కోర్టుకు హాజరైన సోనియా, రాహుల్ | sonia gandhi, rahul gandi reaches patiala house court | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన సోనియా, రాహుల్

Published Sat, Dec 19 2015 2:38 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

కోర్టుకు హాజరైన సోనియా, రాహుల్ - Sakshi

కోర్టుకు హాజరైన సోనియా, రాహుల్

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ నిమిత్తం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం పాటియాల హౌస్ కోర్టుకు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య వీరు కోర్టుకు చేరుకున్నారు. వీరితో పాటు సోనియా కుమార్తె ప్రియాంకా గాంధీ, అల్లుడు రాబర్డ్ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, కపిల్ సిబల్, మీరా కుమార్, షీలా దీక్షిత్, అంబికా సోనీ తదితరులు కోర్టుకు వచ్చారు.

 

అయితే కేసుకు సంబంధించి మాత్రమే కోర్టులోకి అనుమతిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అబద్దాలు ఆడటంలో రాహుల్ నిపుణుడంటూ ఆయన విమర్శించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement