న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్- ఏజేఎల్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం మరోమారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో కలిసి వచ్చారు సోనియా. సోనియా గాంధీ ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమెకు సహాయకారిగా ఉండేందుకు ప్రియాంకకు ఈడీ అనుమతిచ్చింది.
గత గురువారం నేషనల్ హెరాల్డ్ కేసులో తొలిసారి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు సోనియా గాంధీ. దాదాపు మూడు గంటల పాటు సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. అనంతరం సోమవారం మరోమారు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది ఈడీ. ఆ తర్వాత మంగళవారానికి విచారణ తేదీని మార్చింది.
ఇదీ చదవండి: సోనియా గాంధీ గురించి అలా మాట్లాడుతారా? బీజేపీ యాంటీ వుమెన్: జైరాం రమేశ్
Comments
Please login to add a commentAdd a comment