మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ | CPI Leader Suravaram Sudhakar Reddy Fires on BJP Govt | Sakshi
Sakshi News home page

మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ

Published Thu, Apr 13 2017 2:12 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ - Sakshi

మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ

సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి
హైదరాబాద్‌: మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలను బీజేపీ నేతలు తెరపైకి తెస్తున్నారని.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకునేందుకు నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు.

బుధవారం రంగారెడ్డి జిల్లా పెద్దంబర్‌పేట్‌ పరిధిలోని రావి నారాయణరెడ్డి కాలనీలో బాలవికాస్‌ సంస్థ ఏర్పాటు చేసిన నీటిశుద్ధి ప్లాంట్‌ను, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ అయోధ్యలో రామమందిరం నిర్మిస్తాం, దేశంలో గోవధను నిషేధిస్తాం అంటూ బీజేపీ నేతలు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రామ మందిర నిర్మాణానికి అడ్డొస్తే తల నరుకుతానంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రకటన చేయడం సరికాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement