
తప్పు చేయనప్పుడు భయమెందుకు?
న్యూఢిల్లీ : అన్యాయం జరిగినప్పుడు బాధ్యతగల పౌరుడిగా ప్రశ్నించే హక్కు తనకు ఉందని బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన శనివారమిక్కడ తిప్పికొట్టారు. నిరసనలు, ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ వ్యాఖ్యలను సుబ్రహ్మణ్యం స్వామి తిప్పికొట్టారు. ఏ తప్పు చేయకుంటే మామూలుగానే కోర్టుకు హాజరయ్యేవారని ఆయన అన్నారు.
ఏ తప్పు చేయకుంటే కాంగ్రెస్ భయపడాల్సిన పనేమీ లేదని, ఈ కేసును వాదించేందుకు ఆరుగురు సీనియర్ న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారని, మరి ఇంకెందుకు భయమంటూ సుబ్రహ్మణ్యం స్వామి ఎద్దేవా చేశారు. అనంతరం పటియాల హౌస్ కోర్టుకు సుబ్రహ్మణ్యం స్వామి తన సతీమణి రుక్సానాతో కలిసి వెళ్లారు. మరోవైపు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కానున్న నేపధ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోర్టు సమీపంలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటంతో, పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.