హైదరాబాద్ : బీజేపీ పట్ల టీఆర్‌ఎస్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భయపడే ముందస్తు ఎన్నికలను తెస్తున్నారన్నారు. ఒకేసారి ఎన్నికలు బాగున్నా...ఆచరణలో సాధ్యం కాదన్నారు. మోదీ ఏటీఎంలను పోగొట్టి పేటీఎంలను తెచ్చారని నారాయణ విమర్శించారు.
బీజేపీ పాలనలో దళితులపై దాడులు, గోరక్షణ పేరుతో హత్యలు అధికం అవుతున్నాయని నారాయణ మండిపడ్డారు. ప్రతిరోజూ దళిత, క్రైస్తవ, ముస్లింలపై దాడి చేస్తూ వారిని ఊచకోత కోస్తున్నారని, ఈ దాడుల పాపభీతి పట్టుకున్నందుకే తిన్నింటి వాసాలు లెక్కించే చందంగా దళితుల ఇళ్లలో అమిత్ షా భోజనం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక దళితులపై అమిత్ షాది అంతా కొంగ జపమే అని, దళితవాడలో ఆయన భోజనం పాపాలను కడుక్కోవడానికే అని అన్నారు.
ఇక తెలంగాణలో బీజేపీ.. కమ్యూనిష్టులపై దృష్టి పెట్టినట్లు పైకి కనిపిస్తున్నా... అసలు దెబ్బ మాత్రం సీఎం కేసీఆర్‌ను కొట్టడానికే అని నారాయణ అన్నారు. ఈ దెబ్బతో కేసీఆర్ భయపడి మోదీని, అమిత్ షాను ఆశ్రయిస్తారా అన్నది చూడాలన్నారు. కమ్యూనిస్టులను ఖాళీ చేస్తామని పైకి చెబుతూ నల్లగొండపై అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టారని, చూపు మాత్రం టీఆర్‌ఎస్‌పైనే ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ను ధ్వంసం చేయడం ద్వారా రాష్ట్రంలో బీజేపీ అధిపత్యం సాధించాలని చూస్తోందని అన్నారు.
కేసీఆర్‌ను దెబ్బ కొట్టడానికే...:నారాయణ
Published Sat, May 20 2017 12:40 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement