ఒమర్ అబ్దుల్లా, పాయల్(ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాజీ భార్య పాయల్ అబ్దుల్లాకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ నివాసం ఖాళీ చేయాల్సిందేనని ఆమెను పాటియాలా హౌస్ కోర్టు మంగళవారం ఆదేశించింది.
ఢిల్లీలో ఆమె నివాసం ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి వెళ్లాలని జమ్మూకశ్మీర్ ఎస్టేట్ అధికారి ఇచ్చిన నోటీసును రద్దుచేయాలని పాయల్ పెట్టుకున్న పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. ఢిల్లీలోని అక్బర్ రోడ్డు 7లో ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయాలని జూన్ 30న ఆమెకు నోటీసు ఇచ్చారు. ఒమర్, పాయల్ 1994లో పెళ్లి చేసుకున్నారు. 2011, సెప్టెంబర్ లో విడిపోయారు.