అమిత్‌షా ప్రశ్నలతో టీఆర్‌ఎస్ ఉలికిపాటు | BJP lakshman comments on TRS | Sakshi
Sakshi News home page

అమిత్‌షా ప్రశ్నలతో టీఆర్‌ఎస్ ఉలికిపాటు

Published Tue, Sep 20 2016 2:14 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

అమిత్‌షా ప్రశ్నలతో టీఆర్‌ఎస్ ఉలికిపాటు - Sakshi

అమిత్‌షా ప్రశ్నలతో టీఆర్‌ఎస్ ఉలికిపాటు

బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కె.లక్ష్మణ్

 సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వరంగల్ బహిరంగ సభలో కొన్ని అంశాలపై కేసీఆర్‌ను ప్రశ్నిస్తే, వాటిపై టీఆర్‌ఎస్ నాయకులు, మంత్రులు స్పందించిన తీరు వారి ఉలికిపాటును స్పష్టం చేస్తోందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. అమిత్ షా సభకు ప్రజల నుంచి భారీ స్పందన రావడం టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తోందన్నారు.

సోమవారం పార్టీ నాయకులు జి. ప్రేమేందర్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ప్రదీప్, ప్రకాశ్‌రెడ్డి, కృష్ణసాగర్‌రావు, రఘునందన్‌రావు, కాసం వెంకటేశ్వర్లుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 ఉత్సవాన్ని పార్టీపరంగా నిర్వహిస్తూ, ప్రభుత్వపరంగా నిర్వహించలేకపోవడంపై కే సీఆర్ సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement