
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్–ఏజేఎల్ వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం ఈడీ నడుచుకుంటోందని, ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనిగా పెట్టుకుందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.
పార్టీ ఎంపీలు, నేతలు గురువారం కాంగ్రెస్ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసు దాకా పాదయాత్ర చేయనున్నారు. అలాగే రాజ్‌భవన్ ఎదుట నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. దర్యాప్తు సంస్థల దుర్వినియోగం పట్ల పార్టీపరంగా ఎలా స్పందించాలన్న దానిపై వ్యూహాన్ని ఖరారు చేయడానికి ఎంపీ మల్లికార్జున ఖర్గే నివాసంలో నేతలు సమావేశమయ్యారు. సోనియా గాంధీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment