. దాంతో 2013లో ఈ ఉదంతంపై ఈడీ కేసు నమోదు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సల్‌లను విచారించింది. యంగ్ ఇండియన్, ఏజేఎల్ ఆర్థిక లావాదేవీలు, ప్రమోటర్ల పాత్ర, షేర్‌హోల్డింగ్ తదితరాలపై స్పష్టత కోసం రాహుల్, సోనియాలను విచారించి వారి స్టేట్మెంట్లు నమోదు చేయనున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. చదవండి: కాంగ్రెస్‌పై పీకే ఆసక్తికర వ్యాఖ్యలు -
కాంగ్రెస్ సీనియర్ నేతకు బిగ్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ పత్రిక అవినీతి కేసులో మరో కాంగ్రెస్ సీనియర్ నేతకు షాక్ తగిలింది. ఈ కేసులో భాగంగా రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖార్గేకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు పంపించింది. సోమవారం విచారణకు హాజరు కావాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వచ్చిన ఖర్గేను అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణలో పలు అంశాలపై స్పష్టత కోసం ఆయనను పిలిచినట్లు వెల్లడించారు. మనీల్యాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. అగస్టా వెస్ట్‌లాండ్ చాపర్ కుంభకోణం కేసులో రక్షణ శాఖ మాజీ కార్యదర్శి, మాజీ కాగ్ శశికాంత్ శర్మకు సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నలుగురు రిటైర్డ్ అధికారులతో పాటు అంతకుముందు సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఉన్న నిందితులందరికీ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు పంపింది. వీరంతా ఏప్రిల్ 28వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి అనుకూలంగా పనిచేసేందుకు అవినీతికి పాల్పడ్డారన్న వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కాగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ఈ ఒప్పందం చేసుకోగా.. ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. -
సోనియా.. రాహుల్.. ఓ యంగ్ ఇండియన్
National Herald Case: వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని 50 లక్షలకే సొంత చేసుకొని.. పన్ను కట్టమంటే అసలు ఆ అవసరమే లేదని వాదిస్తే ఏమనాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు తప్పుపట్టినా.. ట్రిబ్యునల్‌కు వెళ్లి మరీ తమది డొల్ల వాదనని చెప్పించుకొని గతుక్కుమన్నారు సోనియా, రాహుల్ గాంధీలు న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎవరిది? కోట్లాది మంది కార్యకర్తలది కాదా? మహాత్మా గాంధీ వంటి స్వాతంత్య్ర సమరయోధులతో పాటు నెహ్రూ, పటేల్ వంటి మహామహులది కాదా? కేవలం సోనియా, రాహుల్ గాంధీదేనా? ఏమో!! కాంగ్రెస్ ఆస్తులు వారిద్దరికే చెందుతాయన్న రీతిలో జరిగిన ‘నేషనల్ హెరాల్డ్– యంగ్ ఇండియా’ డీల్‌ను చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. రూ.50 లక్షలతో దర్జాగా వేల కోట్లు సొంతం చేసుకోవడం.. అదీ ఆస్తుల రూపంలో సామాన్యుడికి ఎవరికైనా సాధ్యమేనా! రాహుల్ బాబా (గాంధీ)కి అది చిన్న పనే. స్వాతంత్య్రోద్యమ సమయంలో ప్రజోపయోగం కోసం ఏర్పడ్డ ఓ సంస్థకు కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు.. కాలక్రమంలో రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలూ భారీ ఆస్తులు కట్టబెట్టాయి. 2008 నాటికే వాటి విలువ మార్కెట్ అంచనాల ప్రకారం రూ.5 వేల కోట్లు దాటేసింది. ఇప్పుడెంతో ఊహించటం కష్టమే. అలాంటి సంస్థ నష్టాల్లో కూరుకుపోతే దానికి కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్లు అప్పుగా ఇచ్చింది. కాకపోతే ఆ రుణాన్ని అది తీర్చలేదని భావించి... కాంగ్రెస్ పార్టీయే 94 శాతాన్ని మాఫీ చేసేసింది. మిగిలిన 6 శాతం... అంటే రూ.50 లక్షల్ని సోనియా, రాహుల్‌కు చెందిన సొంత కంపెనీ చెల్లించి...ఆ ఆస్తులన్నీ తన ఖాతాలో వేసేసుకుంది. ఇదీ కథ.137 ఏళ్ల సుదీర్ఘ కాంగ్రెస్ చరిత్రలోని మలుపుల కన్నా ఆసక్తికరమైన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌పై 5 రోజుల కిందటే ఆదాయపు పన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) తీర్పునిచ్చింది. సదుద్దేశంతో పత్రిక.. జనామోదం పొందలేక మూత నేషనల్ హెరాల్డ్ పేరు చాలామందికి తెలుసు. స్వాతంత్య్రోద్యమ సమయంలో.. 1938లో జనానికి వార్తలు చేరవేయడానికి.. పండిట్ జవహర్లాల్ నెహ్రూతో పాటు పలువురు స్వాతంత్య్ర సమరయోధులు కలిసి రూ.5 లక్షల మూలధనంతో ఏర్పాటు చేసిన పత్రిక ఇది. అసోసియేటెడ్ జర్నల్స్ అనే కంపెనీ దీంతో పాటు పేరు లేని చిన్నాచితకా పత్రికల్నీ ప్రచురించేది. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో ఈ కంపెనీకి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు భూములు, భవ నాల రూపంలో పలు రకాల ఆస్తుల్ని కట్టబెట్టాయి. ఆస్తులు పెరిగినా... నష్టాల్లోకి అయితే ఆస్తులు పెరిగినా పత్రికగా మాత్రం అది రాణించలేకపోయింది. ఢిల్లీలోని ప్రఖ్యాత హెరాల్డ్ హౌస్‌తో పాటు కోట్ల రూపాయల ఆస్తులున్నా.. జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో 2008కి వచ్చేసరికి మూతపడింది. జీతాలతో పాటు ఇతర బకాయిలూ పేరుకుపోవటంతో... కాంగ్రెస్ దీన్ని కాపాడాలనుకుంది. ప్రజల నుంచి చందాలు, విరాళాల రూపంలో వసూలు చేసిన పార్టీ నిధి నుంచి అసోసియేటెడ్ జర్నల్స్‌కు రూ.90 కోట్లు అప్పు ఇచ్చింది. ఆ డబ్బుతో దాని రుణాలు తీర్చుకోమంది. తెరపైకి ‘యంగ్ ఇండియన్’ అసోసియేటెడ్ జర్నల్స్‌కు కాంగ్రెస్ పార్టీ రూ.90 కోట్ల అప్పిచ్చిన రెండేళ్లకు.. అంటే 2010 నవంబర్‌లో చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. రూ.5 లక్షల మూలధనంతో ‘యంగ్ ఇండియన్’ అనే సంస్థ పుట్టుకొచ్చింది. దీన్లో 76 శాతం వాటా సోనియా, రాహుల్ గాంధీలదే. మిగతా 24 శాతం మాత్రం గాంధీలకు నమ్మకస్తులుగా ఉంటూ వస్తున్న మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్లది (ఇప్పుడు వీరిద్దరూ సజీవంగా లేరు). అయితే ఏంటట అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ‘చరిత్రాత్మక’ ఒప్పందం.. ‘యంగ్ ఇండియన్’ పుట్టిన 15 రోజులకే దాని తరఫున అధికారిక ప్రతినిధిగా మోతీలాల్ వోరా ఓ అత్యద్భుతమైన ఒప్పందం చేసుకున్నారు. అదీ మరెవరితోనో కాదు. కాంగ్రెస్ కోశాధికారి మోతీలాల్ వోరాతోను.. అసోసియేటెడ్ జర్నల్స్ ఎండీ మోతీలాల్ వోరాతోను!!. అంటే మూడింటి తరఫునా రకరకాల హోదాల్లో తనే ఒప్పందంపై సంతకాలు పెట్టేశారు. ఇంతకీ ఆ ఒప్పందం ఏంటో తెలుసా? రూ.90 కోట్ల రుణాన్ని అసోసియేటెడ్ జర్నల్స్ చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది కనక.. దాని బదులు తామైతే ఓ 50 లక్షలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీకి ‘యంగ్ ఇండియన్’ ఓ ఆఫరిచ్చింది. యంగ్ ఇండియన్ ప్రతినిధిగా మోతీలాల్ వోరాయే ఈ మేరకు లేఖ రాశారు. 90 కోట్లు ఎటూ రాదు.. 50 లక్షలైనా వస్తోంది కదా.. అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఓకే చేసింది. అంటే.. కాంగ్రెస్ కోశాధికారిగా వోరాయే ఓకే చేశారు. ఇటు అసోసియేటెడ్ జర్నల్స్‌కూ ‘యంగ్ ఇండియన్’ ఓ ప్రతిపాదన చేసింది. మీరెలాగూ రుణం చెల్లించలేరు.. మీ బదులు మేం చెల్లిస్తాం.. ఆ మేరకు వాటాను మాకు బదిలీ చేసేయండి.. అనేది దాని సారాంశం. ఈ లేఖ రాసిందీ వోరాయే. జర్నల్స్ ఎండీ హోదాలో దీనికి ఓకే చేసింది వోరాయే. అంటే.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అప్పును ఓరా మేనేజింగ్ డైరెక్టరుగా ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ కంపెనీ తీర్చలేకపోవటంతో.. ఆ రుణాన్ని 94 శాతాన్ని మాఫీ చేసి కంపెనీని మాత్రం సోనియా యజమానిగా ఉన్న యంగ్ ఇండియన్‌కు రూ.50 లక్షలిస్తే చాలునన్న లెక్కతో కట్టబెట్టేశారు. ఫలితం... కాంగ్రెస్ ఇచ్చిన 90 కోట్లు గాయబ్ అయ్యాయి. అసోసియేటెడ్ జర్నల్స్‌కు చెందిన వేల కోట్ల ఆస్తులు సోనియా చేతికి వచ్చేశాయి. అదీ కథ. నిజానికి 2008లో ఐటీ శాఖ దీని ఆస్తుల విలువను రూ.2 వేల కోట్లుగా లెక్కించింది. మార్కెట్ విలువ 5 వేల కోట్లపైనే. ఇప్పుడు వాటి విలువ ఎన్ని వేల కోట్లుంటుందనేది ఊహించటం కష్టమే. మరో విచిత్రమైన మలుపు కాంగ్రెస్‌లానే ఈ కథ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. యంగ్ ఇండియన్ దగ్గర చెల్లించడానికి ఆ 50 లక్షలు లేవు. దానికి బ్యాంకు ఖాతా లేదు. మరెలా? 2011 ఫిబ్రవర్లో యంగ్ ఇండియన్ సంస్థ డాటెక్స్ మర్చండైజింగ్ అనే కంపెనీ నుంచి రూ.1కోటి రుణం తీసుకుంది. దాంట్లో రూ.50 లక్షలను మార్చిలో కాంగ్రెస్ పార్టీకి చెల్లించింది. అంటే 2010 డిసెంబర్లో రూ.90 కోట్ల సరుకు తీసుకుని 3 నెలలకు దానికి 50 లక్షలు అప్పు తెచ్చి చెల్లించిందన్న మాట. ఇంత అద్దిరిపోయే ఆఫర్ ఎవ్వరికైనా ఎదురవుతుందా? ఎంతైనా సోనియా.. రాహుల్ మరి. తీర్చలేని దయనీయ పరిస్థితుల్లో 90 కోట్ల రుణం 50 లక్షలుగా మారిపోయింది. కాకపోతే అది యంగ్ ఇండియన్ చేతికి వచ్చేసిందిగా!!. కథ మారింది. 90 కోట్లు పోతే పోయింది. ఎనలేని దయతో రూ.50 లక్షలు చెల్లించినందుకు ‘యంగ్ ఇండియన్’కు సంస్థలో 99 శాతం షేర్లు కేటాయించారు అసోసియేటెడ్ జర్నల్స్ ఎండీ మోతీలాల్ వోరా. పాపం.. అప్పటిదాకా కంపెనీలో షేర్లున్న 32,000 మంది షేర్హోల్డర్లు... ఈ కొత్త షేర్ల కేటాయింపుతో 1 శాతానికి పరిమితమైపోయారు. నిజానికి వాళ్లంతా నాటి స్వాతంత్ర సమరయోధులు. నిబంధనల ప్రకారం వారి వారసులకు ఆ వాటా చెందాలి. వారసులెవరో తెలియనప్పుడు సదరు ఆస్తి ప్రభుత్వానికి చెందుతుంది. దీన్ని తప్పించుకోవటానికే ఈ కేటాయింపు. ఈ మొత్తం లావాదేవీల్లో కాంగ్రెస్ పార్టీ తన సభ్యుల నుంచి సేకరించిన 89.5 కోట్ల రూపాయల్ని నష్టపోయింది. జర్నల్స్‌లో వాటా ఉన్న షేర్ హోల్డర్లు తమ వాటా విలువను పూర్తిగా కోల్పోయారు. కానీ 50 లక్షలు పెట్టుబడితో సోనియా, రాహుల్ ఈ అసోసియేటెడ్ జర్నల్స్ ఆస్తులకు యజమానులైపోయారు. -
చాయ్‌వాలా కోర్టు మెట్లెక్కించాడు
సుమేర్పూర్/దౌసా: నాలుగు తరాలపాటు దేశాన్ని పాలించిన గాంధీల కుటుంబాన్ని నేడు ఓ చాయ్‌వాలా కోర్టు వరకు తీసుకొచ్చాడని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలను రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి 2011–12 ఆర్థిక సంవత్సరంలో రాహుల్, ఆయన తల్లి సోనియా గాంధీల ఆదాయపు పన్ను వివరాలను తనిఖీ చేసేందుకు సుప్రీంకోర్టు మంగళవారమే అనుమతివ్వడం తెలిసిందే. పాలి, దౌసా జిల్లాల్లో మోదీ ఎన్నికల ర్యాలీల్లో మాట్లాడుతూ ‘ఇప్పుడు మీరెలా తప్పించుకుంటారో నేను చూస్తా. నాలుగు తరాలు దేశాన్ని పాలించిన కుటుంబాన్ని కోర్టుకు తీసుకొచ్చిన టీ అమ్మే వ్యక్తి ధైర్యాన్ని చూడండి’ అని మోదీ అన్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన మైకేల్ క్రిస్టియన్‌ను యూఏఈ నుంచి భారత్‌కు తీసుకొచ్చిన అంశాన్నీ మోదీ ప్రస్తావించి కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పించారు. మైకేల్ నోరు తెరిస్తే తమ పేర్లు బయటకొస్తాయని గాంధీ కుటుంబం వణికిపోతోందనీ, ఇది వేల కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకున్న కుంభకోణమని మోదీ అన్నారు. ‘మైకేల్ రాజకీయ నేతలకు సేవలందించాడు. ఇప్పుడు ఆ రహస్యాలను బయటపెడతాడు. ఇది ఎంత దూరం వెళ్తుందో చూద్దాం’ అని మోదీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మంగళవారం రాజస్తాన్‌లోని కుంభారం ప్రాజెక్టును కుంభకర్ణ ప్రాజెక్టు అని తప్పుగా పలికారు. దీనిపై మోదీ స్పందిస్తూ కాంగ్రెస్ అంతా అయోమయంలో కూరుకుపోయిన పార్టీ అనీ, అలాంటి పార్టీకి ఓట్లు వేయొద్దని కోరారు. గాంధీల కుటుంబం కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందనీ, తమ పార్టీకి దేశమే కుటుంబమనీ, కాబట్టి మరోసారి రాజస్తాన్‌లో బీజేపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాజస్తాన్‌లో ముగిసిన ప్రచారం రాజస్తాన్‌లో గెలుపే లక్ష్యంగా బీజేపీ–కాంగ్రెస్‌ల మధ్య సాగిన హోరాహోరీ ఎన్నికల ప్రచారం బుధవారం సాయంత్రానికి ముగిసింది. ఈ రాష్ట్రంలో మొత్తం 200 శాసనసభ నియోజకవర్గాలుండగా 199 నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ జరగనుంది. 199 మంది మహిళలు, 830 మంది స్వతంత్రులు సహా మొత్తం 2,274 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆళ్వార్ జిల్లాలోని రామగఢ్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్ మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందనీ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని రాజస్తాన్ ముఖ్య ఎన్నికల అధికారి ఆనంద్ కుమార్ చెప్పారు. ఈ రాష్ట్రంలో మొత్తం 4.77 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 130 స్థానాల్లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యనే ఉండనుంది. మరో 50 సీట్లలో ఇరు పార్టీల నుంచి తిరుగుబాటు అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. -
సోనియా, రాహుల్ గాంధీకి చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి 2011-12 సంవత్సరంలో సోనియా, రాహుల్ ఆదాయపన్ను వివరాలను పునఃపరిశీలన చేసేందుకు సుప్రీంకోర్టు ఐటీశాఖ అధికారులకు అనుమతిని ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి సోనియా, రాహుల్ పన్ను మదింపు వివరాలను పునఃపరిశీలించేందుకు ఢిల్లీ హైకోర్టు గతంలో అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అనుమతిని సవాలు చేస్తూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుత దశలో కేసులో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. అయితే, ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. సోనియా వేసిన పిటిషన్‌పై తాము వాదనలు విన్న తర్వాతే.. ఈ మేరకు పన్ను వివరాల పునఃపరిశీలనను ఐటీశాఖ చేపట్టాలని స్పష్టం చేసింది. అలాగే సోనియా, రాహుల్ తరఫున దాఖలైన పిటిషన్‌పై తాము ప్రస్తుతం ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని, జనవరి 8న ఈ కేసులో తుది విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల విషయమై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సోనియా, రాహుల్‌లకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేయడంతో ఈ వ్యవహారంలో వారి ఆదాయపన్ను వివరాలను మళ్లీ మదింపు చేయాలని కోర్టు ఐటీ శాఖ అధికారులను ఆదేశించింది. -
నేషనల్ హెరాల్డ్ కేసు : నేడు సుప్రీం విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి 2011-12లో తమ పన్ను వివరాల తనిఖీపై ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు మంగళవారం విచారించనుంది. ఈ కేసులో 2011-12 ట్యాక్స్ అసెస్మెంట్ల పునఃపరిశీలన నుంచి తమకు ఊరట కల్పించాలన్న రాహుల్, సోనియాల అప్పీల్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 10న వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ వీరు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన సుప్రీం బెంచ్ విచారించనుంది. హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైనందున ఆదాయ పన్ను శాఖ సర్వోన్నత న్యాయస్ధానంలో కేవియట్ దాఖలు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా కాంగ్రెస్ అగ్ర నేతలపై ఆదాయ పన్ను విచారణ తలెత్తింది. నేషనల్ హెరాల్డ్ కేసులో 2015, డిసెంబర్ 19న ప్రత్యేక న్యాయస్ధానం సోనియా, రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. యంగ్ ఇండియన్ అనే సంస్థ ద్వారా సోనియా, రాహుల్,ఇతరులు కేవలం రూ 50 లక్షలు చెల్లించి నేషనల్ హెరాల్డ్‌ను నిర్వహించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు కాంగ్రెస్ పార్టీ బకాయిపడిన రూ 90.25 కోట్లు వసూలు చేసుకునే హక్కులు పొందారని సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 2010 నవంబర్‌లో ఏర్పాటైన యంగ్ ఇండియా కేవలం రూ 50 లక్షల పెట్టుబడితో ఏజేఎల్‌లోని షేర్లన్నంటినీ కొనుగోలు చేసిందని స్వామి ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే యంగ్ ఇండియాలో రాహుల్‌కున్న షేర్లతో ఆయన ఆదాయం రూ 154 కోట్లని, ట్యాక్స్ రిటన్స్‌లో చూపినట్టు రూ 68 లక్షలు కాదని ఆదాయ పన్ను శాఖ వాదిస్తోంది. -
రాహుల్ గాంధీకి చుక్కెదురు
న్యూఢిల్లీ: 2011–12 ఆర్థిక సంత్సరంలో తాము చెల్లించిన పన్నుల వివరాలను మరో సారి తనిఖీ చేయకుండా అడ్డుకోవాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీలు వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. దీంతో ఆ ఏడాదిలో గాంధీలతోపాటు కాంగ్రెస్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్‌లు చెల్లించిన పన్నుల వివరాలను ఆదాయపు పన్ను విభాగం అధికారులు మరోసారి తనిఖీ చేసి పన్ను ఎగవేతల విషయాన్ని తేల్చనున్నారు. కాంగ్రెస్‌కు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికను నడుపుతున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) కంపెనీని యంగ్ ఇండియా (వైఐ) అనే సంస్థ కొనుగోలు చేసింది. 2011–12 ఏడాదికి రాహుల్ రూ. 68 లక్షల ఆదాయానికే పన్ను చెల్లించగా ఆయనకు వైఐలో ఉన్న వాటాల ద్వారా రూ. 154 కోట్ల ఆదాయం వచ్చిందని గతంలో అంచనా వేసింది. ఏజేఎల్ నుంచి తమ వాటాలను వైఐకి బదిలీ చేసే సమయంలో గాంధీలతోపాటు ఫెర్నాండెజ్ అవకతవకలకు పాల్పడి పన్ను తక్కువగా కట్టారనేది ఆరోపణ. తాజాగా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా స్పందిస్తూ ప్రధాని మోదీకి ధైర్యముంటే రాహుల్‌ను, కాంగ్రెస్‌ను రాజకీయ యుద్ధంలో ఎదుర్కోవాలనీ, ఆదాయపు పన్ను విభాగం వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించి కాదని విరుచుకుపడ్డారు. -
రాహుల్, సోనియాలకు భారీ ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2011-2012 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను రీ-అసెస్మెంట్ కోరుతూ ఆదాయం పన్ను శాఖ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ సోనియా, రాహుల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. పన్ను ప్రక్రియలను తిరిగి తెరిచే అధికారం ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఉంటుందని తెలిపింది. సమస్యలు ఏమైనా ఉంటే ఆదాయపు పన్ను శాఖనే సంప్రదించాలని సూచించింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి, 2011-12 ఆర్థిక సంవత్సరపు పన్ను రీ-అసెస్మెంట్ను ఆదాయపు పన్ను శాఖ తిరిగి తెరవడంపై రాహుల్ గాంధీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు రీ-ఎసెస్మెంట్ నోటీసులు పంపడంలో ఆదాయం పన్ను శాఖకు 'దురుద్దేశాలు' ఉన్నాయని సోనియాగాంధీ గత నెలలో ఢిల్లీ కోర్టుకు తెలియజేశారు. యంగ్ ఇండియన్ కంపెనీకి రాహుల్ గాంధీ డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే దాని నుంచి రాహుల్ గాంధీ ఎలాంటి ఆదాయాన్ని ఆర్జించడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడి న్యాయవాది తెలిపారు. రాహుల్ గాంధీ యంగ్ ఇండియాకు డైరెక్టర్‌గా ఉన్న విషయాన్ని దాచిపెట్టారని ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇది ప్రధాన కంపెనీ. ఆదాయపు పన్ను శాఖ దగ్గర రాహుల్ గాంధీ నిజాలు దాయడంతో, రూ.154.97 కోట్ల విలువైన మొత్తాన్ని ఆర్జించినట్టు పేర్కొంది. -
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి మీడియా రిపోర్టింగ్‌ను నిలువరించాలన్న రాహుల్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియా లావాదేవీలకు సంబంధించి తన పన్ను అసెస్మెంట్ను తిరిగి పరిశీలించాలన్న ఆదాయపన్ను ఉత్తర్వులను రాహుల్ గాంధీ హైకోర్టులో సవాల్ చేశారు. అసోసియేట్ జర్నల్‌కు ఏఐసీసీ రూ 99 కోట్లు ఇచ్చిందని, యంగ్ ఇండియాలో డైరెక్టర్ పదవి వివరాలను రాహుల్ ఉద్దేశపూర్వకంగా వెల్లడించలేదని ఆదాయ పన్ను శాఖ హైకోర్టుకు నివేదించింది. అయితే ఈ పదవి ద్వారా రాహుల్ ఎలాంటి ఆదాయం పొందనందున పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని రాహుల్ న్యాయవాది స్పష్టం చేశారు. కాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి నేషనల్ హెరాల్డ్ కేసును తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. సోనియా, రాహుల్ వారి కంపెనీలకు వ్యతిరేకంగా సుబ్రహ్మణ్య స్వామి న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ పత్రికను నిర్వహించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు రూ 90.25 కోట్ల వడ్డీలేని రుణాన్ని మంజూరు చేసిందని తన పిటిషన్లో ఆరోపించారు. -
వాళ్లా పాండవులు?
న్యూఢిల్లీ: గతంలో రాముడి అస్తిత్వాన్నే ప్రశ్నించిన పార్టీ నేడు తమను తాము పాండవులుగా చెప్పుకుంటారా అని బీజేపీ నేత, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. ప్లీనరీలో రాహుల్ విమర్శలను తిప్పికొడుతూ.. సిక్కుల ఊచకోతకు, లక్షలకోట్ల కుంభకోణాలకు పాల్పడ్డ కాంగ్రెస్ నేతలు.. పాండవులమని చెప్పుకోవటం విడ్డూరన్నారు. నరేంద్ర మోదీకి.. నీరవ్, లలిత్ మోదీలతో సంబంధమున్నట్లు చూపించే ప్రయత్నం పూర్తిగా అర్థరహితమని మంత్రి తెలిపారు. ‘నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన రాహుల్ గాంధీ.. మహాత్ముని ఇంటిపేరుతో ఉన్నారు. దీన్నెలా చూడాలి?’ అని ప్రశ్నించారు. ‘ఓ కేసులో తనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినపుడు ఇం దిరా గాంధీ న్యాయవ్యవస్థపై ఎలా వ్యవహరించారో నేను గుర్తుచేయాలా? 1988లో రాజీవ్ గాంధీ ప్రెస్ హక్కులను కాలరాసే బిల్లును తీసుకొచ్చినంత పనిచేశారు. ఎమర్జెన్సీలో ఇందిర మీడియాతో ఎలా వ్యవహరించారు? ఆమె మనుమడు ఇప్పుడు మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడటం విడ్డూరం’ అని ఆమె పేర్కొన్నారు. -
నేషనల్ హెరాల్డ్ కేసులో అనూహ్య మలుపు
-
నేషనల్ హెరాల్డ్ కేసులో అనూహ్య మలుపు
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ శనివారం అనూహ్య మలుపు తిరిగింది. కేసు విచారణను ప్రారంభించిన పటియాలా కోర్టుకు బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి ఆదాయ పన్ను శాఖ(ఐటీ) ఆదేశాలను సమర్పించారు. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ పెద్ద తలకాయలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2012లో రూ. 90.25 కోట్ల రుణాన్ని వడ్డీ లేకుండా నేషనల్ హెరాల్డ్ న్యూస్‌పేపర్‌ను నడుపుతున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందంటూ సుబ్రమణియన్ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. అందులో సోనియా, రాహుల్, మోతీలాల్ వోరాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 2016లో స్వామి పిటిషన్‌పై స్పందించాలంటూ కోర్టు సోనియా, రాహుల్‌లను న్యాయస్థానం కోరింది. దీంతో గతేడాది నవంబర్‌లో రాహుల్, ఆయన తల్లి సోనియాలు కోర్టులో స్వామి పిటిషన్‌పై కౌంటర్‌ను దాఖలు చేశారు. శనివారం పటియాలా కోర్టు ఈ కేసులో విచారణను ప్రారంభించగా.. తన పిటిషన్‌ను బలపర్చుతూ స్వామి ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన ఆదేశాల పత్రాలను ఆధారాలుగా సమర్పించారు. రూ. 414 కోట్ల పన్నును కాంగ్రెస్ పార్టీ చెల్లించాలని కోర్టులో వాదించారు. -
నేషనల్ హెరాల్డ్ కేసు.. చిన్న బ్రేక్!
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు మరోసారి తాత్కాలిక ఊరట లభించింది. నేషనల్ హెరాల్డ్ కేసు తిరిగి విచారణ ప్రారంభించిన పటియాలా కోర్టు తదుపరి వాదనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం కేసు విచారణకు బెంచ్ ముందుకు రాగా, నంబర్ 18వ తేదీకి వాయిదాస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, మరికొందరు 2012లో దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా నేషనల్ హెరాల్డ్ స్కాం వెలుగులోకి వచ్చింది. సంచలనం రేపిన ఈ స్కాంలో సోనియా, రాహల్‌తోపాటు మరో నలుగురు కాంగ్రెస్ కీలక నేతలపై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు జూలై 1న నిందితులను వివరణ కోరగా.. 22న సోనియా, రాహుల్‌లు సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పక్షం దాదాపు 90 కోట్ల రుణాన్ని ది నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ యాజమాన్య సంస్థ అసోషియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు అప్పనంగా కట్టబెట్టిందంటూ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపిస్తూ వస్తున్నారు. నిందితులుగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా, పార్టీ నేతలు ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబె, శామ్ పిట్రోడాల పేర్లను స్వామి పేర్కొన్నారు. -
సోనియా, రాహుల్‌కు ఎదురుదెబ్బ
► యంగ్ ఇండియన్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు ► నేషనల్ హెరాల్డ్ కేసులో స్టే ఇచ్చేందుకు నిరాకరణ ► తొలుత ఆదాయపన్ను శాఖను సంప్రదించాలని సూచన న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వ్యతిరేకంగా ఆదాయ పన్ను(ఐటీ) శాఖ చేపట్టిన దర్యాప్తును నిలుపుదల చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. రిట్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని, దానిని ఉపసంహరించుకుని ఐటీ అస్సెసింగ్ అధికారిని సంప్రదించాలని జస్టిస్ ఎస్.మురళీధర్, జస్టిస్ చంద్రశేఖర్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. ఐటీ అస్సెసింగ్ అధికారి లేవనెత్తిన ప్రశ్నలకు యంగ్ ఇండియన్ కంపెనీ సమధానం ఇవ్వలేదని, అస్సెస్మెంట్ అధికారినీ కంపెనీ కలవలేదని, అందువల్ల ముందు ఐటీ శాఖను సంప్రదించి.. అవసరమైన పత్రాలు అందించాలని సూచించింది. ఆ తర్వాతా సంతృప్తి చెందనట్లయితే కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. యంగ్ ఇండియన్ తరపున కోర్టుకు హాజరైన న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని చెప్పడంతో.. ధర్మాసనం అందుకు అంగీకరించింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల దుర్వినియోగం కేసులో 2011–12 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన రీ అస్సెస్మెంట్ నోటీసులను కొట్టివేయాలని, ఐటీ దర్యాప్తును నిలుపుదల చేయాలని కోరుతూ యంగ్ ఇండియన్ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. అసలేం జరిగింది.. నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణ సంస్థ అయిన అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు చెందిన షేర్లను 2010లో రూ. 50 లక్షల మూలధనంతో ఏర్పాటైన యంగ్ ఇండియన్ కంపెనీ సొంతం చేసుకుంది. ఐటీ శాఖ రికార్డుల ప్రకారం.. యంగ్ ఇండియన్‌లో సోనియా, రాహుల్‌కు 83.3 శాతం, వోరాకు 15.5 శాతం.. ఫెర్నాండెజ్‌కు మిగతా 1.2 శాతం వాటా ఉంది. అయితే బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి ఈ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఏజేఎల్ చెల్లించాల్సిన రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును రూ.50 లక్షలకే యంగ్ ఇండియన్‌కు అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. ఇందులో సోనియా, రాహుల్‌తో పాటు మోతీలాల్వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శామ్ పిట్రోడాలను నిందితులుగా పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను వారు తోíసిపుచ్చారు. స్వామి పిటిషన్‌పై దర్యాప్తు జరిపిన ఐటీ శాఖ.. ఏజేఎల్ ఆస్తులను యంగ్ ఇండియన్‌కు బదిలీ చేయడంలో దుర్వినియోగం జరిగిందని, ఇందులో రాహుల్, సోనియా పాత్ర ఉందని పేర్కొంటూ గతంలో నోటీసులు జారీ చేసింది. -
హెరాల్డ్ ట్రబుల్స్
-
హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ కు ఊరట
-
హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ కు ఊరట
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలకు ఊరట లభించింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్‌ను పటియాల కోర్టు సోమవారం తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి 2010-11 నాటి కాంగ్రెస్ బ్యాలెన్స్ షీట్, ఇతర పత్రాలను సమర్పించాలని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే సుబ్రహ్మణ్యస్వామి పిల్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది. కాగా దీనిపై సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధులను సోనియా, రాహుల్ దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ సుబ్రహ్మణ్యస్వామి కేసు పెట్టిన సంగతి విదితమే. -
సోనియా, రాహుల్‌కు నోటీసులు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ కోర్టు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరో ఐదుగురికి నోటీసులు జారీచేసింది. రెండు వారాలలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధులను సోనియా, రాహుల్ దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అసోసియేట్ జర్నల్ లిమిటెడ్(ఏజేఎల్), కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్యుమెంట్లు కోరుతూ సమన్లు జారీచేయాల్సిందిగా స్వామి కోర్టుకు విన్నవించారు. ఈ కేసును విచారించిన పాటియాల కోర్టు కాంగ్రెస్ నేతలకు నోటీసులు పంపింది. -
కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షలు
అందరినీ ఇబ్బందులు పెట్టడంలో ఆరితేరిన కాంగ్రెస్ అధినేతలకు ఈమధ్య కష్టా లొచ్చిపడ్డాయి. రెండు కీలకమైన కేసులు వారిని వెంటాడుతున్నాయి. అందులో ఒకటి బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తీసుకొచ్చిన నేషనల్ హెరాల్డ్ కేసు, రెండోది- తమ సంస్థపై రాహుల్‌గాంధీ అపనింద వేశారంటూ మహారాష్ట్రకు చెందిన ఆరెస్సెస్ కార్యకర్త ఒకరు దాఖలు చేసిన కేసు. నేషనల్ హెరాల్డ్ కేసు అవినీతి ఆరోపణలకు సంబంధించింది. ఆ పత్రిక ప్రచురణ కోసం ఎన్నడో 1937లో జవహర్లాల్ నెహ్రూ స్థాపించిన అసోసియేట్ జర్నల్ లిమిటెడ్(ఏజేఎల్)కు ఇప్పుడున్న వేల కోట్ల విలువైన స్థిరాస్తులను చేజిక్కించుకునేందుకు యంగ్ ఇండియన్ అనే సంస్థను 2010లో స్థాపించారన్నది ఆ ఆరోపణల సారాంశం. న్యాయస్థానం విచారణలో ఉన్న ఆ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందన్నది వేచి చూడాల్సిన అంశం. డబ్బు రూపేణా కాకపోయినా దాన్ని మించిన కేసు ఆరెస్సెస్ సంస్థపై వేసిన నిందకు సంబంధించింది. మహాత్మాగాంధీ హత్య వెనక ఆరెస్సెస్ హస్తముందని 2014లో ఒక బహిరంగసభలో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణపై ఆ సంస్థ కార్యకర్త ఒకరు కింది కోర్టులో పెట్టిన కేసు అది. ఆ కేసును కొట్టేయాలన్న రాహుల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘మీ ఆరోపణలు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 499కిందికి వస్తాయో, రావో తేల్చాల్సి ఉన్నద’ని స్పష్టం చేసింది. ‘పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారా లేక విచారణను ఎదుర్కొనడానికి సిద్ధ పడతారా’ అని కూడా ప్రశ్నించింది. ఈ సూటి ప్రశ్న చాలా జటిలమైనది. ఈ కేసులో ముందుకుపోయినా, వెనక్కొచ్చినా అంతిమంగా సంకటస్థితిలో పడేది కాంగ్రెసే. ముందుకెళ్లి విచారణను ఎదుర్కొనదల్చుకుంటే చేసిన ఆరోపణలకు సంబంధించి నిర్దిష్టమైన ఆధారాలను ఆయన చూపవలసి ఉంటుంది. దీన్నుంచి వెనక్కి రావడం ఉత్తమం అనుకుంటే సుప్రీంకోర్టు చెప్పినట్టు పశ్చాత్తాపం వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఆ పని చేస్తే కాంగ్రెస్ తగిలించుకున్న సెక్యులర్ భుజకీర్తులకు భంగం కలుగుతుంది. రాజీవ్ హయాంలో రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం, షాబానో కేసు తదితర అంశాల్లో వ్యవహరించిన తీరుతో మొదలుపెడితే అనేక సందర్భాల్లో ఆ పార్టీ వేసిన అడుగుల వల్ల దాని సెక్యులర్ ప్రభ అసలే అంతంతమాత్రంగా ఉంది. ఇప్పుడు ఆరెస్సెస్ కేసులో రాహుల్ ‘పశ్చాత్తాప’పడితే అది మరింత కొడిగట్టడం ఖాయం. బింకంగా ముందు కెళ్తే ఏమవుతుందో చెప్పలేం. ఆయన సమర్పించే సాక్ష్యాధారాలపైనా, వాటిని న్యాయస్థానం అంగీ కరించడంపైనా అది ఆధారపడి ఉంటుంది. కేసు సర్వోన్నత న్యాయస్థానానికి చేరే సరికి చాన్నాళ్లు పడుతుంది. మొత్తానికి ఆయన రెండో తోవ ఎంచుకున్నారు. రాహుల్ ‘చారిత్రక వాస్తవాలపై’ అవగాహన ఉన్నవారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఘంటాపథంగా చెబుతున్నారు. రాహుల్ అందజేసే ఆ ‘వాస్తవాల’ను న్యాయస్థానం అంగీకరిస్తే వేరుగానీ... తిరస్కరిస్తే పార్టీ పరువు పోవడంతోపాటు దాని సెక్యులర్ స్థానం మరింత కుంచించుకుపోతుంది. పైగా ఆ తీర్పు ఆరెస్సెస్‌కు అదనపు సర్టిఫికెట్ అవుతుంది. నిజానికి ఆరెస్సెస్‌పై ఇలాంటి ఆరోపణ చేసిన నేతల్లో రాహుల్‌గాంధీ మొదటివారేమీ కాదు. ఇంతక్రితం చాలామంది చేశారు. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమూ, అప్పటి జమ్మూ-కశ్మీర్‌లోని షేక్ అబ్దుల్లా ప్రభుత్వమూ కుట్రపన్నిన పర్యవసానంగానే జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ 1952లో కస్టడీలో మరణించారని బీజేపీ, సంఘ్ పరివార్ నేతలు అనేకులు పలు సందర్భాల్లో ఆరోపించారు. అలాగే 1984లో ఇందిర హత్య తర్వాత ఢిల్లీలో జరిగిన నరమేథంపైనా, 2001లో గోథ్రా మారణకాండ తర్వాత గుజరాత్లో చోటుచేసుకున్న ఊచకోతపైనా కాంగ్రెస్, బీజేపీ నేతలపై ఆరోపణలొ చ్చాయి. అందుకు సంబంధించిన కేసుల్లో ఆ రెండు పార్టీల నేతలపైనా న్యాయ స్థానాల్లో విచారణలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికీ ఎన్నికలొచ్చాయంటే ఆ రెండు పార్టీల ఆరోపణల జాబితాల్లోనూ ఈ అంశాలు ప్రధానంగా ఉంటాయి. మరో ఆరునెలల్లో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవి హోరెత్తుతాయి. ఈ బాణీకి భిన్నంగా రాహుల్ ఏమైనా మాట్లాడారా? ఆరెస్సెస్‌కు అదనంగా ఆగ్రహం తెప్పించారా? గతంలో ఆరెస్సెస్ ఇలాంటి ఆరోపణల్ని ఎదుర్కొన్నా వా టికి అంతే దీటుగా బదులివ్వడం తప్ప ఎన్నడూ న్యాయస్థానం తలుపు తట్టలేదు. చట్టసభల్లోనూ, బహిరంగసభల్లోనూ, ఇతర వేదికలపైనా ప్రత్యర్థి పక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వర్తమానకాలంలో వింతేమీ కాదు. ఈమధ్య స్పీకర్ల పుణ్యమా అని చట్టసభల్లో కొందరు ఏం మాట్లాడినా చెల్లుబాట వుతోంది. కొందరు ఎలా మాట్లాడినా అపరాధమై రికార్డుల్లోంచి మాయమవు తోంది. ఆ సంగతలా ఉంచి బహిరంగసభలు, మీడియా సమావేశాల్లో నాయకులు చేసుకునే ఆరోపణలు మీడియాకు మేతగా తప్ప న్యాయస్థానాల వరకూ వెళ్లడం లేదు. అలా వెళ్తే సహజంగానే అది వేరే రూపం తీసుకుంటుంది. ప్రతి మాటా బలిగోరుతుంది. అడుగడుగునా ప్రశ్నల కొడవళ్లు అడ్డు తగులుతాయి. ఇక నీళ్లు నమలడం కుదరదు. ప్రతిదానికీ నిర్దిష్టంగా జవాబివ్వాలి. తగిన ఆధారాలివ్వాలి. రాహుల్‌కు ఇప్పుడు ఈ సమస్యే ఎదురైంది. మహాత్మాగాంధీ హత్య వెనక ఆరెస్సెస్ హస్తమున్నదని ఎలా చెప్పారని అడిగితే ఆయన తరఫు న్యాయవాది... పంజాబ్- హరియాణా హైకోర్టు తీర్పులో ప్రస్తావించిన అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గాంధీజీని హత మార్చిన గాడ్సే ఆరెస్సెస్ కార్యకర్త అని మాత్రమే అందులో ఉన్నది తప్ప ఆ సంస్థే చంపిందని ఎక్కడ నిర్ధారించిందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ కేసులో న్యాయ స్థానం ముందుంచబోయే ‘చారిత్రక వాస్తవాలు’ ఏమిటో రాగలకాలంలో తేలు తుంది. అయితే, దీని సంగతలా ఉంచి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో... గాలి కబుర్లు కాక బాధ్యతాయుతంగా మాట్లాడాలని, జవాబుదారీ తనంతో మెలగాలని నేతలు గ్రహిస్తే మంచిదే. -
హెరాల్డ్ కేసులో...సోనియా,రాహుల్‌కు ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వీరిద్దరికీ ట్రయల్ కోర్టులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి సుప్రీం కోర్టు మినహాయింపునిచ్చింది. ఈ కేసు విచారణ ట్రయల్ కోర్టులో కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే మెజిస్ట్రేట్ ఎప్పుడు అవసరమని భావించినా వ్యక్తిగతంగా హాజరు కావాలని సోనియా, రాహుల్‌ను ఆదేశించవచ్చని షరతు విధించింది. ట్రయల్ కోర్టు ముందు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాన్న సోనియా, రాహుల్ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ జరపనుంది. ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధులను సోనియా, రాహుల్ దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కేసు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్‌ను విచారణకు స్వీకరించొద్దనిస్వామి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ కేసులోని పరిస్థితులు, పిటిషనర్ల స్థాయిని బట్టి చూసినట్లయితే వారు ట్రయల్ కోర్టుకు హాజరు కావడం వల్ల సౌలభ్యం కన్నా ఇబ్బందులే ఎక్కువ ఉంటాయని కోర్టు పేర్కొంది. కింది కోర్టులో ఉన్న క్రిమినల్ ప్రొసిడింగ్స్‌లో జోక్యం చేసుకునేందుకు మాత్రం నిరాకరించింది. అయితే ఈ కేసులో నిందితులకు సంబంధించి హైకోర్టు పరిశీలనలు, నిర్ధారణలతో తాము ఏకీభవించడం లేదని ధర్మాసనం పేర్కొంది. -
హెరాల్డ్ కేసులో సుప్రీంకు సోనియా, రాహుల్
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో తమపై విచారణ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారితో పాటు ఆ కేసులో నిందితులుగా ఉన్న శ్యామ్ పిట్రోడా, సుమన్ దూబే కోర్టులో పిటిషన్ వేశారు. ట్రయల్ కోర్టు సమన్లను కొట్టివేయాలంటూ సోనియా, రాహుల్ చేసుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు ఇటీవల కొట్టేసింది. 20న ఆ కేసు మళ్లీ విచారణకు రానున్న నేపథ్యంలో సోనియా, రాహుల్ సుప్రీంకోర్టు తలుపుతట్టారు. -
సుప్రీంకోర్టుకు సోనియా, రాహుల్
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. గత విచారణం సందర్భంగా వారు తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ వారు సుప్రీం మెట్లెక్కారు. గత ఏడాది చివర్లో డిసెంబర్ లో ఈ కేసుకు సంబంధించి వారు తప్పనిసరిగా హాజరుకావాలని ఢిల్లీ హైకోర్టు వారిని ఆదేశించింది. అయితే, అందుకు తమకు మినహాయింపు ఇవ్వాలని వారు కోరినా కోర్టు తిరస్కరించింది. తమకు కోర్టు హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలని తాజాగా వారు చేసుకున్న పిటిషన్ పై తదుపరి విచారణ ఫిబ్రవరి 20న జరగనుంది. హెరాల్డ్ పత్రిక పేరిట చట్ట వ్యతిరేకంగా వేల కోట్లను అక్రమంగా తమ ఖాతాల్లోకి జమచేసుకోవాలని ప్రయత్నించారని వారిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. -
కక్ష సాధింపు అనడం విడ్డూరంగా ఉంది
సోనియా వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్య సాక్షి, హైదరాబాద్: ఎన్డీయే ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. న్యాయస్థానం తన ముందు హాజరవ్వాలని ఆదేశిస్తే గౌరవించి న్యాయస్థానం ముందు హాజరై వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది పోయి ఊరేగింపులు, ప్రదర్శనలు చేయడం తగునా అని ప్రశ్నించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ తమపై కేసు నమోదుకు ప్రధాని మోదీ కారణమని సోనియా ఆరోపించడం సరికాదన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు 2012-13లో నమోదైందని గుర్తు చేశారు. వారు ఏది మాట్లాడినా వాటికి బాధ్యుడు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ అవుతారన్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కోపంతో పార్లమెంట్ జరగనీయకుండా ఆ పార్టీ ప్రజలపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తోందని వెంకయ్య ఆరోపించారు. ప్రస్తుతం పార్లమెంట్లో 18 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని గుడ్డిగా ఆమోదించమని చెప్పను గానీ, పార్లమెంట్‌ను సజావుగా జరగనీయాలని విజ్ఞఫ్తి చేశారు. కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న యజ్ఞానికి హాజరవుతానని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
'సోనియా, రాహుల్ జైలుకెళ్లడం ఖాయం'
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో విజయం తనదేనని బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన శనివారమిక్కడ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు బెయిల్ మంజూరు అనంతరం సుబ్రమణ్యస్వామి మీడియాతో మాట్లాడారు. అవినీతిపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కేసు గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఎప్పుడూ చర్చించలేదని సుబ్రమణ్యంస్వామి తెలిపారు. కేసుకు సంబంధించి ఎలాంటి కక్ష సాధింపు చర్య లేదని ఆయన అన్నారు. కాగా కోర్టు సోనియా, రాహుల్‌కు బెయిల్ మంజూరు చేయటాన్ని సుబ్రమణ్యం స్వామి వ్యతిరేకించిన విషయం తెలిసిందే. -
చివరకు న్యాయమే గెలుస్తుంది: సోనియా
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, అయితే చివరకు న్యాయమే గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. దేశ పౌరులుగా ఏం చేయాలో తాము అదే చేశామన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మంజూరు అనంతరం సోనియా, రాహుల్ శనివారం ఏఐసీసీ కార్యాలయం వద్ద ప్రెస్మీట్లో మాట్లాడారు. చట్టాన్ని తాము గౌరవిస్తామని, కోర్టులో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని సోనియా అన్నారు. ప్రతిపక్షాన్ని ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని, కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆమె ఆరోపించారు. కేసులకు భయపడేది లేదని సోనియా స్పష్టం చేశారు. తాము స్వచ్ఛమైన మనసుతో కోర్టుకు హాజరయ్యామని ఆమె తెలిపారు. రాజకీయ ప్రతికార చర్యలను తాము ధైర్యంగా ఎదుర్కొంటామని సోనియా పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందన్నారు. కేంద్రం తమపై అన్నిరకాల అస్త్రాలు ప్రయోగిస్తుందన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాము చట్టాన్ని గౌరవిస్తామని అన్నారు. ప్రధాని మోదీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, బెదిరింపులకు వెనకడుగు వేసేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. తమపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ఆ ఒత్తిళ్లకు లొంగకపోవడంతో కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా... ప్రజల కోసమే తమ పోరాటం సాగుతుందని, ప్రతిపక్షంగా తమ పాత్ర తాము పోషిస్తున్నామన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యలతో ప్రతిపక్షాన్ని అణచలేరన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుందన్నారు. సోనియా, రాహుల్‌కు కాంగ్రెస్ పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ భావ జాలాన్ని తాము ఎన్నడూ వీడేది లేదన్నారు. మరోవైపు సోనియా, రాహుల్‌కు బెయిల్ మంజూరు కావటంతో ఏఐసీసీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. -
చివరకు న్యాయమే గెలుస్తుంది
-
కోర్టులో 5 నిమిషాలు మాత్రమే...
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో తొలిసారిగా కోర్టు మెట్లు ఎక్కిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేవలం 5 నిమిషాలు మాత్రమే న్యాయస్థానంలో ఉన్నారు. ఈ కేసులో వాదనలు అయిదు నిమిషాల్లోనే ముగిశాయి. పాటియాల హౌస్ కోర్టులో శనివారం సోనియా, రాహుల్ తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సోనియా, రాహుల్‌తో సహా ఈ కేసులో ఏడుగురికి బెయిల్ మంజూరు అయింది. మరోవైపు కేసు విచారణ సందర్భంగా కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది. కాగా సోనియా కుమార్తె ప్రియాంకా వాద్రా, అల్లుడు రాబర్ట్ వాద్రాలు సోనియా కంటే ముందుగానే కోర్టుకు వచ్చారు. కాగా ఈ కేసుకు సంబంధించి రాహుల్, సోనియాలు బెయిల్ తీసుకుంటారా, అరెస్ట్ అవుతారా అనే దానిపై కాంగ్రెస్ పార్టీ చివరివరకూ వ్యూహత్మకంగా వ్యవహరించింది. కేసు విచారణ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, మాజీ స్పీకర్ మీరా కుమార్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్ సహా పలువురు కాంగ్రెస్ అగ్ర నేతలుతో పాటు పార్టీ శ్రేణులు కూడా పటియాలా హౌజ్ కోర్టుకు తరలి వచ్చారు. హేమాహేమీలు తరలిరావడం, గాంధీ కుటుంబానికి సంబంధించిన కేసు విచారణ కావడంతో కోర్టు పరిసరాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. కోర్టులో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు కోర్టు పరిసరాల్లో భారీగా బలగాలను రంగంలోకి దింపారు. ఎస్పీజీ సిబ్బంది కోర్టు ప్రాంగణాన్ని అదుపులోకి తీసుకొని ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. -
సోనియా, రాహుల్‌కు బెయిల్ మంజూరు
-
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ ప్రారంభం
-
సోనియా, రాహుల్‌కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పాటియాల హౌస్ కోర్టు శనివారం వీరిరువురికి బెయిల్ మంజూరు చేసింది. సోనియా, రాహుల్ తరఫున మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ బెయిల్ పత్రాలు సమర్పించారు. ఆ పత్రాలను పరిశీలించిన చెరో 50 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోనియా తరఫున సీనియర్ నేత ఏకే ఆంటోనీ, రాహుల్ గాంధీ తరఫున సోదరి ప్రియాంకా వాద్రా ష్యూరిటీ పత్రాలపై సంతకాలు చేశారు. అంతకుముందు సోనియా, రాహుల్‌లకు బెయిల్ ఇవ్వొద్దని పిటిషనర్ సుబ్రమణ్యస్వామి వాదించారు. శ్యామ్ పిట్రోడాపై నాన్ బెయిల్ వారెంట్ జారీ చేయాలని కోరారు. కాగా సోనియా, రాహుల్ తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సోనియా, రాహుల్ గాంధీలకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను 2016 ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. -
కోర్టుకు హాజరైన సోనియా, రాహుల్
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ నిమిత్తం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం పాటియాల హౌస్ కోర్టుకు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య వీరు కోర్టుకు చేరుకున్నారు. వీరితో పాటు సోనియా కుమార్తె ప్రియాంకా గాంధీ, అల్లుడు రాబర్డ్ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, కపిల్ సిబల్, మీరా కుమార్, షీలా దీక్షిత్, అంబికా సోనీ తదితరులు కోర్టుకు వచ్చారు. అయితే కేసుకు సంబంధించి మాత్రమే కోర్టులోకి అనుమతిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అబద్దాలు ఆడటంలో రాహుల్ నిపుణుడంటూ ఆయన విమర్శించారు. -
సోనియా రాహుల్ హాజిర్ హో
-
సోనియా రాహుల్ హాజిర్ హో
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇద్దరూ నేషనల్ హెరాల్డ్ ఆస్తుల అమ్మకం కేసులో తొలిసారి కోర్టు మెట్లు ఎక్కబోతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో కూడా దీనిపై ఇప్పటికే వేలాది కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్విట్టర్ ట్రెండింగ్ టాపిక్స్‌లో 'సోనియా రాహుల్ హాజిర్ హో' అనేది టాప్ ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. సుబ్రమణ్యం స్వామిని అడ్డం పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తమ మీద కక్ష సాధించాలని చూస్తోందని కాంగ్రెస్ నేతలు మండి పడుతుండగా, తాను కేవలం అవినీతిని అడ్డుకోడానికే కేసు వేశాను తప్ప.. ఇందులో బీజేపీకి ఎలాంటి ప్రమేయం లేదని స్వామి చెబుతున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీలో బాగా ఖరీదైన ఐదుగురు న్యాయవాదులు ఉండగా వాళ్లకు భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియాలో రెండు పార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా కామెంట్లు విపరీతంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 'సోనియా రాహుల్ హాజిర్ హో' హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండ్‌గా నిలిచింది. -
'స్వామి వెనుక బీజేపీ, మోదీ ఉన్నారు'
కాంగ్రెస్ నాయకత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి ఎలా కేసులు ఎలా పెడుతున్నారో దేశ ప్రజలందరికీ తెలుసని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ దీని వెనక ఉన్నారని ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాటియాల కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఈరోజు అందరూ పేపర్లు చదివే ఉంటారు. కేంద్ర ప్రభుత్వం సుబ్రమణ్యం స్వామికి జడ్ కేటగిరీ భద్రత కల్పించింది. స్వామి పార్లమెంటు సభ్యుడు కాదు. సరిహద్దు రాష్ట్రాల్లో కూడా లేరు. ఆయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదు, వాళ్లను ఏమీ అనలేదు, ఉగ్రవాదులను ఆయన చంపలేదు. కేవలం కాంగ్రెస్ నాయకత్వాన్ని కోర్టుకు లాగినందుకు బహుమతిగానే ఆయనకు జడ్ కేటగిరీ భద్రత, ప్రభుత్వ క్వార్టర్స్ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోంది. ఇలా ఇంతకుముందెన్నడూ లేదు. గత ఏడాది కాలంగా గుజరాత్ ప్రతిపక్ష నేత గానీ, హిమాచల్ సీఎం గానీ, ఇప్పుడు పార్లమెంటు మొదలై వారం రోజులు కూడా గడవలేదు, అరుణాచల్ ప్రదేశ్‌లో గవర్నర్‌తో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. కోర్టు అడ్డుపడటంతో ఆగింది. ఢిల్లీలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీబీఐ దాడులు చేస్తున్నారు. ఇతర పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టే కుట్రలు చేస్తున్నారు. మొదట్లో తాము కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే వ్యతిరేకం అన్నారు. ఇప్పుడు మరే ఇతర పార్టీ అన్నది లేకుండా చేయాలని చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్లతో కూడా పోరాడింది' అని అజాద్ అన్నారు. సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్ వాద్రా సహా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అజాద్ ఇంటికి వెళ్లారు. సోనియా, రాహుల్ కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో తదుపరి పర్యవసానాల గురించి చర్చించారు. -
కోర్టు చుట్టూ భారీ భద్రత
-
నాలుగో రోజూ ‘హెరాల్డ్’ దే!
రాజ్యసభను సాగనివ్వని కాంగ్రెస్ ♦ రాహుల్‌పై బీజేపీ సభ్యుడి వ్యాఖ్యలపై లోక్‌సభలో విపక్షం వాకౌట్ ♦ జూలో జంతువుల్లా అరుస్తున్నారు.. కాంగ్రెస్ సభ్యులపై నఖ్వీ విసుర్లు న్యూఢిల్లీ: పార్లమెంట్లో ‘నేషనల్ హెరాల్డ్’ కేసు ప్రకంపనలు శుక్రవారం కూడా కొనసాగాయి. తమ అధినేతలకు ఆ కేసులో సమన్లు జారీ కావడంపై కాంగ్రెస్ సభ్యులు వరుసగా నాలుగో రోజూ రాజ్యసభను స్తంభింపజేశారు. ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభాకార్యక్రమాలను అడ్డుకోవడంతో రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ‘మోదీ.. నీ నియంతృత్వం చెల్లదు.. నీ హిట్లర్గిరీ చెల్లదు’ అంటూ సభను నినాదాలతో హోరెత్తించారు. ఇంధన రంగంపై స్థాయి సంఘం నివేదికను సభకు సమర్పించాల్సి ఉన్న కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్.. వెల్ వద్ద నిరసన తెలుపుతూ ఆ నివేదికను సమర్పించేందుకు నిరాకరించారు. గందరగోళం మధ్యనే పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడి జరిగి 14 ఏళ్లు అయిన విషయాన్ని సభ చైర్మన్ హమీద్ అన్సారీ ప్రస్తావించారు. అలాగే, అవినీతి నిరోధక బిల్లు-2013ను సెలక్ట్ కమిటీకి నివేదించాలన్న తీర్మానాన్ని సభ ఆమోదించింది. సభలో కాంగ్రెస్ సభ్యులు కేకలు వేస్తుండటంపై వారిని వారించిన డెప్యూటీ చైర్మన్ పీజే కురియన్.. అలా కేకలు వేయడం మనుషుల లక్షణం కాదని వ్యాఖ్యానించారు. ‘జంతు ప్రదర్శన శాలలో వినిపించే శబ్దాలు ఈ రోజు సభలో వినిపిస్తున్నాయ’ని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఎద్దేవా చేశారు. ‘వారం క్రితం నినాదాలు చేశారు. ఇప్పుడు కేకలు మాత్రమే వేస్తున్నారు. వారి గొంతు ఆరోగ్యంపై మేం ఆందోళన చెందుతున్నాం. ప్రతిపక్ష నేత వారి గొంతులు బాగుపడేలా మెడిసిన్స్ తెప్పించాలి’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నేషనల్ హెరాల్డ్ కేసు వల్ల పార్లమెంటును కాంగ్రెస్ కావాలనే అడ్డుకుంటోదన్న అభిప్రాయం కలిగేలా ప్రభుత్వం ప్రచారం చేస్తోందని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. ‘మా నిరసన కోర్టులో ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించింది కాదు. ఈ విషయం గతంలో కూడా వివరణ ఇచ్చాను. అయినా మీడియా పట్టించుకోవడం లేదు. కేంద్రమంత్రి వీకే సింగ్ చేసిన ‘కుక్క’ వ్యాఖ్య వల్ల రెండు రోజులు సభ స్తంభించింది. ఇతర కారణాల వల్ల మూడు రోజులు నిరసనలు చోటు చేసుకున్నాయి’ అని ఆజాద్ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ సభ్యుల నినాదాల నేపథ్యంలో ఉదయం 11.30 గంటలకు ఒకసారి, 12 గంటలకు ఒకసారి సభను వాయిదా వేశారు. ఆ తరువాత చైర్మన్ హమీద్ అన్సారీ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు విఫలయత్నం చేశారు. గందరగోళం మధ్యనే మంత్రులు రెండు, మూడు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభను వాయిదా వేశారు. కాగా, మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో సభలో ఎస్సీ, ఎస్టీ(వేధింపుల నిరోధక) సవరణ బిల్లు 2015ను, జువనైల్ జస్టిస్ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే, శుక్రవారం సాయంత్రం సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సభ్యులు టికెట్లు రిజర్వ్ చేసుకుని ఉంటారని, అందువల్ల శుక్రవారం సాయంత్రం 5 దాటిన తరువాత సభను కొనసాగించడం కుదరదు కనుక ఆ బిల్లులను ప్రవేశపెట్టకూడదంటూ విపక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌సభలో.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై బీజేపీ సభ్యుడు వీరేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం లోక్‌సభలో దుమారం చెలరేగింది. వీరేంద్ర సింగ్ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆ సభ్యుడిని సస్పెండ్ చేయాలంటూ కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదంటూ తప్పించుకుంటే సరిపోదని తేల్చిచెప్పారు. వీరేంద్రసింగ్ నుంచి క్షమాపణ చెప్పించే విషయంలో ప్రభుత్వం లేదా స్పీకర్ నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో టీఎంసీ, ఆర్జేడీ, జేడీయూ సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు. సభ ప్రారంభం కాగానే ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, ప్లకార్డులతో కాంగ్రెస్ సభ్యులు వెల్‌ను చుట్టుముట్టారు. అయితే స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. జీరో అవర్‌లో లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఖర్గేకు మాట్లాడే అవకాశమిచ్చారు. రాహుల్‌తో పాటు, నెహ్రూ, గాంధీ కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వీరేంద్రసింగ్ విచారం వ్యక్తం చేయడం కానీ, క్షమాపణ చెప్పడం కానీ చేయకపోవడాన్ని ఖర్గే తప్పుబట్టారు. వీరేంద్రతో క్షమాపణ చెప్పిస్తే.. సభ సజావుగా సాగుతుంది కదా! అని టీఎంసీ సభ్యుడు సుదీప్ సూచించగా.. ‘ఆ గ్యారంటీ మీరివ్వగలరా?’ అంటూ కాంగ్రెస్ సభ్యులపై స్పీకర్ మండిపడ్డారు. తర్వాత టీఎంసీ, ఆర్జేడీ, జేడీయూ సభ్యులతో కలిసి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. హెరాల్డ్ కేసును పీఎంఓ ప్రేరేపితమని, దీన్ని న్యాయమార్గంలో ఎదుర్కొంటామని రాహుల్ గువాహటిలో అన్నారు. పార్లమెంటు సమాచారం 8 చెక్ జారీ అయిన దగ్గర కాకుండా, దాన్ని నగదుగా మార్చుకునే చోటే చెక్ బౌన్స్ కేసులను నమోదు చేయాలన్న బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్(సవరణ) బిల్లును లోక్‌సభ గతంలోనే ఆమోదించినప్పటికీ.. గతవారం రాజ్యసభ కొన్ని మార్పులతో తిరిగి పంపడంతో శుక్రవారం మళ్లీ ఆమోదం తెలిపింది. చెక్ జారీ చేసిన బ్రాంచ్ ఉన్న ప్రాంతంలోనే చెక్ బౌన్స్ కేసు వేయాలంటూ గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా 18 లక్షల చెక్ బౌన్స్ కేసులున్నాయి. 8గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపేయాలని బీజేడీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు కారణంగా ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఉన్న అనేక గిరిజన ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని బీజేడీ సభ్యుడు భర్తృహరి మహతాబ్ ఆందోళన వ్యక్తం చేశారు. 8 84 నుంచి సియాచిన్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో 869 మంది సైనికులు మృత్యువాత పడ్డారని రక్షణ శాఖ సహాయమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సభకు తెలిపారు. 8 కశ్మీరీ పండిట్లకు తక్షణ పునరావాసానికి సంబంధించిన తీర్మానాన్ని లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. పీఓకేకు వలసవెళ్లిన వారికీ ఈ పునరావాస పథకం వర్తిస్తుంది. 8 14 ఏళ్ల క్రితం పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి పార్లమెంటు ఉభయసభలు శుక్రవారం నివాళులర్పించాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరులో నిబద్ధతను పునరుద్ఘాటించాయి. -
ప్రభుత్వం కక్షసాధింపునకు పాల్పడుతోంది
-
'మోదీ సర్కార్‌ను నడిపేది సుబ్రహ్మణ్యమే'
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో తమ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్డీయే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీపై ముప్పేట దాడికి దిగారు. బుధవారం రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ప్రధాని నరేంద్రమోదీపై విరుచుపడుతూ మోదీ సర్కార్‌ను బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి నడుపుతున్నారని అన్నారు. ఆగస్టులోనే ఈడీ ఈ కేసును మూసివేసిందని, కావాలనే కొత్త డైరెక్టర్ ను నియమించుకొని బీజేపీ తమపై కక్షకు దిగిందని ఆయన ఆరోపించారు. ఎన్డీయే ప్రజాస్వామ్యాన్ని నలిపేసిందని, వదించిందని, ఖూనీ చేసిందంటూ పరుష పదాలను ఉపయోగించారు. -
'లెక్చర్ దంచొద్దు'
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసుపై రాజ్యసభలో వరుసగా రెండో రోజు అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. తమ పార్టీ నేతలపై బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు బుధవారం సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వీరికి మద్దతు తెలపడంతో సభలో గందరగోళం రేగింది. నేషనల్ హెరాల్డ్ కేసు ఇద్దరు వ్యక్తులకు సంబంధించిందని, దీన్ని కోర్టు చూసుకుంటుందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. తమకు లెక్చర్ ఇవ్వడం మానుకోవాలని నఖ్వీకి తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రీన్ సూచించారు. ఈ కేసును ఈడీ చీఫ్ మూసేశారని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఆయనను బదిలీ చేసి కొత్తగా మరొకరిని ఈడీ చీఫ్ గా నియమించి కేసు విచారణను మళ్లీ ప్రారంభించిందని ఆజాద్ ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్యుద్ధంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. -
'డెమొక్రసీ కాదు మొబొక్రసీ'
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగించేలా కాంగ్రెస్ వ్యవరిస్తోందని విమర్శించారు. తమ ప్రభుత్వం ఎవరినీ వేధింపులకు గురిచేయడం లేదని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై పరోక్షంగా దాడి చేస్తోందని మండిపడ్డారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మొదలైందని గుర్తు చేశారు. 'కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్నది డెమొక్రసీ కాదు మొబొక్రసీ. ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ నుంచి ముప్పు పొంచివుంది. మోదీ సర్కారు దెబ్బతీస్తున్నామని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ వారు దెబ్బతీస్తున్నది ఇండియాను' అని వెంకయ్య నాయుడు అన్నారు. -
పార్లమెంట్లో నేషనల్ హెరాల్డ్ రగడ
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ రగడ రెండోరోజు కొనసాగింది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ బుధవారం ఉదయం కాంగ్రెస్ సభ్యులు నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌పై కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్‌పై కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. రాజ్యసభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించవద్దని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన సభను 11.30 గంటల వరకూ వాయిదా వేశారు. మరోవైపు లోక్ సభలోనూ నేషనల్ హెరాల్డ్ కేసుపై గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య సమావేశాలు కొనసాగుతున్నాయి. -
పాపం సోనియానా.. కోర్టుకా!
ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రులలో మొదటి వరుసలో ఉండే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి.. ఉన్నట్టుండి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అంటే ఎల్లమాలిన ప్రేమ, జాలి వచ్చేశాయి. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల అమ్మకానికి సంబంధించిన కేసులో తప్పనిసరిగా సోనియా, రాహుల్ ఇద్దరూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు కూడా చెప్పడంతో వాళ్లు తొలిసారి కోర్టు గుమ్మం తొక్కాల్సి వస్తోంది. దాదాపుగా దేశానికి ప్రధానమంత్రి కాబోయి.. కొద్దిలో తప్పిపోయినా.. వెనక నుంచి చక్రం తిప్పిన సోనియాగాంధీకి ఎంతటి కష్టం వచ్చిందని మమతా బెనర్జీ తెగ బాధపడిపోయారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని తాను కలుస్తానని, సోనియాగాంధీకి కూడా ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతానని అన్నారు. అయితే.. వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పొత్తుపెట్టుకుంటుందో.. అలా జరిగితే ఓట్లు చీలిపోయి తమకు నష్టం కలుగుతుందోనని మమతమ్మ భయపడుతున్నారన్నది విశ్వసనీయ సమాచారం. అందుకే ఎందుకైనా మంచిదని ముందుగానే సోనియమ్మను ప్రసన్నం చేసుకోడానికే ఇలా జాలి ఒలకబోశారా అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు గందరగోళం నడుమ మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో నేషనల్ హెరాల్డ్ కేసుపైన చర్చించాల్సిందిగా కాంగ్రెస్ డిమాండ్ చేయటంతో కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. రాజ్యసభలో నేషనల్ హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ చర్చకు పట్టుబట్టడంతో రాజ్యసభ మధ్యాహ్నం 12.30 గంటల వరకు వాయిదా పడింది. అదేవిధంగా లోకసభలోనూ అదేవిషయంపై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడంతో లోకసభ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది. -
'ఇందిర కోడలిని.. ఎవరికీ భయపడను'
న్యూఢిల్లీ: 'దివంగత ప్రధాని ఇందిరా గాంధీ కోడలిని.. ఎవరికీ భయపడను' అని ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సోనియా పైవిధంగా స్పందించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధులు దుర్వినియోగం చేశారంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్మామి దాఖలు చేసిన కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కి సమన్లు వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరూ మంగళవారం పాటియాల కోర్టుకు హాజరుకావాల్సిఉండగా, ఇద్దరూ గైర్హాజరయ్యారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని సోనియా ఆరోపించారు. -
‘హెరాల్డ్’ సమన్లపై సోనియా, రాహుల్ పిటిషన్
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో పాటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన సమన్లను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాల్ చేశారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ హెరాల్డ్ నిధుల దుర్వినియోగం కేసులో ఆగస్టు 7న స్వయంగా విచారణకు హాజరుకావాలంటూ పాటియాలా కోర్టు పలువురు కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిందితులకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నందున వారంతా విచారణకు హాజరుకావాల్సిందిగా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గోమతి మనోచా గత నెలలో ఆదేశాలిచ్చారు. -
ఢిల్లీ హైకోర్టులో సోనియా, రాహుల్ పిటిషన్
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ నిధుల దుర్వినియోగం కేసుకు సంబంధించి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింగ్‌లు ఈ కేసును వాదించే అవకాశం ఉంది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన నిధులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దుర్వినియోగం చేసినట్లు బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు చేసిన నేపధ్యంలో వారిద్దరికి కోర్టు సమన్లు జారీ చేసింది. దాంతో సోనియా, రాహుల్ ఇద్దరూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.