సాక్షి, న్యూఢిల్లీ : వేలకోట‍్ల రూపాయలను బ్యాంకులకు ఎగనామం పెట్టి పారిపోయిన ప్యుజిటివ్ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు మరో షాక్ తగిలింది. ఫెరా నిబంధనల ఉల్లంఘనల కేసులో మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని బెంగళూరు కోర్టు ఢిల్లీ హైకోర్టు శనివారం ఆదేశించింది. తదుపరి విచారణకు జూలై 10 వ తేదీనికి వాయిదా వేసింది.
జూలై 10వ తేదీ నాటికి ఆస్తులను అటాచ్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దీపక్ షెరావత్ బెంగళూరు పోలీసులు ఆదేశించారు.ఇప్పటికే బెంగళూరు పోలీసులు దాదాపు 159 ఆస్తులను గుర్తించినట్లు న్యాయస్థానానికి ఇప్పటికే అధికారులు తెలియజేశారు. గత ఏడాది మేలో ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఆదేశించిన కోర్టు దీనిపై సమగ్ర నివేదికను అందించాలని కోరింది. ఈ కేసులో మాల్యాపై నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉన్న సంగతి విదితమే.
కాగా రూ.9 వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేయడంతో పాటు, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని విజయ్ మాల్యాపై ఆరోపణలు ఉన్నాయి. రుణ బకాయిలను వసూలు చేసుకునేందుకు ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం న్యాయపరమైన చర్యలు ప్రారంభించడంతో 2016లో విజయ్ మాల్యా లండన్‌కు పారిపోయాడు. అయితే ఈ కేసులో మాల్యాను తిరిగి భారత్‌కు రప్పించేందుకు సీబీఐ, ఈడీ తీవ్ర ప్రయత్నిస్తున్నాయి
Comments
Please login to add a commentAdd a comment