న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ మూడో రోజు ముగిసింది. బుధవారం సుమారు తొమ్మిది గంటలపాటు ఆయన్ని ప్రశ్నించారు ఈడీ అధికారులు. అయితే విచారణ ఇక్కడితోనే ముగియలేదని.. శుక్రవారం మరోసారి తమ ఎదుట విచారణ కోసం హాజరుకావాలని రాహుల్‌ను కోరింది ఈడీ.
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసిన ఈడీ.. ఢిల్లీ కార్యాలయంలో మూడు రోజులుగా ఆయన్ని ప్రశ్నిస్తోంది. అయితే ఇది కేంద్రంలోని బీజేపీ ఉద్దేశపూర్వకంగా దర్యాప్తు సంస్థతో కలిసి చేయిస్తున్న కక్షపూరిత చర్యగా అభివర్ణిస్తూ.. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తోంది. ఈ క్రమంలో.. బుధవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద హైడ్రామానే నడిచింది.
ED asks Congress leader Rahul Gandhi to appear on Friday to rejoin the investigation in the National Herald case.
— ANI (@ANI) June 15, 2022
Comments
Please login to add a commentAdd a comment