పార్లమెంట్లో నేషనల్ హెరాల్డ్ రగడ
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ రగడ రెండోరోజు కొనసాగింది. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ బుధవారం ఉదయం కాంగ్రెస్ సభ్యులు నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్పై కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్పై కక్ష సాధింపు చర్యకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. రాజ్యసభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించవద్దని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన సభను 11.30 గంటల వరకూ వాయిదా వేశారు.
మరోవైపు లోక్ సభలోనూ నేషనల్ హెరాల్డ్ కేసుపై గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య సమావేశాలు కొనసాగుతున్నాయి.