న్యూఢిల్లీ: పటియాలా హౌజ్ కోర్టు ఆవరణలో సీపీఐ కార్యకర్తపై దాడి కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆప్ మహిళా ఎమ్మెల్యే అల్కా లాంబాపై అభ్యంతరక వ్యాఖ్యల కేసులో.. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దుచేయాలని ఢిల్లీ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. గతేడాది ఈ ఘటన జరగటంతో.. ఆగ్రహించిన స్పీకర్ రామ్ నివాస్ గోయల్.. శర్మను శీతాకాల సమావేశాలనుంచి బహిష్కరించారు. ఈ వివాదాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి ప్రతిపాదించారు. దీనిపై విచారించిన కమిటీ.. శర్మను తొలగించాలని సూచించింది.