సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు రుణాల ఎగవేతదారుడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఢిల్లీ న్యాయస్థానం హెచ్చరికలు జారీ చేసింది. ఫెరా కేసులో డిసెంబర్ 18లోపు తమ ఎదుట హాజరుకావాలంటూ పటియాలా హౌజ్ కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మాల్యాకు ఇదే చివరి అవకాశమని న్యాయమూర్తి పేర్కొనటం విశేషం.
ఫెరా ఉల్లంఘనలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టోరేట్ నమోదు చేసిన ఓ కేసులో ఆయన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. గడువు తేదీలోగా హాజరుకాని పక్షంలో మాల్యాను ఆర్థిక నేరంలో దోషిగా భావించాల్సి ఉంటుందని బెంచ్ వ్యాఖ్యానించింది. కాగా, ఆర్థిక నేరస్తుడిగా మాల్యాను ప్రకటించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టోరేట్ విభాగం నిన్న కోర్టు కోర్టును ఆశ్రయించింది.
ఇక ఈ ఏప్రిల్‌లోనే ఢిల్లీ కోర్టు మాల్యా పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీచేసిన విషయం తెలిసిందే. తాజాగా పాటియాలా కోర్టు జారీ చేసిన దాంతో కలిపి ఇప్పటిదాకా మొత్తం ఆరు వారెంట్లు లిక్కర్ కింగ్‌పై జారీ అయ్యాయి. అదే సమయంలో కోర్టు రెండు నెలల్లోగా ఈ కేసు పురోగతికి సంబంధించిన సాక్షి పూర్తి వివరాలు అందజేయాలని ఈడీని ఆదేశించింది.
ఆరోపణలు ఏంటంటే...
మాల్యా 1996,97,98 సంవత్సరాలకు గానూ ఫార్ములా వన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ రేసుల్లో కింగ్ ఫిషర్ లోగోను ప్రదర్శించారు. అందుకుగానూ సుమారు 2 లక్షల అమెరికన్ డాలర్లను మాల్యా.. ఓ బ్రిటిష్ కంపెనీ, యూరోపియన్ సంస్థలకు చెల్లించారు. అయితే ఆర్బీఐ అనుమతి లేకుండా ఫెరా నిబంధనలను ఉల్లంఘిస్తూ మాల్యా డబ్బు చెల్లించారిన ఈడీ ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment