Patiala House court
-
ఎయిర్ ఇండియా ‘మూత్ర విసర్జన’ ఘటనలో కొత్త కోణం
ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. మద్యం మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా.. తను ఆమె పట్ల ఆ విధంగా ప్రవర్తించలేదని తెలిపాడు. వాస్తవానికి వృద్ధురాలిపై తాను మూత్ర విసర్జన చేయలేదని.. ఆ మహిళే తన సీట్లో మూత్ర విసర్జన చేసుకుందని ఢిల్లీ పాటియాలా కోర్టుకు శుక్రవారం వెల్లడించారు. వృద్ధ మహిళ తనను తానే మూత్ర విసర్జన చేసుకుని తనపై ఆరోపణలు చేస్తోందని ఆరోపించాడు. ఈ మేరకు కోర్టులో మిశ్రా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. వృద్ధురాలు తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మూత్ర విసర్జన చేసిందని పేర్కొన్నారు. ఆ మహిళ 30 ఏళ్లుగా భరతనాట్యం నృత్యకారిణి అని, వారికి మూత్ర విసర్జన సమస్య రావడం సహజమేనని కోర్టుకు తెలిపారు. కాగా విచారణ నిమిత్తం శంకర్ మిశ్రాను కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు పాటియాలా హౌస్ కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు అతనికి బుధవారం నోటీసులు జారీ చేసింది. అంతేగాక మిశ్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కోర్టు నోటీసులపై విచారణ సందర్భంగా మిశ్రా పై వ్యాఖ్యలు చేశాడు. చదవండి: 12 రోజుల్లోనే 5.4 సె.మీ కుంగిపోయిన జోషిమఠ్.. వాళ్లకు ఆర్థిక సాయం అసలేం జరిగిందంటే.. గతేడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో మద్యం మత్తులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి సహప్రయాణికురాలికి మూత్ర విసర్జన చేశాడు. ఎయిరిండియాకు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు జనవరి 4న మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మిశ్రా పరారీలో ఉన్నాడు. దీంతో పోలీసులు అతనిపై లుకౌట్ పోలీసులు జారీ చేసిన తర్వాత నిందితుడిని బెంగళూరులో అరెస్టు చేశారు.ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ఇంఇయాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది, ఈ చర్య అనంతరం మిశ్రాను ఉద్యోగంలో నుంచి తీసేశారు. మిశ్రాను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ శనివారం కోర్టు ఆదేశించింది. -
ఉరితీయొద్దు.. సరిహద్దుకు పంపండి
న్యూఢిల్లీ: ‘‘వాళ్లను భారత్- పాకిస్తాన్ సరిహద్దుకు పంపండి లేదా డోక్లాంకు పంపండి. అంతేగానీ వాళ్లను ఉరితీయకండి. వాళ్లు దేశ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని నిర్భయ దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తాను అఫిడవిట్ దాఖలు చేస్తానని పేర్కొన్నారు. డిసెంబరు 16, 2012లో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు రామ్ సింగ్, ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ సహా ఓ మైనర్ సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. తీవ్ర గాయాలతో ప్రాణాలతో పోరాడుతూ బాధితురాలు సింగపూర్‌లోని ఆస్పత్రిలో కన్నుమూసింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఈ కేసులో ప్రధాన దోషి రామ్‌సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకోగా... మైనర్ విడుదలయ్యాడు. మిగిలిన నలుగురు దోషులు ముఖేశ్, పవన్, అక్షయ్, వినయ్‌లకు ఉరిశిక్ష ఖరారు కాగా అనేక పరిణామాల అనంతర, మూడుసార్లు ఉరిశిక్ష అమలు వాయిదా పడిన తర్వాత.. తాజాగా మార్చి 20న ఉరితీత ఖరారు చేస్తూ డెత్‌వారెంట్లు జారీ అయ్యాయి. (వాళ్లకు ఏ అవకాశాలు లేవన్న కోర్టు.. కానీ మళ్లీ) ఈ క్రమంలో వారిని శిక్ష నుంచి తప్పించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్న ఏపీ సింగ్.. వరుస పిటిషన్లు, రివ్యూ పిటిషన్లు వేయిస్తూ వారికి అండగా నిలిచారు. ఇక తాజాగా నిర్భయ దోషులకు ఎటువంటి చట్టపరమైన అవకాశాలు లేవంటూ ఢిల్లీ కోర్టు పేర్కొనగా.. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లను పటియాలా హౌజ్ కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో కోర్టు ప్రాంగణంలో ఏపీ సింగ్ మాట్లాడుతూ.. నిర్భయ దోషులు సైనికుల్లా పనిచేస్తారని.. వారికి దేశ సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరడం విశేషం. కాగా నిర్భయ ఘటన జరిగిన సమయంలో దోషులను సమర్థించిన ఏపీ సింగ్.. రాత్రిపూట అమ్మాయిలు బయట తిరిగితే ఇలాంటి ఘటనలే జరుగుతాయని... తన కూతురు ఇలా బాయ్‌ఫ్రెండ్‌తో తిరిగితే చంపేసే వాడినంటూ లింగవివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా నిర్భయ దోషులు ఉగ్రవాదులు కాదని.. వారిని క్రూరమైన నేరస్తులుగా చిత్రీకరించి ఎప్పుడో చంపేశారని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (దోషులను నాలుగుసార్లు చంపేశారు : ఏపీ సింగ్) నిర్భయ: ‘బతకాలని లేదు.. నేను చచ్చిపోతా’ AP Singh, 2012 Delhi gangrape case convicts lawyer before Patiala House Court: Send them to Indo-Pak border, send them to Doklam, but don't hang them. They are ready to serve the country. I can file an affidavit in this regard. (file pic) pic.twitter.com/6FMSxcpn9e — ANI (@ANI) March 19, 2020 -
అగస్టా కేసు: త్యాగికి బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : అగస్టా వెస్ట్‌లాండ్ మనీ ల్యాండరింగ్ కేసులో వైమానిక దళ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి, ఆయన సోదరులకు పటియాలా హౌస్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. రూ లక్ష వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని కోర్టు కోరింది. రూ 3600 కోట్ల అగస్టా ఒప్పందంలో పలు అక్రమ మార్గాల్లో కాంట్రాక్టును పొందేందుకు కోట్ల మొత్తం చేతులు మారాయని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ కేసులో దాఖలైన చార్జిషీట్‌ను పరిశీలించిన అనంతరం కోర్టు ఎదుట హాజరు కావాలని 30 మందికి పైగా నిందితులకు ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ సమన్లు జారీ చేశారు. కాగా అగస్టా స్కామ్‌తో సంబంధం ఉన్న విదేశీ సంస్థలు, వ్యక్తులు బుధవారం కోర్టు ఎదుట హాజరుకాలేదు. భారత వైమానిక దళానికి 12 ఏడబ్ల్యూ-101 హెలికాఫ్టర్లను సరఫరా చేసేందుకు భారత ప్రభుత్వంతో 2010లో అగస్టావెస్ట్‌ల్యాండ్ రూ 3546 కోట్ల కాంట్రాక్టుపై సంతకాలు చేసింది. వీటిలో ఎనిమిది హెలికాఫ్టర్లు రాష్ట్రపతి, ప్రధాని వంటి వీవీఐపీల ప్రయాణానికి ఉద్దేశించినవి కావడం గమనార్హం. ఈ ఒప్పందంలో 34 మంది వ్యక్తులు, సంస్థలు అక్రమ పద్ధతుల్లో పాలుపంచుకున్నారని మనీల్యాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది. త్యాగి భాగస్వామిగా ఉన్న కంపెనీ ఈ ఒప్పందంలో రూ కోటి ముడుపులు అందుకుందని ఈడీ చార్జిషీట్లో ఆరోపించింది. -
విజయ్ మాల్యాకు గట్టి హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు రుణాల ఎగవేతదారుడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఢిల్లీ న్యాయస్థానం హెచ్చరికలు జారీ చేసింది. ఫెరా కేసులో డిసెంబర్ 18లోపు తమ ఎదుట హాజరుకావాలంటూ పటియాలా హౌజ్ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మాల్యాకు ఇదే చివరి అవకాశమని న్యాయమూర్తి పేర్కొనటం విశేషం. ఫెరా ఉల్లంఘనలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టోరేట్ నమోదు చేసిన ఓ కేసులో ఆయన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. గడువు తేదీలోగా హాజరుకాని పక్షంలో మాల్యాను ఆర్థిక నేరంలో దోషిగా భావించాల్సి ఉంటుందని బెంచ్ వ్యాఖ్యానించింది. కాగా, ఆర్థిక నేరస్తుడిగా మాల్యాను ప్రకటించాలని ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టోరేట్ విభాగం నిన్న కోర్టు కోర్టును ఆశ్రయించింది. ఇక ఈ ఏప్రిల్‌లోనే ఢిల్లీ కోర్టు మాల్యా పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీచేసిన విషయం తెలిసిందే. తాజాగా పాటియాలా కోర్టు జారీ చేసిన దాంతో కలిపి ఇప్పటిదాకా మొత్తం ఆరు వారెంట్లు లిక్కర్ కింగ్‌పై జారీ అయ్యాయి. అదే సమయంలో కోర్టు రెండు నెలల్లోగా ఈ కేసు పురోగతికి సంబంధించిన సాక్షి పూర్తి వివరాలు అందజేయాలని ఈడీని ఆదేశించింది. ఆరోపణలు ఏంటంటే... మాల్యా 1996,97,98 సంవత్సరాలకు గానూ ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ రేసుల్లో కింగ్ ఫిషర్ లోగోను ప్రదర్శించారు. అందుకుగానూ సుమారు 2 లక్షల అమెరికన్ డాలర్లను మాల్యా.. ఓ బ్రిటిష్ కంపెనీ, యూరోపియన్ సంస్థలకు చెల్లించారు. అయితే ఆర్బీఐ అనుమతి లేకుండా ఫెరా నిబంధనలను ఉల్లంఘిస్తూ మాల్యా డబ్బు చెల్లించారిన ఈడీ ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది. -
భత్కల్‌పై నేడు మరొకటి
సాక్షి, న్యూఢిల్లీ : జమా మసీద్ పేలుడు కేసులో పటియాలా హౌజ్ కోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఉగ్రవాది, ఇండియన్ ముజాహిద్దీన్ చీఫ్ యాసిన్ భత్కల్‌పై ఆరోపణలను నమోదు చేయనుంది. భత్కల్‌తోపాటు అతని కుడి భుజంగా చెప్పుకునే అసదుల్లాపై పేరును కూడా జత చేయనుంది. సెప్టెంబర్ 19, 2010లో జమా మసీద్ గేట్ వద్ద బైక్ పై వచ్చిన ఇద్దరు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు తైవాన్ జాతీయులు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాదు మసీద్ సమీపంలో ఓ కారులో బాంబు పెట్టి పేలుడు జరిపారు. ఈ దాడి వెనుక యాసిన్ భత్కల్ ఉన్నాడన్నది ప్రధాన ఆరోపణ. ఇక ఇదే కేసులో భత్కల్‌తోపాటు.. అసదుల్లా అక్తర్ పై కూడా ఆరోపణలను కోర్టు నమోదు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే సాక్ష్యులను విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకోబోతోంది. ఈ ఏడాది ఆగష్టు 1న ఈ కేసు విచారణ సందర్భంగా సరైన సాక్ష్యాలు లేకపోవటంతో ముగ్గురిని కోర్టు విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన యాసిన్ భత్కల్ పై మొత్తం 10 బాంబు కేసులు నమోదు అయ్యాయి. 2008 ఢిల్లీ, 2010 వారణాసి, బెంగళూరు స్టేడియం ఇలా వరుస పేలుళ్ల వెనుక ప్రధాన నిందితుడిగా ఉండగా, 2006 ముంబై వరుస రైళ్లు పేలుళ్లు, 2012 పుణే పేలుళ్ల కేసులో అనుమానితుడిగా ఉన్నాడు. బెంగళూర్‌లో జన్మించిన భత్కల్.. తర్వాత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా తయారవ్వగా... 2013 ఆగష్టు 28న నేపాల్ సరిహద్దులో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఎన్ఐఏ కోర్టు డిసెంబర్ 19, 2016 అతనికి మరణశిక్ష విధించింది. -
సీఎంకు, ఆయన భార్యకు బెయిలివ్వొద్దు
అక్రమాస్తుల కేసులో సీబీఐ వాదన న్యూఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తులు కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్, ఆయన భార్య సోమవారం పటియాల హౌస్ కోర్టు ముందు హాజరయ్యారు. తమకు బెయిల్ ఇవ్వాలని వారితోపాటు మిగత నిందితులు కోర్టులో దరఖాస్తు చేశారు. అయితే, వారికి షాక్ ఇస్తూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. సీఎం వీరభద్రసింగ్, ఆయన భార్యకు బెయిల్ ఇవ్వవద్దని, బెయిల్ ఇస్తే వారు కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందని వాదించింది. ప్రస్తుతం న్యాయస్థానం ఈ విషయంలో ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలను వింటోంది. గత యూపీఏ-2 ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రిగా వీరభద్రసింగ్ పనిచేశారు. ఆ సమయంలో 2009 నుంచి 2011 మధ్య ఆయన, కుటుంబ సభ్యులు కలిసి రూ.10 కోట్ల దాకా అక్రమాస్తులు కూడబెట్టారని సీబీఐ 2015 సెప్టెంబర్‌లో కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే రూ.14 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. -
ఒమర్ అబ్దుల్లా మాజీ భార్యకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాజీ భార్య పాయల్ అబ్దుల్లాకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ నివాసం ఖాళీ చేయాల్సిందేనని ఆమెను పాటియాలా హౌస్ కోర్టు మంగళవారం ఆదేశించింది. ఢిల్లీలో ఆమె నివాసం ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి వెళ్లాలని జమ్మూకశ్మీర్ ఎస్టేట్ అధికారి ఇచ్చిన నోటీసును రద్దుచేయాలని పాయల్ పెట్టుకున్న పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఢిల్లీలోని అక్బర్ రోడ్డు 7లో ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయాలని జూన్ 30న ఆమెకు నోటీసు ఇచ్చారు. ఒమర్, పాయల్ 1994లో పెళ్లి చేసుకున్నారు. 2011, సెప్టెంబర్ లో విడిపోయారు. -
మాల్యాకు వార్నింగ్
న్యూఢిల్లీ: కార్పొరేట్ రుణ ఎగవేతదారుడు, బ్రిటన్‌లో తలదాచుకుంటున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యాపై మరోసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు పాటియాలా హౌస్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నవంబర్ 4న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. లండన్ లో ఉన్న మాల్యాకు వారెంట్ అందేలా చూడాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కోర్టుకు హాజరుకాకుంటే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. ఇప్పటికే పలు కోర్టులు మాల్యాకు బెయిల్ కు వీలుకాని వారెంట్లు జారీ చేశాయి. సుప్రీంకోర్టు కూడా నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఆయన ఏ కోర్టులోనూ హాజరుకాలేదు. కాగా, ముంబైలోని కింగ్‌ఫిషర్ హౌస్ ను రూ.135 కోట్లకు వేలం వేసినా ఎవరూ కొనేందుకు ముందుకు రాలేదు. -
బీజేపీ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయాలి: ఢిల్లీ అసెంబ్లీ కమిటీ
న్యూఢిల్లీ: పటియాలా హౌజ్ కోర్టు ఆవరణలో సీపీఐ కార్యకర్తపై దాడి కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆప్ మహిళా ఎమ్మెల్యే అల్కా లాంబాపై అభ్యంతరక వ్యాఖ్యల కేసులో.. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దుచేయాలని ఢిల్లీ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. గతేడాది ఈ ఘటన జరగటంతో.. ఆగ్రహించిన స్పీకర్ రామ్ నివాస్ గోయల్.. శర్మను శీతాకాల సమావేశాలనుంచి బహిష్కరించారు. ఈ వివాదాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి ప్రతిపాదించారు. దీనిపై విచారించిన కమిటీ.. శర్మను తొలగించాలని సూచించింది. -
కన్హయ్యను ఎవరూ కొట్టలేదు: బస్సీ
న్యూఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ను పాటియాలా కోర్టుకు తీసుకువస్తుండగా అతడిని ఎవరూ కొట్టినట్లు తాను భావించడంలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ బుధవారం పేర్కొన్నారు. కన్హయ్య కుమార్ కు వ్యతిరేకంగా తమ వద్ద తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని బస్సీ మరోసారి స్పష్టం చేశారు. విద్యార్థి నాయకుడ్ని కోర్టుకు తీసుకెళ్తుండగా పరిస్థి కాస్త అదుపుతప్పిందని అయితే, ఆ సమయంలో ఎవరూ కన్హయ్యపై దాడి చేసినట్లు తాను అనుకోవడం లేదన్నారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ మీడియాతో మాట్లాడారు. విద్యార్థి సంఘం నాయకుడ్ని పాటియాలా హౌస్ కోర్టుకు పటిష్ట భద్రతతో తీసుకొచ్చామన్నారు. అయితే, అనుకోకుండా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో ఆ సమయంలో కన్హయ్య తన చెప్పులు పోగొట్టుకున్నాడని వివరించారు. ఈ వివాదంలో కేవలం జేఎన్‌యూ విద్యార్థులే కాక మరికొంతమంది బయటివాళ్లు కూడా ఈ ఘటనలో ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, ఈ కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నామని చెప్పారు. తమవద్ద గట్టి ఆధారాలున్నాయని, ఎలాంటి పక్షపాతం లేకుండానే తాము ఈ కేసు విషయంలో ముందుకు వెళ్తున్నామని బస్సీ తెలిపారు. -
కన్హయ్యకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ
న్యూఢిల్లీ : జెఎన్యూ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ జ్యూడీషియల్ కస్టడీ మార్చి 2వ తేదీ వరకూ కోర్టు పొడిగించింది. కాగా దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన కన్హయ్య కుమార్ రిమాండ్ నేటితో ముగియటంతో అతడిని ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు యత్నిస్తుండగా అక్కడే ఉన్న కొందరు న్యాయవాదులు అతడిపై దాడికి దిగారు. అతన్ని చుట్టుముట్టిన పలువురు న్యాయవాదులు పిడిగుద్దులు కురిపించారు. లాయర్ల బారి నుంచి అతడిని తప్పించేందుకు పోలీసులు యత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో అతడు గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. పాటియాల హౌస్ కోర్టులో తాజా ఘటనలపై విచారణ పరిశీలనకు ఆరుగురు సీనియర్ సభ్యులతో కూడిన బృందాన్ని నియమిస్తూ జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అభయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా అంతకు ముందు జెఎన్యూ విద్యార్థులకు, న్యాయవాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, మరోవైపు న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోయి దాడికి దిగారు. ఈ ఘటనలో విద్యార్థులతో పాటు ఓ జర్నలిస్టు కూడా గాయపడ్డాడు. -
రణ రంగంగా పాటియాల హౌస్ కోర్టు
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం ఢిల్లీ కోర్టు ప్రాంగణాన్ని రణరంగం చేసింది. అక్కడికి వచ్చిన లాయర్లు కొంతమంది జేఎన్‌యూవిద్యార్థులపై, టీచర్లపై దాడులు చేశారు. కాళ్లతో తన్నుతూ, చేతులతో గుద్దుతూ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు. అసలు దేశానికి వ్యతిరేకంగా ఎలా ర్యాలీలు నిర్వహిస్తారని హెచ్చరిస్తూ భౌతికదాడులకు దిగారు. ఈ చర్యలను చూస్తూ పోలీసులు మిన్నకుండిపోయారే తప్ప ఏ ఒక్కరూ అడ్డుకునే సాహసం చేయలేదు. సాక్షాత్తు బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ కూడా ఓ గుర్తు తెలియని వ్యక్తిని కొట్టారు. దేశ ద్రోహానికి పాల్పడ్డాడనే ఆరోపణల కిందట జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ మరికొందరు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని సోమవారం ఢిల్లీలోని పాటియాలా కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకురావడానికి కొద్ది సేపటి ముందే ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలకు మధ్య కోర్టు ప్రాంగణంలో ఘర్షణ ప్రారంభమైంది. అనంతరం ఇందులో అక్కడికి చేరుకున్న కొంతమంది న్యాయవాదులు కూడా ఏబీవీపీ కార్యకర్తలతో కలిసి అక్కడి విద్యార్థులు, టీచర్లపై దాడులు చేశారు. ఈ ఘటనలను వీడియో తీస్తున్న జర్నలిస్టులపై కూడా వారు తమ ప్రతాపాన్ని చూపించారు. వారి చేతులోని మొబైల్ ఫోన్స్ లాక్కోని పగులగొట్టారు. ఈ ఘటనపట్ల పలు వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. -
చివరకు న్యాయమే గెలుస్తుంది: సోనియా
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, అయితే చివరకు న్యాయమే గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. దేశ పౌరులుగా ఏం చేయాలో తాము అదే చేశామన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ మంజూరు అనంతరం సోనియా, రాహుల్ శనివారం ఏఐసీసీ కార్యాలయం వద్ద ప్రెస్మీట్లో మాట్లాడారు. చట్టాన్ని తాము గౌరవిస్తామని, కోర్టులో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని సోనియా అన్నారు. ప్రతిపక్షాన్ని ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని, కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆమె ఆరోపించారు. కేసులకు భయపడేది లేదని సోనియా స్పష్టం చేశారు. తాము స్వచ్ఛమైన మనసుతో కోర్టుకు హాజరయ్యామని ఆమె తెలిపారు. రాజకీయ ప్రతికార చర్యలను తాము ధైర్యంగా ఎదుర్కొంటామని సోనియా పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందన్నారు. కేంద్రం తమపై అన్నిరకాల అస్త్రాలు ప్రయోగిస్తుందన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాము చట్టాన్ని గౌరవిస్తామని అన్నారు. ప్రధాని మోదీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, బెదిరింపులకు వెనకడుగు వేసేది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. తమపై ఒత్తిడి తేవాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ఆ ఒత్తిళ్లకు లొంగకపోవడంతో కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా... ప్రజల కోసమే తమ పోరాటం సాగుతుందని, ప్రతిపక్షంగా తమ పాత్ర తాము పోషిస్తున్నామన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యలతో ప్రతిపక్షాన్ని అణచలేరన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుందన్నారు. సోనియా, రాహుల్‌కు కాంగ్రెస్ పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ భావ జాలాన్ని తాము ఎన్నడూ వీడేది లేదన్నారు. మరోవైపు సోనియా, రాహుల్‌కు బెయిల్ మంజూరు కావటంతో ఏఐసీసీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. -
చివరకు న్యాయమే గెలుస్తుంది
-
కోర్టులో 5 నిమిషాలు మాత్రమే...
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో తొలిసారిగా కోర్టు మెట్లు ఎక్కిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కేవలం 5 నిమిషాలు మాత్రమే న్యాయస్థానంలో ఉన్నారు. ఈ కేసులో వాదనలు అయిదు నిమిషాల్లోనే ముగిశాయి. పాటియాల హౌస్ కోర్టులో శనివారం సోనియా, రాహుల్ తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. సోనియా, రాహుల్‌తో సహా ఈ కేసులో ఏడుగురికి బెయిల్ మంజూరు అయింది. మరోవైపు కేసు విచారణ సందర్భంగా కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది. కాగా సోనియా కుమార్తె ప్రియాంకా వాద్రా, అల్లుడు రాబర్ట్ వాద్రాలు సోనియా కంటే ముందుగానే కోర్టుకు వచ్చారు. కాగా ఈ కేసుకు సంబంధించి రాహుల్, సోనియాలు బెయిల్ తీసుకుంటారా, అరెస్ట్ అవుతారా అనే దానిపై కాంగ్రెస్ పార్టీ చివరివరకూ వ్యూహత్మకంగా వ్యవహరించింది. కేసు విచారణ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, మాజీ స్పీకర్ మీరా కుమార్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్ సహా పలువురు కాంగ్రెస్ అగ్ర నేతలుతో పాటు పార్టీ శ్రేణులు కూడా పటియాలా హౌజ్ కోర్టుకు తరలి వచ్చారు. హేమాహేమీలు తరలిరావడం, గాంధీ కుటుంబానికి సంబంధించిన కేసు విచారణ కావడంతో కోర్టు పరిసరాల్లో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. కోర్టులో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు కోర్టు పరిసరాల్లో భారీగా బలగాలను రంగంలోకి దింపారు. ఎస్పీజీ సిబ్బంది కోర్టు ప్రాంగణాన్ని అదుపులోకి తీసుకొని ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. -
సోనియా, రాహుల్‌కు బెయిల్ మంజూరు
-
నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ ప్రారంభం
-
సోనియా, రాహుల్‌కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పాటియాల హౌస్ కోర్టు శనివారం వీరిరువురికి బెయిల్ మంజూరు చేసింది. సోనియా, రాహుల్ తరఫున మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ బెయిల్ పత్రాలు సమర్పించారు. ఆ పత్రాలను పరిశీలించిన చెరో 50 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోనియా తరఫున సీనియర్ నేత ఏకే ఆంటోనీ, రాహుల్ గాంధీ తరఫున సోదరి ప్రియాంకా వాద్రా ష్యూరిటీ పత్రాలపై సంతకాలు చేశారు. అంతకుముందు సోనియా, రాహుల్‌లకు బెయిల్ ఇవ్వొద్దని పిటిషనర్ సుబ్రమణ్యస్వామి వాదించారు. శ్యామ్ పిట్రోడాపై నాన్ బెయిల్ వారెంట్ జారీ చేయాలని కోరారు. కాగా సోనియా, రాహుల్ తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సోనియా, రాహుల్ గాంధీలకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను 2016 ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. -
కోర్టుకు హాజరైన సోనియా, రాహుల్
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ నిమిత్తం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం పాటియాల హౌస్ కోర్టుకు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య వీరు కోర్టుకు చేరుకున్నారు. వీరితో పాటు సోనియా కుమార్తె ప్రియాంకా గాంధీ, అల్లుడు రాబర్డ్ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, కపిల్ సిబల్, మీరా కుమార్, షీలా దీక్షిత్, అంబికా సోనీ తదితరులు కోర్టుకు వచ్చారు. అయితే కేసుకు సంబంధించి మాత్రమే కోర్టులోకి అనుమతిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అబద్దాలు ఆడటంలో రాహుల్ నిపుణుడంటూ ఆయన విమర్శించారు. -
తప్పు చేయనప్పుడు భయమెందుకు?
న్యూఢిల్లీ : అన్యాయం జరిగినప్పుడు బాధ్యతగల పౌరుడిగా ప్రశ్నించే హక్కు తనకు ఉందని బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన శనివారమిక్కడ తిప్పికొట్టారు. నిరసనలు, ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ వ్యాఖ్యలను సుబ్రహ్మణ్యం స్వామి తిప్పికొట్టారు. ఏ తప్పు చేయకుంటే మామూలుగానే కోర్టుకు హాజరయ్యేవారని ఆయన అన్నారు. ఏ తప్పు చేయకుంటే కాంగ్రెస్ భయపడాల్సిన పనేమీ లేదని, ఈ కేసును వాదించేందుకు ఆరుగురు సీనియర్ న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారని, మరి ఇంకెందుకు భయమంటూ సుబ్రహ్మణ్యం స్వామి ఎద్దేవా చేశారు. అనంతరం పటియాల హౌస్ కోర్టుకు సుబ్రహ్మణ్యం స్వామి తన సతీమణి రుక్సానాతో కలిసి వెళ్లారు. మరోవైపు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కానున్న నేపధ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు సమీపంలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటంతో, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. -
‘హెరాల్డ్’ సమన్లపై సోనియా, రాహుల్ పిటిషన్
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో పాటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన సమన్లను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాల్ చేశారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ హెరాల్డ్ నిధుల దుర్వినియోగం కేసులో ఆగస్టు 7న స్వయంగా విచారణకు హాజరుకావాలంటూ పాటియాలా కోర్టు పలువురు కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. నిందితులకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నందున వారంతా విచారణకు హాజరుకావాల్సిందిగా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గోమతి మనోచా గత నెలలో ఆదేశాలిచ్చారు. -
కోర్టు ప్రాంగణంలో టుండాపై దాడి
సాక్షి, న్యూఢిల్లీ: లష్కరే తోయిబాకు చెందిన బాంబుల నిపుణుడు అబ్దుల్ కరీం టుండాపై మంగళవారం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ప్రాంగణంలో దాడి జరిగింది. శివకుమార్ రాఘవ్ అనే హిందూసేన కార్యకర్త టుండా వీపుపై బలంగా చరిచాడు. ముఖంపై కూడా కొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. టుండాను కోర్టులో హాజరుపరచిన నేపథ్యంలో కోర్టు ఆవరణలో హిందూసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో గుమిగూడి, అతడికి మరణశిక్ష విధించాలంటూ నినాదాలు చేశారు. ఇంతలోనే ఒక వ్యక్తి అకస్మాత్తుగా భద్రతా వలయాన్ని ఛేదించుకుంటూ వెళ్లి అతడిపై దాడికి పాల్పడ్డాడు. టుండాపై దాడి చేసిన రాఘవ్‌తో పాటు విష్ణు గుప్తా అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జయ్ తరేజా ఇన్ కెమెరా విచారణకు ఆదేశించారు. తన వద్ద డబ్బు లేదని, అందువల్ల తాను లాయర్‌ను పెట్టుకోలేనని టుండా మేజిస్ట్రేట్‌కు చెప్పాడు. అతడి తరపున వాదించేందుకు కొందరు లాయర్లు ముందుకు వచ్చారు. అయితే, టుండా వకాల్తనామాపై సంతకం చేశాడంటూ ఎం.ఎస్.ఖాన్ అనే న్యాయవాది కోర్టుకు చెప్పారు. దీనిపై మేజిస్ట్రేట్ టుండాను ప్రశ్నించగా, తనకు న్యాయవాది ఖాన్ పెద్దగా తెలియదని, అయితే, ఆయన తన తరఫున వాదిస్తారని చెప్పాడు. ఈలోగా ఒక న్యాయవాది ‘టుండా ఉగ్రవాది’ అంటూ కేకలు వేయడంతో కోర్టులో గలభా రేగింది. దీంతో నిందితుడి తరఫు న్యాయవాది మినహా మరెవరూ కోర్టు గదిలో ఉండరాదని మేజిస్ట్రేట్ ఆదేశించారు. టుండాను నాలుగు రోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టుండాను ప్రశ్నించనున్న హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్‌లో గతంలో జరిగిన పేలుళ్లతో సంబంధాలు ఉన్న టుండాను ప్రశించాలని హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. పీటీ వారంట్‌పై అతడిని ఇక్కడకు రప్పించనున్నామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. ఐఎస్ఐ బ్రిగేడియర్ నుంచి టుండాకు నకిలీ కరెన్సీ పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకు చెందిన ఒక బ్రిగేడియర్ నుంచి టుండాకు నకిలీ భారత కరెన్సీ అందేదని ఢిల్లీ పోలీసులు మంగళవారం వెల్లడించారు. పలుసార్లు అతడు ఐఎస్ఐ బ్రిగేడియర్ నుంచి నకిలీ కరెన్సీ అందుకున్నాడని వారు చెప్పారు.