బీజేపీ పాలనలో పేదల బతుకు ఛిద్రం
ఇటీవల అమిత్‌షా నల్లగొండ జిల్లాలో మూడురోజు లున్నారని, ఆయన 30రోజులున్నా కమ్యూనిస్టుల కంచుకోటలను బద్ధలు కొట్టలేరన్నారు. వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైం దన్నారు. కేసీఆర్ మూడేళ్ల పాలన వాగాడంబ రంగానూ, గత పోరాటాలపై ఆధారపడి బతుకీడుస్తున్నట్లుగానూ ఉందని ఎద్దేవా చేశారు. కార్మిక, తదితర చట్టాల్లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు దేశంపై పెనుప్రభావాన్ని చూపనున్నాయన్నారు. ఎన్నికలకు ముందు పేదలను ఉద్ధరిస్తామని ప్రగల్భాలు పలికి ఆ తర్వాత పెద్దోళ్లకు ఊడిగం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
దేశంలో సెక్యులరిజాన్ని పరిరక్షించే వ్యక్తే రాష్ట్రపతిగా ఉండాలని, ఈ దిశలో గోపాలకృష్ణ గాంధీతో వామపక్షాలు సంప్రదింపులు జరుపుతున్న విషయం వాస్త వమేనని ఒక ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. దేశంలోని కొందరు రాజకీయ నాయకులను, విపక్షాలను లోబరుచుకునేందుకే సీబీఐ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ద్వారా కేంద్రం పథకం ప్రకారం దాడులకు పాల్పడుతోందని ఆరో పించారు. గతంలో బీజేపీ నాయకులు ఆరెస్సెస్ సేవకులమని చెప్పుకోడానికి సిగ్గు పడేవారని, ఇప్పుడైతే ఏకంగా కేంద్ర మంత్రులకు సంఘ్‌పరివార్ కార్యాలయం లోనే కరసేవకులు దిశానిర్దేశం చేస్తున్నారని అన్నారు.