
సోనియా గాంధీ - రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ నిధుల దుర్వినియోగం కేసుకు సంబంధించి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింగ్లు ఈ కేసును వాదించే అవకాశం ఉంది.
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన నిధులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దుర్వినియోగం చేసినట్లు బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు చేసిన నేపధ్యంలో వారిద్దరికి కోర్టు సమన్లు జారీ చేసింది. దాంతో సోనియా, రాహుల్ ఇద్దరూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.