ఆ మాట చెప్పే ధైర్యం బీజేపీకి లేదు | suravaram sudhakar reddy lashes out at bjp | Sakshi
Sakshi News home page

ఆ మాట చెప్పే ధైర్యం బీజేపీకి లేదు

Published Mon, Sep 12 2016 8:22 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఆ మాట చెప్పే ధైర్యం బీజేపీకి లేదు - Sakshi

ఆ మాట చెప్పే ధైర్యం బీజేపీకి లేదు

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టంలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్పే ధైర్యం బీజేపీకి లేదని, ఇవ్వాలని అడిగే ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేదని ఆయన విమర్శించారు. ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయాల్సిన అవసరంలేదని సురవరం అభిప్రాయపడ్డారు.

ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ప్రజల్లో భ్రమలు సృష్టిస్తున్నారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ప్యాకేజీతో ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. ఏపీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి సరికాదని ఏచూరి చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement